7-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 420 / Bhagavad-Gita - 420 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 208 / Sripada Srivallabha Charithamrutham - 208 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 72 🌹
4) 🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత- 1 🌹
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 111 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 28 🌹 
7) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 88🌹 🌹 
8) 🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 589/ SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 59 🌹 
9) 🌹. సౌందర్య లహరి - 35 / Soundarya Lahari - 35 🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 334 / Bhagavad-Gita - 334 🌹
11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 164 🌹 
12) 🌹. VEDA UPANISHAD SUKTHAM - 51 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 36 🌹
14) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 41 🌹
15) 🌹 Seeds Of Consciousness - 116 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 26 / Sri Lalita Sahasranamavali - Meaning - 26 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 54 🌹
18)
19)
20) 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 420 / Bhagavad-Gita - 420 🌹* 
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 29 🌴

29. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||

🌷. తాత్పర్యం : 
చావుకోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే నశించడం కోసం మహావేగంగా నీ నోళ్ళలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు.

🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 420 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 29 🌴

29. yathā pradīptaṁ jvalanaṁ pataṅgā
viśanti nāśāya samṛddha-vegāḥ
tathaiva nāśāya viśanti lokās
tavāpi vaktrāṇi samṛddha-vegāḥ

🌷 Translation : 
I see all people rushing full speed into Your mouths, as moths dash to destruction in a blazing fire.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 208 / Sripada Srivallabha Charithamrutham - 208 🌹* 
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయం 36
🌻. ఆత్మ ఏక - బహు శరీరగతమా? - 2 🌻

కాని దివ్యాత్మల విషయం వేరు. వాటికి ఒకటే ఆత్మ ఉంటుంది. ఆత్మ పురుష రూపంలో ఆవిర్భవిస్తే ఆ ఆత్మయొక్క శక్తి స్త్రీ రూపంలో ఉద్భవిస్తుంది. అటువంటి వారిది దివ్యదాంపత్యం అనబడుతుంది," అని చెప్పి నా వైపు తిరిగి నీవు ఒకే సమయంలో వేదాంతశర్మ అనే బ్రాహ్మణునిలా, బంగారయ్య అనే చర్మకారునిలా జన్మించావు. 

అలాగే నీ స్త్రీశక్తి ఒకే సమయంలో నీ ముగ్గురి భార్యలవలె, ఇటీవలె మీ యింట్లో మరణించిన గోవువలె, బంగారమ్మ అనే పేరుతో బంగారయ్య అనే ఆ చర్మకారుని భార్యవలెను జన్మించింది. 

చనిపోయిన ఆ ముగ్గురి భార్యల చైతన్యం, చనిపోయిన ఆ గోమాత చైతన్యం ప్రస్తుతం బంగారమ్మలో లీనమయి ఉన్నాయి. చైతన్యం ఇలా మూడు నాల్గు శరీరాలలో విభాజితం అయినపుడు ప్రతి శరీరం తనది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అనుకుంటుంది. 

కాని ఏ శరీరం మరణించినా దానికి సంబంధించిన చైతన్యం సజీవంగా ఉన్నమూల చైతన్యంలో విలీనం అవుతుంది ఇదే సృష్టి రహస్యం. కాబట్టి నీ శక్తిస్వరూపం అయిన బంగారమ్మని నీ భార్యను చేసుకో. 

కాకపోతే ఆమె శరీరం ఈ జన్మలో బంగారయ్యకు ధారా దత్తం అయ్యింది కాబట్టి ధర్మవిరుద్ధం కాకుండా, ఆమెనుండి ఏ శరీరసుఖం కోరకుండా సంసారం నిర్వహించు. 

బంగారమ్మ తన చర్మం ఒలిచి నాకు చెప్పులు కుట్టి ఇస్తాను అన్నది. నేను సరే అన్నాను. గోమాత మరణించి ఆ చర్మంతో నాకు చెప్పులు కుట్టడం జరిగింది, గోమాతలోని చైతన్యం కూడా ఆమెదే కాబట్టి ఆమె అన్న మాట నిజమై నట్లేకదా!” అని చెప్పి గోష్ఠికి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి “మీ ఆంతర్యం నాకు తెలుసు, మమ్మల్ని కులంనుండి వెలి వేయాలని మీ సంకల్పం. 

మీరు నన్ను ఏమి చేయగలరు? నేనే ఈ వేదాంతశర్మని కులబహి ష్కృతుని చేస్తున్నాను. నీవు ఈనాటి నుండి బంగారయ్యగా వ్యవహరించెదవు గాక!.” అని తమ తీర్మానం వ్యక్తం చేసారు. అందరు చూస్తుండగానే ఒక జ్యోతి స్వరూపం నాలో కలిసి పోయింది. 

అపుడు వారు, “మీ కళ్ళ ఎదుటే బంగారయ్య ఆత్మజ్యోతి ఈ శర్మలో కలిసి పోయింది. ఇప్పుడు ఇతడు బ్రాహ్మణుడా? చండాలుడా? మీరే నిర్ణయించండి,” అని ప్రశ్నించి వారిని ధర్మసంకటంలో పడవేసి ఇంకా ఇలా చెప్పారు:

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 208 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 21
🌴 Dandiswami comes to Kukkuteswara Temple Sadaka should have purity of place and purity of ‘bhava’ 🌴

🌻 Insult to Dandi Swami - 1 🌻

On the same day when we went, one Dandi Swami came there with 108 disciples.  

It was our habit to pay obeisance to their feet whenever we came across ‘Mahatmas’. When we saluted to Dandiswami, he lost his speech immediately.  

We prayed ‘Sripada Srivallabha! Maha Prabhu! Please restore his speech.’ Immediately Dandi Swami got back his speech.  

After knowing that we were devotees of Sripada, they talked with false logic. “The person by name Sripada is a ‘kshudra’ mantrik. Being his disciples, you are also ‘kshudra’ mantriks.  

Eventhough, you made him speechless with your ‘kshudra vidya’, our Swami has got back his speech again because he is a powerful person. Our great Swami will come to Peethikapuram and expose your Sripada.  

He will make Sripada bite dust and get the victory certificate. The people of Peethikapuram will highly honour our Swami.” We could not say anything. 

 In the process of His ‘leela’, Sripada will put his followers into troubles and when they pray, He will protect them in a wonderful manner. He is the one who creates the problem. He is the one who shows the remedy and gives support. 

These types of leelas are very familiar to all Datta devotees. After a few days, Dandi Swami came to Peethikapuram. Fortunately I also came to Peethikapuram on the way at the same time. 

There was no dearth of people in Peethikapuram who had hatred towards Sri Bapanarya, Sri Appala Raju Sharma and Sripada. Dandi Swami had darshan of Gods and Goddess in Kukkuteswara temple. They also had darshan of Swayambhu Datta.  

Dandi Swami said, “The power in this Swayambhu Datta is great. Swayambhu Datta has taken me as a tool to control the ego of Sripada who boasts himself as His avathar.  

Good days have started for Peethikapuram from today. You be without worry.” Saying so, he created vibhudi and kumkum with the power of his ‘will’, and gave them to his supporters.  

The Brahmins of Peethikapuram went to Kukkuteswara temple to welcome Dandi Swami with ‘Veda ghosha’ (chanting Veda mantras) into Peethikapuram. It was announced through out the village, ‘Sripada who says he is the avathar of Datta should realize his mistake and prostrate before Dandi Swami. Bapanarya should come in person before Dandi Swami and express his regret.  

Appala Raju Sharma should come before Dandi Swami and surrender the idol of Kalagni Shamana Datta to him and be ready for the punishment given by Swami.’

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 88 🌹* 
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 4* 🌻

మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు. 

ఉదయం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు సాయంత్రం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు అనుష్ఠానం చేసికొంటూ ఉండండి. (అని నియమం) ఈ సంస్థ యువకులలోంచి బయలు దేరి ఇన్ని దేశాలలోను స్థాపింపబడినది. 

ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలోనే కాక ఫ్రాన్స్, బెల్జియం, హాలండ్, స్విట్లర్లాండ్, వెస్ట్ జర్మనీ, స్కాండినేవియన్ దేశాలలో అనగా డెన్మార్క్ మొదలయిన దేశాలలో కూడా ఉన్నది. ఈ దేశాలన్నింటిలోను స్థానికమైన కాలమానం ప్రకారం ఉదయం, సాయంకాలం 6.00 గంటలకు ప్రార్థన చేసికొంటున్నారు. 

ఈ ప్రార్థన చేసికొనేటప్పుడు కూర్చున్న తరువాత ముందు 'ఓంకారము' మూడు పర్యాయములు చేసి తరువాత గురుస్తోత్రం చేసికోవాలి. 

తరువాత గాయత్రీ మంత్రం పదిమారులు సస్వరంగా కంఠమెత్తి ముక్తకంఠంగా ఉచ్చారణ చేసికొనవలసినది. అది అయిన తరువాత గురుశిష్య సంబంధాన్ని స్థాపించు "శంనో మిత్రః శంవరుణః" అను మంత్రమును ఉచ్చరించవలెను. 

తరువాత జ్వాలాకూల మహర్షి యావత్ర్పపంచమునకు బ్రహ్మ విద్యా సమన్వయం చేయటం కోసం, ఒక సుప్రభాతం (Invocation) అనునది ఇచ్చారు. ఆ Invocation‌ ని ఉదయం పూట చేసికొనవలసినది. తరువాత నేను ఒక Invocation ఇచ్చాను. వీటిని ఇన్ని దేశాల వారు ఒక Standard క్రింద పెట్టుకున్నారు. 

దీనిని అనుష్ఠానం చేసికొనునపుడు ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొనవలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు.
.......✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 110 🌹*
*🌴 Meditation for the Aquarian AGE - 1 🌴* 
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Our Original Identity - 1 🌻

All forms are manifestations of the One Life, the One Truth, the original state of pure existence. 

Periodically the awareness emerges from this eternal existence, and subsequently we experience: “I AM”. 

This happens with us every morning. It is not our decision to wake up: Like a wave from the ocean we emerge from the existence into awareness and awake. 

Then thoughts are coming and we begin with our daily activity. Where comes the “I Am” from? Where do the thoughts emerge from? Anything we think, even about ourselves, isn’t really ourselves. We don’t give thoughts a permission to come. 

They come as soon as we wake up, even if we don’t want them. We can observe our thoughts, but we cannot get a grip on them. The fundamental meditation is to source the thoughts and to trace: “Who am I?”

Thus we recall our original identity: that we are neither the thoughts nor the emotions nor the body, but that we exist as souls having emerged from the one Truth and belonging to it. 

We have taken to a name and a form, we belong to a race and a nationality and through the five senses we enter into the outer world.

The many kinds of prayers, rituals, exercises and meditations are nothing but means to conjoin with the one consciousness and to keep the fundamental truth in mind. 

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K. P. Kumar: The Aquarian Master / seminar notes.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 72 🌹*
*🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻* 
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

తస్యాఙ్కభువి నిషణ్ణాం
తరుణ కదమ్బ ప్రసూన కిరణాభామ్ I
శీతాంశు ఖణ్డ చూడాం
సీమన్త న్యస్త సాన్ద్ర సిన్దూరామ్ II 161 II

కుఙ్కుమ లలామ భాస్వ
న్నిటలాం కుటిలతర ఝిల్లికా యుగళామ్ I
నాళీక సదృశ నయనాం
నాసాఞ్చల కలిత మౌక్తికాభరణామ్ II 162 II

అఙ్కురిత మన్దహాసా
మరుణాధర కాన్తి విజిత బిమ్బాభామ్ I
కస్తూరీ మకరీయుత
కపోల సఙ్క్రాన్త కనక తాటఙ్కామ్ II 163 II

కర్పూర సాన్ద్రవీటీ
కబళిత వదనారవిన్ద సౌరభ్యామ్ I
కమ్బు సహోదర కణ్ఠ
ప్రలమ్బమానాచ్ఛ మౌక్తిక కలాపామ్ II 164 II

కహ్లార దామ కోమల
భుజ యుగళ స్ఫురిత రత్న కేయూరామ్ I
కరపద్మ మూల విలసత్
కాఞ్చనమయ కటకవలయ సన్దోహామ్ II 165 II

పాణి చతుష్టయ విలసత్
పాశాఙ్కుశ పుణ్డ్ర చాప పుష్పాస్త్రామ్ I
కూలఙ్కష కుచ శిఖరాం
కుఙ్కుమ కర్దమిత రత్న కూర్పాసామ్ II 166 II

అణు దాయాద వలగ్నా
మమ్బుద శోభా సనాభి రోమలతామ్ I
మాణిక్య ఖచిత కాఞ్చీ
మరీచికాక్రాన్త మాంసల నితమ్బామ్ II 167 II

కరభోరు కాణ్డ యుగళాం
జంఘాజిత కామ జైత్ర తూణీరామ్ I
ప్రపద పరిభూత కూర్మాం
హల్లక సచ్ఛాయ పాదతల మనోజ్ఞామ్ II 168 II

కమలభవ-కఞ్జలోచన-
కిరీట రత్నాంశు రఞ్జితపదాబ్జామ్ I
ఉన్మత్తకానుకమ్పా
ముత్తరళాపాఙ్గ పోషితానఙ్గామ్ II 169 II

ఆదిమరసావలమ్బా
మనిదం ప్రథమోక్తి వల్లరీ కలికామ్ I
ఆబ్రహ్మ కీట జననీ
మన్తః కలయామి సున్దరీ మనిశమ్ II 170 II

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత - 1 🌹* 
 *శ్లోకము - భావము* 
📚. ప్రసాద్ భరద్వాజ 

01. సర్వ భూతాన్తరస్థాయ
నిత్యముక్త చిదాత్మనే
ప్రత్యక్చైతన్య రూపాయ
మహ్యమేవ నమోనమః ll 

భావము: 
సర్వ భూతముల యందు వసించు వాడును, సదా ముక్తుడును, చిదాత్మ రూపుడును, ప్రత్యక్‌ చైతన్య రూపుడును, నాకు వేరు గాని వాడును అగు పరమాత్మకు నమస్కారము.

02. జీవన్ముక్తి శ్చయా ముక్తిః
సాముక్తిః పిండ పాతనే
యాముక్తిః పిండ పాతనే
సాముక్తిః శుని సూకరే ll 

భావము: 
జీవించి యుండగనే ముక్తిని బొందుటను ‘జీవన్ముక్తి’ యందురు. ముక్తి యననుది దేహ పతనముతో కలుగునన్నచో, మరి అట్టి ముక్తి దేహపతనము జరుగు కుక్కలకు, పందులకు కలుగుచున్నది గదా!

03. జీవః శివః సర్వమేవ
భూతేష్వేవం వ్యవస్థితః
ఏవమేవాభి పశ్యన్హి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము:      
జీవుడే శివుడు. సమస్త భూతముల యందు శివుడే వ్యవస్థితుడై యున్నాడు.
ఈ విధముగా ఎవడు సత్యమును గాంచుచున్నాడో వాడే ‘జీవన్ముక్తుడు’ అని చెప్పబడు చున్నాడు.

04. ఏవం బ్రహ్మ జగత్సర్వమ్‌
అఖిలం భాసతే రవిః
సంస్థితం సర్వభూతానామ్‌
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
సూర్యుడు సమస్త విశ్వమును ప్రకాశింప జేయునట్లు, సర్వ భూతాంతరాత్ముడు అయిన బ్రహ్మము జగత్తునంతటిని ప్రభావిత మొనర్చుచున్నాడు. దీనిని గ్రహించిన దివ్యాత్ముడే ‘జీవన్ముక్తుడు’ అని చెప్పబడుచున్నాడు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నారద భక్తి సూత్రాలు - 28 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 16

 *🌻 16. పూజాదిష్వనురాగ ఇతిపారాశర్యః - 2 🌻* 

హృదయమే లేని పూజనాచరించుట కన్న
 మానివేయుట కడునుత్తమంబు సుమ్ము -మెహెర్‌ బాబా

            హృదయ పూర్వక భక్తి భగవంతుని మీదనే కాకుండా భాగవతోత్త ముల మీదను, ఆచార్యుల మీదను కూడా ఉంటుంది. భక్తుని భావన దాసానుదాసుడుగా ఉంటుంది. అతడు నమ్రత, అణకువ, విధేయత, అర్పణ భావాలు కలిగి ఉంటాడు. 

అతడిలో ‘‘నేను’’ అనేది చచ్చిపోయేటంతటగా తగ్గి ఉంటుంది. అప్పుడే అతడు భగవదనుగ్రహం పొందుతాడు. భగవంతునితో నిరంతర సాన్నిధ్యాన్ని అనుభవిస్తాడు. మైమరచి, పరవశించి ఉంటాడు.

            ఈ చెప్పినదంతా భక్తి సాధనలో భాగమే. అయితే భవత్సాక్షాత్కారం కలిగిన తరువాత కూడా పూజాదికాలు జరిపే పరాభక్తులు కూడా ఉంటారు. నిజానికి వారికవి అవసరం లేవు. 

అయినా ఇతరులు ఆ విధంగా సాధన చేయాలని చేస్తూ ఉంటారు. వారిలో ఇలా చేయాలని ఒక ప్రేరణ ఉంటుంది. వారిలో లోకాన్ని పట్టించుకునే ఆలోచన ఉండదు. 

కాని ఈ విధమైన ప్రేరణలు సాధకులకు మార్గదర్శకంగా ఉండటానికి పనికి వస్తాయి. ఇట్టి దైవీ ప్రేరణ వలన భగవంతునికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. 

ఉత్సవ ఊరేగింపులు, ఏకాహం, సప్తాహం వంటివి దేవాలయ పునర్నిర్మాణాలు, అన్న సంతర్పణలు, దీనజన సేవ, ఇవన్నీ నారాయణసేవగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి పరాభక్తుని విషయంలో పూజాదికాలే అవుతాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 59 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 59 🌹* 
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

  *🌸. దమ్మిడి చక్కెర 🌸* 

      ప్రభువు భక్తుల కోరికలు తీర్చి, భక్తులు మొక్కుకున్న మొక్కులు తీర్చడం కోసం ఎదురు చూస్తారని అందరికీ తెలిసింది. ఆ కాలంలో కొందరు ప్రభువు వద్దకు వెళ్లే భక్తులను అపహాస్యం చేసేవారు. 

అలా హుమానాబాదులో ఒక గృహస్థు ఉండేవాడు. అతను స్వయంగా ఎప్పుడూ ప్రభువు వద్దకు రాలేదు. కానీ ఎవరైనా ఇతరులు ప్రభు వద్దకు వెళ్తుంటే అపహాస్యం చేసేవాడు.

    ఒకసారి ఆ గృహస్థు చెప్పులు పోయాయి. అవి క్రొత్తవి కావడం వలన అతనికి బాధ కలిగింది. అప్పుడు అతనికి, జనం ఆపద సమయంలో ప్రభువును స్మరిస్తూ మొక్కుకుంటారని గుర్తుకు వచ్చింది.  

చెప్పులు నాకు ఇప్పటికిప్పుడే దొరికితే నేను ఒక దమ్మిడీ చక్కెర సమర్పిస్తాను అని ప్రభువుకి మొక్కుకున్నాడు. అనుకోకుండా అదేరోజు చెప్పులు దొరికాయి. 

తాను ప్రభువుకి ఒక దమ్మిడీ చక్కెర మొక్కుకున్నందుకు అతనికి సిగ్గుగా అనిపించి, నాలుగు అణాలకు చక్కెర తీసుకొని ప్రభువు దర్శనానికి బయలుదేరాడు.

    ఎప్పటిలాగే ప్రభు దర్బార్ లో రద్దీ ఉండెను. అంత రద్దీలోనుంచి దారి చేసుకొని ప్రభు ముందుకు వెళ్లి తన దగ్గర ఉన్న చక్కెర పొట్లం ప్రభు ముందు పెట్టి నమస్కారం చేయగానే, ప్రభు తన శిష్యులలో ఒకరిని తక్కెడ తీసుకురమ్మన్నారు. 

వారు తక్కెడ తీసుకొని రాగానే ప్రభు గృహస్థునితో మీరు తెచ్చిన చక్కెరలో ఒక దమ్మిడి చక్కెర మాత్రమే నాది. అంత మాత్రమే తీసి నా పంచలో వేయండి. మిగతాది నాకెందుకు? అనగానే అతని శరీరం చల్లబడి, అవాక్కయ్యాడు. నమస్కారం చేసి ప్రభువుని క్షమించమని అడిగాడు.

   అప్పుడు ప్రభు ఇలా అన్నారు. అరే బాబా! దేవుడిని పరీక్షించవద్దు. దమ్మిడి చక్కెర కోసం ప్రభువుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆలోచించు. 

గృహస్థునికి ప్రభువు ఆంతర్యం ప్రత్యక్షంగా కనిపిస్తుండగా అతను ప్రభు ముందు సాష్టాంగ దండప్రమాణం చేసి ఇక ఎప్పుడూ ఇలాంటి అపరాధం చేయను, నన్ను క్షమించండి అని విన్నవించుకున్నాడు. ప్రభువుకి దయ కలిగి క్షమించారు. తరువాత ఆ గృహస్థు ప్రభువుకు ప్రియమైన భక్తుడు అయ్యాడు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 59 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 15. Shri Siddharaj Manik Prabhu (1939 – 2009) - 5 🌻

One often felt like asking him the question which King Yadu asked Shri Dattatreya.  

“Remaining inactive, as it were, whence did you acquire this vast wisdom, even after which, you move like an innocent child? Generally men strive for spiritual merit, riches or enlightenment or for long life, renown or good fortune.  

You, yourself, are of able body, learned, skilful, handsome and soft spoken. You do nothing, covet nothing and behave like a simpleton, lunatic, or a devil.  

In the midst of people burning with the fire of greed and desire, you remain unscathed like a Lord of the Elephants standing in the waters of Ganges.  

Tell me, who is enquiring thus, the reason of the joy abiding in your mind, even though you are living alone and devoid of enjoyment” (Bhagavat Purana XI.7.26-30). 

No one possibly asked this question to Shreeji. None, in fact, needed to ask. Blessed are those who got an opportunity to interact with Shri Siddharaj Manik Prabhu. None can surely describe the taste of honey who have not, in the first instance, tasted it.  

We may, therefore, with the seer of Brihad Aranyak Upanishad speak, “Let a wise Brahman after knowing him alone, practise the wisdom (spoken by him). Let him not reflect on many words, for that, verily is mere weariness of speech” (IV.4.21). 

Shreeji’s more than five-decade-long efforts of developing of Shri Manik Prabhu Samsthan not only as a spiritual organisation but also as a social institution committed to the cause of wider societal development, bore fruits of success and thus Maniknagar was transformed from a sleepy little hamlet into a throbbing centre of social, educational and cultural activities. 

After successfully heading the Samsthan for more than six decades, after bringing material and spiritual happiness and a sense of purpose into the lives of thousands of his devotees, after spreading Shri Prabhu’s divine message of love and equality into every nook and corner of the country, after bringing Maniknagar on the forefront of the spiritual social and educational map of India, Shreeji attained MahaSamadhi on the 6th of October 2009.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సౌందర్య లహరి - 35 / Soundarya Lahari - 35 🌹* 
📚. ప్రసాద్ భరద్వాజ 

35 వ శ్లోకము

 *🌴. కుండలినీ జాగృతి, క్షయ వ్యాధి హరించుకు పోవుటకు, 🌴* 

శ్లో:35. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారది రసి 
త్వమాపస్త్యం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరంl 
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా 
చిదానందాకారం శివ యువతి భావేన బిభృషేll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! ఆజ్ఞా చక్రమునందు గల మనస్తత్వమును, విశుద్ధి చక్రమునందు ఉన్న ఆకాశతత్వము, అనాహత చక్రమునందు ఉన్న వాయు తత్వము నీవే కదా. స్వాదిస్థాన చక్ర ముందున్న అగ్ని తత్వము, మణిపూరక చక్రమందలి జలతత్వము, మూలాధార చక్రమునందున్న పృధ్వీ తత్వము కూడా నీవే. నీకన్నా వేరైనది ఏదియూ లేదు కదా. నీవే నీ స్వరూపమును జగత్తు యొక్క రూపముగా పరిణమింప జేయుటకు చిదానందాకారమయిన శివ తత్వమును ధరించుచున్నావు కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, చక్కెర, పాయసం నివేదించినచో కుండలినీ శక్తి జాగరణ, క్షయ వ్యాధి నివారణ జరుగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 35 🌹 
📚 Prasad Bharadwaj 

SLOKA -35 🌹

🌴 Kundalini Raising and Curing of Tuberculosis 🌴

35. Manas tvam vyoma tvam marud asi marut saarathir asi Tvam aastvam bhoomis tvayi parinathayam na hi param; Tvam eva svatmanam parinamayithum visva-vapusha Chidanand'aakaram Shiva-yuvati-bhaavena bibhrushe.

🌻 Translation :
Mind you are, ether you are, air you are, fire you are, water you are, earth you are, and you are the universe, mother, there is nothing except you in the world, but to make believe your form as the universe, you take the role of wife of Shiva, and appear before us in the form of ethereal happiness.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :   

If one chants this verse 1000 times each day for 45 days, offering, honey, sugar and payasam as prasadam, it is said that a raise in Kundalini and one would be able to overcome tuberculosis.

🌻 BENEFICIAL RESULTS:
Cure of asthma, tuberculosis and other lung troubles; vision of Shiva and Devi in dreams. 
 
🌻 Literal results:
Single women finding mates, all elemental problems in the body getting cured. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 334 / Bhagavad-Gita - 334 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 15 🌴

15. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ||

🌷. తాత్పర్యం :
జ్ఞానసముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివధరుపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.

🌷. భాష్యము : 
పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము. సంపూర్ణ భక్తిభావనలో నిలిచి తనను తప్ప అన్యమును తెలియనివారు మహాత్ములని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపియున్నాడు. అట్టి మహాత్ముల స్థాయికి చెందకున్నను శ్రీకృష్ణునే పలువిధములుగా పూజించువారు కొందరు గలరు. 

వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానసముపార్జన యందు నియుక్తులైనవారుగా ఇదివరకే వర్ణింపబడినారు. 

వీరికన్నను తక్కువస్థాయిలో గల ఇతరులు తిరిగి మూడు రకములుగా విభజింపబడిరి. 

అందులో మొదటిరకమువారు ఆత్మనే భగవానుని తలచి తమను తాము అర్చించుకొందురు. 

రెండవరకమువారు భగవానునికి ఏదో తోచినరూపము ఆపాదించి దానిని అర్చింతురు. 

మూడవ రకము వారు చెందినవారు విశ్వమును భగవానునిగా భావించి పూజింతురు. 

ఈ మూడురకములలో తమను అద్వైతులుగా భావించుచు తమను తామే భగవానుని రూపమున అర్చించువారు అధికముగా నుందురు. వారు అధములు. 

అట్టివారు తమనే భగవానుని భావించుచు అదే భావనలో తమను తాము పూజించుకొందురు. ఇదియును ఒక విధమైన భగవదర్చనమే. 

ఏలయన అట్లు చేయువారు తాము దేహాదులము కామనియు, కేవలము ఆత్మస్వరూపలమేననియు సంపూర్ణముగా తెలిసియుందురు. కనీసము వారి యందు అట్టి భావనము ప్రబలముగా నుండును. 

సాధారణగా నిరాకారవాదులు దేవదేవుని ఈ రీతిగనే అర్చింతురు. ఈ రూపమైనను భగవానుని రూపమే అనెడి భావనలో ఇతర దేవతార్చనము చేయువారు రెండవ తరగతికి చెందినవారు. 

ఇక మూడవతరగతికి చెందినవారు విశ్వమును తప్ప అన్యమును ఊహింపలేక విశ్వమునే దివ్యముగా భావించి దానిని అర్చింతురు. 

అట్టి విశ్వము కూడా శ్రీకృష్ణభగవానుని రూపమే అయియున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 334 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 15 🌴

15. jñāna-yajñena cāpy anye
yajanto mām upāsate
ekatvena pṛthaktvena
bahudhā viśvato-mukham

🌷 Translation : 
Others, who engage in sacrifice by the cultivation of knowledge, worship the Supreme Lord as the one without a second, as diverse in many, and in the universal form.

🌹 Purport :
This verse is the summary of the previous verses. 

The Lord tells Arjuna that those who are purely in Kṛṣṇa consciousness and do not know anything other than Kṛṣṇa are called mahātmā; yet there are other persons who are not exactly in the position of mahātmā but who worship Kṛṣṇa also, in different ways. 

Some of them have already been described as the distressed, the financially destitute, the inquisitive, and those who are engaged in the cultivation of knowledge. But there are others who are still lower, and these are divided into three: 

(1) he who worships himself as one with the Supreme Lord, 

(2) he who concocts some form of the Supreme Lord and worships that, and 

(3) he who accepts the universal form, the viśva-rūpa of the Supreme Personality of Godhead, and worships that. 

Out of the above three, the lowest, those who worship themselves as the Supreme Lord, thinking themselves to be monists, are most predominant. Such people think themselves to be the Supreme Lord, and in this mentality they worship themselves. 

This is also a type of God worship, for they can understand that they are not the material body but are actually spiritual soul; at least, such a sense is prominent. Generally the impersonalists worship the Supreme Lord in this way. 

The second class includes the worshipers of the demigods, those who by imagination consider any form to be the form of the Supreme Lord. 

And the third class includes those who cannot conceive of anything beyond the manifestation of this material universe. 

They consider the universe to be the supreme organism or entity and worship that. The universe is also a form of the Lord.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 164 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
38. అధ్యాయము - 13

*🌻. శివపూజ - 4 🌻*

కర్తవ్యం సర్వథా తత్ర నియమాస్స్వగృహే స్థితైః | ప్రాణ ప్రతిష్ఠాం కుర్వీత భూతశుద్ధిం విధాయ చ || 36

దిక్పాలాన్పూజయోత్తత్ర స్థాపయిత్వా శివాలయే | గృహే శివస్సదా పూజ్యో మూలమంత్రాభియోగతః || 37

తత్ర తు ద్వారపాలానాం నియమో నాస్తి సర్వథా | గృహే లింగం చ యత్పూజ్యం తస్మిన్‌ సర్వం ప్రతిష్ఠితమ్‌ || 38

పూజాకాలే చ సాంగం వై పరివారేణ సంయుతమ్‌ | ఆవాహ్య పూజయేద్దేవం నియమోsత్ర న విద్యతే || 39

లింగసన్నిధిలో నియమములనన్నిటినీ తన గృహమునందు లభ్యమయ్యే పదార్థములతో ఆచరించవలెను. భూత శుద్ధిని చేసి ప్రాణ ప్రతిష్ఠను చేయవలెను (36). 

శివాలయమునందు దిక్పాలకులను స్థాపించి పూజించవలెను. గృహమునందు శివుని నిత్యము మూలమంత్రముతో నారాధించవలెను (37). 

గృహమునందు ద్వారపాలకులను ప్రతిష్ఠించవలెననే నియమము లేదు. గృహమునందు పూజింపబడే లింగమునందు సర్వము ప్రతిష్ఠితమై యున్నది (38). 

పూజాకాలమునందు శివుని సాంగముగా సపరివారముగా ఆవాహన చేసి పూజించవలెను. ఇంతకు మించి నియమము ఏదియూ లేదు (39).

శివస్య సన్నిధిం కృత్వా స్వాసనం పరికల్పయేత్‌ | ఉదజ్ఞ్మఖస్తదా స్థిత్వా పునరాచమనం చరేత్‌ || 40

ప్రక్షాల్య హస్తౌ పశ్చాద్వై ప్రాణాయామం ప్రకల్పయేత్‌ | మూలమంత్రేణ తత్రైవ దశావర్తం నయేన్నరః || 41

పంచముద్రాః ప్రకర్తవ్యః పూజావశ్యం కరేప్సితాః | ఏతా ముద్రాః ప్రదర్శ్యైవ చరేత్పూజావిధిం నరః || 42

దీపం కృత్వా తదా తత్ర నమస్కారం గురోరథ | బద్ధ్వా పద్మాసనం తత్ర భద్రాసనమథాపి వా || 43

ఉత్తానాసనకం కృత్వా పర్యంకాసనకం తథా | యథాసుఖం తథా స్థిత్వా ప్రయోగం పునరేవ చ || 44

భక్తుడు శివుని సన్నిధిలో ఆసనమును ఏర్పాటు చేసుకొని ఉత్తరదిక్కుగా నిలబడి మరల ఆచమనమును చేయవలెను (40). 

తరువాత చేతులను కడుగుకొని భక్తుడు శివసన్నిధిలో కూర్చుండి మూలమంత్రముతో పదిసార్లు ప్రాణాయామమును చేయవలెను (41). 

పూజ సార్థకమగుటకై అయిది ముద్రలను ప్రదర్శించవలెను. భక్తుడు ఈ ముద్రలను ప్రదర్శించిన తరువాతనే పూజా విధిని అనిష్ఠించవలెను (42). 

తరువాత అచట దీపమును వెలిగించి, గురువునకు నమస్కరించి పద్మాసనమును గాని, లేక భద్రాసనమును గాని (43), 

ఉత్తానాసనమును గాని, పర్యంకాసనమును గాని వేసి, సుఖముగా ఆసనమునందుండి, పూజా విధిని అనుష్ఠించవలెను (44).

కృత్వా పూజాం పురాజాతాం వట్టకేనైవ తారయేత్‌ | యది వా స్వయమేవేహ గృహేన నియమోsస్తి చ || 45

పశ్చాచ్చైవార్ఘ్య పాత్రేణ క్షారయే ల్లింగముత్తమమ్‌ |అనన్యమానసో భూత్వా పూజాద్రవ్యం నిధాయ చ || 46

పశ్చాచ్చావాహయేద్దేవం మంత్రేణానేన వై నరః |

స్వయంభులింగమును పానువట్టముతో సహా పూజించిన వ్యక్తి ముక్తిని పొందును. ఇట్టి లింగమును పానువట్టము లేకుండగనైననూ పూజించవచ్చును. ఇంటిలో చేయు ఆరాధనకు ఈ విషయములో నియమము లేదు (45). 

తరువాత అర్ఘ్యపాత్రతో ఉత్తమమగు ఆ శివలింగమును క్షాళన చేయవలెను. మనస్సును ఇటునటు మరలనీయకుండా, పూజాద్రవ్యములను సిద్ధము చేసుకొని (46) 

భక్తుడు ఈ మంత్రముతో శివుని ఆవాహన చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. VEDA UPANISHAD SUKTHAM - 51 🌹* 
 *🌻 1. Annapurna Upanishad - 12 🌻* 
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

IV-11. Those indeed who have known what is to be known and shed all attachments, whose intellect is great, the knots of whose hearts have been cut, are free, though living in the body. 

IV-12. Dead is his mind who is unmoved in joy and sorrow, and whom nothing jerks out of equality, even as breaths stir not a mighty mountain. 

IV-13. Dead is the mind of one who is undisturbed by danger, resourcelessness, energy, hilarity, dullness, or great rejoicing.

 IV-14. The destruction of mind is twofold, determinate and indeterminate. In (the state of) liberation in life it is determinate; in that of disembodied liberation it is indeterminate. 

IV-15. The presence of mind makes for sorrow; its destruction promotes joy. Attenuate the existent mind and bring about its destruction. 

IV-16. The nature of mind, know, is folly, O sinless one! When that perishes one's real essence, mindlessness, is (won). 

IV-17. The mind of one liberated in life, having qualities like friendliness, etc., is rich in noble impulses; it is never reborn. 

IV-18. This 'destruction' of the Jivanmukta's mind is determinate; Nidagha, with disembodied liberation comes indeterminate destruction. 

IV-19. One liberated in disembodiment is he who realizes the partless Self; his mind, the abode of all excellent qualities as it was, is dissolved. 

IV-20-21. In that supremely holy, blemishless status of disembodied liberation, marked by 'mindlessness', in that state of indeterminate destruction of the mind, just nothing remains, neither qualities nor their absence; neither glory nor its absence; nothing (whatsoever) of the world;

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 36 🌹* 
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 15
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. పాండవ చరిత వర్ణనము - 1 🌻* 

అథ పాణ్డవ చరిత వర్ణనమ్‌.

అగ్నిరువాచ :

యుధిష్ఠరే తు రాజ్యస్థే ఆశ్రమాదాశ్రమాన్తరమ్‌ | ధృతరాష్ట్రో వనమగాద్గాన్ధారీ చ పృథా ద్విజత 1

అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదురస్త్వగ్ని నా దగ్ధో వనజేన దివం గతః | ఏవం విష్ణుర్భువో భారమహరద్ధానవాదికమ్‌. 2

ధర్మాయాధర్మానాశాయ నిమిత్తీకృత్య పాణ్డవాన్‌ | స విప్రశాపవ్యాజేన ముసలేనాహనత్కులమ్‌. 3

యాదవానాం భారకరమ్‌-

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.

వజ్రం రాజ్యే7భిషేచయత్‌ | దేవాదేశాత్ర్పభాసే స దేహం త్యక్త్వా స్వయం హరిః 4

ఇన్ద్రలోకే బ్రహ్మలోకే పూజ్యతే స్వర్గవాసిభిః | బలభద్రో7నన్తమూర్తిః పాతాల స్వర్గమీయివాన్‌. 5

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.

అవినాశీ హరిర్దేవో ధ్యానిభిర్ధ్యేయ ఏవ సః | వినా తం ద్వారకాస్థానం ప్లావయామాస సాగరః. 6

వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.

సంస్కృత్య యాదవాన్‌ పార్థో దత్తోదకధనాదికః | స్త్రియో7ష్టావక్రశాపేన భార్యా విష్ణోశ్చ యాః స్థితాః. 7

పునస్తచ్ఛాపతో నీతా గోపాలైర్లగుడాయుధై ః | అర్జునం హి తిరస్కృత్య పార్థః శోకం చకార హ. 8

వ్యాసేనాశ్వాసితో మేనే బలిం మే కృష్ణసన్నిధౌ య | హస్తినాపురమాగత్య పార్థః సర్వం న్యవేదయత్‌. 9

యుధిష్టిరాయ స భ్రాత్రే పాలకాయ నృణాం తదా |

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను. 

అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను. 

వ్యాసు డాతనిని ఊరడించెను. కృష్ణుడున్నప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 41 🌹* 
Chapter 13
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

 *🌻 Yogayoga sanskaras are released through Universal Mind - 1 🌻* 

 A virus can penetrate through thick stone walls, and a virus can travel at the speed of three miles per second, or ten thousand, eight hundred miles per hour.  

A virus germ is a thousand times thicker than any sanskara, and therefore it is not impossible for the sanskaras to penetrate through rocks or stones. 

But this e xample of speed and fineness of sanskaric matter has only to do with physical matter and the physical body.  

To understand the release of yogayoga sanskaras and how one's own sanskaric nature receives these sanskaras of the Avatar, one must understand the n ature of the universal mind.

The universal mind is infinite, indivisible and eternal. It is the mind of the First Soul, who is one with all souls.  

Therefore all animate and inanimate beings in creation have within each of them the same universal mind . The universal mind is the shadow of the Infinite Mind of the INFINITE CONSCIOUSNESS.  

Every individual mind is therefore the shadow of the shadow of the universal mind, and when the Avatar releases his yogayoga sanskaras every individual mind is affected. 

The releasing of the divine free impressions means that the divine free impressions of his universal work have been activated. 

And because of this activation in the universal mind, action and reaction take place in the mind of each individual being, wheth er animate or inanimate.  

The greatest action and reaction is in the human mind because the human mind is fully developed mind, nevertheless, though the mind is not very developed in the inanimate forms of evolution, it is there.  

And so when the Avatar rele ases his yogayoga sanskaras even a stone or rock is affected, because these sanskaras penetrate to that state of mind.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 50 🌹* 
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻. గౌతమమహర్షి - అహల్య - 3 🌻* 

15. యజ్ఞపురుషుడి యొక్క స్వభావము ఒకటి ఉంది, అతడి స్వరూపము ఉంది. తేజస్వంతమయిన శరీరం ఉంటుంది. తేజస్వంతం, వర్చస్వంతం. తేజస్సంటే బయటికి కనబడేటటువంటిది-ప్రభవలె కనబడేటటువంటిది. వర్చస్సు అంటే అతడి లోపలనుంచి కనబడేది. 

16. ఒకతెర వెనుకాల దీపం ఉంటే కనబడేటటువంటిదానిని వర్చస్సు అనవచ్చు. తేజస్సు, వర్చస్సు ఆ దివ్యపురుషుడియందుంటాయి. 

17. ఎవరిని మనం దృష్టిలోపెట్టుకొని ఆవాహనచేస్తున్నామో అతడి దర్శనం మన అంతఃకరణలో క్రమంగారావాలి. భావనగా అంతర్గతంగా ఒక వస్తువును మనం ఆరాధిస్తున్నాము. 

18. అది చక్కగా ప్రవర్ధమానమై మనకు ఒకనాడు కనబడుతోన్నది. ఈ భావనతోచేస్తే మనం మన ఉపాసనకు ఫలం పొందవచ్చు. 

19. అలా కనుక యజ్ఞం చేసినట్లయితే, అందరికీకూడా వ్యక్తిగతంగా ఉండేటటువంటి కష్టాలు, బాధలు, గ్రహదోషాలు అవీ నిర్మూలించబడుతాయి.

సశేషం....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 26 / Sri Lalita Sahasranamavali - Meaning - 26 🌹* 
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻. శ్లోకం 56* 

226. మహాతంత్రా - 
గొప్పదైన తంత్ర స్వరూపిణి.

227. మహామంత్రా - 
గొప్పదైన మంత్ర స్వరూపిణి.

228. మహాయంత్రా - 
గొప్పదైన యంత్ర స్వరూపిణి.

229. మహాసనా - 
గొప్పదైన ఆసనము గలది.

230. మహాయాగ క్రమారాధ్యా - 
గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది.

231. మహాభైరవ పూజితా - 
ఆదిత్య మండలంలో మధ్యనవుండే మహాభైరవుడు (నారాయణుడు) చేత పూజింపబడింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 *🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 26 🌹* 
📚. Prasad Bharadwaj 
 
*🌻 Sahasra Namavali - 26 🌻* 

226 ) Mahathanthra -   
She who has the greatest Thantra sasthras

227 ) Mahamanthra -   
She who has the greatest manthras

228 ) Mahayanthra -  
 She who has the greatest yanthras

229 ) Mahasana -   
She who has the greatest seat

230 ) Maha yaga kramaradhya -   
She who should be worshipped by performing great sacrifices( Bhavana yaga and Chidagni Kunda yaga)

231 ) Maha bhairava poojitha -
She who is being worshipped by the great Bhairava

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 116 🌹* 
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

Whatever name you give it: will, or steady purpose, or one-pointedness of mind, you come back to earnestness, sincerity, honesty. 

When you are in dead earnest, you bend every incident, every second of your life to your purpose. 

You do not waste time and energy on other things. You are totally dedicated, call it will, or love, or plain honesty. 

We are complex beings, at war within and without. We contradict ourselves all the time, undoing today the work of yesterday. 

No wonder we are stuck. A little of integrity would make a lot of difference.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మనోశక్తి - Mind Power - 54 🌹* 
 *Know Your Infinite Mind* 
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻 Q 52 :-- సృష్టి, ఫ్రీక్వెన్సీ - 1 🌻* 

Ans :--
1) చైతన్యశక్తి రూపాంతరం చెంది కోటానుకోట్ల లోకాలుగా వెలిశాయి. మన భూమి అందులో ఒక లోకం. మనం దాన్ని 3d plane అంటాం.

2) frequency ఎక్కువ వున్నప్పుడు పదార్ధస్వరూపం ఒకలా, frequency తక్కువ ఉన్నప్పుడు పదార్ధస్వరూపం ఒకలా ఉంటుంది. 
For ex:--fan ని గమనిద్దాం. ఫ్యాన్ మాములుగా తిరిగేటప్పుడు రెక్కలు కనపడతాయి. స్పీడ్ గా తిరిగేటప్పుడు రెక్కలు కనిపించవు.

3) మన దేహం యొక్క frequency పెరిగితే మనకు higher frequency ఉన్న లోకాలు కనపడతాయి. మన దేహం మన ఆలోచనలు lower frequency లో ఉంటే lower frequency ఉన్న లోకాలు కనపడతాయి. మనకంటే ఎక్కువ frequency ఉన్న లోకాలు మనకు కనపడవు.

4) ఈ విశ్వంలో వివిధ లోకాలు వివిధ శక్తిస్తాయిలతో వివిధ frequency లతో చైతన్య పరిణామం చెందుతున్నాయి.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. సాయి తత్వం - మానవత్వం - 45 / Sai Philosophy is Humanity - 45 🌹* 
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻. అద్భుత ఆవతారము - 1 🌻* 

1. సాయిబాబా హిందువనంచో వారు మహమ్మరీయునివలె కనిపించెడివారు. మహమదీయుడనుకొన్నచో హిందుమతాచారసంపన్నుడుగ గాన్పించుచుండెను.

2. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా యన్న విషయము ఇదమిద్ధముగ యెవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగాహిందువుల శ్రీరామనవమి యుత్సవము జరుపుచుండెను.

3. అదేకాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవ సమయమందు కుస్తీపోటీలను ప్రోత్సహించుచుండువారు.

4. గెలిచినవారికి మంచి బహుతులిచ్చెడివారు. గోకులాష్టమినాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి.

5. ఈదుల్ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహఱ్ఱం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్పి, కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి.

6. నాలుగు దినములవరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐయిదవనాడు నిస్సంకోచముగ దానిని తామే తీసి వేసిరి.

7. వారు మహమ్మదీయులన్నచో హిందువులకువలె వారి చెవులు కుట్టబడియుండెను. వారు హిందువులన్నచో, సుంతీని ప్రోత్సహించెడివారు.

8. బాబా హిందువైనచో మసీదునందేల యుండును?

9. మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహోత్రమునేల వెలిగించి యుండువారు? అదియేగాక, తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంటవాయించుట, హోమము చేయుట, భజన, అన్నసంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయమతమునకు అంగీకారముకాని విషయములు మసీదులో జరుగుచుండెను.

10. వారి మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయుచుండెడివారు? వారే తెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి.

11. అందుచే సాయిబాబా హిందువో, మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇదియొక వింతకాదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sai Philosophy is Humanity - 45 🌹
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

🌻 Wonderful Incarnation - 1 🌻

Sai Baba knew all Yogic Practices. 

He was well-versed in the six processes including Dhauti (Stomach-cleaning by a moistened piece of linen 3" in breadth and 22 1/2" in length), Khandayoga,

 i.e., separating His limbs and joining them again, and Samadhi, etc. If you think that He was a Hindu, He looked like a Yavan.

 If you think Him to be a Yavan, He looked like a pious Hindu. No one definitely knew whether He was a Hindu or a Mahomedan.

 He celebrated the Hindu festival of Rama-Navami with all due formalities, and at the same time permitted the ‘Sandal’ procession of the Mahomedans. 

He encouraged wrestling bouts in this festival, and gave good prizes to winners. 

When the Gokul Ashtami came, He got the ‘Gopal-Kala’ ceremony duly performed and on Id festivals, He allowed Mahomedans to say their prayers (Namaj) in His Masjid. 

Once in the Moharum festival, some Mahomedans proposed to contruct a Tajiya or Tabut in the Masjid, keep it there for some days and afterwards take it in procession through the village.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹