శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-3

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-3🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 312. 'రణత్కింకిణిమేఖలా' - 3🌻

సంసార క్షయ మొనర్చి ఆత్మ సాక్షాత్కారము కలిగించు శ్రీదేవి కటిభాగము నారాధించుట సంప్రదాయము. కటిభాగ మందలి మొలత్రాడు చిరుగంటల సవ్వడి శ్రీదేవి భక్తులకు వినిపించు చుండును. బాల మంత్ర ఉపాసకులకు ఈ అనుభవము సహజము. శక్తికూట మంత్ర భాగమైన సకల హ్రీం గురుముఖముగ ఉపదేశము పొంది ధ్యానించినచో శక్తి బంధము నుండి విడివడ వచ్చును. అనుగ్రహకారిణియైన శ్రీమాత తన నారాధించు వారిని కూడ ఈ విధముగ ఉద్ధరించును.

పై విధానమగు ఉధారణము పొందినవారు క్షరత్వము నుండి అక్షరత్వము లోనికి ప్రవేశింతురు. బాహ్యమునుండి అంతరంగము చేరుదురు. మూలాధారము నుండి హృదయమును చేరుదురు. క్రియా శక్తి నుండి జ్ఞానశక్తిలోనికి వ్యాపింతురు. మానవ శరీర మందలి మూడు భాగములు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులకు అనుగుణముగ అమర్చబడి యున్నవి. శ్రీమాత అనుగ్రహమున మూడింటి యందును మానవుడు పరిపూర్ణముగ వ్యాప్తి చెందుట, బంధములు లేక త్రికూటముల యందుండుట ప్రధానము. ప్రాథమికముగ క్రియకు జ్ఞానమును జోడించి కర్మ బంధమునుండి విముక్తులగుట ప్రధానము గనుక శ్రీమాత మొలనూలు ఈ సందేశము నందించుచున్నది. ఆమె సందేశమే చిరుగంటల మ్రోతలు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 312-3 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 312-3. Raṇatkiṅkiṇi-mekhalā रणत्किङ्किणि-मेखला (312) 🌻

It is also said that these descriptions enable the beginners to visualise Her gross form. She has four types of forms, gross (sthūla), subtle (sūkṣma rūpa), subtler (sūkṣmatara) which is also known as Her kāmakalā dorm and Her subtlest form is kuṇḍalinī form.

Her gross form is described in nāma-s twelve to fifty one. Her subtle form (mantra-s) is described in nāma-s 85 to 89. Her subtler form (kāmakalā) is described in 88 and 89. (Nāma 322 is kāmakalā rūpa.) Finally, Her subtlest form kuṇḍalinī is described in 90 to 111. (Psychic cakra-s are discussed in 475 to 534).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Oct 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 79

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 79 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడు సమస్థం. సమస్త భిన్న ధృవాలు కలిగింది. కాబట్టి దేవుణ్ణి కేవలం కాంతి అనడం కుదరదు. దేవుడు కాంతి మాత్రమే కాదు అంతే మేరకు చీకటి కూడా. నువ్వు స్పష్టంగా చూడదలచు కుంటే భయం మంచు పొగలా మాయమవుతుంది. 🍀

తరతరాల నుండి దేవుణ్ణి కాంతిగా భావిస్తున్నారు. ఎందుకంటే చీకటంటే మనకు భయం. దేవుడు కాంతి మాత్రమే కాదు అంతే మేరకు చీకటి కూడా. దేవుడు రెండూ లేని పక్షంలో చీకటి వునికిలో వుండదు. దేవుడు అత్యల్ప స్థాయిలో వాడు, అత్యున్నతమైన స్థాయిలోని వాడు. దేవుడు పదార్థం, మనసు, దేవుడు సమస్థం. సమస్త భిన్న ధృవాలు కలిగింది. కాబట్టి దేవుణ్ణి కేవలం కాంతి అనడం కుదరదు. చీకటి పట్ల భయంతో మనం దేవుణ్ణి చీకటిగా అనుకోవడానికి యిష్టపడం.

దేవుణ్ణి మనం భయం గుండా సమీపిస్తే అది సరయింది కాదు. దేవుణ్ణి నిర్భయంగా సమీపించాలి. గాఢమయిన ప్రేమతో సమీపించాలి భయంతో సమీపిస్తే అక్కడ నీ భయాన్ని ముందుంచుతావు. అక్కడ లేని వస్తువుల్ని నువ్వు చూస్తావు. అక్కడ వున్న విషయాల్ని చూడవు. నువ్వు స్పష్టంగా చూడదలచుకుంటే భయం మంచుపొగలా మాయమవుతుంది. మంచి అన్నది ఎప్పుడూ స్పష్టతలో చూస్తుంది. దేవుడు రెండూ. చీకటి దేవుడు, వెలుగు దేవుడు. వేసవి దేవుడు, చలికాలం దేవుడు. జీవితం దేవుడు, మరణం దేవుడు, అక్కడ ద్వైదీభావం అదృశ్యమై నీ దృష్టిలో ఏకత్వం మిగుల్తుంది.

మనం ద్వైదీభావంతో బంధింపబడి వుంటాం. ఏకత్వం ద్వారా విముక్తి పొందుతాం. ప్లాటినస్, 'దేవుణ్ణి అన్వేషించడంలో మనం ఒక ఏకాంతం నించీ యింకో ఏకాంతం దాకా సాగుతాం' అన్నాడు. చీకట్ని దైవత్వంగా దర్శించడం ఆరంభించు. ప్రతిదాన్నీ దైవత్వంగా భావించు. ఎందుకంటే మనకు తెలిసినా తెలియకున్నా అంతా దైవత్వమే. మనం అంగీకరించినా, అంగీకరించకున్నా అంతా దైవత్వమే. మన లక్ష్యపెట్టడమన్నది లెక్కలోనిది కాదు. అస్తిత్వం దైవత్వం. ప్రతి దాని ఉనికి దైవత్వం, దాన్ని మనం ఆమోదిస్తే ఆనందిస్తాం. ఆమోదించకుంటే అనవసరంగా బాధపడతాం.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

14 Oct 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 12

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 12 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 8. సమ భావము ముఖ్యలక్షణము - 2 🌻

ఎవరికి దేనియందు ఎక్కువ సామర్థ్యము కలదో వారికి ఆ విషయమున స్వతంత్రము నిచ్చి కార్యమును నిర్వర్తింప చేసుకొనుట తెలివి. భార్యా భర్తల యందు, తల్లితండ్రుల యందు, బిడ్డల యందు కల వ్యక్తిగత సామర్థ్యములను గుర్తించి, గౌరవించుట వలన మరియు నిర్వర్తించుట కనుమ తించుట వలన ఆయా సమర్థలు వారియందు పెంపొందుటయే గాక, సమిష్టిగ కుటుంబమునకు ఉపయోగ పడగలవు.

ఇదియే సూత్రమును ఒక సంస్థ యందు పాటించినచో, సమిష్టిగా సంస్థ వృద్ధిచెందగలదు. సంఘ అభివృద్ధికి కూడ ఇదియే సూత్రము ఉపయోగకరమైనప్పటికి, ఒక కుటుంబమున, ఒక సంస్థ యందు గల కట్టుబాటు సంఘమున లేకుండుట అభివృద్ధికి అవరోధమై నిలచుచున్నది. కుటుంబము నందు, సంస్థయందు ఒకరిని పెద్దగ గౌరవించుట వలన కట్టుబాటుకు అవకాశ మేర్పడు చున్నది. హృదయ పూర్వకముగా గౌరవింప బడగల నాయకులున్ననే సంఘమున కట్టుబాటు, అభివృద్ధి సాధ్యములగును.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

14 Oct 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 495 / Vishnu Sahasranama Contemplation - 495

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 495 / Vishnu Sahasranama Contemplation - 495🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 495. గోపతిః, गोपतिः, Gopatiḥ🌻

ఓం గోపతయే నమః | ॐ गोपतये नमः | OM Gopataye namaḥ

గోపతిః, गोपतिः, Gopatiḥ

గోపవేషధరో విష్ణుర్గోపతిః పాలనాద్గవామ్ ।
అథవా గౌర్మహీ తస్యాః పతిత్వాద్వా తథోచ్యతే ॥

గోపవేషధరుడైన విష్ణువు గోవుల రక్షకుడిగా గోపతిః అని ఎరుగబడును. లేదా 'గౌః' అనగా భూమి. ఆమెకు పతి అనియూ చెప్పదగును. 'గో' శబ్దమునకు ఇంద్రియము అని కూడా అర్థముగలదు. ఈ కోణములో ఇంద్రియముల రక్షకుడు అనగా ముఖ్య ప్రాణతత్త్వముగా కూడా విష్ణువును గోపతిః నామము ద్వారా కీర్తించవచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 495 🌹

📚. Prasad Bharadwaj

🌻 495. Gopatiḥ 🌻

OM Gopataye namaḥ

गोपवेषधरो विष्णुर्गोपतिः पालनाद्गवाम् ।
अथवा गौर्मही तस्याः पतित्वाद्वा तथोच्यते ॥

Gopaveṣadharo viṣṇurgopatiḥ pālanādgavām,
Athavā gaurmahī tasyāḥ patitvādvā tathocyate.

Donning the garb of a cowherd, He protects the cows and hence is called Gopatiḥ. 'Gau' can mean earth and hence Gopatiḥ may also be taken as the lord of earth. 'Go' can also be interpreted as sensory organ and Lord Viṣṇu as the protector of sensory organs or as the prime life force is Gopatiḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

14 Oct 2021

దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి Devi Navratra - Nav Durgas Sadhana - 8. Mahagauri Mata - Mahishasuramardadhini Devi

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి 🌹

🌻 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :

'శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

🌷. అలంకారము :

మహిషాసురమర్ధిని - ఎర్రని ఎరుపు రంగు

🌷. నివేదనం : బెల్లంఅన్నం

🌷. మహిమ - చరిత్ర :

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది.

పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ ।
బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥

🌻. సాధన :

కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‍కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

ఇంకో కధ ప్రకారం, పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి , బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది .

అష్టమ శక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము.

ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.

మహాగౌరీ మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి.

మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి.

ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి.

ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.

🌹 🌹 🌹 🌹 🌹

14 Oct 2021

14-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 14, గురువారం, ఆక్టోబర్ 2021 🌹
🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 98 / Bhagavad-Gita - 98 - 2-51🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 666 / Bhagavad-Gita - 666 -18-77🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 495 / Vishnu Sahasranama Contemplation - 495🌹
5) 🌹 DAILY WISDOM - 173🌹 
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 12🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 79🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము / Sri Lalitha Chaitanya Vijnanam - 312-3🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి 🌹
🌻 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :
'శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

🌷. అలంకారము :
మహిషాసురమర్ధిని - ఎర్రని ఎరుపు రంగు
🌷. నివేదనం : బెల్లంఅన్నం 

🌷. మహిమ - చరిత్ర :
దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. 

పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ ।
బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥

🌻. సాధన :
కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‍కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

ఇంకో కధ ప్రకారం, పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి , బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది . 

అష్టమ శక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము. 

ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.

మహాగౌరీ మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. 

మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి. 

ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. 

ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 98 / Bhagavad-Gita - 98🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 51 🌴

51. కర్మజం బుద్ధియుక్తా హి 
ఫలం త్యక్వా మనీషిణ: |
జన్మబన్ధ వినిర్ముక్తా: 
పదం గచ్ఛన్త్యనామయమ్ ||

🌷. తాత్పర్యం :
ఆ విధముగా భక్తియోగమునందు నియుక్తులైన మహర్షులు లేదా భక్తులు ఈ భౌతికజగము నందు కర్మఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన,మరణచక్రము నుండి విడుదలను పొంది (భగవద్దామమును చేరుట ద్వారా) దుఃఖరాహిత్యస్థితిని పొందుచున్నారు.

🌷. భాష్యము :
ముక్తజీవులు దుఃఖరాహిత్యమైన స్థానమునకు చెందినవారై యున్నారు. ఈ విషయమున శ్రీమద్భాగవతము(10.14.58)
ఈ విధముగా పలుకు చున్నది. సమాశ్రితా యే పపదపల్లవప్లం మహత్పదం పుణ్యయశో మురారే: |
భవామ్భుది ర్వత్సపదం పరం పదం పదం పదం యద్విపదాం న తేషామ్ ||

“విశ్వమునకు శరణ్యుడును మరియు ముక్తినిచ్చు ముకుందునిగా ప్రసిద్ధినొందినవాడును అగు శ్రీకృష్ణభగవానుని పాదపద్మనౌకను ఆశ్రయించినవానికి సంసారసాగరము దూడపాదముద్ర యందలి జలమే కాగలదు. వైకుంఠము లేదా దుఃఖరహితస్థలమైన పరమపదమే ఆ భక్తుని గమ్యస్థానముగాని అడుగడుగున అపాయము కలిగిన అన్యస్థానము కాదు.”

ఈ భౌతికజగము అడుగడుగున అపాయము కలిగిన దుఃఖ;భూయిష్ట స్థానమని ఎవ్వరును అజ్ఞానవశమున తెలిసికొనజాలరు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు సకామకర్మల ద్వారా తమ స్థితిని చక్కబరచుకొనుటకు యత్నింపుము. అట్టి కర్మఫలములు తమకు ఆనందము నొసగగలవని వారు భావింతురు. కాని విశ్వమునందు ఎచ్చోటను దుఃఖరాహిత్యమైన జన్మముండదని వారెరుగరు. 

జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనెడి నాలుగు దుఃఖములు విశ్వమందంతటను గలవు. కాని భగవానుని నిత్యదాసునిగా తన నిజస్థితిని అవగతము చేసికొనినవాడు భగవానుని స్థితిని తెలిసికొని అతని భక్తియుక్తసేవలో నియుక్తుడగును. తత్పలితముగా అతడు దుఃఖమాయజీవనము గాని, కాలము మరియు మృత్యువుల ప్రభావము గాని లేనటువంటి వైకుంఠలోకములందు ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు. 

వాస్తవమునకు తన నిజస్థితిని తెలియుట యనగా భగవానుని ఉదాత్తము మరియు ఉన్నతమైన స్థితిని తెలియుట యనియే భావము. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానమైనవే యని తప్పుగా తలంచువాడు అంధకారమున ఉన్నట్టివాడు. తత్పలితముగా అట్టివాడు భగవానుని సేవలో ఎన్నడును నిలువజాలడు. 

అట్టివాడు తనకు తానే ప్రభువై జన్మ,మృత్యు పరంపరకు మార్గము నేర్పరచుకొనును. కాని సేవయే తన నిజస్థితి యని అవగతము చేసికొనినవాడు శ్రీకృష్ణభగవానుని సేవలో నిలిచి శీఘ్రమే వైకుంఠలోకమును పొందుటకు అర్హుడగుచున్నాడు. శ్రీకృష్ణభగవానునికి ఒనర్చబడు సేవయే కర్మయోగము (బుద్ధియోగము) అనబడును. సులభవాక్యములలో చెప్పవలెనన్న అదియే కృష్ణభక్తి యనబడును..
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 98 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 51 🌴

51. karma-jaṁ buddhi-yuktā hiphalaṁ tyaktvā manīṣiṇaḥ
janma-bandha-vinirmuktāḥ padaṁ gacchanty anāmayam

🌷Translation :
By thus engaging in devotional service to the Lord, great sages or devotees free themselves from the results of work in the material world. In this way they become free from the cycle of birth and death and attain the state beyond all miseries [by going back to Godhead].

🌷 Purport :
For one who has accepted the boat of the lotus feet of the Lord, who is the shelter of the cosmic manifestation and is famous as Mukunda, or the giver of mukti, the ocean of the material world is like the water contained in a calf’s footprint. Paraṁ padam, or the place where there are no material miseries, or Vaikuṇṭha, is his goal, not the place where there is danger in every step of life.”

Owing to ignorance, one does not know that this material world is a miserable place where there are dangers at every step. Out of ignorance only, less intelligent persons try to adjust to the situation by fruitive activities, thinking that the resultant actions will make them happy. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 666 / Bhagavad-Gita - 666 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 77 🌴*

77. తచ్చ సంస్మృత్య సంస్మృత్య 
రూపమత్యద్భుతం హరే: |
విస్మయో మే మహాన్ రాజన్ 
హృష్యామి చ పున: పున: ||

🌷. తాత్పర్యం : 
ఓ రాజా! అత్యద్భుతమైన శ్రీకృష్ణభగవానుని రూపమున స్మరించిన కొలది నేను అత్యంత విస్మయము నొందుచు మరల మరల ఆనందము ననుభవించుచున్నాను.

🌷. భాష్యము :
వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు సైతము అర్జునునకు చూపబడిన శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమును గాంచగలిగినట్లు ఇచ్చట గోచరించుచున్నది. అట్టి విశ్వరూపమును శ్రీకృష్ణుడు పూర్వమెన్నడును చూపలేదని తెలుపబడినది. అది ఒక్క అర్జనునికే చూపబడినను ఆ సమయమున కొందరు మహాభక్తులు సైతము ఆ రూపమును గాంచగలిగిరి. అట్టివారిలో వ్యాసమహర్షి ఒకరు. 

శ్రీకృష్ణుని పరమభక్తులలో ఒకడైన అతడు శక్తిపూర్ణ అవతారముగా పరిగణింపబడినాడు. వ్యాసదేవుడు దానిని తన శిష్యుడైన సంజయునకు దర్శింపజేసెను. అర్జునునకు చూపబడిన ఆ అద్భుత రూపమున తలచుచు సంజయుడు మరల మరల ఆనందము ననుభవించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 666 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 77 🌴*

77. tac ca saṁsmṛtya saṁsmṛtya rūpam aty-adbhutaṁ hareḥ
vismayo me mahān rājan hṛṣyāmi ca punaḥ punaḥ

🌷 Translation : 
O King, as I remember the wonderful form of Lord Kṛṣṇa, I am struck with wonder more and more, and I rejoice again and again.

🌹 Purport :
It appears that Sañjaya also, by the grace of Vyāsa, could see the universal form Kṛṣṇa exhibited to Arjuna. It is, of course, said that Lord Kṛṣṇa had never exhibited such a form before. It was exhibited to Arjuna only, yet some great devotees could also see the universal form of Kṛṣṇa when it was shown to Arjuna, and Vyāsa was one of them. 

He is one of the great devotees of the Lord, and he is considered to be a powerful incarnation of Kṛṣṇa. Vyāsa disclosed this to his disciple Sañjaya, who remembered that wonderful form of Kṛṣṇa exhibited to Arjuna and enjoyed it repeatedly.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 495 / Vishnu Sahasranama Contemplation - 495🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 495. గోపతిః, गोपतिः, Gopatiḥ🌻*

*ఓం గోపతయే నమః | ॐ गोपतये नमः | OM Gopataye namaḥ*

గోపతిః, गोपतिः, Gopatiḥ

గోపవేషధరో విష్ణుర్గోపతిః పాలనాద్గవామ్ ।
అథవా గౌర్మహీ తస్యాః పతిత్వాద్వా తథోచ్యతే ॥

గోపవేషధరుడైన విష్ణువు గోవుల రక్షకుడిగా గోపతిః అని ఎరుగబడును. లేదా 'గౌః' అనగా భూమి. ఆమెకు పతి అనియూ చెప్పదగును. 'గో' శబ్దమునకు ఇంద్రియము అని కూడా అర్థముగలదు. ఈ కోణములో ఇంద్రియముల రక్షకుడు అనగా ముఖ్య ప్రాణతత్త్వముగా కూడా విష్ణువును గోపతిః నామము ద్వారా కీర్తించవచ్చును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 495 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 495. Gopatiḥ 🌻*

*OM Gopataye namaḥ*

गोपवेषधरो विष्णुर्गोपतिः पालनाद्गवाम् ।
अथवा गौर्मही तस्याः पतित्वाद्वा तथोच्यते ॥

Gopaveṣadharo viṣṇurgopatiḥ pālanādgavām,
Athavā gaurmahī tasyāḥ patitvādvā tathocyate.

Donning the garb of a cowherd, He protects the cows and hence is called Gopatiḥ. 'Gau' can mean earth and hence Gopatiḥ may also be taken as the lord of earth. 'Go' can also be interpreted as sensory organ and Lord Viṣṇu as the protector of sensory organs or as the prime life force is Gopatiḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 173 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 21. All that We possess may Leave Us 🌻*

We have a working knowledge of things, as people say. We don’t have a real knowledge—just a working knowledge which goes with the life we lead. We have been getting one with things through various kinds of relationships. The adhyatma and the adhibhuta, the subject and the object, and man and nature have been in this sort of relationship—not really related, but only apparently connected. We have not been able to know what to do with this world. Nature has always been lying outside us. It has never become ours. We have never been able to control or master nature fully, because it was always something different from us, and not ours. 

Ever since creation, this has been the situation, as we have never been able to possess a thing properly. If we could possess it really, why should it leave us after some time? Why should we lose a thing that is really ours? The reason is that it is not ours. We have been thinking that it was ours, but it asserts its real nature of not being ours when it leaves us. “I am not yours, my dear friend. Don’t think I am not going.” Things may leave us; it may be a person, it may be our own relationships, our own possessions—whatever it is—all that we possess may leave us.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 12 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 8. సమ భావము ముఖ్యలక్షణము - 2 🌻*

ఎవరికి దేనియందు ఎక్కువ సామర్థ్యము కలదో వారికి ఆ విషయమున స్వతంత్రము నిచ్చి కార్యమును నిర్వర్తింప చేసుకొనుట తెలివి. భార్యా భర్తల యందు, తల్లితండ్రుల యందు, బిడ్డల యందు కల వ్యక్తిగత సామర్థ్యములను గుర్తించి, గౌరవించుట వలన మరియు నిర్వర్తించుట కనుమ తించుట వలన ఆయా సమర్థలు వారియందు పెంపొందుటయే గాక, సమిష్టిగ కుటుంబమునకు ఉపయోగ పడగలవు. 

ఇదియే సూత్రమును ఒక సంస్థ యందు పాటించినచో, సమిష్టిగా సంస్థ వృద్ధిచెందగలదు. సంఘ అభివృద్ధికి కూడ ఇదియే సూత్రము ఉపయోగకరమైనప్పటికి, ఒక కుటుంబమున, ఒక సంస్థ యందు గల కట్టుబాటు సంఘమున లేకుండుట అభివృద్ధికి అవరోధమై నిలచుచున్నది. కుటుంబము నందు, సంస్థయందు ఒకరిని పెద్దగ గౌరవించుట వలన కట్టుబాటుకు అవకాశ మేర్పడు చున్నది. హృదయ పూర్వకముగా గౌరవింప బడగల నాయకులున్ననే సంఘమున కట్టుబాటు, అభివృద్ధి సాధ్యములగును.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 79 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. దేవుడు సమస్థం. సమస్త భిన్న ధృవాలు కలిగింది. కాబట్టి దేవుణ్ణి కేవలం కాంతి అనడం కుదరదు. దేవుడు కాంతి మాత్రమే కాదు అంతే మేరకు చీకటి కూడా. నువ్వు స్పష్టంగా చూడదలచు కుంటే భయం మంచు పొగలా మాయమవుతుంది. 🍀*

తరతరాల నుండి దేవుణ్ణి కాంతిగా భావిస్తున్నారు. ఎందుకంటే చీకటంటే మనకు భయం. దేవుడు కాంతి మాత్రమే కాదు అంతే మేరకు చీకటి కూడా. దేవుడు రెండూ లేని పక్షంలో చీకటి వునికిలో వుండదు. దేవుడు అత్యల్ప స్థాయిలో వాడు, అత్యున్నతమైన స్థాయిలోని వాడు. దేవుడు పదార్థం, మనసు, దేవుడు సమస్థం. సమస్త భిన్న ధృవాలు కలిగింది. కాబట్టి దేవుణ్ణి కేవలం కాంతి అనడం కుదరదు. చీకటి పట్ల భయంతో మనం దేవుణ్ణి చీకటిగా అనుకోవడానికి యిష్టపడం. 

దేవుణ్ణి మనం భయం గుండా సమీపిస్తే అది సరయింది కాదు. దేవుణ్ణి నిర్భయంగా సమీపించాలి. గాఢమయిన ప్రేమతో సమీపించాలి భయంతో సమీపిస్తే అక్కడ నీ భయాన్ని ముందుంచుతావు. అక్కడ లేని వస్తువుల్ని నువ్వు చూస్తావు. అక్కడ వున్న విషయాల్ని చూడవు. నువ్వు స్పష్టంగా చూడదలచుకుంటే భయం మంచుపొగలా మాయమవుతుంది. మంచి అన్నది ఎప్పుడూ స్పష్టతలో చూస్తుంది. దేవుడు రెండూ. చీకటి దేవుడు, వెలుగు దేవుడు. వేసవి దేవుడు, చలికాలం దేవుడు. జీవితం దేవుడు, మరణం దేవుడు, అక్కడ ద్వైదీభావం అదృశ్యమై నీ దృష్టిలో ఏకత్వం మిగుల్తుంది. 

మనం ద్వైదీభావంతో బంధింపబడి వుంటాం. ఏకత్వం ద్వారా విముక్తి పొందుతాం. ప్లాటినస్, 'దేవుణ్ణి అన్వేషించడంలో మనం ఒక ఏకాంతం నించీ యింకో ఏకాంతం దాకా సాగుతాం' అన్నాడు. చీకట్ని దైవత్వంగా దర్శించడం ఆరంభించు. ప్రతిదాన్నీ దైవత్వంగా భావించు. ఎందుకంటే మనకు తెలిసినా తెలియకున్నా అంతా దైవత్వమే. మనం అంగీకరించినా, అంగీకరించకున్నా అంతా దైవత్వమే. మన లక్ష్యపెట్టడమన్నది లెక్కలోనిది కాదు. అస్తిత్వం దైవత్వం. ప్రతి దాని ఉనికి దైవత్వం, దాన్ని మనం ఆమోదిస్తే ఆనందిస్తాం. ఆమోదించకుంటే అనవసరంగా బాధపడతాం.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-3🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 312. 'రణత్కింకిణిమేఖలా' - 3🌻* 

సంసార క్షయ మొనర్చి ఆత్మ సాక్షాత్కారము కలిగించు శ్రీదేవి కటిభాగము నారాధించుట సంప్రదాయము. కటిభాగ మందలి మొలత్రాడు చిరుగంటల సవ్వడి శ్రీదేవి భక్తులకు వినిపించు చుండును. బాల మంత్ర ఉపాసకులకు ఈ అనుభవము సహజము. శక్తికూట మంత్ర భాగమైన సకల హ్రీం గురుముఖముగ ఉపదేశము పొంది ధ్యానించినచో శక్తి బంధము నుండి విడివడ వచ్చును. అనుగ్రహకారిణియైన శ్రీమాత తన నారాధించు వారిని కూడ ఈ విధముగ ఉద్ధరించును. 

పై విధానమగు ఉధారణము పొందినవారు క్షరత్వము నుండి అక్షరత్వము లోనికి ప్రవేశింతురు. బాహ్యమునుండి అంతరంగము చేరుదురు. మూలాధారము నుండి హృదయమును చేరుదురు. క్రియా శక్తి నుండి జ్ఞానశక్తిలోనికి వ్యాపింతురు. మానవ శరీర మందలి మూడు భాగములు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులకు అనుగుణముగ అమర్చబడి యున్నవి. శ్రీమాత అనుగ్రహమున మూడింటి యందును మానవుడు పరిపూర్ణముగ వ్యాప్తి చెందుట, బంధములు లేక త్రికూటముల యందుండుట ప్రధానము. ప్రాథమికముగ క్రియకు జ్ఞానమును జోడించి కర్మ బంధమునుండి విముక్తులగుట ప్రధానము గనుక శ్రీమాత మొలనూలు ఈ సందేశము నందించుచున్నది. ఆమె సందేశమే చిరుగంటల మ్రోతలు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 312-3 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 312-3. Raṇatkiṅkiṇi-mekhalā रणत्किङ्किणि-मेखला (312) 🌻*

It is also said that these descriptions enable the beginners to visualise Her gross form. She has four types of forms, gross (sthūla), subtle (sūkṣma rūpa), subtler (sūkṣmatara) which is also known as Her kāmakalā dorm and Her subtlest form is kuṇḍalinī form.  

Her gross form is described in nāma-s twelve to fifty one. Her subtle form (mantra-s) is described in nāma-s 85 to 89. Her subtler form (kāmakalā) is described in 88 and 89. (Nāma 322 is kāmakalā rūpa.) Finally, Her subtlest form kuṇḍalinī is described in 90 to 111. (Psychic cakra-s are discussed in 475 to 534).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹