🌹 మానవుడు కోల్పోయిన వాస్తవిక జ్ఞానము 🌹

🌹 మానవుడు  కోల్పోయిన వాస్తవిక జ్ఞానము 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🍃 ఉనికి (జీవుల కర్మ భూమి) 🍃

సూర్యుడు (Sun)
బుధుడు (Mercury)
శుక్రుడు (Venus)
భూమి (Earth)
కుజుడు (Mars)
గురువు (Jupiter)
శని (Saturn)
ఇంద్రుడు (Uranus)
వరుణుడు (Neptune)

ఇది మన సౌరమండలము (Solar System) .

Google లో ఒకసారి వాటి స్ధితి గతులను ప్రశ్నించండి, పరిశీలించండి.  మీ ఉనికిని Google Maps యందు పరిశీలించండి.

ఆ తర్వాత, పాలపుంత యందు (MilkyWay) మన సౌర కుటుంబము (Solar System), మన భూమి  యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత,  నక్షత్రవీధి (Galaxy) యందు మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత, విశ్వము (Universe) యందు మన నక్షత్రవీధి (Galaxy),  మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత,  బ్రహ్మాండము (Cosmos) యందు మన విశ్వము (Universe), మన నక్షత్రవీధి (Galaxy),  మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఇప్పుడు ప్రశ్నించుకోండి,  ఇంత జ్యామితి బద్ధమైనటువంటి, గణిత బద్ధమైనటువంటి క్లిష్టమైనటువంటి బ్రహ్మాండ రచన ఎవరి మేధాశక్తితో జరుగుతోంది?

గురుత్వాకర్షణ శక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి, మానసిక శక్తి,  ఆలోచనా శక్తి ఇవన్ని పంచభూతములైనటువంటి ఆకాశము, గాలి, అగ్ని, భూమి, నీరు మరియు గ్రహముల యెుక్క కారకత్వము వలన జీవరాశులకు సంభవించుచున్నవి. వీటియందు ఏ ఒక్కటి కొరవడినా మనము నివసించెడు భూమి గతుల యందు ఊహించనటు వంటి మార్పులు సంభవించి ప్రకృతి ప్రళయాలకు దారితీయును.

ధర్మము (Law of Friction and Law of Action) నిర్దేశింపబడి, గ్రహములుకాని, పంచభూతములుకాని పనిచేయుచున్నవి.

కాలము అనునది ఒక అనిత్యమైన,  అస్ధిరమైన (Variable) పరిమాణం (Dimension).

ఒక్కొక్క గ్రహమునకు రేయింబగళ్ళు యెుక్క కాలనిర్ణయము,  అవి సూర్యుని చుట్టూ తిరిగే కాలాన్ని బట్టి మారుతూవుంటుంది. అందుచేత కాలము అస్ధిరమైనటువంటి పరిమాణం!

మెుదలు, మన భూమి యొక్క అగణిత పరిభ్రమణాన్ని,  జ్ఞాని, శాస్త్రజ్ఞుడు,  మహా శక్తివంతుడైనటువంటి దేవుడు పెద్దపెద్ద పర్వతముల (Mountain Ranges)  సంస్ధాపనచేత (Installation)  భూమి యొక్క పరిభ్రమణాన్ని ఆయన పరిపూర్ణంగా జ్యామితి (Geometrical) పరచెను. ఆవిధముగా ఆయన భూమి మీద జీవరాశి యొక్క మనుగడకు నాంది పలికారు.

పైన తెలిపినటువంటి సౌర మండలాలు కోటానుకోట్లు ఈ విశ్వమంతా వ్యాపించి యున్నవి. మరి వీటి స్థితిగతులు,  జీవరాశికి ఖర్మనాపాదించుటకు ప్రతి సౌరమండలముయందుండెడు గ్రహముల కారకత్వము (Authorship), వాటి  ఆవశ్యకత,  ఇంతటిని పరిపూర్ణముగా జ్యామితిపరుచుటకు కావలసిన యుక్తి, శక్తి కలవాడై,  దైవము ఈ సమస్త విశ్వమును నడుపుచున్నాడు!

రూపరహితుడైన తను, మాయను (సృష్టి, స్ధితి, లయములు) కార్య, కారణ, కాలమనెడి పరిమాణములాధారంగా జగత్కళ్యాణమును సాధించుచుండును!
తన స్ధిరమైన (Static or Absolute) ఉనికినుండి యుక్తి, శక్తి అనెడి అస్ధిరత్వాల(Variable)  సం-యెాగముతో ఇచ్ఛా, జ్ఞాన, క్రీయా శక్తుల ద్వారా శాశ్వతసమయమందు (Time Immortal) చరాచర జగత్తును స్పృశించుచుండును.
ఈ పరిణామక్రమములో, కల్పములయందు జరిగిన, జరుగుచున్న, జరుగబోయెడి రూపాంతరములు కొన్ని పాక్షికస్పృహతో కూడినివై (Partial Consciousness) ఆ తదుపరి తన పూర్తిస్పృహ (Full Consciousness)  యెుక్క అధ్భుతమైనటువంటి సూక్ష్మవిశ్వము తాలూకు నమూనా మనిషి-మానవజాతి!

ఈ మనిషి అనే రూపముయందు తన స్ధిరమైనటువంటి రూపరహిత ఉనికి (SOUL) మరియు అస్ధిరత్వాలైనటువంటి శక్తియుక్తుల సంయెాగముద్వారా, జీవత్వమును (Third Value)  కారణమనెడి పరిమాణముద్వారా సిధ్దింపజేయుచుండును.

కొత్తదనము, పాతదనము యెుక్క త్యాగము (Collapse or Sacrifice) వల్ల సిద్ధించుచుండును. స్ధిరమైన తను అస్ధిరత్వాల సంయెాగము చేత ప్రతి క్షణము రూపాంతరము చెందుచుండును(Reproduction)!
తనున్నానటువంటి ఉనికిని స్పందన-ప్రతిస్పందన అనెడి చర్యయందు తెలియజేయుచుండును!


🌺జీవి గర్వము (False Ego)🌺

గాఢ నిద్రయందు జీవుల శ్వాసనిశ్వాసలు నియంత్రించెడి శక్తియుక్తులు, జీవి ప్రమేయము లేకుండుగనే జరుగుచున్నవి!

ఎవరి ఉత్తర్వులమేరకు,  పై చర్య జరుగుచున్నది?

శక్తి-యుక్తి స్వతంత్ర పరిమాణములు (Separate Entities from Life)  అనుటకు నిదర్శనముగా, మెలుకువతోడనే "గాఢంగా నిద్రపోయాను" అన్న అనుభవమును విశదపరుచున్నది ఎవరు,  ప్రశ్నించుకోగలరు?

జీవత్వమన్నది శక్తి-యుక్తుల సంయెాగానుభవమే!

మూడవ విలువైనటువంటి "జీవము" ద్వారా ఒక నిర్ధిష్టమైనటువంటి కట్టబాటు, యెాగము ద్వారా తన్నుతానెరుంగుట ఒక విలాసము!

మరి ఈ అహంకారమనెడి తప్పుడు స్పందన మనిషికి ఎటునుంచి దాపురించినది?

ఇంకొక ఉదాహరణ......

శారీరక స్పందనల వల్ల  స్త్రీ, పురుష సంయెాగముతో జనించెడు బిడ్డ యెుక్క పోషణ, రచన, తల్లి గర్భముయందు ఎవరు నియంత్రిస్తున్నారు?
ఆ రచన యందు తల్లిదండ్రుల పాత్ర కొసమెరుపైనా లేదు!
పోనీ జీవోత్పత్తికి తయారయ్యెడి శుక్రశోణితాలు తల్లిదండ్రులు ఆధీనము నందున్నవా? లేవు!

మరి ఈ అహంకారమనెడి తప్పుడు స్పందన మనిషికి ఎటునుంచి దాపురించినది?

ప్రారబ్ధముననుసరించి,  యుగధర్మమున అభివృద్ధి పేరిట రూపాంతరము చెందుచున్నటువంటి మానవుని శక్తి-యుక్తులు,  బాహ్య ప్రకృతికి కాని, అంతర్ప్రకృతికి గాని దైవము యెుక్క సృజనాత్మకతకు అద్దం పట్టేదిలా ఉండడమే జీవము యెుక్క అత్యున్నతమైనటువంటి నైతిక పరిణామం!

చిత్రవిచత్రమైనటువంటి అశ్రేస్కరమైనటువంటి కోరికల వలయాలయందు గ్రహముల కారకత్వము చేత మనిషి తన్ను తాను గొప్పగా కీర్తించుకుంటున్నాడు! తద్వారా,  యుగధర్మములకు భాధ్యుడైనాడు!

వ్యాఖ్య: 1

ఒక్కటి తెలుసుకో,  భగవంతుడి కార్యములయందు
స్వేచ్ఛ.
జ్ఞానము.
అందము.
ఆనందము.
పరమార్థము (Life Supporting, Nature Supporting). 
కాలప్రమాణము యందు శాశ్వతము.
ఒకదానిననుసరించి ఒకటుంటుంది!

దేహమే నేననెడి భావన - దేహాత్మ
జీవమనెడి భావన - జీవాత్మ.
సాంఘికముగా జీవులయెడ జీవమును గౌరవించెడు స్ధాయి - మహాత్మ
అన్నిటియందు "నేను" ను స్మరించు స్ధాయి -  పరమాత్మ
పై విధముగా రూపాంతరము చెందినటువంటి ఆత్మను పరమాత్మ స్ధాయికి చేర్చుటయే మనిషి యెుక్క ఖార్మిక కర్తవ్యము!
ఇంతకు మించిన జీవన ధర్మము ఇంకేముంటుంది?

కల్పాంతరములయందు, ఆధ్యాత్మికత (Spirituality) యందు పురోగతి సాధించినటువంటి ఉత్తమ మానవతావర్గానికి చెందినటువంటి మహనీయులు తమ శక్తి-యుక్తులను తపస్సు ద్వారా భగవంతుడి కల్పనాశక్తి మేరకు అనుసంధానపరచి, భగవంతుడి (Static Omni Potent) విశ్వకళ్యాణ ఆలోచనా తరంగములను "వేదము" (Sacred Thoughts) ల ద్వారా గ్రహించి జీవకోటి కళ్యానమునకు దోహదపడి శాశ్వత ఉనికిని సంపాదించుకొనిరి!

వ్యాఖ్య: 2

ఆదిఆద్యంతములు లేని ఇంత బ్రహ్మాండ రచన అంత గణితబధ్ధమై పరిపూర్ణమైన నమూనాగా గోచరిస్తూవుంటే, జీవుడేమిటి భగవంతుడి భౌతిక రచనాసామర్ధ్యాన్ని  బాహ్యమునందే అర్ధము చేసుకోలేకున్నాడే,  ఇంక వీడు(జీవుడు) లోపలికి ప్రయాణము చేసి తన్నుతాతెలుసుకొని భగవంతుడి ఆలోచనా దృక్పధము యందు భాగస్వామెప్పుడయ్యేడు!

విశ్వం యెుక్క పుట్టుక,  విశ్వము యందు జరుగుచున్నటు వంటి సమస్త విలాసము, శృతి తప్పక,  గతి తప్పక ప్రకృతీసమేతముగా రూపాంతరము,  భగవంతుడి "వేదతరంగముల" (Sacred Thoughts) ద్వారానే జరుగుచున్నది.

జీవుడిగా మనము ఆయన ఆదేశాలమేరకు బ్రతకడం తప్ప ఇంకే విధమైనటువంటి అధిక వైపరీత్య చదువుల దోరణితో అభివృధ్ది యందు తప్పిదము జరిగినపుడు, భగవంతుడి ఆలోచనా తరంగముల ద్వారా సహజీవనం సాగిస్తున్నటువంటి మన భూమి-ప్రకృతి యందు అగణిత తరంగముల ఉత్పత్తి పెరిగి జీవుని మనుగడయందు లోపమేర్పడును! లోపములను క్రమబధ్దీకరించే నైపుణ్యమును జీవుడు తిరిగి భగవంతుని ఆలోచనా తరంగములనుంచియే (వేదము)  గ్రహించవలసియుంది!

భగవంతుడు సృష్టించిన రచనను అర్ధం చేసుకొని (వాస్తవిక విద్య), మానవుడు అభ్యున్నతిని సాధించవలెను.

🌺||సర్వేజన సుఖినోభవంతు,  లోకాసమస్తా సుఖినోభవంతు||🌺
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹