మైత్రేయ మహర్షి బోధనలు - 12


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 12 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 8. సమ భావము ముఖ్యలక్షణము - 2 🌻


ఎవరికి దేనియందు ఎక్కువ సామర్థ్యము కలదో వారికి ఆ విషయమున స్వతంత్రము నిచ్చి కార్యమును నిర్వర్తింప చేసుకొనుట తెలివి. భార్యా భర్తల యందు, తల్లితండ్రుల యందు, బిడ్డల యందు కల వ్యక్తిగత సామర్థ్యములను గుర్తించి, గౌరవించుట వలన మరియు నిర్వర్తించుట కనుమ తించుట వలన ఆయా సమర్థలు వారియందు పెంపొందుటయే గాక, సమిష్టిగ కుటుంబమునకు ఉపయోగ పడగలవు.

ఇదియే సూత్రమును ఒక సంస్థ యందు పాటించినచో, సమిష్టిగా సంస్థ వృద్ధిచెందగలదు. సంఘ అభివృద్ధికి కూడ ఇదియే సూత్రము ఉపయోగకరమైనప్పటికి, ఒక కుటుంబమున, ఒక సంస్థ యందు గల కట్టుబాటు సంఘమున లేకుండుట అభివృద్ధికి అవరోధమై నిలచుచున్నది. కుటుంబము నందు, సంస్థయందు ఒకరిని పెద్దగ గౌరవించుట వలన కట్టుబాటుకు అవకాశ మేర్పడు చున్నది. హృదయ పూర్వకముగా గౌరవింప బడగల నాయకులున్ననే సంఘమున కట్టుబాటు, అభివృద్ధి సాధ్యములగును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


14 Oct 2021

No comments:

Post a Comment