శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు Greetings on Sri Subrahmanya Shashti Skanda Shashti



🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్ భరద్వాజ


🍀 Happy Sri Subrahmanya Shashti Skanda Shashti to everyone 🍀
Prasad Bharadwaja


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం హారతి Subrahmanya Abhishek Harathi (a YT Short)



https://youtube.com/shorts/wGEidjz0drY


🌹 సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం హారతి దివ్య దర్శనం Subrahmanya Abhishek Harathi 🌹

తప్పక వీక్షించండి



ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹




స్కందోత్పత్తి కధ – కుమారసంభవం గాధ SKANDOTHPATHI – story of Kumarasambhavam - Story of Creation


https://youtu.be/GnssM2GwmZA


🌹 స్కందోత్పత్తి కధ – కుమారసంభవం గాధ SKANDOTHPATHI – story of Kumarasambhavam - Story of Creation 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్‌ భరధ్వాజ

🐍 మార్గశిర మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే సృష్టి రహాస్యం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించిన సమస్త కోరికలు నెరవేరతాయని అంటారు. పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది. మోక్ష మార్గం విశదం అవుతుంది. వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు. నాగదోషాలు తొలగి పోతాయిని పండితులు చెబుతారు. 🐍

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam



🌹🌹🌹🌹🌹

ఉమామహేశ్వర కుమారగురవే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా Subrahmanyam Shanmukha Nadha (a devotional YouTube Short)



https://youtube.com/shorts/miybwBY40V4


🌹 ఉమామహేశ్వర కుమారగురవే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా Subrahmanyam Shanmukha Nadha 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్ భరద్వాజ



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


సుబ్రహ్మణ్య స్కంధ షష్ఠి విశిష్టత - Significance of Subramanya Shashti



https://youtu.be/B6liu2jsJDw


🌹 సుబ్రహ్మణ్య స్కంధ షష్ఠి విశిష్టత - పూజా విధానం - స్కంధ పుష్కరిణి - స్కందోత్పత్తి - ఆరు మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు Subrahmanya Shashti Significance 🌹

🍀 శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🍀
ప్రసాద్‌ భరధ్వాజ


🐍 మార్గశిర మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్టి రహాస్యం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించి స్కందోత్పత్తి కధను విన్నా చదివినా సమస్త కోరికలు నెరవేరతాయని అంటారు. ముఖ్యంగా పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పంచమి రోజు.. ఉపవాసం ఉండి షష్ఠి నాడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగి పోతాయిని పండితులు చెబుతారు. 🐍

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు Greetings on Sri Subrahmanya Shashti Skanda Shashti

🌹శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్టి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹Shri Subrahmanya Shashti Skanda Shashti greetings to everyone 🌹
Prasad Bharadhwaja


కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నః స్కందః ప్రచోదయాత్

ఓం సౌమ్ శరవణభవాయ నమః

నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||

నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||


మార్గశిర శుద్ధ షష్టి నాడు ఈ స్తోత్రంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని శరణు వేడినవారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను, సర్పదోషాలు తొలగి సత్సంతానమును ఆ స్వామి ప్రసాదిస్తాడు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్టి రహాస్యం. సుబ్రహ్మణ్యుడిని శివపార్వతుల కుమారుడిగా భావిస్తారు. ఈ పండుగ హిందూ సంప్రదాయంలో ముఖ్యమైనది మరియు యుద్ధం, జ్ఞానం, విజయం యొక్క దేవుడిగా భావించే మురుగన్ (సుబ్రహ్మణ్యుడు) ఆరాధనకు అంకితం చేయబడింది. 26 నవంబర్ బుధవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ రోజున ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం అయిన స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది, దయచేసి సద్వినియోగం చేసుకోమని మనవి.

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును కూడా "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు.

ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని, పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము. వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి, సత్సంతానం, వంశాభివృద్ధి , జ్ఞానము, తేజస్సు, పాప కర్మల నుండి విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.


🐍. కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం 🐍

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు,కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం స్కందుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజల చేయడం మనం చూస్తూ వుంటాం. సంతానప్రాప్తిని కోరే స్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108 మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరం చేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

🌹 🌹 🌹 🌹 🌹