శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 373 -1. ‘కామేశ్వరప్రాణనాడీ’🌻

కామేశ్వరుని యొక్క ప్రాణనాడియే శ్రీమాత అని అర్థము. ప్రజ్ఞ పురుషుడు కాగా అందుండి యేర్పడునది ప్రాణము. ప్రాణమునకు ప్రజ్ఞ ఆధారము. ప్రజ్ఞకు ప్రాణమాధారము. సృష్టియం

దిరువురును ప్రముఖులే. వారి యందు హెచ్చుతగ్గులు లేవు. ఒకే తత్వము నుండి దిగి వచ్చినవారు. ప్రాణ మున్ననే ప్రజ్ఞ ఉపాధి యందు స్థితిగొని యుండును. ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ నిష్క్రమించును. ప్రాణ మవతరించినచో ప్రజ్ఞ అవతరించును. అమ్మ లేక సృష్టియందు ప్రాణము లేదు. ఆమెయే ప్రాణేశ్వరి. ఆమెయే ప్రాణదాత్రి. ఆమెయే ప్రాణము. సృష్టియందు, జీవులయందు ప్రాణ నాడిగ వర్తించును. స్పందనాత్మకమై నిలచును.

కామేశ్వరుని యందు కూడ ప్రాణనాడి శ్రీమాతయే. కనుకనే పరమశివుడు సాగర మథన సమయమున పరమేశ్వరి అనుజ్ఞగొని హాలాహలమును స్వీకరించెను. శ్రీమాత ప్రాణనాడి యగుట చేత శివుడు మహాక్రూరమైన కాలకూట విషమును త్రాగిననూ శ్రీమాత మహిమచే కాలవశుడు కాలేదు. అమ్మ అనుగ్రహ మున్నవారికి ప్రాణ భయము లేదు. మన యందలి ప్రాణనాడి ఆమెయే. శరీరము నుండి ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ కూడ నిష్క్రమించును. ఒకానొకప్పుడు ప్రజ్ఞ నిష్క్రమించిననూ ప్రాణము దేహము నంటిపెట్టుకొని యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 373 -1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 373-1. Kāmeśvara-prāna-nāḍī कामेश्वर-प्रान-नाडी 🌻

She is the vital force of Kāmeśvara, the Supreme form of Śiva. This nāma is taken from Veda-s. Śrī Rudraṁ says (Yajur Veda IV.v.10) “Oh! Rudra! We invoke the auspicious form of yours, that is auspicious and ever healing along with the great auspicious form of Śaktī”.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 186. అసలు ప్రశ్న / Osho Daily Meditations - 186. THE REAL QUESTION

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 186 / Osho Daily Meditations - 186 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 186. అసలు ప్రశ్న 🍀

🕉. ప్రశ్న ఎప్పుడు కేవలం ఒక గుళిక వంటిది. దీనిలో సమాధానం దాచబడి ఉంటుంది, మృదువైన సమాధానాన్ని రక్షించే గట్టి పెంకు. ఇది ఒక విత్తనాన్ని చుట్టుముట్టి వుండే కవచం మాత్రమే. 🕉

నేడు వందలో తొంభై-తొమ్మిది ప్రశ్నలు చెత్తగా ఉన్నాయి. ఈ తొంభై-తొమ్మిది ప్రశ్నల కారణంగా మీరు నిజంగా విలువైన ప్రశ్నను అడగలేరు. మీ చుట్టూ ఉన్న ఈ తొంభై తొమ్మిది కోలాహలం, అరుపులు, చాలా సందడిగా ఉన్నందున, అవి మీలో అసలు ప్రశ్న తలెత్తడానికి అనుమతించవు. అసలు ప్రశ్న చాలా నిశ్శబ్దంగా, నిశ్చలంగా, చిన్న స్వరాన్ని కలిగి ఉంటుంది. ఈ అవాస్తవమైనవి గొప్పగా నటిస్తూ ఉంటాయి. వాటి కారణంగా మీరు సరైన ప్రశ్న అడగలేరు మరియు మీరు సరైన సమాధానం కనుగొనలేరు.

కాబట్టి చెత్తను చెత్తగా తెలుసుకోవడం గొప్ప అంతర్దృష్టి. అప్పుడు అది మీ చేతుల్లోంచి జారిపోవడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది చెత్త అని మీకు తెలిస్తే మీరు దానిని ఎక్కువసేపు పట్టుకోలేరు. మీ చేతులు ఖాళీగా మారడం ప్రారంభించటానికి ఇది చెత్త అని అర్థం చేసుకోవడం సరిపోతుంది. మీ చేతులు చెత్త నుండి శుభ్ర పడినప్పుడు, అసలు ప్రశ్న ఒక్కటే మిగిలిపోతుంది. మరి దీనిలోని సౌందర్యం ఏమిటంటే.. అసలు ప్రశ్నే మిగిలి ఉంటే సమాధానం ఎంతో దూరంలో లేదు. ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది. ప్రశ్నకు కేంద్రమే సమాధానం.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 186 🌹

📚. Prasad Bharadwaj

🍀 186. THE REAL QUESTION 🍀

🕉 The real question is just a capsule in which the answer is hidden, a hard shell that protects the soft answer within. It is just a crust that surrounds a seed. 🕉

Ninety-nine questions out of a hundred are rubbish, and because of these ninety-nine questions you cannot manage to ask the really valuable question. Because these ninety-nine clamor around you, shout, are very noisy, they don't allow the real question to arise in you. The real question has a very silent, still, small voice, and these unreal ones are great pretenders. Because of them you cannot ask the right question and you cannot find the right answer.

So to know rubbish as rubbish is a great insight. Then it starts slipping out of your hands-because you cannot hold it long if you know it is rubbish. The very understanding that it is rubbish is enough for your hands to start becoming empty, and when your hands are empty of the rubbish, only the one, the real question, is left. And the beauty is that if only the real question is left, the answer is not far away. It is just inside the question. The very center of the question is the answer.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 51 - కశ్యప వంశ వర్ణనము - 1 / Agni Maha Purana - 51 - The progeny of Kaśyapa - 1

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 / Agni Maha Purana - 51 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 19

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కశ్యప వంశ వర్ణనము - 1 🌻

అగ్ని పలికెను : ఓ మునీశ్వరుడా! అపుడు కశ్యపునకు అదిత్యాదుల యందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరము నందు తుషిత దేవతలుగా ఉన్నవారే మరల వైవస్వత మన్వంతరము నందు - విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత అర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశాదిత్యులుగా అదితి యందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి.

విద్వాంసుడైన బహుపుత్రునకు నలుగురు విద్యుత్తులు కుమార్తెలుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్ఠమైన సురాయుధములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్త మనముల వలె, వీరి ఉదయాన్తమనములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.

దితికి క్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సంహికయను కుమార్తెయు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి స్తెంహినేయులని ప్రసిద్ది పొందిరి.

హిరణకశిపునకు ప్రసిద్దమైన తేజస్సుగల అనుహ్రాదుడు, హ్రాదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంహ్రాదుడు అను నలుగరు పుత్తరులు జనించిరి. హ్రాదుని పుత్రుడు హ్రదుడు, ఆయుష్మంతుడు, éశిబి, బాష్కలుడు అనువారు సంహ్రాదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.

పూర్వకల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింప చేసికొని ఆతనినుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 51 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 19

🌻 The progeny of Kaśyapa - 1 🌻

Agni said:

1-3. O Sage! I describe the creation (made) by Kaśyapa through Aditi and others. Those devas who were (known) as Tuṣita in the Cākṣuṣa manvantara, again became (the sons) of Kaśyapa through Aditi in the Vaivasvata manvantara as the twelve Ādityas (with the names) Viṣṇu, Śakra, Tvaṣṭṛ, Dhātṛ, Aryaman, Pūṣan, Vivasvat, Savitṛ, Mitra, Varuṇa, Bhaga, and Aṃśu. The progeny of the wives of Ariṣṭanemi were sixteen.

4. The four lightnings were the daughters of the learned Bahuputra. Those born of Aṅgiras were excellent. (The progeny) of Kṛśāśva were the celestial weapons.[1]

5. Just as the sun rises and sets, similarly these (do) in every yuga. From Kaśyapa, Hiraṇyakaśipu and Hiraṇyākṣa (were born) through Diti.

6. Siṃhikā was also their daughter, who was married by Vipracitti. Rāhu and others born to her were known as Saiṃhikeyas.

7-8. The four sons of Hiraṇyakaśipu (were) very effulgent. (They were) Anuhrāda, Hrāda, Prahrāda a staunch devotee of Viṣṇu; and Saṃhrāda was the fourth (son). Hrada (was) the son of Hrāda. Āyuṣmat, Śibi, and Bāṣkala (were) the sons of Hrada.

9. Virocana (was) the son of Prahrāda. Bali was born to Virocana. Bali had hundred sons. Bāṇa was the foremost among them, O great sage!

10. Having propitiated the consort of Umā (Śiva) in the past kalpa, a boon was obtained by Bāṇa from the lord that he would always wander by the side (of the lord).

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

21 May 2022

శ్రీ శివ మహా పురాణము - 567 / Sri Siva Maha Purana - 567

🌹 . శ్రీ శివ మహా పురాణము - 567 / Sri Siva Maha Purana - 567 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 5 🌻

భర్త చెప్పిన మాటకు కోపముతో మండి పడుతూ బదులిడే స్త్రీ గ్రామములో కుక్కయైగాని, నిర్జనారణ్యములో నక్కయైగాని జన్మించును (45). పతివ్రత ఎత్తైన ఆసనముపై కూర్చుండరాదు. దుష్టుల సన్నిధికి పోరాదు. భర్తతో ఎక్కడనైననూ పిరికి దనమును, భయమును కలిగించు మాటలను చెప్పరాదు (46). కొండెములను చెప్పరాదు.కలహములకు దూరముగా నుండవలెను. పెద్దల సన్నధిలో బిగ్గరగా మాటలాడరాదు, నవ్వరాదు(47).

బయట నుండి వచ్చిన భర్తను గాంచి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములనిచ్చి, భోజనము పెట్టి, తాంబూలమునిచ్చి పాదములను నొక్కి సేవించవలెను (48). మరియు ప్రేమతో నిండిన మాటలను చెప్పి శ్రమను తొలగింపజేసి ప్రీతిని కలిగించు స్త్రీ ముల్లోకములను సంతోష పెట్టిన పుణ్యమును పొందును (49).

తండ్రిగాని, సోదరుడు గాని, కుమారుడుగాని, స్త్రీకి పరిమితముగనే ఇచ్చును. కాని సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీసదా పూజించవలెను (50). దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నియూ భర్తయే. కావున అన్నిటినీ విడిచి ఒక్క భర్తను మాత్రము సేవించవలెను (51). భర్తను విడిచి రహస్యముగా తిరుగాడు దుష్టస్త్రీ చెట్టు తొర్రలో నివసించే క్రూరమగు గుడ్లగూబయై పుట్టును (52). భర్తను కొట్టబోవు స్త్రీపెద్దపులి, లేక పిల్లియై పుట్టును. ఇతర పురుషులను ఓర చూపుతో చూచే స్త్రీ మెల్లకన్ను గలది యగును (53).

ఏ స్త్రీ భర్తను విడిచి పెట్టి తాను ఒక్కతెయే మృష్టాన్నమును భుజించునో ఆమె గ్రామసూకరమైగాని, మేకయై గాని పుట్టును (54). ఏ స్త్రీ భర్తను నిరాకరించి మాటలాడునో ఆమె మూగియై జన్మించును. ఎల్లవేళలా సవతితో కొట్లాడు స్త్రీ భాగ్యహీనురాలిగా అనేక జన్మలను పొందును (55).

భర్తను చూచుట మాని ఇతర పురుషుని చూచు స్త్రీకురూపి, గ్రుడ్డి, వికృతమగు ముఖము గలది అయి పుట్టును (56). ప్రాణము లేని దేహము అశుచి గనుక మానవులు దానిని వెంటనే తగులబెట్టెదరు. అదే తీరున భర్తను విడిచిన స్త్రీ చక్కగా స్నానము చేసినా అశుచియే యగును (57). ఏ గృహములో పతివ్రతా దేవి ఉండునో, ఆమె తల్లిదండ్రులు ధన్యులు. ఆమె భర్త ధన్యుడు (58).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 567 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴

🌻 Description of the duties of the chaste wife - 5 🌻

45. If she furiously retorts to her husband she is born as a bitch in a village or as a vixen in a secluded place.

46. The chaste lady shall never take a higher seat never approach a defiled person, never speak to her husband in agitation.

47. She should avoid slanderous words, shun quarrels and shall not speak aloud or laugh in the presence of elders.

48-49. She who delights her husband delights all the worlds. When she sees her husband coming home she shall hasten to serve him food and water, hand him betel and change of garments, and serve him by massaging his feet. By pleasing words she shall fascinate him and dispel his gloom.

50. What father gives is limited, what brother gives is limited and what the son gives is also limited. A chaste lady shall worship her husband who gives what has no limit.

51. To a wife the husband is god, preceptor, virtue, holy centre and sacred rite. She should cast off everything and adore him alone.

52. She who forsakes her husband and secretly violates her fidelity is born as a she-owl of cruel nature wasting its days in the hollow of a tree.

53. If she desires to beat her husband in retaliation, she becomes a tiger or a wild cat. She who ogles at another man becomes squint-eyed.

54. She who partakes of sweet dish denying the same to her husband becomes a pig in the village or a wild goat eating its own dung.

55. She who addresses her husband in singular becomes dumb. She who is jealous of a co-wife becomes ill-fated in matrimony again and again.

56. She who casts glance on another person hiding it from her husband becomes one-eyed, twisted-faced or ugly.

57. Just as a body bereft of the soul becomes unclean in a moment, similarly a woman without a husband is always unclean even though she may take a neat bath.

58. The mother, the father and the husband are blessed if there is a chaste lady in the house.

Continues....

🌹🌹🌹🌹🌹

21 May 2022

కపిల గీత - 11 / Kapila Gita - 11

🌹. కపిల గీత - 11 / Kapila Gita - 11🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి - 5 🌴

11. తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారమ్
జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠమ్

అన్ని లోకాలకు రక్షకుడవైన నిన్ను శరణు వేడుతున్నాను. భక్తుల యొక్క సంసారమనే వృక్షాన్ని కూలగొట్టడానికి గొడ్డలి వంటి వాడవు. ప్రకృతి యొక్క పురుషుడి యొక్క తత్వం తెలుసుకోవాలని, సద్ధరం తెలుసుకోవాలి.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 11 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Devahuti Desires Transcendental Knowledge - 5 🌴

11. tam tva gataham saranam saranyam sva-bhrtya-samsara-taroh kutharam
jijna-sayaham prakrteh purusasya namami sad-dharma-vidam varistham

Devahuti continued: I have taken shelter of Your lotus feet because You are the only person of whom to take shelter. You are the ax which can cut the tree of material existence. I therefore offer my obeisances unto You, who are the greatest of all transcendentalists, and I inquire from You as to the relationship between man and woman and between spirit and matter.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 May 2022

21 - MAY - 2022 శనివారం, స్థిర వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 21, శనివారం, మే 2022 స్థిర వాసరే 🌹
🌹 కపిల గీత - 11 / Kapila Gita - 11🌹
2) 🌹. శివ మహా పురాణము - 567 / Siva Maha Purana - 567🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 / Agni Maha Purana - 51🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 186 / Osho Daily Meditations - 186🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 21, మే, 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 5 🍀*

*5) సాలగ్రామతులసీమాలాధరం*
*సాలంకృతాభరణభూషితాంగం*
*సాయంకాలసహస్రదీపాలంకరణం*
*శ్రీవేంకటేశ రక్షమాం శ్రీధరనిశం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడు కలకసిమెలసి జీవించేవారికి, ఉన్నది పంచుకుని తినేవారికి తప్పక లభిస్తుంది. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ షష్టి 15:00:00 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: శ్రవణ 23:48:34 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: శుక్ల 08:11:23 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: వణిజ 15:04:00 వరకు
వర్జ్యం: 05:03:40 - 06:33:32
మరియు 27:37:00 - 29:09:00
దుర్ముహూర్తం: 07:26:32 - 08:18:34
రాహు కాలం: 08:57:36 - 10:35:09
గుళిక కాలం: 05:42:29 - 07:20:02
యమ గండం: 13:50:17 - 15:27:50
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:38
అమృత కాలం: 14:02:52 - 15:32:44
సూర్యోదయం: 05:42:29
సూర్యాస్తమయం: 18:42:58
చంద్రోదయం: 00:13:44
చంద్రాస్తమయం: 10:44:50
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మకరం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
23:48:34 వరకు తదుపరి వర్ధమాన 
యోగం - ఉత్తమ ఫలం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 11 / Kapila Gita - 11🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి - 5 🌴*

*11. తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారమ్*
*జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠమ్*

*అన్ని లోకాలకు రక్షకుడవైన నిన్ను శరణు వేడుతున్నాను. భక్తుల యొక్క సంసారమనే వృక్షాన్ని కూలగొట్టడానికి గొడ్డలి వంటి వాడవు. ప్రకృతి యొక్క పురుషుడి యొక్క తత్వం తెలుసుకోవాలని, సద్ధరం తెలుసుకోవాలి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 11 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Devahuti Desires Transcendental Knowledge - 5 🌴*

*11. tam tva gataham saranam saranyam sva-bhrtya-samsara-taroh kutharam*
*jijna-sayaham prakrteh purusasya namami sad-dharma-vidam varistham*

*Devahuti continued: I have taken shelter of Your lotus feet because You are the only person of whom to take shelter. You are the ax which can cut the tree of material existence. I therefore offer my obeisances unto You, who are the greatest of all transcendentalists, and I inquire from You as to the relationship between man and woman and between spirit and matter.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 567 / Sri Siva Maha Purana - 567 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*

*🌻. పతివ్రతా ధర్మములు - 5 🌻*

భర్త చెప్పిన మాటకు కోపముతో మండి పడుతూ బదులిడే స్త్రీ గ్రామములో కుక్కయైగాని, నిర్జనారణ్యములో నక్కయైగాని జన్మించును (45). పతివ్రత ఎత్తైన ఆసనముపై కూర్చుండరాదు. దుష్టుల సన్నిధికి పోరాదు. భర్తతో ఎక్కడనైననూ పిరికి దనమును, భయమును కలిగించు మాటలను చెప్పరాదు (46). కొండెములను చెప్పరాదు.కలహములకు దూరముగా నుండవలెను. పెద్దల సన్నధిలో బిగ్గరగా మాటలాడరాదు, నవ్వరాదు(47). 

బయట నుండి వచ్చిన భర్తను గాంచి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములనిచ్చి, భోజనము పెట్టి, తాంబూలమునిచ్చి పాదములను నొక్కి సేవించవలెను (48). మరియు ప్రేమతో నిండిన మాటలను చెప్పి శ్రమను తొలగింపజేసి ప్రీతిని కలిగించు స్త్రీ ముల్లోకములను సంతోష పెట్టిన పుణ్యమును పొందును (49).

తండ్రిగాని, సోదరుడు గాని, కుమారుడుగాని, స్త్రీకి పరిమితముగనే ఇచ్చును. కాని సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీసదా పూజించవలెను (50). దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నియూ భర్తయే. కావున అన్నిటినీ విడిచి ఒక్క భర్తను మాత్రము సేవించవలెను (51). భర్తను విడిచి రహస్యముగా తిరుగాడు దుష్టస్త్రీ చెట్టు తొర్రలో నివసించే క్రూరమగు గుడ్లగూబయై పుట్టును (52). భర్తను కొట్టబోవు స్త్రీపెద్దపులి, లేక పిల్లియై పుట్టును. ఇతర పురుషులను ఓర చూపుతో చూచే స్త్రీ మెల్లకన్ను గలది యగును (53).

ఏ స్త్రీ భర్తను విడిచి పెట్టి తాను ఒక్కతెయే మృష్టాన్నమును భుజించునో ఆమె గ్రామసూకరమైగాని, మేకయై గాని పుట్టును (54). ఏ స్త్రీ భర్తను నిరాకరించి మాటలాడునో ఆమె మూగియై జన్మించును. ఎల్లవేళలా సవతితో కొట్లాడు స్త్రీ భాగ్యహీనురాలిగా అనేక జన్మలను పొందును (55). 

భర్తను చూచుట మాని ఇతర పురుషుని చూచు స్త్రీకురూపి, గ్రుడ్డి, వికృతమగు ముఖము గలది అయి పుట్టును (56). ప్రాణము లేని దేహము అశుచి గనుక మానవులు దానిని వెంటనే తగులబెట్టెదరు. అదే తీరున భర్తను విడిచిన స్త్రీ చక్కగా స్నానము చేసినా అశుచియే యగును (57). ఏ గృహములో పతివ్రతా దేవి ఉండునో, ఆమె తల్లిదండ్రులు ధన్యులు. ఆమె భర్త ధన్యుడు (58).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 567 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*

*🌻 Description of the duties of the chaste wife - 5 🌻*

45. If she furiously retorts to her husband she is born as a bitch in a village or as a vixen in a secluded place.

46. The chaste lady shall never take a higher seat never approach a defiled person, never speak to her husband in agitation.

47. She should avoid slanderous words, shun quarrels and shall not speak aloud or laugh in the presence of elders.

48-49. She who delights her husband delights all the worlds. When she sees her husband coming home she shall hasten to serve him food and water, hand him betel and change of garments, and serve him by massaging his feet. By pleasing words she shall fascinate him and dispel his gloom.

50. What father gives is limited, what brother gives is limited and what the son gives is also limited. A chaste lady shall worship her husband who gives what has no limit.

51. To a wife the husband is god, preceptor, virtue, holy centre and sacred rite. She should cast off everything and adore him alone.

52. She who forsakes her husband and secretly violates her fidelity is born as a she-owl of cruel nature wasting its days in the hollow of a tree.

53. If she desires to beat her husband in retaliation, she becomes a tiger or a wild cat. She who ogles at another man becomes squint-eyed.

54. She who partakes of sweet dish denying the same to her husband becomes a pig in the village or a wild goat eating its own dung.

55. She who addresses her husband in singular becomes dumb. She who is jealous of a co-wife becomes ill-fated in matrimony again and again.

56. She who casts glance on another person hiding it from her husband becomes one-eyed, twisted-faced or ugly.

57. Just as a body bereft of the soul becomes unclean in a moment, similarly a woman without a husband is always unclean even though she may take a neat bath.

58. The mother, the father and the husband are blessed if there is a chaste lady in the house.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 / Agni Maha Purana - 51 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 19*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. కశ్యప వంశ వర్ణనము - 1 🌻*

అగ్ని పలికెను : ఓ మునీశ్వరుడా! అపుడు కశ్యపునకు అదిత్యాదుల యందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరము నందు తుషిత దేవతలుగా ఉన్నవారే మరల వైవస్వత మన్వంతరము నందు - విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత అర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశాదిత్యులుగా అదితి యందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి.

విద్వాంసుడైన బహుపుత్రునకు నలుగురు విద్యుత్తులు కుమార్తెలుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్ఠమైన సురాయుధములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్త మనముల వలె, వీరి ఉదయాన్తమనములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.

దితికి క్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సంహికయను కుమార్తెయు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి స్తెంహినేయులని ప్రసిద్ది పొందిరి.

హిరణకశిపునకు ప్రసిద్దమైన తేజస్సుగల అనుహ్రాదుడు, హ్రాదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంహ్రాదుడు అను నలుగరు పుత్తరులు జనించిరి. హ్రాదుని పుత్రుడు హ్రదుడు, ఆయుష్మంతుడు, éశిబి, బాష్కలుడు అనువారు సంహ్రాదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.

పూర్వకల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింప చేసికొని ఆతనినుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 51 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 19*
*🌻 The progeny of Kaśyapa - 1 🌻*

Agni said:
1-3. O Sage! I describe the creation (made) by Kaśyapa through Aditi and others. Those devas who were (known) as Tuṣita in the Cākṣuṣa manvantara, again became (the sons) of Kaśyapa through Aditi in the Vaivasvata manvantara as the twelve Ādityas (with the names) Viṣṇu, Śakra, Tvaṣṭṛ, Dhātṛ, Aryaman, Pūṣan, Vivasvat, Savitṛ, Mitra, Varuṇa, Bhaga, and Aṃśu. The progeny of the wives of Ariṣṭanemi were sixteen.

4. The four lightnings were the daughters of the learned Bahuputra. Those born of Aṅgiras were excellent. (The progeny) of Kṛśāśva were the celestial weapons.[1]

5. Just as the sun rises and sets, similarly these (do) in every yuga. From Kaśyapa, Hiraṇyakaśipu and Hiraṇyākṣa (were born) through Diti.

6. Siṃhikā was also their daughter, who was married by Vipracitti. Rāhu and others born to her were known as Saiṃhikeyas.

7-8. The four sons of Hiraṇyakaśipu (were) very effulgent. (They were) Anuhrāda, Hrāda, Prahrāda a staunch devotee of Viṣṇu; and Saṃhrāda was the fourth (son). Hrada (was) the son of Hrāda. Āyuṣmat, Śibi, and Bāṣkala (were) the sons of Hrada.

9. Virocana (was) the son of Prahrāda. Bali was born to Virocana. Bali had hundred sons. Bāṇa was the foremost among them, O great sage!

10. Having propitiated the consort of Umā (Śiva) in the past kalpa, a boon was obtained by Bāṇa from the lord that he would always wander by the side (of the lord).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 186 / Osho Daily Meditations - 186 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 186. అసలు ప్రశ్న 🍀*

*🕉. ప్రశ్న ఎప్పుడు కేవలం ఒక గుళిక వంటిది. దీనిలో సమాధానం దాచబడి ఉంటుంది, మృదువైన సమాధానాన్ని రక్షించే గట్టి పెంకు. ఇది ఒక విత్తనాన్ని చుట్టుముట్టి వుండే కవచం మాత్రమే. 🕉*
 
*నేడు వందలో తొంభై-తొమ్మిది ప్రశ్నలు చెత్తగా ఉన్నాయి. ఈ తొంభై-తొమ్మిది ప్రశ్నల కారణంగా మీరు నిజంగా విలువైన ప్రశ్నను అడగలేరు. మీ చుట్టూ ఉన్న ఈ తొంభై తొమ్మిది కోలాహలం, అరుపులు, చాలా సందడిగా ఉన్నందున, అవి మీలో అసలు ప్రశ్న తలెత్తడానికి అనుమతించవు. అసలు ప్రశ్న చాలా నిశ్శబ్దంగా, నిశ్చలంగా, చిన్న స్వరాన్ని కలిగి ఉంటుంది. ఈ అవాస్తవమైనవి గొప్పగా నటిస్తూ ఉంటాయి. వాటి కారణంగా మీరు సరైన ప్రశ్న అడగలేరు మరియు మీరు సరైన సమాధానం కనుగొనలేరు.*

*కాబట్టి చెత్తను చెత్తగా తెలుసుకోవడం గొప్ప అంతర్దృష్టి. అప్పుడు అది మీ చేతుల్లోంచి జారిపోవడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది చెత్త అని మీకు తెలిస్తే మీరు దానిని ఎక్కువసేపు పట్టుకోలేరు. మీ చేతులు ఖాళీగా మారడం ప్రారంభించటానికి ఇది చెత్త అని అర్థం చేసుకోవడం సరిపోతుంది. మీ చేతులు చెత్త నుండి శుభ్ర పడినప్పుడు, అసలు ప్రశ్న ఒక్కటే మిగిలిపోతుంది. మరి దీనిలోని సౌందర్యం ఏమిటంటే.. అసలు ప్రశ్నే మిగిలి ఉంటే సమాధానం ఎంతో దూరంలో లేదు. ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది. ప్రశ్నకు కేంద్రమే సమాధానం.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 186 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 186. THE REAL QUESTION 🍀*

*🕉 The real question is just a capsule in which the answer is hidden, a hard shell that protects the soft answer within. It is just a crust that surrounds a seed. 🕉*
 
*Ninety-nine questions out of a hundred are rubbish, and because of these ninety-nine questions you cannot manage to ask the really valuable question. Because these ninety-nine clamor around you, shout, are very noisy, they don't allow the real question to arise in you. The real question has a very silent, still, small voice, and these unreal ones are great pretenders. Because of them you cannot ask the right question and you cannot find the right answer.*

*So to know rubbish as rubbish is a great insight. Then it starts slipping out of your hands-because you cannot hold it long if you know it is rubbish. The very understanding that it is rubbish is enough for your hands to start becoming empty, and when your hands are empty of the rubbish, only the one, the real question, is left. And the beauty is that if only the real question is left, the answer is not far away. It is just inside the question. The very center of the question is the answer.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

*🌻 373 -1. ‘కామేశ్వరప్రాణనాడీ’🌻* 

*కామేశ్వరుని యొక్క ప్రాణనాడియే శ్రీమాత అని అర్థము. ప్రజ్ఞ పురుషుడు కాగా అందుండి యేర్పడునది ప్రాణము. ప్రాణమునకు ప్రజ్ఞ ఆధారము. ప్రజ్ఞకు ప్రాణమాధారము. సృష్టియం
దిరువురును ప్రముఖులే. వారి యందు హెచ్చుతగ్గులు లేవు. ఒకే తత్వము నుండి దిగి వచ్చినవారు. ప్రాణ మున్ననే ప్రజ్ఞ ఉపాధి యందు స్థితిగొని యుండును. ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ నిష్క్రమించును. ప్రాణ మవతరించినచో ప్రజ్ఞ అవతరించును. అమ్మ లేక సృష్టియందు ప్రాణము లేదు. ఆమెయే ప్రాణేశ్వరి. ఆమెయే ప్రాణదాత్రి. ఆమెయే ప్రాణము. సృష్టియందు, జీవులయందు ప్రాణ నాడిగ వర్తించును. స్పందనాత్మకమై నిలచును.*

*కామేశ్వరుని యందు కూడ ప్రాణనాడి శ్రీమాతయే. కనుకనే పరమశివుడు సాగర మథన సమయమున పరమేశ్వరి అనుజ్ఞగొని హాలాహలమును స్వీకరించెను. శ్రీమాత ప్రాణనాడి యగుట చేత శివుడు మహాక్రూరమైన కాలకూట విషమును త్రాగిననూ శ్రీమాత మహిమచే కాలవశుడు కాలేదు. అమ్మ అనుగ్రహ మున్నవారికి ప్రాణ భయము లేదు. మన యందలి ప్రాణనాడి ఆమెయే. శరీరము నుండి ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ కూడ నిష్క్రమించును. ఒకానొకప్పుడు ప్రజ్ఞ నిష్క్రమించిననూ ప్రాణము దేహము నంటిపెట్టుకొని యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 373 -1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*

*🌻 373-1. Kāmeśvara-prāna-nāḍī कामेश्वर-प्रान-नाडी 🌻*

*She is the vital force of Kāmeśvara, the Supreme form of Śiva. This nāma is taken from Veda-s. Śrī Rudraṁ says (Yajur Veda IV.v.10) “Oh! Rudra! We invoke the auspicious form of yours, that is auspicious and ever healing along with the great auspicious form of Śaktī”.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹