25-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం  25-సెప్టెంబర్-2021, శుభ శనివారం 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 258  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 457🌹 
4) 🌹 వివేక చూడామణి - 134 / Viveka Chudamani - 134 🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -86🌹  
6) 🌹 Osho Daily Meditations - 76🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 134🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*25 శనివారం, సెప్టెంబర్‌ 2021*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వేంకటేశ అష్టకం -1 🍀*

వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః |
సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ || 1 ||

జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసినః |
సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః || 2 ||
🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాధ్రపద మాసం
 తిథి: కృష్ణ చవితి 10:37:51 వరకు తదుపరి కృష్ణ పంచమి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: భరణి 11:34:20 వరకు తదుపరి కృత్తిక
యోగం: హర్షణ 14:50:31 వరకు తదుపరి వజ్ర
 కరణం: బాలవ 10:37:51 వరకు
వర్జ్యం: 25:03:30 - 26:51:26
దుర్ముహూర్తం: 07:41:56 - 08:30:14
రాహు కాలం: 09:06:27 - 10:37:01
గుళిక కాలం: 06:05:20 - 07:35:54
యమ గండం: 13:38:07 - 15:08:41
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:31
అమృత కాలం: 06:14:00 - 08:00:40
సూర్యోదయం: 06:05:20, సూర్యాస్తమయం: 18:09:47
వైదిక సూర్యోదయం: 06:08:53, సూర్యాస్తమయం: 18:06:17
చంద్రోదయం: 21:07:19, చంద్రాస్తమయం: 09:31:02
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: మేషం
ఆనందాదియోగం: ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని 11:34:20 వరకు తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
పండుగలు : పంచమ మహాలయ శ్రాధ్ధకర్మ
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -258 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 3-2
 
*🍀 3-2. చక్రవ్యూహము - ధర్మము తెలియుటకు ప్రధానముగ శ్రద్ధ అవసరము. శ్రద్ధలేని వానికి కనీసమగు వివేకము కూడ యుండదు. శ్రద్ధ కలుగుటకు కర్తవ్యము ప్రధానమగు సాధనము. తానిపుడు ఏమి చేయవలెను? అను ప్రశ్న మనసున ఎపుడును ధరించి యుండవలెను. అట్లు కాక తనకేమి కావలయును అని మనసున ప్రధానముగ ధరించి నచో కాముకుడగును. తనకేమి కావలయును అనునది పతనము నకు దారి. తానేమి చేయవలెను అనునది పురోగమనమునకు దారి. కర్తవ్య మున్నచోట శ్రద్ధ యుండును. శ్రద్ధ యున్నచోట ధర్మము స్ఫురించును. 🍀*

అశ్రద్ధధానా: పురుషా ధర్మ ప్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్మని || 3

తాత్పర్యము : ధర్మమునందు శ్రద్ధలేని పురుషులు నన్ను పొందలేరు. అట్టివారు మృత్యువే పర్యవసానమగు సంసారము నందు వర్తించుచు నుందురు.

వివరణము : తన ధర్మము తనకు తెలియనివారే మనుజుల యందు మెండు. ధర్మము తెలియుటకు ప్రధానముగ శ్రద్ధ అవసరము. శ్రద్ధలేని వానికి కనీసమగు వివేకము కూడ యుండదు. శ్రద్ధ కలుగుటకు కర్తవ్యము ప్రధానమగు సాధనము. తానిపుడు ఏమి చేయవలెను? అను ప్రశ్న మనసున ఎపుడును ధరించి యుండవలెను. అట్లు కాక తనకేమి కావలయును అని మనసున ప్రధానముగ ధరించి నచో కాముకుడగును. తనకేమి కావలయును అనునది పతనము నకు దారి. తానేమి చేయవలెను అనునది పురోగమనమునకు దారి. 

తనకామె (సీత) కావలయును అని తెలిసినవాడు రావణుడు. తన కర్తవ్యము తెలిసినవాడు రాముడు. కర్తవ్య మున్నచోట శ్రద్ధ యుండును. శ్రద్ధ యున్నచోట ధర్మము స్ఫురించును. రామునికి ధర్మము స్పృజించినట్లు సమకాలికముగ మరెవ్వరికిని ధర్మము స్పృజించలేదు. కర్తవ్యము నశ్రద్ధ చేసినచో లక్ష్యము గతి తప్పును. లక్ష్యము గతి తప్పినచో సంసార చక్రమున బంధింపబడును. ఆ చక్రమున జనన మరణ ములు అశేషముగ నుండును. అట్టివారు “నన్ను" అనగా సత్యమును పొందలేరు అనుటలో ఆశ్చర్య మేమున్నది! 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 457🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 32

*🌻. సప్తర్షుల రాక - 1 🌻*

బ్రహ్మిట్లు పలికెను (1).

బ్రాహ్మణుని మాటలను వినిన మేన శోకముచే ఎర్రబడిన కన్నులు గలదై దుఃఖించు చున్న హృదయముతో హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికెను (1).

మేన ఇట్లు పలికెను-

ఓ పర్వతరాజా! పరిణామమునందు సుఖమును కలిగించే నా మాటను వినుము. శివభక్తులనందరినీ అడిగి తెలుసుకొనుము. ఈ బ్రాహ్మణుడు చెప్పినది ఏమి? (2) ఈ వైష్ణవ బ్రాహ్మణుడు శివుని నిందించినాడు. ఓ పర్వత రాజా! ఆ నిందను విన్న నా మనస్సు మిక్కిలి నిరాశను పొందియున్నది (3). ఓ శైలరాజా! నేను మంచి లక్షణములతో గూడియున్న నా కుమార్తెను చెడు రూపము, శీలము గల ఆ రుద్రునకు ఈయను (4). నీవు నా మాటను విననిచో నేను నిస్సందేహముగా మరణించెదను. వెంటనే ఇంటిని విడిచి పెట్టెదను. లేదా, విషమును మ్రింగెదను (5).

అమ్మాయిని త్రాటితో మెడకు కట్టుకొని దట్టమైన అడవికిపోయెదను. లేదా మహాసముద్రములో ముంచెదను. కాని అమ్మాయిని వానికి ఈయను (6). ఇట్లు పలికి మేన వెంటనే దుఃఖముతో కోప గృహమునకు వెళ్లి ఆభరణములను వీడి ఏడుస్తూ నేలపై పరుండెను (7). ఓ కుమారా! ఇంతలో విరహముచే దుఃఖితమైన మనస్సు గల శంభుడు వెంటనే సప్తర్షులను స్మరించెను (8). శంభుడు స్మరించినంతనే అపర కల్ప వృక్షముల వంటి ఆ ఋషులందరూ మరుక్షణంలో అచటకు స్వయముగా విచ్చేసిరి (9).

మరియు అపరసిద్ధివలె నున్న అరుంధతి కూడ వచ్చెను. సూర్యునివలె విరాజిల్లుచున్న వారిని చూచి శివుడు తన జపమును ఆపెను (10). ఓ మహర్షీ! తపశ్శాలురగు ఆ ఋషులుశ్రేష్ఠుడగు శివుని యెదుల నిలబడి ఆయనకు నమస్కరించి స్తుతించి కృతార్థులమైతిమని భావించిరి (11). పిమ్మట ఆశ్చర్యచకితులైన ఆ ఋషులు లోకవందితుడగు శివుని మరల నమస్కరించిచేతులు జోడించి ఇట్లు పలికిరి (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 134 / Viveka Chudamani - 134🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 27. విముక్తి - 7 🍀*

440. ఎవడు ఈ శరీరము యొక్క సుఖాలకు, దుఃఖాలకు, మంచి చెడులకు సమానముగా ఉంటాడో అతడు విముక్తిని పొందినవాడు. 

441. సన్యాసులు తమకు ఎవరైన లౌకిక వస్తువులను సమకూర్చిన వాటిని సముద్రము నదులను తనలో కలుపుకొన్నట్లు ఆ వస్తువులను చూస్తారు. అనగా పట్టించుకోరు. ఎందువలనంటే వారు తాను బ్రహ్మముతో సమానులుగా భావించి, వాటిని పట్టించుకోరు. వారే విముక్తి పొందినవారు. 

442. ఎవడైతే సత్యాన్ని గ్రహిస్తాడో, తానే బ్రహ్మమని భావిస్తాడో వాడు భౌతిక వస్తువులతో ఎట్టి బంధములు పెంచుకోడు వాడే విముక్తుడు. అట్టి బంధమున్నచో అతడు బ్రహ్మమును తెలుసుకొన్నవాడు కాదు. అట్టి వారు తన ఇంద్రియాలను బయటకు మళ్ళించినవాడవుతాడు. వాడు విముక్తుడు కాదు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 134 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 27. Redemption - 7 🌻*

440. He who feels just the same when his body is either worshipped by the good or tormented by the wicked, is known as a man liberated-in-life.

441. The Sannyasin in whom the sense-objects directed by others are engulfed like flowing rivers in the sea and produce no change, owing to his identity with the Existence Absolute, is indeed liberated.

442. For one who has realised the Truth of Brahman, there is no more attachment to the sense-objects as before: If there is, that man has not realised his identity with Brahman, but is one whose senses are outgoing in their tendency.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 86 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 2* 🌻

ఇతర దేశాలలో వేదాధ్యయనం చేస్తూన్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు‌ ఏదో ఒక రకంగా ప్రొద్దున్నే రోజూ కాస్సేపు గుణగుణలాడి దేవుని దగ్గర సణిగినట్లుగా చేసి ఆఫీసుకి పోయినట్లుగా కాక వారు చాలా నిష్ఠగా చేస్తూ ఉన్నారు‌. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గాయత్రి మంత్రం ప్రపంచ శాంతికై చేస్తూన్న వాళ్ళు ఉన్నారు. 

ప్రపంచ శాంతికై, ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధం రాకుండా ఉండటం కొరకు, ప్రపంచంలోని మానవజాతి శాంతిగా ఉండాలి, పరస్పరం ఒకరికొకరు సమన్వయంతో ఉండాలి అనే దృష్టితో అహోరాత్రాలు నమకచమకాలు చేస్తూన్నవారు, ప్యారిస్ లో, లండను లో, కొన్ని వేల మంది ఇప్పటికి 6 సంవత్సరాల నుండి చేస్తున్నారు‌ (1980-82 నాటికి) అఖండమైన నామజపం కూడా ఇప్పుడు చెప్పిన దేశాలలోను మరియు న్యూయార్కులోను కొన్ని వేల మంది ఉన్నారు. ఈ విధంగా అఖండ నామజపం కూడా (24 గంటలు) 6 సంవత్సరాల నుండి నడుస్తున్నది. 

ఇదంతా దేనికండీ అనగా ప్రపంచశాంతికై ఈ మహా యజ్ఞ నిర్వహణ జరుగుతోంది. అయితే ఇంతగా మనం భారతదేశంలో మనం చేస్తున్నమా? మనం మళ్ళీ వాళ్ళను (పాశ్చాత్యులను) చూసి నేర్చుకొనే రోజులు వస్తున్నాయి. 

Masters బ్రహ్మ విద్య అందరికీ అర్థమయ్యేటట్లు చేయటం కోసం, Madam Blavetsky అనే ఆమె ద్వారా "గుప్త విద్య" (Secret Doctrine) అను దానిని సరహస్యంగా ప్రయోగోపసంహార పూర్వకంగా ఇచ్చారు. 

అటుపైన 20వ శతాబ్దిలో 1934-35 సంవత్సరాల నుండి అఖండంగా ఒక 35 సంవత్సరాలు ఏలిస్ ఏ బెయిలీ అను ఆమె ద్వారా 24 సంపుటాలుగా బ్రహ్మవిద్య మళ్ళీ ప్రసాదింపబడినది‌. 

ఇతర దేశాలను ఈ విషయమున గమనించినచో, ఈ గ్రంథముల అధ్యయనము అఖండ బ్రహ్మ విద్యా పారీణత తత్వపరిషత్తులు, గోష్ఠులు మొదలయినవి ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జియం, స్విట్జర్లాండ్, హాలండ్, నెదర్లాండ్స్ లోని ఇతర దేశాలలో మనకు చక్కగా కనిపిస్తాయి. 

ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు...

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 75 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 75. WITHDRAW UNLOVE 🍀*

*🕉 We don't love. But that is not the only' problem. We unlove. So first start dropping anything that you feel is unloving. Any attitude, any word that you have used out if habit but that now suddenly you feel is cruel-drop it! 🕉*

Always be ready to say, "I am sorry." Very few people are capable of saying this. Even when they appear to be saying it, they are not. It may be just a social formality. To really say "I am sorry" is a great understanding. You are saying that you have done something wrongand you are not just trying to be polite. You are withdrawing something. You are withdrawing an act that was going to happen, you are withdrawing a word that you had uttered.

So withdraw unlove, and as you do you will see many more thingsthat it is not really a question of how to love. It is only a question of how not to love. It is just like a spring covered with stones and rocks. You remove the rocks, and the spring starts flowing. It is there. Every heart has love, because the heart cannot exist without it. It is the very pulse of life. Nobody can be without love; that is impossible. It is a basic truth that everyone has love, has the capacity to love and to be loved. 

But some rocks-wrong upbringing, wrong attitudes, cleverness, cunningness, and a thousand and one things are blocking the path. Withdraw unloving acts, unloving words, unloving gestures, and then suddenly you will catch yourself in a very loving mood. Many moments will come when suddenly you will see that something is bubbling-and there was love, just a glimpse. And by and by those moments will become longer. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 134 / Sri Lalita Sahasranamavali - Meaning - 134 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 134. రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా ।
రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః ॥ 134 ॥ 

🍀 686. రాజరాజేశ్వరీ : 
ఈశ్వరుని హృదయేశ్వరీ 

🍀 687. రాజ్యదాయినీ : 
రాజ్యములను ఇచ్చునది 

🍀 688. రాజ్యవల్లభా : 
రాజ్యమునకు అధికారిణీ 

🍀 689. రాజత్కృపా : 
అధికమైన కరుణ కలది 

🍀 690. రాజపీఠనిశేవితనిజాశ్రితా :
 తనను ఆశ్రయించినవారిని సింహాసనము పైన కూర్చొండపెట్టునది 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 134 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 134. Rajarajishvari rajyadaeini rajyavallabha
Raja tkrupa rajapita niveshitanija shrita ॥ 134 ॥

🌻 686 ) Raja rajeswari -   
She who is goddess to king of kings like Devaraja, Yaksha raja, , Brahma, Vishnu and Rudra

🌻 687 ) Rajya Dhayini -   
She who gives kingdoms like Vaikunta, kailasa etc

🌻 688 ) Rajya vallabha -  
 She who likes such kingdoms

🌻 689 ) Rajat krupa -  
 She whose mercy shines everywhere

🌻 690 ) Raja peetha nivesitha nijasritha -   
She who makes people approaching her as kings

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹