శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 459. ‘నళినీ’ - 3 🌻
పరబ్రహ్మమునకు, సగుణ బ్రహ్మమునకు నడుమ నిర్గుణ బ్రహ్మమున్నదని పెద్దలు పలుకుదురు. ఇందు పదు నాలుగు స్థితులున్నట్లుగ పరమ గురువు మాస్టర్ సి.వి.వి. వివరించినారు. తల్లి నుండి బిడ్డకు యేర్పడు సంబంధమిది. అన్నింటినీ అనుసంధాన మొనర్చు తత్త్వము. ఇట్టి సృష్టి నాళము శ్రీమాత గనుక నళినీ అని పిలుతురు. నల మహారాజుచే ఆరాధింపబడిన దేవి అగుటచే శ్రీమాతను నళిని అనుట కూడ కద్దు. నలుడు యుధిష్ఠిరుని వలె ధర్మమూర్తి. అతడు శ్రీమాత భక్తుడు. శ్రీమాత ఆరాధనమున నిలచి కష్టనష్టములను ఓర్పుతో భరించి, కృతకృత్యుడై శాశ్వతమగు యశోకీర్తులను పొందెను. శాశ్వత దివ్యమూర్తియై నిలచెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 459. 'Nalini' - 3 🌻
Elders say that between Parabrahman ( The absolute) and Saguna Brahma ( The creation with Gunas) is Nirguna Brahma( The creation beyond Gunas). There are fourteen such states as Param Guru Master C.V.V. Explained. It is a relationship between a mother and child. A philosophy that connects everything. Such vessel of creation is Srimata. Hence she is called Nalini. The goddess worshiped by Nala Maharaja is also known as Nalini. Nala is a righteous like Yudhisthira. He is a devotee of Sri Mata. He stood in the worship of Sri Mata and bore the hardships with patience and got eternal glory as a result. He stood as the Eternally glorious.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment