22-JULY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 230 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 431🌹 
3) 🌹 వివేక చూడామణి - 106 / Viveka Chudamani - 106🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -58🌹  
5) 🌹 Osho Daily Meditations - 47🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 107 / Lalitha Sahasra Namavali - 107🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 107 / Sri Vishnu Sahasranama - 107🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. గీతోపనిషత్తు -230 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 14

*🍀 13. నిత్య స్మరణము - చిత్త మితర విషయములందు తగులుకొనక బ్రహ్మమును తగులుకొని యుండవలెను. అట్లుండుటకు ఇతర విషయములుగ గోచరించుచున్న దంతయు బ్రహ్మమే అని గుర్తు తెచ్చుకొనవలెను. కనపడుచున్నదని బ్రహ్మమే అని భావించవలెను. నిజమునకు బ్రహ్మము కాక మరియొకటి లేదు. బ్రహ్మమే ప్రకృతి ఆవరణలతో కూడి గోచరించుచున్నది. ఈ భావ మెల్లప్పుడుండవలె ననునది సూచన. 🍀*

అనన్యచేతా స్సతతం యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః || 14

తాత్పర్యము : అనన్యమగు ఎరుకవలన, నిత్యస్మరణ వలన ఎల్లప్పుడును నిరంతర ధ్యానపరుడు అగుటవలన, యోగి సులభముగ 'నన్ను' చేరగలుగుచున్నాడు. నే నతనిచే పొందబడు చున్నాను.

వివరణము : బోధన యందు మరల మరల విలువైన విషయములు తెలుపుట యుండును. కనుక ఈ శ్లోకమున విలువైన విషయములను మరల మరల భగవానుడు తెలుపుచున్నాడు. అందు (1) అనన్యచింతనము, (2) సతతచింతనము, (3) నిత్యస్మరణము, (4) నిత్యయుక్తత ప్రధానముగ మరల తెలుపుట జరుగుచున్నది. 

1) అనన్య చింతనము : చిత్త మితర విషయములందు తగులుకొనక బ్రహ్మమును తగులుకొని యుండవలెను. అట్లుండుటకు ఇతర విషయములుగ గోచరించుచున్న దంతయు బ్రహ్మమే అని గుర్తు తెచ్చుకొనవలెను. కనపడుచున్నదని బ్రహ్మమే అని భావించవలెను. నిజమునకు బ్రహ్మము కాక మరియొకటి లేదు. బ్రహ్మమే ప్రకృతి ఆవరణలతో కూడి గోచరించుచున్నది. ఈ భావ మెల్లప్పుడుండవలె ననునది సూచన. 

2. సతతచింతనము : చింతన ఎల్లప్పుడునూ యుండవలెను. విను చున్నపుడు, త్రాగుచున్నపుడు, చూచుచున్నపుడు, పని యందు విరామమందు అన్నివేళల, అన్ని దేశములందు, అన్ని రూపములందు అన్ని నామములయందు బ్రహ్మమే ఉన్నాడని భావింప వలెను.

3. నిత్యస్మరణము : నిత్యస్మరణకై ఏదియో ఒక మంత్రమును ఉపాసించుట యిచ్చట చెప్పలేదు. కనబడుచున్న దానియందు బ్రహ్మమును దర్శించుట తెలుపబడినది. ఎన్ని చూచినను, ఎన్ని చేసినను, ఏమి అనుభవించుచున్నను అంతయూ బ్రహ్మమే అను స్మరణ యుండవలెను.

4. నిత్యయుక్తత : తన లోపల, తన వెలుపల అంతయు బ్రహ్మమే నిండియుండగ, తానందిమిడి యున్నాడని, బ్రహ్మము లేక తాను లేడని, నిజమునకు బ్రహ్మమునకు, తనకు అవినాభావమగు అనుబంధ మున్నదని తెలిసియుండవలెను. 

పై తెలిపిన విధముగ బ్రహ్మముతో కూడియుండుట యోగము. పై నాలుగు విధములుగ బ్రహ్మముతో కూడియుండు ప్రయత్నము చేయువానికి సులభముగ యోగము సిద్ధించును. అక్షరము, పరము అయిన బ్రహ్మముతో కూడియుండి శాశ్వతుడై యుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 430🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 25

*🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 7 🌻*

పరబ్రహ్మ యొక్క సగుణ రూపమే శివుడు. ఆయన భక్తుల కొరకై ఆకారమును పొందినాడు. ఆయనకు లౌకికమగు సామర్థ్యమును ప్రదర్శించవెననే ఆకాంక్ష లేనే లేదు(64) ఇందువలననే అవధూత స్వరూపుడు పరమానంద ఘనుడునగు శివుడు పరమహంసలకు ఆనందముతో పొందదగిన పరమగతియై ఉన్నాడు.(65) మాయా లేపము గలవారికి అలంకారాదుల యందు అభిరుచి ఉండును. కాని పరబ్రహ్మకు అట్టి అభిరుచి ఉండదు. ఆ ప్రభుడు నిర్గుణుడు, పుట్టుక లేని వాడు. మాయాలేపము లేనివాడు, ఆయన స్వరూపము ఇంద్రియ గోచరము కాదు. కాని విరాడ్రూపములో నున్నది ఆయనయే (66). 

ఓ బ్రాహ్మణులారా! ధర్మము, జాతి, మొదలగునవి శివుని అనుగ్రహమును పొందుటలో హేతువులు కాజాలవు. గురువు యొక్క అనుగ్రహము చేత మాత్రమే నేను శివుని యథార్ధ స్వరూపము నెరింగినాను.(67)

ఓ బ్రహ్మణులారా! ఆ శివుడు నన్ను వివాహమాడనిచో, నేను అవివాహితురాలిగా శాశ్వత కాలము మిగిలి యుందును. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను.(68) సూర్యుడు పశ్చిమ దిక్కునందు ఉదయించిననూ, మేరు పర్వతము కదలజొచ్చిననూ, అగ్ని చల్లబడిననూ, పర్వతశిఖరముపై రాతి మీద పద్మము వికసించిననూ, నా ఈ హఠము చలించదు. నేను సత్యమును పలుకుచున్నాను.(69).

బ్రహ్మ ఇట్లు పలికెను- 

ఇట్లు పలికి ఆ పార్వతి వెంటనే ఆ మహర్షులకు నమస్కరించి వికారము లేని మనస్సుతో శివుని స్మరించి విరమించెను.(70) ఆ ఋషులు కూడా పార్వతి యొక్క ఇట్టి దృఢనిశ్చయము పెరంగి, 'జయము కలుగుగాక! 'అని ఉత్తమమగు ఆశీర్వచనమును పలికిరి(71). 

అపుడు అనందముతో నిండిన మనస్సుగల ఆ మునుల ఆ దేవికి నమస్కరించిరి. ఓ మహర్షీ! వారీ విధముగా ఆమెను పరీక్షించి వెంటనే శివుని స్థానమునకు వెళ్లిరి(72). వారు అచటకు వెళ్లి శివునకు నమస్కరించి ఆ వృత్తాంతమును నివేదించి ఆయన ఆజ్ఞను పొంది ఆదరముతో స్వర్గలోకమునకు వెళ్లిరి (73).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీ ఖండలో సప్తర్షులు పరీక్ష చేయుట అనే ఇరువది యైదవ అధ్యాయము ముగిసినది (25).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 106 / Viveka Chudamani - 106🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 24. సమాధి స్థితి - 2 🍀*

356. ఎవరైతే సమాధి స్థితిని చేరగలడో వారి తనలోని మార్పులనే బానిసత్వము నుండి స్వేచ్ఛను పొందగలడు వారు ఈ వస్తు ప్రపంచాన్ని, మనస్సును, అహంకారమును ఆత్మలో లయము చేసి అత్యున్నత విజ్ఞానమును పొంది ఇతరములైన పుస్తక జ్ఞానమును త్రోసిపుచ్చును. 

357. ఎన్ని విధములైన ఉపాదులు ఉన్నప్పటికి మనిషి ఖచ్చితముగా తనను గూర్చి తాను ఆలోచించి అట్టి ఇతర భావనలనుతొలగించుకొని శాశ్వతమైన ఆత్మను పొందలగడు. అందువలన తెలివి గల వ్యక్తి ఎల్లపుడు నిర్వికల్ప సమాధి సాధనకు కృషి చేసి తనను అంటి పెట్టుకొని ఉన్న ఉపాధులను తొలగించుకొనగలడు. 

358. ఎవరైతే సత్యానికి అంటి పెట్టుకొని ఉంటాడో అతడు సత్యమే అవుతాడు. అందుకు అతడు ఏకాగ్రతతో సాధన చేయాలి. భ్రమల కీటక న్యాయములో భ్రమరము సదా ఝుంకారము చేయగా చేయగా కీటకము భ్రమరముగా మారుతుంది. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 106 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 24. Samadhi State - 2 🌻*

356. Those alone are free from the bondage of transmigration who, attaining Samadhi, have merged the objective world, the sense-organs, the mind, nay, the very ego, in the Atman, the Knowledge Absolute – and none else, who but dabble in second-hand talks.

357. Through the diversity of the supervening conditions (Upadhis), a man is apt to think of himself as also full of diversity; but with the removal of these he is again his own Self, the immutable. Therefore the wise man should ever devote himself to the practice of Nirvikalpa Samadhi, for the dissolution of the Upadhis.

358. The man who is attached to the Real becomes Real, through his one-pointed devotion. Just as the cockroach thinking intently on the Bhramara is transformed into a Bhramara.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 58 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆచరణ- ఆధ్యాత్మికత 🌻

కార్యరూపము ధరింపని సత్సంకల్పములు స్వప్నములోని భవనములు. అందు నివసించుట అభిలాషయే గాని అనుభూతి కాదు. 

మంచిపనులు చేయవలెనను అభిలాష నిరంతర ధారణలో ఉన్నను, భౌతిక సిద్ధిలేనిదే ప్రయోజనము శూన్యము. 

ప్రాచీనుల ఆధ్యాత్మిక వాదమునందు భౌతిక సిద్ధి కూడా పునాదిగా ఇమిడి ఉన్నది. అధి+ఆత్మము అను పదమునకు ఆత్మను అధిష్టించినది అని అర్థము. 

ఆత్మ అనగా దేహములోని భౌతిక పదార్థము మొదలు "నా" లోని అనుభూతి వరకు వ్యాపించిన అంతర్యామి తత్త్వము. కనుక ఆధ్యాత్మికము అనగా భౌతిక సిద్ధి వరకు సాధింపబడిన సృష్టి.

 ప్రాణమయ, మనోమయాది కోశముల ప్రత్యేక ప్రవర్తనచే చెదరగొట్టబడిన ఆత్మ అనబడు అంతర్యామి అనుభూతి మరల సక్రమము చేయబడిన ప్రాణమయాది కోశములలో రుచి చూడబడుటయే ఆధ్యాత్మిక సాధనము. ఈ రుచియే సిద్ధి. కనుక సత్కర్మ అనగా ఈ సిద్ధిని కలిగించు సాధన ప్రక్రియ. 

సత్కర్మల యందు పలువురకు అభిలాష కలదు. మానవులలో పలువురు మంచివారే. అందు ఆచరణ ప్రధానమగు మార్గమే సాధన అనబడును. 

ఆచరణ అనగా నిత్యజీవన కార్యక్రమమున నెలకొను సత్కర్మల ఆచరణము, దీనికై జపతపాదులు,‌ ఆసన ప్రాణాయామాదులు, పరిశుద్ధిని కలిగించి అభిలాషను ఉన్ముఖత్వమును కలుగజేయును. అందేదియు పరమావధులు కావు. 

జీవితమొక్కటే,‌ అందును ఐహికాచరణము ఒక్కటే పరమావధి. ఇది లేని జపతపాదులు,‌ యజ్ఞయాగాదులు పంటలేని చెట్ల వంటివి. కనుక జపతపాదులచే నిత్యజీవితము నిండినప్పుడే ఆనందానుభూతి కలుగును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 47 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 POVERTY 🍀*

*🕉 Sooner or later the outer poverty is going to disappear-- We now have enough technology to make it disappear and the real problem is going to arise. 🕉*

The really poor people are those who are missing love; and the whole earth is full of those poor people who are starved. Sooner or later the outer poverty is going to disappear-we now have enough technology to make it disappear-and the real problem is going to arise. The real problem will be inner poverty. No technology can help. 

We are capable of feeding people now-but who will feed the spirit, the soul? Science cannot do that. Something else is needed, and that is what I call religion. Then science has done its work; only then can true religion enter the world. Up to now religion has been only a freak phenomenon--once in a while a Buddha, a Krishna appears.

These are exceptional people; they don't represent humanity. They simply herald a possibility, a future. But that future is coming closer. Once science has released the potential powers of matter and human beings are physically satisfied-have shelter, have enough food, have enough education-then for _the first time they will see that now a new food is needed. That food is love, and science cannot provide it. That can only be done by religion. Religion is the science of love.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 107 / Sri Lalita Sahasranamavali - Meaning - 107 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |*
*ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ‖ 107 ‖ 🍀*

🍀 519. ముద్గౌదనాసక్తచిత్తా -
 పులగములో ప్రీతి కలది.

🍀 520. సాకిన్యంబా స్వరూపిణీ - 
సాకినీ దేవతా స్వరూపముగా నుండునది.

🍀 521. ఆజ్ఞా చక్రాబ్జనిలయా - 
ఆజ్ఞాచక్ర పద్మంలో వసించునది.

🍀 522. శుక్లవర్ణా - 
తెలుపురంగులో ఉండునది.

🍀 523. షడాసనా - 
ఆరు ముఖములు కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 107 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 107. mudgaudanāsakta-cittā sākinyambā-svarūpiṇī |*
*ājñā-cakrābja-nilayā śuklavarṇā ṣaḍānanā || 107 || 🌻*

🌻 519 ) Mudgou danasaktha chittha -   
She who likes rice mixed with green gram dhal

🌻 520 ) Sakinyambha swaroopini -   
She who has the name “Sakini”

🌻 521 ) Agna chakrabja nilaya -   
She who sits on the lotus called Agna chakra or the wheel of order

🌻 522 ) Shukla varna -   
She who is white coloured

🌻523 ) Shadanana -   
She who has six faces

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 107 / Sri Vishnu Sahasra Namavali - 107 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*రేవతి నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🍀 107. శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|*
*రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః|| 107 ‖ 🍀*
 
🍀 993) శంఖభృత్ - 
పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.

🍀 994) నందకీ - 
నందకమను ఖడ్గమును ధరించినవాడు.

🍀 995) చక్రీ - 
సుదర్శనమును చక్రమును ధరించినవాడు.

🍀 996) శారంగ ధన్వా - 
శారంగము అనెడి ధనుస్సు కలవాడు.

🍀 997) గదాధర: -
కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.

🍀 998) రథాంగపాణి: - 
చక్రము చేతియందు గలవాడు.

🍀 999) అక్షోభ్య: - 
కలవరము లేనివాడు.

🍀 1000) సర్వ ప్రహరణాయుధ: - 
సర్వవిధ ఆయుధములు కలవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 107 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Revathi 3rd Padam*

*🌻 107. śaṅkhabhṛnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ |*
*rathāṅgapāṇirakṣōbhyaḥ sarvapraharaṇāyudhaḥ || 107 || 🌻*

🌻 993. Śaṅkhabhṛt: 
One who sports the conch known as Panchajanya, which stands for Tamasahamkara, of which the five elements are born.

🌻 994. Nandakī: 
One who has in His hand the sword known as Nandaka, which stands for Vidya (spiritual illumination).

🌻 995. Cakri: 
One who sports the discus known as Sudarshana, which stands for the Rajasahamkara, out of which the Indriyas have come.

🌻 996. Śārṅga-dhanvā: 
One who aims His Sarnga bow.

🌻 997. Gadādharaḥ: 
One who has the mace known as the Kaumodaki, which stands for the category of Buddhi.

🌻 998. Rathāṅga-pāṇiḥ: 
One in whose hand is a wheel (Chakra).

🌻 999. Akṣobhyaḥ: 
One who cannot be upset by anything, because He controls all the above-mentioned weapons.

🌻 1000. Sarva-praharaṇā-yudhaḥ: 
There is no rule that the Lord has got only the above- mentioned weapons. All things, which can be used for contacting or striking, are His weapons.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹