🍀 08 - SEPTEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀 🌴. ఓనమ్‌ శుభాకాంక్షలు, Happy Onam to All 🌴

🌹🍀 08 - SEPTEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀 🌴. ఓనమ్‌ శుభాకాంక్షలు, Happy Onam to All 🌴🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 06, గురువారం, సెప్టెంబరు 2022 బృహస్పతి వాసరే Thursday 🌹
🌴. ఓనమ్‌ శుభాకాంక్షలు, Happy Onam to All 🌴
2) 🌹 కపిల గీత - 67 / Kapila Gita - 67 🌹 సృష్టి తత్వము - 23
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 106 / Agni Maha Purana - 106 🌹 
4) 🌹. శివ మహా పురాణము - 622 / Siva Maha Purana -622 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 241 / Osho Daily Meditations - 241 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 4 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹08, September 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🌴. ఓనమ్‌ శుభాకాంక్షలు, Happy Onam to All 🌴*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, ఓనమ్‌, Pradosh Vrat, Onam🌻*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 10 🍀*

*10. అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతోః ఆతస్థివాన్మంత్రమయం శరీరం*
*అఖండసారైర్హవిషాం ప్రదానైః ఆప్యాయనం వ్యోమసదాం విధత్సే ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అనంతం యొక్క కట్టకడపటి తీవ్ర వేగం అలవడడానికి అవరోధమనేదీ ఎంతగా అవసరమో నీవు గుర్తించ గలిగినప్పుడే, దైవీ పద్ధతులు మసకగానైనా అర్థం అవుతాయి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల త్రయోదశి 21:04:18
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: శ్రవణ 13:46:22 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: అతిగంధ్ 21:41:54
వరకు తదుపరి సుకర్మ
కరణం: కౌలవ 10:34:33 వరకు
వర్జ్యం: 17:24:10 - 18:51:26
దుర్ముహూర్తం: 10:10:09 - 10:59:34
మరియు 15:06:37 - 15:56:02
రాహు కాలం: 13:46:20 - 15:18:58
గుళిక కాలం: 09:08:24 - 10:41:02
యమ గండం: 06:03:07 - 07:35:45
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37
అమృత కాలం: 04:20:30 - 05:47:30
మరియు 26:07:46 - 27:35:02
సూర్యోదయం: 06:03:07
సూర్యాస్తమయం: 18:24:15
చంద్రోదయం: 17:07:05
చంద్రాస్తమయం: 03:39:07
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మకరం
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 13:46:22 వరకు
తదుపరి శ్రీవత్స యోగం - ధన లాభం , 
సర్వ సౌఖ్యం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌴🌴. ఓనమ్‌ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Onam to All 🌴🌴*
🙏. ప్రసాద్‌ భరధ్వాజ

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 67 / Kapila Gita - 67🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 23 🌴*

*23. మహత్తత్త్వాద్వికుర్వాణాద్భగవద్వీర్యసమ్భవాత్*
*క్రియాశక్తిరహఙ్కారస్త్రివిధః సమపద్యత*

*ప్రకృతి తత్వములో పరమాత్మ సంకల్పముతో క్షోభ కలుగ చేస్తే హిరణ్మయమైన మహత్ తత్వం ఏర్పడింది.ఆ మహత్ తత్వం యొక్క వికారమే చిత్తమూ. ఈ మహత్ తత్వములో కూడా పరమాత్మ క్షోభను కలిగిస్తే, పరమాత్మ సంకల్పం వలన కలిగిన ప్రేరణతో కలిగిన వికారముతో మూడు రకములైన అహంకారాలు పుడతాయి. వీటి వలనే కర్మేంద్రియములూ, జ్ఞ్యానేంద్రియములూ, మనసు కలుగుతాయి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 67 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 23 🌴*

*23. mahat-tattvād vikurvāṇād bhagavad-vīrya-sambhavāt*
*kriyā-śaktir ahaṅkāras tri-vidhaḥ samapadyata*

*The material ego springs up from the mahat-tattva, which evolved from the Lord's own energy. The material ego is endowed predominantly with active power of three kinds—good, passionate and ignorant. It is from these three types of material ego that the mind, the senses of perception, the organs of action, and the gross elements evolve.*

*In the beginning, from clear consciousness. The first contamination false ego, or identification of the body as self. The living entity exists in the natural consciousness, but he has marginal independence, and this allows him to forget.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 106 / Agni Maha Purana - 106 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 33*

*🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము - 7🌻*

 వాటి వెలుపల తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్ర - అగ్ని-యమ-నిర్బతి- వరుణ-వాయు-కుబేర-ఈశానులను పూజించి నైరృతి పశ్చమదిక్కల మధ్య అనంతుని, తూర్పు-ఈశాన్యదిక్కుల మధ్య బ్రహ్మను పూజించవలెను.

వీటి బైట వజ్రము మొదలగు అస్త్రమయఆవరణములను పూజించవలెను. వీటి బైట దిక్పలకుల వాహనరూపములగు ఆవరణములను పూజింపవలెను. తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఐరావతమును, మేకను, దున్నపోతును, వానరుని, మత్స్యమును, మృగమును, చెవులపిల్లిని, వృషభమును, కూర్మమును, హంసను పూజింపవలెను. వీటి బయట పృశ్నిగర్భుడు, కుముదుడు మొదలగు ద్వారపాలులను పూజింపలెను. 

తూర్పు మొదలు ఉత్తరము వరకు, అన్ని దిక్కులందును ఇద్దరిద్దరు ద్వారపాంకులను పూజింపవలెను. పిమ్మట శ్రీహరికి నమస్కారము చేసి వెలుపల బలి అర్పింపవలెను. ''ఓం విష్ణుపార్షదేభ్యో నమః '' అను మంత్రము నుచ్చరించుచు విష్ణుపీఠముపై వారలకు బలి అర్పింపవలెను. ఈశానదిక్కునందు ''ఓం విశ్వాయ విష్వక్సేనాయ నమః'' అను మంత్రముచే విష్వక్సేనపూజ చేయవలెను. పిమ్మట దేవుని కుడిచేతికి రక్షాసూత్రము కట్టవలెను. 

ఆ సమయమున ఆ భగవంతునితో ఇట్లు చెప్పవలెను-

''దేవా! ఒక సంత్సరముపాటు నిరంతరము జరుగు మీ పూజయొక్క సంపూర్ణఫలము లభించుటకై జరుప నున్న పవిత్రారోపణకర్మకొరకై ఈ కౌతుకసూత్రమును ధరింపుము. ఓం నమః''. పిమ్మట భగవంతుని సమీపమున ఉపవాసాది నియమములను అవలంబించి ఇట్లు చెప్పవలెను. ''నేను నియమపూర్వకముగ ఉపవాసాదులు చేసి ఇష్టదేవతకు సంతోషము కలిగింపగలను. దేవేశ్వరా! నేడు మొదలు వైశేషిక ఉత్సవ దివసము వరకును కామక్రోధాదిదోషము లేవియు నా వద్దకు రాకుండు గాక''. 

వ్రతమును స్వీకరించిన యజమానుడు ఉపవాసముచేయు సామర్థ్యము లేని పక్షమున నక్తవ్రతము (రాత్రిమాత్రమే భోజనము చేయుట) ఆచరించవలెను. హవనము చేసి భగవంతునిస్తోత్రము చేసిన పిమ్మట భగవంతుని ఉద్వాసన చెప్పవలెను. భగవంతుని నిత్యపూజ చేసి చో లక్ష్మి ప్రాప్తించును. భగవంతుని పూజించుటకై ''ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః'' అనునది మంత్రము.

శ్రీ అగ్ని మహాపురాణమునందు పవిత్రారోపణమున శ్రీధరనిత్యపూజావిధాన మను ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 106 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 33*
*🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 7 🌻*

45. The bow, club, sword, and garland of wild flowers (should be worshipped) outside it. Indra and others as well as Ananta, and Varuṇa (should be worshipped) in the south-west.

46-48. Brahmā and Indra (should be worshipped) in the north-east and their hosts of weapons on the outside. The Airā-vata (the elephant of Indra), goat, buffalo, monkey, fish, deer, hare, bull, tortoise, and haṃsa (should be worshipped) and Kṛṣṇa on the outside. The gate-keepers Kumuda and others (should be worshipped) in pairs from the east to the north. After saluting Hari, the food (is offered) outside. Salutations to the attendants of Viṣṇu. The offering should be made on the altar.

49. One should worship the Universal Being, the All-pervading on the north-east. The protective thread should be tied on the right arm of the lord.

50. (One should say), “Oṃ salutations to the one who confers full benefits of worship done through the whole year. You wear this thread for the purpose of installation.”

51. One should observe the vow of fasting etc. in the presence of the deity (saying), “I am pleasing the deity by observing fasting etc.”

52. “May not lust, anger, and all other (qualities) reside in me ever. O lord of gods from this day onwards it is the last of them.”

53. If the worshipper is unable (to do as described), he should observe the vow eating only in the night. Having made oblations, the visarjana (dismissal) is done, after laudation. This is the (mode of) daily worship which yields riches. Oṃ, hrīṃ, śrīm, salutations to Śrīdhara the enchanter of the three worlds.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 621 / Sri Siva Maha Purana - 621 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 09 🌴*
*🌻. దేవాసురసంగ్రామ వర్ణన - 4 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆతడిట్లు పలికి వారిని నిందించుట వలన తన పుణ్యమును పోగొట్టు కొనెను. యుద్దవీరులలో శ్రేష్ఠుడగు ఆ తారకుడు అత్యద్భుతమగు శక్తిని చేతబట్టెను (36). ఇంద్రుడు గుహుని ముందిడుకొని ఆ బాలుని సమీపమునకు వచ్చుచున్న తారకాసురుని బలముగా వజ్రముతో కొట్టెను (37). నిందచే నష్టమైన బలము గల ఆ తారకుడు ఆ వజ్రపు దెబ్బచే శిథిలమైన అవయవములు గలవాడై వెంటనే క్షణకాలము నేలపై బడెను(38).

ఆతడు క్రిందపడిననూ మరల పైకి లేచి ఏనుగుపై నున్న ఆ ఇంద్రుని కోపముతో శక్తితో కొట్టి నేలపై బడవేసెను (39). ఇంద్రుడు పడుటను గాంచిన దేవసేనలో పెద్ద హాహాకారము బయల్వెడలెను. దేవతలను దుఃఖము ఆవేశించెను (40). తారకుడా సమయములో దుఃకము నిచ్చునది, తన నాశమునకు హేతవు అయినది, ధర్మమునకు విరుద్ధమైనది అగు కర్మను ఆచరించినాడు. దానిని నేను చెప్పెదను. తెలుసుకొనుము(41). పడియున్న ఇంద్రుని ఆతడు కాలితో తన్ని వజ్రమును చేతినుండి లాగుకొని దానితో మిక్కుటముగా ఆతనిని కొట్టెను (42).

ఈ విధముగా ఇంద్రుడు అవమానింపబడుటను గాంచి ప్రతాపశీలుడగు విష్ణు భగవానుడు చక్రమును పైకెత్తి తారకుని కొట్టెను(43). చక్రముతో గొట్టిన దెబ్బకు అతడు నేలపై బడెను. కాని ఆ రాక్షసరాజు మరల లేచి శక్తితో విష్ణువును కొట్టెను (44). ఆ శక్తి యొక్క దెబ్బకు అచ్యుతుడు నేలపై బడెను. అపుడు దేవతలు పెద్ద హాహాకారముతో అధికముగా ఆక్రోశించిరి (45). కాని ఒక నిమేషకాలములో విష్ణువు స్వయముగా లేచి నిలబడెను. ఇంతలో వీరభద్రుడు తత్‌క్షణమే రాక్షసుని పైకి వెళ్లెను (46).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 621🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 09 🌴*

*🌻 Boasting of Tāraka and fight between him and Indra, Viṣṇu, Vīrabhadra - 4 🌻*

Brahmā said:—

36. Saying this and dispossessing himself of his own merit by that act of censure, Tāraka the foremost among war-mongers seized his wonderful spear.

37. Indra who was going ahead of Kumāra hit the demon Tāraka forcibly with his thunderbolt as he was approaching the boy.

38. Tāraka was shattered and split by that blow of the thunderbolt, his power being sapped up already by the act of censure. He fell on the ground.

39. Though he fell down, he got up immediately and furiously hit Indra who was seated on an elephant, with his spear and felled him to the ground.

40. When Indra fell down there was a great hue and cry. On seeing it a great pain entered the army of the gods.

41. Know from me the vile action that Tāraka has committed against virtue which is sure to bring about his own ruin.

42. He stamped on Indra with his foot after he fell down and seized his thunderbolt with which he hit him with great force.

43. Seeing Indra thus insulted, the powerful lord Viṣṇu lifted his discus and hit Tāraka.

44. Hit by the discus he fell on the ground. Getting up again, the lord of the Asuras hit Viṣṇu with his spear.

45. On being hit by the spear Viṣṇu fell on the ground. There was a great uproar. The gods lamented much.

46-47. Within a moment Viṣṇu got up but by that time Vīrabhadra came near the demon and dexterously raised his trident. 

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 241 / Osho Daily Meditations - 241 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 241. పిల్లలలాగా మారడం 🍀*

*🕉. మీరు ధ్యానం చేస్తే మరింత పిల్లవాడిగా మారతారు. కొద్దిగా ధ్యానం చేయండి, మీరు తాజాగా అనుభూతి చెందుతారు. దానితో ఒక విధమైన బాధ్యతా రాహిత్యం వస్తుంది - మీరు ఇతరుల వ్యామోహాలను ఇకపై పరిగణించరు అనే అర్థంలో బాధ్యతారాహిత్యం. 🕉*
 
*నేను చూస్తున్నట్లుగా, పిల్లలలాగా మారడం గొప్ప బాధ్యత. మీరు మీ పట్ల బాధ్యత వహించడం ప్రారంభించండి. మీరు మీ ముసుగులు, మీ తప్పుడు ముఖాలను వదులుకోవడం ప్రారంభిస్తారు. ఇతరులు ఎల్లప్పుడూ మీ పట్ల అంచనాలను కలిగి ఉంటారు. మీరు ఆ అంచనాలను నెరవేర్చక పోతే వారు కలవరపడవచ్చు. మీరు బాధ్యతారాహిత్యంగా మారుతున్నారని వారు భావిస్తారు. మీరు బాధ్యతారాహిత్యంగా మారుతున్నారని వారు చెప్పినప్పుడు, మీరు వారి నియంత్రణలో నుండి బయట పడుతున్నారని వారు తెలియ చేస్తున్నారు. మీరు స్వేచ్ఛగా మారుతున్నారు. మీ ప్రవర్తనను ఖండించడానికి, వారు దానిని 'పిల్లతనం' లేదా 'బాధ్యతా రహితం' అని పిలుస్తారు.*

*నిజానికి, స్వేచ్ఛ పెరుగుతోంది, మరియు మీరు మీ పట్ల మరింత బాధ్యత వహిస్తున్నారు. బాధ్యత అంటే ప్రతిస్పందించే సామర్థ్యం. ఇది సాధారణ అర్థంలో నెరవేర్చవలసిన విధి కాదు. ఇది అతి సున్నితమైన ప్రతిస్పందన. కానీ మీరు ఎంత సున్నితంగా మారితే, మీరు బాధ్యతారాహిత్యంగా మారుతున్నారని చాలా మంది భావిస్తారని మీరు కనుగొంటారు - మీరు దానిని అంగీకరించాలి. ఎందుకంటే వారి ఆసక్తులు, వారి పెట్టుబడులు సంతృప్తి చెందవు. చాలా సార్లు మీరు వారి అంచనాలను నెరవేర్చలేరు. కానీ ఎవరివో అంచనాలను నెరవేర్చడానికి ఇక్కడ ఎవరూ లేరు. మీరు లేరు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 241 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 241. CHILDLIKE 🍀*

*🕉. You are bound to become more childlike if you meditate. A little meditation and you will start feeling fresher. And with that comes a sort of irresponsibility--irresponsibility in the sense that you don't consider other people's obsessions any more. 🕉*
 
*As I see it, becoming childlike is a great responsibility. You start becoming responsible to yourself, but you start dropping your masks, your false faces. Others may start feeling disturbed because they have always had expectations and you were fulfilling those demands. Now they will feel that you are becoming irresponsible. When they say that you are becoming irresponsible, they are simply saying that you are getting out from under their control. You are becoming freer. To condemn your behavior, they call it "childish" or "irresponsible."*

*In fact, freedom is growing, and you are becoming responsible-but responsibility means the ability to respond. It is not a duty that has to be fulfilled in the ordinary sense. It is responsiveness, it is sensitivity. But the more sensitive you become, the more you will find that many people think that you are becoming irresponsible--and you have to accept that--because their interests, their investments, will not be satisfied. Many times you will not fulfill their expectations. But nobody is here to fulfill anybody else's expectations.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*
*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*

*🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 4 🌻* 

*మహాకామేశ నయన అను పదముల సముదాయమునకు మరియొక అర్థము కూడ యున్నది. 'నయన' అనగా చేర్చుట అను అర్థము కూడ యున్నది. ఉపనయన మనగా దగ్గరకు చేర్చుట. బ్రహ్మము దగ్గరకు చేర్చుటకే ఉపనయన క్రతువు. అట్లే మహా కామేశుని దగ్గరకు జీవులను చేర్చుటకు కృషి చేయునది శ్రీమాత. పిల్లలను పెంచి తండ్రికి అప్పచెప్పుట తల్లుల కర్తవ్యమై యున్నది. అందువలన శ్రీమాత కృషి అంతయూ జీవులను దేవుని వద్దకు చేర్చుటయే. వెన్నెల వెలుగు మార్గము ద్వారా జీవులను దేవుని వద్దకు చేర్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*
*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*

*🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 4 🌻*

*Mahakamesha Nayana also has another meaning. 'Nayana' also means to include. Upanayana means to bring closer. Thus, Upanayana is the act of approaching Brahman. It is Srimata who strives to bring living beings closer to the great Lord. It is the mother's duty to bring up the children and hand them over to the father. Therefore Sri Mata's work is to bring all beings to God. She brings the beings to God through the path of light.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 237


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 237 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అహం అధికారపూర్వకం. అదెప్పుడూ మర్యాదగా మారదు. అది వినయంగా మారదు. మర్యాద, వినయం, ద్వారానే అస్తిత్వానికి దారి ఏర్పడుతుంది. మనిషి రాయిగా వుండడం కన్నా నీరుగా మారాలి. 🍀


మర్యాద అన్నది గొప్ప దైవికమయిన లక్షణం. అస్తిత్వంలో అపూర్వమయిన లక్షణం వల్ల అహం వదిలేయ బడుతుంది. అహమెప్పుడూ మర్యాద కాదు. అహం అధికారపూర్వకం. అదెప్పుడూ మర్యాదగా మారదు. అది వినయంగా మారదు. వినయంగా అది వుండడమన్నది అసాద్యం.

అది వినయంగా మారితే దాని స్థితి తలకిందులవుతుంది. మర్యాద, వినయం, ద్వారానే అస్తిత్వానికి దారి ఏర్పడుతుంది. మనిషి రాయిగా వుండడం కన్నా నీరుగా మారాలి. ఒక విషయమెప్పుడూ గుర్తుంచుకోవాలి. కాలం గడిచే కొద్దీ నీరు రాయిపై విజయం సాధిస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 337 - 2. నీతి మరియు నైతిక శాస్త్రం / DAILY WISDOM - 337 - 2. The Science of Ethics and Morality


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 337 / DAILY WISDOM - 337 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻 2. నీతి మరియు నైతిక శాస్త్రం 🌻


మానవ జీవితం సురక్షితంగా జీవించడానికి కొన్ని నిర్దుష్టమైన ప్రవర్తనా నియమాలపై ప్రజలు ఎక్కువగా ఆధారపడతారు. వీటినే నైతిక విలువలు లేదా నైతికత అంటారు. మనిషి తన అసమర్థత, అభద్రత మరియు బానిసత్వ భావనను అధిగమించడానికి ప్రయత్నించే ప్రయత్నాలలో ఇది మరొకటి. వ్యక్తుల ప్రవర్తనకు నైతికత అనే ఒక ప్రమాణం లేదా కట్టుబాటు రూపొందించబడింది. ఆ కట్టుబాటు విచ్ఛిన్నమైతే, ఆ ప్రవర్తనను అనైతికం, మొదలైనవి అంటారు. నేటి మతాలు ఈ నైతిక విలువల గురించి ఎంత చెప్పినా, ఆఖరికి ఇవి ఎది చెయ్యాలో, ఎది చెయ్యకూడదో, ఎలా చెయ్యాలో చెప్పే ఒక నియమాల సంపుటి మాత్రమే తప్ప మరొకటి కాదు. మనుష్యులను ఒక విధంగా మాత్రమే జీవించాలని బలవంతపెట్టే ఒక నిర్దుష్టమైన నియమాల యొక్క సమూహం.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనిషి ఒక నిర్దిష్ట పద్ధతిలో మాత్రమే ప్రవర్తించవలసి వస్తుంది, అయితే నీతి మరియు నైతికత యొక్క ఆదేశాలు అతన్ని మరొక విధంగా బలవంతం చేస్తాయి. అతను కోరుకున్నా లేకపోయినా ఒక ప్రామాణిక పద్ధతిలో ప్రవర్తించేలా బలవంతం చేస్తాయి. . కాబట్టి, మళ్ళీ, అతను బంధన స్థితిలోనే ఉన్నాడు. జీవితంలో స్వేచ్ఛ కిరణం కూడా కనిపించదు. ప్రతి వైపు నుండి ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఈ పద్ధతిలో లేదా ఆ పద్ధతిలో చెప్పడానికి, చేయమని మరియు ఆలోచించమని మతం ప్రతి ఒక్కరినీ బలవంతం చేస్తుంది; సమాజం దానిదైన పంథా లో బలవంతం చేస్తుంది. రాజకీయ ప్రభుత్వాలు కూడా అలాగే ఉంటాయి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 337 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 2. 2. The Science of Ethics and Morality 🌻


There is the science of ethics, often called morality, on which people hang very much for a safe conduct of human life. This is another of man's attempts at trying to tackle his feeling of inadequacy, insecurity, and bondage. A standard or a norm is framed for the behaviour of people, and, if the norm is broken, that behaviour is called unethical, immoral, and so on. Thus, the religions of the world today, especially those which have leant too much on these norms of ethics and morality, have turned out to be nothing but mechanisms of dos and don'ts, a different set of mandates that compel men to behave in a particular manner.

While man is forced to behave in a particular manner only, willy-nilly, by the regulations of the government, the mandates of ethics and morality compel him in another way and force him to behave in a standardised manner, whether he wants it or not. So, again, he is in a state of bondage. Not even a ray of freedom can be seen in life. There are always compulsions from every side. Religion compels everyone to say, do, and think in this manner or that manner; society forces in its own way; and so do political governments.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹




విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 658 / Vishnu Sahasranama Contemplation - 658


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 658 / Vishnu Sahasranama Contemplation - 658🌹

🌻658. వీరః, वीरः, Vīraḥ🌻

ఓం వీరాయ నమః | ॐ वीराय नमः | OM Vīrāya namaḥ


విష్ణుర్గత్యాది మత్త్యాత్సవీర ఇత్యభిధీయతే

'వీ' అను ధాతువునకు పలు అర్థములుగలవు.

వీ గతి వ్యాప్తి ప్రజన కాన్తి అసన ఖాదనేషు.

వ్యాప్తి - అనగా ఎందయినను చేరియుండు వాడు; ప్రజననము - మిక్కిలిగా ప్రపంచమును జనింప జేయువాడు; కాంతి - ప్రకాశము గలవాడు; అసనము - అసురులు మొదలయిన వారిని సంహరించుటకై ఏ ఆయుధములయినను ఎంతటి దూరమునకయినను విసిరివేయ సామర్థ్యము గలవాడు; ఖాదము - ప్రళయ కాలమున సర్వ ప్రాణులను హరించువాడు.

పై అర్థములుగల 'వీ' అను ధాతువునకు 'ర' - 'కలది' అను అర్థముగల ప్రత్యయము చేరగా వీరః అను నామము వచ్చును. 'వీ' ధాత్వర్థములన్నియు తన ధర్మములుగా గలవాడు కనుక ఆ విష్ణు దేవుడు వీరః అనబడును.

401. వీరః, वीरः, Vīraḥ

643. వీరః, वीरः, Vīraḥ

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 658🌹

🌻658.Vīraḥ🌻

OM Vīrāya namaḥ


विष्णुर्गत्यादि मत्त्यात्सवीर इत्यभिधीयते / Viṣṇurgatyādi mattyātsavīra ityabhidhīyate

The root 'Vī' has many interpretations.

वी गति व्याप्ति प्रजन कान्ति असन खादनेषु / Vī gati vyāpti prajana kānti asana khādaneṣu.

'Vī' can mean motion, pervasion (to pervade), creation, effulgence, throwing (weapon) and annihilation. The suffix 'ra' implies (the One) with. Hence Lord Viṣṇu by the reason of having all capabilities/attributes as defined by the root 'Vī' is Vīraḥ.

401. వీరః, वीरः, Vīraḥ

643. వీరః, वीरः, Vīraḥ

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹



శ్రీమద్భగవద్గీత - 259: 06వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 259: Chap. 06, Ver. 26

 

🌹. శ్రీమద్భగవద్గీత - 259 / Bhagavad-Gita - 259 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 26 🌴

26. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్యన్యేవ వశం నయేత్ ||


🌷. తాత్పర్యం :

చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మ వశమునకు గొనిరావలెను.

🌷. భాష్యము :

చంచలత్వము, అస్థిరత్వమనునవి మనస్సు యొక్క స్వభావములు. కాని ఆత్మదర్శియైన యోగి అట్టి మనస్సును నియమింపవలెను. దానిచే అతడెన్నడును నియమింపబడరాదు. మనస్సును నియమించినవాడు (తద్ద్వారా ఇంద్రియములను నియమించినవాడు) గోస్వామి లేదా స్వామి యనబడును. అట్లుగాక మనస్సు చేతనే నియమింప బడెడివాడు గోదాసుడు లేదా ఇంద్రియదాసుడని పిలువబడును.

ఇంద్రియముల వలన కలిగే ఆనందపు పరిమాణమును గోస్వామి ఎరిగియుండును. కనుకనే దివ్యానంద భావనలో అతని ఇంద్రియములు హృషీకేశుని (ఇంద్రియాధినేతయైన శ్రీకృష్ణుడు) సేవ యందు నియుక్తమై యుండును. ఆ విధముగా పవిత్రములైన ఇంద్రియములతో కృష్ణుని సేవించుటయే కృష్ణభక్తిరసభావనమనబడును.

ఇంద్రియములను అదుపులోనికి తెచ్చుటకు ఇదియే ఉత్తమమార్గము. యోగాభ్యాసపు అత్యున్నత పూర్ణత్వమైన దీనికి మించినది వేరొక్కటి లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 259 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 26 🌴

26. yato yato niścalati manaś cañcalam asthiram
tatas tato niyamyaitad ātmany eva vaśaṁ nayet


🌷 Translation :

From wherever the mind wanders due to its flickering and unsteady nature, one must certainly withdraw it and bring it back under the control of the Self.

🌹 Purport :

The nature of the mind is flickering and unsteady. But a self-realized yogī has to control the mind; the mind should not control him. One who controls the mind (and therefore the senses as well) is called gosvāmī, or svāmī, and one who is controlled by the mind is called go-dāsa, or the servant of the senses. A gosvāmī knows the standard of sense happiness. In transcendental sense happiness, the senses are engaged in the service of Hṛṣīkeśa, or the supreme owner of the senses – Kṛṣṇa. Serving Kṛṣṇa with purified senses is called Kṛṣṇa consciousness.

That is the way of bringing the senses under full control. What is more, that is the highest perfection of yoga practice.

🌹 🌹 🌹 🌹 🌹



07 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹07, September 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

🌴. వామన జయంతి శుభాకాంక్షలు, Happy Vamana Jayanti 🌴

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : వామన జయంతి, Vamana Jayanti 🌺

🍀. శ్రీ వామన స్తోత్రం 🍀


విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ
స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే |

స్వస్థాయ శశ్వదుపబృంహితవూర్ణబోధ-
వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే ||

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : తుట్టతుది ఆనందం అందుకోడానికి దుఃఖమనేదీ, అడ్డులేని కార్యసిద్ధి పొందడానికి అపజయమనేదీ ఎంతగా అవసరమో నీవు గుర్తించ గలిగినప్పుడే, ఈశ్వరుని కార్యపద్ధతులు నీకు అర్థం కావడమనేది ప్రారంభమౌతుంది.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: శుక్ల ద్వాదశి 24:06:53 వరకు

తదుపరి శుక్ల త్రయోదశి

నక్షత్రం: ఉత్తరాషాఢ 16:01:32

వరకు తదుపరి శ్రవణ

యోగం: శోభన 25:16:56 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: బవ 13:35:17 వరకు

వర్జ్యం: 01:27:40 - 02:55:00

మరియు 19:38:30 - 21:05:30

దుర్ముహూర్తం: 11:49:17 - 12:38:46

రాహు కాలం: 12:14:02 - 13:46:47

గుళిక కాలం: 10:41:16 - 12:14:02

యమ గండం: 07:35:44 - 09:08:30

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38

అమృత కాలం: 10:11:40 - 11:39:00

మరియు 28:20:30 - 29:47:30

సూర్యోదయం: 06:02:58

సూర్యాస్తమయం: 18:25:05

చంద్రోదయం: 16:14:36

చంద్రాస్తమయం: 02:32:43

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మకరం

వజ్ర యోగం - ఫల ప్రాప్తి 10:33:59

వరకు తదుపరి ముద్గర యోగం

- కలహం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


శ్రీ వామన స్తోత్రం Shri Vamana Stotram


🌺. వామన జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Vamana Jayanti to All 🌺

ప్రసాద్ భరద్వాజ

🍀. శ్రీ వామన స్తోత్రం 🍀


అదితిరువాచ –

యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద

తీర్థశ్రవశ్శ్రవణ మంగళనామధేయ |

ఆపన్నలోకవృజినోపశమోదాఽఽద్య శం నః

కృధీశ భగవన్నసి దీననాథః ౧


విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ

స్వైరం గృహీత పురుశక్తి గుణాయ భూమ్నే |

స్వస్థాయ శశ్వదుప బృంహిత వూర్ణబోధ-

వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే ౨


ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ-

ర్ద్యౌభూరసాస్సకలయోగగుణాస్త్రివర్గః |

జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టా-

త్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః ౩


ఇతి శ్రీమద్భాగవతే శ్రీవామనస్తోత్రం |

🌹 🌹 🌹 🌹 🌹


వామన జయంతి శుభాకాంక్షలు, Happy Vamana Jayanti


🌹. వామన జయంతి విశిష్టత🌹

🌴. వామన జయంతి శుభాకాంక్షలు, Happy Vamana Jayanti 🌴

📚. ప్రసాద్‌ భరధ్వాజ

'ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా'నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు.


ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి , కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు. దీన్ని వామన ద్వాదశిగా , విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు. సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం , మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ , ఆ వైవిధ్యం ఆత్మ , పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది , మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో , అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే !

వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం , వామన పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి , స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది , కేశవుణ్ని వేడుకుని , అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు. అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి.

బ్రహ్మ తేజస్సు , దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని , గొడుగును , కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. 'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...' అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు , వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు.

'కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు' అన్నాడు వామనుడు. ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. అయినా బలి శుక్రుడి మాట వినకుండా , వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకుని , ఓ పాదంతో భూమినీ , మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి , మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి , అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు.

బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.

వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం గోచరమవుతుంది .

దుంధుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు. దుంధుణ్ని యుక్తితో జయించాలని , శ్రీహరి వామన రూపంలో దేవికానదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు. దుంధుడు , అతడి అనుచరులు ఆ బాలుణ్ని రక్షించారు. తన పేరు గతి భానుడనీ , తాను మరుగుజ్జునైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు. అతడి దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుంధుణ్ని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.

వామనావతారం ఆత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ , విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామనరూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై , విశ్వవ్యాప్తమై , పరమాత్మ తత్వమై భాసిల్లుతుంది. యజ్ఞయాగాదులనేవి పేరుకోసం చేయవద్దనీ , నేను ప్రభువును , నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది. పరుల ధనాన్నీ , భూమిని ఆక్రమించడం , దానం చేయడం , నేను కర్తను , భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతోంది. ఈ నేపథ్యమే బలి పతనానికి దారి తీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశమిస్తుంది.

వామన ద్వాదశి ముందు రోజు ఏకాదశినాడు ఉపవసించి , జాగారం చేసి , వామన విగ్రహాన్ని పూజిస్తారు.

శుక్ర ద్వాదశి , వామన ద్వాదశి , శ్రవణ ద్వాదశి , మహా ద్వాదశి , అనంత ద్వాదశి , కల్కి ద్వాదశి అన్న పేర్లూ ఈ పర్వదినానికున్నాయి.

ఎదుటివారిని అహంకారంతో చులకనగా చూసే దుష్టులకు తగిన గుణపాఠం నేర్పి , వారికి సక్రమ మార్గ నిర్దేశం చేయడమే వామనావతార రహస్యం.

🌹 🌹 🌹 🌹 🌹