Showing posts with label MahaGauri. Show all posts
Showing posts with label MahaGauri. Show all posts

నవ దుర్గల ఆరాధన - అష్టమ దుర్గ - మహాగౌరి దేవి (Worship of the Nine Durgas (Nava Durgas) – The Eighth Durga – Goddess Mahagauri)


https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2282557859197349


🌹🔱 8. నవ దుర్గల ఆరాధన - అష్టమ దుర్గ - మహాగౌరి దేవి – దుర్గాదేవి అలంకారం విశిష్టత, ప్రార్థనా శ్లోకాలు, ఆరాధనా విధానం - పురాణ కధ, సాధన 🔱🌹
✍️ ప్రసాద్ భరద్వాజ


🌹🔱 8. Worship of the Nava Durgas (Nine Forms of Durga) – The Eighth Durga: Goddess Mahagauri – Significance of the Goddess’s Alankara (Adornment), Prayer Verses, Rituals of Worship – Puranic Legend, Spiritual Practice 🔱🌹
✍️ Prasad Bharadwaj



అలంకారం: దుర్గాదేవి

ఆరాధనా దినం: ఎనిమిదవ రోజు | సంప్రదాయ రంగు: గులాబీ

మహాగౌరీదేవి పవిత్రతకు, శాంతికి, కరుణకు ప్రతీక. చంద్రునిలా ప్రకాశించే దేహకాంతితో, శ్వేతవస్త్రాలను ధరించి, నాలుగు హస్తాలతో దర్శనమిస్తుంది. వృషభం ఆమె వాహనంగా వర్ణించబడుతుంది.

పార్వతీదేవి చేసిన దీర్ఘతపస్సు అనంతరం మహాగౌరి స్వరూపాన్ని పొందినట్లు పురాణకథలు వివరిస్తాయి. ఆమె ఆరాధన మనస్సులోని మలినాలను తొలగించుకొని, పవిత్రమైన ఆలోచనలను, నిష్కల్మషమైన భక్తిని, అంతరంగ శాంతిని అలవరచుకోవాలని బోధిస్తుంది.


🌼 మహాగౌరి ప్రార్థనా శ్లోకం

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవప్రమోదదా ॥

భావం: తెల్లని వృషభంపై ఆసీనురాలై, శ్వేతవస్త్రాలను ధరించిన మహాగౌరీదేవి మాకు శాంతిని, పవిత్రతను, సకల శుభాలను ప్రసాదించుగాక.

అలంకారం: దుర్గాదేవి

దుర్గాదేవిని ఎరుపు, గులాబీ రంగు వస్త్రాలతో, కుంకుమ, పుష్పమాలలు, దివ్యాభరణాలతో అలంకరించి పూజిస్తారు. సింహవాహినిగా దర్శనమిచ్చే అమ్మవారు ధైర్యానికి, ధర్మరక్షణకు, దుష్టశక్తులపై విజయానికి ప్రతీక.


🌼 దుర్గా గాయత్రీ మంత్రం

ఓం కాత్యాయన్యై చ విద్మహే కన్యాకుమార్యై చ ధీమహి । తన్నో దుర్గిః ప్రచోదయాత్ ॥

భావం: దుర్గాదేవి దివ్యశక్తిని ధ్యానిస్తూ, ఆమె మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించి, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.

నైవేద్యం: చక్కెర పొంగలి లేదా కుటుంబ సంప్రదాయానుసారమైన ప్రసాదం.


🌷 పురాణ కధ - సాధన

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది.

పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ । బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥

కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావం వల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‍కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటి నుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

ఇంకో కధ ప్రకారం, పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి , బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది.

అష్టమ శక్తియైన మహాగౌరి పూజ కారణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.

మహాగౌరీ మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి.

ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.


✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹 🌹 🌹 🌹 🌹

'సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే గౌరి' - Gauri Mata Prayer - 'Sarva mangala Mangalye'



https://youtube.com/shorts/6Kikab4LBIU


🌹 సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే గౌరి Gouri Mata Prayer - Sarva mangala Mangalye 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹


శ్రీ దేవి శరన్నవరాత్రులు 8వ రోజు 10/10/2024 "దేవీ మహాగౌరీ " గా దర్శనం 8th Day of Shri Devi Sharannavaratri 10/10/2024 Darshan as "Devi MahaGauri"


శ్రీ దేవి శరన్నవరాత్రులు 8వ రోజు 10/10/2024 "దేవీ మహాగౌరీ " గా దర్శనం

శ్రీశైలం


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

"దేవీ మహాగౌరీ" ధ్యాన శ్లోకం

శ్లో𝕝𝕝 శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః | మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.

పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.

శ్రీ మహాగౌరీదేవ్యై నమః

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑