శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 1







🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 373 -1. ‘కామేశ్వరప్రాణనాడీ’🌻


కామేశ్వరుని యొక్క ప్రాణనాడియే శ్రీమాత అని అర్థము. ప్రజ్ఞ పురుషుడు కాగా అందుండి యేర్పడునది ప్రాణము. ప్రాణమునకు ప్రజ్ఞ ఆధారము. ప్రజ్ఞకు ప్రాణమాధారము. సృష్టియం

దిరువురును ప్రముఖులే. వారి యందు హెచ్చుతగ్గులు లేవు. ఒకే తత్వము నుండి దిగి వచ్చినవారు. ప్రాణ మున్ననే ప్రజ్ఞ ఉపాధి యందు స్థితిగొని యుండును. ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ నిష్క్రమించును. ప్రాణ మవతరించినచో ప్రజ్ఞ అవతరించును. అమ్మ లేక సృష్టియందు ప్రాణము లేదు. ఆమెయే ప్రాణేశ్వరి. ఆమెయే ప్రాణదాత్రి. ఆమెయే ప్రాణము. సృష్టియందు, జీవులయందు ప్రాణ నాడిగ వర్తించును. స్పందనాత్మకమై నిలచును.

కామేశ్వరుని యందు కూడ ప్రాణనాడి శ్రీమాతయే. కనుకనే పరమశివుడు సాగర మథన సమయమున పరమేశ్వరి అనుజ్ఞగొని హాలాహలమును స్వీకరించెను. శ్రీమాత ప్రాణనాడి యగుట చేత శివుడు మహాక్రూరమైన కాలకూట విషమును త్రాగిననూ శ్రీమాత మహిమచే కాలవశుడు కాలేదు. అమ్మ అనుగ్రహ మున్నవారికి ప్రాణ భయము లేదు. మన యందలి ప్రాణనాడి ఆమెయే. శరీరము నుండి ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ కూడ నిష్క్రమించును. ఒకానొకప్పుడు ప్రజ్ఞ నిష్క్రమించిననూ ప్రాణము దేహము నంటిపెట్టుకొని యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 373 -1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 373-1. Kāmeśvara-prāna-nāḍī कामेश्वर-प्रान-नाडी 🌻

She is the vital force of Kāmeśvara, the Supreme form of Śiva. This nāma is taken from Veda-s. Śrī Rudraṁ says (Yajur Veda IV.v.10) “Oh! Rudra! We invoke the auspicious form of yours, that is auspicious and ever healing along with the great auspicious form of Śaktī”.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


21 May 2022

No comments:

Post a Comment