🌹 13, JANUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 13, JANUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 13, JANUARY 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 486 / Bhagavad-Gita - 486 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -17 / Chapter 12 - Devotional Service - 17 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 841 / Sri Siva Maha Purana - 841 🌹
🌻. దేవదేవ స్తుతి - 1 / Prayer to the lord of gods - 1 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 99 / Osho Daily Meditations  - 99 🌹
🍀 99. హేతుబధ్దత / 99. LOGIC 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 524 - 528 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 524 - 528 -2 🌹 
🌻 521 to 528 నామ వివరణము - 2 / 521 to 528 Names Explanation - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 13, జనవరి, JANUARY 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 54 🍀*
 
*54. దావాగ్నిబలసంహారీ ఫలాహారీ గదాగ్రజః |*
*గోపాంగనా చేలచోరః పాథోలీలా విశారదః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : చేతనా విశ్వ విభాగాలు : పరార్ధం, అపరార్ధం, అని చేతనా విశ్వం రెండు విభాగములు చెయ్యబడు తున్నది. సత్తు, చిత్తు, ఆనందం, మహస్సు - ఇవి పరార్ధం (పై సగం ) లోనివి. అన్నం, ప్రాణం, మనస్సు ఇవి అపరార్ధం (క్రింది సగం) లోనివి. అతిమానస విజ్ఞాన మనునది పరార్థములోనిదైన మహస్సే. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
పౌష్య మాసము
తిథి: శుక్ల విదియ 11:12:47ఽ
వరకు తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: శ్రవణ 12:50:50
వరకు తదుపరి ధనిష్ట
యోగం: వజ్ర 10:14:29 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: కౌలవ 11:11:48 వరకు
వర్జ్యం: 16:25:30 - 17:51:42
దుర్ముహూర్తం: 08:18:28 - 09:03:12
రాహు కాలం: 09:36:45 - 11:00:37
గుళిక కాలం: 06:48:59 - 08:12:52
యమ గండం: 13:48:23 - 15:12:15
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46
అమృత కాలం: 03:30:34 - 04:56:38 
మరియు 25:02:42 - 26:28:54
సూర్యోదయం: 06:48:59
సూర్యాస్తమయం: 18:00:01
చంద్రోదయం: 08:30:27
చంద్రాస్తమయం: 20:04:44
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం 12:50:50 వరకు
తదుపరి వర్ధమాన యోగం 
- ఉత్తమ ఫలం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 486 / Bhagavad-Gita - 486 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -17 🌴*

*17. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |*
*శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ య: స మే ప్రియ: ||*

*🌷. తాత్పర్యం : ఉప్పొంగుటగాని దుఃఖించుటగాని తెలియనివాడు, శోకించుటగాని వాంచించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటిని త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు.*

*🌷. భాష్యము : శుద్ధభక్తుడు విషయపరములైన లాభనష్టములందు హర్షశోకములను ప్రకటింపడు. పుత్రుని గాని, శిష్యుని గాని పొందవలెననెడి ఆతురతను అతడు కలిగియుండడు. అలాగుననే వారిని పొందనందుకు చింతను సైతము కలిగియుండడు.*

*తనకు మిగుల ప్రియమైనది కోల్పోయినప్పుడు అతడు శోకింపడు. అదేవిధముగా కోరినది పొందినపుడు అతడు కలతనొందడు. అట్టి భక్తుడు సర్వశుభములకు, అశుభములకు మరియు పాపకార్యములనెడి విషయములకు అతీతుడై యుండును. శ్రీకృష్ణుభగవానుని ప్రీత్యర్థము అన్నిరకముల కష్టములకును అతడు వెనుదీయడు. అతని భక్తినిర్వాహణలో ఏదియును అవరోధమును కాజాలదు. అట్టి భక్తుడు శ్రీకృష్ణుడు అత్యంత ప్రియతముడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 486 🌹
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 12 - Devotional Service - 17 🌴*

*17. yo na hṛṣyati na dveṣṭi na śocati na kāṅkṣati*
*śubhāśubha-parityāgī bhaktimān yaḥ sa me priyaḥ*

*🌷 Translation : One who neither rejoices nor grieves, who neither laments nor desires, and who renounces both auspicious and inauspicious things – such a devotee is very dear to Me.*

*🌹 Purport : A pure devotee is neither happy nor distressed over material gain and loss, nor is he very much anxious to get a son or disciple, nor is he distressed by not getting them. If he loses anything which is very dear to him, he does not lament. Similarly, if he does not get what he desires, he is not distressed.*

*He is transcendental in the face of all kinds of auspicious, inauspicious and sinful activities. He is prepared to accept all kinds of risks for the satisfaction of the Supreme Lord. Nothing is an impediment in the discharge of his devotional service. Such a devotee is very dear to Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 841 / Sri Siva Maha Purana - 841 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 30 🌴*

*🌻. దేవదేవ స్తుతి - 1 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను - ఓ వ్యాసా! లక్ష్మీ పతి అదే సమయములో బ్రహ్మతో కలిసి మహాదివ్యమైనది, ఆధారము లేనిది, భూత నిర్మితము కానిది యగు శివలోకమునకు వెళ్లి (1), ఆనందముతో గూడిన ముఖము గలవాడై లోపలికి వెళ్లెను. విష్ణువు అనేక రత్నములు పొదుగుటచే మిరిమిట్లు గొల్పుతూ మెరియుచున్నది (2), రంగురంగులది, గణములచే సేవింపబడుచున్నది, గొప్ప కాంతితో శోభిల్లునది, చాల పెద్దది, మిక్కిలి సుందరమైనది అగు మొదటి ద్వారమును గాంచెను (3). రత్నసింహాసనములయందు కూర్చున్నవారు, తెల్లని వస్త్రములతో ప్రకాశించుచున్నవారు, రత్నభూషణములతో అలంకరింపబడిన వారు, అయిదు ముఖములు మూడు కన్నులు గలవారు, పచ్చని అందమగు దేహములు గలవారు, త్రిశూలమును మొదలగు ఆయుధములను దాల్చిన వీరులు, మరియు భస్మతో రుద్రాక్షలతో ప్రకాశించువారు అగు ద్వారపాలకులను కూడ గాంచెను (4, 5). లక్ష్మీపతి బ్రహ్మతో సహా వినమ్రతతో వారికి ప్రణమిల్లి ప్రభుడగు శివుని దర్శించదగిన పని గలదని చెప్పెను (6). అపుడు వారు ఆతనికి అనుజ్ఞనీయగా, ఆతడు మిక్కిలి సుందరమైనది, రంగురంగులది, గొప్ప కాంతులను వెదజల్లునది అగు ఆ గొప్ప ద్వారము లోపలకు ప్రవేశించెను (7).*

*అచట మరియొక ద్వారపాలకునకు కూడ తాను ప్రభువు వద్దకు వెళ్లవలసిన కారణము గలదని విష్ణువు విన్నవించి ఆతని అనుమతిని బడసి ఆ ద్వారము లోపల ప్రవెశించెను (8). బ్రహ్మ ఈ విధముగా పదిహేను ద్వారములను దాటి మహాద్వారమును చేరి అచట నందిని గాంచెను (9).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 841 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 30 🌴*

*🌻 Prayer to the lord of gods - 1 🌻*

Sanatkumāra said: —
1-2. O Vyāsa, starting then itself along with Brahmā, Viṣṇu, the lord of Lakṣmī, went to Śivaloka, highly divine, propless and unearthly. He was glad and his face beamed with pleasure. The region was strewn over with many gems. It was highly brilliant.

3-4. The first entrance was of variegated nature with many Gaṇas standing there. It was resplendent, lofty and and beautiful. After reaching it he saw the gatekeepers seated on gem-set thrones. They had gem-set ornaments and white garments.

5. They had five faces, three eyes and fair handsome bodies. They were trident-bearing heroes shining with Bhasma and Rudrākṣa.

6. Both Brahmā and Viṣṇu bowed to them humbly and told them that they wanted to see the lord.

7. They permitted them to enter. They saw another door very beautiful, variegated and very brilliant.

8. They informed the gatekeeper of their desire to approach the lord. Permitted by them they entered and saw another door.

9. Thus Brahmā entered through fifteen doors and reached the main threshold. He saw Nandin.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 99 / Osho Daily Meditations  - 99 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 99. హేతుబధ్దత 🍀*

*🕉 ఆధునిక మనస్సు చాలా హేతుబద్ధంగా మారింది; తర్కం వలలో చిక్కుకుంది. చాలా అణచివేత జరిగింది ఎందుకంటే తర్కం నియంతృత్వ శక్తి, నిరంకుశత్వం. ఒకసారి తర్కం మిమ్మల్ని నియంత్రిస్తే, అది చాలా విషయాలను చంపేస్తుoది. 🕉*

*హేతుబద్ధత వ్యతిరేక ఉనికిని అనుమతించదు మరియు భావోద్వేగాలు వ్యతిరేకం. ప్రేమ, ధ్యానం, తర్కానికి వ్యతిరేకం. ఆధ్యాత్మకత హేతువుకి వ్యతిరేకం. కాబట్టి హేతువు వారిని ఊచకోత కోస్తుంది, చంపుతుంది, నిర్మూలిస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా మీ జీవితం అర్థరహితమని మీరు చూస్తారు. ఎందుకంటే అర్థం అంతా అహేతుకం. కాబట్టి మొదట మీరు హేతువుకి మొగ్గుతారు, ఆపై మీ జీవితానికి అర్థాన్ని ఇచ్చే వాటన్నింటినీ చంపుతారు. మీరు చంపిన తర్వాత మరియు మీరు విజేతగా భావించినప్పుడు, మీరు అకస్మాత్తుగా ఖాళీగా భావిస్తారు.*

*ఇప్పుడు మీ చేతిలో ఏమీ మిగలలేదు, తర్కం మాత్రమే. మీరు తర్కంతో ఏమి చేయగలరు? మీరు దానిని తినలేరు. మీరు దానిని త్రాగలేరు. మీరు దానిని ప్రేమించలేరు. మీరు దానిని జీవించలేరు. ఇది కేవలం చెత్త. మీరు మేధావిగా ఉంటే, అది కష్టమవుతుంది. జీవితం సరళమైనది, మేధోరహితమైనది. మానవత్వం యొక్క మొత్తం సమస్య అభౌతిక జగత్తు. జీవితం గులాబీలా సరళమైనది - సంక్లిష్టత ఏమీ లేదు - అయినప్పటికీ ఇది రహస్యమైనది. ఇందులో సంక్లిష్టంగా ఏమీ లేకపోయినా, మేధస్సు ద్వారా మనం దానిని గ్రహించ లేకున్నాము. మీరు గులాబీతో ప్రేమలో పడవచ్చు, మీరు దాని వాసన చూడవచ్చు, మీరు దానిని తాకవచ్చు, మీరు దానిని అనుభూతి చెందవచ్చు, మీరు అదే కావచ్చు, కానీ మీరు దానిని విడదీయడం ప్రారంభిస్తే, మీ చేతుల్లో చనిపోయింది మాత్రమే ఉంటుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 99 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 99. LOGIC 🍀*

*🕉  The modern mind has become too rational; it is caught in the net if logic. Much repression has happened because logic is a dictatorial force, totalitarian. Once logic controls you, it kills many things. 🕉*

*Logic is like Adolf Hitler or Joseph Stalin; it does not allow the opposite to exist, and emotions are opposite. Love, meditation, is opposite to logic. Religion is opposite to reason. So reason simply massacres them, kills them, uproots them. Then suddenly you see that your life is meaningless-because all meaning is irrational. So first you listen to reason, and then you kill all that was going to give meaning to your life. When you have killed and you are feeling victorious, suddenly you feel empty.*

*Now nothing is left in your hand, only logic. And what can you do with logic? You cannot eat it. You cannot drink it. You cannot love it. You cannot live it. It is just rubbish. If you tend to be intellectual, it will be difficult. Life is simple, nonintellectual. The whole problem of humanity is metaphysics. Life is as simple as a rose -there's nothing complicated about it--and yet it is mysterious. Although there is nothing complicated about it, we are not able to comprehend it through the intellect. You can fall in love with a rose, you can smell it, you can touch it, you can feel it, you can even be it, but if you start dissecting it, you will only have something dead in your hands.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 521 - 528 - 2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 521 - 528 - 2  🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 
*108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।*
*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀*

*🌻 521 to 528 నామ వివరణము - 2 🌻*

*జీవులకు మూలము అగు సత్య స్వరూపము ఇచ్చటి శ్రీమాత. ఈమె నుండియే పంచ భూతాత్మకమగు సృష్టి, సృష్టి జీవుల రూపములు ఏర్పడును. హంసవలె శాశ్వత జలముల యందు తేలియాడు చుండును. సృష్టి నిర్వహించుచున్ననూ సృష్టికి సుదూరముగ స్వచ్ఛమై వెలుగొందుచుండును. హంసవతీ అనుటలో హంస లక్షణము లన్నియూ ఈ పద్మమునందుగల ప్రజ్ఞకు వున్నవని తెలియనగును. శివునితో కూడియుండి సృష్టి నిర్మాణమునకు సంధానకర్తయై యున్ననూ, సృష్టి ప్రభావము తనపై ఏ మాత్రము ప్రసరింపదు. శివ తత్త్వముతోనే చిరుహాసముతో సృష్టినంతయూ నిర్వహించును. ఇచ్చటి శ్రీమాతకు ఆరు ముఖములు వర్ణింపబడినవి. ఆమె 'షడాననా'. గాయత్రి మాతను కూడ షడాననగా తెలుపుదురు. ఇచ్చటి శ్రీమాత గాయత్రియే యని తెలియవలెను. షడానన యగు శ్రీమాతను ఘనరూపిణి యందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 521 - 528 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥*
*108. Majasansdha hansavati mukhyashakti samanvita*
*haridranai karasika hakinirupa dharini  ॥ 108 ॥ 🌻*

*🌻 521 to 528 Names Explanation - 2🌻*

*Srimata here is the embodiment of Truth which is the source of living beings. It is from here that the five elemental creation and the forms for living beings in that creation have manifested. Even while managing the world She resides far away from the world, pure and radiant. In this prgnya and in this Padma she is called Hamsavathi as she has all the characteristics of a swan. Chundunu floated in eternal waters like a swan. Creation is being carried out and the farthest reaches of creation is pure. Even while being the innovator that creates the world along with lord Siva, she is absolutely uninfluenced by the world. She manages the entire creation with a smile, imbibing Siva tattva. Six faces are described for this Srimata. She is 'Shadanana'. Mother Gayatri is also known as Shadanana. It should be known that this Srimata is Gayatri herself. This form of Srimata as Shadanana is called Ghanarupini.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3

Siva Sutras - 200 : 3-23. madhyevara prasavah - 5 / శివ సూత్రములు - 200 : 3-23. మధ్యే అవర ప్రసవహః - 5


🌹. శివ సూత్రములు - 200 / Siva Sutras - 200 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-23. మధ్యే అవర ప్రసవహః - 5 🌻

🌴. సాధన యందు శ్రద్ధ లేదా నియంత్రణ కోల్పోయినప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు, తుర్యా స్థితి ఆనందం మధ్యలో దానితో సంబంధం కోల్పోయి ద్వంద్వత్వ స్థితి ఏర్పడుతుంది. 🌴


సాధకుడు, అహంకు దూరంగా ఉండాలి. అంటే నేను మరియు నాది అనే పదాల వాడుకకు దూరంగా ఉండాలి. ప్రతిదీ భగవంతునిచే ఇవ్వబడింది మరియు ఆధ్యాత్మిక మార్గం ప్రకృతి యొక్క ఈ స్వాభావిక గుణాన్ని అర్థం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. అహం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఆకాంక్షలను నాశనం చేస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మికత యొక్క ప్రధాన ఇతివృత్తం మహా ప్రజ్ఞా పారామిత అనే పదం చుట్టూ తిరుగుతుంది. ఈ పదం స్వార్థ, అహంకార చింతల వల్ల కలిగే అన్ని బాధల నుండి ఒకరిని విముక్తి చేసే లోతైన అంతర్దృష్టిని సూచిస్తుంది. ఇది సరైన ఆధ్యాత్మిక ఆకాంక్షకు బలమైన పునాది వేస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఆధ్యాత్మిక ఆకాంక్షలు అప్పుడప్పుడు మాత్రమే ఉంటాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 200 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-23. madhye'vara prasavah - 5 🌻

🌴. A disconnected state of enjoyment and duality arises in the middle of turya, when the attention or control is lost or weakened. 🌴


The usage of I, Me and Mine should be avoided. Everything is given by God, and the spiritual path is nothing but to understand this inherent quality of the Nature. Ego continues to destroy a person’s spiritual aspirations. The central theme of spirituality revolves around the saying mahā prajñā pāramitā, the term that refers to profound insight which frees one from all suffering caused by selfish, egocentric concerns. This lays the strong foundation for the right kind of spiritual aspiration, as spiritual aspirations of many are only sporadic.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 196 : 14. There Seems to be a Ray of Light on the Horizon / నిత్య ప్రజ్ఞా సందేశములు - 196 : 14. వాతావరణంలో కాంతి కిరణం ఉన్నట్లు కనిపిస్తుంది



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 196 / DAILY WISDOM - 196 🌹

🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 14. వాతావరణంలో కాంతి కిరణం ఉన్నట్లు కనిపిస్తుంది 🌻


విశ్శం మనల్ని స్వాధీనం చేసుకునే ముందు, అది మనల్ని కాల్చివేసి, పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఈ ప్రక్షాళన ప్రక్రియ వ్యక్తిగత ఆత్మ యొక్క ఆధ్యాత్మిక మరణం. అక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. అది అరణ్యం; అది ఆత్మ యొక్క చీకటి రాత్రి మరియు అక్కడ మనం ఏదైనా సాధిస్తామో లేదో మనకు తెలియదు. మనం మౌనంగా ఏడుస్తాము, కానీ మన రోదనలు ఎవరూ వినరు. కానీ రోజు ఉదయిస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు మరియు వాతావరణంలో కాంతి కిరణం ఉన్నట్లు అనిపిస్తుంది. మహాభారతం యొక్క విరాట పర్వ ముగింపులో అది మనకు కనిపిస్తుంది.

ఏళ్లుగా చెప్పలేని బాధలు అనుభవించిన తర్వాత, మానవ మనస్సు సాధారణంగా అర్థం చేసుకోలేనంతగా, అదృష్టానికి సంబంధించిన అసాధారణమైన పెరుగుదల అద్భుతంగా ఉంటుంది. ఇది బాధాకరమైన ఆత్మకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అడగని సహాయం అన్ని వైపుల నుండి వస్తుంది. తొలిదశలో మనం అడిగినా ఏమీ రాదని అనిపించేది. మనం అడవిలో ఒంటరిగా ఏడవవలసి వచ్చింది మరియు మన మొర ఎవరూ వినలేదు. ఇప్పుడు పట్టికలు మారాయి మరియు అభ్యర్థించక పోయినా అన్ని దిశల నుండి సహాయం అందుతున్నట్లు కనిపిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 196 🌹

🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 14. There Seems to be a Ray of Light on the Horizon 🌻


Before the Universal takes possession of us, it burnishes us and cleanses us completely. This process of cleansing is the mystical death of the individual spirit. There it does not know what happens to it. That is the wilderness; that is the dark night of the soul; that is the suffering, and that is where we do not know whether we will attain anything or not. We weep silently, but nobody is going to listen to our wails. But the day dawns, the sun shines and there seems to be a ray of light on the horizon. That is towards the end of the Virata Parva of the Mahabharata.

After untold suffering for years, which the human mind cannot usually stomach, a peculiar upsurge of fortune miraculously seems to operate in favour of the suffering spirit, and unasked help comes from all sides. In the earlier stages, it appeared that nothing would come even if we asked. We had to cry alone in the forest, and nobody would listen to our cry. Now the tables have turned and help seems to be pouring in from all directions, unrequested.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 885 / Vishnu Sahasranama Contemplation - 885


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 885 / Vishnu Sahasranama Contemplation - 885 🌹

🌻 885. రవిలోచనః, रविलोचनः, Ravilocanaḥ 🌻

ఓం రవిలోచనాయ నమః | ॐ रविलोचनाय नमः | OM Ravilocanāya namaḥ

రవిర్లోచనమస్యేతి రవిలోచన ఈర్యతే ।
చక్షుషీ చన్ద్రసూర్యావిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥

ఈతనికి రవి కన్నుగా నున్నాడు కనుక రవిలోచనః.


:: ముణ్డకోపనిషత్ - ద్వితీయ ముణ్డకే ప్రథమ ఖణ్డః ::

అగ్ని ర్మూర్థా చక్షుషీ చన్ద్రసూర్యా దిశః శ్రోత్రే వా గ్వివృతాశ్చ వేదాః ।
వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాన్తరాత్మా ॥ 4 (26) ॥

విరాట్పురుషునకు ఆకాశమే శిరస్సు; సూర్యచంద్రులు నేత్రములు; దిక్కులు శ్రోత్రములు; వాగ్వివరములు వేదములు వాక్కు; వాయువే ప్రాణము. ఈ విశ్వమే మనస్సు. ఆ పురుషుని పాదముల నుండి భూమి పుట్టెను, అతడే సర్వభూతాంతరాత్మగా వెలుగుచున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 885 🌹

🌻 885. Ravilocanaḥ 🌻

OM Ravilocanāya namaḥ


रविर्लोचनमस्येति रविलोचन ईर्यते ।
चक्षुषी चन्द्रसूर्यावित्यादिश्रुतिसमीरणात् ॥

Ravirlocanamasyeti ravilocana īryate,
Cakṣuṣī candra sūryāvityādiśrutisamīraṇāt.


Since He has Ravi or the sun as (one of) His eye(s), He is Ravilocanaḥ.


:: मुण्डकोपनिषत् - द्वितीय मुण्डके प्रथम खण्डः ::

अग्नि र्मूर्था चक्षुषी चन्द्रसूर्या दिशः श्रोत्रे वा ग्विवृताश्च वेदाः ।
वायुः प्राणो हृदयं विश्वमस्य पद्भ्यां पृथिवी ह्येष सर्वभूतान्तरात्मा ॥ ४ (२६) ॥


Muṇḍakopaniṣat - Muṇḍaka 2, Chapter 1

Agni rmūrthā cakṣuṣī candrasūryā diśaḥ śrotre vā gvivr‌tāśca vedāḥ,
Vāyuḥ prāṇo hr‌dayaṃ viśvamasya padbhyāṃ pr‌thivī hyeṣa sarvabhūtāntarātmā. 4 (26).


The indwelling Self of all is surely He of whom the heaven is the head, the moon and sun are the two eyes, the directions are the two ears, the revealed Vedas are the speech, air is the vital force, the whole Universe is the heart, and (it is He) from whose two feet emerged the earth.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



కపిల గీత - 293 / Kapila Gita - 293


🌹. కపిల గీత - 293 / Kapila Gita - 293 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 24 🌴


24. పతితో భువ్యసృఙ్మూత్రె విష్ఠాభూరివ చేష్టతే|
రోరూయతి గతే జ్ఞానే విపరీతాం మతిం గతః॥

తాత్పర్యము : పిమ్మట ఆ శిశువు తల్లియొక్క రక్తములో, మూత్రములో పడి మలములోని కీటకమువలె గిలగిల కొట్టుకొనును. గర్భవాసము నందు ఉన్నప్పుడు కలిగిన జ్ఞానము అంతయు నశించి అతడు విపరీతగతిని (దేహాభిమాన రూపమైన అజ్ఞానదశను) పొందును. అప్పుడు (ఆ స్థితిలోగల శిశువు) బిగ్గరగా పదేపదే ఏడ్చును.


వ్యాఖ్య :


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 293 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 24 🌴


24. patito bhuvy asṛṅ-miśraḥ viṣṭhā-bhūr iva ceṣṭate
rorūyati gate jñāne viparītāṁ gatiṁ gataḥ

MEANING : The child thus falls on the ground, smeared with stool and blood, and plays just like a worm germinated from the stool. He loses his superior knowledge and cries under the spell of māyā.

PURPORT :


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 12, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌻

🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 44 🍀

44. ఆదిలక్ష్మీర్గుణాధారా పంచ బ్రహ్మాత్మికా పరా ।
శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వ సంపత్తిరూపిణీ ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : అతిమానస విజానపు అభివ్యక్తి లక్షణం : అజ్ఞానావరణంచే ముసుగువడక ఏకత్వ జ్ఞాన ప్రభా విలసితమైన సత్యతేజో లోకమును సరాసరిగా అభివ్యక్త మొనరించగల శక్తి అతిమానస విజ్ఞానమున కున్నది. కావున అది సకల విధాభివ్యక్తులకు అతీతమై యున్నట్టిది కాదు, ప్రస్తుతం మన అనుభవంలో నున్న యీ అన్నప్రాణ మనోమయ త్రిపుటికి మాత్రమే అతీతం. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

పౌష్య మాసం

తిథి: శుక్ల పాడ్యమి 14:24:46

వరకు తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: ఉత్తరాషాఢ 15:19:20

వరకు తదుపరి శ్రవణ

యోగం: హర్షణ 14:05:53

వరకు తదుపరి వజ్ర

కరణం: బవ 14:22:46 వరకు

వర్జ్యం: 00:53:00 - 02:19:36

మరియు 18:54:10 - 20:20:14

దుర్ముహూర్తం: 09:02:57 - 09:47:39

మరియు 12:46:28 - 13:31:10

రాహు కాలం: 11:00:18 - 12:24:07

గుళిక కాలం: 08:12:40 - 09:36:29

యమ గండం: 15:11:45 - 16:35:34

అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46

అమృత కాలం: 09:32:36 - 10:59:12

మరియు 27:30:34 - 28:56:38

సూర్యోదయం: 06:48:51

సూర్యాస్తమయం: 17:59:24

చంద్రోదయం: 07:37:06

చంద్రాస్తమయం: 18:58:44

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: ఆనంద యోగం - కార్య

సిధ్ధి 09:55:00 వరకు తదుపరి

కాలదండ యోగం - మృత్యు భయం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


Pushyamasam పుష్యమాసం

🌹పుష్యమాసం 🌹


చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.

ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది.

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి.

ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు , బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.

శని ధర్మదర్శి న్యాయం , సత్యం , ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను , పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి , నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.

అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.

పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.

అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి ) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.

ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.

🌹🌹🌹🌹🌹