🌹 మౌని అమావాస్య. చొల్లంగి అమావాస్య - శని, రాహు-కేతు దోషాల నివారణ - పితృదేవతల ఆశీర్వాదం - పురాణ గాధ - మాఘ మాస ప్రారంభం 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Mauni Amavasya. Chollangi Amavasya - Remedy for Saturn, Rahu-Ketu doshas - Blessings of ancestors - Puranic story - Beginning of Magha month 🌹
Prasad Bhardwaj
పురాణాల ప్రకారం పెద్దలకు పుణ్య నదుల్లో స్నానం చేసి తర్పణాలు వదలడం అతి ముఖ్యమైన ఆచారం. పుష్యమాసం అమావాస్య రోజున అంటే మౌని అమావాస్య ( 2026 జనవరి 18) నదీ సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. . వీటిని అమృత స్నానం అని పిలుస్తారు. ఇలా చేయడం తెలిసో.. తెలియకో చేసిన పాప ..పుణ్యాల కర్మల వలన మౌని అమావాస్య రోజున నదీతీరంలో తర్పణాలు వదిలితే.. ఉత్తమలోకాలకు చేరుకొని పితృదేవతలు ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు.
మౌని అమావాస్య నాడు మౌనవ్రతం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. మౌని అమావాస్య రోజు ధార్మిక కార్యాలు చేయడం వల్ల క్రూర గ్రహాల (శని, రాహు-కేతు) దోషాలు తొలగిపోతాయి. పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం, దానాలు చేయడం వల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలిగి, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషాలనుండి విముక్తి కలుగుతుందని కూడా చెబుతారు.
🌻 శని, రాహు-కేతు దోష నివారణ 🌻
మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా శని బాధలతో పాటు శని దోషం రాహు-కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. జ్యోతిష్యుడు అనీష్ వ్యాస్ ప్రకారం, మౌని అమావాస్య రోజున ఏదైనా శివాలయంలోకి వెళ్లి శివునికి రుద్రాక్ష మాలను సమర్పించండి. శివుడిని విధివిధానంగా పూజించండి.
మంత్రం - రూపం దేహి, యశో దేహి, భోగం దేహి చ శంకర. భుక్తి ముక్తి ఫలం దేహి, గృహీత్వార్ఘ్యం నమోస్తుతే”
శివుడికి సమర్పించిన మాలను మెడలో ధరించండి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే శని,రాహు కేతు దోషాలతో పాటూ పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది.
మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీస్సులు లభించాలంటే ఆదివారం చొల్లంగి అమావాస్య రోజు నియమాలు పాటించడం మంచిది. సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వాదం కోసం తర్పణాలు విడుస్తారు..పిండప్రదానాలు చేస్తారు.. అన్నదానాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలను మౌని అమావాస్య అత్యంత విశేషమైనది అని పండితులు చెబుతారు.
మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరించాలని చెబుతారు. రాగిపాత్రలో ఎర్రటి పూలను కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. త్రిమూర్తి స్వరూపంగా భావించే రావిచెట్టుకి మౌని అమావాస్య రోజు పూజచేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. చెట్టూ చుట్టూ 108 సార్లు దారాలు చుట్టి పూజ చేయాలి. అనంతరం దీపం వెలిగించి నమస్కరించాలి. ఈ రోజు మూగజీవాలకు ఆహారం పెట్టండి.
మౌని అమావాస్య రోజు శ్రీ మహావిష్ణు ఆరాధన, భాగవతం పారాయణం చేయడం శుభప్రదం. మౌని అమావాస్య రోజు చేసే దానధర్మాలు కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి.
🍀 మౌని అమావాస్య కథ 🍀
గరుడ పురాణం ప్రకారం..ఇది పురాతన కాలం నాటి విషయమని గరుడపురాణం ద్వారా . కాంచీపురం అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని భార్య చాలా ధార్మికురాలు... పతివ్రత.. గుణవంతురాలు. దేవస్వామి బ్రాహ్మణ దంపతులకు 7 కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. దేవస్వామి తన కుమార్తె వివాహం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించినప్పుడు, జ్యోతిష్కుడు ఆ బ్రాహ్మణుని జాతకంలో గ్రహాల స్థితిని చూసి విచారకరమైన వార్త చెప్పాడు. నీకు అల్లుడుగా నీచుడు.. దుర్మార్గుడు.. తల్లి దండ్రులను పట్టించుకోనివాడు.. భార్యను .. అత్తమామలను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడని చెబుతాడు. అంతేకాదు పెళ్లి అయిన అనతి కాలంలోనే నీకుమార్తె వితంతువు అవుతుందని చెబుతాడు. విధి అలా ఉంది. దానిని ఎవరూ తప్పించలేరు కదా..అని జ్యోతిష్కులు చెబుతారు.
ఏది జరగాలో శివుడి ఆఙ్ఞ మేరకు బ్రహ్మ సృష్టిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాలం గడిచిన తరువాత దేవస్వామి కుమార్తెకు వివాహ వయస్సు రావడంతో ... ఓ బ్రాహ్మణునకు నరసింహుడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. నరసింహుడు చాలా దుష్టుడు.. చెడ్డవాడు అని తెలిసినా..అతని తల్లి దండ్రులు.. దాచిపెట్టి.. వివాహం అయిన తరువాత అయినా మారుతాడేమొనని.. గుణవంతురాలు.. వినయశీలి అయిన దేవస్వామి కుమార్తెను కోడలిగా తెచ్చుకున్నారు.
పెళ్లి అయిన తరువాత నరసింహుడు చెడు అలవాట్ల వలన మద్యం సేవిస్తూ.. మాంసం తినుచూ.. భార్యను కూడా తినమని బలవంతం పెట్టేవాడు. నిత్యం నరసింహుడు తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. ఇలా ఉండగా నరసింహుడి ఆగడాలను భరించలేక ... అతని తండ్రి చంపాడు. ఇలా ఆయన చేసిన పాపాల వలన ఇటు స్వర్గానికి.. అటు నరకానికి వెళ్లలేక మధ్యలో ఊగిసలాడుతున్నాడు. ఆ సమయంలో నరసింహుడి బాధ వర్ణనాతీతం. ఇలా ఉండగా గంగా నదిలో నరసింహుడి తండ్రి పిండప్రదానం చేశాడు. అది కూడా మౌని అమావాస్య రోజున చేయడంతో నరసింహుడు ఉత్తమలోకాలకు చేరుకున్నాడు.
🌹🌹🌹🌹🌹