శ్రీ లలితా సహస్ర నామములు - 157 / Sri Lalita Sahasranamavali - Meaning - 157
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 157 / Sri Lalita Sahasranamavali - Meaning - 157 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 157. ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహ రూపిణీ ।
భావజ్ఞా, భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ ॥ 157 ॥ 🍀
🍀 835. ముకుందా :
విష్ణు రూపిణీ
🍀 836. ముక్తినిలయా :
ముక్తికి స్థానమైనది
🍀 837. మూలవిగ్రహరూపిణీ :
అన్నింటికీ మూలమైనది
🍀 838. భావఙ్ఞా :
సర్వజీవుల మానసిక భావములను తెల్సినది
🍀 839. భవరోగఘ్నీ :
జన్మపరంపర అను రోగమును పోగొట్టునది
🍀 840. భవచక్ర ప్రవర్తినీ :
లోకచక్రమును నడిపించునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 157 🌹
📚. Prasad Bharadwaj
🌻 157. Mukunda muktinilaya mulavigraharupini
Bhavagyna bhavarogaghni bhavachakra pravartini ॥ 157 ॥ 🌻
🌻 835 ) Mukundaa -
She who gives redemption
🌻 836 ) Mukthi nilaya -
She who is the seat of redemption
🌻 837 ) Moola vigraha roopini -
She who is the basic statue
🌻 838 ) Bavagna -
She who understands wishes and thoughts
🌻 839 ) Bhava rokagni -
She who cures the sin of birth
🌻 840 ) Bhava Chakra Pravarthani -
She makes the wheel of birth rotate
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 Nov 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 109
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 109 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. కోరికలు - ధర్మస్వరూపము 🌻
ధర్మము మొదలగు వాని స్వరూపము కోరిన వానిని బట్టి మారుచుండును. కోరనివాని ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు. కోరిన వారి ధర్మమునకు ప్రభువులు కోరిన వారే. తుదకు మోక్షము కూడ నిట్లే. మోక్షమనగా ఉపాసకుడు ఏమనుకొనుచున్నాడో అదియే దక్కును గాని , సకల బంధ విమోచనము దక్కదు . మోక్షమునకు గూర్చి తనకు గల అభిప్రాయములు తనను బంధించును. అపుడు మోక్షమను పేర జీవుడు బద్ధుడగుచు దాని కొరకై యత్నించుచు చచ్చుచు, పుట్టుచుండును.
🌻. ఇదియే విష్ణుమాయ.
ఎదిరించి యుద్ధము చేయుచున్నను , భక్తితో కొలిచినను శ్రద్ధతో మనస్సు విష్ణుని యందుంచుట జరుగును. ఏ విధముగా జరిగినను వానిపై మనస్సు నిలుచుట చాలును. దానితో వారి భావములు కరగిపోయి మనస్సు మాత్రము నిలబడును. ఆ మనస్సు భగవంతుని ప్రతిబింబముగా పరిణమించును. అపుడు జీవుడుండక భగవంతుడే యుండును.
🌻. అదియే మోక్షస్థితి.
...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
25 Nov 2021
వివేక చూడామణి - 157 / Viveka Chudamani - 157
🌹. వివేక చూడామణి - 157 / Viveka Chudamani - 157🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -4 🍀
515. నేను ఏవిధమైన కర్మ చేయని, మార్పులేని, విభజనకు వీలులేని, ఆకారములేని, పూర్ణము, శాశ్వతము, దేని మీద ఆధారపడని రెండవది ఏదీలేని ఏకైక ఆత్మను నేనే.
516. విశ్వమంతా నేనే, అన్ని నేనే, నేనే అన్నింటిలో ప్రతిబింబించేది, నేనే రెండవది ఏదీలేని ఒకేఒక్కడిని. ఏవిధమైన చీలికలు లేని పూర్తి శాశ్వతమైన ఆత్మను, విభజించుటకు వీలులేని ఆత్మను నేను.
517. ఈ ప్రకాశవంతమైన స్వయం ప్రకాశముతో, దయా సముద్రుడును అయిన నీకు ఇవే నావందనములు. ఓ ఉన్నతమైన బోధకుడా నీకు ఇవే నా శతకోటి వందనములు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 157 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 32. I am the one who knows Brahman -4🌻
515. I am without activity, changeless, without parts, formless, absolute, eternal, without any other support, the One without a second.
516. I am the Universal, I am the All, I am transcendent, the One without a second. I am Absolute and Infinite Knowledge, I am Bliss and indivisible.
517. This splendour of the sovereignty of Self-effulgence I have received by virtue of the supreme majesty of thy grace. Salutations to thee, O glorious, noble-minded Teacher, salutations again and again !
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
25 Nov 2021
శ్రీ శివ మహా పురాణము - 480
🌹 . శ్రీ శివ మహా పురాణము - 480 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 36
🌻. సప్తర్షుల ఉపదేశము - 2 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఈ హిమవంతుడు ఇట్లు పలికి తన కుమార్తెను ప్రేమతో వీక్షించి ఆమెను ఆలంకరింపజేసి మహర్షియొక్క ఒడిలో కూర్చుండబెట్టెను (12). ఆ పర్వరాజు మరల ఆ ఋషులతో నిట్లనెను: ఈ భాగమును నేను శివునకు ఇచ్చు చున్నాను. ఇది నిశ్చితము (13).
ఋషులిట్లు పలికిరి-
ఓ పర్వతరాజా! యాచించువాడు శంకరుడు. దాత స్వయముగా నీవే. యాచింపబడునది పార్వతీదేవి. ఇంతకంటె శ్రేష్ఠమగు సన్నివేశము మరి యేమి గలదు? (14) ఓ హిమవంతుడా! నీ ప్రవర్తన నీ శిఖరముల వలె ఉన్నతమై యున్నది. పర్వతములన్నింటికి అధిపతివగు నీవు అందరికంటె శ్రేష్ఠుడవు. నీవు ధన్యుడవు (15).
బ్రహ్మ ఇట్లు పలికెను-
పవిత్ర హృదయముగల ఆ మహర్షులు ఇట్లు పలికి, 'శివునకు సుఖమును ఇమ్ము' అని పార్వతిని ఆశీర్వదించిరి (16). 'నీకు మంగళము కలుగు గాక! శుక్ల పక్ష చంద్రునివలె నీ గుణములు వృద్ధి పొందును గాక!' అని వారు పార్వతిని చేతితో స్పృశించి ఆశీర్వదించిరి (17). ఆ మహర్షులందు ఇట్లు పలికి హిమవంతునకు పుష్పములను, ఫలములను ఆనందముతో సమర్పించి విశ్వాసమును కలిగించిరి (18). గొప్ప శివభక్తురాలు, సాధ్వి, సుందరి అగు అరుంధతి ఆ సమయములో అచట మేనను తన గుణసంపదచే తన వశము చేసుకొనెను (19).
ఆమె మంగళములకు నిలయము ఉత్తమము అగు లోకాచారము ననుసరించి హిమవంతుని మీసములకు పసుపు కుంకుమల లేపమును చేసెను (20). తరువాత వారు నాల్గవ దినమున ఉత్తమ లగ్నమును నిర్ణయించి పరస్పరము సన్మానించుకొని శివుని సన్నిధికి వెళ్లిరి (21). వసిష్ఠాది ఋషులందరు కైలాసమునకు వెళ్లి శివునకు నమస్కరించి అనేక సూక్తులచే స్తుతించి పరమేశ్వరునితో నిట్లనిరి (22).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
25 Nov 2021
గీతోపనిషత్తు -281
🌹. గీతోపనిషత్తు -281 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 14-1
🍀 14-1. మహాత్ములు - మహాత్ముల లక్షణములు : 1. భగవంతుని ఈశ్వరత్వము తెలిసి యుండుట. 2. అన్నిటికి మూలము అతడేయని తెలిసియుండుట. 3. అన్యమేదియు లేదని నిశ్చయముగ తెలిసి యుండుట. 4. నిత్యమతని దర్శించు ప్రయత్నమున నుండుట. 5. దైవదర్శన ప్రయత్నమే దృఢమగు వ్రతముగ నుండుట. 6. అన్నిట, అంతట నిండియున్న దైవమునకు నామ రూపాది భేదములు లేక మనస్సున నమస్కరించు కొనుట. 7. అతని లీలావైభవములు దర్శించుచు నిత్యము కొనియాడు చుండుట. 8. నిత్యము దైవీతత్త్వముతో ప్రజ్జాపరముగ కూడి యుండుట. 9. భక్తి శ్రద్ధలతో ఆ తత్త్వమునకు అత్యంత సమీపమున వసించి యుండుట. 🍀
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14
తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.
వివరణము : ఈ శ్లోకమున వారు నిత్యము దైవ దర్శన యత్నముననే యుందురని (యతంతః), ఆ ప్రయత్నమే దృఢమగు వ్రతముగ ఏర్పరచుకొని యుందురని, (దృఢవ్రతః), సతతము అన్నిట, అంతట ఆ దైవీ తత్త్వమునే దర్శించుచు, కీర్తించుచు నుందురని (సతతం కీర్తయంత?), సమస్తము నందు దర్శింపబడుచున్న దైవమునకు మనస్సున నమస్కరించుచు నుందురని (నమస్యంతి), నిత్యము ఆ విధముగ దైవముతోనే కూడియుందురని (నిత్యయుక్తః), భక్తితో ఈశ్వరునకు అతి చేరువగ వసింతురని (భక్త్యా ఉపాసతే) తెలుప బడుచున్నది.
మహాత్ముల లక్షణములు 13, 14 శ్లోకములలో ఈ క్రింది విధముగ తెలుపబడినవి.
1. భగవంతుని ఈశ్వరత్వము తెలిసి యుండుట.
2. అన్నిటికి మూలము అతడేయని తెలిసియుండుట.
3. అన్యమేదియు లేదని నిశ్చయముగ తెలిసి యుండుట.
4. నిత్యమతని దర్శించు ప్రయత్నమున నుండుట.
5. దైవదర్శన ప్రయత్నమే దృఢమగు వ్రతముగ నుండుట.
6. అన్నిట, అంతట నిండియున్న దైవమునకు నామ రూపాది భేదములు లేక మనస్సున నమస్కరించు కొనుట.
7. అతని లీలావైభవములు దర్శించుచు నిత్యము కొనియాడు చుండుట.
8. నిత్యము దైవీతత్త్వముతో ప్రజ్జాపరముగ కూడి యుండుట.
9. భక్తి శ్రద్ధలతో ఆ తత్త్వమునకు అత్యంత సమీపమున వసించి యుండుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Nov 2021
Subscribe to:
Posts (Atom)