Showing posts with label Dhanurmasam ధనుర్మాస. Show all posts
Showing posts with label Dhanurmasam ధనుర్మాస. Show all posts

జనవరి 03 ఆకాశంలో అద్భుతం... A spectacular event in the sky on January 3rd...


🌹 జనవరి 03 ఆకాశంలో అద్భుతం.. 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 A spectacular event in the sky on January 3rd... 🌹
Prasad Bharadwaj


ముక్కోటి + ఆరుద్ర నక్షత్రం + శనివారం ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ రాదు.. ముఖ్యంగా ఆడవాళ్లు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలా దీపం పెట్టి,పూజ చేస్తే ద్విపుష్కరయోగం పడుతుంది..

ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది. ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వలే శివుడికి శివ ముక్కోటి కూడా అంత విశిష్టమైనదిగా పండితులు చెబుతారు.

ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా చెబుతారు. ఈ ఏడాది ఈ శివ ముక్కోటి 2026 జనవరి 3వ తేదీన వచ్చింది. శనివారం పౌర్ణమి తిథితో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శివ ముక్కోటి గురించిన విషయాలు తెలుసుకుందాం..

నూతన సంవత్సరం 2026 జనవరి 3వ తేదీ శనివారం. ఈరోజున ఆర్ద్ర నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం (Arudra Nakshatra) ఉంటుంది. ఇది శివుడి (Lord Shiva) జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ నక్షత్రానికి విశిష్టత ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్రరూపం, వినాశన, పునరుత్పత్తి శక్తులకు, భావోద్వేగ తీవ్రత, పరివర్తనకు ప్రతీక. ఇది కన్నీటి చుక్కగా సూచించబడుతుంది. అయితే ఈ జనవరి 3వ తేదీ ధనుర్మాసంలో వస్తుంది. ఈ మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం రోజున శివుని నక్షత్రంగా.. ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు. దీనిని శివ ముక్కోటి అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువుకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదిగా చెబుతారో.. శివుడికి శివ ముక్కోటి కూడా అంతే విశిష్టమైనది.


జనవరి 3 శనివారం

అయితే ఈ ఏడాది ఈ శివ ముక్కోటి జనవరి 3వ తేదీన శనివారం రోజు అందులోనూ పౌర్ణమి తిథితో కలిసి రావడం ఈ శివ ముక్కోటి విశేషమైన ప్రాధాన్యత నెలకొంది. ఈరోజున శివారాధనకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజున పూర్వకాలం సంప్రదాయంగా కంచి పీఠాధిపతులు ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషం ఏమిటంటే.. ఆరోజున తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటల లోపు పవిత్ర స్నానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తుందట. అలాగే చాలా కాంతివంతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందట. కాబట్టి ఈరోజున తెల్లవారుజామునే శివ రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని.. సాక్షాత్తు శివుడిని దర్శించుకున్న ఫలితమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు.


పూజా విధానం

ఈ రోజున శివుడిని నెయ్యితో అభిషేకం చేయడం, అర్చన చేయడం శుభప్రదం. ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం చదవడం, సంపద కోసం శివ పంచాక్షరి పఠించడం, శివ నామస్మరణ చేయడం, ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి పఠించడం, శివ స్తోత్రాలు వంటివి పఠించడం ఎంతో శుభప్రదం. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోరుకునే వారు గరికను నానబెట్టిన జలంతో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. అలాగే పౌర్ణమి తిథి కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయడం ఎంతో మంచిది. అంతే కాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలం రంగు పుష్పాలతో అర్చన చేయడం కూడా శుభప్రదం. ఇలా చేయడం వల్ల శని గ్రహ అనుకూలత కలుగుతందని కూడా చెబుతారు. ఇక నివేదనలో పరమాన్నం నివేదన చేసి.. ఇతరులకు పంచడం చేయడం మంచిది.

🌹 🌹 🌹 🌹 🌹


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 4 - పాశురాలు 7&8 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 4 - Pasuras 7&8



https://youtu.be/E7vQ53MC3QA


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 4 - పాశురాలు 7&8 Tiruppavai Pasuras Bhavartha Gita Series 4 - Pasuras 7&8 🌹

🍀 7వ పాశురం – భక్తి పూజకు సిద్ధమైన వైనం, 8వ పాశురం – ఉషోదయ జాగరణ గీతం 🍀


రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఏడవ పాశురంలో గోదాదేవి తన చెలికత్తెను మేల్కొలుపుతూ, భగవంతుని కీర్తించే సమయం ఆసన్నమైందని, త్వరగా లేచి రమ్మని పిలుస్తుంది. తిరుప్పావై ఎనిమిదవ పాశురంలో మనం అందరం కలిసి వెళ్ళడం వల్ల కృష్ణుడి అనుగ్రహం త్వరగా లభిస్తుందని, సమూహంగా వెళ్లి భగవంతుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను, మరియు భక్తిలో ఐకమత్యం యొక్క ప్రాముఖ్యతను గోదాదేవి నొక్కి చెబుతుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹



ధనుర్మాసం విశిష్టత / The significance of Dhanurmasam



🌹 ధనుర్మాసం విశిష్టత - దైవ ఆశీస్సులను పొందడానికి చేసే భక్తి సాధనలకు ఉత్తమ సమయం. లౌకిక శుభకార్యాలకు విరామం. 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 The significance of Dhanurmasam - It is the best time for devotional practices to receive divine blessings. A period of pause for worldly auspicious events. 🌹

Prasad Bhardwaj



కాలచక్రంలో పంటలు పండించే భూమికి కూడా రుతువుల మార్పులో కొంతకాలం విశ్రాంతి అవసరమైనట్టే.. గ్రహగతుల రీత్యా శుభకార్యాలకు కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఉంటుంది. ఉత్తరాదిన దీన్ని ఖర్మాస్ అని పిలిస్తే... తెలుగు నాట ‘ధనుర్మాసం’ అంటారు. ధనుర్మాసం దైవారాధనకు ఇది అత్యంత పవిత్రమైన సమయమే అయినా, శుభకార్యాలకు మాత్రం నిషిద్ధం.

ధనుర్మాసం 2025 డిసెంబర్ 16న ప్రారంభమైంది. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుభకార్యాలకు విరామం ఇచ్చే కాలాన్ని సూచిస్తుంది. సూర్యదేవుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుందని జ్యోతిష్య నమ్మకం. ఈ కాలంలో సూర్యుని ప్రభావం తగ్గుతుందని విశ్వసిస్తారు. అందుకే ప్రధాన వేడుకలు, నూతన ప్రారంభాలను ఈ సమయంలో వాయిదా వేస్తుంటారు.

సూర్యుడు ప్రతి ఏటా రెండుసార్లు ధనస్సు లేదా మీన రాశులలోకి ప్రవేశించినప్పుడు ఈ కాలం వస్తుంది. ఈ రెండు రాశులకు అధిపతి గురుడు (బృహస్పతి). ఈ సమయంలో సూర్యుడు గురుగ్రహ ప్రభావంతో విశ్రాంతి తీసుకుంటాడని గ్రంథాలు, జ్యోతిష్య సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదు. ఆధ్యాత్మిక సాధనలు, దానధర్మాలకు ఈ కాలం ఎంతో అనుకూలమైనది.

గ్రహ దోషాలను తగ్గించి, దైవ ఆశీస్సులను పొందడానికి ఈ సమయం ఉత్తమమని నమ్ముతారు. ముఖ్యంగా సూర్యదేవుడు, బృహస్పతి అనుగ్రహం కోసం చేసే పూజలు విశేష ఫలితాలనిస్తాయి. జ్యోతిష్యుల ప్రకారం డిసెంబర్ 16న తెల్లవారుజామున 4:26 గంటలకు సూర్యదేవుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమైంది. సూర్యుడు ఈ రాశిలో 2026 జనవరి 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి మారతాడు. ఈ మార్పుతో మకర సంక్రాంతి రోజున ధనుర్మాసం ముగుస్తుంది. అప్పటి నుంచి శుభకార్యాలకు అనుకూల ముహూర్తాలు తిరిగి వస్తాయి.

ధనుర్మాసం సమయంలో కొన్ని ప్రధాన శుభకార్యాలు, ప్రారంభోత్సవాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు. వీటిలో వివాహాలు, నిశ్చితార్థాలు, పిల్లల నామకరణం, శిరోముండనం, ఉపనయనం వంటి సంస్కారాలు కూడా ఈ కాలంలో చేపట్టడం మంచిది కాదని చెబుతారు. కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించడం, ఆస్తి కొనుగోళ్లు, వాహనాలు కొనడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం వంటివి కూడా ఈ కాలంలో నివారించాలి. ధనుర్మాసం సమయంలో ఇలాంటి కార్యకలాపాలను ప్రారంభించడం ఆలస్యాలకు, ఆటంకాలకు లేదా ప్రతికూల ఫలితాలకు దారితీస్తుందని జ్యోతిష్య నమ్మకం.

భౌతిక కార్యకలాపాలకు పరిమితులు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక వృద్ధికి, దోష నివారణలకు ధనుర్మాసం చాలా ప్రయోజనకరమైన సమయం. ప్రతిరోజూ ఉదయం రాగిపాత్రలో నీరు, కుంకుమ, ఎర్రటి పువ్వులు, బియ్యం కలిపి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం శ్రేష్ఠం. అలాగే, మంత్ర పఠనం, ధ్యానం, తపస్సు, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.

వీలైతే గంగానదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. ఆవులు, బ్రాహ్మణులు, పేదల సేవలో పాల్గొనడం శ్రేష్ఠం. ఈ కాలంలో కనీసం ఒకసారైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోయి, దైవ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

పండుగలకు అశుభకరమైనదిగా భావించినా, ధనుర్మాసం ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సమయం. ఈ కాలంలో నిష్ఠతో కూడిన భక్తి, దానధర్మాలు, క్రమశిక్షణ దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం, సానుకూల మార్పులను తెస్తాయని జ్యోతిష్యులు పేర్కొన్నారు. ధనుర్మాసంలో భక్తులు తమ లౌకిక ఆకాంక్షలను తగ్గించుకుని, అంతర్ముఖులై విశ్వాసం మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందించుకోవాలి.

🌹🌹🌹🌹


ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు The Meaning & Benefits of Rangoli Designs & Gobbi Emblems during Dhanurmasam



🌹 ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు 🌹

ప్రసాద్ భరద్వాజ



ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వలన లభించే ‘ధనుర్వాయువు’ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి అనేక శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే.

గోదాదేవి ఆరాధన: ధనుర్మాసంలో గోదాదేవి శ్రీమహావిష్ణువును పతిగా పొందాలని ‘తిరుప్పావై’ వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామి వారికి స్వాగతం పలకడానికి, మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేసే వారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరాధనా భావనతోనే భక్తులు ముగ్గులు వేస్తారు.

గొబ్బెమ్మల విశిష్టత : ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను గోదాదేవి అంశగా, శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మలను పసుపు, కుంకుమలతో అలంకరించడం వల్ల సాక్షాత్తూ మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.

భూత దయ (జీవ కారుణ్యం): ముగ్గులను బియ్యపు పిండితో వేయడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడం (భూత యజ్ఞం) ద్వారా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇది పర్యావరణ స్పృహను మరియు జీవ కారుణ్యాన్ని తెలియజేస్తుంది.

ధనుర్మాస ముగ్గులు కేవలం సంప్రదాయమే కాదు, దీని వెనుక కొన్ని ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ధనుర్వాయువు పీల్చడం: ధనుర్మాసంలో తెల్లవారుజామున వచ్చే గాలిని ‘ధనుర్వాయువు’ లేదా బ్రహ్మ ముహూర్తపు స్వచ్ఛమైన గాలి అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముగ్గులు వేయడానికి ఉదయాన్నే లేవడం వల్ల ఈ స్వచ్ఛమైన గాలి శరీరానికి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఏకాగ్రత మరియు మెదడు పనితీరు: చుక్కల ముగ్గులు, గీతలతో కూడిన సంక్లిష్టమైన ముగ్గులు వేయడం వల్ల మెదడుకు పని లభిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి, మానసిక ప్రశాంతతను మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది.

ఈ ముగ్గులు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి చిహ్నం. ఇంటి ముందర ముగ్గు ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ, లక్ష్మీప్రదంగా ఉంటుందని నమ్మకం. నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) లోపలికి రాకుండా ఈ ముగ్గులు అడ్డుకుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముగ్గు శుభప్రదమైన ప్రారంభానికి సంకేతం.

🌹🌹🌹🌹🌹

3వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 3rd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Malika


https://youtube.com/shorts/dShNLpo8VrM


🌹 3వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 3rd Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹

🍀 3వ పాశురం - హరి భక్తి దీక్షా గీతం 🍀




తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 2 - పాశురాలు 3&4 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 2 - Pasuras 3&4



https://www.youtube.com/watch?v=_wnD-_LyvB8


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 2 - పాశురాలు 3&4 Tiruppavai Pasuras Bhavartha Gita Series 2 - Pasuras 3&4 🌹

🍀 3వ పాశురం - హరి భక్తి దీక్షా గీతం, 4వ పాశురం - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀


తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ



🍀 గోదాదేవి రచించిన 30 పాశురాలు ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లతో జీవించాలని.. తోటివారికి సాయపడాలని.. భగవంతుడిని తప్పకుండా ఆరాధించాలని సూచిస్తాయి. ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు గానం చేస్తారు. మొదటి 5 పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్య ఉద్దేశం తెలియ జేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే సకాలంలో వానలు కురుస్తాయి, పంటలు పుష్కలంగా పండుతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడిని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని.. గోదాదేవి చెబుతుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



తిరుప్పావై 2వ పాశురము భావ గాన మాలిక / Tiruppavai 2nd Pasuramu Bhava Gana Malika



https://youtube.com/shorts/JfMaIVhMVlI



🌹 తిరుప్పావై 2వ పాశురము భావ గాన మాలిక Tiruppavai 2nd Pasuramu Bhava Gana Malika 🌹


తప్పకుండా వీక్షించండి

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


తిరుప్పావై 1వ పాశురము భావ గాన మాలిక / Tiruppavai 1st Pasuramu Bhava Gana Malika


https://www.youtube.com/shorts/v55r2lwUUBA


🌹 తిరుప్పావై 1వ పాశురము భావ గాన మాలిక Tiruppavai 1st Pasuramu Bhava Gana Malika 🌹



తప్పకుండా వీక్షించండి

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹




తిరుప్పావై పాశురాలు భావార్థ గీత మాలిక 1, 2 పాశురాలు / Tiruppavai Pasuras Bhavartha Gita Series 1 and 2



https://www.youtube.com/watch?v=W6L73PpYZVc


🌹 తిరుప్పావై పాశురాలు భావార్థ గీత మాలిక 1, 2 పాశురాలు
Tiruppavai Pasuras Bhavartha Gita Series 1 and 2. 🌹


తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹




Dhanurmasam Special - Sri Vishnu Das Avatar



https://youtube.com/shorts/MzkkF-UHiyo


🌹 DHANURMASAM special శ్రీ విష్ణవు దశావతారాలు యధాయధాహి ధర్మస్య సంభవామి యుగేయుగే Sri Vishnu Das avatar 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

Dhanurmasam - గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం ధనుర్మాసం, ధను సంక్రాంతి శుభాకాంక్షలు


🌹 గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం ధనుర్మాసం, ధను సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



ఓం శ్రీ రంగనాథాయ నమః

ఓం గోదాయై నమః


🌿 విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. నిత్యం తిరుప్పావై పారాయణం చేస్తూ విష్ణుమూర్తిని, శ్రీ కృష్ణుని తులసి ఆకులతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని అలాగే సంపద, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ముఖ్యమైనదని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతం సందర్భంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించింది. ఒకటి నుంచి ఐదు రోజులు నియమ నిబంధనలకు సంబంధించిన పాశురాలు, 6వ రోజు నుంచి 15వ రోజు వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి సందగోపుని గృహానికి వెళ్లడం. 16, 17, 18వ రోజుల్లో పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ రోజు పాశురంలో మంగళాశాసనం, 25, 26వ రోజుల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని తమ శరణాగతిని అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నేరవేర్చమని ప్రార్థిస్తారు. చివరి రోజు గోదారంగనాథుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం మొత్తం నిత్యం ప్రతి ఇంటి ముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. 🌿


🍀 1.పాశురము 🍀

మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱై దరువాన్

పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము - సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించు చున్నది.


🍁 ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు 🍁

2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్‌ సేవ(తూమని మాడత్తు)

డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి (ఉత్తరద్వార దర్శనం)


2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ)

జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి (అన్జు ఇవ్వులగం)


జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ (కూడారై వెల్లుం)

జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం

🌹 🌹 🌹 🌹 🌹

ధనుర్మాసం విశిష్టత - Significance of Dhanurmasam



https://youtu.be/_er39Yddgo4


🌹 ధనుర్మాసం విశిష్టత - DHANURMASAM SIGNIFICANCE - గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం 🌹

ప్రసాద్ భరద్వాజ


🍀 సూర్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలను ధనుర్మాసం అంటారు. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెలరోజులని ధనుర్మాసము అంటారు. ఈ నెల రోజులు తెల్లవారుజామున కాలం అత్యంత పవిత్రమైనది. ధను అంటే ఏదో ఒకదాని కోసం ప్రార్థించడం. ఈ నెల రోజులూ ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం, వైకుంఠద్వార దర్శనం, గబ్బెమ్మలను పెట్టడం, విష్ణు, లక్ష్మీ పూజలు చేస్తారు. ఈ నెలరోజులు విష్ణు ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


ధను సంక్రాంతి ప్రాముఖ్యత. Significance of Dhanu Sankranti



https://youtu.be/lQES5Sj9jzE


🌹 ధను సంక్రాంతి ప్రాముఖ్యత. DHANU SANKRANTHI SIGNIFICANCE ప్రతికూల శక్తులు తొలగి, సుఖశాంతులు, సంపద వృద్ధి కొరకు చేయవలసిన విధులు. 🌹

🍀 ధను సంక్రాంతి అనేది కొత్త ఆధ్యాత్మిక మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని ధను సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అగ్నితత్వ రాశి అయిన ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ రోజు సూర్య ఆరాధనతో ఆరోగ్యం, మానసిక బలం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడతాయి. సూర్య దోషాలతో బాధపడేవారికి లేదా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారికి ఇది అత్యంత శుభప్రదమైన దినం. 🍀

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


ధనుర్మాసం విశిష్ఠత - ధనుర్మాస వ్రతం Dhanurmasam Vratam (Day long fasting)


🌹. ధనుర్మాసం విశిష్ఠత - ధనుర్మాస వ్రతం 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ

ధనుర్మాస ప్రారంభం 15-12-2023


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మికాంతం కమల నయనం యోగి హృధ్యాన గమ్యం వందే విష్ణుమ్ భవ భయహరం సర్వలోకైక నాదం.

దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుడే ధనుర్మాసం ప్రాత:కాలంలా పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడము అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్‌ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అంటే మంగళ కరమైన అని , ‘పావై’ అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది.

ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.



🌻. ధనుర్మాస వ్రతం 🌻

ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, కృష్ణుని లేదా శ్రీ రంగనాథులను అర్చిస్తారు. తిరుప్పావై పాశురాలను రోజుకొక్కటి గానం చేయాలి. ఈ మాసంలో ఒంటి పూట భోజనం ఆచరించాలి. బ్రహ్మచర్యం ఉత్తమం. భగవంతుని నామాన్ని కీర్తిస్తూ, పలు రకాల పువ్వులతో స్వామిని పూజించింది గోదాదేవి. శ్రీ రంగనాథులు, గోదాదేవి కల్యాణం చేయాలి. మనస్సు, మాట, శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ధనుర్మాస వ్రతం, మార్గశీర్ష వ్రతం, సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారట. ఈ మాసంలో స్వామి వారికి పొంగలి నైవేద్యంగా పెట్టాలి.

ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి.

ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూ గానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈ నెల రోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేని వారు 15 రోజులు గానీ, 8 రోజులు గానీ, 6 రోజులు గానీ, 4 రోజులు గానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు

ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాల ముగ్గులతో కనుల విందుగా వుంటాయి. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంభారాలతో పల్లెలు “సంక్రాంతి “పండుగ కోసం యెదురు చూస్తూ వుంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి "ముక్కోటి ఏకాదశి" వస్తుంది. ఆరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి వారికి ఆ రోజు తులసి మాలను సమర్పిస్తారు. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్ర వ్రచనం.

🌹 🌹 🌹 🌹 🌹