నిర్మల ధ్యానాలు - ఓషో - 88


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 88 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి రెండో రకం జీవితం గురించి తెలుసుకున్నపుడే దైవత్వానికి అవకాశముంది. మొదటి రకం జీవితం గుడారంలో జీవితం. కోట్లమంది ఎన్నుకునేదది. అక్కడ భద్రత వుంది. వాళ్ళు సాహసాన్ని, సత్యాన్వేషణని కోల్పోతారు. దైవత్వాన్ని, ప్రేమను, కాంతి కోల్పోతారు. 🍀

మనిషి రెండు రకాలుగా జీవించవచ్చు. అన్ని దిక్కులా తలుపు మూసుకుని బతకవచ్చు. గుడారం లోపల వుండవచ్చు. కోట్ల మంది అట్లా జీవించడానికి కారణముంది. అక్కడ భద్రత వుంది. రక్షణ వుంది. అనుకూలం వుంది. వాళ్ళు సాహసాన్ని, సత్యాన్వేషణని కోల్పోతారు. దైవత్వాన్ని, ప్రేమను, కాంతి కోల్పోతారు. వాళ్ళు దాదాపు అన్నీ కోల్పోతారు. కేవలం సానుకూలమయిన మరణాన్ని అందుకుంటారు. వాళ్ళ జీవితం స్మశాన జీవితం. నిజమే స్మశాన జీవితంలో ప్రమాదం లేదు. అక్కడ మళ్ళీ మరణానికి అవకాశముండదు. అది సురక్షితమైన స్థలం. అది సురక్షితమయినా అక్కడ జీవితాన్ని కోల్పోతాం.

వ్యక్తి రెండో రకం జీవితం గురించి తెలుసుకున్నపుడే దైవత్వానికి అవకాశముంది. మొదటి రకం జీవితం గుడారంలో జీవితం. కోట్లమంది ఎన్నుకునేదది. అందుకనే వాళ్ళు నడిచే సమాధులు. జంతువుల్లాగా బతికి వుంటారంతే. తింటారు. పెరుగుతారు. వాళ్ళకు ఆత్మలుండవు. వ్యక్తి ప్రమాదకరంగా జీవించడం మొదలుపెట్టగానే అతను మొదటిసారి జీవించడం ఆరంభిస్తాడు. ప్రమాదకరంగా జీవించడమంటే పరమాత్మతో జీవించడం. బుద్ధుడు, సోక్రటీస్ ప్రమాదకరంగా జీవించారు. వ్యక్తులుగా వాళ్ళు శిఖరాల్ని అధిరోహించారు. వాళ్ళు చైతన్య ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


02 Nov 2021

No comments:

Post a Comment