శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 317-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 317-1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 317-1. 'రక్షాకరీ' 🌻


రక్షణ కలిగించునది శ్రీదేవి అని అర్థము. అజ్ఞాన మున్నంతకాలము రక్షణ యుండదు. పూర్ణ జ్ఞానియే భయము తొలగిన వాడగును. భయము కలిగిన వారికే రక్షణ అవసరము. వారి భయకారణ మజ్ఞానమే. భయము, భయకారణము తొలగుటకై ఆరాధన. దైవము నారాధించుట వలన భయము తగ్గు చుండును. దివ్యజ్ఞానము పొందుచుండుట వలన మరికొంత భయము తొలగును. పరిపూర్ణమగు భక్తి గలవారికి నిర్భయ స్థితి యుండును.

జీవులలో ప్రహ్లాదు డట్టివాడు. అతడి భక్తి పరిపూర్ణము. అతడు పూర్ణజ్ఞాని, పరమ యోగికూడ. ఎట్టి రాక్షస కృత్యములకు భయపడక శ్రీహరి యందు నిలచినవాడు. మాయను దాటినవారే భయమును దాటినవారు. మాయను దాటుట జీవుని కసాధ్యము. అనుగ్రహ మున్నప్పుడు మాయ ప్రసరింపదు. అనుగ్రహమునకై ఆరాధనమే మార్గము. అనన్య చింతనమే మార్గము. మాయను పడరాదు అని భావించుట కన్న దైవస్మరణ చేయుట మంచిది. తెలియని భయములకు కారణము వెనుక చేసిన తప్పులే. చేసిన తప్పులు గుర్తుండవు. కాని తత్పలమగు భయ ముండును. దైవస్మరణతో భయమును దాటవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 317-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻


🌻 317-1. Rakṣākarī रक्षाकरी (317) 🌻

The one who protects. She is the sustainer of this universe, hence this nāma. There is another interpretation. In specified fire rituals, oblations also consist of herbs. When they are burnt into ashes by the tongs of fire, the ashes are filled in an amulet and worn on the self of a person for the purpose of protection from evils.

As ashes are used for protection and in that sense She is the protector. Secondly, ashes also mean the mortal remains of one who existed earlier. In this sense She is the destroyer. Out of the three actions of the Brahman, two are mentioned here. She is in the form of such oblations that will be discussed in later nāma-s (535 and 536).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Nov 2021

No comments:

Post a Comment