Showing posts with label Kumbh Mela. Show all posts
Showing posts with label Kumbh Mela. Show all posts

మూడు శతాబ్దాల తర్వాత కేరళలోని నీలా నదిపై జరిగే మహామఘ పండుగ – కేరళ కుంభమేళా The Kerala Kumbh Mela


🌹 మూడు శతాబ్దాల తర్వాత కేరళలో తొలిసారి మహామాఘ మహోత్సవం నీలా నది కేరళ కుంభమేళా 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 After three centuries, the Mahamagha festival is being celebrated for the first time in Kerala on the Nila River – the Kerala Kumbh Mela 🌹
Prasad Bharadwaj


కేరళలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత కుంభమేళా జరుగుతోంది. నీలా నది(Nila river) (భారతపుళ) తీరంలో కేరళ (Kerala) కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన' మహామాఘ మహోత్సవం' ప్రారంభమైంది.

మలప్పురం జిల్లా తిరునవయలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును లాంఛనంగా ప్రారంభించారు. మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో జరిగింది. ఈ ఉత్సవాన్ని 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పూర్తిస్థాయిలో నిర్వహించడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 1755లో ఈ కుంభమేళా జరిగినట్లు సమాచారం.

50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు

ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ కుంభమేళా ఉత్సవానికి కేరళ, తమిళనాడు , కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు దాదాపు 50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. వేడుకల్లో భాగంగా కాశీ పండితుల ఆధ్వర్యంలో రోజూ సాయంత్రం నీలానది హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ.. 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేరళ సంప్రదాయ విద్య కలరిపయట్టు, యోగతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ కుంభమేళాలో భాగమైన రథయాత్ర కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది తమిళనాడులోని ఉడుమల్‌పేట సమీపంలోని తిరుమూర్తి కొండ నుంచి సోమవారం ఉదయం రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం నిలిపివేసింది.

🌹 🌹 🌹 🌹 🌹


మహా కుంభ మేళాకు వెళ్లేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు Info For Those Visiting the Maha Kumbh Mela 2025


🌹 మహా కుంభ మేళాకు వెళ్లేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు Info For Those Visiting the Maha Kumbh Mela 2025 🌹

🍀 మహా కుంభ మేళా వివరాలు 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

https://www.youtube.com/watch?v=9nNuBWsxcoE


2025 మహా కుంభ మేళా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం. అంతేకాక ఈసారి వచ్చిన మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేక కుంభమేళా. ఈ కుంభమేళా గంగా, యమునా మరియు పురాణ సరస్వతి నదుల సంగమంలో (త్రివేణీ సంగమంలో) స్నానం చేసి పవిత్రతను పొందాలని కోరుకుంటున్న 400 మిలియన్ల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తోంది.




🌻 ముఖ్యమైన స్నాన తేదీలు (శాహి స్నానాలు): 🌻

- జనవరి 13: పౌష పూర్ణిమ స్నానం (పూర్ణ చంద్ర గ్రహణ స్నానం)

- జనవరి 14: మకర సంక్రాంతి స్నానం

- జనవరి 25: మౌనీ అమావాస్య స్నానం (అమావాస్య స్నానం)

- ఫిబ్రవరి 9: వసంత పంచమి స్నానం

- ఫిబ్రవరి 26: మహా శివరాత్రి స్నానం

సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.

ప్రసాద్‌ భరధ్వాజ.



Join Chaitanya Vijnaanam చైతన్య విజ్ఞానం Group

https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D



🌹🌹🌹🌹🌹

మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం (For those going to Maha Kumbh Mela)



మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం


1.తెలుగు వాళ్లు అందరు మహాకుంభ మేళా సందర్శనకి వెళ్లి వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్లండి ,బస్సు ద్వారా వెళ్తే 16 Km దూరం లో పోలీస్ లు ఆపేస్తారు, అక్కడ నుండి నడుచుకుంటూ మేళా కి వెళ్ళాలి.

2.కుంభం మేళా లకు వెళ్లినవారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళా ని సెక్టార్ లు గా, కాటున్ పాండ్స్ గా, ఘాట్స్ గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి, లేక పోతే అస్సలు ఏమి అర్ధం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో మీకు అర్ధం కాదు.

3.మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి

4.16-17కాటున్ పాండ్స్ ఉంటాయి. (నదికి మధ్యలో బ్రిడ్జి ల నిర్మించారు వాటినే కంటూన్ పాండ్స్ అంటారు )

4.ప్రయాగ రాజ్ ని మూడు గా విభజించారు A.జ్యూస్సి ,B.

హరిలాగంజ్ C.సంగం

5.నది కి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది దీనిలో సెక్టర్ (12 నుండి 21 వరకు ఉంటాయి.

6.హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపు నా ఉంటుంది దీనిలో సెక్టార్ (5,11,10,9,8,7,6,18,19)ఉంటాయి.

7.ముఖ్యం మైంది, సంగం దీనిలో ఇది మెయిల్ రోడ్ కి దగరలో ఉంటుంది దీనిలో సెక్టార్ 3,4,ఉంటాయి.

8.మిగతావి 22,23, చాలా దూరం లో ఉంటాయి.


🚩 వసతి సదుపాయాలు 🚩

9.సెక్టర్ 6 లో TTD వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి. కానీ అక్కడ stay చేయనివ్వరు, స్వామి వారికీ బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకొనివ్వరు.

10.మీరు అక్కడ హిందీ వాళ్లవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు వున్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు. (.ముఖ్యం గా సెక్టార్ 18లో స్టే చేయవాచ్చు నదికి 100 మీటర్లు లో ఉంటాయి.)

11.సెక్టర్ 19,18,20 ఈ సెక్టర్స్ లో నాగసాధువు లు, అఘోరాలు, వుంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండ మంటారు చక్కగా ఉండొచ్చు.


12.సెక్టార్ 1లో ప్రవైట్ సదుపాయాలు ఉంటాయి రోజు కి 200 రూపాయలు

13.అన్ని సెక్టార్ లో పెయిడ్ వసతులు కలవు రోజుకి 1000 -2000 తీసుకుంటారు( 4 మెంబర్స్ వరకు ఉండొచ్చు ).


🚩భోజనం సదుపాయాలు 🚩

14.మీకు అన్ని సెక్టార్ లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి (ఉత్తర భారతదేశం వంటకలు అన్ని అక్కడ ఫ్రీ గా తిన్నవచ్చు…


🚩హెల్ప్ లైన్ 🚩

16.మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీస్ లు మీమల్ని గైడ్ చేస్తారు.

17.మేళా లో అయితే పోలీస్ లు అడుగడుగునా మన కు ఎటువైపు వేళలో చాలా బాగా చెప్తారు.


🚩స్నానం ఎలా🚩🚩

18ఎవరైతే పుణ్యం స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్ లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా.

19.2-3days వుండే వాళ్లు మాత్రమే ఎదో ఒక సెక్టార్ నదికి దగ్గరో వుంటుంది అక్కడే ఉండడం మంచిది, లేకపోతే నదికి, సెక్టార్ కి దూరమైత్ తప్పిపోయే అవకాశం కలదు

🚩నాగసాధువులు, అఘోరాలు, అఖడా లను చూడాలి, వాళ్ళు ఆశీర్వదాలు తీసుకో వలనంటే సెక్టార్ 19,18,20 లో వుంటారు.

🚩చివరిగా నా మాట ప్రతి ఒకరు తప్పక చెయ్య వలిసిన పవిత్ర అమృత స్నానం

🚩ఫ్యామిలీ తో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకుని వెళండి, లేకపోతే చాలా ఇబ్బంది పాడుతారు.

🚩ఒంటరి గా కంటే నలుగురు గా వెళ్తే చాలా మంచిది.

🚩ఎన్నికోట్లమంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగం రాజ్.