🌹 25, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 25, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 25, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 375 / Bhagavad-Gita - 375 🌹 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 03 / Chapter 10 - Vibhuti Yoga - 03 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 222 / Agni Maha Purana - 222 🌹 
. సభాగృహ స్థాపనము. - 1 / The building of pavilions in front of the temples (sabhā-sthāpana) - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 087 / DAILY WISDOM - 087 🌹 
🌻 27. మధు విద్య / 27. Madhu Vidya 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 351 🌹
6) 🌹. శివ సూత్రములు - 89 / Siva Sutras - 89 🌹 
🌻 2-05. విద్యాసముత్థానే స్వభావికే ఖేచరీ శివావస్తా - 1 / 2-05. vidyāsamutthāne svābhāvike khecarī śivāvasthā - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 25, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : స్కందషష్టి, Skanda Sashti 🌺*

*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 7 🍀*

*13. శ్రీశైలవనచారీ చ భార్గవస్థానకోవిదః |*
*అహోబలనివాసీ చ స్వామీ పుష్కరణీప్రియః*
*14. కుంభకోణనివాసీ చ కాంచివాసీ రసేశ్వరః |*
*రసానుభోక్తా సిద్ధేశః సిద్ధిమాన్ సిద్ధవత్సలః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సుస్థిరమైన పునాది అవసరం - దివ్యజ్ఞానంచే రూపాంతరం చెందింప బడని ప్రాణకోశ ప్రవృత్తులను సాధకుడు అవశ్యం నిరాకరించి తీరాలి. లేని యెడల, అది అవినీతికి దారి తీయగలదని చైతన్య మతోద్యమాదుల పూర్వానుభవం హెచ్చరిక చేస్తున్నది. అవరకోశముల యందు నుసిరమైన పునాది ఏర్పడితే తప్ప విశ్వప్రేమ రూపమైన విశాల ప్రవృత్తి సాధకుని యందు నిర్దుష్టంగా ప్రకటితం కానేరదు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల షష్టి 29:21:05 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: పుష్యమి 17:54:21
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: వృధ్ధి 18:07:09 వరకు
తదుపరి ధృవ
కరణం: కౌలవ 16:10:23 వరకు
వర్జ్యం: 00:02:40 - 01:49:48
దుర్ముహూర్తం: 10:02:35 - 10:54:46
మరియు 15:15:38 - 16:07:48
రాహు కాలం: 13:50:51 - 15:28:41
గుళిక కాలం: 08:57:23 - 10:35:12
యమ గండం: 05:41:44 - 07:19:33
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 10:45:28 - 12:32:36
సూర్యోదయం: 05:41:44
సూర్యాస్తమయం: 18:44:20
చంద్రోదయం: 10:18:40
చంద్రాస్తమయం: 23:43:00
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: శుభ యోగం - కార్య
జయం 17:54:21 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 375 / Bhagavad-Gita - 375 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 03 🌴*

*03. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |*
*అసమ్మూఢ: స మర్త్యేషు సర్వపాపై: ప్రముచ్యతే ||*

🌷. తాత్పర్యం :
*నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్యప్రభువుగను తెలిసికొనినవాడు మాత్రమే మనుజులందరిలోను భ్రాంతిరహితుడై, సర్వపాపముల నుండి ముక్తుడగును.*

🌷. భాష్యము : 
*“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతిసిద్ధయే” యని సప్తమాధ్యాయమున (7.3) తెలుపబడినట్లు ఆధ్యాత్మికానుభవ స్థాయిని పొందుటకై యత్నించువారు సామాన్యజనులు కానేరరు. ఆధ్యాత్మికానుభవమునకు సంబంధించిన జ్ఞానము ఏ మాత్రములేని కోట్లాది సామాన్యమానవుల కన్నను వారు నిక్కము ఉత్తములు. కాని ఆ విధముగా తమ ఆధ్యాత్మికస్థితిని అవగాహన చేసికొన యత్నించువారిలో శ్రీకృష్ణుడు దేవదేవుడు, సర్వమునకు ప్రభువు, పుట్టుకలేనివాడనెడి అవగాహనకు వచ్చినవాడు ఆత్మానుభవప్రాప్తిలో కృతకృత్యుడైనట్టివాడు. శ్రీకృష్ణుని దివ్యస్థితిని సంపూర్ణముగా నెరుగగలిగిన స్థితి యందే మనుజుడు సర్వవిధములైన పాపఫలముల నుండి ముక్తుడు కాగలడు.*

*ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అజునిగా (పుట్టుకలేనివానిగా) వర్ణింపబడినాడు. ద్వితీయాధ్యాయమున జీవులు సైతము అజులుగా తెలుపబడినను భగవానుడు వారికి భిన్నమైనవాడు. భౌతికబంధకారణముగా జన్మించుచు మరణించు జీవులకు అతడు భిన్నుడు. ఆ బద్ధజీవులు తమ దేహములను మార్చుచుండ, భగవానుని దేహము మార్పురహితమై యున్నది. అతడు భౌతికప్రపంచమునకు అరుదెంచినను అజునిగనే అరుదెంచును. కనుకనే శ్రీకృష్ణభగవానుడు తన అంతరంగశక్తి ద్వారా న్యునమైన భౌతికశక్తికి అధీనుడుగాక సదా దివ్యశక్తియందే స్థితుడై యుండునని చతుర్థాధ్యాయమున తెలుపబడినది.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 375 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 03 🌴*

*03. yo mām ajam anādiṁ ca vetti loka-maheśvaram*
*asammūḍhaḥ sa martyeṣu sarva-pāpaiḥ pramucyate*

🌷 Translation : 
*He who knows Me as the unborn, as the beginningless, as the Supreme Lord of all the worlds – he only, undeluded among men, is freed from all sins.*

🌹 Purport :
*As stated in the Seventh Chapter (7.3), manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye: those who are trying to elevate themselves to the platform of spiritual realization are not ordinary men; they are superior to millions and millions of ordinary men who have no knowledge of spiritual realization. But out of those actually trying to understand their spiritual situation, one who can come to the understanding that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the proprietor of everything, the unborn, is the most successful spiritually realized person. In that stage only, when one has fully understood Kṛṣṇa’s supreme position, can one be free completely from all sinful reactions.*

*Here the Lord is described by the word aja, meaning “unborn,” but He is distinct from the living entities who are described in the Second Chapter as aja. The Lord is different from the living entities who are taking birth and dying due to material attachment. The conditioned souls are changing their bodies, but His body is not changeable. Even when He comes to this material world, He comes as the same unborn; therefore in the Fourth Chapter it is said that the Lord, by His internal potency, is not under the inferior, material energy, but is always in the superior energy.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 222 / Agni Maha Purana - 222 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 65*

*🌻. సభాగృహ స్థాపనము. - 1 🌻*

*హయగ్రీవుడు చెప్పెను; ఇపుడు సభాదులను స్థాపించు విధానము చెప్పెదను. భూమి పరీక్ష చేసి అచట వాస్తుపరీక్ష చేయవలెను. ఇచ్ఛానుసారముగ దేవసభా నిర్మాణము చేసి, ఇచ్ఛానుసారముగ దేవతా స్థాపన చేయవలెను. సభా నిర్మాణము నగర చతుష్పథమునందు గాని, గ్రామాదులలో గాని చేయవలెను. జనశూన్యప్రదేశములందు చేయరాదు. దేవసభా నిర్మాణము చేసినవాడు పాపరహితుడై తన వంశము నంతను ఉద్ధరించు స్వర్గమునందు ఆనందమనుభవించును. రాజసౌధము నిర్మించిన విధముగ శ్రీహరికి ఏడు అంతస్తుల దేవాలయమును నిర్మింపవలెను. ఇతర దేవతలకు కూడ అట్లే పూర్వాది దిక్కులందు ఏర్పడు ధ్వజాధ్యాయములలో వాటిలో విదిక్కుల ఆయమును విడువలెను. నాలుగు, మూడు, రెండు లేదా ఒకటి శాల లుండు గృహము నిర్మింపవలెను. వ్యయము అధికముగ నుండు పదముపై గృహము నిర్మింపరాదు. అచట నిర్మించిన గృహమునందు వ్యయ మధికముగ నుండును. ఆయ మధికముగ నున్న పీడ కలుగదు.*

*అందుచే ఆయవ్యయములు సమభావములో నుండు నట్లు చూచు కొనవలెను. ఇంటి పొడవు వెడల్పులు ఎన్ని హస్తములుండునో వాటిని ఒకదానితో ఒకటి గుణింపగా వచ్చిన సంఖ్యకు 'కరరాశి' అని పేరు. గర్గాచార్యుని జ్యోతిశ్శాస్త్రము నందు నిపుణు డగు ఆచార్యుడు దానిని ఎనిమిది రెట్లు చేయవలెను. దానిని ఏడు చేతభాగించగా వచ్చిన శేషము 'వ్యయము' లేదా కరరాశిని ఏడుచేత గుణించి దానిని మరల ఎనిమిదిచేత భాగించగా వచ్చిన శేషమను బట్టి ధ్వజాద్యాయములను కల్పించవలెను. ధ్వజము, ధూమ్రము, సింహము, శ్వానము, వృషభము, ఖరము, గజము, ధ్వాంక్షము అను ఎనిమిది ఆయములు పూర్వాది దిక్కలందు ఏర్పుడును.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 222 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 65*
*🌻The building of pavilions in front of the temples (sabhā-sthāpana) - 1 🌻*

The Lord said:
1. I shall describe the mode of building pavilions (in front of temples) [i.e., sabhā] and their maintenance. The vāstuyāga (rite performed to please the spirits dwelling in a site) should be performed after having tested the ground (intended for building pavilion).

2. Having constructed pavilion [i.e., sabhā] as per one’s liking, one should install (the images of) gods according to his wish. (Such buildings) should not be constructed at the junction of four roads or at a deserted place in the village.

3. Such a builder being free from sins and raising his ancestors (to heaven), enjoys in heaven. One should build a sevenstoreyed building for Lord Hari (Viṣṇu) in the following way.

4. The same rule holds good in the building of other (temples of gods), as in the case of erecting the mansions of kings. The banner should be placed in the east. The edifice should be built as a quadrilateral without (having any walls on) the diagonal lines.

5-7. The building should have three or two chambers or one chamber. The vyaya[1] should not be much. Excessive vyaya is deemed to be harmful. Excessive āya[1] is also harmful. Hence the two should be made equal. (The priest) well-versed in the science of Garga (vāstuśāstra), should sum up the hand measures of building and multiply it by eight. It should be multiplied by three and the resultant product should be divided by eight and the remainder is known as vyaya.

8. Alternatively, having divided the sum of the hand measures of the building by three and multiplying it by eight the resultant is known as the dhvaja (banner) etc.

9. Banner, camel, lion, dog, bull, donkey, elephant and crow are said to be eight āyas.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 87 / DAILY WISDOM - 87 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 27. మధు విద్య 🌻*

*భూమి అందరికీ ప్రియమైనది. ప్రతి ఒక్కరికీ భూమి ప్రియమైనది. భూమి ప్రతి జీవి యొక్క ఉనికిలో భాగం. అలాగే ప్రతి జీవి భూమి యొక్క ఉనికిలో భాగం. భూమి మరియు జీవులలో ఉన్న ఈ పరస్పర సంబంధమే కాకుండా, భూమిలో మరియు అన్ని జీవులలో మరొక ఉన్నతమైన సూత్రం ఉంది. ఆ ఉన్నతమైన సూత్రమే ప్రకాశవంతమైన చైతన్యం.*

*మీరు భూమి అని పిలిచే ఈ భౌతిక అస్తిత్వానికి జీవం పోసే ఒక చైతన్యం ఉంది. అలాగే భూమిపై ఉన్న సమస్త జీవజాతికి జీవం పోసే చైతన్యం ఉంది. విశ్వాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవడం కోసం భూమి మరియు దానిపై ఉండే జీవజాలానికి మధ్య ఉన్న సంబంధం చూసినపుడు ఈ సమస్త భూమిని మరియు జీవజాతికి జీవం పోసే ఈ చైతన్యాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 87 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 27. Madhu Vidya 🌻*

*The Earth is the honey of all, and everyone is the honey of the Earth. The Earth is absorbed into the ‘being’ of everything, and everything is absorbed into the ‘being’ of the Earth. Apart from the Earth and the beings who are correlated in this manner, there is another superior principle present in the Earth and in all beings. That superior principle is the luminous consciousness.*

*There is an animating being behind this physical entity that you call the Earth, and an animating principle behind what you call all the beings, creatures, individuals, in the world. That which is cosmically animating all creation and that which is individually animating every little creature, that also has to be taken into consideration in the correlationship of the objective and the subjective aspect of creation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 352 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఎవరు సృజనాత్మకంగా వుంటారో, ఎవరు నిరంతరం అన్వేషణలో వుంటారో వాళ్ళే మానవులు. సహజాతం నుంచి నంతృప్తి పడని వాళ్ళు వాళ్ళు. జీవన విధానాన్ని మెలకువతో మార్చుకోవాలనుకునే వాళ్ళు. వాళ్ళే మనుషులు. 🍀*

*మనిషి మూడు రకాలుగా వునికి నిలుపుకుంటాడు. జంతువులా, లేదా మానవుడిగా లేదా దేవుడిగా. సాధారణ జనం జంతువుల్లా జీవిస్తారు. అక్కడ పెద్దగా తేడా వుండదు. ఒకటే తేడా. సాధారణ జనం జంతువుల కన్నా దారుణంగా వుంటారు. సాధారణ వ్యక్తి ఏ జంతువు కన్నా హీన స్థాయికి దిగజారుతాడు. అతను మరీ మోసకాడు వంచన చేస్తాడు. అతని శక్తియుక్తుల్ని దుర్వినియోగం చేస్తాడు. సృజనాత్మకంగా కన్నా విధ్వంసనాత్మకంగా వుంటాడు. వ్యక్తి జంతువుగా పుట్టాడు. కొంత మంది మాత్రమే నిజమైన మనుషులు.*

*మానవత్వమన్నది పేరుకు మాత్రమే. అది యింకా రాలేదు. అది కొంతమందికే వర్తిస్తుంది. ఎవరికి దృష్టికోణముంటుంది, ఎవరు సృజనాత్మకంగా వుంటారో, ఎవరు నిరంతరం అన్వేషణలో వుంటారో వాళ్ళే మానవులు. సహజాతం నుంచి నంతృప్తి పడని వాళ్ళు, జీవన విధానాన్ని మెలకువతో మార్చుకోవాలనుకునే వాళ్ళు. వాళ్ళే మనుషులు. మరీ కొంతమంది మాత్రమే అంతిమమైన అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. దైవత్వాన్ని అందుకుంటారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 089 / Siva Sutras - 089 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-05. విద్యాసముత్థానే స్వభావికే ఖేచరీ శివావస్తా - 1 🌻*
*🌴. భగవంతుని చైతన్యం యొక్క స్వచ్ఛమైన జ్ఞానం అప్రయత్నంగా పెరుగుతుంది. ఈ శివ స్థితి ఖేచరీ స్థితితో ఒకటిగా గ్రహించ బడుతుంది. 🌴*

*విద్యా – జ్ఞానం; సముత్థాన – ఆవిర్భావం; స్వాభావిక - సహజము; ఖేచరి – అనుభావిక స్వయంతో సమలేఖనం చేయబడిన చైతన్యం; శివ – శివ; అవస్థ – ఒక స్థితిలో ఉండుట.*

*ఎప్పుడూ శివుని గురించే ఆలోచిస్తున్నప్పుడు, తనపైన శ్రద్ధ కోల్పోవడం సహజం. ఇంద్రియ ప్రభావాలను పక్కనబెట్టి అతని చైతన్యం విశ్వ చైతన్యంతో సమలేఖనం చేయబడినప్పుడు, అతనిలో అప్పటికే ఉన్న అత్యున్నత జ్ఞానం అకస్మాత్తుగా మేల్కొంటుంది. ఆ స్థితిలో, అతను శివుడిని గ్రహిస్తాడు. శివ సాక్షాత్కారానికి ముందు జ్ఞాన సముపార్జన అవసరము.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 089 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-05. vidyāsamutthāne svābhāvike khecarī śivāvasthā - 1 🌻*
*🌴. The pure knowledge of God consciousness effortlessly rises and this state of Śiva is realized as one with the state of khecarī. 🌴*

*Vidyā – knowledge; samutthāna – emergence; svābhāvika – natural or inherent; khecarī – consciousness aligned with empirical Self; śiva – Śiva; avasthā – to abide in a condition.*

*When one thinks always about Śiva, it is natural that he loses his attention on his own self. When his consciousness is aligned with universal consciousness, leaving aside sensory influences, there emerges sudden spurt of his inherent supreme knowledge and in that condition, he realizes Śiva. The acquisition of knowledge becomes a precondition for realizing Śiva.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama