27-AUGUST-2021 MESSAGES

1) నిత్య పంచాంగము / Daily Panchangam 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 246 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 445🌹 
4) 🌹 వివేక చూడామణి - 122 / Viveka Chudamani - 122🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -74🌹  
6) 🌹 Osho Daily Meditations - 64🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 122🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆదిలక్ష్మీ స్తోత్రం 🍀*

సుమనసవందిత సుందరి మాధవి 
చంద్రసహోదరి హేమమయే
మునిగణవందిత మోక్షప్రదాయిని 
మంజులభాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవసుపూజిత 
సద్గుణవర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదనకామిని 
ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 

27, శుక్రవారం, ఆగస్టు, 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: దక్షిణాయణ, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
 తిథి : కృష్ణ పంచమి 18:50:52 వరకు తదుపరి కృష్ణ షష్టి
 భాద్రపద - పౌర్ణమాంతం
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: అశ్విని 24:49:28 వరకు తదుపరి భరణి ?
యోగం: వృధ్ధి 29:54:21 వరకు తదుపరి ధృవ ?
కరణం: తైతిల 18:52:53 వరకు
వర్జ్యం: 20:24:50 - 22:10:06
దుర్ముహూర్తం: 08:31:46 - 09:21:55 
మరియు 12:42:30 - 13:32:39
రాహు కాలం: 10:43:24 - 12:17:26
గుళిక కాలం: 07:35:21 - 09:09:23
యమ గండం: 15:25:29 - 16:59:30
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
అమృత కాలం: 16:54:18 - 18:39:34
సూర్యోదయం: 06:01:19
సూర్యాస్తమయం: 18:33:32
వైదిక సూర్యోదయం : 06:04:54
వైదిక సూర్యాస్తమయం: 18:29:58
చంద్రోదయం: 21:56:09
చంద్రాస్తమయం: 10:00:06
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
ఆనందాదియోగం: వజ్ర యోగం - ఫల ప్రాప్తి 24:49:28 
వరకు తదుపరి ముద్గర యోగం - కలహం 
పండుగలు : నాగ పంచమి (గుజరాత్‌)

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -246 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 24-2
 
*🍀 23-2. అపునరావృత్తి మార్గము - బ్రహ్మవేత్త లనగ బ్రహ్మము నెరిగినవారు. వారు బ్రహ్మమే అయి యున్నవారు. వారు నిత్యము బ్రహ్మజ్ఞానమునందు ఉండుటచే బ్రహ్మపదముననే యున్నారు. అట్టివారు భగవత్ సంకల్పము నెరిగి జీవింతురు. వారి మరణము కూడ స్వచ్ఛందమే. వారు తిరిగి దేహములోనికి వచ్చుట జనకళ్యాణము కొరకే. తిరిగి వచ్చుటయా, రాకుండుటయా అనునది దైవేచ్ఛగ నెరిగి, తదను గుణముగ దేహత్యాగ కార్యక్రమమును నిర్వర్తింతురు. ఎంతటి బ్రహ్మవేత్తయైనను, బ్రహ్మ సంకల్పమున మరల జన్మింప వచ్చును. 🍀*

24. అగ్ని ర్ణ్యోతి రహ శుక్ల షణ్మాపా ఉత్తరాయణమ్ |
తత్రప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || 24

తాత్పర్యము : అగ్ని, జ్యోతి, పగలు, శుక్ల పక్షము, ఉత్తరాయణ పుణ్య కాలమునకు ఆరు నెలలు- ఈ కాలములందు దేహము త్యజించు బ్రహ్మవేత్తలు బ్రహ్మమును పొందుచున్నారు.

వివరణము : మకర సంక్రమణము ( డిసెంబరు 22) నుండి కర్కాటక సంక్రమణము వరకు గల ఆరు మాసములు సూర్యుని ఉత్తర ముఖ ప్రయాణముగ తెలియనగును. మకరరేఖ నుండి భూమధ్య రేఖ మీదుగ కర్కాటకరేఖ వరకు ఉత్తరగతిని అనుసరించుచు సూర్యోదయము గోచరించును. ఈ ఆరు మాసములు ఉత్తరాయణ పుణ్యకాలముగ, ప్రకు వికాసము కలిగించు కాలముగ తెలియబడును. తిరిగి రాకుండు మార్గమున చనుటకై సంకల్పించు బ్రహ్మవేత్తలు ఈ కాలమున దేహము విడుతురని ప్రతీతి. 

బ్రహ్మవేత్త లనగ బ్రహ్మము నెరిగినవారు. వారు బ్రహ్మమే అయి యున్నవారు. వారు నిత్యము బ్రహ్మజ్ఞానమునందు ఉండుటచే బ్రహ్మపదముననే యున్నారు. అట్టివారు భగవత్ సంకల్పము నెరిగి జీవింతురు. వారి మరణము కూడ స్వచ్ఛందమే. వారు తిరిగి దేహములోనికి వచ్చుట జనకళ్యాణము కొరకే. తిరిగి వచ్చుటయా, రాకుండుటయా అనునది దైవేచ్ఛగ నెరిగి, తదను గుణముగ దేహత్యాగ కార్యక్రమమును నిర్వర్తింతురు. ఎంతటి బ్రహ్మవేత్తయైనను, బ్రహ్మ సంకల్పమున మరల జన్మింప వచ్చును.

జన్మింపకుండుట కూడ యుండును. ఉదాహరణకు కర్దమ ప్రజాపతి పూర్వకల్పముననే అపునరావృత్తి మార్గమున బ్రహ్మమును చేరినను, ప్రస్తుత కల్పమున నారాయణ సంకల్పముగ ప్రజాపతిస్థానము నలంకరించి దివ్యపురుషులు దిగి వచ్చుటకై సహకరింతురు. బ్రహ్మమునందు తమ ప్రజ్ఞను స్థిరముగ నెలకొల్పుకొన్న బ్రహ్మవేత్తలు దేహము నందున్నను, లేకున్నను కూడ బ్రహ్మమునందే వసించి యుందురు. 

అట్టి వారికి ఈ శ్లోకమున తెలిపిన సమయములు అనుకూల్యమునకే అని తెలియ వలెను. ఇతర జీవులకీ సమయములు ఉత్తర కాలమందు ఉత్తమ జన్మము నీయగలవు. అనగా జరిగిన జన్మకన్న కొంత మెరుగైన జన్మయని అర్ధము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 445🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 29

*🌻. శివపార్వతుల సంవాదము - 3 🌻*

గ్రహములనగా నేమి? ఋతుసమూహములు ఏవి? నీ కంటె భిన్నముగా ఉపగ్రహములు గలవా? ఓ బ్రహ్మచారిణీ! నీవు శివుని కొరకు ఇప్పుడు తపస్సు చేయుచున్నావను మాట ఎట్టిది? (22) మనమిద్దరము భక్తుల యందలి ప్రేమతో నిండిన హృదయము గలవారమై ఈ జగత్తులో గుణభేధమును బట్టి విభిన్న కార్యరూపముగా సృష్ఠించి యున్నాము (23).

సూక్ష్మము, రజస్సత్త్వ తమో గుణాత్మకము, జగద్వ్యాపారమునందు సమర్థమైనది, నిర్గుణమైనదే అయిననూ నిత్యము, సగుణ రూపములో నుండునది అగు ప్రకృతి నీవే (24). ఓ సన్నని నడుము గల దానా! ఈ జగత్తులోని సర్వప్రాణులకు ఆత్మనేనే. వికారములు, కామనలు లేని నేను భక్తుల కోరిక మేరకు దేహమును స్వీకరించినాను (25). 

ఓ పార్వతీ! నేను నీ తండ్రియగు హిమవంతుని వద్దకు వెళ్లను. మరియు నేను భిక్షుకుడనై నిన్ను ఇమ్మని ఎన్నటికీ యాచించను (26). ఓ పార్వతరాజ పుత్రీ ! మహాగుణశాలి, మహాత్ముడు, మమహాపురుషుడు అగు వ్యక్తి కూడా 'ఇమ్ము' అను మాటను పలికిన మరుక్షణములో తేలికయై పోవును (27).

ఓ కల్యాణీ! మంగళస్వరూపురాలా! ఈ విషయమును నీవెరుంగుదువు. ఇపుడు నీవు మాకు ఏమని చెప్పెదవు? నీ ఆజ్ఞ తప్పక అనుసరించ దగినదియే. కావున, నీకు ఎట్లు నచ్చినచో, అట్లు చేయుము (28).

బ్రహ్మ ఇట్లు పలికెను-

సాధ్వి, మహాదేవి, పద్మములు వంటి కన్నులు గలది అగు ఆమె ఈశ్వరుడు ఇట్లు చెప్పిననూ, భక్తితో అనేక పర్యాయములు సాష్టాంగపడి శంకరునితో నిట్లు పలికెను (29).

పార్వతి ఇట్లు పలికెను-

నీవు ఆత్మ, నేను ప్రకృతి అను విషయములో చర్చ లేదు. మనము స్వతంత్రులము; కాని భక్తుల అధీనములో నుండెదము నిర్గుణులము, సగుణులము కూడా (30). ఓ శంభో! ప్రభో! నేను చెప్పిన తీరున నీవీ పనిని ప్రయత్నపూర్వకముగా చేయవలసియున్నది. హే శంకరా! హిమవంతునికి ఈ భాగ్యమును కలిగించుము. నన్ను ఇమ్మని ఆయనను కోరుము (31). మహేశ్వరా! నాపై దయ చూపుము. నేను నీకు నిత్యభక్తురాలను. నాథా! నేను జన్మజన్మలయందు సర్వదా నీకు భార్యను (32).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 122 / Viveka Chudamani - 122🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 9 🍀*

404. ఉన్నతమైన సత్యాన్ని గుర్తించిన తరువాత ఈ విశ్వము శాశ్వతమైన ఆత్మలో ఎలా ఉండగలదు! మూడు స్థితులైన గతము, వర్తమానము, భవిష్యత్తులో కూడా; పాము త్రాడు వలె ఎలా కనబడుతుంది. అలానే ఎండమావులలో నీరు ఎలా ఉంటుంది. 

405. సృతులలో చెప్పబడినట్లు, ద్వంద్వములతో కూడిన ఈ జగత్తు కేవలము మాయ మాత్రమేనని సత్యాన్ని అవగతము చేసుకొన్నచో అర్థమవుతుంది. ఈ స్థితి కలలులేని నిద్ర స్థితిలో కూడా అనుభవమవుతుంది. 

406. ఎఱుక స్థితిలో ఉన్న జ్ఞాని, తాను వేరై ఇంకొక దానిపై ఆవరించి ఉన్నప్పుడు అసలు సత్యాన్ని ఎలా గ్రహిస్తాడో, అలానే అదంతా బ్రహ్మమని గ్రహించగలడు. తాడు పాము వలె కనిపించినట్లు. ఏదైన తేడా కనిపించిన అది కేవలము పొరపాటే అవుతుంది. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 122 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 9 🌻*

404. Even before the realisation of the highest Truth, the universe does not exist in the Absolute Brahman, the Essence of Existence. In none of the three states of time is the snake ever observed in the rope, nor a drop of water in the mirage.

405. The Shrutis themselves declare that this dualistic universe is but a delusion from the standpoint of Absolute Truth. This is also experienced in the state of dreamless sleep.

406. That which is superimposed upon something else is observed by the wise to be identical with the substratum, as in the case of the rope appearing as the snake. The apparent difference depends solely on error.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 74 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. అవకూడని పనులను తలపెట్టడం అవివేకం. 🌻*

1. కోరికలు తీరుట అనగా అవి లేకుండా పోవడమే! కోరిక కన్నా పైన ఉండాలి. వాటిని కోసివేయుట కాదు. కోరని వానికి అన్ని కోరికలు తీరును. కోరే స్వభావం పోవాలి.   

2. కుటుంబ పరమైన బాధ్యతలను, విధులను మాత్రమే నిర్వర్తించవలెను. సంతతి విషయంలో మేడలు కట్టరాదు. 

3. యోగాభ్యాసం మొట్ట మొదటి నుండియూ మధురంగానే ఉంటుంది. కొన్ని మెట్లు క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తాయి. కాని అభ్యాసపాటవం చేత సులభమవుతుంది. ఎంతటి పాపాత్ముడైనా యోగాభ్యాసాన్ని ఆచరిస్తే తరించగలడు. 

4. నీ చుట్టు ప్రక్కల వారి యందు ఎన్నడూ హద్దులు మీరకుండా యుండవలెను. 

5. వైకుంఠమంటే ఒక స్థితియే గాని, అది‌ ఒక చోటు కాదు. దానిని ఎక్కడ కల్పించుకుంటే అక్కడే ఉంటుంది. ఇంకొక వాని కొరకు జీవించుట వైకుంఠము.

...✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 63 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 63. BALANCE 🍀*

*🕉 When feeling and reason are balanced, one is free. In that very balance is freedom, in that very balance is
equilibrium, tranquility, silence. 🕉*

When the head is too much-and it is too much, it is very murderous-it does not allow anything that is not profitable to exist. And all joy is profitless, all joy is just playfulness; it has no purpose. Love is play, it has no purpose; so is dance, so is beauty. All that is significant to the heart is meaningless to reason.

So in the beginning one has to put much investment into the: heart so the balance is achieved. One has almost to lean too mud toward the heart. One has to go to the other extreme to create: the balance. By and by one comes into the middle, but first one has to go to the other extreme, because reason has dominated toe much.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 122 / Sri Lalita Sahasranamavali - Meaning - 122 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 122. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |*
*ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ‖ 122 ‖ 🍀*

🍀 607. దేవేశీ - 
దేవతలకు పాలకురాలు.

🍀 608. దండనీతిస్థా - 
దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.

🍀 609. దహరాకాశరూపిణి -
 హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.

🍀 610. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితా - 
పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 122 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 122. deveśī daṇḍanītisthā daharākāśa-rūpiṇī |*
*pratipanmukhya-rākānta-tithi-maṇḍala-pūjitā || 122 || 🌻*

🌻 607 ) Deveshi -   
She who is the goddess of Gods

🌻 608 ) Dhanda neethistha -   
She who judges and punishes

🌻 609 ) Dhaharakasa roopini -   
She who is of the form of wide sky

🌻 610 ) Prathi panmukhya rakantha thidhi mandala poojitha -   
She who is being worshipped on all the fifteen days from full moon to new moon

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా సహస్ర నామములు - 122 / Sri Lalita Sahasranamavali - Meaning - 122

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 122 / Sri Lalita Sahasranamavali - Meaning - 122 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🍀 122. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ‖ 122 ‖ 🍀

🍀 607. దేవేశీ -
దేవతలకు పాలకురాలు.

🍀 608. దండనీతిస్థా -
దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.

🍀 609. దహరాకాశరూపిణి -
హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.

🍀 610. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితా -
పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 122 🌹

📚. Prasad Bharadwaj

🌻 122. deveśī daṇḍanītisthā daharākāśa-rūpiṇī |
pratipanmukhya-rākānta-tithi-maṇḍala-pūjitā || 122 || 🌻

🌻 607 ) Deveshi -
She who is the goddess of Gods

🌻 608 ) Dhanda neethistha -
She who judges and punishes

🌻 609 ) Dhaharakasa roopini -
She who is of the form of wide sky

🌻 610 ) Prathi panmukhya rakantha thidhi mandala poojitha -
She who is being worshipped on all the fifteen days from full moon to new moon

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

27 Aug 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 74

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 74 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అవకూడని పనులను తలపెట్టడం అవివేకం. 🌻

1. కోరికలు తీరుట అనగా అవి లేకుండా పోవడమే! కోరిక కన్నా పైన ఉండాలి. వాటిని కోసివేయుట కాదు. కోరని వానికి అన్ని కోరికలు తీరును. కోరే స్వభావం పోవాలి.

2. కుటుంబ పరమైన బాధ్యతలను, విధులను మాత్రమే నిర్వర్తించవలెను. సంతతి విషయంలో మేడలు కట్టరాదు.

3. యోగాభ్యాసం మొట్ట మొదటి నుండియూ మధురంగానే ఉంటుంది. కొన్ని మెట్లు క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తాయి. కాని అభ్యాసపాటవం చేత సులభమవుతుంది. ఎంతటి పాపాత్ముడైనా యోగాభ్యాసాన్ని ఆచరిస్తే తరించగలడు.

4. నీ చుట్టు ప్రక్కల వారి యందు ఎన్నడూ హద్దులు మీరకుండా యుండవలెను.

5. వైకుంఠమంటే ఒక స్థితియే గాని, అది‌ ఒక చోటు కాదు. దానిని ఎక్కడ కల్పించుకుంటే అక్కడే ఉంటుంది. ఇంకొక వాని కొరకు జీవించుట వైకుంఠము.

...✍️ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹

27 Aug 2021

వివేక చూడామణి - 122 / Viveka Chudamani - 122

🌹. వివేక చూడామణి - 122 / Viveka Chudamani - 122🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 26. ఆత్మ మార్పులేనిది - 9 🍀

404. ఉన్నతమైన సత్యాన్ని గుర్తించిన తరువాత ఈ విశ్వము శాశ్వతమైన ఆత్మలో ఎలా ఉండగలదు! మూడు స్థితులైన గతము, వర్తమానము, భవిష్యత్తులో కూడా; పాము త్రాడు వలె ఎలా కనబడుతుంది. అలానే ఎండమావులలో నీరు ఎలా ఉంటుంది.

405. సృతులలో చెప్పబడినట్లు, ద్వంద్వములతో కూడిన ఈ జగత్తు కేవలము మాయ మాత్రమేనని సత్యాన్ని అవగతము చేసుకొన్నచో అర్థమవుతుంది. ఈ స్థితి కలలులేని నిద్ర స్థితిలో కూడా అనుభవమవుతుంది.

406. ఎఱుక స్థితిలో ఉన్న జ్ఞాని, తాను వేరై ఇంకొక దానిపై ఆవరించి ఉన్నప్పుడు అసలు సత్యాన్ని ఎలా గ్రహిస్తాడో, అలానే అదంతా బ్రహ్మమని గ్రహించగలడు. తాడు పాము వలె కనిపించినట్లు. ఏదైన తేడా కనిపించిన అది కేవలము పొరపాటే అవుతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 122 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 26. Self is Unchangeable - 9 🌻

404. Even before the realisation of the highest Truth, the universe does not exist in the Absolute Brahman, the Essence of Existence. In none of the three states of time is the snake ever observed in the rope, nor a drop of water in the mirage.

405. The Shrutis themselves declare that this dualistic universe is but a delusion from the standpoint of Absolute Truth. This is also experienced in the state of dreamless sleep.

406. That which is superimposed upon something else is observed by the wise to be identical with the substratum, as in the case of the rope appearing as the snake. The apparent difference depends solely on error.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

27 Aug 2021

శ్రీ శివ మహా పురాణము - 445

🌹 . శ్రీ శివ మహా పురాణము - 445🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 29

🌻. శివపార్వతుల సంవాదము - 3 🌻

గ్రహములనగా నేమి? ఋతుసమూహములు ఏవి? నీ కంటె భిన్నముగా ఉపగ్రహములు గలవా? ఓ బ్రహ్మచారిణీ! నీవు శివుని కొరకు ఇప్పుడు తపస్సు చేయుచున్నావను మాట ఎట్టిది? (22) మనమిద్దరము భక్తుల యందలి ప్రేమతో నిండిన హృదయము గలవారమై ఈ జగత్తులో గుణభేధమును బట్టి విభిన్న కార్యరూపముగా సృష్ఠించి యున్నాము (23).

సూక్ష్మము, రజస్సత్త్వ తమో గుణాత్మకము, జగద్వ్యాపారమునందు సమర్థమైనది, నిర్గుణమైనదే అయిననూ నిత్యము, సగుణ రూపములో నుండునది అగు ప్రకృతి నీవే (24). ఓ సన్నని నడుము గల దానా! ఈ జగత్తులోని సర్వప్రాణులకు ఆత్మనేనే. వికారములు, కామనలు లేని నేను భక్తుల కోరిక మేరకు దేహమును స్వీకరించినాను (25).

ఓ పార్వతీ! నేను నీ తండ్రియగు హిమవంతుని వద్దకు వెళ్లను. మరియు నేను భిక్షుకుడనై నిన్ను ఇమ్మని ఎన్నటికీ యాచించను (26). ఓ పార్వతరాజ పుత్రీ ! మహాగుణశాలి, మహాత్ముడు, మమహాపురుషుడు అగు వ్యక్తి కూడా 'ఇమ్ము' అను మాటను పలికిన మరుక్షణములో తేలికయై పోవును (27).

ఓ కల్యాణీ! మంగళస్వరూపురాలా! ఈ విషయమును నీవెరుంగుదువు. ఇపుడు నీవు మాకు ఏమని చెప్పెదవు? నీ ఆజ్ఞ తప్పక అనుసరించ దగినదియే. కావున, నీకు ఎట్లు నచ్చినచో, అట్లు చేయుము (28).

బ్రహ్మ ఇట్లు పలికెను-

సాధ్వి, మహాదేవి, పద్మములు వంటి కన్నులు గలది అగు ఆమె ఈశ్వరుడు ఇట్లు చెప్పిననూ, భక్తితో అనేక పర్యాయములు సాష్టాంగపడి శంకరునితో నిట్లు పలికెను (29).

పార్వతి ఇట్లు పలికెను-

నీవు ఆత్మ, నేను ప్రకృతి అను విషయములో చర్చ లేదు. మనము స్వతంత్రులము; కాని భక్తుల అధీనములో నుండెదము నిర్గుణులము, సగుణులము కూడా (30). ఓ శంభో! ప్రభో! నేను చెప్పిన తీరున నీవీ పనిని ప్రయత్నపూర్వకముగా చేయవలసియున్నది. హే శంకరా! హిమవంతునికి ఈ భాగ్యమును కలిగించుము. నన్ను ఇమ్మని ఆయనను కోరుము (31). మహేశ్వరా! నాపై దయ చూపుము. నేను నీకు నిత్యభక్తురాలను. నాథా! నేను జన్మజన్మలయందు సర్వదా నీకు భార్యను (32).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

27 Aug 2021

గీతోపనిషత్తు -246

🌹. గీతోపనిషత్తు -246 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 24-2

🍀 23-2. అపునరావృత్తి మార్గము - బ్రహ్మవేత్త లనగ బ్రహ్మము నెరిగినవారు. వారు బ్రహ్మమే అయి యున్నవారు. వారు నిత్యము బ్రహ్మజ్ఞానమునందు ఉండుటచే బ్రహ్మపదముననే యున్నారు. అట్టివారు భగవత్ సంకల్పము నెరిగి జీవింతురు. వారి మరణము కూడ స్వచ్ఛందమే. వారు తిరిగి దేహములోనికి వచ్చుట జనకళ్యాణము కొరకే. తిరిగి వచ్చుటయా, రాకుండుటయా అనునది దైవేచ్ఛగ నెరిగి, తదను గుణముగ దేహత్యాగ కార్యక్రమమును నిర్వర్తింతురు. ఎంతటి బ్రహ్మవేత్తయైనను, బ్రహ్మ సంకల్పమున మరల జన్మింప వచ్చును. 🍀