శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 432 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 432 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀
🌻 432. 'చందనద్రవ దిగ్ధాంగీ'- 1 🌻
మంచి గంధము యొక్క సారముచే అలంకరింప బడిన అంగములు గలది శ్రీమాత అని అర్థము. మంచి గంధము చల్లదన మిచ్చును. సువాసనలను కలిగించును. సత్సంకల్పములను కలిగింపచేయును. మాలిన్యములను నెట్టివేయును. శ్రీమాత సాన్నిధ్యము భక్తులకు లభించు సమయమున చల్లదనము, గంధపు వాసన ప్రాథమికముగ కలుగును. ఆమె అంగముల గంధపు సువాసన శ్రీమాత భక్తులకు నిత్య పుష్టి నియ్యగలదు. మలిన భావములను నెట్టివేయగలదు. సత్సంకల్పములను స్థిరపరచగలదు. పూజా సమయమున శ్రీమాతకు చేయు ఉపచారములలో గంధము మిక్కుట ముగ వాడుట అమ్మకు ప్రీతి కలిగించ గలదు. అంగములను గంధముతో అలంకరించుట పూజయందు ప్రధానమగు విధులలో నొకటి. ముందు తెలిపిన నామముల యందలి భావమే ఈ నామ మందు కూడ ప్రతిపాదింపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh
Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻
🌻 432. 'Chandandrava Digdhangi'- 1 🌻
Srimata means the one whose limbs are adorned with the essence of fine sandalwood. Good sandalwood is cooling. Creates fragrances. Creates good intentions. Dispels impurities. When the devotees get the closeness of Sri Mata, the smell of sandalwood and coolness will be felt first. The sandalwood fragrance of her limbs can eternally nourish the devotees of Sri Mata. Can push away impure feelings. Can establish good intentions. The use of sandalwood mixed in the services done to Sri Mata at the time of pooja can bring pleasure to Amma. Adorning the limbs with sandalwood is one of the main services of worship. The meaning of the names mentioned earlier is also proposed in this name.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment