సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 32


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 32 🌹 
32 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 అహంకారము 1 🍃 

221. చిత్తము వలె అహంకారము కూడా అంతఃకరణ చతుష్టయములో ఒకటి. అహంకారము ఢాంభికము, మదము, గర్వముల ద్వారా వ్యక్తమవుతుంది. ఇవి శరీరానికి సంబంధించినవి. ఇది ఒక మాయాతత్వము. అరిషడ్వర్గాలు, దర్పం, డంబం మొదలగునవి అహంకార లక్షణములు.

222. అహంకార రూపములు: ధన మదము, విద్యా మదము, భోగ మదము, శీలము, రూపము, బలము, జ్ఞానము, కీర్తి మొదలగునవి కూడా అహంకార రూపములే. దేహ స్మృతి ఉన్నంత కాలము అహంకార స్మృతి ఉంటుంది. నేను నాది నావారు అనేది, నాకొరకు అనేవి అహంకార వ్యక్తీకరణములే.

223. బిరుదులు, డాంబికములు, పొగడ్తలు, అభినందనలపై ఆసక్తి కలవారు అహంకారము ఉన్నవారే. ఇట్టి డాంబిక, నామరూపాల ఆసక్తి కల్గి ఉండుట సాధనకు అడ్డంకులే. యోగి అయిన వాడు బాహ్యాలకు భ్రమపడరాదు.

224. మనస్సు యొక్క అంధకారమే అహంకారము. అహంకారము యొక్క బీజము అజ్ఞానమే. అవిద్యకు కారణము అహంకారము. అవిద్య తొలగించిన అహం అంతరించి పోతుంది. అహంకారము ఆత్మానుభవమునకు అడ్డుగా ఉన్నది. ''నేను'' పోతే ఉన్నది ఆత్మే.

225. అహంకారమునకు ఉనికి లేదు, స్పర్శకు అందనిది. అది పదార్థము కాదు. దాని స్వరూప లక్షణాలు తీవ్రముగా ఆలోచించి అన్వేషించవల్సి ఉంటుంది. ఇది అసుర రాజులను, సిద్ధులను, యోగులను, కూడా అధోగతిపాలు చేసినది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అహంకారము ఉండదు. స్వప్న జాగ్రత్తులలోనే అహంకారము ఉంటుంది. మరుపు, మరణము, మూర్ఛ, సుషుప్తి, సమాధులలో ''నేను'' తాత్కాలికముగా ఉండదు. ''నేను'' శాశ్వతముగా పోవాలి. తిరిగి రాకూడదు.

226. నేను, నాది, నా శరీరము, నా ఇల్లు, నా చెవులు, ప్రాణము, మనస్సు, బుద్ధి అని వేరువేరుగా భావించుచున్నారు. ఇవన్నీ ఆత్మకు వేరుగా ఉన్నవి.

227. నిజమైన భోగి ఫలాపేక్షరహితముగా సర్వం భగవంతునికి సమర్పించినప్పుడు సత్‌ఫలితములన్నీ తనవే. యోగ లక్షణం ''నేను'' అనేది పూర్తిగా తొలగిపోవాలి. సర్వం ''బ్రహ్మ'' అను భావం కలిగి ఉండాలి.

228. శరీరము ''నేనే'' అను భావము వలన కర్మలతో బంధం ఏర్పడి పునర్జన్మలందు ఆసక్తి కల్గి ఉండును. అహంకార రూపమే జీవుడు. శరీరాభిమానము ఒక విష రోగము. అహంకారం మాటల ద్వారా, పనుల ద్వారా, సంబంధాల ద్వారా వ్యక్తమవుతుంది. అహంకారము వలననె కర్మలు ఏర్పడతాయి. అహంకారము అసుర గుణము. పాప కర్మలకు దారితీయును. యోగ సాధనకు తగినది కాదు. కామ క్రోధాదులె అహంకార చిహ్నములు. కర్తృత్వము అహంకారమే. భోక్తృత్వము అహంకారమే.
🌹 🌹 🌹 🌹 🌹

09.Apr.2019

🌹 49 వాయువులు—మరుత్తులు 🌹

🌹 49 వాయువులు—మరుత్తులు 🌹

క్రియాయోగి శ్రీ కౌతా మార్కండేయ శాస్త్రి వ్రాసిన గీత అంతరార్థము అను గ్రంథము నుండి ఇవ్వబడినది.

వాయువులు—మరుత్తులు:

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం.రవిరంశుమాన్
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహంశశీ                        

నేను ఆదిత్యులలోవిష్ణువును, ప్రకాశింపజేయువానిలో కిరణములు గల సూర్యుడను,మరుత్తులను దేవతలలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను.
ఈ సందర్భముగా మహేశ్వర సూత్రములను ఉటంకించడమైనది.

మహేశ్వర సూత్రములు:
అయిఉణ్ ఋలుక్ ఏ ఓయ్ ఐఓచ్ హయవరాట్ లణ్ జ్ఞమణ్ణనమ్ జభగడదస్ ఖఫచఠదవ్ కపయ్
అనే శబ్దములవలన అచ్చులు, హల్లులు, హల్లులు మరియు అచ్చులు,  హల్లులతో కూడిన సంయుక్తాక్షరములు ఏర్పడినవి.

జ్ఞానము మరియు శక్తి రెండునూ గలది సూక్ష్మప్రాణశక్తి. దీని మూలము  సహస్రారచక్రము. ఈ 49 ముఖ్యఉపవాయువుల మూలము సహస్రారచక్రము మూలముగాగల సూక్ష్మప్రాణశక్తి.
ప్రతి ఉపవాయువునకు అద్భుతమైన తన తన ప్రత్యేకమైన విధులున్నాయి.  అవి ఆజ్ఞా చక్రముద్వారా విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాదారచక్రములకు పంచ/పంప బడినవి. ఈ చక్రములనుండి నరకేంద్రములకు, వాటిద్వారా వివిధ అవయవములకు పంపబడును.

మరుత్తులు ఏడుగురు. వారు:

1)ఆవహుడు, 2)ప్రవహుడు,3)వివహుడు, 4)పరావహుడు, 5)ఉద్వహుడు,   6)సంవహుడు, మరియు 7)పరివహుడు(మరీచి).

ఈ 49 ముఖ్య ఉపవాయువులు పైన పేర్కొన్నట్లుగా  ఏడు విధములుగా విభజించబడ్డాయి. ఈవాయువులు మన లోపల ఉన్నవి మరియు మన వెలుపలి బ్రహ్మాండములోను యున్నవి. అందువలననే బ్రహ్మాండము, మనస్సు మరియు శరీరమునకు సంబంధము ఏర్పడుచున్నది.
బ్రహ్మపదార్థమే ఈవిధముగా 49 ముఖ్యఉపవాయువులుగా వ్యక్తమైనది. ఇది తెలిసుకోకనే ఈ అస్తవ్యస్తము అయోమయము. ఇది తెలిసుకుంటే ఏ వ్యాకులతయుండదు.

ఆరు చక్రములలో ఉన్న అన్ని అక్షరములు కలిపి సహస్రారములో ఉండును.
ఆయా చక్రమునకు సంబంధించిన అక్షరములు, వాయువులు ఈ క్రింద ఇవ్వబడినవి.

A)అజ్ఞా  
1)ప్రవహ శ్వాసిని టానా మహాబల్   

B)విశుద్ధ
2) పరివహ విహగ ఉడ్డీయాన ఋతవాహ
3) పరివహ సప్తస్వర శబ్ద స్థితి,
4) పరివహ ప్రాణ నిమీళన బహిర్గమన త్రిశక్ర
5) పరావహ మాతరిశ్వా అణు సత్యజిత్,
6) పరావహ జగత్ ప్రాణ బ్రహ్మఋత 
7) పరావహ పవమాన క్రియార్ పరావస్థఋతజిత్
8) పరావహ నవప్రాణ ప్రాణరూపో చిత్వహిత్ ధాతా
9) పరావహ హమి మోక్ష అస్తిమిత్ర
10) పరావహ సారఙ్ నిత్య పతివాస 
11) పరావహ స్తంభన సర్వవ్యాపిమిత
12) ప్రవహ శ్వసనశ్వాస ప్రశ్వాసాదిఇంద్ర
13) ప్రవహ సదాగతి గమనాదౌ గతి
14) ప్రవహపృవదశ్యస్పర్శశక్తిఅదృశ్యగతి  
15) ప్రవహగంధ వాహ అనుష్ణ అశీతఈదృక్ష
16) ప్రవహ వాహ చలన వృతిన
17) ప్రవహవేగికంతభోగకామ

C)అనాహత 
18) ఉద్వహ వ్యాన జృంభణ ఆకుంచన ప్రసారణ ద్విశక్ర
19) ఆవహ గంధవహ గంధేర్ అణుకే ఆనే త్రిశక్ర
20) ఆవహ ఆశుగ శైఘ్రం అదృక్ష
21) ఆవహ మారుత భిత్తరేర్  వాయు అపాత్
22) ఆవహ పవన పవన అపరాజిత
23) ఆవహ ఫణిప్రియ ఊర్ధ్వగతి ధృవ
24) ఆవహ నిశ్వాసక త్వగింద్రియ వ్యాపి యుతిర్గ
25) ఆవహ ఉదాన ఉద్గీరణ సకృత్
26) పరివహ అనిల్ అనుష్ణ అశీత అక్షయ
27) పరివహ సమిరణపశ్చిమేర్ వాయు సుసేన
28) పరివహ అనుష్ణ  శీతస్పర్శ పసదీక్ష 
29) పరివహ సుఖాస సుఖదా దేవదేవ

D)మణిపుర  
30) వివహ వాతివ్యక్ సంభవ
31) వివహ ప్రణతి ధారనా  అనమిత్ర
32) వివహ ప్రకంపన కంపన భీమ
33) వివహ సమాన పోషణ ఏక జ్యోతి
34) ఉద్వహ మరుత ఉత్తరదిగేర్ వాయుసేనాజిత్
35) ఉద్వహ నభస్థాన అపంకజ అభియుక్త
36) ఉద్వహ ధునిధ్వజ ఆదిమిత 
37) ఉద్వహ కంపనా సేచనా ధర్తా
38) ఉద్వహ వాస దేహవ్యాపి విధారణ
39) ఉద్వహ మృగవాహన విద్యుత్ వరణ

E)స్వాధిష్ఠాన 
40) సంవహ చంచల ఉత్క్షేపణ ద్విజ్యోతి
41) సంవహ పృషతాంపతి బలంమహాబల
42) సంవహ అపాన క్షుధాకర అధోగమన ఏకశక్ర
43) వివహ స్పర్శన స్పర్శ విరాట్
44) వివహ వాత తిర్యక్  గమన పురాణహ్య 
45) వివహ ప్రభంజన మన పృథక్ సుమిత
       
F)మూలాధారము
46) సంవహ అజగత్ ప్రాణ జన్మమరణ అదృశ్య
47) సంవహ ఆవక్ ఫేలా పురిమిత్ర
48) సంవహ సమిర ప్రాతఃకాలేర్ వాయుసఙ్ మిత
49) సంవహ ప్రకంపన గంధేర్ అణుకే ఆనే మితాసన       
🌹🌹🌹🌹🌹
🙏 ప్రసాద్