గీతోపనిషత్తు - 99

🌹. గీతోపనిషత్తు - 99 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 27. యజ్ఞార్థ భావము - యజ్ఞార్థముగ జీవించువారు అట్టి కార్యము లందు అందరి శ్రేయస్సును హృదయమున స్మరించుచు నిర్వర్తించ వలెను. యజ్ఞము లాచరింపగ అందు శేషించిన ఫలము అమృతమయము. దాని ననుభవించు వారు శాశ్వతమైన బ్రహ్మమును పొందుచున్నారు. పరమాత్మ తెలిపిన యజ్ఞము ఫలాపేక్షలేక యితరుల శ్రేయస్సు కొరకు ఆచరించు కార్యము. అట్టివారే దైవానుగ్రహ ప్రాప్తులగుదురు. అట్టి వారికే సనాతనము, శాశ్వతము అగు బ్రహ్మనుభూతి అనుభవమగును. 🍀

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోక్కో స్త్యయజ్ఞస్య కుతో 2 వ్య: కురుసత్తమ || 31

కురుసత్తముడవగు ఓ అర్జునా! యజ్ఞము లాచరింపగ అందు శేషించిన ఫలము అమృతమయము. దాని ననుభవించు వారు శాశ్వతమైన బ్రహ్మమును పొందుచున్నారు. లోకమున యజ్ఞము చేయనివానికి ఈ లోకమునందే అస్థిత్వము దొరుకదు.

పరలోకమెట్లు దొరుకును? పరమాత్మ తెలిపిన యజ్ఞము ఫలాపేక్షలేక యితరుల శ్రేయస్సు కొరకు ఆచరించు కార్యము. అట్లు కార్యములను నిర్వర్తించు రాజవంశమైన కురు వంశమునందు అర్జునుని శ్రేష్ఠునిగ శ్రీకృష్ణుడు సంబోధించినాడు. నిజమునకు అర్జునుని జీవితమంతయు యజ్ఞార్థమే.

ఇట్లు యజ్ఞార్థముగ జీవించువారు అట్టి కార్యము లందు అందరి శ్రేయస్సును హృదయమున స్మరించుచు నిర్వర్తించ వలెను. అట్టి విశిష్టమగు కార్యముల నుండి పుట్టిన ఫలములను అందరికిని పంచవలెను. అందరికి పంచగ మిగిలినది తాను భుజించినచో అది అమృతమగును. ముందుగ భుజించుట వలన ఫల మమృతము కాదు. అందువలన అందరికొరకు తాను, అందరి శ్రేయస్సు తరువాత తన శ్రేయస్సు అనునది యఁరభావము.

అట్టివారే దైవానుగ్రహ ప్రాప్తులగుదురు. అట్టి వారికే సనాతనము, శాశ్వతము అగు బ్రహ్మనుభూతి అనుభవమగును. అన్ని విషయములందు అందరికన్న ముందు పొంద వలెనని, అందరికన్న ముందు భుజించవలెనని భావించువారు ప్రాపంచికులు. వారికి నిదానమే లేదు. అట్టి వారికి యజ్ఞమన నేమో తెలియదు. వారీ లోకమున కూడ స్థిమితముగ నుండలేరు. వారి పరలోక ప్రయత్నము లన్నియు హాస్యాస్పదములే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 297

🌹 . శ్రీ శివ మహా పురాణము - 297 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

72. అధ్యాయము - 27

🌻. దక్షయజ్ఞ ప్రారంభము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఒకప్పుడు ఆ దక్షుడు గొప్ప యజ్ఞమునారంభించెను. ఆ యజ్ఞమునకు దీక్షితుడైన దక్షుడు దేవతలను, ఋషులను ఆహ్వానించెను (1). మహర్షులు, దేవతలు అందరు శివమాయచే మోహితులై ఆతని యజ్ఞమును చేయించుటకు అచటికి విచ్చేసిరి (2). అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాస భగవానుడు, భారద్వాజుడు, గౌతముడు (3), పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు, మరియు వైశంపాయనుడు విచ్చేసిరి (4).

నా కుమారుడగు దక్షుని యజ్ఞమునకు వీరేగాక ఇంకా ఎందరో మహర్షులు తమ భార్య పిల్లలతో ఆనందముగా విచ్చేసిరి (5). మరియు, సర్వదేవగణములు, మహాత్ములగు లోకపాలురు, సర్వ ఉపదేవగణములు తమ వాహనముతో, సైన్యములతో కూడి విచ్చేసిరి (6). జగత్స్రష్టనగు నన్ను స్తుతించి సత్యలోకమునుండి తీసుకొని వెళ్లిరి. నేను నా కుమారులతో, పరివారముతో, మరియు మూర్తీభవించిన వేదశాస్త్రములతో గూడి వెళ్లితిని (7). మరియు, వైకుంఠము నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరముతో దోడ్కొని వచ్చిరి. ఆయన ఆ యజ్ఞమునకు తన భక్తులతో, పరివారముతో గూడి విచ్చేసెను (8).

వీరే గాక, ఇంకనూ చాల మంది మోహితులై దక్షయజ్ఞమునకు వచ్చిరి. దుష్టుడగు దక్షుడు వారినందరినీ సత్కరించెను (9). విశ్వకర్మ మిక్కిలి విలువైన, గొప్పగా ప్రకాశించే మహాదివ్య భవనములను నిర్మించి యుండెను. దక్షుడు వారందరికీ వాటిలో మకామునిచ్చెను (10). ఆ భవనములన్నింటియందు యోగ్యతనను సరించి అందరు నివసించిరి. నేను, విష్ణువు కూడ అచట నివసింతిమి. అందరికీ సన్మానము చేయబడెను. వారందరు చక్కగా ప్రకాశించిరి (11).

అపుడు కనఖల తీర్థమునందు జరిగిన ఆ మహాయజ్ఞములో దక్షుడు భృగువు మొదలగు తపశ్శాలురను ఋత్విక్కులుగా నియమించెను (12). విష్ణువు మరుద్గణములన్నింటితో గూడి స్వయముగా ఆ యజ్ఞమునకు అధ్యక్షుడు గా నుండెను. నేను బ్రహ్మనై ఆ యజ్ఞములో వేద విధిని వివరిస్తూ నడిపించితిని (13).

సర్వదిక్పాలకులు ఆయుధములను ధరించి పరివారసమేతముగా ద్వారపాలకుల స్థానమునందు నిలబడి రక్షణనొసంగిరి. ఆ దృశ్యము చాల కుతూహలమును కలిగించెను (14). సుందరాకారుడగు యజ్ఞుడు ఆ దక్షుని యజ్ఞములో స్వయముగా హాజరయ్యెను. మహాముని శ్రేష్ఠులందరు స్వయముగా వేదోక్త కర్మలను నిర్వహించిరి (15). అగ్ని తన వేయి రూపములతో హవిస్సును స్వీకరించుటకై ఆ యజ్ఞమహోత్సవములో వెనువెంటనే ఉపస్థితుడాయెను (16). పద్ధెనిమిదివేల మంది ఋత్విక్కులు హోమమును చేసిరి. అరవై నాలుగు వేల దేవర్షులు ఉద్గాతృస్థానముల నలంకరించిరి (17).

అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులైరి. నారదాది ఋషులు, మరియు సప్తవర్షులు వేర్వేరుగా గాథలను వినిపించిరి (18). ఆ దక్షుడు తన మహాయజ్ఞములో గంధర్వులను, విద్యాధరులను, సిద్ధ సంఘములను, ద్వాదశా దిత్యులను, అసంఖ్యాకములగు నాగులను వారివారి గణములతో యజ్ఞములతో సహా ఋత్విక్కులు గా వరణము చేసెను (19). ఆ యజ్ఞములో యజమానియగు దక్షుడు ద్విజర్షులను, రాజర్షులను, దేవర్షులను, మిత్రులతో మంత్రులతో సైన్యములతో గూడియున్న రాజులను, వసువులను, గణ దేవతలను అందరినీ వరణము చేసెను (20).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 184

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 184 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వామిత్రమహర్షి - 4 🌻

22. హరిశ్చంద్రుడు రాజ్యంపోయినా, కొడుకుపోయినా సత్యవ్రతమే గొప్పదని, ఇవన్నీ ఎప్పుడయినా నశించేవేనని, కాని సత్యవ్రతం శాశ్వతమైనటువంటి ఐశ్వర్యమనీ వివేకంతో గ్రహించాడు. అందుకే దారిద్య్రాన్నికూడా దుఃఖంలేకుండా అనుభవించాడు. “అయ్యో! భార్యను పోగొట్టుకుంటున్నాను. అయ్యో! రాజ్యం పోగొట్టుకున్నాను” అని ఏడవలేదు. చూచిన వాళ్ళు దుఃఖం పొందారు.

22. కాబట్టి మహాత్ములెవరయినా సరే, కష్టం వచ్చినప్పుడు దుఃఖించలేదు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని చూచినవాళ్ళుమాత్రం దుఃఖించారు. విశ్వామిత్రుడు లేకపోతే హరిశ్చంద్రుడు లేడు, అతడి చరిత్ర లేదు. అతడిని అసత్యమాడించగలనని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞచేసాడని మామూలుగా పురాణంలో వ్రాయబడింది.

23. అలా వ్రాయబడిఉందికాని, వాస్తవంగా విశ్వామిత్రుడు అన్నది, “హరిశ్చంద్రుడి సత్యవ్రతదీక్షను నేను పరీక్షిస్తాను. మీరెవ్వరూ పరీక్షచేయలేరు!” అని. ఆ విధంగా ఆయనను పరీక్షించి నిలబెట్టి, “నా పరీక్షకు నీవు నిలబడ్డవు! నువ్వు ఏది అడిగినా నీకిస్తాను” అని హరిశ్చంద్రుడికి అన్ని కోరికలనూ తీర్చాడు.

24. విశ్వామిత్ర వాక్యాలలో మహాపాతకాలంటే ఏమిటో నిర్ణయించబడి ఉన్నది. ప్రాయశ్చిత్తం అనేది లేదు. అనుభవించి తీరవలసిందే! ఇహపరములూ రెండూ తెలిసిన ఋషులు వ్రాసారివన్నీ. ఇహంలో ఏధర్మాన్ని ఆచరిస్తే ఏ లోకం కలుగుతుందో తెలిసి, పరలోకస్వభావంకూడా తెలిసినవాళ్ళే ఇహలోక ధర్మం చెప్పలి. ఇక్కడి న్యాయం చూచినవాళ్ళు; అంతేగాక, పారలౌకికమైన ప్రవృత్తి ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి? పాశబంధనాన్నించి విముక్తి అంటే ఏమిటి? అది దేనివల్ల కలుగుతుంది-అవన్నీకూడా తెలిసిన మహర్షులే ఇక్కడ ఆచరించవలసిన ధర్మాన్ని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటలు మనకు శిరోధార్యములు.

25. విశ్వామిత్రుడు సప్తర్షిమండలంలోకి వెళ్ళి సప్తర్షులలో ఒకరుగా ఉండి, నిత్యుడు – శాశ్వతుడుగా వెలుగొందుతున్నారు. ఆయనకొక లోకం, పదవి ఉన్నది. ఆయనను స్మరణచేయటంతోటే దర్శనమిచ్చేటటువంటీ మహాత్ముడు, శక్తిసంపన్నుడు. ఆయనను స్మరించి స్తోత్రంచేస్తే ఉపాసిస్తే అనేక విశేషములయిన జ్ఞానములు కలుగుతాయి.

26. ఆయన శక్తి ఎంతటిదో, ఆయన ఔదార్యముకూడా అంత గొప్పదే. ఆయనను అడిగితే ఏదయినా ఇస్తారు, ఇవ్వడంలో ముదువెనకలు లేవుమరి. ఆయన గొప్పదాత, క్షాత్ర లక్షణం కలిగినదాత. అందుకనే లోకలో-బ్రాహ్మణుడేం దానంచేస్తాడు, చేస్తే క్షత్రియుడే చెయ్యాలి, లేకపోతే వైశ్యుడివ్వాలి అని ఒక వాడుక ఉంది. వాళ్ళే దాతలు కాని, బ్రాహ్మణులెలా అవుతారు? బ్రాహ్మణులు ఇవ్వరు, తీసుకుంటారు.

27. అంటే, దాత అనేవాడికి క్షాత్రగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి. రజోగుణం లేకపోతే ఇవ్వలేడు. “వాడడిగింది నాకు లేఖ్ఖా! అడిగింది ఇచ్చేస్తాను. నా దగ్గిన ఉన్నది ఇచ్చేస్తాను” అనుకుంటాడు దాత. దెండో ఆలోచన ఉండదు. ఖర్చుపెట్టేటప్పుడు దాతృత్వగుణానికి వెనకాల రజోగుణం ఉంటుంది. తీక్షణమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి – దాత ఒక వీరుడు, ధీరుడు అయి ఉండాలి. ‘దానవీరుడు’ అంటారందుకే. కర్ణాదులు అందరూ అలాంటివాళ్ళే, దానవీరులు వాళ్ళు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

Seeds Of Consciousness - 248

🌹 Seeds Of Consciousness - 248 🌹
✍️ Nisargadatta Maharaj

Nisargadatta Gita
📚. Prasad Bharadwaj

🌻 97. Do nothing but stay in the knowledge 'I am', the 'moolmaya' -, or primary illusion, and then it will release its stranglehold on you and get lost.🌻

Once you have understood the knowledge 'I am' you have to do nothing but just abide in it. The 'I am' is the primary illusion or concept and is also known as the 'moolmaya' (rootMaya).

At present you are in the firm grip of Maya (illusion), come to the root of this Maya, which is the 'I am'. On abiding in the 'I am' in fact you are now holding Maya by the root or its neck!

And what will happen now? Maya realizes its own existence is in danger and thus releases its stranglehold on you, runs away and vanishes.

🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 87 / Sri Vishnu Sahasra Namavali - 87

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 87 / Sri Vishnu Sahasra Namavali - 87 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

శ్రవణం నక్షత్ర తృతీయ పాద శ్లోకం

🍀 87. కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోనిలః !
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః!! 87!! 🍀

🍀 807. కుముదః
భారమును తగ్గించి భూదేవిని సంతోషపెట్టిన వాడు.

🍀 808. కుందరః
భూమిని చీల్చి హిరణ్యాక్షుని సంహరించిన వాడు. మోక్షమునిచ్చు తత్త్వజ్జానము ననుగ్రహించు వాడు.

🍀 809. కుందః
భూమిని దానమిచ్చిన వాడు. కశ్యపమహర్షికి భూమిని దానము చేసిన పరశురామ స్వరూపుడు. అత్యుత్కృష్టమైన పరమభక్తిని అనుగ్రహించి ఇచ్చువాడు.

🍀 810. పర్జన్యః
మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి, వారి మనసులను శాంతింప జేయువాడు.

🍀 811. పావనః
తలచినంతనే పవిత్రుని చేయువాడు.

🍀 812. అనిలః
వాయువు వలె అంతట వ్యాపించి యున్నవాడు. సదా జాగరూకుడు. ప్రేరణ కలిగించువాడు.

🍀 813. అమృతాశః
అమృతము నొసగువాడు. నశించని ఆశ గలవాడు.

🍀 814. అమృతవపుః
శాశ్వతుడు. నాశమెరుగని శరీరము గలవాడు.

🍀 815. సర్వజ్జః
సర్వము తెలిసిన వాడు.

🍀 816. సర్వతోముఖః
అన్నివైపుల ముఖములు గలవాడు. ఏకకాలమున సర్వమును చూడగలవాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 87 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Sravana 3rd Padam

🌻 87. kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvanōnilaḥ
amṛtāśōmṛtavapuḥ sarvajñaḥ sarvatōmukhaḥ || 87 || 🌻

🌻 807. Kumudaḥ:
'Ku' means earth; one who gives joy (muda) to the earth by freeing it of its burdens is Kumuda.

🌻 808. Kundaraḥ: 
One who offers blessings as pure as Kunda or jasmine.

🌻 809. Kundaḥ: 
One who has limbs as beautiful as Kunda or Jasmine.

🌻 810. Parjanyaḥ:
The word means cloud. One who resembles the cloud in extinguishing the three Tapas (heats, that is, miseries) arising from psychological, material and spiritual causes. Or one who rains all desires like a cloud.

🌻 811. Pāvanaḥ:
One by merely remembering whom a devotee attains purity.

🌻 812. Anilaḥ:
'Ilanam' means inducement. One who is without any inducement is Anila. Ilana also means sleep. So one who sleeps not or is ever awake is Anila.

🌻 813. Amṛtāśaḥ:
One who consumes Amruta or immortal bliss, which is His own nature.

🌻 814. Amṛtavapuḥ:
One whose form is deathless, that is, undecaying.

🌻 815. Sarvajñaḥ:
One who is all-knowing.

🌻 816. Sarvatōmukhaḥ:
One who has faces everywhere.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 123

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 123 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 3 🌻

512. నిర్వాణమే నిర్వికల్ప స్థితిగా రూపాంతర మొందును.

513. మానవుని స్థితిలో భగవంతుని 'మహా చైతన్యము' పరమాత్మపై ప్రకాశించి, పరమాత్మతో తాదాత్మ్యతను పొంది, "నేను భగవంతుడను" అనెడి అనుభవమును పొందును. ఇదియే జీవిత గమ్యము.

514. జీవిత గమ్యమును చేరుకొనుటయే నిర్వికల్ప సమాధి స్థితి.

515. సామాన్య మానవుడు నిత్యము రాత్రివేళ పరుండును. ఉదయము మేల్కొను చుండును. అట్లే - రాత్రివేళ గాఢ నిద్రవంటిది నిర్వాణస్థితి. ఉదయము, జాగ్రదవస్థ వంటిది దివ్య జాగృతియైన నిర్వికల్ప సమాథి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 170, 171 / Vishnu Sahasranama Contemplation - 170, 171

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 170, 171 / Vishnu Sahasranama Contemplation - 170, 171 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻170. మహామాయః, महामायः, Mahāmāyaḥ🌻

ఓం మహామాయాయ నమః | ॐ महामायाय नमः | OM Mahāmāyāya namaḥ

మోహపరచు మాయాశక్తి కలవాడు.

:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ॥ 14 ॥

దైవసంబంధమైనదియు (అలౌకిక సామర్థ్యము కలదియు), త్రిగుణాత్మకమైనదియునగు ఈ నా యొక్క మాయ (ప్రకృతి) దాటుటకు కష్టసాధ్యమైనది. అయినను ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారు ఈ మాయను దాటివేయగలరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 170🌹

📚. Prasad Bharadwaj

🌻170. Mahāmāyaḥ🌻

OM Mahāmāyāya namaḥ

Mahatī māyā yasya / महती माया यस्य One who can cause impregnable illusion. Māyāvināṃ api māyākārī / मायाविनां अपि मायाकारी One who can cause illusion even over other great illusionists.

Śrīmad Bhagavadgīta - Chapter 7

Daivī hyeṣā guṇamayī mama māyā duratyayā,

māmeva ye prapadyante māyāmetāṃ taranti te. (14)

:: श्रीमद्भगवद्गीत - विज्ञान योग ::

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।

मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥ १४ ॥

It is difficult indeed to go beyond the influence of My divine cosmic hypnosis, imbued with the triple qualities. Only those who take shelter in Me become free from this power of illusion.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।
अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।
Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 171 / Vishnu Sahasranama Contemplation - 171🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻171. మహోత్సాహః, महोत्साहः, Mahotsāhaḥ🌻

ఓం మహోత్సాహాయ నమః | ॐ महोत्साहाय नमः | OM Mahotsāhāya namaḥ

మహోత్సాహః, महोत्साहः, Mahotsāhaḥ

మహాన్ ఉత్సాహః (ఉద్యోగః) అస్య గొప్పది యగు పూనిక ఇతనికి కలదు. జగదుత్పత్తి, స్థితిలయముల నిర్వహించ సమర్థమగు గొప్ప పూనిక కలవాడు.

:: పోతన భాగవతము - ప్రథమ స్కంధము ::

మ.తనకున్ భృత్యుఁడు వీనిఁగాచుట మహాధర్మంబు వొమ్మంచు నర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్‍మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్‍జనులన్ మోహము నొందఁ జేయుఁ పరమోత్సాహుం బ్రశంసించెదన్‍.

"ఇతడు నా నమ్మినబంటు, ఇతణ్ణి కాపాడటం నా కర్తవ్యం సుమా!" అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో ఒయ్యారంగా పగ్గాలు పట్టుకొని, మరొక చేతిలో కొరడా ధరించి, పరమోత్సాహంగా అశ్వాలను అదలిస్తూ చూచేవాళ్ళను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 171🌹

📚. Prasad Bharadwaj

🌻171. Mahotsāhaḥ🌻

OM Mahotsāhāya namaḥ

Mahān utsāhaḥ (udyogaḥ) asya / महान् उत्साहः (उद्योगः) अस्य He who takes great delight in the creation, preservation and subsumption of the universe.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।
अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।
Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 133

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 133 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 63 🌻

దీనికి అడ్డువస్తున్నది ఏమిటి? సహజంగా తాను ఈశ్వరుడే అయివున్నప్పటికీ, తనకు తాను ఈశ్వరుడుగా తోచడం లేదు. ‘ఈశ్వరుడు వేరే కలడు’ - అనేటటువంటి భ్రాంతికిలోనై, ప్రథమ భ్రాంతి ‘పంచ భ్రమ నిరూపణ’ అని ఆది శంకరులు ఒక విధానాన్ని అందించారు. (అన్నపూర్ణోపనిషత్‌ అంతర్గతంగా)

అందులో మొట్టమొదటి భ్రాంతి ‘జీవేశ్వరోభిన్నః’ కాబట్టి ‘జీవుడు ఈశ్వరుడు వేరు వేరే’ అనేటటువంటి ప్రథమమైనటువంటి భ్రమ చేత, మనోభ్రాంతికి, మనస్సు అనేటటువంటి మయాకల్పితమైనటువంటి, ప్రతిబింబ సమానమైనటువంటి, అసలు లేనేలేనటువంటి భ్రమకి గురౌతున్నాడు. ఈ విభ్రమ నుంచి తప్పక ప్రయత్నశీలియై, ఆత్మవిచారణ చేత తనకు తాను బుద్ధికి వేరు పరుచుకుని తాను ఈశ్వరుడు అనే నిర్ణయాన్ని, అనే స్థితిని తప్పక సాధించాలి. అలా లేకపోయినట్లయితే ఎప్పటికి అభిమానగ్రస్థుడుగా మిగిలిపోతాడు.

ఇప్పుడు మనమందరం సామాన్యంగా జీవిస్తున్నటువంటి జీవనం ఎలా జీవిస్తున్నాము అంటే ‘విధి, వ్యాధి, అభిమానము’ - అనే మూడింటికి గురై, జీవుడుగా జీవిస్తూఉన్నాము. కానీ, ఈ మూడింటికి ఆధారం పట్టుకొమ్మ అభిమానం. ‘శరీరం నేను’ అనేటటువంటి అభిమానం. ‘నేనే కర్త’ ను అనేటటువంటి అభిమానము.

‘నేనే భోక్త’ ను అనేటటువంటి అభిమానము. కార్యకారణమునకు లొంగినటువంటి అభిమానము. కాలత్రయానికి లొంగినటువంటి అభిమానము. అవస్థాత్రయానికి లొంగినటువంటి అభిమానము. దేహత్రయానికి లొంగినటువంటి అభిమానము. శరీర త్రయానికి లొంగినటువంటి అభిమానము.

ఈ రకంగా ఎన్ని త్రిపుటులున్నాయో, ఆ అన్ని త్రిపుటులకు, గుణత్రయానికి లొంగిపోయినటువంటి అభిమానము. ఇట్లా ప్రతీ దానికి కూడా ఈ అభిమానమే అడ్డు వస్తూఉంటుంది. ఒకరు ఒకరితో మాట్లాడాలి అంటే, అభిమానం అడ్డు వస్తుంది. ఒకరు ఒకరితో సంబంధ పడాలి అంటే, అభిమానం అడ్డం వస్తుంది. ఒకరు ఒకరిని క్షమాపణ అడగాలి అనంటే, అభిమానం అడ్డు వస్తోంది.

ఒకరు ఒకరిని ప్రశంసించాలి అంటే, అభిమానం అడ్డు వస్తుంది. ఈ అభిమానం అనే తెర ఏదైతే ఉందో, నిజానికి ఇదొక పెద్ద తెర. ఇనుప గొలుసుల తెర. సాత్విక, రాజసిక, తామసిక శక్తులతో కూడినటువంటి, గుణ త్రయంతో కూడినటువంటి తెర. “తెర తీయరా తిరుపతి దేవర తెర తీయరా..” - అనేటటువంటి పాటలో ఆ తెర అంటే ఈ అభిమానము అనేటటువంటి తెర.

నేనే చేస్తున్నాను. సర్వకర్తను నేనే. సర్వహర్తను నేనే. సర్వభర్తను నేనే. అనే ఈశ్వరత్వాన్ని సాధించవలసినటువంటి మానవుడు, నిమిత్తమైనటువంటి కర్తృత్వ భావంతో, పరిమితమైనటువంటి,శరీరం చేత పరిమితించబడినటువంటి, దేహాభిమానం చేత పరిమితించబడినటువంటి చైతన్యం కలిగినవాడై, జీవాత్మగా వ్యవహరించడం చేత, ఇంద్రియాలకు లోబడి వ్యవహరించడం చేత, ఈ రకమైనటువంటి అజ్ఞానావృతమైన, అవిద్యావృతమైన, మోహావృతమైన, మాయావృతమైన జీవనశైలిని మానవుడు కలిగియుంటున్నాడు. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 7

🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 7 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 7 🍀

పర్వతా ప్రమాణే పాతక్ కరణే!
వజ్రలేప్ హెణే అభక్తాసీ!!

నాహి జ్యాసీ భక్తి తో పతిత్ అభక్త!
హరిసీ న భజత్ దైవహత్!!

అనంత వాచాళ్ బరళతీ బరళ్!
త్యాకై సేని గోపాళ్ పావే హరి?!!

జ్ఞానదేవా ప్రమాణ్ ఆత్మా హా నిధాన్!
సర్వా ఘటీ పూర్జ్ ఏక్ నాందే!!

భావము:

పర్వతమంతటి పాపము చేసినవాడు అభక్తుడు. వాడు చేసిన కఠిన పాపాలు వజ్ర లేపమై బాధించును.

హరి భక్తి లేని వాడు పతితుడు, భక్తి హీనుడు హరి భజన చేసే భాగ్యము కోల్పోవును.

ఈ అధిక ప్రసంగిని, వాగుడుకాయను దయాళుడైన శ్రీహరి ఎందుకు కరుణించాలి?

ఆత్మయే తరగని దైవనిధి. సర్వ ఘటములలో హరి ఒక్కడే

క్రీడించుచున్నాడని జ్ఞాన దేవులు తన అనుభవమును తెలిపినారు,

🌻. నామ సుధ -7 🌻

పర్వత మంతటి పాపకృత్యము

అభక్తుడు చేసిన కర్మ సమూహము

అయి పోయినది వజ్ర లేపనము

భక్తిలేని బ్రతుకుయే హీనము

హరిపై లేదు భక్తి భావము

భక్తి హీనుడి బ్రతుకు పతితము

తీరి పోయినది దైవ ధనము

కోల్పోయాడు భజన భాగ్యము

నేర్చినాడు వాగుడు అధికము

వాదించడముతో ఏమి ఫలితము

శ్రీహరి రూపము దయగల దైవము

అయినా ఎందుకు కరుణించడము?

జ్ఞాన దేవుని ప్రమాణము వినుము

“ఆత్మయే దైవ ధనము”

సర్వ ఘటములలో సంపూర్ణము

క్రీడించు హరి ఒక్కడే సత్యము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 150 / Sri Lalitha Chaitanya Vijnanam - 150

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 150 / Sri Lalitha Chaitanya Vijnanam - 150 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖

🌻150. 'నిరవద్యా'🌻

నిందకతీత మైనది శ్రీలలిత అని అర్థము.

అవద్య అనగా అవిద్యా వికారము వలన పుట్టిన నింద. శ్రీమాత విద్యా అవిద్యా స్వరూపిణి. అవిద్య యందు వసించుచూ వున్నప్పటికి అవిద్యా ప్రభావము ఆమె నంటదు. మట్టి యందున్ననూ బంగారము బంగారమేకదా! అవిద్యా వికారము కలవారు అవద్య నరకముల వసింతురు. కారణ మేదైనను అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశముల యందు వుడుకుట వున్న వారందరూ, అవద్య నరక వాసులే.

నిత్యము చింత, దుఃఖము, బాధ, భయము, ద్వేషము, ఈర్ష్య, గర్వము, అసూయ, ఇత్యాది భావములలో సతమతమగు వారందరు అవద్యా నరకమున జీవించు చున్నవారే. శ్రీమాత నిరవద్య అగుటచే ఆమె నాశ్రయించి ఆరాధించువారు పాపకూపములైన ఈ భావముల నుండి విముక్తి పొందెదరు. ఆమె నాశ్రయించుట వలన, సతతము స్మరించుట వలన దోష రహితులై జీవింపగలరు. అనుభవమగు భావములు శ్రీదేవి భక్తులను సోకవని శ్రీ సూక్తము కూడ చాటి చెప్పుచుండును.

“నక్రోధో నచ మాత్సర్యమ్....”

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 150 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Niravadhyā निरवध्या (150) 🌻

She is inviolable and without defects. Avadhyā means incapable of being transgressed or dishonoured. Defects arise out of ignorance or ignorance is the cause of differentiating between defect and perfect.

There cannot be any defect in the Brahman as it is eternally pure. Defects arise out of impurities such as desire, ego, etc.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Dec 2020

16-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 580 / Bhagavad-Gita - 580🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 170, 171 / Vishnu Sahasranama Contemplation - 170, 171🌹
3) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 133🌹
4) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 7 🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 154 🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 80 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 150 / Sri Lalita Chaitanya Vijnanam - 150 🌹
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 491 / Bhagavad-Gita - 491 🌹

09) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 99 📚
10) 🌹. శివ మహా పురాణము - 297 🌹 
11) 🌹 Light On The Path - 52🌹
12) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 184🌹 
13) 🌹 Seeds Of Consciousness - 248 🌹   
14) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 123 🌹
15) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 87 / Sri Vishnu Sahasranama - 87🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 580 / Bhagavad-Gita - 580 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 24 🌴*

24. తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదానతప:క్రియా: |
ప్రవర్తన్తే విధానోక్తా: సతతం బ్రహ్మవాదినామ్ ||

🌷. తాత్పర్యం : 
కనుకనే శాస్త్రనియమానుసారము యజ్ఞము, దానము, తపములను చేపట్టు తత్త్వజ్ఞులు పరమపురుషుని పొందుటకై వానిని ఓంకారముతో ప్రారంభింతురు.

🌷. భాష్యము :
ఋగ్వేదము (1.22.20) “ఓంతద్విష్ణో: పరమం పదం” అని పలుకుచున్నది. అనగా విష్ణు పాదపద్మములే దివ్యభక్తికి స్థానములు. దేవదేవుడైన శ్రీకృష్ణుని కొరకు ఒనర్చబడునదేదైనను కర్మల యందు సంపూర్ణత్వమును నిశ్చయముగా సిద్ధింపజేయును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 580 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 24 🌴*

24. tasmād oṁ ity udāhṛtya
yajña-dāna-tapaḥ-kriyāḥ
pravartante vidhānoktāḥ
satataṁ brahma-vādinām

🌷 Translation : 
Therefore, transcendentalists undertaking performances of sacrifice, charity and penance in accordance with scriptural regulations begin always with oṁ, to attain the Supreme.

🌹 Purport :
Oṁ tad viṣṇoḥ paramaṁ padam (Ṛg Veda 1.22.20). The lotus feet of Viṣṇu are the supreme devotional platform. The performance of everything on behalf of the Supreme Personality of Godhead assures the perfection of all activity.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 170, 171 / Vishnu Sahasranama Contemplation - 170, 171 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻170. మహామాయః, महामायः, Mahāmāyaḥ🌻*

*ఓం మహామాయాయ నమః | ॐ महामायाय नमः | OM Mahāmāyāya namaḥ*

 మోహపరచు మాయాశక్తి కలవాడు.

:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ॥ 14 ॥

దైవసంబంధమైనదియు (అలౌకిక సామర్థ్యము కలదియు), త్రిగుణాత్మకమైనదియునగు ఈ నా యొక్క మాయ (ప్రకృతి) దాటుటకు కష్టసాధ్యమైనది. అయినను ఎవరు నన్నే శరణుబొందుచున్నారో వారు ఈ మాయను దాటివేయగలరు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 170🌹*
📚. Prasad Bharadwaj

*🌻170. Mahāmāyaḥ🌻*

*OM Mahāmāyāya namaḥ*

Mahatī māyā yasya / महती माया यस्य One who can cause impregnable illusion. Māyāvināṃ api māyākārī / मायाविनां अपि मायाकारी One who can cause illusion even over other great illusionists.

Śrīmad Bhagavadgīta - Chapter 7
Daivī hyeṣā guṇamayī mama māyā duratyayā,
māmeva ye prapadyante māyāmetāṃ taranti te. (14)

:: श्रीमद्भगवद्गीत - विज्ञान योग ::
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥ १४ ॥

It is difficult indeed to go beyond the influence of My divine cosmic hypnosis, imbued with the triple qualities. Only those who take shelter in Me become free from this power of illusion.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 171 / Vishnu Sahasranama Contemplation - 171🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻171. మహోత్సాహః, महोत्साहः, Mahotsāhaḥ🌻*

*ఓం మహోత్సాహాయ నమః | ॐ महोत्साहाय नमः | OM Mahotsāhāya namaḥ*

మహోత్సాహః, महोत्साहः, Mahotsāhaḥ

మహాన్ ఉత్సాహః (ఉద్యోగః) అస్య గొప్పది యగు పూనిక ఇతనికి కలదు. జగదుత్పత్తి, స్థితిలయముల నిర్వహించ సమర్థమగు గొప్ప పూనిక కలవాడు.

:: పోతన భాగవతము - ప్రథమ స్కంధము ::
మ.తనకున్ భృత్యుఁడు వీనిఁగాచుట మహాధర్మంబు వొమ్మంచు నర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్‍మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్‍జనులన్ మోహము నొందఁ జేయుఁ పరమోత్సాహుం బ్రశంసించెదన్‍.

"ఇతడు నా నమ్మినబంటు, ఇతణ్ణి కాపాడటం నా కర్తవ్యం సుమా!" అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో ఒయ్యారంగా పగ్గాలు పట్టుకొని, మరొక చేతిలో కొరడా ధరించి, పరమోత్సాహంగా అశ్వాలను అదలిస్తూ చూచేవాళ్ళను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 171🌹*
📚. Prasad Bharadwaj

*🌻171. Mahotsāhaḥ🌻*

*OM Mahotsāhāya namaḥ*

Mahān utsāhaḥ (udyogaḥ) asya / महान् उत्साहः (उद्योगः) अस्य He who takes great delight in the creation, preservation and subsumption of the universe.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 133 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 63 🌻*

దీనికి అడ్డువస్తున్నది ఏమిటి? సహజంగా తాను ఈశ్వరుడే అయివున్నప్పటికీ, తనకు తాను ఈశ్వరుడుగా తోచడం లేదు. ‘ఈశ్వరుడు వేరే కలడు’ - అనేటటువంటి భ్రాంతికిలోనై, ప్రథమ భ్రాంతి ‘పంచ భ్రమ నిరూపణ’ అని ఆది శంకరులు ఒక విధానాన్ని అందించారు. (అన్నపూర్ణోపనిషత్‌ అంతర్గతంగా) 

అందులో మొట్టమొదటి భ్రాంతి ‘జీవేశ్వరోభిన్నః’ కాబట్టి ‘జీవుడు ఈశ్వరుడు వేరు వేరే’ అనేటటువంటి ప్రథమమైనటువంటి భ్రమ చేత, మనోభ్రాంతికి, మనస్సు అనేటటువంటి మయాకల్పితమైనటువంటి, ప్రతిబింబ సమానమైనటువంటి, అసలు లేనేలేనటువంటి భ్రమకి గురౌతున్నాడు. ఈ విభ్రమ నుంచి తప్పక ప్రయత్నశీలియై, ఆత్మవిచారణ చేత తనకు తాను బుద్ధికి వేరు పరుచుకుని తాను ఈశ్వరుడు అనే నిర్ణయాన్ని, అనే స్థితిని తప్పక సాధించాలి. అలా లేకపోయినట్లయితే ఎప్పటికి అభిమానగ్రస్థుడుగా మిగిలిపోతాడు.

    ఇప్పుడు మనమందరం సామాన్యంగా జీవిస్తున్నటువంటి జీవనం ఎలా జీవిస్తున్నాము అంటే ‘విధి, వ్యాధి, అభిమానము’ - అనే మూడింటికి గురై, జీవుడుగా జీవిస్తూఉన్నాము. కానీ, ఈ మూడింటికి ఆధారం పట్టుకొమ్మ అభిమానం. ‘శరీరం నేను’ అనేటటువంటి అభిమానం. ‘నేనే కర్త’ ను అనేటటువంటి అభిమానము.

 ‘నేనే భోక్త’ ను అనేటటువంటి అభిమానము. కార్యకారణమునకు లొంగినటువంటి అభిమానము. కాలత్రయానికి లొంగినటువంటి అభిమానము. అవస్థాత్రయానికి లొంగినటువంటి అభిమానము. దేహత్రయానికి లొంగినటువంటి అభిమానము. శరీర త్రయానికి లొంగినటువంటి అభిమానము.

ఈ రకంగా ఎన్ని త్రిపుటులున్నాయో, ఆ అన్ని త్రిపుటులకు, గుణత్రయానికి లొంగిపోయినటువంటి అభిమానము. ఇట్లా ప్రతీ దానికి కూడా ఈ అభిమానమే అడ్డు వస్తూఉంటుంది. ఒకరు ఒకరితో మాట్లాడాలి అంటే, అభిమానం అడ్డు వస్తుంది. ఒకరు ఒకరితో సంబంధ పడాలి అంటే, అభిమానం అడ్డం వస్తుంది. ఒకరు ఒకరిని క్షమాపణ అడగాలి అనంటే, అభిమానం అడ్డు వస్తోంది. 

ఒకరు ఒకరిని ప్రశంసించాలి అంటే, అభిమానం అడ్డు వస్తుంది. ఈ అభిమానం అనే తెర ఏదైతే ఉందో, నిజానికి ఇదొక పెద్ద తెర. ఇనుప గొలుసుల తెర. సాత్విక, రాజసిక, తామసిక శక్తులతో కూడినటువంటి, గుణ త్రయంతో కూడినటువంటి తెర. “తెర తీయరా తిరుపతి దేవర తెర తీయరా..” - అనేటటువంటి పాటలో ఆ తెర అంటే ఈ అభిమానము అనేటటువంటి తెర.

    నేనే చేస్తున్నాను. సర్వకర్తను నేనే. సర్వహర్తను నేనే. సర్వభర్తను నేనే. అనే ఈశ్వరత్వాన్ని సాధించవలసినటువంటి మానవుడు, నిమిత్తమైనటువంటి కర్తృత్వ భావంతో, పరిమితమైనటువంటి,శరీరం చేత పరిమితించబడినటువంటి, దేహాభిమానం చేత పరిమితించబడినటువంటి చైతన్యం కలిగినవాడై, జీవాత్మగా వ్యవహరించడం చేత, ఇంద్రియాలకు లోబడి వ్యవహరించడం చేత, ఈ రకమైనటువంటి అజ్ఞానావృతమైన, అవిద్యావృతమైన, మోహావృతమైన, మాయావృతమైన జీవనశైలిని మానవుడు కలిగియుంటున్నాడు. - విద్యా సాగర్ గారు

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 7 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 7 🍀*

పర్వతా ప్రమాణే పాతక్ కరణే!
వజ్రలేప్ హెణే అభక్తాసీ!!

నాహి జ్యాసీ భక్తి తో పతిత్ అభక్త!
హరిసీ న భజత్ దైవహత్!!

అనంత వాచాళ్ బరళతీ బరళ్!
త్యాకై సేని గోపాళ్ పావే హరి?!!

జ్ఞానదేవా ప్రమాణ్ ఆత్మా హా నిధాన్!
సర్వా ఘటీ పూర్జ్ ఏక్ నాందే!!

భావము:
పర్వతమంతటి పాపము చేసినవాడు అభక్తుడు. వాడు చేసిన కఠిన పాపాలు వజ్ర లేపమై బాధించును. 

హరి భక్తి లేని వాడు పతితుడు, భక్తి హీనుడు హరి భజన చేసే భాగ్యము కోల్పోవును.

ఈ అధిక ప్రసంగిని, వాగుడుకాయను దయాళుడైన శ్రీహరి ఎందుకు కరుణించాలి?

ఆత్మయే తరగని దైవనిధి. సర్వ ఘటములలో హరి ఒక్కడే
క్రీడించుచున్నాడని జ్ఞాన దేవులు తన అనుభవమును తెలిపినారు,

*🌻. నామ సుధ -7 🌻*

పర్వత మంతటి పాపకృత్యము
అభక్తుడు చేసిన కర్మ సమూహము
అయి పోయినది వజ్ర లేపనము

భక్తిలేని బ్రతుకుయే హీనము
హరిపై లేదు భక్తి భావము
భక్తి హీనుడి బ్రతుకు పతితము
తీరి పోయినది దైవ ధనము

కోల్పోయాడు భజన భాగ్యము
నేర్చినాడు వాగుడు అధికము
వాదించడముతో ఏమి ఫలితము
శ్రీహరి రూపము దయగల దైవము
అయినా ఎందుకు కరుణించడము?

జ్ఞాన దేవుని ప్రమాణము వినుము
“ఆత్మయే దైవ ధనము”
సర్వ ఘటములలో సంపూర్ణము
క్రీడించు హరి ఒక్కడే సత్యము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 154 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
146

You may wonder, “Why do we need Guru Gita if there is no possibility of establishing a Guru-disciple relationship until I’ve received initiation from the Guru?” There is still, however, a Guru-disciple relationship here. That is because, that disciple is eagerly awaiting initiation from the Guru while thinking of him as his Guru. The Guru too is eagerly looking forward to initiating the disciple hoping that the disciple soon gains eligibility for initiation. That means the Guru is thinking of him as his disciple. Because of the intensity of this mutual feeling, a Guru-disciple relationship is established. That is why Siva is the Guru for us all.

It is clear from this that the Principle of Guru so far is an experience, a feeling, not a formal relationship. We understand therefore, that the Principle of Guru is an experience and not yet a practical, real relationship. So, when will the Guru actually became our Guru? The Guru will initiate you when we have intense longing. What is this intensity? It is not enough to intensely wish to get initiated, but whatever needs to be done to gain eligibility should be done with intense longing. 

That is what this intensity implies. That means, there should be intense spiritual practice. Until then, the Guru cannot give you initiation and even if he does, you cannot receive it. That means, you should do intense and steady spiritual practice based on the Guru-disciple relationship you established in your mind. As you continue to consistently do this, you gain the non-dual state of oneness with the Guru. Both become one. That is when you have been initiated. Non-duality has been attained. At that point, the one giving the initiation, the one receiving it and the initiation itself cease to exist. Such interesting concepts have been described in the Guru Gita.

The Guru Gita has a wonderful description of the Principle of Guru. Even though it’s small scripture, it contains all the great Upanishads. It contains the essence of all the Vedas. We should also try to understand the means to liberation described in this scripture. 

That is why, it is said that the Guru Gita should be chanted in the morning, afternoon and evening. One should clearly understand these great instructions and get absorbed in each verse in the Guru Gita, in each description in the Guru Gita. It is not enough to just recite it or learn by rote. It is not enough to say, “I recited the Guru Gita 5 times today”. 

You may say, “I have recited the Guru Gita about 1000 times. I know all the slokas really well. I am teaching all my children the Guru Gita”. Good. Everything you said sounds very wonderful. But, whether you are teaching your children, or whether you are learning it yourself or whether you are studying it, you should always, in every instance, understand and recollect the meaning and visualize it over and over again.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 80 / Sri Lalitha Sahasra Nama Stotram - 80 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 150 / Sri Lalitha Chaitanya Vijnanam - 150 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |*
*నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖*

*🌻150. 'నిరవద్యా'🌻*

నిందకతీత మైనది శ్రీలలిత అని అర్థము.

అవద్య అనగా అవిద్యా వికారము వలన పుట్టిన నింద. శ్రీమాత విద్యా అవిద్యా స్వరూపిణి. అవిద్య యందు వసించుచూ వున్నప్పటికి అవిద్యా ప్రభావము ఆమె నంటదు. మట్టి యందున్ననూ బంగారము బంగారమేకదా! అవిద్యా వికారము కలవారు అవద్య నరకముల వసింతురు. కారణ మేదైనను అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశముల యందు వుడుకుట వున్న వారందరూ, అవద్య నరక వాసులే. 

నిత్యము చింత, దుఃఖము, బాధ, భయము, ద్వేషము, ఈర్ష్య, గర్వము, అసూయ, ఇత్యాది భావములలో సతమతమగు వారందరు అవద్యా నరకమున జీవించు చున్నవారే. శ్రీమాత నిరవద్య అగుటచే ఆమె నాశ్రయించి ఆరాధించువారు పాపకూపములైన ఈ భావముల నుండి విముక్తి పొందెదరు. ఆమె నాశ్రయించుట వలన, సతతము స్మరించుట వలన దోష రహితులై జీవింపగలరు. అనుభవమగు భావములు శ్రీదేవి భక్తులను సోకవని శ్రీ సూక్తము కూడ చాటి చెప్పుచుండును.
“నక్రోధో నచ మాత్సర్యమ్....”

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 150 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Niravadhyā निरवध्या (150) 🌻*

She is inviolable and without defects. Avadhyā means incapable of being transgressed or dishonoured. Defects arise out of ignorance or ignorance is the cause of differentiating between defect and perfect.  

There cannot be any defect in the Brahman as it is eternally pure. Defects arise out of impurities such as desire, ego, etc.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 491 / Bhagavad-Gita - 491 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 1 🌴*

01. శ్రీ భగవానువాచ
పరం భూయ: ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యజ్జ్ఞాత్వా మునయ: సర్వే పరాం సిద్ధిమితో గతా: ||

🌷. తాత్పర్యం : 
దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : దేనిని తెలిసికొని మునులందరును పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలో కెల్ల ఉత్తమమైన ఈ దివ్యజ్ఞానమును నీకిప్పుడు నేను మరల తెలియజేయుదును.

🌷. భాష్యము :
సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయపు అంతము వరకు పరతత్త్వమును, దేవదేవుడును అగు తనను గూర్చి విశదముగా వివరించిన శ్రీకృష్ణభగవానుడు తిరిగి ఇప్పుడు అర్జునునకు మరింత జ్ఞానవికాసమును కలిగించుచున్నాడు. 

తాత్త్విక చింతన విధానము ద్వారా ఈ అధ్యాయమును అవగాహన చేసికొనినచో మనుజుడు శీఘ్రముగా భక్తియోగమును అవగతము చేసికొనగలడు. నమ్రతతో జ్ఞానాభివృద్ధిని సాధించుట ద్వారా జీవుడు భౌతికబంధము నుండి ముక్తుడు కాగలడని గడచిన త్రయోదశాధ్యాయమున వివరింపబడినది. 

ఆలాగుననే ప్రకృతిత్రిగుణముల సంపర్కము చేతనే జీవుడు భౌతికజగములో బంధితుడగుననియు పూర్వము తెలుపబడినది. ఇక ప్రస్తుతము ఈ అధ్యాయమున ప్రకృతి త్రిగుణములనేవో, అవి ఎట్లు వర్తించునో, ఏ విధముగా అవి బంధ, మోక్షములను గూర్చునో దేవదేవుడైన శ్రీకృష్ణుడు తెలియజేయుచున్నాడు. 

ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము పూర్వపు అధ్యాయములందు తెలుపబడిన జ్ఞానము కన్నను మిగుల శ్రేష్టమని భగవానుడు పలుకుచున్నాడు. అట్టి ఈ జ్ఞానమును అవగాహనము చేసికొనుట ద్వారా పలువురు మునులు పరమసిద్ధిని పొంది ఆధ్యాత్మికజగత్తును చేరిరి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 491 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 01 🌴*

01. śrī-bhagavān uvāca
paraṁ bhūyaḥ pravakṣyāmi
jñānānāṁ jñānam uttamam
yaj jñātvā munayaḥ sarve
parāṁ siddhim ito gatāḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Again I shall declare to you this supreme wisdom, the best of all knowledge, knowing which all the sages have attained the supreme perfection.

🌹 Purport :
From the Seventh Chapter to the end of the Twelfth Chapter, Śrī Kṛṣṇa in detail reveals the Absolute Truth, the Supreme Personality of Godhead. 

Now, the Lord Himself is further enlightening Arjuna. If one understands this chapter through the process of philosophical speculation, he will come to an understanding of devotional service. 

In the Thirteenth Chapter, it was clearly explained that by humbly developing knowledge one may possibly be freed from material entanglement. It has also been explained that it is due to association with the modes of nature that the living entity is entangled in this material world. 

Now, in this chapter, the Supreme Personality explains what those modes of nature are, how they act, how they bind and how they give liberation. The knowledge explained in this chapter is proclaimed by the Supreme Lord to be superior to the knowledge given so far in other chapters. 

By understanding this knowledge, various great sages attained perfection and transferred to the spiritual world. The Lord now explains the same knowledge in a better way. 

This knowledge is far, far superior to all other processes of knowledge thus far explained, and knowing this many attained perfection. Thus it is expected that one who understands this Fourteenth Chapter will attain perfection.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 99 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 27. యజ్ఞార్థ భావము - యజ్ఞార్థముగ జీవించువారు అట్టి కార్యము లందు అందరి శ్రేయస్సును హృదయమున స్మరించుచు నిర్వర్తించ వలెను. యజ్ఞము లాచరింపగ అందు శేషించిన ఫలము అమృతమయము. దాని ననుభవించు వారు శాశ్వతమైన బ్రహ్మమును పొందుచున్నారు. పరమాత్మ తెలిపిన యజ్ఞము ఫలాపేక్షలేక యితరుల శ్రేయస్సు కొరకు ఆచరించు కార్యము. అట్టివారే దైవానుగ్రహ ప్రాప్తులగుదురు. అట్టి వారికే సనాతనము, శాశ్వతము అగు బ్రహ్మనుభూతి అనుభవమగును. 🍀*

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోక్కో స్త్యయజ్ఞస్య కుతో 2 వ్య: కురుసత్తమ || 31

కురుసత్తముడవగు ఓ అర్జునా! యజ్ఞము లాచరింపగ అందు శేషించిన ఫలము అమృతమయము. దాని ననుభవించు వారు శాశ్వతమైన బ్రహ్మమును పొందుచున్నారు. లోకమున యజ్ఞము చేయనివానికి ఈ లోకమునందే అస్థిత్వము దొరుకదు. 

పరలోకమెట్లు దొరుకును? పరమాత్మ తెలిపిన యజ్ఞము ఫలాపేక్షలేక యితరుల శ్రేయస్సు కొరకు ఆచరించు కార్యము. అట్లు కార్యములను నిర్వర్తించు రాజవంశమైన కురు వంశమునందు అర్జునుని శ్రేష్ఠునిగ శ్రీకృష్ణుడు సంబోధించినాడు. నిజమునకు అర్జునుని జీవితమంతయు యజ్ఞార్థమే.

ఇట్లు యజ్ఞార్థముగ జీవించువారు అట్టి కార్యము లందు అందరి శ్రేయస్సును హృదయమున స్మరించుచు నిర్వర్తించ వలెను. అట్టి విశిష్టమగు కార్యముల నుండి పుట్టిన ఫలములను అందరికిని పంచవలెను. అందరికి పంచగ మిగిలినది తాను భుజించినచో అది అమృతమగును. ముందుగ భుజించుట వలన ఫల మమృతము కాదు. అందువలన అందరికొరకు తాను, అందరి శ్రేయస్సు తరువాత తన శ్రేయస్సు అనునది యఁరభావము. 

అట్టివారే దైవానుగ్రహ ప్రాప్తులగుదురు. అట్టి వారికే సనాతనము, శాశ్వతము అగు బ్రహ్మనుభూతి అనుభవమగును. అన్ని విషయములందు అందరికన్న ముందు పొంద వలెనని, అందరికన్న ముందు భుజించవలెనని భావించువారు ప్రాపంచికులు. వారికి నిదానమే లేదు. అట్టి వారికి యజ్ఞమన నేమో తెలియదు. వారీ లోకమున కూడ స్థిమితముగ నుండలేరు. వారి పరలోక ప్రయత్నము లన్నియు హాస్యాస్పదములే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 297 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
72. అధ్యాయము - 27

*🌻. దక్షయజ్ఞ ప్రారంభము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఒకప్పుడు ఆ దక్షుడు గొప్ప యజ్ఞమునారంభించెను. ఆ యజ్ఞమునకు దీక్షితుడైన దక్షుడు దేవతలను, ఋషులను ఆహ్వానించెను (1). మహర్షులు, దేవతలు అందరు శివమాయచే మోహితులై ఆతని యజ్ఞమును చేయించుటకు అచటికి విచ్చేసిరి (2). అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాస భగవానుడు, భారద్వాజుడు, గౌతముడు (3), పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు, మరియు వైశంపాయనుడు విచ్చేసిరి (4).

నా కుమారుడగు దక్షుని యజ్ఞమునకు వీరేగాక ఇంకా ఎందరో మహర్షులు తమ భార్య పిల్లలతో ఆనందముగా విచ్చేసిరి (5). మరియు, సర్వదేవగణములు, మహాత్ములగు లోకపాలురు, సర్వ ఉపదేవగణములు తమ వాహనముతో, సైన్యములతో కూడి విచ్చేసిరి (6). జగత్స్రష్టనగు నన్ను స్తుతించి సత్యలోకమునుండి తీసుకొని వెళ్లిరి. నేను నా కుమారులతో, పరివారముతో, మరియు మూర్తీభవించిన వేదశాస్త్రములతో గూడి వెళ్లితిని (7). మరియు, వైకుంఠము నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరముతో దోడ్కొని వచ్చిరి. ఆయన ఆ యజ్ఞమునకు తన భక్తులతో, పరివారముతో గూడి విచ్చేసెను (8).

వీరే గాక, ఇంకనూ చాల మంది మోహితులై దక్షయజ్ఞమునకు వచ్చిరి. దుష్టుడగు దక్షుడు వారినందరినీ సత్కరించెను (9). విశ్వకర్మ మిక్కిలి విలువైన, గొప్పగా ప్రకాశించే మహాదివ్య భవనములను నిర్మించి యుండెను. దక్షుడు వారందరికీ వాటిలో మకామునిచ్చెను (10). ఆ భవనములన్నింటియందు యోగ్యతనను సరించి అందరు నివసించిరి. నేను, విష్ణువు కూడ అచట నివసింతిమి. అందరికీ సన్మానము చేయబడెను. వారందరు చక్కగా ప్రకాశించిరి (11). 

అపుడు కనఖల తీర్థమునందు జరిగిన ఆ మహాయజ్ఞములో దక్షుడు భృగువు మొదలగు తపశ్శాలురను ఋత్విక్కులుగా నియమించెను (12). విష్ణువు మరుద్గణములన్నింటితో గూడి స్వయముగా ఆ యజ్ఞమునకు అధ్యక్షుడు గా నుండెను. నేను బ్రహ్మనై ఆ యజ్ఞములో వేద విధిని వివరిస్తూ నడిపించితిని (13).

సర్వదిక్పాలకులు ఆయుధములను ధరించి పరివారసమేతముగా ద్వారపాలకుల స్థానమునందు నిలబడి రక్షణనొసంగిరి. ఆ దృశ్యము చాల కుతూహలమును కలిగించెను (14). సుందరాకారుడగు యజ్ఞుడు ఆ దక్షుని యజ్ఞములో స్వయముగా హాజరయ్యెను. మహాముని శ్రేష్ఠులందరు స్వయముగా వేదోక్త కర్మలను నిర్వహించిరి (15). అగ్ని తన వేయి రూపములతో హవిస్సును స్వీకరించుటకై ఆ యజ్ఞమహోత్సవములో వెనువెంటనే ఉపస్థితుడాయెను (16). పద్ధెనిమిదివేల మంది ఋత్విక్కులు హోమమును చేసిరి. అరవై నాలుగు వేల దేవర్షులు ఉద్గాతృస్థానముల నలంకరించిరి (17).

అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులైరి. నారదాది ఋషులు, మరియు సప్తవర్షులు వేర్వేరుగా గాథలను వినిపించిరి (18). ఆ దక్షుడు తన మహాయజ్ఞములో గంధర్వులను, విద్యాధరులను, సిద్ధ సంఘములను, ద్వాదశా దిత్యులను, అసంఖ్యాకములగు నాగులను వారివారి గణములతో యజ్ఞములతో సహా ఋత్విక్కులు గా వరణము చేసెను (19). ఆ యజ్ఞములో యజమానియగు దక్షుడు ద్విజర్షులను, రాజర్షులను, దేవర్షులను, మిత్రులతో మంత్రులతో సైన్యములతో గూడియున్న రాజులను, వసువులను, గణ దేవతలను అందరినీ వరణము చేసెను (20).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 52 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 4 - THE 3rd RULE
*🌻 Kill out desire of comfort. - Be happy as those are who live for happiness. - 9 🌻*

225. C.W.L. – This is the remainder of Rule 4, the Chohan’s comment on the first three rules. The giant weed is the heresy of separateness – the idea of the separated self – which is truly the source of evil. We are directed to kill it out by stages. We are told first to unify the lower and the higher self, that is to say, to merge the personality in the individuality. 

For most of us the personal self is still so near that it tends to shut out the higher things. We have to work our way through that and gradually to transcend it, to get entirely rid of all selfishness. Then we have to begin upon the individuality.

226. Now, the individuality, the ego, is a very wonderful thing – complex, exceedingly beautiful and marvellously adapted to its surroundings, a glorious being indeed; yet eventually we must realize that even that is only an instrument that we have created by the working of many ages for the sake of the progress of the Monad. 

Because we have had to develop the idea of the separated self in the earlier stages of our progress, the giant weed; or the seed of it, is in the heart of everybody. That has to be killed out at one time or another, yet only the strong can tear it out from themselves at the beginning of their development. 

The weak must wait and let it go on growing while they are developing sufficient strength to kill it out. That is unfortunate for them, because the longer it is allowed to persist the more closely it becomes intertwined with the nature of the man. 

Those who can summon the courage to tear it out now will make rapid and much surer progress. Terrible as the struggle is to get rid of this separated self at any time, it will be thousands of times more difficult if we leave it until the later stages of our progress. 

Until it is finally destroyed we shall be subject to all kinds of difficulties and dangers from which we can escape only by getting rid of it here and now. Obviously, therefore, it is best to kill it out in the beginning.

227. All systems of occult teaching agree in advising students to try from the very beginning to get rid of this illusion. The difficulty in the way, apart from the habit of thinking of ourselves as separate, is that this idea has been the source of all our strength in the past. 

When the ego was first formed as an individual he was distinctly weak. He had been, until then, part of a group soul, and the idea of separate identity was not strong in him. It had to be intensified through the savage life. 

The man’s strength gradually grew from the feeling, “I am I”. In the earlier days it would be: “I am a great fighter and a swift runner; I am a mighty headsman; I can lead armies; I can guide men; I can make them do as I will.” 

Later on, it would express itself on a higher level as: “I have a mighty intellect; I can trust myself; I am proud of myself; I am a great man; I can think more strongly than other men and therefore I have power over their minds, and can sway them to do this or that.” It is through the sense of separateness that we have learnt to be self-reliant.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 184 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. విశ్వామిత్రమహర్షి - 4 🌻*

22. హరిశ్చంద్రుడు రాజ్యంపోయినా, కొడుకుపోయినా సత్యవ్రతమే గొప్పదని, ఇవన్నీ ఎప్పుడయినా నశించేవేనని, కాని సత్యవ్రతం శాశ్వతమైనటువంటి ఐశ్వర్యమనీ వివేకంతో గ్రహించాడు. అందుకే దారిద్య్రాన్నికూడా దుఃఖంలేకుండా అనుభవించాడు. “అయ్యో! భార్యను పోగొట్టుకుంటున్నాను. అయ్యో! రాజ్యం పోగొట్టుకున్నాను” అని ఏడవలేదు. చూచిన వాళ్ళు దుఃఖం పొందారు. 

22. కాబట్టి మహాత్ములెవరయినా సరే, కష్టం వచ్చినప్పుడు దుఃఖించలేదు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని చూచినవాళ్ళుమాత్రం దుఃఖించారు. విశ్వామిత్రుడు లేకపోతే హరిశ్చంద్రుడు లేడు, అతడి చరిత్ర లేదు. అతడిని అసత్యమాడించగలనని విశ్వామిత్రుడు ప్రతిజ్ఞచేసాడని మామూలుగా పురాణంలో వ్రాయబడింది. 

23. అలా వ్రాయబడిఉందికాని, వాస్తవంగా విశ్వామిత్రుడు అన్నది, “హరిశ్చంద్రుడి సత్యవ్రతదీక్షను నేను పరీక్షిస్తాను. మీరెవ్వరూ పరీక్షచేయలేరు!” అని. ఆ విధంగా ఆయనను పరీక్షించి నిలబెట్టి, “నా పరీక్షకు నీవు నిలబడ్డవు! నువ్వు ఏది అడిగినా నీకిస్తాను” అని హరిశ్చంద్రుడికి అన్ని కోరికలనూ తీర్చాడు.

24. విశ్వామిత్ర వాక్యాలలో మహాపాతకాలంటే ఏమిటో నిర్ణయించబడి ఉన్నది. ప్రాయశ్చిత్తం అనేది లేదు. అనుభవించి తీరవలసిందే! ఇహపరములూ రెండూ తెలిసిన ఋషులు వ్రాసారివన్నీ. ఇహంలో ఏధర్మాన్ని ఆచరిస్తే ఏ లోకం కలుగుతుందో తెలిసి, పరలోకస్వభావంకూడా తెలిసినవాళ్ళే ఇహలోక ధర్మం చెప్పలి. ఇక్కడి న్యాయం చూచినవాళ్ళు; అంతేగాక, పారలౌకికమైన ప్రవృత్తి ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి? పాశబంధనాన్నించి విముక్తి అంటే ఏమిటి? అది దేనివల్ల కలుగుతుంది-అవన్నీకూడా తెలిసిన మహర్షులే ఇక్కడ ఆచరించవలసిన ధర్మాన్ని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటలు మనకు శిరోధార్యములు.

25. విశ్వామిత్రుడు సప్తర్షిమండలంలోకి వెళ్ళి సప్తర్షులలో ఒకరుగా ఉండి, నిత్యుడు – శాశ్వతుడుగా వెలుగొందుతున్నారు. ఆయనకొక లోకం, పదవి ఉన్నది. ఆయనను స్మరణచేయటంతోటే దర్శనమిచ్చేటటువంటీ మహాత్ముడు, శక్తిసంపన్నుడు. ఆయనను స్మరించి స్తోత్రంచేస్తే ఉపాసిస్తే అనేక విశేషములయిన జ్ఞానములు కలుగుతాయి. 

26. ఆయన శక్తి ఎంతటిదో, ఆయన ఔదార్యముకూడా అంత గొప్పదే. ఆయనను అడిగితే ఏదయినా ఇస్తారు, ఇవ్వడంలో ముదువెనకలు లేవుమరి. ఆయన గొప్పదాత, క్షాత్ర లక్షణం కలిగినదాత. అందుకనే లోకలో-బ్రాహ్మణుడేం దానంచేస్తాడు, చేస్తే క్షత్రియుడే చెయ్యాలి, లేకపోతే వైశ్యుడివ్వాలి అని ఒక వాడుక ఉంది. వాళ్ళే దాతలు కాని, బ్రాహ్మణులెలా అవుతారు? బ్రాహ్మణులు ఇవ్వరు, తీసుకుంటారు. 

27. అంటే, దాత అనేవాడికి క్షాత్రగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి. రజోగుణం లేకపోతే ఇవ్వలేడు. “వాడడిగింది నాకు లేఖ్ఖా! అడిగింది ఇచ్చేస్తాను. నా దగ్గిన ఉన్నది ఇచ్చేస్తాను” అనుకుంటాడు దాత. దెండో ఆలోచన ఉండదు. ఖర్చుపెట్టేటప్పుడు దాతృత్వగుణానికి వెనకాల రజోగుణం ఉంటుంది. తీక్షణమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి – దాత ఒక వీరుడు, ధీరుడు అయి ఉండాలి. ‘దానవీరుడు’ అంటారందుకే. కర్ణాదులు అందరూ అలాంటివాళ్ళే, దానవీరులు వాళ్ళు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 248 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 97. Do nothing but stay in the knowledge 'I am', the 'moolmaya' -, or primary illusion, and then it will release its stranglehold on you and get lost.🌻*

Once you have understood the knowledge 'I am' you have to do nothing but just abide in it. The 'I am' is the primary illusion or concept and is also known as the 'moolmaya' (rootMaya). 

At present you are in the firm grip of Maya (illusion), come to the root of this Maya, which is the 'I am'. On abiding in the 'I am' in fact you are now holding Maya by the root or its neck!  

And what will happen now? Maya realizes its own existence is in danger and thus releases its stranglehold on you, runs away and vanishes.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 123 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 3 🌻*

512. నిర్వాణమే నిర్వికల్ప స్థితిగా రూపాంతర మొందును.

513. మానవుని స్థితిలో భగవంతుని 'మహా చైతన్యము' పరమాత్మపై ప్రకాశించి, పరమాత్మతో తాదాత్మ్యతను పొంది, "నేను భగవంతుడను" అనెడి అనుభవమును పొందును. ఇదియే జీవిత గమ్యము.

514. జీవిత గమ్యమును చేరుకొనుటయే నిర్వికల్ప సమాధి స్థితి.

515. సామాన్య మానవుడు నిత్యము రాత్రివేళ పరుండును. ఉదయము మేల్కొను చుండును. అట్లే - రాత్రివేళ గాఢ నిద్రవంటిది నిర్వాణస్థితి. ఉదయము, జాగ్రదవస్థ వంటిది దివ్య జాగృతియైన నిర్వికల్ప సమాథి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 87 / Sri Vishnu Sahasra Namavali - 87 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*శ్రవణం నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🍀 87. కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోనిలః !*
*అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః!! 87!! 🍀*

🍀 807. కుముదః 
భారమును తగ్గించి భూదేవిని సంతోషపెట్టిన వాడు.

🍀 808. కుందరః    
భూమిని చీల్చి హిరణ్యాక్షుని సంహరించిన వాడు. మోక్షమునిచ్చు తత్త్వజ్జానము ననుగ్రహించు వాడు.

🍀 809. కుందః    
భూమిని దానమిచ్చిన వాడు. కశ్యపమహర్షికి భూమిని దానము చేసిన పరశురామ స్వరూపుడు. అత్యుత్కృష్టమైన పరమభక్తిని అనుగ్రహించి ఇచ్చువాడు.

🍀 810. పర్జన్యః    
మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి, వారి మనసులను శాంతింప జేయువాడు.

🍀 811. పావనః    
తలచినంతనే పవిత్రుని చేయువాడు.

🍀 812. అనిలః     
వాయువు వలె అంతట వ్యాపించి యున్నవాడు. సదా జాగరూకుడు. ప్రేరణ కలిగించువాడు.

🍀 813. అమృతాశః     
అమృతము నొసగువాడు. నశించని ఆశ గలవాడు.

🍀 814. అమృతవపుః    
శాశ్వతుడు. నాశమెరుగని శరీరము గలవాడు.

🍀 815. సర్వజ్జః    
సర్వము తెలిసిన వాడు.

🍀 816. సర్వతోముఖః    
అన్నివైపుల ముఖములు గలవాడు. ఏకకాలమున సర్వమును చూడగలవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 87 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Sravana 3rd Padam*

*🌻 87. kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvanōnilaḥ*
*amṛtāśōmṛtavapuḥ sarvajñaḥ sarvatōmukhaḥ || 87 || 🌻*

🌻 807. Kumudaḥ:
 'Ku' means earth; one who gives joy (muda) to the earth by freeing it of its burdens is Kumuda.

🌻 808. Kundaraḥ: One who offers blessings as pure as Kunda or jasmine.

🌻 809. Kundaḥ: One who has limbs as beautiful as Kunda or Jasmine.