శ్రీ మదగ్ని మహాపురాణము - 51 - కశ్యప వంశ వర్ణనము - 1 / Agni Maha Purana - 51 - The progeny of Kaśyapa - 1
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 / Agni Maha Purana - 51 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 19
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. కశ్యప వంశ వర్ణనము - 1 🌻
అగ్ని పలికెను : ఓ మునీశ్వరుడా! అపుడు కశ్యపునకు అదిత్యాదుల యందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరము నందు తుషిత దేవతలుగా ఉన్నవారే మరల వైవస్వత మన్వంతరము నందు - విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత అర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశాదిత్యులుగా అదితి యందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి.
విద్వాంసుడైన బహుపుత్రునకు నలుగురు విద్యుత్తులు కుమార్తెలుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్ఠమైన సురాయుధములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్త మనముల వలె, వీరి ఉదయాన్తమనములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.
దితికి క్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సంహికయను కుమార్తెయు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి స్తెంహినేయులని ప్రసిద్ది పొందిరి.
హిరణకశిపునకు ప్రసిద్దమైన తేజస్సుగల అనుహ్రాదుడు, హ్రాదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంహ్రాదుడు అను నలుగరు పుత్తరులు జనించిరి. హ్రాదుని పుత్రుడు హ్రదుడు, ఆయుష్మంతుడు, éశిబి, బాష్కలుడు అనువారు సంహ్రాదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.
పూర్వకల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింప చేసికొని ఆతనినుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 51 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 19
🌻 The progeny of Kaśyapa - 1 🌻
Agni said:
1-3. O Sage! I describe the creation (made) by Kaśyapa through Aditi and others. Those devas who were (known) as Tuṣita in the Cākṣuṣa manvantara, again became (the sons) of Kaśyapa through Aditi in the Vaivasvata manvantara as the twelve Ādityas (with the names) Viṣṇu, Śakra, Tvaṣṭṛ, Dhātṛ, Aryaman, Pūṣan, Vivasvat, Savitṛ, Mitra, Varuṇa, Bhaga, and Aṃśu. The progeny of the wives of Ariṣṭanemi were sixteen.
4. The four lightnings were the daughters of the learned Bahuputra. Those born of Aṅgiras were excellent. (The progeny) of Kṛśāśva were the celestial weapons.[1]
5. Just as the sun rises and sets, similarly these (do) in every yuga. From Kaśyapa, Hiraṇyakaśipu and Hiraṇyākṣa (were born) through Diti.
6. Siṃhikā was also their daughter, who was married by Vipracitti. Rāhu and others born to her were known as Saiṃhikeyas.
7-8. The four sons of Hiraṇyakaśipu (were) very effulgent. (They were) Anuhrāda, Hrāda, Prahrāda a staunch devotee of Viṣṇu; and Saṃhrāda was the fourth (son). Hrada (was) the son of Hrāda. Āyuṣmat, Śibi, and Bāṣkala (were) the sons of Hrada.
9. Virocana (was) the son of Prahrāda. Bali was born to Virocana. Bali had hundred sons. Bāṇa was the foremost among them, O great sage!
10. Having propitiated the consort of Umā (Śiva) in the past kalpa, a boon was obtained by Bāṇa from the lord that he would always wander by the side (of the lord).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
21 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment