1) 🌹 శ్రీమద్భగవద్గీత - 487 / Bhagavad-Gita - 487🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 275🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 175🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 91 / Sri Lalita Sahasranamavali - Meaning - 91🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 92 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 63🌹
8) 🌹. శివగీత - 60 / The Shiva-Gita - 60🌹
9) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 50 / Gajanan Maharaj Life History - 50 🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 42 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 402 / Bhagavad-Gita - 402🌹
12) 🌹. శివ మహా పురాణము - 222🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 98 🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 109 🌹
15) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 52🌹
16 ) 🌹 Seeds Of Consciousness - 173🌹
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 29 📚
18) 🌹. అద్భుత సృష్టి - 30 🌹
19 ) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 9 / Vishnu Sahasranama Contemplation - 9🌹
20 ) శ్రీ విష్ణు సహస్ర నామములు - 11 / Sri Vishnu Sahasranama - 11🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 487 / Bhagavad-Gita - 487 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 32 🌴*
32. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ: |
శరీరస్థో(పి కౌన్తేయ న కరోతి న లిప్యతే ||
🌷. తాత్పర్యం :
నిత్యదృష్టి కలిగినవారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను, నిత్యమైనదిగను, త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. ఓ అర్జునా! అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగియున్నను కర్మనొనరింపదు మరియు బద్ధము కాదు.
🌷. భాష్యము :
దేహము జన్మించుచున్నందున జీవుడును జన్మించినట్లు గోచరించుచుండును. కాని వాస్తవమునకు జీవుడు నిత్యమైనవాడు మరియు జన్మలేనటువంటివాడు. దేహమునందు నిలిచియున్నను అతడు దివ్యుడు మరియు నిత్యుడు. కనుక అతడ నశింపులేనివాడు. స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణుడు. భౌతికకర్మల యందు అతడు నిమగ్నుడు కానందున దేహసంపర్కముచే ఒనరింపబడు కర్మలు అతనిని బంధింపవు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 487 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 32 🌴*
32. anāditvān nirguṇatvāt
paramātmāyam avyayaḥ
śarīra-stho ’pi kaunteya
na karoti na lipyate
🌷 Translation :
Those with the vision of eternity can see that the imperishable soul is transcendental, eternal, and beyond the modes of nature. Despite contact with the material body, O Arjuna, the soul neither does anything nor is entangled.
🌹 Purport :
A living entity appears to be born because of the birth of the material body, but actually the living entity is eternal; he is not born, and in spite of his being situated in a material body, he is transcendental and eternal. Thus he cannot be destroyed. By nature he is full of bliss. He does not engage himself in any material activities; therefore the activities performed due to his contact with material bodies do not entangle him.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 275 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 34
*🌴. The story of Sarabheswara 🌴*
*🌻 Sri Datta puts His devotees in troubles, tests their devotion and then saves them - 3 🌻*
She was brought to the house where we were living. She prayed pitifully, ‘Anna! Please save my ‘mangalyam’. My heart was moved very much.
I had some sacred ‘akshatas’ given by Sripada to the farmer in Panchadeva Pahad at the time of his marriage. I had some divine intusion. It struck me that these ‘akshatas’ would save her ‘mangalyam’ as they were given by Sripada Himself. I said, ‘Amma! You take these mantra akshatas.
These are golden akshatas. Keep them safely in your puja room. Your husband will reach you in a few days. This is true.’ The betting farmers carried this to Sharabheswara Sastri. He got raged with anger.
He said if her husband came home alive, she would repay the debt of that poor Brahmin, accept Shankar Bhatt as Guru and worship Sripada Srivallabha.
Three days passed. In these three days, some farmers were bringing the food material to the poor Brahmin’s house. They were the people who betted on me. If I won, they would also win.
They would get great amount of money. On the fourth day Sharabheswara Shastri’s sister’s husband came home safely. That Brahmin woman was extremely happy.
She thought that her husband was saved because of the sacred mantra ‘akshatas’ which I gave. When decoits tried to kill her husband, one muslim wrestler killed the decoits and saved the Brahmin. Oh! Endless was the greatness of Sripada. The ego in Sharabheswara Shastri was destroyed.
Because my foretelling became true, Sharabheswara Shastri cleared the debt of the poor Brahmin in whose house we were staying. He requested me and Dharma Gupta to accept hospitality in his house. We agreed.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. భావ బలము - 2 🌻*
*ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే కల్పింపక తప్పదు. ఇతరులకు మనము ప్రతికూలపు ఆలోచనను అందించినచో మనకు కూడా వారి నుండి ప్రతికూలపు ఆలోచనయే ఎదురగాక తప్పదు.*
ఇట్టి వ్యవహారము, ఇరువురు వ్యక్తుల నుడమ వాటిల్లినచో, దాని ప్రభావము సమాజముపై అంతగా ఉండదు. కాని, ఇట్టిదే రెండు వర్గములకో, జాతులకో, దేశములకో ప్రాతినిధ్యము వహించు ఇరువురు వ్యక్తుల నడుమ వాటిల్లినచో ఫలితము వినాశకరమగును.
సంగ్రామము పేరున, మానవ చరిత్ర పుటలలో చాలా బాధాకరములయిన గుణపాఠములు లిఖింపబడినవి. ప్రతి యుద్ధము గూడ, నరుడను జీవిలోని పశుప్రవృత్తి యొక్క చేవ్రాలు మాత్రమే. అనగా మృగ ప్రాయమైన బాధ్యతారహిత పథమున ఆలోచనలను, దృక్పథములను ఉద్భవింపజేయుటయే.
ప్రసార కేంద్రము నుండి వెలువడు ఒకే కార్యక్రమమును ఎవరి రేడియో అయినను స్వీకరించును. ఉద్వేగము వలన మనలో ఒక తలంపు పుట్టగనే, ఇతరులలోను అది ఉద్వేగమునే ప్రేరేపించును. అవతలి వ్యక్తి, ఉద్వేగమును అంతయు తనలోన సంలీనము గావించుకొన్నవాడయితే తప్ప, ఇది యథార్థము.
దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా..
...✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Centres of the Solar System - 175 🌹*
*🌴 Sun and Consciousness - 4 🌴*
✍️ Master E.
📚 . Prasad Bharadwaj
*🌻. Life and Consciousness - 2 🌻*
Sun is expansion, Saturn solidification, the anti-life principle we call death. Stocks of carbon dioxide in the body form a source of chronic illnesses. All rooms should receive as much air and sunlight during the day as possible.
Rooms without sunlight are hotbeds of negative energies which lead to a loss of consciousness. Today there is a lot of wrong architecture blocking the vital energy.
Asanas exercises which keep the spine flexible help with the intake of the pranic force of the sunlight, especially the Sarvang Asana (shoulder stand posture). Drinking fresh water or fruit juices and eating fresh vegetables are also helpful.
The vital force of the Sun enters into the body via two main centres: via the sacral centre (spleen) and the centre between the shoulder blades which is located more closely to the heart centre than to the throat centre.
The rays of the morning Sun give fresh life and consciousness. It is very good to expose the body during this time to fresh air and to take in the golden light into ourselves; it doesn’t have to be the direct sunrays. The times of sunset are also helpful to receive a lot of vital force.
About 90 minutes before the Sun appears over the Eastern horizon a great surge of energy comes on our part of the planet, and less than 30 minutes before the Sun appears a second surge of energy rushes through the atmosphere, this one being still more powerful.
Master E.K. insisted very much that the disciples wake up in the early morning hours, take a shower and expose themselves to the rays of the early morning Sun.
Those who don’t do it cannot even dream of getting into any hierarchical work or of following the teachings.
🌻 🌻 🌻 🌻 🌻
Sources: Master K.P. Kumar: Hercules / Uranus / notes from seminars / Master E. Krishnamacharya: Spiritual Astrology.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 91 / Sri Lalita Sahasranamavali - Meaning - 91 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. శ్లోకం 175.*
*పంచమే పంచభూతేశే పంచసంఖ్యోపచారిణి*
*శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ*
947. పంచమే :
పంచకృత్యపరాయణి
948. పంచభూతేశే :
పంచభూతములను ఆఙ్ఞాపించునది
949. పంచసంఖ్యోపచారిణి :
శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరధింపబడునది
950. శాశ్వతీ :
శాశ్వతముగా ఉండునది
951. శాశ్వతైశ్వర్యా :
శాశ్వతమైన ఐశ్వర్యము కలది
952. శర్మదా :
ఓర్పు ను ఇచ్చునది
953. శంభుమోహినీ :
ఈశ్వరుని మోహింపజేయునది
*🌻. శ్లోకం 176.*
*ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ*
*లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా*
954. ధరా :
ధరించునది
955. ధరసుతా :
సమస్త జీవులను తన సంతానముగా కలిగినది
956. ధన్యా :
పవిత్రమైనది
957. ధర్మిణీ :
ధర్మస్వరూపిణి
958. ధర్మవర్ధినీ :
ధమమును వర్ధిల్ల చేయునది
959. లోకాతీతా :
లోకమునకు అతీతమైనది
960. గుణాతీతా :
గుణములకు అతీతమైనది
961. సర్వాతీతా :
అన్నిటికీ అతీతురాలు
962. శమాత్మికా :
క్షమాగుణము కలిగినది
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 91 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 91 🌻*
947 ) Panchami -
She who is the consort of Sadshiva - the fifth of the pancha brahmas
948 ) Pancha bhoothesi -
She who is the chief of Pancha bhoothas viz earth, sky, fire, air. And water
949 ) Pancha sankhyopacharini -
She who is to be worshipped by five methods of Gandha(sandal wood), Pushpa(flower), Dhoopa(incense), dheepa(light), Naivedya(offering)
950 ) Saswathi -
She who is permanent
951 ) Saswathaiswarya -
She who gives perennial wealth
952 ) Sarmadha -
She who gives pleasure
953 ) Sambhu mohini -
She who bewitches Lord Shiva
954 ) Dhara -
She who carries (beings like earth)
955 ) Dharasutha -
She who is the daughter of the mountain
956 ) Dhanya -
She who has all sort of wealth
957 ) Dharmini -
She who likes dharma
958 ) Dharma vardhini -
She who makes dharma grow
959 ) Loka theetha -
She who is beyond the world
960 ) Guna theetha -
She who is beyond properties
961 ) Sarvatheetha -
She who is beyond everything
962 ) Samathmika -
She who is peace
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 92 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 63
*🌻 63. స్తీ ధన నాస్తిక (వైరి) చరిత్రం న శ్రవణీయమ్ ॥| 🌻*
పురుషులలో శృంగారం ఉదయించడానికి కారణ భూతమైన స్త్రీల కథలను వినరాదు. ఇంద్రియ భోగాలకు, వ్యసనాలకు ఆలవాలమైన ధనంతో ముడిపడిఉన్న
విషయాలను వినరాదు. నాస్తికులతో వాదన చేయరాదు. ఈ మూడింటిని శత్రువులుగా చూడవలెను.
స్త్రీ విషయంగా దర్శనం, స్పర్శనం, కేళి, కీరనం, గుహ్యభాషణం, సంకల్పం, అధ్యవసాయం, క్రియానివృత్తి అని ఎనిమిది మైధున భావా లున్నాయి. స్త్రీ సంపర్కం చేయకున్నను పై ఎనిమిది వికారాల వలన మనసు చలించి భక్తిభావం విచ్చిన్న మవుతుంది. స్త్రీలపై తృష్ణ భోగ్యతా బుద్ధి విడనాడాలి. అట్లే స్త్రీలు కూడా పురుషుల యెడ ఈ విధమైన వికారాలు కలుగకుండా చూచుకోవాలి.
ధనం వలన చెడు అలవాట్లు కలిగి, వ్యసనాలవాలై విడుదలవడం కష్టమవుతుంది. ఇంద్రియ భోగలాలసకు అవకాశం కలుగుతుంది. ఇక దిగ జారుడు మొదలవుతుంది. కనుక కాంత, కనకాల ప్రస్తావనే రాకూడదని చెప్పన్నారు. ఆ విషయాలు ఎవరైనా చెపితే వినరాదని కూడా చెప్తున్నారు. అత్యంత జాగరూకత అవసరం.
శివ భక్తుడైన రావణుడు స్త్రీ కాంక్ష వల్లనే పతనమయ్యాడు. రామకృష్ణ పరమహంస తన భార్య శారదను మాతవలె భావించారు. భక్త ప్రహ్లాదుడు స్త్రీలు ఎదురైతే మాతృభావంతో అడ్డుతొలగేవాడు. “ప్రతి స్త్రీలో అమ్మను చూచేవాడికి అందనిదంటూ లేదు” అని జిల్లళ్ళమూడి అమ్మ వాక్యం.
స్త్రీలు వలె పురుషులు కూడా వారి శరిర రూప సౌందర్య పోషణ గావించు కోవడం చూస్తుంటాం. ఇట్టి విలాసపరులచే స్త్రీలు ఆకర్షింపబడాలనే కదా ఈ అలంకారం ? ఇట్టి బాహ్యమైన ఆడంబరాల మీద ధ్యాస ఉంటే ఇక భక్తి ఏకాగ్రతలు ఎలా కుదురుతాయి ? ఇదే మాదిరిగా స్రీలు కూడా ఆడంబరాలకు దూరంగా ఉండాలి.
నాస్తిక వాదులతో స్నేహం, వారితో వాదోపవాదాలు చేయడం వలన మనలో ఉన్న ఆస్తిక్య బుద్ధిలో సందేహాలు తలెత్తుతాయి. అంతటితో భక్తిలో ఏకాగ్రత తగ్గటం మొదలవుతుంది. భక్తి పెంపొందే దిశగా సత్సంగ గోష్టిలో పాల్గొంటూ పెద్దల సలహాలను, మార్దదర్శకాలను పాటించాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 60 / The Siva-Gita - 60 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ఎనిమిదో అధ్యాయము
*🌻. గర్భో త్పత్త్యాది కథనము - 6 🌻*
తతొ జాతే ష్ట మే మాసి - న జీవ త్యో జసోజ్ఘి తః
కించి త్కాల మవస్థానం - సంస్కారా త్పీడి తాంగ వత్ 36
సమయః ప్రసవ స్య స్మా - న్మాసే షు నవ మాది షు
మాటూర స్రవహాం నాడీ - మాశ్రిత్యా న్వవ తారితా 37
నాభిస్థనాడీ గర్భస్య - మాత్రాహార రసావహా
తేన జీవతి గర్భోపి - మాత్రాహారేణ పోషితః 38
ఆస్థి యంత్ర వినిష్పిష్ట - పతితః కుక్షి వర్త్మనా,
మేదో సృగ్ది గ్ద సర్వాంగో - జరాయు పుట సంవృతః 39
నిష్క్రామన్భ్రు శ దుఃఖార్తో - రుదన్నుచ్చైర ధో ముఖః
యంత్రాదేవం వినిర్ముక్తం - పతత్యుత్తాన శాయ్యుతః 40
తొమ్మిదవ మాసమున ప్రసవమునకు సమయమైనప్పటికి కొంతకాలము బరువు మోయువాడిలా నిలిచియున్నట్లు గర్భమునందే ఉండగలదు. (సామాన్యముగా మూడు తొమ్మిదులు మోయువారి విషయమేమనగా, ఎక్కువ భారమైన కట్టెలు మున్నగు భారమును మోయువాడు అట్లే నిలిచిపోయినట్లు నిలిచిపోవును ఇట్లే కొంతకాలము
ఎక్కువగా గర్భములో జీవుడుండు నని వివరణము)
తల్లి యొక్క ఆహార రసమును వహించు నాది యేదైతే ఉందో అట్టి తల్లి ఆహారముతోనే గార్భమందున్న శిశువు పోషింపబడును. (ఇక్కడ శిశువు జన్మించే విధానము వివరించుచున్నాడు).
ఎముకల యంత్ర మయమగు యోని నుండి పీడింపబడినవాడై అదే ద్వారము నుండి జరాయుకోశముతో జుట్టబడి మెదడు రక్తముల చేత మూయబడి సమస్తావయవ పరిపూర్ణుడై క్రిందబడును.
ఇట్లా శిశువు జన్మించిన తరువాత బాల్యావస్థలను వివరించుచున్నాడు. అధోముఖుడై శోకించుచు మిగుల దుఃఖముతో బీడితుండై ఈ విధముగా యోని యంత్రము నుండి బయలుదేరి క్రిందబడును. మరియు వెల్లకిలా బడియుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 60 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 08 :
*🌻 Pindotpatti Kathanam - 6 🌻*
In the ninth month before the birth takes place, the child remains in a shape which resembles as if someone is carrying a load of his shoulders.
Inside the womb the child gets nourished through the umbilical
cord with the substances which come from the mother.
During the birth process the child slips out of the same door of bones and flesh called vagina and the child takes birth passing through the Jarayu (skin bag), blood and fluids.
Finally it falls on the ground. Now i would narrate the sequences of the stages through which the infant passes after the birth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 63 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
*🌻 Only the feet of the Guru have the power to rid you of all the dualities, all sorrows and all attachments to ferry you across the ocean of Samsara. 🌻*
We discussed that these were detachments that came coupled with attachments. Or, they can be called attachments that came coupled with detachments.
To each his own – the one who built a temple, the donor, some who are in fear of not receiving ancestral rites annually and so on. Owing to this fear, Some of these people wear a lot of gold jewelry and announce that people that perform the funeral rites will be given that jewelry.
They even provide this in writing. Is this called detachment? Tell me. Is it called sacrifice? Is it called attachment? This is also attachment coupled with detachment.
Then again, there is is that sinful attachment, just pure attachment. Due to this, we covet everything we see. This is sinful attachment, “It would be nice to have this”, “Oh, this would be very nice to have”. One desires to have the newer item even though he just bought a new item.
They don’t want to give anything to anyone under any circumstances. That attachment engulfs them. Such people don’t sacrifice anything for anyone.
Doesn’t matter if it rots and festers, they will not give it away. This is called sinful attachment. This attachment is a kind of passion. This is caused by dualities that are also otherwise known as the ocean of samsara.
It is being said here that only the feet of the Guru have the power to rid you of all these dualities, all sorrows and all attachments to ferry you across the ocean of Samsara.
Thus, after defining what a Guru is, they are talking about what one needs to do to cross the ocean of samsara once he takes refuge with a Guru.
Sloka :
Dehi brahma bhavedyasmat tadidanim prakasaye sarva papa visuddhatama sri guroh pada sevanat
When one falls upon the feet of the Guru, and serves him, his sins will be washed off and his mind gets purified. Then he becomes a part of the godhead. So, the panacea is service at the feet of the Guru.
The Lord is saying here that he will advise on what needs to be done for the soul that takes on a body to attain godhead. This body needs to be an outstanding chariot. We need this body.
You should not just grow your body, but you should make it an outstanding chariot. This body should become a temple . The Lord is revealing the secret one needs to know for the soul to attain liberation. Let’s recall a short story.
In Mahabharata, the fifth veda, Ganga was born to fulfill a greater purpose. Her son, Bheeshma was also born to fulfil a greater purpose. Let’s see what happens next.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 50 / Sri Gajanan Maharaj Life History - 50 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 10వ అధ్యాయము - 4 🌻*
అప్పటినుండి భాస్కరు అతనితో మంచిగా ప్రవర్తించాడు. ఆమ్లపరీక్ష తరువాతనే బంగారం గుర్తించ బడుతుంది. బాలాపూరులో శుఖలాల్ అగర్వాలు అనే ఒకవ్యక్తి ఉండేవాడు.
అతనికి ఒక పెంకి ఆవు ఉండేది. అది ఊళ్ళో విచ్చలవిడిగా తిరుగుతూ, కొమ్ములతో ప్రజలను గాయపరచేది. ఏ దుకాణం లోకయినా వెళ్ళి కడుపు నిండా ధాన్యంతిని మిగిలినవి తోసి రోడ్డుమీద పోసేది. అది నూనె, నెయ్యి డబ్బాలను తన్ని అందులోని పదార్ధాలు బయట రోడ్డుమీద పడేలా చేసేది. ఒక వేళ ఇంటి దగ్గర కట్టి ఉంచితే, తాళ్ళులాగేసి గొలుసులు తెంచేసేది. అది పులి మాదిరి ప్రవర్తించేది.
బాలాపూరు ప్రజలు దాని ఆకతాయితనంతో విసిగు చెందారు. అది గర్భిణీ కావడంలేదు. ఇంటిలో ఉండటంలేదు. చాలామంది దానిని కసాయికి ఇచ్చేయమని లేదా తుపాకితో కాల్చమని శుఖలాల్ కు సలహాఇచ్చారు. ఏమి చెయ్యగలిగితే అది చెయ్యడానికి వాళ్ళకు అతను అనుమతి ఇచ్చాడు. ఒక ముస్లిం ఒకసారి దానిని తుపాకితో చంపడానికి ప్రయత్నిస్తే, ఎలాగో దానికి తెలిసి అతనిని ఎదుర్కుని కొమ్ములతో విసిరి పడేసింది.
అప్పుడు శుఖలాల్ దానిని తీసుకు వెళ్ళి వేరేగ్రామంలో వదలి వస్తే అదితిరిగి బాలాపూరు వచ్చేసింది. గోవిందబువా గురాన్ని శ్రీమహారాజు శాంతపరచిన విషయం ఒకరికి గుర్తువచ్చి ఈఆవును కూడా, షేగాం తీసుకువెళ్ళి శ్రీమహారాజుకు కానుకగా ఇచ్చి దీని బాధనుండి విముక్తి పొందడం మరియు యోగికి గోదానం చేసిన పుణ్యం దక్కించుకోడం వంటి రెండు పనులు పొందవచ్చని శుఖలాలకు సలహా ఇస్తాడు.
ఈసలహా అందరికి నచ్చింది కానీ ప్రతిసారి దాన్ని పట్టుకోడానికి ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. అప్పుడు పెద్ద పచ్చగడ్డి గుట్టలాపోసి, దూదిగింజలు ఖాళీ స్థలంలో పోసి పెట్టారు. అవి తినడానికి ఆఆవు రాగానే 10/15 మంది చుట్టుముట్టి తాళ్ళతో బంధించారు. ఆతరువాత దాన్ని మోసి ఒక ఎడ్లబండి మీద ఇనుప గొలుసులతో కట్టి శ్రీమహారాజుకు ఇచ్చేందుకు షేగాం తీసుకు వచ్చారు.
షేగాం దగ్గరపడుతూండగానే దానిలో మార్పువస్తున్నట్టు కనిపించడం మొదలయింది. శ్రీమహారాజు ముందుకు తెచ్చేసరికి అతి అమాయకంగా కనిపించింది. కళ్ళనీళ్ళతో అది శ్రీమహారాజును చూసింది. అప్పుడు ..... ఒక అమాయకమైన ఆవును ఈవిధంగా కట్టి హింసించడం మీమూర్ఖత్వం. దాని మెడ, కొమ్ములు మరియు కాళ్ళు తాళ్ళతో గొలుసులతో బంధించారు.
అటువంటి బందోబస్తు ఒకపులి కొరకు అయితే సరిగానీ, ఇటువంటి అమాయక మయిన ఆవుకు తగదు, ఓమూర్ఖుడా, ఇది ఒకఆవు, అందరికీ తల్లివంటిది అని నీకు తెలిసి ఉండాలి. ఈవిధంగా కట్టి నువ్వు పాపం చేసావు. వెంటనే దాన్ని వదలండి, ఎవ్వరినీ అది ఇబ్బంది పెట్టదు అని శ్రీమహారాజు అన్నారు.
అటువంటి ఆశ్వాసన తరువాత కూడా ఎవరూ దానిని ముట్టుకుందుకు సాహసించలేదు. శ్రీమహారాజు అప్పుడు స్వయంగా తన పవిత్రహస్తాలతో ఆతాళ్ళను, గొలోసులను పూర్తిగా విప్పుతారు. అలా బంధనాలు తొలగగానే ఆవు కిందికిదిగి, ఆయన చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ముందు కాళ్ళమీద కూర్చుని తలవంచి నమస్కరించి ఆయన పాదాలను నాకడం మొదలు పెట్టింది. ఈ అద్భుతం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు.
ఓగోమాతా ఇకనుండి ఎవరినీ ఇబ్బంది పెట్టకు, అంతేకాక ఈస్థలం ఎప్పటికి వదలకు అని శ్రీమహారాజు ఆ ఆవుతో అన్నారు. ఈసంఘటన జరిగినప్పుడు ప్రజలు శ్రీమహారాజును పొగుడుతూ ధన్యవాదాలు చేసారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 50 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 10 - part 4 🌻*
Bhaskar, thereafter, treated Balabhau with due respect. Gold has to go through an acid test to be accepted as an object of value. There was a man named Sukhlal Agarwal at Balapur who owned a wicked cow.
She used to wander in the town trampling and hurting people by the means of her horns. She would enter any shop, eat grains to her heart’s content and then push and spilled the remaining on road. She even kicked oil and ghee containers thereby spilling the contents everywhere. If tied down at home, she snapped the ropes and broke the chains.
She behaved like a tiger and the people of Balapur got fed up with her nuisance. She was not getting pregnant and never remained indoors. Many folks advised Sukhlal to hand her over to a butcher or get her shot down by a bullet.
He permitted them to do whatever they liked to her. One Muslim man once tried to kill her by gun, but somehow she came to know about it and attacked and threw him away by her horns. Sukhlal then took her and abandoned her in another village, but she returned back to Balapur again.
Somebody then, remembering the fact that it was Shri Gajanan Maharaj who had tamed Govindbua’s horse, advised Sukhlal to take her to Shegaon and offer her to Shri Gajanan Maharaj , thereby serving dual purpose of getting rid of her and obtain Punya for giving a gift of a cow to a saint.
All liked the idea, but their attempts to catch her failed every time. Then they kept a heap of green grass and some cotton seeds on an open ground. As the cow rushed to eat it, 10 to 15 people surrounded and trapped her by ropes.
Then she was lifted and tied on a bullockcart with iron chains and brought to Shegaon as an offering to Shri Gajanan Maharaj . As Shegaon was approaching, there appeared to be a significant change in her behavior, and when brought before Shri Gajanan Maharaj , she appeared to be an extremely tame creature.
With tears in her eyes, she looked at Shri Gajanan Maharaj . Thereupon Shri Gajanan Maharaj said, “It is foolish of you all to have tied and tortured a poor cow like this. Her neck, horns and legs are tied with rope and chains. Such type of ‘Bandobast’ is all right for a tiger, but not for a poor cow like this.
You fools! You should know that this is a cow, a mother of all, and by tying her like this you have committed a sin. Release her at once, she will not trouble anybody.”
Even with Maharaj’s assurance, no one dared to go close to her. So Maharaj, with His sacred hands, released her of all the restraining chains and ropes. As soon as she was free, the cow came down, went round Shri Gajanan Maharaj three times, folded her forelegs and with a bowed head and started rubbing His feet by her tongue. All the people saw this miracle and were surprised.
Shri Gajanan Maharaj said to the cow, “O cow! Do not trouble anybody hereafter and don’t leave this place at all.” When this happened all the people prasent raised cheers in praise of Shri Gajanan Maharaj .
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 42 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 9 🌻*
161. పరిణామ ప్రక్రియలో, చైతన్యము పరిణామమొందుటతో
రూపములు
లోకములు
సంస్కారములు
పరిణామమొందుచున్నవి.
162. నిద్రించిన మానవుడు (A), తన నేత్రమును మెల్లమెల్లగా తెరచుటవంటిది పరిణామక్రమము.
163.ఆత్మ యొక్క చైతన్యము సంపూర్ణముగా పరిణామమొందిన తరువాత తోలిమానవ రూపముతో సంయోగమందగనే, దాని పరిణామము పరిసమాప్తి చెందినది.
164.ఆత్మ యొక్క చైతన్యము సంపూర్ణముగా పరిణామమొందిన తరువాత మానవరూపముతో తాదాత్మ్యత చెందుట ప్రారంభించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Rife frequencies App For Health 🌹*
Prasad Bharadwaj
*There is app of free Rife frequencies in google play store. Our Mobile can be used as Rife mechine to treat various health problems. Just select the Problem and play it....*
App name is
*Z-app.*
https://play.google.com/store/apps/details?id=com.zappkit.zappid
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
VIBRATE HIGHER
The Spiritually inclined will understand:
The covid virus has a vibration of 5.5hz and dies above 25.5hz.
For humans with a higher vibration, infection is a minor irritant that is soon eliminated!
The reasons for having low vibration could be:
Fear, Phobia, Suspicion
Anxiety, Stress, Tension.
Jealousy, Anger, Rage
Hate, Greed
Attachment or Pain
*And so......we have to understand to vibrate higher, so that the lower frequency does not weaken our immune system.*
The frequency of the earth today is 27.4hz. but there are places that vibrate very low like:
Hospitals
Assistance Centers.
Jails
Underground etc.
It is where the vibration drops to 20hz, or less.
For humans with low vibration, the virus becomes dangerous.
Pain 0.1 to 2hz.
Fear 0.2 to 2.2hz.
Irritation 0.9 to 6.8hz.
Noise 0.6 to 2.2hz.
Pride 0.8 hz.
Superiority 1.9 hz.
A higher vibration on the other hand is the outcome of the following behaviour :-
Generosity 95hz
Gratitude 150 hz
Compassion 150 hz or more.
The frequency of Love and compassion for all living beings is 150 Hz and more.
Unconditional and universal love from 205hz
So...Come on ...
*Vibrate Higher!!!*
What helps us vibrate high?
Loving, Smiling, Blessing, Thanking, Playing, Painting, Singing, Dancing, Yoga, Tai Chi, Meditating, Walking in the Sun, Exercising, Enjoying nature, etc.
Foods that the Earth gives us: seeds-grains-cereals-legumes-fruits and vegetables-
Drinking water: help us vibrate higher ..... !!!
*The vibration of prayer alone goes from 120 to 350hz*
So sing, laugh, love, meditate, play, give thanks and live !
_*Let's vibrate high .... !!!*_
The original source of this information is from the book Power Vs Force
Based on David R Hawkins' Doctoral Thesis.
Please share this valuable information & stay safe 🤞
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 222 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
49. అధ్యాయము - 4
*🌻. కామ వివాహము - 1 🌻*
నారద ఉవాచ |
విష్ణుశిష్య మహాప్రాజ్ఞ విధే లోకకర ప్రభో | అద్భుతేయం కథా ప్రోక్తా శివలీలామృతాన్వితా || 1
తతః కిమభవత్తాత చరితం తద్వదాధునా | అహం శ్రద్ధాన్విత శ్ర్శోతుం యది శంభుకథాశ్రయమ్ || 2
నారదుడిట్లు పలికెను -
ఓ విష్ణుశిష్యా! నీవు గొప్ప ప్రాజ్ఞుడవు. హే విధే! నీవు లోకములను సృష్టించితివి. హే ప్రభో! శివుని లీలలు అనే అమృతముతో కూడిన ఈ అద్భుతమగు గాథను చెప్పితివి (1).
తండ్రీ! ఆతరువాత ఏమైనది? ఆ వృత్తాంతమును ఇప్పుడు చెప్పుము. నేను శంభుని గాథను వినుటయందు శ్రద్ధ గల వాడను (2).
బ్రహ్మోవాచ |
శంభౌ గతే నిజస్థానే వేధస్యంతర్హితే మయి | దక్షః ప్రాహాథ కందర్పం సంస్మరన్ మమ తద్వచః || 3
బ్రహ్మ ఇట్లు పలికెను -
శంభుడు తన స్థానమునకు వెళ్లెను. బ్రహ్మనగు నేను అంతర్థానము చెందితిని. అపుడు దక్షుడు నా ఆ మాటను స్మరించుచూ, మన్మథునితో నిట్లనెను (3).
దక్ష ఉవాచ |
మద్దేహజేయం కందర్ప సద్రూపగుణసంయుతా | ఏనాం గృహ్ణీష్వ భార్యార్థం భవతస్సదృశీం గుణౖః || 4
ఏషా తవ మహాతేజా స్సర్వదా సహచారిణీ | భవిష్యతి యథాకామం ధర్మతో వశవర్తినీ || 5
దక్షుడిట్లు పలికెను -
ఓ మన్మథా! ఈమె నా దేహమునుండి పుట్టినది. మంచి రూపము, గుణములు కలది. ఈమె గుణములలో నీకు తగినది. ఈమెను భార్యగా స్వీకరింపుము (4).
గొప్ప తేజస్వినియగు ఈమె సదా నీకు తోడుగా నుండును. ఈమె నిన్ను ప్రేమించును. నీకు అనుకూలముగా నుండి ధర్మమును పాలించగలదు (5).
బ్రహ్మో వాచ |
ఇత్యుక్త్వా ప్రదదౌ తసై#్మ దేహ స్వేదాంబుసంభవామ్ | కందర్పాయాగ్రతః కృత్వా నామ కృత్వా రతీతి తామ్ || 6
విహహ్య తాం స్మరస్సోsపి ముమోదాతీవ నారద | దక్షజాం తనయాం రమ్యాం మునీనామపి మోహినీమ్ || 7
అథ తాం వీక్ష్య మదనో రత్యాఖ్యాం స్వస్త్రియం శుభామ్ | ఆత్మా గుణన విద్దోసౌ ముమోహ రతిరంజితః || 8
క్షణ ప్రదాsభవత్కాంతా గౌరీ మృగదృశీ ముదా | లోలాపాంగ్యథ తసై#్యవ భార్యా చ సదృశీ రతౌ || 9
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుడు ఇట్లు పలికి తన దేహము యొక్క చెమటనుండి పుట్టిన ఆమెకు రతియను నామకరణము చేసి ఆమెను కందర్పుని ఎదుట నిలిపి సమర్పించెను (6).
ఓ నారదా! సుందరి, మునులను కూడ మోహింపజేయునది అగు ఆ దక్షపుత్రిని వివాహమాడి మన్మథుడు మిక్కిలి ఆనందించెను (7).
అపుడు మన్మథుడు రతి అనే శోభాయుక్తమగు తన భార్యను చూచి, అనురాగముచే నిండిన మనస్సు గలవాడై, తన బాణములచే తానే కొట్టబడినవాడై, మోహమును పొందెను (8).
గౌరవర్ణము గలది, లేడికన్నులు గలది, చంచలమగు ఓర చూపులు గలది, సుందరి అగు ఆ మన్మథుని భార్య అతనితో సమమైన అనురాగము గలదియై, అతనికి ఉత్సవమును కలిగించెను (9).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 109 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. అరుణి మహర్షి - 1 🌻*
🌻. జ్ఞానం:
1. తపోవృత్తిలో ఉన్నా, ఆ వృత్తిలో ఉండేవాళ్లను అనుసరించినా అది తపస్సే అవుతుంది.
2. వేదాధ్యనం చేయటమేకాక, ఎవరైనా అధ్యయనం చేస్తున్నప్పుడు నిరంతరం వింటూంటేకూడా ఫలం కలుగుతుంది. వాటిలో ఉండే శక్తి అట్లాంటిది.
ఈ ప్రపంచం అంతటికీకూడా అధిష్ఠానమైన ఒకానొక వస్తువున్నది. దానికి పరమాత్మ, బ్రహమవస్తువు అని పేర్లున్నాయి.
3. అది తెలుసుకుంటే జగత్తులోని బంధన హేతువులైనటు వంటివన్నీకూడా జీవుడిని విసర్జిస్తాయి. అది నేర్చుకున్న తరువాత ఆ వస్తువును తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడికే బంధనాలు అతడిని వదిలి పెట్టడము మొదలుపెడతాయి.
4. ఆ ప్రయత్నమే అంత పవిత్రమైనదికాబట్టి అటువంటివస్తువును తెలుసుకునే ప్రయత్నంచెయ్యటానికీ, దానికి మార్గం అడగటానికే గురువును వినియోగించుకోవటం అవుతుంది కాని, ఈ విధ్యవల్ల ఏమీ లాభంలేదు.
కంటికి కనిపించేటటువంటి ప్రపంచం అంతాకూడా ఈ సృష్టికిపూర్వం సద్రూపమయిన బ్రహ్మముగానే ఉన్నది.
5. దానినుంచి వివర్తమై పుట్టి, ద్వంద్వములతో ఉండి, సజాతీయ, విజాతీయ భేదములతో వచ్చిన ఈ జగత్తంతా ఉన్నది. సజాతీయ భేదమంటే, వృక్షములన్నీ – ఒక పనసచెట్టు, ఒక మామిడిచెట్టు – ఒకటే జాతివి. అది స్వజాతీయతలో భేదం.
6. విజాయీవతతో కూడిన భేదమంటే – చెట్టుకు, రాయికి ఉండేటటువంటితేడా. అదీగాక స్వగతభేదమనే మూదవరకమైన భేదం ఓకటుంది. ఆ చెట్టుకే కాండం వేరు, కొమ్మలు వేరు, ఆకులు వేరు, పువ్వులు వేరు, కాయ వేరు, పండు వేరు. చెట్టులోనే ఇది మళ్ళీ స్వగతభేదం.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 29. గీతోపనిషత్తు - ఆత్మ చింతన - ఆత్మ తత్త్వమును గూర్చి వినుట, మననము చేయుట బాగుగ సాగినచో నిత్యానిత్య వస్తు వివేక మేర్పడి ఆత్మజ్ఞానము నందు రుచి కలుగును. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 59 📚*
*విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |*
*రసవర్జం రసోஉప్యస్య పరం దృష్ట్వా నివర్తతే || 59 ||*
*దైవచింతన లేక ఆత్మచింతన దీర్ఘకాలము జరిగిన వానికి విషయ చింతన తొలగుటయే కాక క్రమశః వాని వాసన కూడ తొలగిపోగలదు. దైవమును నమ్ముట వేరు, దైవము నచ్చుట వేరు. నచ్చినపుడే మనస్సునకు ఆసక్తి కలుగును.*
అట్టి ఆసక్తి వలన మనస్సు దైవమునందే రమించుటకు పదే పదే కోరుకొనుచుండును. అనురక్తి దైవము పైకి మరలక అది హెచ్చు చుండును. ప్రబల మగుచుండును. అది కారణముగ తాత్కాలిక సుఖ సంతోషముల కన్న శాశ్వత సంతోషము నందు రుచి కలుగుటచే విషయ వాసనలయందు కూడ క్రమశః ఆసక్తి తొలగిపోవును.
ఇంద్రియార్థముల వెంట తీరుబడి లేక తిరుగువాడు ఎట్లు ప్రవర్తించునో అట్లే తీరుబడి లేని దైవచింతన యందు మనస్సు పాదుకొని ఇంద్రియార్థముల యందు కూడ దైవమునే గుర్తించుట జరుగుచుండును.
ప్రకృతి దైవీప్రకృతిగ గోచరించును. తన ప్రకృతి దైవీప్రకృతి కాగ సమస్తము నందలి దైవమునే చూచుచు స్థిరమతియైు యుండును. అతనిని దైవము తప్ప మరి ఇతరములు ఆకర్షించవు. అట్టి వాడు 'స్థితప్రజ్ఞుని' భగవంతుడు తెలుపుచున్నాడు.
జీవుడు ఆహారమును అనేక రకములుగ స్వీకరించుచున్నాడు. కేవలము భోజనమే ఆహారము అనుకొనరాదు. పంచేంద్రియముల నుండి, మనస్సు నుండి (అనగా భావము నుండి) రక రకములైన విషయములను తన లోపలికి మనిషి స్వీకరించుచున్నాడు. ఈ ప్రవృత్తి కూడ ఆహారమే. ఇక్కడ ఆహారము వాసనాపరముగ నుండును.
ఈ వాసనలు జన్మ జన్మలలో జీవుడు ప్రోగుచేసుకొని తనతో తెచ్చుకొను చుండును. మాలిన్య పదార్థములను ప్రోగుచేసుకొని తెచ్చుకొను జంతువువలె జీవుని మనస్సు ఈ వాసనలను కూడ శుభవాసనలతో పాటు కొని తెచ్చుకొనును. ఈ ఆహారమును విసర్జించుట నిజమైన నిరాహార దీక్ష.
ఉదాహరణకు భోజనమును గూర్చిన ఆసక్తి భుజించని సందర్భములలో ఉండినచో అది వాసన యగును. భార్య లేని సమయములో భర్తకు భోగాసక్తి యుండుట వాసన యగును. ఇట్లే ధనము గూర్చి, ఇతర చిల్లర విషయముల గూర్చి అవి లేని సందర్భమున భావించుట వాసనయే.
ఈ వాసనలు కూడ ఆహారముగ సంకేతింపబడినవి.
వీటి యందు రతి చెందిన వాడు సతతము అశుద్ధ ఆహారమును భావముచే స్వీకరించుచుండును. వీని విసర్జన సులభమైన విషయము కాదు. ఆత్మ విచార మొక్కటియే పరిష్కారము.
*ఆత్మ తత్త్వమును గూర్చి వినుట, మననము చేయుట బాగుగ సాగినచో నిత్యానిత్య వస్తువివేక మేర్పడి ఆత్మజ్ఞానము నందు రుచి కలుగును.*
ఆ జ్ఞానము అగ్నిది. అగ్ని సమక్షమున ఏదియును నిలువక అగ్నిలో లయమగును. ఆ విధముగ వాసన లంతమొందును. అట్టి వాడు ఇంద్రియార్థ విషయములను స్వీకరింపనట్టి దేహము కలవాడై యుండును. అతడు స్థితప్రజ్ఞుడు. అంతే నిరాహారి.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 29🌹*
✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. *4. అనాహత చక్రం: 🌻*
గ్రీన్ కలర్, ఆకుపచ్చరంగు-థైమస్ గ్రంధి (Thymus gland), వాయుతత్వం. క్వాలిటీ-స్పర్శ, ఫీలింగ్.
✨. ఈ చక్రం హృదయం మధ్య భాగంలో ఉంటుంది. దీనిని గుండె చక్రం అంటారు. ఇది ఆత్మ యొక్క కేంద్ర స్థానం. శరీరంలో గుండెతోనూ, ఊపిరితిత్తులతోనూ, గాల్ బ్లాడర్ తోనూ, డయాఫ్రమ్ తోనూ ఈ చక్రం కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఈ ప్రాంతాలలో ఎక్కడ బ్లాక్స్ ( శక్తి నిరోధకాలు) ఉన్నా శరీరంలోని ఆ అవయవాలలో వ్యాధులు సంక్రమిస్తాయి.
ఈ చక్రంలో ఉన్న శక్తి *"unconditional love"* మరి *"కరుణతో కూడుకున్న ప్రేమ."* దీనిని గొప్ప ట్రాన్స్ ఫార్మర్ గా పిలుస్తారు. ఈ చక్రం *"దుఃఖం"* అనే ఎనర్జీతో బ్లాక్ చేయబడి ఉంటుంది.
💠. *లాభాలు:*
జీవితంలో బ్యాలెన్స్ వస్తుంది. ప్రేమ, కరుణ, విశ్వాసం, నిష్కపట ప్రేమ, స్వేచ్ఛా సామర్థ్యాలను కలిగి ఉండటం. భయం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంపొందిస్తుంది.
🌀. *అండర్ యాక్టివ్:*
తన మీద తనకు నమ్మకం లేకపోవడం, శరీరం ఎప్పుడూ చల్లగా ఉండడం, వ్యక్తుల మధ్య మనస్పర్థలు వచ్చి దూరం పెరిగిపోతుంది.
🔹. *ఓవర్ యాక్టివేట్:*
ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడం (ప్రేమకు సంబంధించి) అవగాహనారాహిత్యం, అహం సమస్యలు తలెత్తడం జరుగుతుంది.
🌟. *సమతుల్యంగా ఉంటే:* కరుణ, ప్రేమ, స్నేహం కలిగి ఉంటాం. భావోద్వేగాలు శాంతియుతంగా ఉంటాయి. హృదయపూర్వకంగా జీవిస్తాం. ఈ చక్రం మహర్లోకంతో కనెక్ట్ అయి ఉంది. ఈ శక్తి ద్వారా మనం *"మహర్షి"* గా ఎదుగుతాం.
ఈ చక్రం 4 వ ప్రోగు DNA తో కనెక్ట్ అయి ఉంది. దీని ద్వారా మనం మూలం నుండి ఏదైతే ఫీల్ అవుతున్నామో(రాధాకృష్ణ తత్వం, జీసస్ తత్వం, ప్రేమ) దీనినే ఇతరులకు పంచుకున్నాం.
🌼. *సాధనా సంకల్పం 1:-*
*"నా అనాహత చక్రంలో ఉన్న సరికాని శక్తులు అన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. ఇందులో ఉన్న దుఃఖం పూర్తిగా తొలగించబడాలి. నేను ఏ ఆత్మ స్వరూపానికి అయినా దుఃఖాన్ని కలిగించి ఉంటే ఆ ఆత్మ స్వరూపులు అందరూ నన్ను క్షమించాలి. దీనికి సంబంధించిన కర్మలు, కర్మ ముద్రలు మూలాలతో సహా నా నుండి తొలగించబడాలి."*
*🏵️. సంకల్పం-2:-*
*"నాలో అంతర్గతంగా దాగి ఉన్న విశ్వశక్తి అయిన కరుణతో కూడుకున్న ప్రేమ అభివృద్ధి చెందాలి. నా హృదయం అనంత ప్రేమతో నిండిపోయి దానిని ఇతరులకు పునఃప్రసరణ చేయాలి. నేను ప్రేమతో, కరుణతో జీవిస్తూ ఇతరులను ఇతర జీవరాశులను అదే విధంగా జీవించేలా చేస్తాను."*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 174 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 21. Without doing anything you have the knowledge ‘I am’, it has come spontaneously and unwillingly on you, stay there and put an ax to the ‘I am’. 🌻*
See the beauty of it, this knowledge ‘I am’ has dawned on you without any effort on your part; it has come on its own without you willing it to be so.
This ‘I am’ would also go on its own without asking or telling you, but before that happens, stabilize in the ‘I am’ and liquidate it, then there is no death for you.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 52 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 16 🌻*
ఏంటంటే, ఈ జన్మలో, ఈ శరీరంతో నువ్వు ఏదైనా సరే, అధికారాన్ని, ఆధిపత్యాన్ని... చాలామందికి తెలుసు. మీ ఇళ్ళల్లో మీమాటే చెల్లుతూ వుంటుందనుకోండి. దాని అర్థం ఏమిటి? అంటే అది కూడా ఒక అధికారమే. నీ మాటే నెగ్గించుకోవడం.
అప్పుడు ఏం ఖర్చు అయిపోతుంది అంటే, పుణ్యఫలం ఖర్చు అయిపోతూ వుంటుంది. ఎదుటివాడు నువ్వు ఏదైనా చెప్పగానే, చెప్పకుండానే విని ఆచరిస్తున్నాడు, నీమాటను ఔదర దాలుస్తున్నాడు, ఔదారుస్తున్నాడు అనంటే, అంటే అక్కడ నీ పుణ్యఫలం ఖర్చైపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అబ్బా! నేనే నా సంసారమునకు అధిష్ఠానమును. నేనే నా కుటుంబమునకు అధిష్ఠానమును. నామాటే చెల్లుతుంది. నామాటే నెగ్గుతుంది. అనేటటువంటి అహం ఏదైతే వుందో, ఆ అహం ఈ పుణ్యభోగాన్ని అనుభవించేస్తూ వుంది.
ఈ రకంగా రాజ్యాధికార పదవి, అనేక రాజ్యాలుంటాయి ఈ ప్రపంచంలో... మనోరాజ్యం వేరే, బుద్ధిరాజ్యం వేరే, శారీరక రాజ్యం వేరే. ఐహికమైనటువంటి భూమండలాధిపత్యం వేరే.
అనేక రకాల అధికారములతో కూడినటువంటి, అనేక శాసనములు, అనేక పదవులు నా శాసనమే చెల్లుతుంది, నా మాటే చెల్లుతుంది, నేనే అధికారిని, నేనే అధిష్ఠానాన్ని అనేటటువంటి బలం ఏదైతే వుందో, ఆ బలం అంతా ఇతః పూర్వ పుణ్యఫలం చేత, ఖర్చయ్యేటప్పుడు జరిగేటటువంటి ఫలితం.
కాబట్టి, భక్తుడైనటువంటి వాడు ఎప్పుడూ ఎలా వుంటాడయ్యా? అనంటే, ‘దాసోహం’ - నాయనా! నాకు ఏ రాజ్యములు వద్దూ, నాకు ఏ సేవకులు వద్దూ, నేనే దాసాను దాసుడను. నేనే సేవకులకు సేవకుడను. నాకు సేవకులు అసవరం లేదు. నా సామాన్య అవసరములు తీరితే చాలు. నాకు ఏ రకమైనటువంటి ఇతరత్రా... ఇతరత్రా... ఎవరక్కడా అంటే పలికేటటువంటి వాళ్ళు అవసరం లేదు. ఈ రకంగా నిశ్చలంగా, భక్తి విశ్వాసాలతో ఉండి, ఈ రకమైనటువంటి ఆకర్షణ నుంచీ బయటపడాలి.
ఇంకొక్కటి ఏం చెప్తున్నారు? ఐహికంలో రాజ్యపదవి ఎలాగో, ఆముష్మికంలో హిరణ్యగర్భ పదవి కూడా అంతే. ఈ హిరణ్మయ కోశానికి అధిష్ఠానం హిరణ్యగర్భుడు. మీరు అందరూ కూడా ఐదు కోశముల విషయం తెలుసుకుని ఉండాలి. ఈ ఐదు కోశములకు అవతల హిరణ్మయకోశం అని ఆరవ కోశం కలదు.
కాబట్టి, “జనన మరణ రాహిత్యం పొందాలి అనంటే, షట్కోశ రహితం అవ్వాలి”. పంచకోశ విచారణ, పంచకోశ నిరసన వరకూ సరిపోదన్నమాట. ఆరవకోశమైనటువంటి హిరణ్మయకోశము నందు ప్రవేశించి, అట్టి హిరణ్యగర్భ పదవిని కూడా, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ వున్నటువంటి సమస్తమూ ‘నాకు అవసరం లేదు’ - అనే త్యాగం చేయగలిగేటటువంటి, తీవ్రవైరాగ్యం కలిగినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడు మాత్రమే మోక్షమునకు అర్హుడు.
ఈ రకమైనటువంటి సత్యాన్ని ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నారు. ఇవి అశాశ్వతమని ఎరిగి తోసిపుచ్చాలి. ఇది చాలా ముఖ్యం. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 9 / Vishnu Sahasranama Contemplation - 9 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*9. భూతభావనః, भूतभावनः, Bhūtabhāvanaḥ*
*ఓం భూతభావనాయ నమః | ॐ भूतभावनाय नमः | OM Bhūtabhāvanāya namaḥ*
తస్మాత్వా ఏతస్మాదాత్మాన ఆకాశః సంభూతః సంకల్ప మాత్రముననే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివ్యాదులు సృష్టింప బడినవి. ఈ సృష్టియంతయును ఆయన తపోఫలమే. భూతభావనభూతేశ దేవ దేవ జగత్పతే.
న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ॥
ప్రాణికోట్లు నాయందుండునవియుకావు. ఈశ్వరసంబంధమగు నా యీ యోగమహిమను జూడుము. నాయాత్మ (స్వరూపము) ప్రాణికోట్లనుత్పన్న మోనర్చునదియు, భరించునదియునైనను ఆ ప్రాణులయందుండుటలేదు.
భగవద్గీతలోని రాజవిద్యా రాజగుహ్యయోగమునందు పై వాక్యములను భగవానుడు దృశ్యరహిత పరిపూర్ణాద్వైతదృష్టియందు చెప్పిరి. అట్టి పూర్ణస్థితియందు ఒక్క బ్రహ్మము తప్ప అన్యమగు ఏ వస్తువున్ను ఉండనేరదు. కావున ద్వైతదృష్టిలో తనయొక్క స్వరూపము ప్రాణులను భరించుచున్నను, రక్షించుచున్నను, పరమార్థదృష్టిలో ప్రాణులలోగానీ, జగత్తుతోగానీ ఏ మాత్రము సంబంధము లేక వెలయుచున్నారు.
భూతాని భావయతి; భూతములను కలిగించును లేదా వృద్ధినందించును. [భూత శబ్ధము ఉపపదముగా 'భూ' ధాతు ప్రేరణార్థక రూపమునుండి ఉపపద సమాసము.]
:: పోతన భాగవతము షష్ఠమ స్కంధము ::
సీ. పూని నా రూపంబు భూతజాలంబులు, భూతభావనుఁడ నేఁ బొందువడఁగ
బ్రహ్మంబు మఱియు శబ్దబ్రహ్మమును శాశ్వతంబైన తనువులు దగిలె నాకు
నఖిలలోకములందు ననుగతంబై యుందు, లోకంబు నా యందు జోకఁజెందు,
నుభయంబు నాయందు నభిగతంబై యుండు, నభిలీన మగుదు న య్యుభయమందు!
తే. వెలయ నిద్రించువాఁడాత్మ విశ్వమెల్లఁ, జూచి మేల్కాంచి తా నొక్క చోటివానిఁ
గా వివేకించు మాడ్కి నీ జీవితేశ, మాయ దిగనాడి పరమధర్మంబుఁ దెలియు. (479)
ఈ జగత్తులోని సమస్తజీవులూ నా స్వరూపాలే. నేను భూత భావనుడను. ఈ సృష్టిలోని సమస్త రూపములను నిర్దేశించెడివాడను నేనే! బ్రహ్మమూ, శబ్దబ్రహ్మమూ - రెండూ శాశ్వతమైన నా దేహములు. ఆత్మస్వరూపుడనైన నేను అఖిల లోకములయందు నిండి ఉన్నాను. ఈ సమస్త జగత్తులు నాలో ఇమిడి ఉన్నాయి. ఈ రెండు స్థితులూ నాకు అనుకూలముగా నడుస్తూ ఉంటాయి. నేను ఈ రెంటిలోను అంతర్లీనముగా ఉంటాను. నిదురించెడివాడు స్వప్నావస్థలో సమస్త విశ్వమును సందర్శించి మేల్కాంచిన అనంతరము తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. అదే విధముగా జీవులు ఈ విశాల సృష్టియందు విహరించి ఏదో ఒకనాడు భగవంతుని మాయనుండి విడివడినవారై పరమార్థమును తెలుసుకుంటారు.
He who originates and develops the elements. One who creates and multiplies the creatures; meaning the One, who is the cause for the birth and who is responsible for the growth of all living creatures.
In the 9th chapter of Bhagavad Gitā, the Lord tells Arjuna...
Na ca matsthāni bhūtāni paśya me yogamaiśvaram,
Bhūtabhr̥nna ca bhūtastho mamātmā Bhūtabhāvanaḥ.
Nor do the beings dwell in Me. Behold My divine Yoga! I am the sustainer and originator of beings, but My Self is not contained in the beings.
One has to understand the absence of association due to Its being free from contact. There is no possibility of Its remaining contained in beings. How again, is it said 'It is My Self?' Following human understanding, having separated the aggregate of body etc. from the Self and superimposing egoism on them, the Lord calls It 'My Self'. But not that He has said so by ignorantly thinking like ordinary mortals that the Self is different from Himself.
So also, I am the bhūtabhāvanaḥ, originator of beings, on who gives birth to or nourishes the beings.
:: श्रीमद्भागवते षष्ठस्कन्धे षोडशोऽध्यायः ::
अहं वै सर्वभूतानि भूतात्मा भूतभावनः ।
शब्दब्रह्म परं ब्रह्म ममोभे शाश्वती तनू ॥ ५१ ॥
Śrīmad Bhāgavata - Canto 6, Chapter 16
Ahaṃ vai sarvabhūtāni bhūtātmā bhūtabhāvanaḥ,
Śabdabrahma paraṃ brahma mamobhe śāśvatī tanū. 51.
All living entities, moving and non-moving, are My expansions and are separate from Me. I am the Supersoul of all living beings, who exist because I manifest them. I am the form of the transcendental vibrations like oḿkāra and I am the Supreme Absolute Truth. These two forms of Mine - namely, the transcendental sound and the eternally blissful spiritual form of the Deity, are My eternal forms; they are not material.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 11 / Sri Vishnu Sahasra Namavali - 11 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*మేషరాశి - కృత్తిక నక్షత్ర 3వ పాద శ్లోకం*
*11. అజ స్సర్వేశ్వర సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః|*
*వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః|| 11*
95) అజః -
పుట్టుక లేనివాడు, జననమరణాలకు అతీతుడు, ఎల్లప్పుడూ వుండువాడు.
96) సర్వేశ్వరః -
అన్నింటికీ, అందరికీ ప్రభువు.
97) సిద్ధః -
అన్ని సిద్ధులు కలిగియున్నవాడు, అన్ని సిద్ధులను ప్రసాదించువాడు.
98) సిద్ధిః -
సకల సాధన, సమస్త కర్మఫలములు తానై యున్నవాడు.
99) సర్వాదిః -
సర్వమునకు మూలకారణము, ప్రప్రథముడు.
100) అచ్యుతః -
తరుగులేని మహాశక్తి సంపన్నుడు, జన్మ, పరిణామ, వార్ధక్యము లేనివాడు.
101) వృషాకపిః -
అధర్మములో మునిగిపోతున్న భూమిని ఉద్ధరించినవాడు (శ్రీవరాహమూర్తి).
102) అమేయాత్మా -
ఊహించుటకు వీలులేని పరమాత్మ స్వరూపుడు.
103) సర్వయోగ వినిసృతః -
బంధములకు అతీతుడు, యోగముతో అర్ధమగువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 11 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*11. ajaḥ sarveśvaraḥ siddhaḥ siddhiḥ sarvādiracyutaḥ |*
*vṛṣākapirameyātmā sarvayōgaviniḥsṛtaḥ || 11 ||*
95) Aja –
The Lord Who Does Not Have Birth
96) Sarveshwara –
The Lord of All
97) Siddha –
The Lord Who is Always Everywhere
98) Siddhi –
The Lord Who is the Desirable Effect of Everything
99) Sarvadi –
The Lord Who is the Primary Reason for Everything
100) Achyuta –
The Lord Who Does Not Slip
101) Vrishakapi –
The Lord Who is the Personification of Dharma and Varaha
102) Ameyatma –
The Lord Whose Stature Cannot be Measured
103) Sarva Yogavinih Srita –
The Lord Who is Known by All Yogas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹