శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀

🌻 380. 'బిందుమండలవాసినీ' - 2🌻

సృష్టికర్త కూర్చుండియున్న పద్మము సృష్టి కర్తకన్న ముందే యేర్పడినది. ఆ పద్మము నాళము అంతకన్న ముందున్నది. ఆ నాళము పుట్టు స్థానము తెలియుట అసాధ్యము. అవ్యక్తమగు పరమాత్మ తత్త్వము నాళము ద్వారా ప్రసరించి పద్మము నేర్పరచి సృష్టికర్తను పుట్టించెను. జీవుని కూడ అట్లే ప్రతి ఉదయము మేల్కాంచును. మేల్కాంచుటకు ముందు జీవు డెటనుండి వచ్చుచున్నాడో తెలియుటకు ప్రయత్నించుట నాళమున చేరి వెదకుటగా తెలియదగును. సృష్టికి కర్త చతుర్ముఖ బ్రహ్మ. మన జీవన సృష్టికి కర్త మనమే.

బ్రహ్మవలె మనము కూడ సృష్టి జరుపుదుము. బ్రహ్మ సృష్టి బ్రహ్మము ఆజ్ఞానుసారము జరుగుట వలన బ్రహ్మదేవుడు సృష్టి కధిపతియై యున్నాడు. అతడు దైవేచ్ఛ నెఱిగి సృష్టి కర్తృత్వము నిర్వహించు చున్నాడు. అతని కర్తృత్వము నిరహంకార పూరితము. జీవుడు కూడ దైవేచ్ఛకు సమర్పణము చెంది దివ్యసంకల్పమునే నిర్వర్తించు చుండినచో బ్రహ్మానందమున ఉండవచ్చును. ఇట్టి బ్రహ్మానందము పొందుటకే సర్వసాధనలును. నవవిధ భక్తుల ద్వారా దైవసాన్నిధ్యము సిద్దించిన వారు కేవలము దైవేచ్ఛయే తమ ఇచ్ఛగా జీవింతురు. దివ్య ప్రణాళిక నిర్వర్తించుచు శాశ్వతులై సృష్టి యందుందురు. ఇట్టి బ్రహ్మానంద స్థితి తమ లోపలి బ్రహ్మనాళమును (బ్రహ్మ రంధ్రము) చేరినచో కలుగును. దానికి చేయు ప్రయత్నమే తపస్సు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 380 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻

🌻 380. Bindumaṇḍala-vāsini बिन्दुमण्डल-वासिनि - 2 🌻

The bindu is also referred to the orifice in the sahasrāra also known as brahmarandhra through which commune with God is established. The cosmic energy enters the human body only through this orifice in the crown cakra and medulla in the back head cakra. When these two places are exposed to Mother Nature and early morning sun, sufficient cosmic energy can be drawn by the gross body to have a disease free life.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Jun 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 200. అభద్రత / Osho Daily Meditations - 200. INSECURITY

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 200 / Osho Daily Meditations - 200 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 200. అభద్రత 🍀

🕉. మానవుడు సున్నితంగా ఉండే పువ్వు. ఏదైనా రాయి మిమ్మల్ని నలిపి వేయగలదు. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే మీరు ఉండరు. ఒక్కసారి అర్థం చేసుకోండి.. 🕉

మీరు చాలా భయపడినప్పుడు, ఏమి చేయాలి? రాత్రి చీకటిగా ఉంది, దారి తెలియదు, దారిని వెలిగించడానికి వెలుతురు లేదు, మిమ్మల్ని నడిపించడానికి ఎవరూ లేరు, మ్యాప్ లేదు, కాబట్టి ఏమి చేయాలి? మీరు ఏడవడం ఇష్టపడితే, ఏడ్వండి. కానీ అది ఎవరికీ సహాయం చేయదు. దానిని అంగీకరించి చీకట్లో తడుముకోవడం మంచిది. మీరు జీవించి ఉన్నప్పుడు ఆనందించండి. భద్రత సాధ్యం కానప్పుడు, భద్రత కోసం వెతుకులాటలో సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు. ఇది అభద్రతా జ్ఞానం. మీరు దానిని అర్థం చేసుకున్న తర్వాత, అంగీకరించండి, మీరు భయం నుండి విముక్తి పొందుతారు. సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు చాలా భయపడతారు, ఎందుకంటే మరణం వారి కోసం వేచి ఉంది. బహుశా వారు మళ్లీ తిరిగి రాకపోవచ్చు. వారు వణుకుతారు, వారు నిద్రపోలేరు, వారికి పీడకలలు ఉంటాయి. వారు చంపబడ్డారని లేదా వికలాంగులయ్యారని కలలు కంటారు.

కానీ వారు ముందుకి చేరుకున్న తర్వాత, భయం అంతా మాయమవుతుంది. మరణం సంభవిస్తుందని, ప్రజలు చనిపోతున్నారని, ఇతర సైనికులు చనిపోయారని, వారి స్నేహితులు చనిపోయారని, బాంబులు పడిపోతున్నాయని మరియు బుల్లెట్లు వెళుతున్నాయని వారు చూసిన తర్వాత, ఇరవై నాలుగు గంటల్లో వారు స్థిరపడతారు. భయం అంతా పోయింది. వారు వాస్తవికతను అంగీకరిస్తారు; బుల్లెట్లు వెళుతున్నప్పుడు వారు కార్డులు ఆడటం ప్రారంభిస్తారు. వారు టీ తాగుతారు మరియు వారు ఇంతకు ముందెన్నడూ ఆస్వాదించని విధంగా ఆనందిస్తారు, ఎందుకంటే ఇది వారి చివరి కప్పు కావచ్చు. వారు జోకులు వేసుకుని నవ్వుతారు, వారు నృత్యం చేస్తారు మరియు పాడతారు. ఏం చేయాలి? అక్కడ ఉన్నప్పుడు మృత్యువు అక్కడే ఉంటుంది. ఇది అభద్రత. దానిని అంగీకరించండి, అది అదృశ్యమవుతుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 200 🌹

📚. Prasad Bharadwaj

🍀 200. INSECURITY🍀

🕉 The human being is a fragile flower. Any stone can crush you. Any accident and you are Gone. Once you understand it .... 🕉

When you feel very afraid, what to do? The night is dark, the path unknown, no light to light the path, nobody to guide you, no map, so what to do? If you like crying and weeping, cry and weep, but that helps nobody. Better to accept it and grope in the dark. Enjoy while you are alive. Why waste this time in hankering after security, when security is not possible. This is the wisdom of insecurity. Once you understand it, accept it, you are freed from fear. It always happens when soldiers go to war that they are very afraid, because death is waiting for them. Maybe they will never come back again. They tremble, they cannot sleep, they have nightmares. They dream again and" again that they have been killed or crippled.

But once they reach the front, all fear disappears. Once they see that death is happening, people are dying, other soldiers are dead, that their friends may be dead, that bombs are falling and bullets passing-- within twenty-four hours they settle, and all fear is gone. They accept reality; they start playing cards while bullets are passing. They drink tea, and they enjoy it as they have never enjoyed it before, because this may be their last cup. They joke and laugh, they dance and sing. What to do? When death is there, it is there. This is insecurity. Accept it, then it disappears.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Jun 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 65 / Agni Maha Purana - 65

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 65 / Agni Maha Purana - 65 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 24

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -3‌ 🌻

జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటిపై పాత్రను, ఇధ్మమును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి స్రుక్కున, స్రువమును భూమిపై ఉంచవలెను.

ఆజ్యాస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షిణిని గ్రహించి దానిని నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడిచి, ప్రోక్షణీపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని అగ్నికీ ఎదురుకుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు ప్రోక్షించి, ఎదుట నుంచి, ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీతపై విష్ణువును ధ్యానించి, ఆజ్యసాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్ళు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవ్రేలితోను అనామికతోను పట్టుకొని, వాటిని నేతలో ఇటు నటు త్రిప్పినేతిని సంస్కరించవలెను.

వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు క్రిందికి చిమ్మవలెను. వాటితో స్రుక్స్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్భలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని లనుచు పిమ్మట హౌమము చేయవలెను.

గర్భాధానాది కర్మలను ఆ యా అంశములను వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగముల ననుసరించి, నామాంతముగా గాని, సమావర్తాంతము గాని, అధికారాంతము గాని చేయవలెను. 31

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 65 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 24

🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 3 🌻

21-22. Having adorned the incarnate form (of energy), one has to throw fire after having remembered Hari. Having offered twigs of the size of a span (between the thumb and the fore-finger)and having sprinkled water and having spread around. on the three sides in the east etc. with the darbha grass, the fire from the fuel as well as the ladle for pouring clarified butter, (sruk) and sacrificial ladle (sruva) are to be placed on the ground.

23-26. (One should then place) vessels (for keeping) clarified butter, (and) (caru) (oblation of rice, barley and pulse boiled together), kuśa grass and clarified butter. The prokṣaṇī[1] vessel being sprinkled with water with the praṇītā[2] vessel, (and) taken up and filled with water (and) that water being enclosed in the hand with the pavitra (darbha grass) placed in between and having taken the prokṣaṇī vessel towards the east and having placed it in front of the radiant fire (and) having sprinkled (all the vessels) thrice with water and having placed the fuel in front, (and) having meditated on Viṣṇu in the praṇītā vessel, containing a flower and having then filled vessel for (keeping) clarified butter with clarified butter and having placed it in front, the purification of the clarified butter is made by straining and sprinkling clarified butter on the fire.

27. One should take up two kuśa grass with unbroken tips, not being filled in, and of the measure of a span (between the thumb and the fore-finger) with the thumb and the nameless finger (ring-finger) of the palm facing upwards.

28-30. Having taken with them the clarified butter twice and having carried them, (they) must be cast downwards thrice. And again having taken the ladles (sruk and sruva) (and) having sprinkled them with water with them (the kuśa grass) and having heated and wiped them with the darbhas and again having sprinkled (water) and burnt and having placed along with the syllable Om, the aspirant must perform fire oblation commencing with the syllable Om and ending with salutation. (One has to perform) garbhādhāna and other rites as much as it is laid down.

31. One has to do upto the naming ceremony, the undertaking of a vowed observance, observance marking the conclusion of study of the student, (and) investiture of authority in due manner.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

18 Jun 2022

శ్రీ శివ మహా పురాణము - 581 / Sri Siva Maha Purana - 581

🌹 . శ్రీ శివ మహా పురాణము - 581 / Sri Siva Maha Purana - 581 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴

🌻. కుమారస్వామి జననము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

యోగమునందు, జ్ఞానమునందు విశారదుడగు మహాదేవుడు ఆ రోదనమును విని విహారమును ముగించగోరియూ, పార్వతి వలని భయముచే ముగించలేదు (1). భక్తవత్సలుడగు శివశంకరుడు రాక్షసునిచే పీడితులైన దేవతలను చూచుటకు గృహ ద్వారము వద్దకు వచ్చెను (2). అపుడునేను, విష్ణువు, దేవతలందరు భక్తవత్సలుడగు శివుని చూచి మిక్కిలి ఆనందమును పొందితిమి (3). ఓ మునీ! నేను, హరి, మరియు సమస్త దేవతలు మహానందముతో శంకరునకు సాష్టాంగ ప్రణామమాచరించి స్తుతించితిమి (4).

దేవతలిట్లు పలికిరి --

ఓ మహా ప్రభూ! దయచేసి తారకాది రాక్షసులను సంహరించుము. హే విభూ! దేవకార్యమును చేయుము. మహేశ్వరా! దేవతలను రక్షించుము (5). ఓ దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! శంకరా! సర్వుల అంతర్యామిని అగు నీకు సర్వము విదితమే (6).

శివభగవానుడు దేవతల ఆమాటను విని దుఃఖితమైన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (7).

శివుడిట్లు పలికెను--

ఓవిష్ణూ| బ్రహ్మా! దేవతలారా! మీకు అందరికీ మీ మనస్సులే శరణము. జరుగబోయేది జరిగి తీరును. దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు (8). జరిగిన దేదో జరిగినది. దేవతలారా! ప్రకృతమును గురించి వినుడు. ఇపుడు నా తేజస్సును గ్రహించగల వారెవ్వరు? (9) గ్రహించగల సమర్థుడు గ్రహించుగాక! యని శివుడు చెప్పెను. దేవతలందరిచే ప్రేరితుడైన అగ్ని కపోతరూపమును ధరించి (10), ఆ శివతేజస్సును ముక్కుతో గ్రహించెను. ఓ మునీ! ఇంతలో పార్వతి అచటికి వచ్చెను (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 581 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴

🌻 The birth of Śiva’s son - 1 🌻

Brahmā said:—

1. On hearing that, the great lord, an expert in Yogic theory, though free from lust, did not emit the semen, fearing to offend Pārvatī.

2. He came to the door, near the gods distressed by the demon. Śiva is the benefactor favourably disposed to His devotees.

3. On seeing lord Śiva, favourably disposed to His devotees, the gods including me and Viṣṇu became extremely happy.

4. O sage, bowing down with stooping shoulders the gods along with me and Viṣṇu eulogised Śiva with great pleasure.

The gods said:—

5. “O great God, O lord of gods, O ocean of mercy,

O Śiva, you are the immanent soul of all. You know everything.

6. O lord, carry out the task of the gods. O great lord, save the gods. Slay Tāraka and other demons and take pity on us.”

7. On hearing these words of the gods, lord Śiva agitated in soul and dispirited in the mind, replied.

Śiva said:—

8. “O Viṣṇu, O Brahmā, O gods, you are the goal of everybody’s mind. What should happen necessarily must happen. There is none to stop it.

9-11. What has happened has already happened. Now O gods, listen to what is relevant to the context. Let him who will, take up this discharged semen”. After saying this He let it fall on the ground. Urged by the gods Agni became a dove and swallowed it with his beak. O sage, in the meantime Pārvatī came there.

Continues....

🌹🌹🌹🌹🌹

18 Jun 2022

కపిల గీత - 25 / Kapila Gita - 25

🌹. కపిల గీత - 25 / Kapila Gita - 25🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 1 🌴

25. సతాం ప్రసఙ్గాన్మమ వీర్యసంవిదో భవన్తి హృత్కర్ణ రసాయనాః కథాః
తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధా రతిర్భక్తిరనుక్రమిష్యతి

భక్తులు చెప్పే నా కథలు మీ ప్రయత్నం చేయకుండానే మీ కర్ణ రంధ్రం నుండి లోపలకి వెళ్ళి అక్కడ ఉన్న దోషాన్ని పోగొడతాయి. ఇలా వారు చెప్పే కథలను వినడం వలన మోక్ష మార్గం తెలుసుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. వారి యందు ప్రీతి కలుగుతుంది, నా యందు (పరమాత్మ యందు) భక్తి కలుగుతుంది. శ్రద్ధ కథల మీద, రతి చెప్పేవారి మీద, భక్తి పరమాత్మ మీద కలుగుతుంది.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 25 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 12. Association with the Supreme Lord Through Hearing - 1 🌴

25. satam prasangan mama virya-samvido
bhavanti hrt-karna-rasayanah kathah
taj josanad asv apavarga-vartmani
sraddha ratir bhaktir anukramisyati

In the association of pure devotees, discussion of the pastimes and activities of the Supreme Personality of Godhead is very pleasing and satisfying to the ear and the heart. By cultivating such knowledge one gradually becomes advanced on the path of liberation, and thereafter he is freed, and his attraction becomes fixed. Then real devotion and devotional service begin.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Jun 2022

18 Jun 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹.18, June 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, స్థిర వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - 1 🍀

1. నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ |
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ

2. నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ |
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మనం ఉండే స్థానం బట్టి మన స్థాయి, స్థాయిని బట్టి మన విలువ పెరుగుతుంది. మనం కలిసుండే వ్యక్తుల ద్వారా మన యోగ్యత పెరుగుతుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ పంచమి 24:21:04 వరకు

తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: శ్రవణ 07:40:42 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: వైధృతి 13:50:10 వరకు

తదుపరి వషకుంభ

కరణం: కౌలవ 13:40:35 వరకు

వర్జ్యం: 11:22:40 - 12:51:44

దుర్ముహూర్తం: 07:27:27 - 08:20:07

రాహు కాలం: 08:59:38 - 10:38:24

గుళిక కాలం: 05:42:06 - 07:20:52

యమ గండం: 13:55:56 - 15:34:42

అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:43

అమృత కాలం: 20:17:04 - 21:46:08

సూర్యోదయం: 05:42:06

సూర్యాస్తమయం: 18:52:15

చంద్రోదయం: 22:54:33

చంద్రాస్తమయం: 09:34:39

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: మకరం

స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ

ఫలం 07:40:42 వరకు తదుపరి

వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

18 - JUNE - 2022 SATURDAY MESSAGES శనివారం, స్థిర వాసరే సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 18, శనివారం, జూన్ 2022 స్ధిర వాసరే Saturday🌹
2) 🌹 కపిల గీత - 25 / Kapila Gita - 25🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 65 / Agni Maha Purana - 65🌹 
4) 🌹. శివ మహా పురాణము - 581 / Siva Maha Purana - 581🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 200 / Osho Daily Meditations - 200🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹.18, June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) - 1 🍀*

*1. నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ |*
*నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ*
*2. నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ |*
*నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మనం ఉండే స్థానం బట్టి మన స్థాయి, స్థాయిని బట్టి మన విలువ పెరుగుతుంది. మనం కలిసుండే వ్యక్తుల ద్వారా మన యోగ్యత పెరుగుతుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ పంచమి 24:21:04 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: శ్రవణ 07:40:42 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: వైధృతి 13:50:10 వరకు
తదుపరి వషకుంభ
కరణం: కౌలవ 13:40:35 వరకు
వర్జ్యం: 11:22:40 - 12:51:44
దుర్ముహూర్తం: 07:27:27 - 08:20:07
రాహు కాలం: 08:59:38 - 10:38:24
గుళిక కాలం: 05:42:06 - 07:20:52
యమ గండం: 13:55:56 - 15:34:42
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:43
అమృత కాలం: 20:17:04 - 21:46:08
సూర్యోదయం: 05:42:06
సూర్యాస్తమయం: 18:52:15
చంద్రోదయం: 22:54:33
చంద్రాస్తమయం: 09:34:39
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ 
ఫలం 07:40:42 వరకు తదుపరి
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 25 / Kapila Gita - 25🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 1 🌴*

*25. సతాం ప్రసఙ్గాన్మమ వీర్యసంవిదో భవన్తి హృత్కర్ణ రసాయనాః కథాః*
*తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధా రతిర్భక్తిరనుక్రమిష్యతి*

*భక్తులు చెప్పే నా కథలు మీ ప్రయత్నం చేయకుండానే మీ కర్ణ రంధ్రం నుండి లోపలకి వెళ్ళి అక్కడ ఉన్న దోషాన్ని పోగొడతాయి. ఇలా వారు చెప్పే కథలను వినడం వలన మోక్ష మార్గం తెలుసుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. వారి యందు ప్రీతి కలుగుతుంది, నా యందు (పరమాత్మ యందు) భక్తి కలుగుతుంది. శ్రద్ధ కథల మీద, రతి చెప్పేవారి మీద, భక్తి పరమాత్మ మీద కలుగుతుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 25 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 12. Association with the Supreme Lord Through Hearing - 1 🌴*

*25. satam prasangan mama virya-samvido*
*bhavanti hrt-karna-rasayanah kathah*
*taj josanad asv apavarga-vartmani*
*sraddha ratir bhaktir anukramisyati*

*In the association of pure devotees, discussion of the pastimes and activities of the Supreme Personality of Godhead is very pleasing and satisfying to the ear and the heart. By cultivating such knowledge one gradually becomes advanced on the path of liberation, and thereafter he is freed, and his attraction becomes fixed. Then real devotion and devotional service begin.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 581 / Sri Siva Maha Purana - 581 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴*

*🌻. కుమారస్వామి జననము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

యోగమునందు, జ్ఞానమునందు విశారదుడగు మహాదేవుడు ఆ రోదనమును విని విహారమును ముగించగోరియూ, పార్వతి వలని భయముచే ముగించలేదు (1). భక్తవత్సలుడగు శివశంకరుడు రాక్షసునిచే పీడితులైన దేవతలను చూచుటకు గృహ ద్వారము వద్దకు వచ్చెను (2). అపుడునేను, విష్ణువు, దేవతలందరు భక్తవత్సలుడగు శివుని చూచి మిక్కిలి ఆనందమును పొందితిమి (3). ఓ మునీ! నేను, హరి, మరియు సమస్త దేవతలు మహానందముతో శంకరునకు సాష్టాంగ ప్రణామమాచరించి స్తుతించితిమి (4).

దేవతలిట్లు పలికిరి --

ఓ మహా ప్రభూ! దయచేసి తారకాది రాక్షసులను సంహరించుము. హే విభూ! దేవకార్యమును చేయుము. మహేశ్వరా! దేవతలను రక్షించుము (5). ఓ దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! శంకరా! సర్వుల అంతర్యామిని అగు నీకు సర్వము విదితమే (6).

శివభగవానుడు దేవతల ఆమాటను విని దుఃఖితమైన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (7).

శివుడిట్లు పలికెను--

ఓవిష్ణూ| బ్రహ్మా! దేవతలారా! మీకు అందరికీ మీ మనస్సులే శరణము. జరుగబోయేది జరిగి తీరును. దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు (8). జరిగిన దేదో జరిగినది. దేవతలారా! ప్రకృతమును గురించి వినుడు. ఇపుడు నా తేజస్సును గ్రహించగల వారెవ్వరు? (9) గ్రహించగల సమర్థుడు గ్రహించుగాక! యని శివుడు చెప్పెను. దేవతలందరిచే ప్రేరితుడైన అగ్ని కపోతరూపమును ధరించి (10), ఆ శివతేజస్సును ముక్కుతో గ్రహించెను. ఓ మునీ! ఇంతలో పార్వతి అచటికి వచ్చెను (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 581 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴*

*🌻 The birth of Śiva’s son - 1 🌻*

Brahmā said:—
1. On hearing that, the great lord, an expert in Yogic theory, though free from lust, did not emit the semen, fearing to offend Pārvatī.

2. He came to the door, near the gods distressed by the demon. Śiva is the benefactor favourably disposed to His devotees.

3. On seeing lord Śiva, favourably disposed to His devotees, the gods including me and Viṣṇu became extremely happy.

4. O sage, bowing down with stooping shoulders the gods along with me and Viṣṇu eulogised Śiva with great pleasure.

The gods said:—
5. “O great God, O lord of gods, O ocean of mercy,

O Śiva, you are the immanent soul of all. You know everything.

6. O lord, carry out the task of the gods. O great lord, save the gods. Slay Tāraka and other demons and take pity on us.”

7. On hearing these words of the gods, lord Śiva agitated in soul and dispirited in the mind, replied.

Śiva said:—
8. “O Viṣṇu, O Brahmā, O gods, you are the goal of everybody’s mind. What should happen necessarily must happen. There is none to stop it.

9-11. What has happened has already happened. Now O gods, listen to what is relevant to the context. Let him who will, take up this discharged semen”. After saying this He let it fall on the ground. Urged by the gods Agni became a dove and swallowed it with his beak. O sage, in the meantime Pārvatī came there.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 65 / Agni Maha Purana - 65 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 24*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -3‌ 🌻*

జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటిపై పాత్రను, ఇధ్మమును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి స్రుక్కున, స్రువమును భూమిపై ఉంచవలెను.

ఆజ్యాస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షిణిని గ్రహించి దానిని నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడిచి, ప్రోక్షణీపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని అగ్నికీ ఎదురుకుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు ప్రోక్షించి, ఎదుట నుంచి, ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీతపై విష్ణువును ధ్యానించి, ఆజ్యసాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్ళు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవ్రేలితోను అనామికతోను పట్టుకొని, వాటిని నేతలో ఇటు నటు త్రిప్పినేతిని సంస్కరించవలెను.

వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు క్రిందికి చిమ్మవలెను. వాటితో స్రుక్స్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్భలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని లనుచు పిమ్మట హౌమము చేయవలెను.

గర్భాధానాది కర్మలను ఆ యా అంశములను వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగముల ననుసరించి, నామాంతముగా గాని, సమావర్తాంతము గాని, అధికారాంతము గాని చేయవలెను. 31

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 65 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 24*
*🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 3 🌻*

21-22. Having adorned the incarnate form (of energy), one has to throw fire after having remembered Hari. Having offered twigs of the size of a span (between the thumb and the fore-finger)and having sprinkled water and having spread around. on the three sides in the east etc. with the darbha grass, the fire from the fuel as well as the ladle for pouring clarified butter, (sruk) and sacrificial ladle (sruva) are to be placed on the ground.

23-26. (One should then place) vessels (for keeping) clarified butter, (and) (caru) (oblation of rice, barley and pulse boiled together), kuśa grass and clarified butter. The prokṣaṇī[1] vessel being sprinkled with water with the praṇītā[2] vessel, (and) taken up and filled with water (and) that water being enclosed in the hand with the pavitra (darbha grass) placed in between and having taken the prokṣaṇī vessel towards the east and having placed it in front of the radiant fire (and) having sprinkled (all the vessels) thrice with water and having placed the fuel in front, (and) having meditated on Viṣṇu in the praṇītā vessel, containing a flower and having then filled vessel for (keeping) clarified butter with clarified butter and having placed it in front, the purification of the clarified butter is made by straining and sprinkling clarified butter on the fire.

27. One should take up two kuśa grass with unbroken tips, not being filled in, and of the measure of a span (between the thumb and the fore-finger) with the thumb and the nameless finger (ring-finger) of the palm facing upwards.

28-30. Having taken with them the clarified butter twice and having carried them, (they) must be cast downwards thrice. And again having taken the ladles (sruk and sruva) (and) having sprinkled them with water with them (the kuśa grass) and having heated and wiped them with the darbhas and again having sprinkled (water) and burnt and having placed along with the syllable Om, the aspirant must perform fire oblation commencing with the syllable Om and ending with salutation. (One has to perform) garbhādhāna and other rites as much as it is laid down.

31. One has to do upto the naming ceremony, the undertaking of a vowed observance, observance marking the conclusion of study of the student, (and) investiture of authority in due manner.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 200 / Osho Daily Meditations - 200 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 200. అభద్రత 🍀*

*🕉. మానవుడు సున్నితంగా ఉండే పువ్వు. ఏదైనా రాయి మిమ్మల్ని నలిపి వేయగలదు. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే మీరు ఉండరు. ఒక్కసారి అర్థం చేసుకోండి.. 🕉*
 
*మీరు చాలా భయపడినప్పుడు, ఏమి చేయాలి? రాత్రి చీకటిగా ఉంది, దారి తెలియదు, దారిని వెలిగించడానికి వెలుతురు లేదు, మిమ్మల్ని నడిపించడానికి ఎవరూ లేరు, మ్యాప్ లేదు, కాబట్టి ఏమి చేయాలి? మీరు ఏడవడం ఇష్టపడితే, ఏడ్వండి. కానీ అది ఎవరికీ సహాయం చేయదు. దానిని అంగీకరించి చీకట్లో తడుముకోవడం మంచిది. మీరు జీవించి ఉన్నప్పుడు ఆనందించండి. భద్రత సాధ్యం కానప్పుడు, భద్రత కోసం వెతుకులాటలో సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు. ఇది అభద్రతా జ్ఞానం. మీరు దానిని అర్థం చేసుకున్న తర్వాత, అంగీకరించండి, మీరు భయం నుండి విముక్తి పొందుతారు. సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు చాలా భయపడతారు, ఎందుకంటే మరణం వారి కోసం వేచి ఉంది. బహుశా వారు మళ్లీ తిరిగి రాకపోవచ్చు. వారు వణుకుతారు, వారు నిద్రపోలేరు, వారికి పీడకలలు ఉంటాయి. వారు చంపబడ్డారని లేదా వికలాంగులయ్యారని కలలు కంటారు.*

*కానీ వారు ముందుకి చేరుకున్న తర్వాత, భయం అంతా మాయమవుతుంది. మరణం సంభవిస్తుందని, ప్రజలు చనిపోతున్నారని, ఇతర సైనికులు చనిపోయారని, వారి స్నేహితులు చనిపోయారని, బాంబులు పడిపోతున్నాయని మరియు బుల్లెట్లు వెళుతున్నాయని వారు చూసిన తర్వాత, ఇరవై నాలుగు గంటల్లో వారు స్థిరపడతారు. భయం అంతా పోయింది. వారు వాస్తవికతను అంగీకరిస్తారు; బుల్లెట్లు వెళుతున్నప్పుడు వారు కార్డులు ఆడటం ప్రారంభిస్తారు. వారు టీ తాగుతారు మరియు వారు ఇంతకు ముందెన్నడూ ఆస్వాదించని విధంగా ఆనందిస్తారు, ఎందుకంటే ఇది వారి చివరి కప్పు కావచ్చు. వారు జోకులు వేసుకుని నవ్వుతారు, వారు నృత్యం చేస్తారు మరియు పాడతారు. ఏం చేయాలి? అక్కడ ఉన్నప్పుడు మృత్యువు అక్కడే ఉంటుంది. ఇది అభద్రత. దానిని అంగీకరించండి, అది అదృశ్యమవుతుంది.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 200 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 200. INSECURITY🍀*

*🕉 The human being is a fragile flower. Any stone can crush you. Any accident and you are Gone. Once you understand it .... 🕉*
 
*When you feel very afraid, what to do? The night is dark, the path unknown, no light to light the path, nobody to guide you, no map, so what to do? If you like crying and weeping, cry and weep, but that helps nobody. Better to accept it and grope in the dark. Enjoy while you are alive. Why waste this time in hankering after security, when security is not possible. This is the wisdom of insecurity. Once you understand it, accept it, you are freed from fear. It always happens when soldiers go to war that they are very afraid, because death is waiting for them. Maybe they will never come back again. They tremble, they cannot sleep, they have nightmares. They dream again and" again that they have been killed or crippled.*

*But once they reach the front, all fear disappears. Once they see that death is happening, people are dying, other soldiers are dead, that their friends may be dead, that bombs are falling and bullets passing-- within twenty-four hours they settle, and all fear is gone. They accept reality; they start playing cards while bullets are passing. They drink tea, and they enjoy it as they have never enjoyed it before, because this may be their last cup. They joke and laugh, they dance and sing. What to do? When death is there, it is there. This is insecurity. Accept it, then it disappears.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*

*🌻 380. 'బిందుమండలవాసినీ' - 2🌻* 

*సృష్టికర్త కూర్చుండియున్న పద్మము సృష్టి కర్తకన్న ముందే యేర్పడినది. ఆ పద్మము నాళము అంతకన్న ముందున్నది. ఆ నాళము పుట్టు స్థానము తెలియుట అసాధ్యము. అవ్యక్తమగు పరమాత్మ తత్త్వము నాళము ద్వారా ప్రసరించి పద్మము నేర్పరచి సృష్టికర్తను పుట్టించెను. జీవుని కూడ అట్లే ప్రతి ఉదయము మేల్కాంచును. మేల్కాంచుటకు ముందు జీవు డెటనుండి వచ్చుచున్నాడో తెలియుటకు ప్రయత్నించుట నాళమున చేరి వెదకుటగా తెలియదగును. సృష్టికి కర్త చతుర్ముఖ బ్రహ్మ. మన జీవన సృష్టికి కర్త మనమే.*

*బ్రహ్మవలె మనము కూడ సృష్టి జరుపుదుము. బ్రహ్మ సృష్టి బ్రహ్మము ఆజ్ఞానుసారము జరుగుట వలన బ్రహ్మదేవుడు సృష్టి కధిపతియై యున్నాడు. అతడు దైవేచ్ఛ నెఱిగి సృష్టి కర్తృత్వము నిర్వహించు చున్నాడు. అతని కర్తృత్వము నిరహంకార పూరితము. జీవుడు కూడ దైవేచ్ఛకు సమర్పణము చెంది దివ్యసంకల్పమునే నిర్వర్తించు చుండినచో బ్రహ్మానందమున ఉండవచ్చును. ఇట్టి బ్రహ్మానందము పొందుటకే సర్వసాధనలును. నవవిధ భక్తుల ద్వారా దైవసాన్నిధ్యము సిద్దించిన వారు కేవలము దైవేచ్ఛయే తమ ఇచ్ఛగా జీవింతురు. దివ్య ప్రణాళిక నిర్వర్తించుచు శాశ్వతులై సృష్టి యందుందురు. ఇట్టి బ్రహ్మానంద స్థితి తమ లోపలి బ్రహ్మనాళమును (బ్రహ్మ రంధ్రము) చేరినచో కలుగును. దానికి చేయు ప్రయత్నమే తపస్సు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 380 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*

*🌻 380. Bindumaṇḍala-vāsini बिन्दुमण्डल-वासिनि - 2 🌻*

*The bindu is also referred to the orifice in the sahasrāra also known as brahmarandhra through which commune with God is established. The cosmic energy enters the human body only through this orifice in the crown cakra and medulla in the back head cakra. When these two places are exposed to Mother Nature and early morning sun, sufficient cosmic energy can be drawn by the gross body to have a disease free life.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹