🌹 11, JUNE 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 11, JUNE 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 11, JUNE 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 383 / Bhagavad-Gita - 383 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 11 / Chapter 10 - Vibhuti Yoga - 11 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 230 / Agni Maha Purana - 230 🌹 
🌻. ఉత్సవ విధి కథనము -2 / Mode of taking out a procession and celebration of festivals -2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 095 / DAILY WISDOM - 095 🌹 
🌻 4. సహకారమే జీవితం యొక్క చట్టం / 4.The Law of Life is Cooperation 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 361 🌹
6) 🌹. శివ సూత్రములు - 97 / Siva Sutras - 97 🌹 
🌻 2-06. గురు రూపాయః - 4 / 2-06. guru Rupāyah   - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 11, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : 🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 10 🍀*

*19. ఖగః ప్రతర్దనో ధన్యో హయగో వాగ్విశారదః |*
*శ్రీమానశిశిరో వాగ్మీ శ్రీపతిః శ్రీనికేతనః*
*20. శ్రీకంఠః శ్రీధరః శ్రీమాన్ శ్రీనివాసో వసుప్రదః |*
*కామచారీ మహామాయో మహోగ్రోఽవిదితామయః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : విశుద్ధ భక్తి వైశిష్ట్యం - విశుద్ధ భావావేశంతో కూడిన భక్తి తీవ్రతరం అయిన కొలదీ సంసిద్ధికి కావలసిన శక్తి సంపద నీలో పెరుగుతుంది. విశుద్ధభక్తి భావావేశం ద్వారానే నీలోని అంతరాత్మ మేల్కొనడం, దివ్య భూమికలలోనికి ప్రవేశమిచ్చే అంతః కవాటములు నీలో తెరుచుకోడం జరుగుతాయి. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: కృష్ణ అష్టమి 12:07:08 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: పూర్వాభద్రపద 14:33:57
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: ప్రీతి 10:10:18 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: కౌలవ 12:09:08 వరకు
వర్జ్యం: 23:51:12 - 25:24:24
దుర్ముహూర్తం: 17:05:00 - 17:57:36
రాహు కాలం: 17:11:34 - 18:50:13
గుళిక కాలం: 15:32:56 - 17:11:34
యమ గండం: 12:15:39 - 13:54:17
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41
అమృత కాలం: 06:54:40 - 08:26:08
సూర్యోదయం: 05:41:06
సూర్యాస్తమయం: 18:50:13
చంద్రోదయం: 00:37:16
చంద్రాస్తమయం: 12:44:39
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: చర యోగం - దుర్వార్త శ్రవణం
14:33:57 వరకు తదుపరి స్థిర యోగం -
శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 383 / Bhagavad-Gita - 383 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 11 🌴*

*11. తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమ: |*
*నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||*

🌷. తాత్పర్యం :
*నేను వారి యెడ ప్రత్యేకకరుణను చూపుట కొరకు వారి హృదయము నందు వసించుచు, తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింప జేయుదును.*

🌷. భాష్యము :
*భక్తియోగము నందు శ్రద్దాళువైనచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని అంతర్యము నుండి సహాయమును కూర్చగలడు. అనగా శ్రద్ధతో కృష్ణభక్తిభావన యందు నిలిచిన భక్తుడు ఎన్నడును జ్ఞానరహితుడు కాబోడు. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో సేవ నొనర్చుట ఒక్కటే దానికి కావలసిన యోగ్యత. ఆత్మానాత్మ విచక్షణ లేకుండా ఎవ్వరును శుద్ధజ్ఞానమును పొందలేరని ఆధునిక తత్త్వవేత్తలు భావింతురు. అట్టివారికి శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున చక్కని సమాధానమొసగినాడు.*

*అనగా శుద్ధభక్తియోగమున నియుక్తులైనవారు తగినంత విద్య లేనప్పటికి మరియు వేదనియమములను గూర్చిన తగిన జ్ఞానమును కలిగియుండనప్పటికిని ఈ శ్లోకమున తెలుపబడినట్లు తప్పక భగవానునిచే సహాయమును పొందగలరు. పరతత్త్వమైన తనను కేవలము మానసికకల్పనల ద్వారా అవగాహన చేసికొనుట సాధ్యముకాని విషయమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బోధించెను. పరతత్త్వమైన భగవానుడు అత్యంత ఘనుడైనవాడగుచో మనోకల్పనల ద్వారా అతనిని అవగాహనము చేసికొనుట లేదా పొందగలుగుట సాధ్యము కాదు. కనుకనే గీతాధ్యయనము ద్వారా మనుజుడు శ్రీకృష్ణభగవానునకు సంపూర్ణశరణాగతుడై అతని శుద్ధభక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. పిదప భగవానుడే రక్షణభారమును స్వీకరించినపుడు అతడు సర్వవిధములైన భౌతికయత్నముల నుండి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 383 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 11 🌴*

*11. teṣām evānukampārtham aham ajñāna-jaṁ tamaḥ*
*nāśayāmy ātma-bhāva-stho jñāna-dīpena bhāsvatā*

🌷 Translation : 
*To show them special mercy, I, dwelling in their hearts, destroy with the shining lamp of knowledge the darkness born of ignorance.*

🌹 Purport :
*The sincere devotee engaged in Kṛṣṇa consciousness cannot be without knowledge. The only qualification is that one carry out devotional service in full Kṛṣṇa consciousness. The Māyāvādī philosophers think that without discriminating one cannot have pure knowledge. For them this answer is given by the Supreme Lord: those who are engaged in pure devotional service, even though they be without sufficient education and even without sufficient knowledge of the Vedic principles, are still helped by the Supreme God, as stated in this verse. The Lord tells Arjuna that basically there is no possibility of understanding the Supreme Truth, the Absolute Truth, the Supreme Personality of Godhead, simply by speculating, for the Supreme Truth is so great that it is not possible to understand Him or to achieve Him simply by making a mental effort.*

*The pure devotee does not have to worry about the material necessities of life; he need not be anxious, because when he removes the darkness from his heart, everything is provided automatically by the Supreme Lord, who is pleased by the loving devotional service of the devotee. This is the essence of the teachings of Bhagavad-gītā. By studying Bhagavad-gītā, one can become a soul completely surrendered to the Supreme Lord and engage himself in pure devotional service. As the Lord takes charge, one becomes completely free from all kinds of materialistic endeavors.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 230 / Agni Maha Purana - 230 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 68*

*🌻. ఉత్సవ విధి కథనము -2 🌻*

*పిమ్మట విద్వాంసులై వైష్ణవులతో కలిసి మూలమంత్రముతో ప్రతిమ అవయవములకు నెయ్యి పూసి, రాత్రి అంతయు నేతిధారతో అభిషేకము చేయవలెను. దేవతకు అద్దము చూపించి, ఆరతి, గీతము, వాద్యములు మొదలగు వాటితో మంగళకృత్యములు నెరపి, వ్యజనము విసిరి, పూజించవలెను. పిదప దీప-గంధ-పుష్పాదులతో పూజించవలెను. పసుపు, కర్పూరము, కేసరములు, శ్వేతచందన చూర్ణము దేవతా ప్రతిమపైనను, భక్తుల శిరస్సులపైనను చల్లినచో సమస్త తీర్థముల ఫలము లభించును. ఆచార్యుడు యాత్రకొరకై ఏర్పరచిన దేవతామూర్తిని రథముపై ఉంచి, పూజించి, ఛత్ర-చారమ- శంఖనాదాదులతో రాష్ట్రమును పాలించునది తటమునకు తీసికొని వెళ్ళవలెను.*

*నదిలో స్నానము చేయించుటకు ముందు అచట వేదికను నిర్మించి, ఆ మూర్తిని వాహనమునండి దింపి, దానిని ఆ వేదికపై ఉంచవలెను. అచట చరువు వండి దానిని హోమము చేసిన పిదప పాయసహోమము చేయవలెను. వరుణ దేవతా మంత్రముతో సమస్తతీర్థముల అవాహనము చేసి ''అపోహిష్ఠామ'' ఇత్యాదిమంత్రములతో వాటికి అర్ఘ్యప్రదానము చేసి పూజించవలెను. దేవతామూర్తిని తీసికొని వెళ్ళి ఉదకమునందు ఆఘమర్షణ చేసి బ్రాహ్మణ - మహాజనులకు స్నానము చేయవలెను. స్నానానంతరము మూర్తిని తీసికొని వచ్చి వేదికపై ఉంచవలెను. ఆ దివసమునందు అచట దేవతాపూజ చేసి, దేవాలయామునకు తీసికొని వెళ్ళవలెను., ఆచార్యుడు అగ్నిలో నున్న దేవతకు పూజలు చేయవలెను. ఈ ఉత్సవము భోగ - మోక్షప్రదము.*

*అగ్ని మహాపురాణమునందు ఉత్సవవధి కధనమను ఆరువది ఎనిమిదవఅధ్యాయము సమాప్తము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 230 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 68*
*🌻Mode of taking out a procession and celebration of festivals -2🌻*

12. Having shown the mirror, there should be the waving of light, auspicious singing and instrumental music, fanning, worship, and present of light. The deity should be worshipped with incense and flowers.

13. Turmeric, green-gram, saffron and white powders should be put on the head of image. But when ghee (is placed over the head) it gets the merit of all sacred places for the devotees.

14. Having bathed and worshipped the image that is placed in the car for being taken around, the officers of the king should take it to the river-side accompanied by music, umbrella and. other things.

15. A platform should be got ready at a distance of a yojana (eight or nine miles) before the river. The image should be brought down from the car and placed on the platform.

16. Gruel should be prepared and sweet gruel should be offered as oblation. The sacred waters (of the sacred spots) should be invoked for their presence with (the recitation of) vedic mantras symbolising the waters.

17. The image should again be worshipped with the principal oblations uttering the mantra āpo hi ṣṭhā[1]. The image should again be carried to the waters and the aghamarṣaṇa[2] hymn repeated.

18. (The priest) should bathe with the assembly of brahmins and then the image should be lifted and placed on the platform. Having worshipped it there that day it should then be taken to the temple. The priest should worship it as in the fire which gets him enjoyment and liberation.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 95 / DAILY WISDOM - 95 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 4. సహకారమే జీవితం యొక్క చట్టం 🌻*

*చాలా మంది తమను తాము వ్యక్తిగతంగా ‘ధృవీకరించుకోడం ' ద్వారా విజయం సాధించవచ్చనే తప్పుడు భావన వల్ల దుఃఖానికి గురవుతారు. నిజం అందుకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి తప్పుడు భావన ఎందుకు వస్తుందంటే మనలాగే వ్యక్తిగతంగా ధృవీకరంచుకోగల, ఇతరుల వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించే అనేక మంది మన చుట్టూనే ఉన్నారనే విషయాన్ని మరచిపోవడం వల్ల. ప్రపంచంలోని తాను కాక 'ఇతరులను' తన అహంతో ఎదిరించిన ఎవరూ జీవితంలో విజయం సాధించలేదు. ప్రతి అహంభావం బయటి నుండి సమానమైన బలమైన అహంభావంతో ఢీ కొంటుంది.*

*ఒక చర్యలో, వాదనలో లేదా భావనలో ఎల్లప్పుడూ ఒకరిదైన స్వంత దృక్కోణాన్ని తీసుకోవడం వల్ల 'ప్రతిపక్షాన్ని' ఆకర్షిస్తాము. కానీ జీవితానికి కావల్సింది పరస్పర సహకారం కానీ అహంకారం కాదు. అందుకని అహంభావం చివరికి ప్రకృతిలో తప్పక ఓడిపోతుంది. ఎందుకంటే అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. మనస్సులో, మాటలో లేదా శరీరంలో అన్ని అహంకార చర్యలు ప్రపంచంలోని ఇతర శక్తి కేంద్రాల నుండి అదే విధమైన చర్యను ప్రేరేపిస్తాయి. అలాంటి స్థితిలో జీవించడాన్నే సంసారం అని పిలుస్తారు. నిరంతరం పరస్పరం పోరాడుతున్న అంశాలు ఒకదానికొకటి ప్రతిస్పందించే అనుభవాన్ని కలిగి ఉండి, నిరంతరం బాధని, చాంచలత్వాన్ని తీసుకొస్తాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 95 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 4.The Law of Life is Cooperation 🌻*

*Most people come to grief due to the wrong notion that they can succeed by ‘asserting’ themselves. The truth is just the opposite. The false idea that self-assertion can bring success is based on the ignorance of the fact that there are also others in this world who can equally assert themselves and stand against the assertion from any particular individual or centre of action. No one has ever succeeded in life, who confronted the ‘others’ in the world with his ego. All egoism is met with an equally strong egoism from outside.*

*To take always one’s own standpoint, whether in an action, an argument or even in feeling, is to court ‘opposition’, while the law of life is ‘cooperation’. Self-assertion, thus, is contrary to nature’s laws and shall stand defeated in the end. All egoistic action, whether in mind, speech or body, evokes a similar action from other centres of force in the world and to live in such a condition is fitly called samsara, and experience in which perpetually warring elements react against one another and bring about restlessness and pain.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 360 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. అస్తిత్వం నిన్ను ప్రేమిస్తుంది. అది నీ పట్ల జాగ్రత్త తీసుకుంటుంది. అది నీకు శాపంలా కనిపించవచ్చు. కానీ అదెప్పుడూ వరమే. మన సంకుచితత్వం వల్ల అలా అనిపించవచ్చు. మరణం ఒక విశ్రాంతి. అంతం కాదు. గొప్ప జీవితానికి ఆరంభం.🍀*

*చాడీలు చెప్నే మనసు ఎప్పటికీ మత సంబంధమయిన మనసు కాలేదు. అసాధ్యం. కారణం అది ప్రాథమికమయిన యథార్థం పట్ల స్పృహతో వుండదు. అస్తిత్వం నిన్ను ప్రేమిస్తుంది. అది నీ పట్ల జాగ్రత్త తీసుకుంటుంది. అందువల్ల సూర్యచంద్రులు, గాలి, వర్షం నీతో స్నేహంగా వుంటాయి. ఏది ఏమైనా అది నీ పట్ల జాగ్రత తీసుకుంటుంది. అది నీకు శాపంలా కనిపించవచ్చు. అదెప్పుడూ వరమే. మన సంకుచితత్వం వల్ల అలా అనిపించవచ్చు. దాని వల్ల మనం సమగ్రంగా చూడలేం. దాని చర్యల్ని గుర్తించలేం. అట్లా చూడగలిగిన పక్షంలో మనం కృతజ్ఞతతో వుంటాం.*

*మరణించే సందర్భంలోనయినా అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కృతజ్ఞతతో వుంటాడు. కారణం మరణం ఒక విశ్రాంతి. అంతం కాదు. గొప్ప జీవితానికి ఆరంభం. నిజమైన జీవితానికి మన జీవితం రీహార్సల్ లాంటిది. నిజమైన నాటకం మరణానంతరం మొదలవుతుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. అర్థం చేసుకోని వాళ్ళు రీహార్సలే. నిజమైన నాటకమనుకుంటారు. ఆ రీహార్సల్ ముగిశాక వాళ్ళు అరుస్తారు. ఏడుస్తారు. దాన్ని పట్టుకు వేళ్ళాడుతారు. వదిలిపెట్టడానికి యిష్టపడరు. ప్రతి ఈ ఆశీర్వాదమే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 097 / Siva Sutras - 097 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-06. గురు రూపాయః - 4 🌻*
*🌴. మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను అధిగమించడానికి, మాతృకలలో నివసించే మంత్ర శక్తులను మేల్కొల్పడానికి మరియు స్వయం యొక్క స్వచ్ఛమైన ఎరుకను పొందడానికి గురువు సాధనం. 🌴*

*శక్తి, శివుని యొక్క స్వతంత్ర శక్తి, అది ఒక గురువు రూపంలో వ్యక్తమైనప్పుడు, ఆ గురువుకు దైవీకృప ఉందని సూచించ బడుతుంది. మరొక దృక్కోణంలో, ఆ శక్తి ద్వారా మాత్రమే, శివుడిని గ్రహించగలడు మరియు ఆమె శివుని సాక్షాత్కారానికి అవసరమైన జ్ఞాన స్వరూపిణి. ఈ సూత్రం నిజమైన ఆధ్యాత్మిక పురోగతికి సరైన గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎటువంటి తార్కికం లేకుండానే ఆనంద స్థాయి, ఆనందం స్థాయిని బట్టి ఆధ్యాత్మిక పురోగతిని స్వయంగా నిర్ధారించు కోవచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 097 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-06. guru rupāyah   - 4 🌻*
*🌴. The guru is the means to overcome the impurities of the mind and body, awaken the mantra shaktis who reside in the matrkas and attain the pure consciousness of the self.   🌴*

*When Śaktī, the independent energy of Śiva, manifests in the form of a guru, it is implied that the said guru has divine grace. From another perspective, it is only through Śaktī, Śiva can be realised and She is the embodiment of all the necessary wisdom to realise Śiva. This aphorism highlights the importance of a right guru for true spiritual progression. Spiritual progression can be self ascertained by the level of bliss, the level of happiness without any reasoning.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 459. ‘నళినీ’ - 3 🌻


పరబ్రహ్మమునకు, సగుణ బ్రహ్మమునకు నడుమ నిర్గుణ బ్రహ్మమున్నదని పెద్దలు పలుకుదురు. ఇందు పదు నాలుగు స్థితులున్నట్లుగ పరమ గురువు మాస్టర్ సి.వి.వి. వివరించినారు. తల్లి నుండి బిడ్డకు యేర్పడు సంబంధమిది. అన్నింటినీ అనుసంధాన మొనర్చు తత్త్వము. ఇట్టి సృష్టి నాళము శ్రీమాత గనుక నళినీ అని పిలుతురు. నల మహారాజుచే ఆరాధింపబడిన దేవి అగుటచే శ్రీమాతను నళిని అనుట కూడ కద్దు. నలుడు యుధిష్ఠిరుని వలె ధర్మమూర్తి. అతడు శ్రీమాత భక్తుడు. శ్రీమాత ఆరాధనమున నిలచి కష్టనష్టములను ఓర్పుతో భరించి, కృతకృత్యుడై శాశ్వతమగు యశోకీర్తులను పొందెను. శాశ్వత దివ్యమూర్తియై నిలచెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 459. 'Nalini' - 3 🌻

Elders say that between Parabrahman ( The absolute) and Saguna Brahma ( The creation with Gunas) is Nirguna Brahma( The creation beyond Gunas). There are fourteen such states as Param Guru Master C.V.V. Explained. It is a relationship between a mother and child. A philosophy that connects everything. Such vessel of creation is Srimata. Hence she is called Nalini. The goddess worshiped by Nala Maharaja is also known as Nalini. Nala is a righteous like Yudhisthira. He is a devotee of Sri Mata. He stood in the worship of Sri Mata and bore the hardships with patience and got eternal glory as a result. He stood as the Eternally glorious.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 362. REMAIN ADVENTUROUS / ఓషో రోజువారీ ధ్యానాలు - 362. సాహసోపేతంగా ఉండండి




🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 362 / Osho Daily Meditations - 362 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 362. సాహసోపేతంగా ఉండండి 🍀

🕉. ఎల్లప్పుడూ సాహసోపేతంగా ఉండండి. జీవితం అన్వేషకులుగా ఉన్నవారికి చెందినదని ఒక్క క్షణం కూడా మర్చిపోకండి. ఇది స్థిరత్వానికి చెందినది కాదు; అది ప్రవహించేది. ఎప్పుడూ సరస్సుగా మారవద్దు; ఎప్పుడూ నదిగానే వుండండి. 🕉

మనస్సు కొత్తదనాన్ని తట్టుకోలేదు. అది ఏమిటో గుర్తించలేము, దానిని వర్గీకరించలేము, దానిపై లేబుల్స్ పెట్టలేము; అది కొత్తది అబ్బురపరుస్తుంది. ఏదైనా కొత్త విషయం ఎదురైనప్పుడు మనస్సు తన సమర్ధతను కోల్పోతుంది. గతంతో, పాతవాటితో, సుపరిచితమైన వాటితో, మనసు చాలా తేలికగా ఉంటుంది, ఎందుకంటే అది ఏమిటో, ఎలా చేయాలో, ఏమి చేయాలో, ఏది చేయకూడదో దానికి తెలుసు. తెలిసిన వాటిలో ఇది పరిపూర్ణమైనది; అది బాగా తెలిసిన వాతావరణంలో మసలుతోంది. చీకటిలో కూడా అది కదలగలదు; పరిచయమున్న వాతావరణం మనస్సు భయపడకుండా ఉండటానికి సహాయపడుతుంది. కానీ అర్థం చేసుకోవలసిన సమస్యల్లో ఇది ఒకటి: మనస్సు ఎల్లప్పుడూ తెలిసిన వాటితో మాత్రమే భయపడదు, అది మిమ్మల్ని ఎదగనివ్వదు.

ఎదుగుదల కొత్తదానితో ఉంటుంది మరియు మనస్సు పాత వాటికి మాత్రమే భయపడదు. కాబట్టి మనసు పాతవాటిని అంటిపెట్టుకుని కొత్తవాటికి దూరంగా ఉంది. పాతది జీవితానికి పర్యాయపదంగా కనిపిస్తుంది, మరియు కొత్తది మరణానికి పర్యాయపదంగా కనిపిస్తుంది; అది విషయాలను చూసే మనస్సు యొక్క మార్గం. మనసును పక్కన పెట్టాలి. జీవితం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రతిదీ మారుతోంది: ఈ రోజు అది ఉంది, రేపు అది ఉండకపోవచ్చు. మీరు దాన్ని మళ్లీ చూడవచ్చు; ఎప్పుడన్నది ఎవరికి తెలుసు? దీనికి నెలలు, సంవత్సరాలు లేదా జీవితాలు పట్టవచ్చు. కాబట్టి అవకాశం తలుపు తట్టినప్పుడు, దానితో వెళ్లండి. ఇది ప్రాథమిక చట్టంగా ఉండనివ్వండి: ఎల్లప్పుడూ పాతదాని కంటే కొత్తదాన్ని ఎంచుకోండి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 362 🌹

📚. Prasad Bharadwaj

🍀 362. REMAIN ADVENTUROUS 🍀

🕉. Always remain adventurous. Never forget for a single moment that l!fe belongs to those who are explorers. It does not belong to the static; it belongs to the flowing. Never become a reservoir; always remain a river. 🕉


The mind cannot cope with the new. It cannot figure out what it is, it cannot categorize it, it cannot put labels on it; it is puzzled by the new. The mind loses all its efficiency when it confronts something new. With the past, with the old, with the familiar, the mind is very at ease, because it knows what it is, how to do, what to do, what not to do. It is perfect in the known; it is moving in well-traveled territory. Even in darkness it can move; the familiarity helps the mind to be unafraid. But this is one of the problems to be understood: Because the mind is always unafraid only with the familiar, it does not allow you growth.

Growth is with the new, and the mind is only unafraid of the old. So the mind clings to the old and avoids the new. The old seems to be synonymous with life, and the new seems to be synonymous with death; that is the mind's way of looking at things. You have to put the mind aside. Life never remains static. Everything is changing: Today it is there, tomorrow it may not be. You may come across it again; who knows when? Maybe it will take months, years, or lives. So when an opportunity knocks at the door, go with it. Let this be a fundamental law: Always choose the new over the old.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ శివ మహా పురాణము - 743 / Sri Siva Maha Purana - 743

🌹 . శ్రీ శివ మహా పురాణము - 743 / Sri Siva Maha Purana - 743 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 13 🌴

🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 2 🌻


ఇంద్రుడిట్లు పలికెను -

ఓయీ! నీవెవరిని? ఎచటనుండి వచ్చితివి? నీ పేరేమి? సత్యమును పలుకుము. శంబుడు తన ధామునందే ఉన్నాడా? లేక ఆ ప్రభుడు ఎచటి కైననూ వెళ్లియున్నాడా? (10)


సనత్కుమారుడిట్లు పలికెను -

ఇంద్రుడిట్లు ప్రశ్నించగా ఆ తాపసుడు ఏమియూ పలుకలేదు. ఇంద్రుడు మరల ప్రశ్నించగా ఆ తాపసుడు సమాధానము నీయలేదు (11). లోకములకు ప్రభువగు ఇంద్రుడు మరల ప్రశ్నించెను. మహాయోగి, లీలచే వివిధరూపములను దరించువాడు అగు ఆ ప్రభుడు మిన్నకుండెను (12). ఈ విధముగా ఇంద్రుడు అనేక పర్యాయములు ప్రశ్నించెను. కాని దిగంబరుడగు ఆ భగవానుడు ఇంద్రుని జ్ఞానమును పరీక్షింప గోరి, ఏమియు పలుకలేదు (13). ముల్లోకముల ఐశ్వర్యముచే గర్వించియున్న దేవేంద్రుడు అపుడు కోపించి, ఆ జటాధారిని గద్దించి ఇట్లు పలికెను (14).


ఇంద్రుడిట్లు పలికెను -

ఓరీ! నేను ప్రశ్నించు చున్ననూ నీవు ఉత్తరము నీయకున్నావు. కావున నిన్ను వజ్ర ముతో సంహరించెదను. ఓరీ దుర్బుద్ధీ! నిన్ను కాపాడు వారెవరు గలరు? (15)


సనత్కుమారుడిట్లు పలికెను -

వజ్రధారియగు ఇంద్రుడు ఇట్లు పలికి, ఆ దిగంబరుని కోపముతో చూచి ఆతనిని సంహరించుటకు వజ్రమును పైకి ఎత్తెను (16). ఇంద్రుడు వజ్రమును ఎత్తుటను గాంచి, సదా మంగళస్వరూపుడగు శంకరదేవుడు ఆ వజ్రపు దెబ్బను స్తంభింపజేసెను. (17). అపుడు రుద్రుడు క్రోధావేశమును పొంది, భయంకరమగు కన్నులు గలవాడై తేజస్సుతో దహించి వేయునా యన్నట్లు మండిపడెను (18).



సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 743🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 13 🌴

🌻 Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 2 🌻



Indra said:—

10. O, who are you? Where have you come from? What is your name? Tell me truly. Is the lord Śiva in his apartment or has he gone anywhere?


Sanatkumāra said:—

11. O sage, on being asked by Indra thus, he did not say anything. Indra asked him again. But the naked person did not say anything.

12. Indra, the supreme lord of the worlds, asked again. The lord the great Yogin who assumes forms variously kept quiet.

13. The naked lord, though asked repeatedly by Indra, did not say anything, for he wanted to test the knowledge of Indra.

14. Then the lord of Gods, proud of the wealth of the three worlds, became enraged. Rebuking the lord with matted hair he spoke these words.


Indra said:—

15. “O evil-minded one, though asked you did not reply to me. Hence I am going to kill you with my thunderbolt. Who can save you?”


Sanatkumāra said:—

16. After saying this and looking at him ferociously Indra raised his thunderbolt in order to kill him.

17. On seeing Indra lifting up his thunderbolt, Śiva prevented the fall of the thunderbolt by making his hand benumbed.

18. Then Śiva became furious. His eyes became terrible. He blazed with his burning splendour.



Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 782 / Vishnu Sahasranama Contemplation - 782


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 782 / Vishnu Sahasranama Contemplation - 782🌹

🌻782. శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ🌻

ఓం శుభాఙ్గాయ నమః | ॐ शुभाङ्गाय नमः | OM Śubhāṅgāya namaḥ

ధ్యేయత్వాచ్ఛోభనై రఙ్గైః శుభాఙ్గః ఇతి కథ్యతే

శోభనములగు అందమైన అంగములతో కూడిన సుందర రూపుడిగా భక్తుల సుద్ధాంతఃకరణములతో ధ్యానము చేయబడ దగిన వాడు కనుక శుభాంగః.

దుంధుభి ధ్వనివలె గంభీరమైన కంఠ స్వరము కలవాడు. నిగనిగలాడు శరీర ఛాయ కలవాడు. ప్రతాపశాలి, ఎక్కువ తక్కువలు లేకుండ పరిపుష్టములైన చక్కని అంగములు కలవాడు. మేఘ శ్యామ వర్ణ శోభితుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 782🌹

🌻782. Śubhāṅgaḥ🌻

OM Śubhāṅgāya namaḥ

ध्येयत्वाच्छोभनै रङ्गैः शुभाङ्गः इति कथ्यते /


Dhyeyatvācchobhanai raṅgaiḥ śubhāṅgaḥ iti kathyate

As He has to be meditated by devotees as having beautiful well formed limbs, He is called Śubhāṅgaḥ.

He has a voice like the sound of a kettle-drum. He has a shining skin. He is full of splendor. He is square-built. His limbs are built symmetrically. He is endowed with a dark-brown complexion.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr‌takarmā kr‌tāgamaḥ ॥ 84 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 190 / Kapila Gita - 190


🌹. కపిల గీత - 190 / Kapila Gita - 190 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 44 🌴

44. తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికామ్|
దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణావతిష్ఠతే॥

తాత్పర్యము : కావున, భగద్భక్తుడు జీవుల స్వరూపములలో దాగియున్న కార్యకారణరూపముగా పరిణమించెడు భగవంతుని అచింత్యమగు మాయాశక్తిని భగవదనుగ్రహముచే జయించి, తన వాస్తవస్వరూపము అగు పరబ్రహ్మమునందు ప్రతిష్ఠితుడై యుండును.

వ్యాఖ్య : వంకర కట్టెలో గానీ, పొడుగు కట్టెలో గానీ ఒకే నిప్పు చాలారకాలుగా కంపిస్తుంది. అలాగే ఆత్మ కూడా చాలా రకాలుగా కనపడుతుంది. ఈ ప్రకృతి దైవీం (దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా- గీత). ఇది కార్య కారణ రూపములో ఉంటుంది. ఇది మన ఊహకు అందదు. అలాంటి ప్రకృతిని విడిచిపెట్టిన వాడే స్వస్వరూపముతో ఉండగలడు. ప్రకృతిని వదిలిపెట్టాకే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలడు. ప్రకృతి వదిలి పెట్టాలంటే కార్య కారణం గురించి అర్థం కావాలి. ప్రకృతి పురుషున్ని విడిచిపెట్టదు కదా అని దేవహూతి అడిగిన ప్రశ్నకు సమాధానముగా కపిలుడు చెప్పిన సమాధానం ఇది.

శ్రీమద్భాగవత మహాపురాణము నందలి తృతీయ స్కంధము నందు "భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు" అను ఇరువది ఎనిమిది అధ్యాయము సమాప్తము.

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 190 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 44 🌴

44. tasmād imāṁ svāṁ prakṛtiṁ daivīṁ sad-asad-ātmikām
durvibhāvyāṁ parābhāvya svarūpeṇāvatiṣṭhate


MEANING : Thus the yogī can be in the self-realized position after conquering the insurmountable spell of māyā, who presents herself as both the cause and effect of this material manifestation and is therefore very difficult to understand.

PURPORT : It is stated in Bhagavad-gītā that the spell of māyā, which covers the knowledge of the living entity, is insurmountable. However, one who surrenders unto Kṛṣṇa, the Supreme Personality of Godhead, can conquer this seemingly insurmountable spell of māyā. Here also it is stated that the daivī prakṛti, or the external energy of the Supreme Lord, is durvibhāvyā, very difficult to understand and very difficult to conquer. One must, however, conquer this insurmountable spell of māyā, and this is possible, by the grace of the Lord, when God reveals Himself to the surrendered soul. It is also stated here, svarūpeṇāvatiṣṭhate. Svarūpa means that one has to know that he is not the Supreme Soul, but rather, part and parcel of the Supreme Soul; that is self-realization. To think falsely that one is the Supreme Soul and that one is all-pervading is not svarūpa. This is not realization of his actual position. The real position is that one is part and parcel. It is recommended here that one remain in that position of actual self-realization. In Bhagavad-gītā this understanding is defined as Brahman realization. After Brahman realization, one can engage in the activities of Brahman. As long as one is not self-realized, he engages in activities based on false identification with the body. When one is situated in his real self, then the activities of Brahman realization begin.

With this, Chapter "Features of Bhakti Yoga and Practices" End.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




10 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 10, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, Kalashtami 🌻

🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 01 🍀

ఓం వేంకటేశో విరూపాక్షో విశ్వేశో విశ్వభావనః |
విశ్వసృడ్విశ్వ సంహర్తా విశ్వప్రాణో విరాడ్వపుః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : దర్శనం - ఆదేశం - దర్శనం, ఆదేశం అనేవి సాధనలో భగవంతునికి చాల దూరంలో ఉన్న స్థితిని సూచిస్తాయి. ప్రాణమనః కోశాలు దర్శనం ద్వారా భగవత్సంసర్గనూ, ఆదేశం ద్వారా భగవదాలంబననూ, పొందాలని ఆశించడం జరుగుతుంది. కాని, ఈ ప్రాణమనో భూమికలు సామాన్యంగా అపరి శుద్ధములైన కారణాన, పొరపాట్లు సంభవించడానికి వీలున్నది. ఈ భూమికలు రూపాంతరం చెందితే తప్ప, కర్మక్షేత్రంలో భగవత్సంయోగ రూపమైన పూర్ణ సత్యప్రాప్తి కలుగనేరదు. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: కృష్ణ సప్తమి 14:03:29 వరకు

తదుపరి కృష్ణ అష్టమి

నక్షత్రం: శతభిషం 15:40:08 వరకు

తదుపరి పూర్వాభద్రపద

యోగం: వషకుంభ 12:48:15

వరకు తదుపరి ప్రీతి

కరణం: బవ 14:05:29 వరకు

వర్జ్యం: 21:45:52 - 23:17:20

దుర్ముహూర్తం: 07:26:12 - 08:18:47

రాహు కాలం: 08:58:14 - 10:36:50

గుళిక కాలం: 05:41:01 - 07:19:37

యమ గండం: 13:54:04 - 15:32:40

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41

అమృత కాలం: 08:55:00 - 10:25:00

మరియు 30:54:40 - 32:26:08

సూర్యోదయం: 05:41:01

సూర్యాస్తమయం: 18:49:54

చంద్రోదయం: 00:37:16

చంద్రాస్తమయం: 11:47:50

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: ఆనంద యోగం - కార్య

సిధ్ధి 15:40:08 వరకు తదుపరి

కాలదండ యోగం - మృత్యు భయం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹