శ్రీ లలితా సహస్ర నామములు - 129 / Sri Lalita Sahasranamavali - Meaning - 129

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 129 / Sri Lalita Sahasranamavali - Meaning - 129 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 129. అదృశ్యా, దృశ్యరహితా, విజ్ఞాత్రీ, వేద్యవర్జితా ।
యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా ॥ 129 ॥ 🍀

🍀 649. అదృశ్యా -
చూడబడనిది.
🍀 650. దృశ్యరహితా -
చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
🍀 651. విజ్ఞాత్రీ -
విజ్ఞానమును కలిగించునది.
🍀 652. వేద్యవర్జితా -
తెలుసుకొన బడవలసినది ఏమీ లేనిది.
🍀 653. యోగినీ -
యోగముతో కూడి ఉంది.
🍀 654. యోగదా -
యోగమును ఇచ్చునది.
🍀 655. యోగ్యా -
యోగ్యమైనది.
🍀 656. యోగానందా -
యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
🍀 657. యుగంధరా -
జంటను ధరించునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 129 🌹

📚. Prasad Bharadwaj
 
🌻 129. Adrushyadrushyarahita vigynatri vedyavarjita
Yogini yogada yogya yoganandayugandhara ॥ 129 ॥

🌻 649 ) Adurshya -
She who cannot be seen
🌻 650 ) Drusya rahitha -
She who does not see things differently
🌻 651 ) Vignathree -
She who knows all sciences
🌻 652 ) Vedhya varjitha -
She who does not have any need to know anything
🌻 653 ) Yogini -
She who is personification of Yoga
🌻 654 ) Yogadha -
She who gives knowledge and experience of yoga
🌻 655 ) Yogya -
She who can be reached by yoga
🌻 656 ) Yogananda -
She who gets pleasure out of yoga
🌻 657 ) Yugandhara -
She who wears the yuga (Division of eons of time)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Sep 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 82

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 82 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సాధన- సమిష్టి జీవనము - 3 🌻

ఎవరితో అభిప్రాయభేదం వచ్చిందో, అతనితో సూటిగా కూడ్చుండి మాట్లాడుకొని పరస్పరావగాహనతో కలిసిపోవాలి. కొందరు సాధకులు సామాజిక విషయంలో మార్గదృష్టను అనిసరిస్తారు కాని, తమతమ వ్యక్తిగత విషయాలలో గాదు, తమ కుటుంబ వ్యవహారాలలో, తమ‌ పిల్లల వివాహ విద్యావిషయాదుల్లో తమదారి తమది. అయితే, అందరి యొక్క సమగ్ర శ్రేయస్సు సరియైన గురువుకు తెలుస్తుంది.

నిజమైన గురువు దృష్టి ఎల్లరి మేలు మీద ఉంటుంది. మామూలు మనుష్యులకు తమకు మంచి జరగాలని ఉంటుంది గాని, ఆ మంచి ఏమిటో ఏం చేస్తే వస్తుందో తెలియదు. ప్రస్తుత కాలంలో, సగటు మనిషి యొక్క ఆదర్శం గొప్పతనంగాని, మంచితనంగాదు.

సాధకులకు గూడ పూజాదుల్లో, సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచి ఉండవచ్చు గాని, ధనము, అధికారము, సంఘంలో గౌరవం మున్నగు గొప్పతనమునకు చెందిన అంశాలపై మోహం తొందరగా వీడదు. తమతమ అభిప్రాయాలను పరిపూర్ణంగా పరమగురువుకు సమర్పించుకొన్నవాడే వికాసపథంలో సాగుతాడు.

తనకు తాను సమాజ స్వరూపుడగు దేవునికి సమర్పణ పొందినవానికే 'అహంకారం' అనే పెంకు పగిలి ఆనంద సామ్రాజ్యంలో చోటు దొరుకుతుంది. నిజమయిన గురువు తమ మాట అనుచరులనబడే వారు పాటించకపోయినా సరే అలకపూనడు, తాను గురువు ‌అని‌ అనుకొనడు. ఇతరులపై తమ భావాలు రుద్దడు.

తల్లికున్న ప్రేమ వారికి ఉంటుంది. ఎవరితోనయినా ప్రేమగా మెలగ గలరు గురువులు. ప్రేమయే వారి ప్రాణం. వారి యందు గౌరవము అంటే వారిని అనుసరించడమే కాని, వట్టి నమస్కారాలు కాకూడదు. అయితే గురువుల దృష్టి మానవ సంబంధాల వికాసం మీదనే ఉంటుంది. మాట పట్టుదలకన్నా మానవుల నడుమ హృదయ పూర్వకములయిన సత్సంబంధాలు సాధకులకు ఆవశ్యకము.

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

16 Sep 2021

వివేక చూడామణి - 130 / Viveka Chudamani - 130

🌹. వివేక చూడామణి - 130 / Viveka Chudamani - 130🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 27. విముక్తి - 3 🍀

428. ఎవరి యొక్క ప్రకాశము స్థిరముగా ఉంటుందో అతడు నిరంతరముగా ఆనందములో ఉండగలుగుతాడు. వారు అశాశ్వతమైన ఈ విశ్వమును పూర్తిగా మరచిపోతారు. వారు లౌకిక జీవితము నుండి పూర్తిగా విముక్తి పొందుతారు.

429. ఎవరి మనస్సు బ్రహ్మములో కలసి ఉంటుందో, అదే సమయములో స్వేచ్ఛగా ఎఱుక స్థితిలోని గుణాల నుండి విముక్తి పొందుతాడో, మరియు అతని విముక్తి కోరికల నుండి స్వేచ్ఛను పొందిన, ఆ వ్యక్తి తన జీవితములో స్వేచ్ఛను పొందినవాడగును.

430. ఎవరు బంధాల నుండి జాగృతిని పొంది విముక్తులగుతారో వారు శాంతిని పొందగలరు. అతడు శరీరము కలిగి ఉన్నప్పటికి వాటి భాగాలు బ్రహ్మము నుండి వేరుగా ఉండి ఆతురతల నుండి విముక్తులై ఈ లౌకిక స్థితుల నుండి విడుదల పొందుతారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 130 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 27. Redemption - 3 🌻

428. He whose illumination is steady, who has constant bliss, and who has almost forgotten the phenomenal universe, is accepted as a man liberated in this very life.

429. He who, even having his mind merged in Brahman, is nevertheless quite alert, but free at the same time from the characteristics of the waking state, and whose realisation is free from desires, is accepted as a man liberated-in-life.

430. He whose cares about the phenomenal state have been appeased, who, though possessed of a body consisting of parts, is yet devoid of parts, and whose mind is free from anxiety, is accepted as a man liberated-in-life.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

16 Sep 2021

శ్రీ శివ మహా పురాణము - 453

🌹 . శ్రీ శివ మహా పురాణము - 453🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 31

🌻. శివ మాయ - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతల ఈ మాటను విని బృహస్పతి శివుని నామమును స్మరిస్తూ చెవులను మూసుకొనెను. ఆయన వారి కోరికను అంగీకరించలేదు (12). అపుడు విశాల హృదయుడగు బృహస్పతి మహాదేవుని స్మరించి, దేవతలను అనేక పర్యాయములు నిందించి వారితో నిట్లనెను (13).

బృహస్పతి ఇట్లు పలికెను-

దేవతందరు తమ లాభమును సంపాదించుకొని, ఇతరుల కార్యమును ధ్వంసము చేయుట యందు నిమగ్నులైయున్నారు. శంకరుని నేను నిందించినచో నాకు నరకప్రాప్తి తప్పని సరియగును (14). ఓ దేవతలారా ! మీలో ఒకడు హిమవంతుని వద్దకు వెళ్లి ఆయనకు బోధించి మీ కోర్కెను నెరవేర్చుకొనుడు (15). ఆయన శివునకు భక్తితో కన్యాదానమును చేసి మోక్షమును పొందుట నిశ్చితము. కాని ప్రీతి లేకుండగా కుమార్తెను ఇచ్చినచో భారత ఖండమునందు సుఖముగ నుండగలడు (16).

మీలో ఒకరు వెళ్లి వచ్చిన తరువాత సప్తర్షులందరు వెళ్లి ఆ పర్వతునకు ఉపదేశించగలరు. దుర్గాదేవి పినాకధారియగు శివుని తక్క మరియొకనిని వివాహమాడదు (17). ఓ దేవతలారా! అట్లు గానిచో, మీరు ఇంద్రుని దోడ్కొని బ్రహ్మలోకమునకు వెళ్లుడు. మీ వృత్తాంతమును ఆయనకు చెప్పుడు. ఆయన మీ కార్యమును చక్కబెట్టగలడు (18).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలందరు ఆ మాటను విని ఆలోచించుకొని నా సభకు విచ్చేసిరి. వారందరు అచట నున్న నాకు సాదరముగా నమస్కరించి విన్నివించరి (19). శివనిందను ప్రస్తావించే ఆ దేవతల మాటను విని వేదములను ప్రవర్తిల్ల జేసిన నేను విలపించితిని. ఓ మహర్షీ! అపుడు నేను దేవతలతోనిట్లంటిని (20).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

16 Sep 2021

గీతోపనిషత్తు -254

🌹. గీతోపనిషత్తు -254 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 2-1

🍀 2-1. రాజ రహస్యము - బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలోకూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 🍀

రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ || 2

తాత్పర్యము : శాశ్వతము, అవ్యయము, అక్షరము, సమస్తమున కతీతము అగు సత్యము లేక బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలో కూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. ప్రత్యక్షముగ దీనిని తెలియవచ్చును. ఇది తెలిసినవాడు సహజముగనే ధర్మమున వర్తించును. ద్వంద్వా తీతమగు సుఖము ననుభవించును. కనుక దీని ననుష్ఠించుట కర్తవ్యమై యున్నది.

వివరణము : లోకమున అనేకానేకమగు విద్యలున్నవి. అట్టి విద్యలెన్ని నేర్చినను అట్టివారు సత్యవంతునితో సరిపోలరు. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. వశిష్ఠ విశ్వామిత్రుల ఉపాఖ్యానమే దీనికి ఉదాహరణము. రజస్ తమో గుణముల దోషము చేత జీవులనేకానేక విద్యలు నేర్తురు. కాని వారు సత్యము తెలియకపోవుట చేత శాశ్వతులుగ నుండలేరు. వారే శాశ్వతులు కానపుడు, వారి విద్యలు కూడ వారితోనే పోవును. కనుక తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి.

అది అత్యంత పవిత్రము, ఉత్తమ విద్యలకన్న ఉత్తమము. పై తెలిపిన రాజవిద్య రాజగుహ్యమని భగవానుడు పలికి నాడు. అనగా రహస్యము లన్నిటి కన్న గూఢమగు రహస్యమని అర్థము. రహస్యమనగా మరుగుగ నుండునది. రాజుల రహస్యములు కూడ తెలియనగును. కాని ఈ రహస్యము విచిత్రమగు రహస్యము. దీనిని మరుగున నుంచ నవసరము లేదు. దీనిని బాహాటముగ తెలిపినను, మరుక్షణమే రహస్యమైపోవును. తెలుప కుండునది రహస్యము. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Sep 2021

16-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం  16-సెప్టెంబర్-2021  గురువారం శుభాకాంక్షలు 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 254  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 453🌹 
4) 🌹 వివేక చూడామణి - 130 / Viveka Chudamani - 130🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -82🌹  
6) 🌹 Osho Daily Meditations - 72🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 130 / Sri Lalita Sahasranamavali - Meaning - 130 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. భగవద్గీతాసారము 🍀*

గీత కూడ ధర్మపరిపాలనముననే పరిపూర్ణముగ సమర్థించును. ఎవరి ధర్మము వారు పరిపాలించినపుడు సంఘము సుభిక్షమగును. 'కలి' ప్రభావమున ప్రతియొక్కరు స్వధర్మమును నిర్లక్ష్యము చేయుట జరుగుచున్నది. ఎవరు ఏ పనినైననూ చేయవచ్చునను అవగాహన కలిప్రభావమే. తాను చేయవలసిన పని చేయుటకు అసళిలికర్యముగ నుండుట వలన మరియొక మార్గమును చూసుకొనువాడు, అపకీర్తి పాలగుటయేగాక, పాపమును పొంది నశింపగలడు. ధర్మ ప్రవర్తనమున మరణించిననూ, జయించి బ్రతికిననూ అట్టి జీవుడు ముక్తుడై యుండును. అధర్మమును ఆచరించు వాడు, ఆచరించుచూ జీవించువాడు శవము కన్నా హీనమని ధర్మము బోధించుచున్నది.
🌻 🌻 🌻 🌻 🌻

16 గురువారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
 తిథి: శుక్ల-దశమి 09:37:37 వరకు తదుపరి శుక్ల-ఏకాదశి
 పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: ఉత్తరాషాఢ 28:09:03 వరకు తదుపరి శ్రవణ
యోగం: శోభన 22:30:05 వరకు తదుపరి అతిగంధ్
కరణం: గార 09:37:37 వరకు
వర్జ్యం: 12:40:20 - 14:13:12
దుర్ముహూర్తం: 10:08:33 - 10:57:26 మరియు
15:01:50 - 15:50:43
రాహు కాలం: 13:42:25 - 15:14:04
గుళిక కాలం: 09:07:27 - 10:39:06
యమ గండం: 06:04:10 - 07:35:49
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:34
అమృత కాలం: 21:57:32 - 23:30:24
సూర్యోదయం: 06:04:10, సూర్యాస్తమయం: 18:17:22
వైదిక సూర్యోదయం: 06:07:41
వైదిక సూర్యాస్తమయం: 18:13:49
చంద్రోదయం: 15:05:46, చంద్రాస్తమయం: 01:24:28
సూర్య రాశి: సింహం, చంద్ర రాశి: ధనుస్సు
ఆనందాదియోగం: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 22:19:59
వరకు తదుపరి ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని
పండుగలు : 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -254 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 2-1
 
*🍀 2-1. రాజ రహస్యము - బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలోకూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 🍀*

రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ || 2

తాత్పర్యము : శాశ్వతము, అవ్యయము, అక్షరము, సమస్తమున కతీతము అగు సత్యము లేక బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలో కూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. ప్రత్యక్షముగ దీనిని తెలియవచ్చును. ఇది తెలిసినవాడు సహజముగనే ధర్మమున వర్తించును. ద్వంద్వా తీతమగు సుఖము ననుభవించును. కనుక దీని ననుష్ఠించుట కర్తవ్యమై యున్నది. 

వివరణము : లోకమున అనేకానేకమగు విద్యలున్నవి. అట్టి విద్యలెన్ని నేర్చినను అట్టివారు సత్యవంతునితో సరిపోలరు. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. వశిష్ఠ విశ్వామిత్రుల ఉపాఖ్యానమే దీనికి ఉదాహరణము. రజస్ తమో గుణముల దోషము చేత జీవులనేకానేక విద్యలు నేర్తురు. కాని వారు సత్యము తెలియకపోవుట చేత శాశ్వతులుగ నుండలేరు. వారే శాశ్వతులు కానపుడు, వారి విద్యలు కూడ వారితోనే పోవును. కనుక తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. 

అది అత్యంత పవిత్రము, ఉత్తమ విద్యలకన్న ఉత్తమము. పై తెలిపిన రాజవిద్య రాజగుహ్యమని భగవానుడు పలికి నాడు. అనగా రహస్యము లన్నిటి కన్న గూఢమగు రహస్యమని అర్థము. రహస్యమనగా మరుగుగ నుండునది. రాజుల రహస్యములు కూడ తెలియనగును. కాని ఈ రహస్యము విచిత్రమగు రహస్యము. దీనిని మరుగున నుంచ నవసరము లేదు. దీనిని బాహాటముగ తెలిపినను, మరుక్షణమే రహస్యమైపోవును. తెలుప కుండునది రహస్యము. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 453🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 31

*🌻. శివ మాయ - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతల ఈ మాటను విని బృహస్పతి శివుని నామమును స్మరిస్తూ చెవులను మూసుకొనెను. ఆయన వారి కోరికను అంగీకరించలేదు (12). అపుడు విశాల హృదయుడగు బృహస్పతి మహాదేవుని స్మరించి, దేవతలను అనేక పర్యాయములు నిందించి వారితో నిట్లనెను (13).

బృహస్పతి ఇట్లు పలికెను-

దేవతందరు తమ లాభమును సంపాదించుకొని, ఇతరుల కార్యమును ధ్వంసము చేయుట యందు నిమగ్నులైయున్నారు. శంకరుని నేను నిందించినచో నాకు నరకప్రాప్తి తప్పని సరియగును (14). ఓ దేవతలారా ! మీలో ఒకడు హిమవంతుని వద్దకు వెళ్లి ఆయనకు బోధించి మీ కోర్కెను నెరవేర్చుకొనుడు (15). ఆయన శివునకు భక్తితో కన్యాదానమును చేసి మోక్షమును పొందుట నిశ్చితము. కాని ప్రీతి లేకుండగా కుమార్తెను ఇచ్చినచో భారత ఖండమునందు సుఖముగ నుండగలడు (16). 

మీలో ఒకరు వెళ్లి వచ్చిన తరువాత సప్తర్షులందరు వెళ్లి ఆ పర్వతునకు ఉపదేశించగలరు. దుర్గాదేవి పినాకధారియగు శివుని తక్క మరియొకనిని వివాహమాడదు (17). ఓ దేవతలారా! అట్లు గానిచో, మీరు ఇంద్రుని దోడ్కొని బ్రహ్మలోకమునకు వెళ్లుడు. మీ వృత్తాంతమును ఆయనకు చెప్పుడు. ఆయన మీ కార్యమును చక్కబెట్టగలడు (18).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలందరు ఆ మాటను విని ఆలోచించుకొని నా సభకు విచ్చేసిరి. వారందరు అచట నున్న నాకు సాదరముగా నమస్కరించి విన్నివించరి (19). శివనిందను ప్రస్తావించే ఆ దేవతల మాటను విని వేదములను ప్రవర్తిల్ల జేసిన నేను విలపించితిని. ఓ మహర్షీ! అపుడు నేను దేవతలతోనిట్లంటిని (20). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 130 / 
Viveka Chudamani - 130🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 27. విముక్తి - 3 🍀*

428. ఎవరి యొక్క ప్రకాశము స్థిరముగా ఉంటుందో అతడు నిరంతరముగా ఆనందములో ఉండగలుగుతాడు. వారు అశాశ్వతమైన ఈ విశ్వమును పూర్తిగా మరచిపోతారు. వారు లౌకిక జీవితము నుండి పూర్తిగా విముక్తి పొందుతారు. 

429. ఎవరి మనస్సు బ్రహ్మములో కలసి ఉంటుందో, అదే సమయములో స్వేచ్ఛగా ఎఱుక స్థితిలోని గుణాల నుండి విముక్తి పొందుతాడో, మరియు అతని విముక్తి కోరికల నుండి స్వేచ్ఛను పొందిన, ఆ వ్యక్తి తన జీవితములో స్వేచ్ఛను పొందినవాడగును. 

430. ఎవరు బంధాల నుండి జాగృతిని పొంది విముక్తులగుతారో వారు శాంతిని పొందగలరు. అతడు శరీరము కలిగి ఉన్నప్పటికి వాటి భాగాలు బ్రహ్మము నుండి వేరుగా ఉండి ఆతురతల నుండి విముక్తులై ఈ లౌకిక స్థితుల నుండి విడుదల పొందుతారు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 130 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 27. Redemption - 3 🌻*

428. He whose illumination is steady, who has constant bliss, and who has almost forgotten the phenomenal universe, is accepted as a man liberated in this very life. 

429. He who, even having his mind merged in Brahman, is nevertheless quite alert, but free at the same time from the characteristics of the waking state, and whose realisation is free from desires, is accepted as a man liberated-in-life. 

430. He whose cares about the phenomenal state have been appeased, who, though possessed of a body consisting of parts, is yet devoid of parts, and whose mind is free from anxiety, is accepted as a man liberated-in-life.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 82 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సాధన- సమిష్టి జీవనము - 3 🌻*

ఎవరితో అభిప్రాయభేదం వచ్చిందో, అతనితో సూటిగా కూడ్చుండి మాట్లాడుకొని పరస్పరావగాహనతో కలిసిపోవాలి. కొందరు సాధకులు సామాజిక విషయంలో మార్గదృష్టను అనిసరిస్తారు కాని, తమతమ వ్యక్తిగత విషయాలలో గాదు, తమ కుటుంబ వ్యవహారాలలో, తమ‌ పిల్లల వివాహ విద్యావిషయాదుల్లో తమదారి తమది. అయితే, అందరి యొక్క సమగ్ర శ్రేయస్సు సరియైన గురువుకు తెలుస్తుంది. 

నిజమైన గురువు దృష్టి ఎల్లరి మేలు మీద ఉంటుంది. మామూలు మనుష్యులకు తమకు మంచి జరగాలని ఉంటుంది గాని, ఆ మంచి ఏమిటో ఏం చేస్తే వస్తుందో తెలియదు. ప్రస్తుత కాలంలో, సగటు మనిషి యొక్క ఆదర్శం గొప్పతనంగాని, మంచితనంగాదు. 

సాధకులకు గూడ పూజాదుల్లో, సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచి ఉండవచ్చు గాని, ధనము, అధికారము, సంఘంలో గౌరవం మున్నగు గొప్పతనమునకు చెందిన అంశాలపై మోహం తొందరగా వీడదు. తమతమ అభిప్రాయాలను పరిపూర్ణంగా పరమగురువుకు సమర్పించుకొన్నవాడే వికాసపథంలో సాగుతాడు. 

తనకు తాను సమాజ స్వరూపుడగు దేవునికి సమర్పణ పొందినవానికే 'అహంకారం' అనే పెంకు పగిలి ఆనంద సామ్రాజ్యంలో చోటు దొరుకుతుంది. నిజమయిన గురువు తమ మాట అనుచరులనబడే వారు పాటించకపోయినా సరే అలకపూనడు, తాను గురువు ‌అని‌ అనుకొనడు. ఇతరులపై తమ భావాలు రుద్దడు. 

తల్లికున్న ప్రేమ వారికి ఉంటుంది. ఎవరితోనయినా ప్రేమగా మెలగ గలరు గురువులు. ప్రేమయే వారి ప్రాణం. వారి యందు గౌరవము అంటే వారిని అనుసరించడమే కాని, వట్టి నమస్కారాలు కాకూడదు. అయితే గురువుల దృష్టి మానవ సంబంధాల వికాసం మీదనే ఉంటుంది. మాట పట్టుదలకన్నా మానవుల నడుమ హృదయ పూర్వకములయిన సత్సంబంధాలు సాధకులకు ఆవశ్యకము.

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 71 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 71. STRONG WINDS 🍀*

*🕉 Those strong winds that hit hard are not really enemies. They help to integrate you. They look as if they will uproot you, but in fighting with them you become rooted. 🕉*

Think of a tree. You can bring a tree inside the room and, in a way, it will be protected; the wind will not be so hard on it. When storms are raging outside, it will be out of danger. But there w ill be no challenge; everything will be protected. You can put it in a hothouse, but by and by the tree will start becoming pale, it w ill not be green. Something deep inside it will start dying-because challenge shapes life. 

Those strong winds that hit hard are not really enemies. They help to integrate you. They look as if they will uproot you, but in fighting with them you become rooted. You send your roots even deeper than the storm can reach and destroy. The sun is very hot and it seems it will burn, but the tree sucks up more water to protect itself against the sun. It becomes greener and greener. Fighting with natural forces, it attains to a certain soul. The soul arises only through struggle.

If things are very easy, you start dispersing. By· and by you disintegrate, because integration is not needed at all. You become like a pampered child. So when a challenge happens, live it courageously.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 130 / Sri Lalita Sahasranamavali - Meaning - 130 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 130. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ ।*
*సర్వాధారా, సుప్రతిష్ఠా, సదసద్-రూపధారిణీ ॥ 130 ॥ 🍀*

🍀 658. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ - 
స్వేచ్ఛాసంకల్పశక్తి, జ్ఞానకారకమైన శక్తి, కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉంది.

🍀 659. సర్వాధారా - 
సమస్తమునకు ఆధారమైనది.

🍀 660. సుప్రతిష్ఠా - 
చక్కగా స్థాపించుకొనినది.

🍀 661. సదసద్రూపధారిణీ - 
వ్యక్తమైనదిగాను, వ్యక్తముకాని దానిగాను రూపమును ధరించునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 130 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 130. Echashakti gynashakti kriyashakti svarupini*
*Sarvadhara supratishta sadasadrupadharini ॥ 130 ॥ 🌻*

🌻 658 ) Iccha shakthi - Gnana shakthi - Kriya shakthi swaroopini -   
She who has desire as her head, Knowledge as her body and work as her feet

🌻 659 ) Sarvaadhara -   
She who is the basis of everything

🌻 660 ) Suprathishta -   
She who is the best place of stay

🌻 661 ) Sada sadroopa dharini -   
She who always has truth in her

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹