శ్రీ శివ మహా పురాణము - 567 / Sri Siva Maha Purana - 567


🌹 . శ్రీ శివ మహా పురాణము - 567 / Sri Siva Maha Purana - 567 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 5 🌻


భర్త చెప్పిన మాటకు కోపముతో మండి పడుతూ బదులిడే స్త్రీ గ్రామములో కుక్కయైగాని, నిర్జనారణ్యములో నక్కయైగాని జన్మించును (45). పతివ్రత ఎత్తైన ఆసనముపై కూర్చుండరాదు. దుష్టుల సన్నిధికి పోరాదు. భర్తతో ఎక్కడనైననూ పిరికి దనమును, భయమును కలిగించు మాటలను చెప్పరాదు (46). కొండెములను చెప్పరాదు.కలహములకు దూరముగా నుండవలెను. పెద్దల సన్నధిలో బిగ్గరగా మాటలాడరాదు, నవ్వరాదు(47).

బయట నుండి వచ్చిన భర్తను గాంచి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములనిచ్చి, భోజనము పెట్టి, తాంబూలమునిచ్చి పాదములను నొక్కి సేవించవలెను (48). మరియు ప్రేమతో నిండిన మాటలను చెప్పి శ్రమను తొలగింపజేసి ప్రీతిని కలిగించు స్త్రీ ముల్లోకములను సంతోష పెట్టిన పుణ్యమును పొందును (49).

తండ్రిగాని, సోదరుడు గాని, కుమారుడుగాని, స్త్రీకి పరిమితముగనే ఇచ్చును. కాని సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీసదా పూజించవలెను (50). దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నియూ భర్తయే. కావున అన్నిటినీ విడిచి ఒక్క భర్తను మాత్రము సేవించవలెను (51). భర్తను విడిచి రహస్యముగా తిరుగాడు దుష్టస్త్రీ చెట్టు తొర్రలో నివసించే క్రూరమగు గుడ్లగూబయై పుట్టును (52). భర్తను కొట్టబోవు స్త్రీపెద్దపులి, లేక పిల్లియై పుట్టును. ఇతర పురుషులను ఓర చూపుతో చూచే స్త్రీ మెల్లకన్ను గలది యగును (53).

ఏ స్త్రీ భర్తను విడిచి పెట్టి తాను ఒక్కతెయే మృష్టాన్నమును భుజించునో ఆమె గ్రామసూకరమైగాని, మేకయై గాని పుట్టును (54). ఏ స్త్రీ భర్తను నిరాకరించి మాటలాడునో ఆమె మూగియై జన్మించును. ఎల్లవేళలా సవతితో కొట్లాడు స్త్రీ భాగ్యహీనురాలిగా అనేక జన్మలను పొందును (55).

భర్తను చూచుట మాని ఇతర పురుషుని చూచు స్త్రీకురూపి, గ్రుడ్డి, వికృతమగు ముఖము గలది అయి పుట్టును (56). ప్రాణము లేని దేహము అశుచి గనుక మానవులు దానిని వెంటనే తగులబెట్టెదరు. అదే తీరున భర్తను విడిచిన స్త్రీ చక్కగా స్నానము చేసినా అశుచియే యగును (57). ఏ గృహములో పతివ్రతా దేవి ఉండునో, ఆమె తల్లిదండ్రులు ధన్యులు. ఆమె భర్త ధన్యుడు (58).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 567 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴

🌻 Description of the duties of the chaste wife - 5 🌻


45. If she furiously retorts to her husband she is born as a bitch in a village or as a vixen in a secluded place.

46. The chaste lady shall never take a higher seat never approach a defiled person, never speak to her husband in agitation.

47. She should avoid slanderous words, shun quarrels and shall not speak aloud or laugh in the presence of elders.

48-49. She who delights her husband delights all the worlds. When she sees her husband coming home she shall hasten to serve him food and water, hand him betel and change of garments, and serve him by massaging his feet. By pleasing words she shall fascinate him and dispel his gloom.

50. What father gives is limited, what brother gives is limited and what the son gives is also limited. A chaste lady shall worship her husband who gives what has no limit.

51. To a wife the husband is god, preceptor, virtue, holy centre and sacred rite. She should cast off everything and adore him alone.

52. She who forsakes her husband and secretly violates her fidelity is born as a she-owl of cruel nature wasting its days in the hollow of a tree.

53. If she desires to beat her husband in retaliation, she becomes a tiger or a wild cat. She who ogles at another man becomes squint-eyed.

54. She who partakes of sweet dish denying the same to her husband becomes a pig in the village or a wild goat eating its own dung.

55. She who addresses her husband in singular becomes dumb. She who is jealous of a co-wife becomes ill-fated in matrimony again and again.

56. She who casts glance on another person hiding it from her husband becomes one-eyed, twisted-faced or ugly.

57. Just as a body bereft of the soul becomes unclean in a moment, similarly a woman without a husband is always unclean even though she may take a neat bath.

58. The mother, the father and the husband are blessed if there is a chaste lady in the house.


Continues....

🌹🌹🌹🌹🌹


21 May 2022

No comments:

Post a Comment