Showing posts with label భారతదేశం Bharat India. Show all posts
Showing posts with label భారతదేశం Bharat India. Show all posts

80వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు, స్వర్ణ గౌరీ వ్రతం, మరియు శ్రీ అరబిందో జన్మదిన 80th Independence Day, Swarna Gouri Vrat and Sri Arabindo Birthday




🌹 80వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు, స్వర్ణ గౌరీ వ్రతం, మరియు శ్రీ అరబిందో జన్మదిన శుభాకాంక్షలు అందరికి

Happy 80th Independence Day, Swarna Gouri Vrat and Sri Arabindo Birthday Greetings to All. 🌹



Prasad Bharadwaj

వందేమాతరం Vande Mataram - Original Full song



వందేమాతరం Vande Mataram - Original Full song

వందేమాతరం - 80వ స్వాతంత్య్ర దినోత్సవం Happy 80th India Independence Day




https://youtube.com/shorts/caZ7ruPI7eg


🌹 వందేమాతరం 80వ స్వాతంత్య్ర దినోత్సవం

Happy 80th Independence day 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹 🌹 🌹 🌹 🌹


కర్మ యొక్క చట్టం: భారతీయ శాశ్వత తత్వశాస్త్రంలో ఒక లోతైన భావన / The Law of Karma: A profound concept in Indian Sanatana philosophy (YT Short 1)



https://www.youtube.com/shorts/P6H3ZQPUXvo


🌹 కర్మ సిద్ధాంతం - Short 1 Law of Karma 1 🌹

🍀 భారతీయ సనాతన తత్త్వచింతనలో అత్యంత గంభీరమైన అంశమైన కర్మ సిద్ధాంతం Part 1 🍀


✍️ ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


కర్మ సిద్ధాంతం- సృష్టిని నడిపే ఒక నియమం- ఇది ఎలా పని చేస్తుంది? భారతీయ తత్త్వశాస్త్రం. Karma Laws- a law that governs the creation- how it works? Indian philosophy



https://youtu.be/fDllIeYkMl0

🌹 కర్మ సిద్ధాంతం - సృష్టిని నడిపే ఒక సహజ చక్ర నియమం - మన జీవితంలో అది ఎలా పని చేస్తుంది? భారతీయ తత్త్వచింతన.
Karma Siddhanta – The Natural Cyclic Law Governing Creation 🌹


🍀 “నేను ఎవరికీ కీడు చేయలేదు… మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి?” అనే ప్రశ్న ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తలెత్తుతుంది. ఈ వీడియోలో భారతీయ సనాతన తత్త్వచింతనలో అత్యంత గంభీరమైన అంశమైన కర్మ సిద్ధాంతం గురించి లోతుగా తెలుసుకుందాం. 🍀

✍️ ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


భారతీయ సంస్కృతిలో దేవతలను తామర పువ్వులపై కూర్చున్నట్లుగా ఎందుకు చిత్రిస్తారు? In Indian culture, why are deities depicted as seated on lotus flowers?


🌹 దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా ఎందుకు వర్ణిస్తారు? - కమలాసిని శ్రీ మహాలక్ష్మిదేవి ప్రత్యేకత 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 Why are deities depicted as seated on lotus flowers? - The specialty of Goddess Mahalakshmi, who is seated on a lotus 🌹

Prasad Bharadwaj



దేవతల అనుగ్రహం ఉన్నప్పుడే నిజమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు; వాక్కు, జ్ఞానం, వివేకం, ధాన్యం, ఆరోగ్యం, ఆయువు, సంతోషం వంటి సమస్త శుభసంపదల సమాహారమే ఐశ్వర్యం.

దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా వర్ణించడం వెనుక అత్యంత లోతైన ఆధ్యాత్మిక తాత్త్వికత ఉంది. పద్మం (కమలం) భారతీయ ఆధ్యాత్మిక తత్త్వంలో అత్యంత లోతైన ప్రతీక. ఇది కేవలం ఒక పుష్పం మాత్రమే కాదు. పద్మం అనేది పరిపూర్ణ వికాసానికి, పవిత్రతకు, ఐశ్వర్యానికి, వికసించిన జ్ఞానాన్ని మరియు దైవత్వాన్ని సూచించే దివ్య సంకేతం. మురికినీటిలో పుట్టినా ఆ మలినతకు అంటుకోకుండా, స్వచ్ఛంగా వికసించే పద్మంలానే, సంసార మధ్యలో ఉండి కూడా అహంకారం, లోభం, మోహం వంటి మలినాల నుండి దూరంగా నిలిచే శుద్ధ చైతన్యాన్ని ఇది సూచిస్తుంది.

దేవతా శక్తి అనేది జ్ఞానంలోనే, శుద్ధ చైతన్యంలోనే ప్రకాశిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. అదే విధంగా దేవతాశక్తి అనుగ్రహం ఉన్నప్పుడే నిజమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు; వాక్కు, జ్ఞానం, వివేకం, ధాన్యం, ఆరోగ్యం, ఆయువు, సంతోషం వంటి సమస్త శుభసంపదల సమాహారమే ఐశ్వర్యం. ఈ అన్ని ఐశ్వర్యాలను అధిష్ఠించి, నియంత్రించి, అనుగ్రహించే శక్తులే దేవతలు.

అందుకే ఐశ్వర్యాధిదేవతగా భావించే మహాలక్ష్మిని ‘కమలాసన’గా, పద్మంలో ఆసీనమైన రూపంగా వర్ణించారు. ఉపనిషత్తులు మన హృదయాన్ని కూడా ఒక పద్మంగా పేర్కొంటాయి. సద్భావాలు, కరుణ, శాంతి, ఆనందం వంటి గుణాలు ఆ హృదయ పద్మానికి పరిమళంలా మారి, జ్ఞానం వికసించినప్పుడు ఆ మనఃపద్మంలో దైవం గోచరిస్తాడని భావన. అందుకే పద్మంలో దైవాన్ని దర్శించడం అనేది బాహ్య అలంకార వర్ణన కాదు, అంతర్గత ఆధ్యాత్మిక అనుభూతికి సంకేతం.

యోగపరంగా పరిశీలిస్తే, సుషుమ్నా నాడి మార్గంలో ప్రవహించే దైవ చైతన్యం ఆరు ప్రధాన చక్రాలలో ఆవిష్కృతమవుతుంది. అవరోధాలు తొలగి, శక్తి స్వేచ్ఛగా ప్రవహించినప్పుడు ఆ చక్రాలు స్పందించి వికసిస్తాయి; అప్పుడు అవి పద్మాల్లా ప్రకాశిస్తాయని యోగశాస్త్రం చెబుతుంది. అందుకే ఆ ఆరు చక్రాలను ఆరు పద్మాలుగా వర్ణించారు. ఆ పద్మాలలో ప్రకాశించే ఆత్మచైతన్యమే దేవతా తత్త్వం. చివరికి బ్రహ్మరంధ్రంలో, సహస్రదళాలతో వికసించిన సహస్రార కమలంలో పరిపూర్ణ పరబ్రహ్మ తేజస్సు అనుభూతమవుతుంది. ఈ స్థితినే పరమపదం అంటారు. ఈ సర్వ తత్త్వాన్ని మనకు బోధించడానికే, మన అంతరంగంలోని పద్మాలను వికసింప జేసుకోవాలనే సంకేతంగా, దేవతలను పద్మాలలో కూర్చున్నట్లుగా దర్శించి ఆరాధించే సంప్రదాయం ఏర్పడింది.

🌹🌹🌹🌹🌹


44. భారతీయ సంస్కృతి యజ్ఞసంస్కృతి. 44. Indian culture is the culture of sacrifice.


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 44 🌹

🍀 44. భారతీయ సంస్కృతి యజ్ఞసంస్కృతి. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 Teachings of the Consciousness - 44 🌹

🍀 44. Indian culture is the culture of sacrifice. 🍀

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀