🌹 27 - OCTOBER అక్టోబరు - 2022 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 276 / Bhagavad-Gita -276 - 6వ అధ్యాయము 43 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 675 / Vishnu Sahasranama Contemplation - 675 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 637 / Sri Siva Maha Purana - 637 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 354 / DAILY WISDOM - 354 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 253 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹27, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan🌻*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 15 🍀*
*15. అపి క్షణార్ధం కలయంతి యే త్వాం ఆప్లావయంతం విశదైర్మయూఖైః*
*వాచాం ప్రవాహైరనివారితైస్తే మందాకినీం మందయితుం క్షమంతే ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : నీ ప్రత్యర్థిని దునుమాడ బోతున్నప్పుడు కూడా అతనిలో నున్న భగవంతుని ప్రేమించు, అపుడు మీ ఇరుపురిలో నెవరికీ నరకప్రాప్తి ఉండబోదు. లోకం శత్రువులను గురించిన ప్రస్తావన చేస్తూ వుంటుంది. కాని, ఎక్కడ ఉన్నా రా శత్రువులు? నాకు కనిపించేది విశ్వక్రీడా రంగంలో ఏదో ఒక పక్షానికి చెందిన మల్లయోధులు మాత్రమే.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: శుక్ల విదియ 12:46:00 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: విశాఖ 12:11:12 వరకు
తదుపరి అనూరాధ
యోగం: ఆయుష్మాన్ 07:27:53 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: కౌలవ 12:44:00 వరకు
వర్జ్యం: 15:56:20 - 17:26:28
దుర్ముహూర్తం: 10:04:03 - 10:50:22
మరియు 14:41:54 - 15:28:12
రాహు కాలం: 13:26:39 - 14:53:28
గుళిక కాలం: 09:06:11 - 10:33:00
యమ గండం: 06:12:31 - 07:39:21
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 03:50:08 - 05:21:12
మరియు 24:57:08 - 26:27:16
సూర్యోదయం: 06:12:31
సూర్యాస్తమయం: 17:47:08
చంద్రోదయం: 07:50:29
చంద్రాస్తమయం: 19:19:32
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: తుల
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
12:11:12 వరకు తదుపరి ఆనంద
యోగం - కార్య సిధ్ధి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 276 / Bhagavad-Gita - 276 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 43 🌴*
*43. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికమ్ |*
*యతతే చ తతో భూయ: సంసిద్ధౌ కురునన్దన ||*
🌷. తాత్పర్యం :
*ఓ కురునందనా! అట్టి జన్మను పొందిన పిమ్మట అతడ గతజన్మపు దివ్యచైతన్యమును పునరిద్ధరించుకొని పూర్ణవిజయమును సాధించుటకు తిరిగి యత్నము కావించును.*
🌷. భాష్యము :
పూర్వజన్మపు ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతము చేయుటకు ఉత్తమజన్మ అవసరమనెడి విషయమునకు తన మూడవజన్మను ఉత్తమ బ్రహ్మణవంశములో పొందినట్టి భరతమాహారాజు వృత్తాంతము చక్కని ఉదాహరణమై యున్నది. భరతమాహారాజు సమస్త ప్రపంచమునకు చక్రవర్తియై యుండెను. అతని కాలము నుండియే ఈ లోకము భారతవర్షముగా దేవతాలోకములలో ప్రసిద్ధి నొందినది. పూర్వము ఇది ఇలావృతవర్షముగా తెలియబడెడిది. ప్రపంచాధినేతయైన అతడు ఆధ్యాత్మికసిద్ధిని గోరి యుక్తవయస్సు నందే కర్మల నుండి విరమణను పొందినను జయమును సాధింపలేకపోయెను.
తత్కారణముగా అతడు జన్మనెత్తవలసి వచ్చినను, మూడవజన్మను ఒక ఉత్తమబ్రాహ్మణుని ఇంట పొందెను. సదా ఏకాంతస్థలములో వసించుచు మౌనియై నిలిచినందున అతడు జడభరతుడని పిలువబడెను. కాని అతడు గొప్పయోగి యని తదనంతరము రహుగణుడను రాజు అవగతము చేసికొనగలిగెను. ఆధ్యాత్మిక యత్నములు (యోగాభ్యాసము) ఎన్నడును వృథా కావని భరతుని ఈ చరిత్ర ద్వారా అవగతమగుచున్నది. అనగా యోగాభ్యాసి శ్రీకృష్ణభగవానుని కరుణచే కృష్ణభక్తిభావన యందలి పూర్ణత్వమునకై అనుకూల పరిస్థితులను మరల మరల పొందుచునే యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 276 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 43 🌴*
*43. tatra taṁ buddhi-saṁyogaṁ labhate paurva-dehikam*
*yatate ca tato bhūyaḥ saṁsiddhau kuru-nandana*
🌷 Translation :
*On taking such a birth, he revives the divine consciousness of his previous life, and he again tries to make further progress in order to achieve complete success, O son of Kuru.*
🌹 Purport :
King Bharata, who took his third birth in the family of a good brāhmaṇa, is an example of good birth for the revival of previous transcendental consciousness. King Bharata was the emperor of the world, and since his time this planet has been known among the demigods as Bhārata-varṣa. Formerly it was known as Ilāvṛta-varṣa.
The emperor, at an early age, retired for spiritual perfection but failed to achieve success. In his next life he took birth in the family of a good brāhmaṇa and was known as Jaḍa Bharata because he always remained secluded and did not talk to anyone. And later on he was discovered as the greatest transcendentalist by King Rahūgaṇa. From his life it is understood that transcendental endeavors, or the practice of yoga, never go in vain. By the grace of the Lord the transcendentalist gets repeated opportunities for complete perfection in Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 675 / Vishnu Sahasranama Contemplation - 675🌹*
*🌻675. మహాక్రతుః, महाक्रतुः, Mahākratuḥ🌻*
*ఓం మహాక్రత్వే నమః | ॐ महाक्रत्वे नमः | OM Mahākratve namaḥ*
*మహాంశ్చాసౌ క్రతుశ్చేతి మహాక్రతురితీర్యతే ।*
*యథాఽశ్వమేధః క్రతురాద్దితి వైవస్వతోక్తితః ॥*
*స్తుతిః సాపి స ఏవేతి కృతాభగవతో హరేః ॥*
*మను స్మృతి యందు పేర్కొనబడిన 'యథాశ్వమేధః క్రతురాట్' (11-2-60) - 'అశ్వమేధము ఎట్లు క్రతురాజమో' ప్రమాణమును బట్టి అశ్వమేధము క్రతువులలోకెల్ల ఉత్తమమైనది.*
*ఆ అశ్వమేధము అతడే లేదా అతని విభూతియేగనుక విష్ణువు మహాక్రతుః. అశ్వమేధ యజ్ఞమును, అశ్వమేధరూపునిగా విష్ణుని ఈ నామముచేత స్తుతించుటయు జరుగుచున్నది.*
*బహువ్రీహి సమాసముగ చూచినచో 'గొప్పదియగు అశ్వమేధ నామక యజ్ఞము ఎవనిదియో' అనగా 'ఎవని విషయమున జరుపబడు చుండునో' అను అర్థము వచ్చును.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 675🌹*
*🌻675. Mahākratuḥ🌻*
*OM Mahākratve namaḥ*
महांश्चासौ क्रतुश्चेति महाक्रतुरितीर्यते ।
यथाऽश्वमेधः क्रतुराद्दिति वैवस्वतोक्तितः ॥
स्तुतिः सापि स एवेति कृताभगवतो हरेः ॥
Mahāṃścāsau kratuśceti mahākraturitīryate,
Yathā’śvamedhaḥ kraturādditi vaivasvatoktitaḥ.
Stutiḥ sāpi sa eveti krtābhagavato hareḥ
*Based on the reference from Manu smrti 'यथाश्वमेधः क्रतुराट्' / 'Yathāśvamedhaḥ kraturāṭˈ (11-2-60) 'As like the Aśvamedha sacrifice which is greatest of all', the Aśvamedha is considered to be the greatest of kratus or sacrifices.*
*Since Aśvamedha yajña is He Himself or can be considered to be one of His opulences, Lord Hari is Mahākratuḥ.*
*In another possible interpretation, Mahākratuḥ can also mean 'He in whose honor the Aśvamedha yajña is performed.'*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 637 / Sri Siva Maha Purana - 637 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 13 🌴*
*🌻. గణశుని పుట్టుక - 2 🌻*
శివుడు వివాహమాడి కైలాసమునకు వెళ్లిన కొంత కాలమునకు గణపతి జన్మించెను (9). ఒక సమయములో జయ, విజయ అను సఖురాండ్రు పార్వతిని కలిసిరి. ఆమె వరితో చర్చించమొదలిడెను (10). రుద్రుని గణములన్నియు మంగళకరుడగు ఆయన ఆజ్ఞను పాలించుచుందురు. వారిలో నంది, భృంగి మొదలగు వారు మనవారే (11). కాని ప్రమథులు లెక్కలేనంత మంది గలరు. వారిలో మనవాడు ఒక్కడైననూ లేడు. వారందరు శంకరుని ఆజ్ఞనుపాలిస్తూ ద్వారమునందు నిలబడి యుందురు (12). వారందరు మన వారే అయినా వారితోమనస్సు కలియుట లేదు. ఓ పుణ్యాత్మురాలా! నీవు మన వానిని ఒకనిని ద్వారము వద్ద ఏర్పాటు చేయవలెను (13).
బ్రహ్మ ఇట్లు పలిలెను -
సఖురాండ్రిద్దరు పలికిన ఈ సుందరమగు మాటను విని పార్వతీ దేవి అదియే హితమని భావించి అట్లు చేయుటకు నిశ్చయించెను (14). తరువాత ఒకనాడు పార్వతి స్నానమాడు చుండగా సదా శివుడు ద్వారపాలకుడగు నందిని గద్దించి ఇంటిలోపలికి వచ్చెన (15). సమయము కాని సమయములో విచ్చేసిన శంకరుని చూచి జగన్మాతయగు ఆ సుందరి స్నానము చేయుచున్నదై సిగ్గుపడి లేచి నాలబడెన (16). ఆ సమయములో మిక్కిలి ఉత్కంఠను పొందిన పార్వతీ దేవి సఖురాండ్ర వచనము హితమును సుఖమును కలిగించునది యని తలపోసెను (17).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 637🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 13 🌴*
*🌻 The birth of Gaṇeśa - 2 🌻*
9. A long time had lapsed after the marriage of Śiva and His return to Kailāsa that Gaṇeśa was born.
10. Once the friends Jayā and Vijayā conferred with Pārvatī and discussed.
11. All the Gaṇas of Rudra carry out the orders of Śiva. They all, Nandin, Bhṛṅgin and others are in a way our own.
12. Pramathas are numerous. But none of them can be called our own. They all stand at the portals, subservient to Śiva’s behests.
13. They also may be called our own but our mind is not in unison with them. Hence, O sinless lady, one, our own must be created.
Brahmā said:—
14. Goddess Pārvatī to whom this charming suggestion was made by the two friends considered it wholesome and resolved to carry it out.
15. Once when Pārvatī was taking her bath, Sadāśiva rebuked Nandin and came into the inner apartment.
16. The mother of the universe, seeing the untimely arrival of Śiva in the midst of her bath and toilet stood up. The beautiful lady was very shy then.
17. The goddess decided that her friend’s suggestion would be conducive to her good and was so enthusiastic.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 354 / DAILY WISDOM - 354 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻19. ఆహారం కూడా ఒక రకమైన ఔషధం🌻*
*మనిషిలోని తేజోవంతమైన అంతఃశక్తి అతనికి ఉండే పూర్తి జీవశక్తుల సమాహారం. మనిషికి ఉండే ఏ శక్తి అయినా ప్రాణం తప్ప మరొకటి కాదు. ఇది ఎల్లప్పుడూ ఒక వ్యక్తి తినే ఆహారం నుండి మాత్రమే రాదు. అగ్నిని మండించడానికి ఇంధనం అవసరం అయినప్పటికీ, ఇంధనం అగ్నితో సమానం కాదు; జ్వలన కోసం పెట్రోల్ అవసరం అయినప్పటికీ పెట్రోల్ నిప్పు కాదు. ఇంధనం ద్వారా పుట్టే వేడికి, ఇంధనానికి వ్యత్యాసం ఉంది. కాబట్టి, ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి వేగవంతమవుతుంది, ఉద్ఘాటిస్తుంది మరియు మెరుగు పరచ బడుతుంది. కానీ, అది బలంతో సమానం కాదు. బలం అనేది మనిషిలో ఉన్న సామర్ధ్యం, తన లోపల ఉన్న శక్తి. మనిషి బలాన్ని ఎలా పొందుతాడు?*
*ఇది అతను తినే బాదం, లేదా అతను త్రాగే పాలు నుంచి రాదు. ఒక శవం లోపలికి కూడా ఆహారాన్ని నెట్టవచ్చు; దాని నోటిలో పాలు పోయవచ్చు, కానీ అది బలాన్ని పొందదు. శవానికి వడ్డించే ఏ ఆహారం అయినా దానిలో శక్తిని నింపదు. తిన్న ఆహారం శక్తివంతం కావడానికి లేదా జీర్ణం కావడానికి ప్రాణశక్తి అని పిలువబడే మరొక సూత్రం అవసరం. ప్రాణశక్తి ఉంటే తీసుకున్న మందు పనిచేస్తుంది, అయితే అదే ప్రాణశక్తి పోయినట్లయితే, ఔషధం ఒక జీవం లేని పదార్థం. ఇది ఎవరికీ సహాయం చేయదు. ఆహారం విషయంలోనూ అలాగే ఉంటుంది. ఆహారం కూడా ఒక రకమైన ఔషధమే, అది ఆకలి అనే అనారోగ్యం కోసం తీసుకోబడుతుంది, కానీ లోపల జీవశక్తి ఉంటే తప్ప అది శక్తిని అందించదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 354 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻19. Food is Also a Kind of Medicine🌻*
*The vital energy within man is the sum total of his strength. Whatever strength or energy that one has is nothing but the prana. It does not always come just from the food that one eats. Though fuel is necessary to ignite fire, fuel is not the same as fire; petrol is not fire, though petrol is necessary for ignition. There is a difference between the heat, and that which causes the heat to ignite by means of a fuel. So, while energy is accelerated, accentuated, and enhanced by consumption of food, it is not identical with strength itself. Strength is an impersonal capacity that is within man, the force that is inside. How does man gain strength at all?*
*It is not merely from the almonds that he eats, or the milk that he drinks. A corpse also can have food thrust into it; milk may be poured into its mouth, but it cannot gain strength. Any food that is served to the corpse cannot infuse energy into it. Another principle, called vitality, is necessary for the energisation or the digestion of the food that is eaten. Vitality is that which helps the working of the medicine that is taken, but if the vitality is gone, medicine is dead matter. It helps no one. So is the case with food. Food is also a kind of medicine that is taken for the illness of hunger, but it itself cannot provide the energy, unless there is vitality within.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 253 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఈ అనంత అస్తిత్వం సంగీతం మినహా మరేమీ కాదు. మార్మికులు దేవుణ్ణి 'సంగీతం' అన్నారు. దేవుడు వ్యక్తి కాడు. అస్తిత్వానికి సంబంధించిన అంతిమ సమశృతి. 🍀*
*ధ్యానం నిన్ను గొప్ప సంగీతం వేపుకు మేల్కొల్పుతుంది. అంతర్బహి సంగీతం వేపు మేల్పొల్పుతుంది. అది అక్కడ వుంది. కానీ మనమే చురుగ్గా లేం. మనం మేలుకొనిలేం. అందువల్ల మనం దాన్ని కోల్పోతున్నాం. లేకుంటే ఈ అనంత అస్తిత్వం సంగీతం మినహా మరేమీ కాదు. మార్మికులు దేవుణ్ణి 'సంగీతం' అన్నారు. దేవుడు వ్యక్తి కాడు. అస్తిత్వానికి సంబంధించిన అంతిమ సమశృతి.*
*అది వాయిద్య పరికరాల సమూహం. ప్రతిదీ ప్రతిదానితో సమశృతిలో వుంటుంది. చెట్లు భూమితో, భూమి గాలితో, గాలి ఆకాశంతో, ఆకాశం నక్షత్రాలతో అలా సమశృతి కొనసాగుతుంది. ఇక్కడ వైరుధ్యం లేదు. ఇక్కడ గడ్డిపోచ కూడా పెద్ద నక్షత్రంలా విలువైనదే. ఉనికి కలిగిందే. అవి రెండూ అస్తిత్వ సంగీత సమ్మేళనంలో అంతర్భాగాలే. అవి రెండు గానాన్ని సంపన్నం చేస్తాయి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹