1) 🌹 12, FEBRUARY 2023 SUNDAY, ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 325 / Bhagavad-Gita -325 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 15 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 172 / Agni Maha Purana - 172 🌹 🌻. లింగాది లక్షణములు - 2 / Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 037 / DAILY WISDOM - 037 🌹 🌻 6. మనం సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాము / 6. We are on a Long Journey 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 302 🌹
6) 🌹. శివ సూత్రములు - 39 / Siva Sutras - 39 🌹
🌻 13. ఇచ్ఛా శక్తి ఉమా కుమారి - 1 / 13. Icchā śaktir umā kumārī - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹12, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : యశోదా జయంతి, Yashoda Jayanti 🌻*
*🍀. సూర్య మండల స్త్రోత్రం - 8 🍀*
8. యన్మండలం సర్వజనైశ్చ పూజితం |
జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అంతస్సత్త యందే మనకు పరమాత్మ స్పర్శ లభిస్తుంది. అది మానసిక ప్రవృత్తుల ద్వారా పొంద వీలైనది కాదు. అంతరంగపు లోలోతులలో స్ఫురించెడి ఒకానొక దివ్యస్పర్శ, దివ్యదర్శనం, దివ్యగ్రహణమది. సరియైన కర్తవ్య స్ఫురణం, కర్తవ్య ప్రేరణం కూడా దాని నుండియే మనకు లభిసాయి. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ షష్టి 09:47:01 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: స్వాతి 26:28:36 వరకు
తదుపరి విశాఖ
యోగం: దండ 15:34:46 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: వణిజ 09:44:01 వరకు
వర్జ్యం: 07:27:58 - 09:07:06
దుర్ముహూర్తం: 16:44:05 - 17:30:14
రాహు కాలం: 16:49:51 - 18:16:22
గుళిక కాలం: 15:23:20 - 16:49:51
యమ గండం: 12:30:18 - 13:56:50
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 17:22:46 - 19:01:54
సూర్యోదయం: 06:44:14
సూర్యాస్తమయం: 18:16:22
చంద్రోదయం: 23:47:41
చంద్రాస్తమయం: 10:44:14
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 26:28:36 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 325 / Bhagavad-Gita - 325 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 15 🌴*
*15. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |*
*నాప్నువన్తి మహాత్మాన: సంసిద్ధిం పరమాం గతా: ||*
🌷. తాత్పర్యం :
*భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసినవారగుటచే దు:ఖాలయమైన ఈ అనిత్యజగమునకు ఎన్నడును తిరిగిరారు.*
🌷. భాష్యము :
ఈ అనిత్యమగు జన్మము, ముసలితనము, వ్యాధి, మరణములనెడి దుఃఖములచే నిండియున్నందున, పూర్ణత్వమును పొంది కృష్ణలోకమైన (దివ్యలోకము) గోలోకబృందావనమును పొందిన మహాత్ముడు తిరిగి ఈ లోకమునకు రాగోరడు.
అట్టి శ్రీకృష్ణధామము “అవ్యక్తము” , “అక్షరము”, “పరమగతి” యని వేదవాజ్మయము నందు వర్ణింపబడినది. అనగా అది మన భౌతికసృష్టికి అతీతమైనట్టిది మరియు అచింత్యమైనట్టిది. కాని అది పరమగతియై యుండి మహాత్ములకు మాత్రము గమ్యమై యున్నది. మహాత్ములైనవారు పూర్ణ భక్తుల నుండి ఉపదేశములను పొందుచుందురు.
ఆ విధముగా వారు కృష్ణభక్తిభావనలో భక్తియోగమునందు క్రమముగా వృద్ధినొందుచు భగవత్సేవలో నియుక్తులై స్వర్గాది ఉన్నతలోకములను గాని, చివరకు వైకుంఠలోకములను గాని కోరకుందురు.
వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాహచర్యమును తప్ప అన్యమును వాంచింపరు. వాస్తవమునకు అదియే జీవితపు సంపూర్ణత్వమై యున్నది. ఈ శ్లోకము ముఖ్యముగా శ్రీకృష్ణభగవానుని భక్తుల గూర్చియే ప్రస్తావించుచున్నది.
అట్టి కృష్ణభక్తిరసభావితులు అత్యున్నత జీవనపూర్ణత్వమును బడయగలరు. అనగా వారే మహామహితాత్ములై యున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 325 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 15 🌴*
*15 . mām upetya punar janma duḥkhālayam aśāśvatam*
*nāpnuvanti mahātmānaḥ saṁsiddhiṁ paramāṁ gatāḥ*
🌷 Translation :
*After attaining Me, the great souls, who are yogīs in devotion, never return to this temporary world, which is full of miseries, because they have attained the highest perfection.*
🌹 Purport :
Since this temporary material world is full of the miseries of birth, old age, disease and death, naturally he who achieves the highest perfection and attains the supreme planet, Kṛṣṇaloka, Goloka Vṛndāvana, does not wish to return.
The supreme planet is described in Vedic literature as avyakta and akṣara and paramā gati; in other words, that planet is beyond our material vision, and it is inexplicable, but it is the highest goal, the destination for the mahātmās (great souls).
The mahātmās receive transcendental messages from the realized devotees and thus gradually develop devotional service in Kṛṣṇa consciousness and become so absorbed in transcendental service that they no longer desire elevation to any of the material planets, nor do they even want to be transferred to any spiritual planet. They only want Kṛṣṇa and Kṛṣṇa’s association, and nothing else. That is the highest perfection of life.
This verse specifically mentions the personalist devotees of the Supreme Lord, Kṛṣṇa. These devotees in Kṛṣṇa consciousness achieve the highest perfection of life. In other words, they are the supreme souls.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 172 / Agni Maha Purana - 172 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 53*
*🌻. లింగాది లక్షణములు - 2 🌻*
పండితుడు పదునారు అంగుళముల లింగమునకు మధ్య బ్రహ్మరుద్ర భాగములకు సమీపమున నున్న సూత్రము తీసికొని దానిని ఆరు భాగములుగ విభజింపవలెను. వైయమన సూత్రముల సాహాయ్యముతో నిశ్చయింపబడిన ఈ పరిమాణమునకు 'అంతరము' అని పేరు. అన్నింటి కంటె ఉత్తరము నందున్న లింగమును ఎనిమిది యవల పెద్దదిగా ఉండునట్లు చేయవలెను. మిగిలిన లింగములను ఒక్కొక్క యవ తగ్గునట్లు చేయవలెను.
పైన చెప్పిన లింగము క్రింది ప్రదేశమును మూడు భాగములుగా విభజించి పై భాగము నొకదానిని విడచి వేయవలెను. మిగిలిన రెండు భాగములను ఎనిమిది భాగములుగ విభజించి పై మూడు భాగములను విడచి వేయవలెను. ఐదవ భాగముపై భాగము నుండి తిరుగుచున్న ఒక దీర్ఘరేఖ గీయవలెను. ఒక భాగమును విడచి, మధ్యయందు ఆ రెండు రేఖలను కలపవలెను. ఇది లింగముల సాధారణ లక్షణము. ఇపుడు పిండిక యొక్క సర్వసాధారణ లక్షణమును చెప్పెదను; వినుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 172 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 53*
*🌻Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 2 🌻*
9. The wiseman should divide the liṅga measuring 16 aṅgulas into 6 parts through the central line upto the Brahman and Rudra parts.
10. The spaces in between two such lines of division should measure eight yavas each in the first two cases, each latter measuring a yava less than the preceding one.
11. Having divided the lower part into three parts, one part should be left out. Having divided the (remaining) two parts into eight parts, the three upper ones (of these divisions) should be left aside.
12. Those (three sections) above the five divisions should be rotated and the markings lengthened. Having left out one part their union should be brought about.
13. These are the general characteristics of the liṅga described by me. I shall (now) describe the most general (characteristics) of the pedestals.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 37 / DAILY WISDOM - 37 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 6. మనం సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాము 🌻*
*ప్రపంచం మనుషులతో మాత్రమే నిర్మితమైనది కాదని మనకు తెలుసు. మన క్రింద మరియు పైన ఇతరులు ఉన్నారు. భూమి నుండి స్వర్గం వరకు విస్తరించి ఉన్న తాడుపై ఎక్కడో వేలాడుతూ మనం మధ్యలో ఉన్నాము. మనం సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న ఆస్తులకు శాశ్వత యజమానులుగా మనం ఈ ప్రపంచంలో స్థిరపడలేదు. మనం దేనికీ యజమానులం కాదు. నేను ముందు చెప్పినట్లు మనం ఒక ప్రవాహంలో ఉన్నాము. మనం ఒక శాశ్వత ప్రయాణంలో ఉన్నాము.*
*ఒక గొప్ప గురువు చెప్పినట్లుగా, మరుసటి క్షణం నదిలోని అదే నీటిలోకి మనం అడుగు పెట్టలేము. ఎందుకంటే మరుసటి క్షణం మనం అదే నదిలోని వేర్వేరు నీటిలోకి అడుగుపెడతాము. ఆ విధంగా, మరుసటి క్షణం కూడా మనం అదే జీవితాన్ని గడపడం లేదు. ప్రతి క్షణం మనం కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నాము. మన వ్యక్తిత్వం యొక్క కొనసాగింపు అని పిలవబడేది, ఇది మనం నిన్న ఉన్నాము, ఈ రోజు మనం అదే విధంగా ఉన్నాము మరియు రేపు మనం ఖచ్చితంగా అలాగే ఉంటాము అనే ఆశను కలిగిస్తుంది. ఈ అపోహ మనస్సు పని చేసే విధానాల్లో ఉన్న పరిమితుల కారణంగా వస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 37 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 6. We are on a Long Journey 🌻*
*We know that the world is not made up of human beings alone. There are others below us and above us. We are in the middle hanging somewhere on the rope that stretches from the Earth to the heavens. We are on a long journey. We are not stationed in this world as permanent proprietors of properties here. We are not owners of anything. We are in a moving flux, as I said. We are on a perpetual journey onward, and we cannot, as a great master said, step into the same water of the river the next moment.*
*Because the next moment we step into different water of the same river. Thus, too, the next moment we are not living the same life. Every moment we are in a new life into which we perpetually enter, and the so-called continuity of our personality which makes us feel that we were yesterday the same thing that we are today, and the hope that we shall be tomorrow exactly what we are today, is due to a limitation of the way in which the mind works, the way in which we get tied up to one set of connotations in this movement.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 302 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నువ్వు సూర్యాస్తమయాన్ని చూసినపుడు నువ్వు ఆనందిస్తావు. అది అందమైన సూర్యాస్తమయం నించీ వచ్చిందని భావిస్తావు. అది నిజం కాదు. అది నీలోని ధ్యాన స్థితిని స్పర్శించింది. దాన్ని 'ఏక కాలచర్య' అన్నారు. 🍀*
*నువ్వు సూర్యాస్తమయాన్ని చూసినపుడు నువ్వు ఆనందిస్తావు. అది అందమైన సూర్యాస్తమయం నించీ వచ్చిందని భావిస్తావు. అది నిజం కాదు. అది నీలోని ధ్యాన స్థితిని స్పర్శించింది. అదెంత సౌందర్య భరితంగా వుందంటే నీ ఆలోచన ఆగిపోయింది. ఆశ్చర్య స్థితికి చేరుకున్నావు. దాన్ని 'ఏక కాలచర్య' అన్నారు. అది అందరికీ జరుగుతుదని కాదు. లక్షల మంది సూర్యాస్తమయాన్ని చూసి నిశ్చలనంగా వున్నారు. కొంత మంది ముఖాలు వేళ్ళాడేసుకుంటారు.*
*అది వాళ్ళ మానసిక స్థితి మీద ఆధారపడి వుంటుంది. వాళ్ళ మూడ్ మీద ఆధారపడి వుంటుంది. ఆనందమన్నది అక్కడ అనివార్య ఫలితమనిపించదు. ఒకసారి నువ్విది అర్థం చేసుకుంటే ప్రతి ఆనంద క్షణం నువ్వు తక్షణం ధ్యానస్థితికి వెళ్ళవచ్చు. ఆదిలో ధ్యానాన్ని అట్లాగే కనిపెట్టారు. అది ఎప్పుడు ఒకే స్థితి. ఆలోచన వుండదు. మనసు ఆగిపోతుంది. హఠాత్తుగా అక్కడ ఆనందం మొలకెత్తుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 039 / Siva Sutras - 039 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 13. ఇచ్ఛా శక్తి ఉమా కుమారి - 1🌻*
*🌴. యోగి సంకల్పం శివుని శక్తి. దానిని ఉల్లాసభరితమైన ఉమ మరియు కుమారి అంటారు 🌴*
*శివునికి ఐదు ముఖాలు ఉన్నాయి, ఇవి ఐదు దైవిక అంశాలను సూచిస్తాయి. అవి ఈశాన, తత్పురుష, సద్యోజాత, వామదేవ మరియు అఘోర. ఈశానాలో, చిత్ శక్తి (చైతన్యం) ప్రధానమైనది; తత్పురుషలో, ఆనంద శక్తి; సద్యోజాతలో, ఇచ్ఛా శక్తి; వామదేవలో, జ్ఞాన శక్తి; మరియు అఘోరాలో, క్రియా శక్తి ప్రధానమైనది. ఈ సూత్రంలో ఇచ్ఛా శక్తి అంటే సంకల్ప శక్తి.*
*ఉమా అంటే తేజస్సు మరియు కుమారి అంటే ఒక కన్య. కానీ ఈ సూత్రంలో ఉపయోగించిన పదాలు వాటి స్థూల అర్థాలకు మించి అర్థం చేసుకోవాలి. ఈ సూత్రం యోగిని ఉద్దేశించి వివరించబడింది. ఇచ్ఛా అనేది యోగి యొక్క సంకల్ప శక్తి. ఒక యోగి ఎల్లప్పుడూ శివుడిని పొందేందుకు స్వాభావికమైన సంకల్ప శక్తిని కలిగి ఉంటాడు. శివుడు శక్తి సంపూర్ణుడు. యోగి క్రమంగా శివుని యొక్క అద్భుతమైన మరియు నిర్మలమైన శక్తి కేంద్రంలోకి ప్రవేశిస్తాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 039 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 13. Icchā śaktir umā kumārī - 1 🌻*
*🌴. Yogi's will is the energy of Lord Śiva. It is called Playful Umā and Kumāri 🌴*
*Shiva has five faces that represent five aspects of the divine. They are Īśāna, Tatpuruṣa, Sadyojāta, Vāmadeva and Aghora. In Īśāna, cit śaktī (consciousness) is predominant; in Tatpuruṣa, ānanda śaktī (bliss); in Sadyojāta, īcchā śaktī (will); in Vāmadeva, jñāna śaktī knowledge); and in Aghora, kriyā śaktī (activity) are predominant. In this aphorism īcchā śaktī means the will power.*
*Umā means brilliance and kumārī literally means a maiden. But the words used in this aphorism are to be understood beyond their gross meanings. This aphorism is interpreted from the stand point of a yogi. Icchā is the will power of a yogi. A yogi always has inherent will power to attain Shiva. Shiva is the energy Absolute. Yogi gradually enters into the brilliant and unstained energy centre of Shiva.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj