శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 317-1. 'రక్షాకరీ' 🌻

రక్షణ కలిగించునది శ్రీదేవి అని అర్థము. అజ్ఞాన మున్నంతకాలము రక్షణ యుండదు. పూర్ణ జ్ఞానియే భయము తొలగిన వాడగును. భయము కలిగిన వారికే రక్షణ అవసరము. వారి భయకారణ మజ్ఞానమే. భయము, భయకారణము తొలగుటకై ఆరాధన. దైవము నారాధించుట వలన భయము తగ్గు చుండును. దివ్యజ్ఞానము పొందుచుండుట వలన మరికొంత భయము తొలగును. పరిపూర్ణమగు భక్తి గలవారికి నిర్భయ స్థితి యుండును.

జీవులలో ప్రహ్లాదు డట్టివాడు. అతడి భక్తి పరిపూర్ణము. అతడు పూర్ణజ్ఞాని, పరమ యోగికూడ. ఎట్టి రాక్షస కృత్యములకు భయపడక శ్రీహరి యందు నిలచినవాడు. మాయను దాటినవారే భయమును దాటినవారు. మాయను దాటుట జీవుని కసాధ్యము. అనుగ్రహ మున్నప్పుడు మాయ ప్రసరింపదు. అనుగ్రహమునకై ఆరాధనమే మార్గము. అనన్య చింతనమే మార్గము. మాయను పడరాదు అని భావించుట కన్న దైవస్మరణ చేయుట మంచిది. తెలియని భయములకు కారణము వెనుక చేసిన తప్పులే. చేసిన తప్పులు గుర్తుండవు. కాని తత్పలమగు భయ ముండును. దైవస్మరణతో భయమును దాటవచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 317-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 317-1. Rakṣākarī रक्षाकरी (317) 🌻

The one who protects. She is the sustainer of this universe, hence this nāma. There is another interpretation. In specified fire rituals, oblations also consist of herbs. When they are burnt into ashes by the tongs of fire, the ashes are filled in an amulet and worn on the self of a person for the purpose of protection from evils.

As ashes are used for protection and in that sense She is the protector. Secondly, ashes also mean the mortal remains of one who existed earlier. In this sense She is the destroyer. Out of the three actions of the Brahman, two are mentioned here. She is in the form of such oblations that will be discussed in later nāma-s (535 and 536).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

02 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 88

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 88 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి రెండో రకం జీవితం గురించి తెలుసుకున్నపుడే దైవత్వానికి అవకాశముంది. మొదటి రకం జీవితం గుడారంలో జీవితం. కోట్లమంది ఎన్నుకునేదది. అక్కడ భద్రత వుంది. వాళ్ళు సాహసాన్ని, సత్యాన్వేషణని కోల్పోతారు. దైవత్వాన్ని, ప్రేమను, కాంతి కోల్పోతారు. 🍀

మనిషి రెండు రకాలుగా జీవించవచ్చు. అన్ని దిక్కులా తలుపు మూసుకుని బతకవచ్చు. గుడారం లోపల వుండవచ్చు. కోట్ల మంది అట్లా జీవించడానికి కారణముంది. అక్కడ భద్రత వుంది. రక్షణ వుంది. అనుకూలం వుంది. వాళ్ళు సాహసాన్ని, సత్యాన్వేషణని కోల్పోతారు. దైవత్వాన్ని, ప్రేమను, కాంతి కోల్పోతారు. వాళ్ళు దాదాపు అన్నీ కోల్పోతారు. కేవలం సానుకూలమయిన మరణాన్ని అందుకుంటారు. వాళ్ళ జీవితం స్మశాన జీవితం. నిజమే స్మశాన జీవితంలో ప్రమాదం లేదు. అక్కడ మళ్ళీ మరణానికి అవకాశముండదు. అది సురక్షితమైన స్థలం. అది సురక్షితమయినా అక్కడ జీవితాన్ని కోల్పోతాం.

వ్యక్తి రెండో రకం జీవితం గురించి తెలుసుకున్నపుడే దైవత్వానికి అవకాశముంది. మొదటి రకం జీవితం గుడారంలో జీవితం. కోట్లమంది ఎన్నుకునేదది. అందుకనే వాళ్ళు నడిచే సమాధులు. జంతువుల్లాగా బతికి వుంటారంతే. తింటారు. పెరుగుతారు. వాళ్ళకు ఆత్మలుండవు. వ్యక్తి ప్రమాదకరంగా జీవించడం మొదలుపెట్టగానే అతను మొదటిసారి జీవించడం ఆరంభిస్తాడు. ప్రమాదకరంగా జీవించడమంటే పరమాత్మతో జీవించడం. బుద్ధుడు, సోక్రటీస్ ప్రమాదకరంగా జీవించారు. వ్యక్తులుగా వాళ్ళు శిఖరాల్ని అధిరోహించారు. వాళ్ళు చైతన్య ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

02 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 21

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 21 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 13. ఒక త్రిభుజము - గాయత్రి - ఓం - సత్సంకల్పము 🌻

పరమ గురువుల మార్గమున దైనందిన కృషి, త్యాగము అనునవి ముఖ్యాంశములు. కృషి నిరంతరముగ సాగవలెను. సత్సంకల్పములను అవతరింప చేయుటకై (రూపకల్పన చేయుటకై) కృషి సాగుచూ నుండవలెను. తన గురించిన భావమున్నవారు ఈ కృషిని సాగింపలేరు. సత్సంకల్పము నందు పూర్ణవిశ్వాసము లేనివారు కూడ కృషిని కొనసాగించలేరు. తమకున్నది. సత్సంకల్పములకు సమర్పించు కొనలేరు. ప్రస్తుత పరిస్థితిలో కాలము, సత్సంకల్పమునకు ప్రతికూలముగ నున్నదని సత్సంకల్ప సంఘ సభ్యులు గుర్తించ వలెను.

పరిస్థితులకు లోబడని సంకల్పబలము కలిగియుండుటకై ఓంకారమును ధ్యానించుట, గాయత్రి మంత్రమును జపించుట, వీలున్నంత వఱకు మౌనమును వహించుట, వాక్ శక్తిని క్రియాశక్తిగ మలచుట చేయవలెను. విశ్వవ్యాప్తమైన చైతన్యము ఆహ్వానించుట కొఱకు, తన నాదరించి తనయందు స్థిరపడుట కొఱకు గాయత్రిమంత్ర జపము శ్రేష్ఠముగ వినియోగపడును. కేవలము బుద్ధులను ప్రచోదనము గావించు మహామంత్రము గాయత్రి. నా మార్గమున గాయత్రి మంత్రమునకు అత్యంత ప్రాధాన్యత కలదు.

ఓంకారము, గాయత్రి, సత్సంకల్పము, కృషి మరువకుడు. ఇది ఒక త్రిభుజము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

02 Nov 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 504 / Vishnu Sahasranama Contemplation - 504

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 504 / Vishnu Sahasranama Contemplation - 504 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 504. అమృతపః, अमृतपः, Amr‌tapaḥ 🌻

ఓం అమృతపాయ నమః | ॐ अमृतपाय नमः | OM Amr‌tapāya namaḥ

అమృతపః, अमृतपः, Amr‌tapaḥ

అసురైర్హ్రియమాణ మమృతం సంరక్షదేవతాః ।
పాయయిత్వా స్వయమపి యోఽపిబత్పరమేశ్వరః ।
సచామృతప ఇత్యుక్తః వేదార్థజ్ఞానిభిర్బుధైః ॥

స్వాత్మానందము అను అమృత రసమును త్రావువాడుగా పరమాత్ముడు 'అమృతపః' అనబడును. లేదా క్షీరసాగరమథనమున జనించి అసురులచే అపహరింపబడుచుండిన అమృతమును రక్షించి దానిని దేవతలచే త్రావించి తానునూ త్రావినందున అమృతపః.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::

క. ఒక్క బొట్టుఁ జిక్క కుండఁగ, సకల సుధారసము నమర సంఘంబులకుం
బ్రకటించి పోసి హరి దన, సుకరాకృతిఁ దాల్చె నసుర శూరులు బెడగన్ (324)
మ. అమరుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థాభిమానణ్బులన్
సములై లబ్దవికల్పులైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర
య్యమరారుల్ బహుదుఃఖముల్ గనిరి తా మత్యంత దోర్గర్వులై;
కమలాక్షున్ శరణంబు వేఁడని జనుల్ గల్యాణ సంయుక్తులే? (325)

విష్ణువు ఒక్క చుక్క కూడా మిగలకుండా అమృతమంతా అమరసమూహానికే బాహాటంగా పోసినాడు. మోహినీ రూపాన్ని వదలి తన నిజ స్వరూపాన్ని ధరించినాడు. ఇదంతా చూసి రాక్షస వీరులు దుఃఖపడినారు. దేవతలూ సరిసమానమైన రాక్షసులూ పూనికా, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ కలిగినవారే. కానీ వారికి రెండు విధములైన ఫలితములు ప్రాప్తించినాయి. దేవతలు శుభాలను పొందినారు. విష్ణువును శరణు వేడని వారు శుభాలను పొందగలరా?

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 504🌹

📚. Prasad Bharadwaj

🌻504. Amr‌tapaḥ🌻

OM Amr‌tapāya namaḥ

असुरैर्ह्रियमाण ममृतं संरक्षदेवताः ।
पाययित्वा स्वयमपि योऽपिबत्परमेश्वरः ।
सचामृतप इत्युक्तः वेदार्थज्ञानिभिर्बुधैः ॥

Asurairhriyamāṇa mamr‌taṃ saṃrakṣadevatāḥ,
Pāyayitvā svayamapi yo’pibatparameśvaraḥ,
Sacāmr‌tapa ityuktaḥ vedārthajñānibhirbudhaiḥ.

One who drinks the Amr‌ta (nectar) of immortal Bliss which is of One's own self. Or One who recovered the Amr‌ta from the wicked and made the Devas, including Himself, partake of it.

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे नवमोऽध्यायः ॥

एवं सुरासुरगणाः समदेशकाल
हेत्वर्थकर्ममतयोऽपि फले विकल्पाः ।
तत्रामृतं सुरगणाः फलमञ्जसापुर्‌
यत्पादपङ्कजरजः श्रयणान्न दैत्याः ॥२८ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 9

Evaṃ surāsuragaṇāḥ samadeśakāla
Hetvarthakarmamatayo’pi phale vikalpāḥ,
Tatrāmr‌taṃ suragaṇāḥ phalamañjasāpurˈ
Yatpādapaṅkajarajaḥ śrayaṇānna daityāḥ.28.

The place, the time, the cause, the purpose, the activity and the ambition were all the same for both the gods and the demons, but the gods achieved one result and the demons another. Because the gods are always under the shelter of the dust of the Lord's lotus feet, they could very easily drink the nectar and get its result. The demons, however, not having sought shelter at the lotus feet of the Lord, were unable to achieve the result they desired.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

02 Nov 2021

ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి, దంతేరాస్! Dhanvantari Jayanthi, Dhana Trayodashi, Danteras!

🌹. ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి, దంతేరాస్! 🌹

📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ధన్వంతరి జయంతి 🌻

శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా, దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. ‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో, ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’ అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.

ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని, అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.

బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి, మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి, అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి, ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు.

అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి, శలాక్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్‌ సమీపంలో ‘ధన్వంతరి క్షేత్రం’ ఉంది.

🌻. ధన త్రయోదశి 🌻

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం - ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని, అత్యంత సంరంభంగా జరుపుతారు. 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ప్రకారం ధన త్రయోదశినాడు గోత్రిరాత్ర వత్రాన్ని చేసుకుంటారు. 'ఆమాదేర్ జ్యోతిషీ' గ్రంథం ధన త్రయోదశి గురించి విశేషంగా వివరించింది. 'ధన్ తేరస్' పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా భావిస్తారు.

🌻. యమదీపం 🌻

ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరివరకూ కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి, పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటిముందు ఉంచుతారు. దీనినే యమదీపమంటారు. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు.

పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్ తేరస్ సాయంకాలాన తమ ఇంటిముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం.

ధన త్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య, సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు. అలాగే, శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశినాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు.యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మించాడు.

ఆ రాకుమారుడు తన పదహారో ఏట, వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య, తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం, వెండి, రత్నాల్ని రాశులుగా పోసి, ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికీ, బంగారం, వెండి ధగధగలకూ కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోయి, వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికీ, ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి, బంగారాల్ని కొని ధన లక్ష్మీపూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి - ధన త్రయోదశి.

ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.'చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చతషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:' అని శాస్త్ర వచనం.'చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అందరూ నరక లోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం.

🌻. దంతేరాస్ పూజా విశిష్టత, ప్రాముఖ్యత..! 🌻

భారత దేశంలో ఎన్నో పండుగలుంటాయి వాటిలో కొన్ని ఒకరోజు కంటే ఎక్కువే జరుపుకుంటారు. నవరాత్రి, దీపావళి లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ పండుగలని అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంతో జరుపుకుంటారు. ఆ సంవత్సరంలో పడ్డ బాధలూ, కష్టాలూ అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలని సంతోషంగా జరుపుకుంటారు. ధన త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ అయిన దీపావళి ఐదు రోజుల పండుగ.

కృష్ణ పక్షంలో పదమూడవరోజున అక్టోబరు - నవంబరు లో వచ్చే కార్తీక మాసం వచ్చే ఈ త్రయోదశి దీపావళి మొదలవుతుంది. పదిహేనవ రోజు అమావాశ్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ త్రయోదశి రోజున మీరందరూ కొత్త నగలూ లేదా ఏమైనా లోహాలూ కొనుక్కుంటారు కదా. ముఖ్యంగా ఈరోజున బంగారం లేదా వెండి కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అసలు ఈరోజున బంగారం ఎందుకు కొనాలని ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఈ త్రయోదశి విశిష్టత తెలుసా? ప్రతీ పండగ వెనుక ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలము. ఇక ఈ త్రయోదశి విశిష్టత తెలుసుకుందామా ? దీపావళి షాపింగుకి బయలుదేరేముందు ధన త్రయోదశి విశిష్టత తెలుసుకోండి.

1. ధన్‌తేరస్ అని కూడా వ్యవహరిస్తారు ధన త్రయోదశిని. అనగా సంపద అని అర్ధం. చాలా మంది ఈరోజున తమ కుటుంబం సుఖ సంతోషాలూ, అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు. బంగారం, వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోహాలని కూడా పూజిస్తారు.

2. లక్ష్మీ దేవికి స్వాగతం - సంపదకి గుర్తు లక్ష్మీ దేవి. అందుకే ఈరోజున అందరూ కొత్త వస్తువులనీ, నగలనీ, వెండి వస్తువులనీ కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు.

3. యమ దీపం కధ - హీమ రాజు కుమారుడు పెళ్లయ్యిన నాలుగో రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసి పెట్టి ఉంది. తన భర్తని కాపాడుకోవటానికి ఆ యువరాజు భార్య ఆరోజు భర్తని నిద్ర పోనీయకుండా మెలకువతో , గది నిండా బంగారం, వెండి నాణాలు కుప్ప పోసి, మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంది.

యువరాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమ ధర్మ రాజుకి నాణేల కాంతి, దీపాల కాంతిలో ఏమీ కనపడదు. అందువల్ల ఆయన వెనుదిరిగివెళ్ళిపోతాడు. తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన త్రయోదశి రోజున తన భర్త ప్రాణాలని కాపాడుగోగలిగింది. అందువల్ల ఆరోజు నుండీ ధన త్రయోదశిరోజున రాత్రంతా యమ ధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు.

4. అమృత మధనం కథ -దేవ దానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీర సాగరం నుండి అమృతం బయటపడింది. అందువల్ల ధన త్రయోదశి నిష్టతో జరుపుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.

5. కుబేరుని పూజ - యక్షుడైన కుబేరుడు సంపదకి అధిపతి. ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా.

6. పార్వతీ దేవి కధ - ధన త్రయోదశిని అల్లుకుని ఉన్న మరోక కదేమిటంటే తన పతితో పాచికలాడిన పార్వతీ దేవి మీద పరమ శివుడు విజయం సాధించాడు. ఈరోజున కనుక పాచికలూ, జూదం లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం.

ఇప్పుడు తెలిసిందా ధన త్రయోదశి యొక్క విశిష్టత ? దీపావళి ముందు వచ్చే ఈ పండుగ భారత దేశంలో చాలా ముఖ్యమయినది. ఈరోజున కనీసం కొంచెం బంగారం లేదా వెండి కొంటారు. ఒక వేళ అవి కొనలేక పోతే కొత్త పాత్రలు కొని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు.

🌹 🌹 🌹 🌹 🌹

02 Nov 2021

2-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 02 మంగళ వారం, భౌమ వారం ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 107 / Bhagavad-Gita - 107 2-60🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 504 / Vishnu Sahasranama Contemplation - 504 🌹
4) 🌹 DAILY WISDOM - 182 🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 21 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 87 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-1 🌹

🌹. ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి, దంతేరాస్! 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*02, నవంబర్‌ 2021, భౌమవారం, *
*ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆంజనేయుని శ్లోకాలు-5 🍀*

ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి త్వం ప్రాంజలీరాంజనేయం

భావము:- ఎవరైతే సముద్రాన్ని ఆడుతూ పాడుతూ సునాయాసంగా దాటగలిగినాడో, జనకుని కుమార్తె అయిన జానకీమాత శోకాన్ని చూసి తట్టుకోలేక ఆ శోకంతోనే లంకని దహింపజేసిన హనుమా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
అశ్వీజ మాసం, కృష్ణపక్షం
తిథి: ద్వాదశి 11:31 వరకు
నక్షత్రము: ఉత్తర 11:44 వరకు
యోగము: వైధృతి 18:14 వరకు
కరణము: తైతుల 11:31 వరకు, 
తదుపరి బవ 22:20 వరకు
అభిజిత్: 11:37 – 12:23 వరకు
అమృతకాలము: 04:25 – 05:54 వరకు
గోధూళి ముహూర్తం: 17:33 – 17:57 వరకు
బ్రహ్మ ముహూర్తం: 04:35 – 05:25 వరకు
రాహుకాలము: 14:52 – 16:18 వరకు
గుళికకాలము: 12:00 – 13:26 వరకు
యమగండము: 09:07 – 10:33 వరకు
దుర్ముహూర్తము: 08:33 – 09:19 వరకు, 
22:45 – 23:35 వరకు
వర్జ్యం: 19:31 – 21:00 వరకు
సూర్యోదయము: 06:15, సూర్యాస్తమయము: 17:44, 
చంద్రోదయము: 04:27, చంద్రాస్తమయము: 16:02
 సూర్య రాశి: తుల, చంద్ర రాశి: కన్య
ఆనందాదియోగం: ధాత్రి యోగం - కార్య జయం 11:45:33 
వరకు తదుపరి సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 
పండుగలు : ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి
ధన్‌తేరాస్‌, యమ దీపం, ప్రదోషవ్రతం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 107 / Bhagavad-Gita - 107 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 60 🌴*

60. యతతో హ్యాపి కౌన్తేయ 
పురుషస్య విపశ్చిత: |
ఇంద్రియాణి ప్రమాథీని 
హరన్తి ప్రసభం మన: ||

🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! ఇంద్రియములు బలవంతములను మరియు దృడములును అయియున్నవి. వానిని అదుపు చేయు యత్నించు విచక్షణాపూర్ణుని మనస్సును సైతము అవి హరించి వేయుచున్నవి.*

🌷. భాష్యము :
ఇంద్రియములను జయించుటకు యత్నించు మునులు, తత్త్వవేత్తలు, జ్ఞానులు పలువురు కలరు. కాని వారట్లు ప్రయత్నించుచున్న వారి యందు ఘనులైనట్టివారే కల్లోలిత మనస్సు కారణముగా ఇంద్రియభోగమునకు బలియగుదురు. గొప్ప తాపసి మరియు పూర్ణయోగియైన విశ్వామిత్రుడు సైతము మేనకచే మైథునభోగమునకు ఆకర్షితుడయ్యెను. యోగము మరియు పలువిధములైన తపస్సులచే ఇంద్రియములను అతడు అదుపుజేయు యత్నించినను మేనకచే మైథునభోగమునకు వశీభూతుడయ్యెను. 

ఇటువంటి సంఘటనలు ప్రపంచచరిత్రలో పెక్కు గలవు. కావున కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా లగ్నము కానిదే ఇంద్రియములను మరియు మనస్సును అదుపు చేయుట మిగుల కష్టతరము. కృష్ణుని యందు మనస్సును సంలగ్నము చేయక విషయకర్మల నుండి విరమించుట ఎవ్వరికిని సాధ్యము కాదు. ఈ విషయమున గొప్పముని మరియు భక్తుడు అయిన శ్రీ యమునాచార్యులు ఒక చక్కని ఉపమానము ఇచ్చియున్నారు.

యదవధి మమచేత: కృష్ణపదారవిన్దే
నవనవరసధామన్యుద్యతరం రంతుమాసీత్|
తదవధి బత నారీ సంగమే స్మర్యమాణే
భవతి ముఖవికార: సుష్టు నిష్టివనం చ ||

“శ్రీకృష్ణభగవానుని పాదపద్మసేవ యందు నా మనస్సు సదా నిలిచియుండుట చేతను మరియు అనుక్షణము నేనొక నవ్యదివ్యరసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగభావన కలిగినంతనే నేను విముఖుడనై ఆ భావముపై ఉమ్మివేయుదును.”

కనుకనే కృష్ణభక్తిరసభావన యనునది అతి దివ్యమైనది. దాని ద్వారా విషయభోగములు అన్నియును రసహీనములగును. అట్టి కృష్ణభక్తిరసభావానము ఆకలికొన్నవాడు తగినంత పుష్టికర ఆహారముతో ఆకలిని శమింపజేసికొనుట వంటిది. కృష్ణభక్తిభావనలో మనస్సును సంలగ్నము చేసియున్నందున భక్త అంబరీషుడు గొప్ప యోగియైన దుర్వాసముని సైతము జయించెను ( స వై మన: కృష్ణపాదారవిన్దయో: వచాంసి వైకుంఠ గుణానువర్ణనే).
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 107 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 60 🌴*

60. yatato hy api kaunteya puruṣasya vipaścitaḥ
indriyāṇi pramāthīni haranti prasabhaṁ manaḥ

🌷Translation :
*The senses are so strong and impetuous, O Arjuna, that they forcibly carry away the mind even of a man of discrimination who is endeavoring to control them.*

🌷 Purport :
There are many learned sages, philosophers and transcendentalists who try to conquer the senses, but in spite of their endeavors, even the greatest of them sometimes fall victim to material sense enjoyment due to the agitated mind. Even Viśvāmitra, a great sage and perfect yogī, was misled by Menakā into sex enjoyment, although the yogī was endeavoring for sense control with severe types of penance and yoga practice. 

And, of course, there are so many similar instances in the history of the world. Therefore, it is very difficult to control the mind and senses without being fully Kṛṣṇa conscious. Without engaging the mind in Kṛṣṇa, one cannot cease such material engagements. A practical example is given by Śrī Yāmunācārya, a great saint and devotee, who says:

yad-avadhi mama cetaḥ kṛṣṇa-pādāravinde
nava-nava-rasa-dhāmany udyataṁ rantum āsīt
tad-avadhi bata nārī-saṅgame smaryamāne
bhavati mukha-vikāraḥ suṣṭhu niṣṭhīvanaṁ ca

“Since my mind has been engaged in the service of the lotus feet of Lord Kṛṣṇa, and I have been enjoying an ever new transcendental humor, whenever I think of sex life with a woman, my face at once turns from it, and I spit at the thought.”

Kṛṣṇa consciousness is such a transcendentally nice thing that automatically material enjoyment becomes distasteful. It is as if a hungry man had satisfied his hunger by a sufficient quantity of nutritious eatables. Mahārāja Ambarīṣa also conquered a great yogī, Durvāsā Muni, simply because his mind was engaged in Kṛṣṇa consciousness (sa vai manaḥ kṛṣṇa-padāravindayor vacāṁsi vaikuṇṭha-guṇānuvarṇane).
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 504 / Vishnu Sahasranama Contemplation - 504 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 504. అమృతపః, अमृतपः, Amr‌tapaḥ 🌻*

*ఓం అమృతపాయ నమః | ॐ अमृतपाय नमः | OM Amr‌tapāya namaḥ*

అమృతపః, अमृतपः, Amr‌tapaḥ

అసురైర్హ్రియమాణ మమృతం సంరక్షదేవతాః ।
పాయయిత్వా స్వయమపి యోఽపిబత్పరమేశ్వరః ।
సచామృతప ఇత్యుక్తః వేదార్థజ్ఞానిభిర్బుధైః ॥

స్వాత్మానందము అను అమృత రసమును త్రావువాడుగా పరమాత్ముడు 'అమృతపః' అనబడును. లేదా క్షీరసాగరమథనమున జనించి అసురులచే అపహరింపబడుచుండిన అమృతమును రక్షించి దానిని దేవతలచే త్రావించి తానునూ త్రావినందున అమృతపః.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
క. ఒక్క బొట్టుఁ జిక్క కుండఁగ, సకల సుధారసము నమర సంఘంబులకుం
      బ్రకటించి పోసి హరి దన, సుకరాకృతిఁ దాల్చె నసుర శూరులు బెడగన్ (324)
మ. అమరుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థాభిమానణ్బులన్
      సములై లబ్దవికల్పులైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర
      య్యమరారుల్ బహుదుఃఖముల్ గనిరి తా మత్యంత దోర్గర్వులై;
      కమలాక్షున్ శరణంబు వేఁడని జనుల్ గల్యాణ సంయుక్తులే? (325)

విష్ణువు ఒక్క చుక్క కూడా మిగలకుండా అమృతమంతా అమరసమూహానికే బాహాటంగా పోసినాడు. మోహినీ రూపాన్ని వదలి తన నిజ స్వరూపాన్ని ధరించినాడు. ఇదంతా చూసి రాక్షస వీరులు దుఃఖపడినారు. దేవతలూ సరిసమానమైన రాక్షసులూ పూనికా, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ కలిగినవారే. కానీ వారికి రెండు విధములైన ఫలితములు ప్రాప్తించినాయి. దేవతలు శుభాలను పొందినారు. విష్ణువును శరణు వేడని వారు శుభాలను పొందగలరా?

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 504🌹*
📚. Prasad Bharadwaj

*🌻504. Amr‌tapaḥ🌻*

*OM Amr‌tapāya namaḥ*

असुरैर्ह्रियमाण ममृतं संरक्षदेवताः ।
पाययित्वा स्वयमपि योऽपिबत्परमेश्वरः ।
सचामृतप इत्युक्तः वेदार्थज्ञानिभिर्बुधैः ॥

Asurairhriyamāṇa mamr‌taṃ saṃrakṣadevatāḥ,
Pāyayitvā svayamapi yo’pibatparameśvaraḥ,
Sacāmr‌tapa ityuktaḥ vedārthajñānibhirbudhaiḥ.

One who drinks the Amr‌ta (nectar) of immortal Bliss which is of One's own self. Or One who recovered the Amr‌ta from the wicked and made the Devas, including Himself, partake of it.

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे नवमोऽध्यायः ॥
एवं सुरासुरगणाः समदेशकाल
    हेत्वर्थकर्ममतयोऽपि फले विकल्पाः ।
तत्रामृतं सुरगणाः फलमञ्जसापुर्‌
    यत्पादपङ्कजरजः श्रयणान्न दैत्याः ॥२८ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 9
Evaṃ surāsuragaṇāḥ samadeśakāla
Hetvarthakarmamatayo’pi phale vikalpāḥ,
Tatrāmr‌taṃ suragaṇāḥ phalamañjasāpurˈ
Yatpādapaṅkajarajaḥ śrayaṇānna daityāḥ.28.

The place, the time, the cause, the purpose, the activity and the ambition were all the same for both the gods and the demons, but the gods achieved one result and the demons another. Because the gods are always under the shelter of the dust of the Lord's lotus feet, they could very easily drink the nectar and get its result. The demons, however, not having sought shelter at the lotus feet of the Lord, were unable to achieve the result they desired.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 182 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 30. Though We Use Electricity, We do not Know What it is Made Of 🌻*

Maha means ‘great', and bhutas means ‘existing elements'. What are these made of? They became the object of further scientific analysis. We know as educated people what these discoveries have been. Physicists of later times analysed the elements of earth, water, fire and air, although they could not analyse ether because they did not know what ether was. It appeared to be a vacuum, and how could one analyse a vacuum?

 Hence, the vacuum was left out of the analysis. The analysis was only of the four elements of earth, water, fire and air. They went on dissecting these into bits and parts and minor particles visible only to a powerful microscope. It was proclaimed as a great discovery that these physical attributes were made up of elements. They said that there are about ninety-two or so elements. This was a great advancement by the scientists, and they were all very happy. “Now we have discovered nature!” We know that a chemical substance differs from another in constitution and function. Though we use electricity, we do not know what it is made of.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 21 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 13. ఒక త్రిభుజము - గాయత్రి - ఓం - సత్సంకల్పము 🌻*

*పరమ గురువుల మార్గమున దైనందిన కృషి, త్యాగము అనునవి ముఖ్యాంశములు. కృషి నిరంతరముగ సాగవలెను. సత్సంకల్పములను అవతరింప చేయుటకై (రూపకల్పన చేయుటకై) కృషి సాగుచూ నుండవలెను. తన గురించిన భావమున్నవారు ఈ కృషిని సాగింపలేరు. సత్సంకల్పము నందు పూర్ణవిశ్వాసము లేనివారు కూడ కృషిని కొనసాగించలేరు. తమకున్నది. సత్సంకల్పములకు సమర్పించు కొనలేరు. ప్రస్తుత పరిస్థితిలో కాలము, సత్సంకల్పమునకు ప్రతికూలముగ నున్నదని సత్సంకల్ప సంఘ సభ్యులు గుర్తించ వలెను.* 

*పరిస్థితులకు లోబడని సంకల్పబలము కలిగియుండుటకై ఓంకారమును ధ్యానించుట, గాయత్రి మంత్రమును జపించుట, వీలున్నంత వఱకు మౌనమును వహించుట, వాక్ శక్తిని క్రియాశక్తిగ మలచుట చేయవలెను. విశ్వవ్యాప్తమైన చైతన్యము ఆహ్వానించుట కొఱకు, తన నాదరించి తనయందు స్థిరపడుట కొఱకు గాయత్రిమంత్ర జపము శ్రేష్ఠముగ వినియోగపడును. కేవలము బుద్ధులను ప్రచోదనము గావించు మహామంత్రము గాయత్రి. నా మార్గమున గాయత్రి మంత్రమునకు అత్యంత ప్రాధాన్యత కలదు.* 

*ఓంకారము, గాయత్రి, సత్సంకల్పము, కృషి మరువకుడు. ఇది ఒక త్రిభుజము.* 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 88 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. వ్యక్తి రెండో రకం జీవితం గురించి తెలుసుకున్నపుడే దైవత్వానికి అవకాశముంది. మొదటి రకం జీవితం గుడారంలో జీవితం. కోట్లమంది ఎన్నుకునేదది. అక్కడ భద్రత వుంది. వాళ్ళు సాహసాన్ని, సత్యాన్వేషణని కోల్పోతారు. దైవత్వాన్ని, ప్రేమను, కాంతి కోల్పోతారు. 🍀*

*మనిషి రెండు రకాలుగా జీవించవచ్చు. అన్ని దిక్కులా తలుపు మూసుకుని బతకవచ్చు. గుడారం లోపల వుండవచ్చు. కోట్ల మంది అట్లా జీవించడానికి కారణముంది. అక్కడ భద్రత వుంది. రక్షణ వుంది. అనుకూలం వుంది. వాళ్ళు సాహసాన్ని, సత్యాన్వేషణని కోల్పోతారు. దైవత్వాన్ని, ప్రేమను, కాంతి కోల్పోతారు. వాళ్ళు దాదాపు అన్నీ కోల్పోతారు. కేవలం సానుకూలమయిన మరణాన్ని అందుకుంటారు. వాళ్ళ జీవితం స్మశాన జీవితం. నిజమే స్మశాన జీవితంలో ప్రమాదం లేదు. అక్కడ మళ్ళీ మరణానికి అవకాశముండదు. అది సురక్షితమైన స్థలం. అది సురక్షితమయినా అక్కడ జీవితాన్ని కోల్పోతాం.* 

*వ్యక్తి రెండో రకం జీవితం గురించి తెలుసుకున్నపుడే దైవత్వానికి అవకాశముంది. మొదటి రకం జీవితం గుడారంలో జీవితం. కోట్లమంది ఎన్నుకునేదది. అందుకనే వాళ్ళు నడిచే సమాధులు. జంతువుల్లాగా బతికి వుంటారంతే. తింటారు. పెరుగుతారు. వాళ్ళకు ఆత్మలుండవు. వ్యక్తి ప్రమాదకరంగా జీవించడం మొదలుపెట్టగానే అతను మొదటిసారి జీవించడం ఆరంభిస్తాడు. ప్రమాదకరంగా జీవించడమంటే పరమాత్మతో జీవించడం. బుద్ధుడు, సోక్రటీస్ ప్రమాదకరంగా జీవించారు. వ్యక్తులుగా వాళ్ళు శిఖరాల్ని అధిరోహించారు. వాళ్ళు చైతన్య ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-1 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 317-1. 'రక్షాకరీ' 🌻* 

రక్షణ కలిగించునది శ్రీదేవి అని అర్థము. అజ్ఞాన మున్నంతకాలము రక్షణ యుండదు. పూర్ణ జ్ఞానియే భయము తొలగిన వాడగును. భయము కలిగిన వారికే రక్షణ అవసరము. వారి భయకారణ మజ్ఞానమే. భయము, భయకారణము తొలగుటకై ఆరాధన. దైవము నారాధించుట వలన భయము తగ్గు చుండును. దివ్యజ్ఞానము పొందుచుండుట వలన మరికొంత భయము తొలగును. పరిపూర్ణమగు భక్తి గలవారికి నిర్భయ స్థితి యుండును. 

జీవులలో ప్రహ్లాదు డట్టివాడు. అతడి భక్తి పరిపూర్ణము. అతడు పూర్ణజ్ఞాని, పరమ యోగికూడ. ఎట్టి రాక్షస కృత్యములకు భయపడక శ్రీహరి యందు నిలచినవాడు. మాయను దాటినవారే భయమును దాటినవారు. మాయను దాటుట జీవుని కసాధ్యము. అనుగ్రహ మున్నప్పుడు మాయ ప్రసరింపదు. అనుగ్రహమునకై ఆరాధనమే మార్గము. అనన్య చింతనమే మార్గము. మాయను పడరాదు అని భావించుట కన్న దైవస్మరణ చేయుట మంచిది. తెలియని భయములకు కారణము వెనుక చేసిన తప్పులే. చేసిన తప్పులు గుర్తుండవు. కాని తత్పలమగు భయ ముండును. దైవస్మరణతో భయమును దాటవచ్చును.  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 317-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 317-1. Rakṣākarī रक्षाकरी (317) 🌻*

The one who protects. She is the sustainer of this universe, hence this nāma. There is another interpretation. In specified fire rituals, oblations also consist of herbs. When they are burnt into ashes by the tongs of fire, the ashes are filled in an amulet and worn on the self of a person for the purpose of protection from evils.  

As ashes are used for protection and in that sense She is the protector. Secondly, ashes also mean the mortal remains of one who existed earlier. In this sense She is the destroyer. Out of the three actions of the Brahman, two are mentioned here. She is in the form of such oblations that will be discussed in later nāma-s (535 and 536). 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి, దంతేరాస్! 🌹*
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻. ధన్వంతరి జయంతి 🌻*

శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా, దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. ‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో, ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’ అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.

ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని, అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.

బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి, మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి, అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి, ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు.

అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి, శలాక్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్‌ సమీపంలో ‘ధన్వంతరి క్షేత్రం’ ఉంది.

*🌻. ధన త్రయోదశి 🌻*

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం - ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని, అత్యంత సంరంభంగా జరుపుతారు. 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ప్రకారం ధన త్రయోదశినాడు గోత్రిరాత్ర వత్రాన్ని చేసుకుంటారు. 'ఆమాదేర్ జ్యోతిషీ' గ్రంథం ధన త్రయోదశి గురించి విశేషంగా వివరించింది. 'ధన్ తేరస్' పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా భావిస్తారు.

*🌻. యమదీపం 🌻*

ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరివరకూ కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి, పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటిముందు ఉంచుతారు. దీనినే యమదీపమంటారు. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. 

పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్ తేరస్ సాయంకాలాన తమ ఇంటిముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం.

ధన త్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య, సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు. అలాగే, శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశినాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు.యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మించాడు. 

ఆ రాకుమారుడు తన పదహారో ఏట, వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య, తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం, వెండి, రత్నాల్ని రాశులుగా పోసి, ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికీ, బంగారం, వెండి ధగధగలకూ కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోయి, వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికీ, ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి, బంగారాల్ని కొని ధన లక్ష్మీపూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి - ధన త్రయోదశి. 

ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.'చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చతషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:' అని శాస్త్ర వచనం.'చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అందరూ నరక లోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం.

*🌻. దంతేరాస్ పూజా విశిష్టత, ప్రాముఖ్యత..! 🌻*

భారత దేశంలో ఎన్నో పండుగలుంటాయి వాటిలో కొన్ని ఒకరోజు కంటే ఎక్కువే జరుపుకుంటారు. నవరాత్రి, దీపావళి లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ పండుగలని అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంతో జరుపుకుంటారు. ఆ సంవత్సరంలో పడ్డ బాధలూ, కష్టాలూ అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలని సంతోషంగా జరుపుకుంటారు. ధన త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ అయిన దీపావళి ఐదు రోజుల పండుగ.

కృష్ణ పక్షంలో పదమూడవరోజున అక్టోబరు - నవంబరు లో వచ్చే కార్తీక మాసం వచ్చే ఈ త్రయోదశి దీపావళి మొదలవుతుంది. పదిహేనవ రోజు అమావాశ్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ త్రయోదశి రోజున మీరందరూ కొత్త నగలూ లేదా ఏమైనా లోహాలూ కొనుక్కుంటారు కదా. ముఖ్యంగా ఈరోజున బంగారం లేదా వెండి కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అసలు ఈరోజున బంగారం ఎందుకు కొనాలని ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఈ త్రయోదశి విశిష్టత తెలుసా? ప్రతీ పండగ వెనుక ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలము. ఇక ఈ త్రయోదశి విశిష్టత తెలుసుకుందామా ? దీపావళి షాపింగుకి బయలుదేరేముందు ధన త్రయోదశి విశిష్టత తెలుసుకోండి.

1. ధన్‌తేరస్ అని కూడా వ్యవహరిస్తారు ధన త్రయోదశిని. అనగా సంపద అని అర్ధం. చాలా మంది ఈరోజున తమ కుటుంబం సుఖ సంతోషాలూ, అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు. బంగారం, వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోహాలని కూడా పూజిస్తారు.

2. లక్ష్మీ దేవికి స్వాగతం - సంపదకి గుర్తు లక్ష్మీ దేవి. అందుకే ఈరోజున అందరూ కొత్త వస్తువులనీ, నగలనీ, వెండి వస్తువులనీ కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు.

3. యమ దీపం కధ - హీమ రాజు కుమారుడు పెళ్లయ్యిన నాలుగో రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసి పెట్టి ఉంది. తన భర్తని కాపాడుకోవటానికి ఆ యువరాజు భార్య ఆరోజు భర్తని నిద్ర పోనీయకుండా మెలకువతో ఉంచి, గది నిండా బంగారం, వెండి నాణాలు కుప్ప పోసి, మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంది. యువరాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమ ధర్మ రాజుకి నాణేల కాంతి, దీపాల కాంతిలో ఏమీ కనపడదు. అందువల్ల ఆయన వెనుదిరిగివెళ్ళిపోతాడు. తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన త్రయోదశి రోజున తన భర్త ప్రాణాలని కాపాడుగోగలిగింది. అందువల్ల ఆరోజు నుండీ ధన త్రయోదశిరోజున రాత్రంతా యమ ధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు.