మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 109


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 109 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కోరికలు - ధర్మస్వరూపము 🌻

ధర్మము మొదలగు వాని స్వరూపము కోరిన వానిని బట్టి మారుచుండును. కోరనివాని ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు. కోరిన వారి ధర్మమునకు ప్రభువులు కోరిన వారే. తుదకు మోక్షము కూడ నిట్లే. మోక్షమనగా ఉపాసకుడు ఏమనుకొనుచున్నాడో అదియే దక్కును గాని , సకల బంధ విమోచనము దక్కదు‌ . మోక్షమునకు గూర్చి తనకు గల అభిప్రాయములు తనను బంధించును. అపుడు మోక్షమను పేర జీవుడు బద్ధుడగుచు దాని కొరకై యత్నించుచు చచ్చుచు, పుట్టుచుండును.

🌻. ఇదియే విష్ణుమాయ.

ఎదిరించి యుద్ధము చేయుచున్నను , భక్తితో కొలిచినను శ్రద్ధతో మనస్సు విష్ణుని యందుంచుట జరుగును. ఏ విధముగా జరిగినను వానిపై మనస్సు నిలుచుట చాలును. దానితో వారి భావములు కరగిపోయి మనస్సు మాత్రము నిలబడును. ఆ మనస్సు భగవంతుని ప్రతిబింబముగా పరిణమించును. అపుడు జీవుడుండక భగవంతుడే యుండును.

🌻. అదియే మోక్షస్థితి.


...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹



25 Nov 2021

No comments:

Post a Comment