నిర్మల ధ్యానాలు - ఓషో - 79


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 79 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడు సమస్థం. సమస్త భిన్న ధృవాలు కలిగింది. కాబట్టి దేవుణ్ణి కేవలం కాంతి అనడం కుదరదు. దేవుడు కాంతి మాత్రమే కాదు అంతే మేరకు చీకటి కూడా. నువ్వు స్పష్టంగా చూడదలచు కుంటే భయం మంచు పొగలా మాయమవుతుంది. 🍀


తరతరాల నుండి దేవుణ్ణి కాంతిగా భావిస్తున్నారు. ఎందుకంటే చీకటంటే మనకు భయం. దేవుడు కాంతి మాత్రమే కాదు అంతే మేరకు చీకటి కూడా. దేవుడు రెండూ లేని పక్షంలో చీకటి వునికిలో వుండదు. దేవుడు అత్యల్ప స్థాయిలో వాడు, అత్యున్నతమైన స్థాయిలోని వాడు. దేవుడు పదార్థం, మనసు, దేవుడు సమస్థం. సమస్త భిన్న ధృవాలు కలిగింది. కాబట్టి దేవుణ్ణి కేవలం కాంతి అనడం కుదరదు. చీకటి పట్ల భయంతో మనం దేవుణ్ణి చీకటిగా అనుకోవడానికి యిష్టపడం.

దేవుణ్ణి మనం భయం గుండా సమీపిస్తే అది సరయింది కాదు. దేవుణ్ణి నిర్భయంగా సమీపించాలి. గాఢమయిన ప్రేమతో సమీపించాలి భయంతో సమీపిస్తే అక్కడ నీ భయాన్ని ముందుంచుతావు. అక్కడ లేని వస్తువుల్ని నువ్వు చూస్తావు. అక్కడ వున్న విషయాల్ని చూడవు. నువ్వు స్పష్టంగా చూడదలచుకుంటే భయం మంచుపొగలా మాయమవుతుంది. మంచి అన్నది ఎప్పుడూ స్పష్టతలో చూస్తుంది. దేవుడు రెండూ. చీకటి దేవుడు, వెలుగు దేవుడు. వేసవి దేవుడు, చలికాలం దేవుడు. జీవితం దేవుడు, మరణం దేవుడు, అక్కడ ద్వైదీభావం అదృశ్యమై నీ దృష్టిలో ఏకత్వం మిగుల్తుంది.

మనం ద్వైదీభావంతో బంధింపబడి వుంటాం. ఏకత్వం ద్వారా విముక్తి పొందుతాం. ప్లాటినస్, 'దేవుణ్ణి అన్వేషించడంలో మనం ఒక ఏకాంతం నించీ యింకో ఏకాంతం దాకా సాగుతాం' అన్నాడు. చీకట్ని దైవత్వంగా దర్శించడం ఆరంభించు. ప్రతిదాన్నీ దైవత్వంగా భావించు. ఎందుకంటే మనకు తెలిసినా తెలియకున్నా అంతా దైవత్వమే. మనం అంగీకరించినా, అంగీకరించకున్నా అంతా దైవత్వమే. మన లక్ష్యపెట్టడమన్నది లెక్కలోనిది కాదు. అస్తిత్వం దైవత్వం. ప్రతి దాని ఉనికి దైవత్వం, దాన్ని మనం ఆమోదిస్తే ఆనందిస్తాం. ఆమోదించకుంటే అనవసరంగా బాధపడతాం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


14 Oct 2021

No comments:

Post a Comment