మైత్రేయ మహర్షి బోధనలు - 99


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 99 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 80. నూతన యుగము 🌻


నూతన యుగమును గూర్చి ఎన్నియో ఆశాభావములు వ్యక్తమైనవి. నూతన జీవనము గూర్చి ఎన్నియో ప్రయత్నములు జరుగు చున్నవి. నూతనమగు ఏర్పాట్లను, సర్దుబాట్లను మానవుడు అవిరామముగ చేయుచున్నాడు. అయినను నూతన జీవన మబ్బలేదు. నూతన యుగము రాలేదు. శాంతి కొరకు భౌతిక లోకమున మహత్తరమగు ప్రయత్నములు జరుగుచున్నవి. శాంతి కొరకు యుద్ధములు కూడ చేయుచున్నారు. యుద్ధము, శాంతి ఒకదానికొకటి విరుద్ధము.

మానవునిలోని అశాంతి, అసహనము, అధికార కాంక్ష, శాంతి కొరకు చేయు ప్రయత్నములను విఫలము చేయును. ప్రపంచ శాంతికి ప్రయత్నము చేయువారి స్వభావము నందు శాంతి యున్నచో వారు చేయు కృషి శాంతి నందించ గలదు. ఎవరు దేనియందు నిష్ణాతులో, వారు దానిని ప్రకటించుటకు సమర్థులు. కపటత్వమున శాంతి లభింపదు. కపటత్వమే ప్రకటితమగు చుండును. తనవద్ద లేని వస్తువును తానిచ్చెదననుట కపటము. భావము, భాషలను సత్యము ఆవరించినచో నూతన యుగము ఆరంభము కాగలదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 160


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 160 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఏ క్షణంలో నువ్వెవరో గ్రహిస్తావో ఆ క్షణమే సమస్తమూ నీ కళ్ళముందు నిలుస్తుంది. సంపూర్ణత నీ సందర్శనకు అందుతుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడమంటే సమస్తాన్నీ తెలుసుకోవడం. 🍀


నిన్ను నువ్వు తెలుసుకోవడమంటే సమస్తాన్నీ తెలుసుకోవడం. అదొక్కటే నేను పదే పదే చెబుతాను. నొక్కి చెబుతాను. ఎట్లాంటి విశ్వాసం, సిద్ధాంతం, చర్చి, మతం, ఆచారం దానికి అవసరం లేదు. సాధారణమైన, నిర్మలమయిన పరిశీలనతో నీ లోపలికి చూసుకోవడమొక్కటే చేయాలి.

ఏ క్షణంలో నువ్వెవరో గ్రహిస్తావో ఆ క్షణమే సమస్తమూ నీ కళ్ళముందు నిలుస్తుంది. సంపూర్ణత నీ సందర్శనకు అందుతుంది. అప్పుడు జీవితం కూడా నీ అవగత మవుతుంది. కారణం నువ్వు జీవితంలో భాగమే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


05 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 260 - 16. ప్రాథమిక గుణాల అవగాహన / DAILY WISDOM - 260 - 16. The Perception of Primary Qualities


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 260 / DAILY WISDOM - 260 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 16. ప్రాథమిక గుణాల అవగాహన 🌻

'స్ధలం, కాలం మరియు దేవత' అనే తన పుస్తకంలో, శామ్యూల్ అలెగ్జాండర్ వివరించిన వ్యవస్థలో ఆధునిక భౌతిక శాస్త్రం మతపరమైన దిగుమతిగా ప్రత్యేకంగా చెప్పబడింది. అలెగ్జాండర్ సాపేక్షత సిద్ధాంతం నుండి సేకరించిన వివరాల ప్రకారం విశ్వ పదార్ధం యొక్క మాతృక స్ధలం, కాలం. ఈ స్ధలము-కాలము ప్రతిదానికి చలనం మరియు శక్తిని కలిగిస్తుంది. పొడవు, వెడల్పు మరియు ఎత్తు, పదార్ధం, వస్తు పరిమాణం మరియు స్వభావం వంటి ప్రాథమిక లక్షణాల యొక్క త్రిమితీయ చిత్రాన్ని తెస్తుంది.

ఈ ప్రాథమిక లక్షణాల యొక్క అవగాహన అనేది ఒక విధమైన చర్య-ప్రతిస్పందన ప్రక్రియ కారణంగా ఉత్పన్నమయ్యే ద్వితీయ లక్షణాల ద్వారా జరుగుతుంది. ఇవి గ్రహణ వస్తువు యొక్క ప్రాథమిక నాణ్యత మరియు దానిని గ్రహించే మనస్సు మధ్య గ్రహించ బడుతున్నాయి. ఒక ఉదాహరణను ఉదహరించాలంటే, ఆకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే ఆకు యొక్క అంతర్గత నిర్మాణంలోని అన్ని ఇతర లక్షణాలు మినహాయించి కేవలం దానిలో స్వయం చాలకంగా జరిగే పచ్చదనం అని పిలువబడే లక్షణాల సంగ్రహణ కారణంగా కనిపిస్తుంది. ఇతర రంగులు మరియు వస్తువుల రూపాల విషయంలో కూడా అలాగే ఉంటుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 260 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 16. The Perception of Primary Qualities 🌻


The specially religious import of modern physical science is highlighted also in the system of Samuel Alexander, which he purports to explain in his book entitled “Space, Time and Deity”. According to Alexander, space-time is the matrix of all things, the very substance of the universe, a clue that he gathers from the Theory of Relativity. The space-time matrix causes motion and force, and brings about the three-dimensional picture of what are known as primary qualities, like length, breadth and height, substance, volume and content.

The perception of these primary qualities happens to be through the secondary qualities arising as a sort of action-reaction process obtaining between the object of perception, namely, a primary quality and the perceiving mind. To cite an instance, a leaf looks green in colour not because there is such a thing called greenness in nature itself, but because of an abstraction of properties automatically taking place in the internal structure of the leaf excluding all other characteristics in nature apart from what looks like green. So is the case with other colours and forms of objects.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


05 Apr 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 30 / Agni Maha Purana - 30


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 30 / Agni Maha Purana - 30 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 12

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. శ్రీహరి వంశ వర్ణనము - 1 🌻


అగ్ని పలికెను - హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మకు అత్రి, అతనికి సోముడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, అతనికి యయాతి పుట్టిరి, అతనినుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషవర్వుని కుమారైయైన శర్మిష్ఠ ద్రుహ్యు-అను పూరులు అనెడు కుమారులను కనిరి. యదువు కులముందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు.

భూ భారమును తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకశివుని ఆరుగురు పుత్రులు దేవకి యందు వసుదేవుని వలన, విష్ణు ప్రేరిత యైన యోగమాయ- ప్రభావముచే పుట్టిరి. బలరాముడు దేవికి సప్తమ గర్భముగా అయెను. అతడు రోహిణి యందు సంక్రమింపజేయబడి రౌహిణయుడాయెను. పిమ్మట చతుర్భుజుడైన హరి శ్రావణ కృష్ణపక్ష్యష్టమి యందు అర్ధరాత్రమున జనించెను.

రెండు భాహువులు గల బాలుడుగా మారిన ఆ చతుర్భుజుని దేవకీ వసుదేవులు స్తుతించిరి. వసుదేవుడు కంసునికి భయపడి ఆ పిల్లవానిని తీసికొని వెళ్లి యశోద పక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసికొని వచ్చి దేవకి పక్కలో పరుండ బెట్టెను. కంసుడు పిల్ల ఏడ్చిన ధ్వని విని ఆ శిశువును శిలపై వేసి కొట్టెను.

దేవకి వారించినను "నీ అష్టమగర్భము నాకు మృత్యుహేతువు" అని పలుకుచు అట్లుచేసెను. ఆకాశవాణిని విని అతడు దేవకి వివాహసమయమున చెప్పిన ప్రకారము తన కిచ్చన శిశువులనందరిని పూర్వము చంపివేసెను. క్రిందికి విసరి వేయబడిన ఆ బాలిక అకాశముపైకి ఎగిరి కంసునిలో ఇట్లు పలికెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Agni Maha Purana -30 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 12

🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 1 🌻


Agni said:

1. I shall describe the genealogy of Hari (Kṛṣṇa). Brahmā (was born) from the lotus in the navel of Viṣṇu. (Sage) Atri (was born) from Brahmā. Then Soma (was born). Purūravas was born from Soma.

2. Āyu was (born) from him (Purūravas). From him (was born) Nahuṣa and then Yayāti. From whom Devayānī[1] gave birth to Yadu and Turvasu.

3. Śarmiṣṭhā, the daughter of Vṛṣaparvan (gave birth to) Druhyu, Anu and Puru (through Yayāti). The Yādavas (came) in the race of Yadu. Vasudeva was the foremost among these.

4-7. From Vasudeva through Devakī (was born Kṛṣṇa) in order to remove oppression on the earth. Once the sons of Hiraṇyakaśipu (became) the six embryos in the womb of Devakī being led by the meditative-sleep cast by Viṣṇu. The seventh child in the womb of Devakī that was strong was transferred to (the womb of) Rohiṇī and (was born) as the son of Rohiṇī.[2] Then Hari the four-armed (manifested) in the sky on the eighth day of the dark fortnight and being adored by Devakī and Vasudeva (was born) as a child with two arms. Vasudeva took (the child) to the couch of Yaśodā, being afraid of Kaṃsa.

8-10. Yaśodā carried the daughter (born to her) and left it at the couch of Devakī. Having heard the cries of the child, Kaṃsa (came there and carried the child) and smashed it on the stone slab in spite of being obstructed by Devakī. Having heard the voice in the heavens that, “My eighth birth would be your death", and being infuriated all the children born were killed (by him) after they were left with him by Devakī as promised (by Vasudeva) at the time of their marriage. The girl who was thrown (on the slab) (bounced) to the sky and said:


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


05 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 581 / Vishnu Sahasranama Contemplation - 581


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 581 / Vishnu Sahasranama Contemplation - 581🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 581. శమః, शमः, Śamaḥ🌻

ఓం శమాయ నమః | ॐ शमाय नमः | OM Śamāya namaḥ

ప్రాధాన్యేన శమం జ్ఞానసాధనం ప్రాహ తచ్ఛమః

ఇంద్రియ ప్రవృత్తులు నిరోధించబడుటను శమము అందురు అనగా ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తిల్లకపోవుట. సన్యాసులకు ప్రధానముగా జ్ఞానసాధనమగు అట్టి శమమును ఉపదేశించు వాడు గనుక శమః.

యతీనాం ప్రశమో ధర్మః నియమో వనవాసినామ్ ।
దానమేవ గృహస్థానాం శుశ్రూషా బ్రహ్మచారిణాం ॥
ఇతి స్మృతేస్తత్కరోతి తదాచష్టేత్యతోణిచి ।
పచాద్యచి కృతే రూపం శమ ఇత్యేవ సిద్ధ్యతి ॥

యతులకు ప్రశమమును, వానప్రస్థులకు నియమమును, గృహస్తులకు దానమును, బ్రహ్మచారులకు గురు శుశ్రూషయయు ముఖ్య ధర్మము అను స్మృతి వచనము ఇట ప్రమాణము. దానిని వ్యాఖ్యానించు, బోధించువాడు అను అర్థమున 'తత్కరోతి తదా చష్టే' అము పాణినీయ చురాదిగణసూత్రముచే 'ణిచ్‍' ప్రత్యయమును పచాది గణశబ్దములపై వచ్చు 'అచ్‍' ప్రత్యయము రాగా పై అర్థమున 'శమః' అను పద రూపము సిద్ధించును.

సర్వభూతానాం శమయితేతి వా శమ ఉచ్యతే

లేదా సర్వభూతములను శమింప అనగా నశింప జేయువాడు శమయతి అని చెప్పవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 581🌹

📚. Prasad Bharadwaj

🌻 581. Śamaḥ 🌻

OM Śamāya namaḥ



प्राधान्येन शमं ज्ञानसाधनं प्राह तच्छमः ।

Prādhānyena śamaṃ jñānasādhanaṃ prāha tacchamaḥ,

He declared that śama is chiefly the means of knowledge of ātmajñāna. So He Himself is Śamaḥ.


यतीनां प्रशमो धर्मः नियमो वनवासिनाम् ॥
दानमेव गृहस्थानां शुश्रूषा ब्रह्मचारिणां ।
इति स्मृतेस्तत्करोति तदाचष्टेत्यतोणिचि ॥
पचाद्यचि कृते रूपं शम इत्येव सिद्ध्यति ।
सर्वभूतानां शमयितेति वा शम उच्यते ॥

Yatīnāṃ praśamo dharmaḥ niyamo vanavāsinām.
Dānameva gr‌hasthānāṃ śuśrūṣā brahmacāriṇāṃ,
Iti smr‌testatkaroti tadācaṣṭetyatoṇici.
Pacādyaci kr‌te rūpaṃ śama ityeva siddhyati,
Sarvabhūtānāṃ śamayiteti vā śama ucyate.


As per the smr‌ti, 'The Dharma of the Sannyāsin is pacification of the mind; of the forest-dweller it is austerity; of the house-holder it is charity and of the Brahmacārin, it is service.'

He controls all creates therefore, He is Śamaḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


05 Apr 2022

05 - APRIL - 2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 05, ఏప్రిల్ 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 182 / Bhagavad-Gita - 182 - 4-20 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 581 / Vishnu Sahasranama Contemplation - 581🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 30 / Agni Maha Purana 30🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 260 / DAILY WISDOM - 260 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 161 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 99 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 05, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక వినాయక చతుర్థి, లక్ష్మి పంచమి, Masik Vinayaka Chaturthi, Lakshmi Panchami 🌻*

*🍀. అంజని పుత్ర స్తోత్రం - 4 🍀*

స్థిర నిల్యావర హనుమంత
ఈశ బాలక హనుమంత
జయ బజరంగబలి 
జయజయ జయ బజరంగబలి

ఖట్వాంగదర హనుమంత
గరుడ గర్వహర హనుమంత
జయ బజరంగబలి 
జయజయ జయ బజరంగబలి

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రేమకు ఓర్పు కావాలి. దానిని సాధన చేయండి. నిత్యము శుభకామనను చేయడం ప్రేమను పెంచుతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944
ఉత్తరాయణం, వసంత ఋతువు
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల చవితి 15:46:14 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: కృత్తిక 16:53:05 వరకు
తదుపరి రోహిణి
యోగం: ప్రీతి 07:58:12 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి 15:48:14 వరకు
వర్జ్యం: 03:40:30 - 05:26:02
దుర్ముహూర్తం: 08:36:15 - 09:25:44
రాహు కాలం: 15:24:30 - 16:57:17
గుళిక కాలం: 12:18:55 - 13:51:42
యమ గండం: 09:13:22 - 10:46:09
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 14:13:42 - 15:59:14
సూర్యోదయం: 06:07:47
సూర్యాస్తమయం: 18:30:04
వైదిక సూర్యోదయం: 06:11:22
వైదిక సూర్యాస్తమయం: 18:26:31
చంద్రోదయం: 08:46:35
చంద్రాస్తమయం: 22:08:51
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: వృషభం
గద యోగం - కార్య హాని , చెడు 
16:53:05 వరకు తదుపరి మతంగ
యోగం - అశ్వ లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 182 / Bhagavad-Gita - 182 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 20 🌴*

*20. త్యక్త్వాకర్మఫలాసజ్గ్ం నిత్యతృప్తో నిరాశ్రయ: |*
*కర్మణ్యభిప్రవృత్తోవి నైవ కించత్ కరోతి స: ||*

🌷. తాత్పర్యం :
*కర్మఫలముల యెడ ఆసక్తిని విడిచి నిత్యతృప్తుడును, నిరాశ్రయుడును అయియుండెడి వాడు అన్నిరకములగు కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయని వాడే యగును.*

🌷. భాష్యము :
మనుజుడు ప్రతిదియు కృష్ణుని కొరకే ఒనరించునపుడు ఆ భావన యందే కర్మబంధము నుండి విడుదల సాధ్యము కాగలదు. కృష్ణభక్తిపూర్ణుడైన భక్తుడు ఆ దేవదేవుని యెడ గల ప్రేమతోనే వర్తించును గావున కర్మఫలముల యెడ ఆకర్షణను కలిగియుండడు. అతడు సర్వభారమును కృష్ణునికే వదలివేయుటచే స్వీయపోషణము గూర్చియు చింతింపడు. లేనివి పొందవలెనని గాని, ఉన్నవానిని రక్షించుకొనవలెనని గాని అతడు ఆతురతపడడు. తన ధర్మమును శ్యక్తానుసారము నిర్యహించి పిదప అతడు సమస్తమును కృష్ణునికే వదలివేయును. 

అట్టి అసంగుడైన భక్తుడు ఏమియును చేయనివాని చందమున కర్మల యొక్క శుభాశుభఫలముల నుండి సర్వదా ముక్తుడై యుండును. ఇట్టి స్థితి అకర్మకు లేదా విషయఫలరహితమైన కర్మకు చిహ్నమై యున్నది. కనుక కృష్ణభక్తిభావన లేనటువంటి ఇతర కర్మ ఏదైనను సరియే కర్తను నిక్కముగా బంధించును. పూర్వము తెలుపబడినట్లు అదియే వికర్మ యొక్క నిజస్వరూపమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 182 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 20 🌴*

*20 . tyaktvā karma-phalāsaṅgaṁ nitya-tṛpto nirāśrayaḥ*
*karmaṇy abhipravṛtto ’pi naiva kiñcit karoti saḥ*

🌷 Translation : 
*Abandoning all attachment to the results of his activities, ever satisfied and independent, he performs no fruitive action, although engaged in all kinds of undertakings.*

🌹 Purport :
This freedom from the bondage of actions is possible only in Kṛṣṇa consciousness, when one is doing everything for Kṛṣṇa.

A Kṛṣṇa conscious person acts out of pure love for the Supreme Personality of Godhead, and therefore he has no attraction for the results of the action. He is not even attached to his personal maintenance, for everything is left to Kṛṣṇa. Nor is he anxious to secure things, nor to protect things already in his possession. 

He does his duty to the best of his ability and leaves everything to Kṛṣṇa. Such an unattached person is always free from the resultant reactions of good and bad; it is as though he were not doing anything. This is the sign of akarma, or actions without fruitive reactions. 

Any other action, therefore, devoid of Kṛṣṇa consciousness, is binding upon the worker, and that is the real aspect of vikarma, as explained hereinbefore.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 581 / Vishnu Sahasranama Contemplation - 581🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 581. శమః, शमः, Śamaḥ🌻*

*ఓం శమాయ నమః | ॐ शमाय नमः | OM Śamāya namaḥ*

*ప్రాధాన్యేన శమం జ్ఞానసాధనం ప్రాహ తచ్ఛమః*

*ఇంద్రియ ప్రవృత్తులు నిరోధించబడుటను శమము అందురు అనగా ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తిల్లకపోవుట. సన్యాసులకు ప్రధానముగా జ్ఞానసాధనమగు అట్టి శమమును ఉపదేశించు వాడు గనుక శమః.*

యతీనాం ప్రశమో ధర్మః నియమో వనవాసినామ్ ।
దానమేవ గృహస్థానాం శుశ్రూషా బ్రహ్మచారిణాం ॥
ఇతి స్మృతేస్తత్కరోతి తదాచష్టేత్యతోణిచి ।
పచాద్యచి కృతే రూపం శమ ఇత్యేవ సిద్ధ్యతి ॥

*యతులకు ప్రశమమును, వానప్రస్థులకు నియమమును, గృహస్తులకు దానమును, బ్రహ్మచారులకు గురు శుశ్రూషయయు ముఖ్య ధర్మము అను స్మృతి వచనము ఇట ప్రమాణము. దానిని వ్యాఖ్యానించు, బోధించువాడు అను అర్థమున 'తత్కరోతి తదా చష్టే' అము పాణినీయ చురాదిగణసూత్రముచే 'ణిచ్‍' ప్రత్యయమును పచాది గణశబ్దములపై వచ్చు 'అచ్‍' ప్రత్యయము రాగా పై అర్థమున 'శమః' అను పద రూపము సిద్ధించును.*

సర్వభూతానాం శమయితేతి వా శమ ఉచ్యతే 

*లేదా సర్వభూతములను శమింప అనగా నశింప జేయువాడు శమయతి అని చెప్పవచ్చును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 581🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 581. Śamaḥ 🌻*

*OM Śamāya namaḥ*

प्राधान्येन शमं ज्ञानसाधनं प्राह तच्छमः ।
*Prādhānyena śamaṃ jñānasādhanaṃ prāha tacchamaḥ,*

*He declared that śama is chiefly the means of knowledge of ātmajñāna. So He Himself is Śamaḥ.*

यतीनां प्रशमो धर्मः नियमो वनवासिनाम् ॥
दानमेव गृहस्थानां शुश्रूषा ब्रह्मचारिणां ।
इति स्मृतेस्तत्करोति तदाचष्टेत्यतोणिचि ॥
पचाद्यचि कृते रूपं शम इत्येव सिद्ध्यति ।
सर्वभूतानां शमयितेति वा शम उच्यते ॥

Yatīnāṃ praśamo dharmaḥ niyamo vanavāsinām.
Dānameva gr‌hasthānāṃ śuśrūṣā brahmacāriṇāṃ,
Iti smr‌testatkaroti tadācaṣṭetyatoṇici.
Pacādyaci kr‌te rūpaṃ śama ityeva siddhyati,
Sarvabhūtānāṃ śamayiteti vā śama ucyate.

*As per the smr‌ti, 'The Dharma of the Sannyāsin is pacification of the mind; of the forest-dweller it is austerity; of the house-holder it is charity and of the Brahmacārin, it is service.'*

*He controls all creates therefore, He is Śamaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 30 / Agni Maha Purana - 30 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 12*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. శ్రీహరి వంశ వర్ణనము - 1 🌻*

అగ్ని పలికెను - హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మకు అత్రి, అతనికి సోముడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, అతనికి యయాతి పుట్టిరి, అతనినుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషవర్వుని కుమారైయైన శర్మిష్ఠ ద్రుహ్యు-అను పూరులు అనెడు కుమారులను కనిరి. యదువు కులముందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు.

భూ భారమును తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకశివుని ఆరుగురు పుత్రులు దేవకి యందు వసుదేవుని వలన, విష్ణు ప్రేరిత యైన యోగమాయ- ప్రభావముచే పుట్టిరి. బలరాముడు దేవికి సప్తమ గర్భముగా అయెను. అతడు రోహిణి యందు సంక్రమింపజేయబడి రౌహిణయుడాయెను. పిమ్మట చతుర్భుజుడైన హరి శ్రావణ కృష్ణపక్ష్యష్టమి యందు అర్ధరాత్రమున జనించెను.

రెండు భాహువులు గల బాలుడుగా మారిన ఆ చతుర్భుజుని దేవకీ వసుదేవులు స్తుతించిరి. వసుదేవుడు కంసునికి భయపడి ఆ పిల్లవానిని తీసికొని వెళ్లి యశోద పక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసికొని వచ్చి దేవకి పక్కలో పరుండ బెట్టెను. కంసుడు పిల్ల ఏడ్చిన ధ్వని విని ఆ శిశువును శిలపై వేసి కొట్టెను.

దేవకి వారించినను "నీ అష్టమగర్భము నాకు మృత్యుహేతువు" అని పలుకుచు అట్లుచేసెను. ఆకాశవాణిని విని అతడు దేవకి వివాహసమయమున చెప్పిన ప్రకారము తన కిచ్చన శిశువులనందరిని పూర్వము చంపివేసెను. క్రిందికి విసరి వేయబడిన ఆ బాలిక అకాశముపైకి ఎగిరి కంసునిలో ఇట్లు పలికెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -30 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 12*
*🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 1 🌻*

Agni said:

1. I shall describe the genealogy of Hari (Kṛṣṇa). Brahmā (was born) from the lotus in the navel of Viṣṇu. (Sage) Atri (was born) from Brahmā. Then Soma (was born). Purūravas was born from Soma.

2. Āyu was (born) from him (Purūravas). From him (was born) Nahuṣa and then Yayāti. From whom Devayānī[1] gave birth to Yadu and Turvasu.

3. Śarmiṣṭhā, the daughter of Vṛṣaparvan (gave birth to) Druhyu, Anu and Puru (through Yayāti). The Yādavas (came) in the race of Yadu. Vasudeva was the foremost among these.

4-7. From Vasudeva through Devakī (was born Kṛṣṇa) in order to remove oppression on the earth. Once the sons of Hiraṇyakaśipu (became) the six embryos in the womb of Devakī being led by the meditative-sleep cast by Viṣṇu. The seventh child in the womb of Devakī that was strong was transferred to (the womb of) Rohiṇī and (was born) as the son of Rohiṇī.[2] Then Hari the four-armed (manifested) in the sky on the eighth day of the dark fortnight and being adored by Devakī and Vasudeva (was born) as a child with two arms. Vasudeva took (the child) to the couch of Yaśodā, being afraid of Kaṃsa.

8-10. Yaśodā carried the daughter (born to her) and left it at the couch of Devakī. Having heard the cries of the child, Kaṃsa (came there and carried the child) and smashed it on the stone slab in spite of being obstructed by Devakī. Having heard the voice in the heavens that, “My eighth birth would be your death", and being infuriated all the children born were killed (by him) after they were left with him by Devakī as promised (by Vasudeva) at the time of their marriage. The girl who was thrown (on the slab) (bounced) to the sky and said:

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 260 / DAILY WISDOM - 260 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 16. ప్రాథమిక గుణాల అవగాహన 🌻*

*'స్ధలం, కాలం మరియు దేవత' అనే తన పుస్తకంలో, శామ్యూల్ అలెగ్జాండర్ వివరించిన వ్యవస్థలో ఆధునిక భౌతిక శాస్త్రం మతపరమైన దిగుమతిగా ప్రత్యేకంగా చెప్పబడింది. అలెగ్జాండర్ సాపేక్షత సిద్ధాంతం నుండి సేకరించిన వివరాల ప్రకారం విశ్వ పదార్ధం యొక్క మాతృక స్ధలం, కాలం. ఈ స్ధలము-కాలము ప్రతిదానికి చలనం మరియు శక్తిని కలిగిస్తుంది. పొడవు, వెడల్పు మరియు ఎత్తు, పదార్ధం, వస్తు పరిమాణం మరియు స్వభావం వంటి ప్రాథమిక లక్షణాల యొక్క త్రిమితీయ చిత్రాన్ని తెస్తుంది.*

*ఈ ప్రాథమిక లక్షణాల యొక్క అవగాహన అనేది ఒక విధమైన చర్య-ప్రతిస్పందన ప్రక్రియ కారణంగా ఉత్పన్నమయ్యే ద్వితీయ లక్షణాల ద్వారా జరుగుతుంది. ఇవి గ్రహణ వస్తువు యొక్క ప్రాథమిక నాణ్యత మరియు దానిని గ్రహించే మనస్సు మధ్య గ్రహించ బడుతున్నాయి. ఒక ఉదాహరణను ఉదహరించాలంటే, ఆకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే ఆకు యొక్క అంతర్గత నిర్మాణంలోని అన్ని ఇతర లక్షణాలు మినహాయించి కేవలం దానిలో స్వయం చాలకంగా జరిగే పచ్చదనం అని పిలువబడే లక్షణాల సంగ్రహణ కారణంగా కనిపిస్తుంది. ఇతర రంగులు మరియు వస్తువుల రూపాల విషయంలో కూడా అలాగే ఉంటుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 260 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 16. The Perception of Primary Qualities 🌻*

*The specially religious import of modern physical science is highlighted also in the system of Samuel Alexander, which he purports to explain in his book entitled “Space, Time and Deity”. According to Alexander, space-time is the matrix of all things, the very substance of the universe, a clue that he gathers from the Theory of Relativity. The space-time matrix causes motion and force, and brings about the three-dimensional picture of what are known as primary qualities, like length, breadth and height, substance, volume and content.*

*The perception of these primary qualities happens to be through the secondary qualities arising as a sort of action-reaction process obtaining between the object of perception, namely, a primary quality and the perceiving mind. To cite an instance, a leaf looks green in colour not because there is such a thing called greenness in nature itself, but because of an abstraction of properties automatically taking place in the internal structure of the leaf excluding all other characteristics in nature apart from what looks like green. So is the case with other colours and forms of objects.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 160 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఏ క్షణంలో నువ్వెవరో గ్రహిస్తావో ఆ క్షణమే సమస్తమూ నీ కళ్ళముందు నిలుస్తుంది. సంపూర్ణత నీ సందర్శనకు అందుతుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడమంటే సమస్తాన్నీ తెలుసుకోవడం. 🍀*

*నిన్ను నువ్వు తెలుసుకోవడమంటే సమస్తాన్నీ తెలుసుకోవడం. అదొక్కటే నేను పదే పదే చెబుతాను. నొక్కి చెబుతాను. ఎట్లాంటి విశ్వాసం, సిద్ధాంతం, చర్చి, మతం, ఆచారం దానికి అవసరం లేదు. సాధారణమైన, నిర్మలమయిన పరిశీలనతో నీ లోపలికి చూసుకోవడమొక్కటే చేయాలి.*

*ఏ క్షణంలో నువ్వెవరో గ్రహిస్తావో ఆ క్షణమే సమస్తమూ నీ కళ్ళముందు నిలుస్తుంది. సంపూర్ణత నీ సందర్శనకు అందుతుంది. అప్పుడు జీవితం కూడా నీ అవగత మవుతుంది. కారణం నువ్వు జీవితంలో భాగమే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 99 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 80. నూతన యుగము 🌻*

*నూతన యుగమును గూర్చి ఎన్నియో ఆశాభావములు వ్యక్తమైనవి. నూతన జీవనము గూర్చి ఎన్నియో ప్రయత్నములు జరుగు చున్నవి. నూతనమగు ఏర్పాట్లను, సర్దుబాట్లను మానవుడు అవిరామముగ చేయుచున్నాడు. అయినను నూతన జీవన మబ్బలేదు. నూతన యుగము రాలేదు. శాంతి కొరకు భౌతిక లోకమున మహత్తరమగు ప్రయత్నములు జరుగుచున్నవి. శాంతి కొరకు యుద్ధములు కూడ చేయుచున్నారు. యుద్ధము, శాంతి ఒకదానికొకటి విరుద్ధము.*

*మానవునిలోని అశాంతి, అసహనము, అధికార కాంక్ష, శాంతి కొరకు చేయు ప్రయత్నములను విఫలము చేయును. ప్రపంచ శాంతికి ప్రయత్నము చేయువారి స్వభావము నందు శాంతి యున్నచో వారు చేయు కృషి శాంతి నందించ గలదు. ఎవరు దేనియందు నిష్ణాతులో, వారు దానిని ప్రకటించుటకు సమర్థులు. కపటత్వమున శాంతి లభింపదు. కపటత్వమే ప్రకటితమగు చుండును. తనవద్ద లేని వస్తువును తానిచ్చెదననుట కపటము. భావము, భాషలను సత్యము ఆవరించినచో నూతన యుగము ఆరంభము కాగలదు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹