Showing posts with label Vasant Panchami. Show all posts
Showing posts with label Vasant Panchami. Show all posts

వ్యాసంత పంచమి శుభాకాంక్షలు; వసంత పంచమి ప్రార్థన Happy Basantha Panchami; Basant Panchami Prayer

 

🌹 సరస్వతీ దేవి ఆశీస్సులతో మీ జీవితంలో జ్ఞానం వెలుగులు ఎల్లప్పుడూ ప్రకాశించాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు అందరికి Happy Basantha Panchami to you and All 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Wishing that the light of knowledge always shines in your life with the blessings of Goddess Saraswati. Happy Basant Panchami to you and all 🌹

Prasad Bharadwaj




🌹 వసంత పంచమి Basant Panchami ప్రార్థన. 🌹
ప్రసాద్ భరద్వాజ

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తదితర దేవతలచే నిత్యం స్తుతింపబడుతూ సకల విద్యలకు దేవతవైన ఓ తల్లీ సరస్వతీ! మాలోని అజ్ఞానాన్ని తొలగించి మమ్మల్ని రక్షించుగాక. సరస్వతీ వందనం అంటే జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతీ దేవిని స్తుతించే ప్రార్థన. అంతేకాకుండా అజ్ఞానాన్ని తొలగించి, విజ్ఞానం, సృజనాత్మకత, స్పష్టమైన ఆలోచనలు ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటూ వసంత పంచమి Basant Panchami రోజు చేసే ప్రార్థన.

🌹 Basant Panchami Prayer 🌹
Prasad Bharadwaj

O Mother Saraswati, who is constantly praised by Brahma, Vishnu, Maheshwara, and other deities, and who is the goddess of all knowledge! May you remove the ignorance within us and protect us. The Saraswati Vandanam is a prayer praising Goddess Saraswati, the goddess of knowledge, music, and arts. It is also a prayer offered on Basant Panchami day, beseeching the Goddess to remove ignorance and bestow knowledge, creativity, and clear thinking.



యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రావ్రుతా

యా వీణా వరదండ మండితకరా.. యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా

సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా


దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా

హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |

భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాసమానా

సామే వాగ్దేవతేయం నివసతువదనే సర్వదా సుప్రసన్నా ||


సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |

విరించి పత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచిమే సదా ||


సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |

ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||


సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |

శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||


నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |

విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||


శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |

శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||


ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |

మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||


మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |

వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ||


వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |

గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||


సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |

సంపన్నాయై కుమార్యైచ సర్వజ్ఞేతే నమో నమః ||


యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |

దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||


అర్ధచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః |

చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమో నమః ||


అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |

అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః ||


జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |

నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||


పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |

పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||


మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |

బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||


కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |

కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ||


సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |

చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ||


ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్ |

సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ||

🌹🌹🌹🌹🌹


"సరసవాణి సరస్వతీ మా అజ్ఞానం తొలగించమ్మా" - వసంత పంచమి Happy Vasantha Panchami


https://youtube.com/shorts/vWq-XfLkNpg


🌹 సరసవాణి సరస్వతీ మా అజ్ఞానం తొలగించమ్మా నిత్యాదాయిని సరస్వతి - వసంత పంచమి

Happy Vasantha Panchami 🌹



ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


వసంత పంచమి శుభాకాంక్షలు - విశిష్టత శుభ శుక్రవారం Happy Vasantha Panchami


https://youtube.com/shorts/cs46-VCykU4

🌹 వసంత పంచమి శుభాకాంక్షలు - విశిష్టత శుభ శుక్రవారం
Happy Vasantha Panchami & Significance 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share


🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ పంచమి శుభాకాంక్షలు - వసంతపంచమి విశిష్టత ( జనవరి 23) / Happy Sri Panchami (Vasant Panchami) - The significance of Vasant Panchami (January 23)


🌹 సకలవిద్యా స్వరూపిణి, పరాశక్తి జ్ఞానప్రదాయిని, శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ వసంత, శ్రీ పంచమి శుభాకాంక్షలు అందరికి 🌹

📚 వసంతపంచమి విశిష్టత ( జనవరి 23) 📚

✍️ ప్రసాద్ భరద్వాజ


🌹 Wishing that the compassionate blessings of Goddess Sri Saraswati Devi, the embodiment of all knowledge and the bestower of wisdom, be upon you all. Happy Vasant Panchami! 🌹

📚 Significance of Vasant Panchami (January 23) 📚

✍️ Prasad Bharadwaj



సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌

కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌

వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌

రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌



యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా

సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా


చదువుకునే పిల్లలకు, నిత్య జ్ఞాన సముపార్జన చేసే వారికి వసంత పంచమి చాలా ప్రత్యేకమైన రోజు. విశేషించి ఈ సారి 20 సంవత్సరాల తరువాత కలిసి వస్తున్న పంచగ్రహ కూటమి, శుక్రవారం మరింత ప్రత్యకతను తీసుకువచ్చాయి. ఆ రోజు చదవుల తల్లి.. సరస్వతి దేవిని పూజించడం వలన విద్యలో విద్యార్థులు, జ్ఞానంలో జ్ఞానాభిలాషులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఙ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా.. నూతన ఆవిష్కరణా ఆలోచనలు రావడం.. పాఠశాలలో... పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

వసంతపంచమి రోజున విద్యార్థులు సరస్వతి దేవిని పూజించాలి. అవకాశం ఉన్నవారు.. ఉండగలిగిన వారు ఉపవాస దీక్షను పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. పూజా మందిరంలో సరస్వతి దేవి విగ్రహాన్ని కాని.. చిత్ర పటాన్ని కాని ఉంచాలి. ఆ తరువాత షోడశోపచారాల పూజలు చేసి.. సరస్వతి అష్టోత్తరం తో అమ్మవారిని పూజించి ధూపం.. దీపం.. దీపం .. నైవేద్యం సమర్పించాలరు. ఇలా చేస్తే పిల్లలకు విద్యా పరంగా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. అలా చేస్తే.. వారి జ్ఞానాభివృద్ధి సులభం అవుతుంది. పాఠశాలల్లో.. కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​ లో మంచి ఫలితాలు పొంది.. జీవితంలో విజయం సాధించడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

సరస్వతి దేవత జ్ఞానం, కళ, సంగీతం, విద్య.. విజ్ఞానానికి అదిష్ఠాన దేవత. ఆమె పుట్టిన రోజున అనగా వసంత పంచమి రోజున ఈ దేవతను ప్రత్యేకతంగా పూజలు చేస్తారు. అలా చేయడం వలన విద్యార్థులకు చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

విద్యార్థులకు మంచిగా చదివేందుకు ప్రేరణ ఇవ్వడానికి సరస్వతి దేవతను పూజించడం ద్వారా వారు నూతన ఆశలు, శక్తిని పొందుతారు.ఈ రోజున సరస్వతి దేవిని పూజించి ...ఉపవాసం ఉండడం వల్ల విద్యార్థుల జీవితాల్లో ఆనందం, విజయం, ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

🌹🌹🌹🌹🌹

వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి శుభాకాంక్షలు అందరికి - Vasant Panchami, Mata Saraswathi Jayanthi Greetings to All


🌹🍀 వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి శుభాకాంక్షలు అందరికి, Vasant Panchami, Mata Saraswathi Jayanthi Greetings to All. 🍀🌹

ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ సరస్వతీ దేవి జయంతి - వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి విశిష్టత 🌻

🌷. సరస్వతి ప్రార్థన :


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః

మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు. జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి.

యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు.

యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.


శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:

మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః ॥


వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీ దేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.

చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం.

పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా గోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.


సరస్వతీ కటాక్షం:

బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.

గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృప వలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహా విద్వాంసుడు అయ్యాడు. వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాస మునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.

🌹🌹🌹🌹🌹


వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం, Sri Panchami, Vasantha Panchami, Republic Day



🍀. వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, Sri Panchami, Vasantha Panchami, Republic Day Good Wishes to All 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹. వసంత పంచమి విశిష్టత 🌹


సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.

మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.

అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.

''చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా'' అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.

ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను, శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితోకూడిన వంటలను నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.

''వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి'' ఇలా అనేక నామాలున్నప్పటికీ ''సామాంపాతు సరస్వతీ.... '' అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.

సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

✍️. డా.యం.ఎన్.చార్య

🌹 🌹 🌹 🌹 🌹

వసంత పంచమి విశిష్టత… ఆరోజున సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే.. (Significance of Vasantha Panchami... Worshiping Goddess Saraswati on this day gives good results ..)


వసంత పంచమి విశిష్టత… ఆరోజున సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే..   (Significance of Vasantha Panchami ...  Worshiping Goddess Saraswati on this day gives good results ..)

మాఘశుద్ధ పంచమినే 'వసంత పంచమి' అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది.

మాఘశుద్ధ పంచమినే ‘వసంత పంచమి’ అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 16న ఈ వసంతి పంచమి వచ్చింది. ఆరోజున సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు.

వసంత పంచమి శుభ సమయం..

పవిత్ర సమయం ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3.36కు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 17న ఉదయం 5.46 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 16న ఉదయం 6.59కి సరస్వతి దేవికి పూజ చేయడం, మధ్యాహ్నం 12.35కి మధ్య శుభ సమయం ఉంటుంది.

సరస్వతి దేవికి పూజా విధానం..

వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి… అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల, మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతి దేవిని పూజిస్తున్నా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

“యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా

యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా

సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..” శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు.

శ్రీ మాత్రే నమః