మైత్రేయ మహర్షి బోధనలు - 21


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 21 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 13. ఒక త్రిభుజము - గాయత్రి - ఓం - సత్సంకల్పము 🌻


పరమ గురువుల మార్గమున దైనందిన కృషి, త్యాగము అనునవి ముఖ్యాంశములు. కృషి నిరంతరముగ సాగవలెను. సత్సంకల్పములను అవతరింప చేయుటకై (రూపకల్పన చేయుటకై) కృషి సాగుచూ నుండవలెను. తన గురించిన భావమున్నవారు ఈ కృషిని సాగింపలేరు. సత్సంకల్పము నందు పూర్ణవిశ్వాసము లేనివారు కూడ కృషిని కొనసాగించలేరు. తమకున్నది. సత్సంకల్పములకు సమర్పించు కొనలేరు. ప్రస్తుత పరిస్థితిలో కాలము, సత్సంకల్పమునకు ప్రతికూలముగ నున్నదని సత్సంకల్ప సంఘ సభ్యులు గుర్తించ వలెను.

పరిస్థితులకు లోబడని సంకల్పబలము కలిగియుండుటకై ఓంకారమును ధ్యానించుట, గాయత్రి మంత్రమును జపించుట, వీలున్నంత వఱకు మౌనమును వహించుట, వాక్ శక్తిని క్రియాశక్తిగ మలచుట చేయవలెను. విశ్వవ్యాప్తమైన చైతన్యము ఆహ్వానించుట కొఱకు, తన నాదరించి తనయందు స్థిరపడుట కొఱకు గాయత్రిమంత్ర జపము శ్రేష్ఠముగ వినియోగపడును. కేవలము బుద్ధులను ప్రచోదనము గావించు మహామంత్రము గాయత్రి. నా మార్గమున గాయత్రి మంత్రమునకు అత్యంత ప్రాధాన్యత కలదు.

ఓంకారము, గాయత్రి, సత్సంకల్పము, కృషి మరువకుడు. ఇది ఒక త్రిభుజము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


02 Nov 2021

No comments:

Post a Comment