భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 109


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 109  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అరుణి మహర్షి - 1 🌻

🌻. జ్ఞానం:

1. తపోవృత్తిలో ఉన్నా, ఆ వృత్తిలో ఉండేవాళ్లను అనుసరించినా అది తపస్సే అవుతుంది.

2. వేదాధ్యనం చేయటమేకాక, ఎవరైనా అధ్యయనం చేస్తున్నప్పుడు నిరంతరం వింటూంటేకూడా ఫలం కలుగుతుంది. వాటిలో ఉండే శక్తి అట్లాంటిది.

ఈ ప్రపంచం అంతటికీకూడా అధిష్ఠానమైన ఒకానొక వస్తువున్నది. దానికి పరమాత్మ, బ్రహమవస్తువు అని పేర్లున్నాయి.

3. అది తెలుసుకుంటే జగత్తులోని బంధన హేతువులైనటు వంటివన్నీకూడా జీవుడిని విసర్జిస్తాయి. అది నేర్చుకున్న తరువాత ఆ వస్తువును తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడికే బంధనాలు అతడిని వదిలి పెట్టడము మొదలుపెడతాయి.

4. ఆ ప్రయత్నమే అంత పవిత్రమైనదికాబట్టి అటువంటివస్తువును తెలుసుకునే ప్రయత్నంచెయ్యటానికీ, దానికి మార్గం అడగటానికే గురువును వినియోగించుకోవటం అవుతుంది కాని, ఈ విధ్యవల్ల ఏమీ లాభంలేదు.

కంటికి కనిపించేటటువంటి ప్రపంచం అంతాకూడా ఈ సృష్టికిపూర్వం సద్రూపమయిన బ్రహ్మముగానే ఉన్నది.

5. దానినుంచి వివర్తమై పుట్టి, ద్వంద్వములతో ఉండి, సజాతీయ, విజాతీయ భేదములతో వచ్చిన ఈ జగత్తంతా ఉన్నది. సజాతీయ భేదమంటే, వృక్షములన్నీ – ఒక పనసచెట్టు, ఒక మామిడిచెట్టు – ఒకటే జాతివి. అది స్వజాతీయతలో భేదం.

6. విజాయీవతతో కూడిన భేదమంటే – చెట్టుకు, రాయికి ఉండేటటువంటితేడా. అదీగాక స్వగతభేదమనే మూదవరకమైన భేదం ఓకటుంది. ఆ చెట్టుకే కాండం వేరు, కొమ్మలు వేరు, ఆకులు వేరు, పువ్వులు వేరు, కాయ వేరు, పండు వేరు. చెట్టులోనే ఇది మళ్ళీ స్వగతభేదం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

12.Sep.2020

No comments:

Post a Comment