🌹 04, OCTOBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 04, OCTOBER 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 04, OCTOBER 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 437 / Bhagavad-Gita - 437 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 23 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 23 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 798 / Sri Siva Maha Purana - 798 🌹
🌻. శివ జలంధరుల యుద్ధము - 2 / Description of Jalandhara’s Battle - 2 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 51 / Osho Daily Meditations  - 51 🌹
🍀 51. పొగలేని జ్వాల / 51. SMOKELESS FLAME 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 494 -3 🌹 
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 3 / Description of Nos. 485 to 494 Names - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 04, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*

*🍀. శ్రీ గజానన స్తోత్రం - 14 🍀*

*14. మహాఖుమారూఢ మకాలకాలం విదేహ యోగేన చ లభ్యమానమ్ |*
*అమాయినం మాయికమోహదం తం గజాననం భక్తియుతా భజామః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : గురువాద ప్రశస్తి - సాధనలో గురువు ఆవశ్యకతను ఉద్ఘాటించే గురువాదాన్ని ముక్త పురుషులెవ్వరూ ఇంతవరకు నిరాకరించి వుండలేదు. ప్రాణ, మనఃకోశాలలో నివసిస్తూ వాటికి సంబంధించిన స్వాతిశయ ప్రవృత్తి కలవారు మాత్రమే గురువు నంగీకరించడం తమ ఘనతకు లోపంగా భావిస్తారు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ షష్టి 29:42:07 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: రోహిణి 18:30:23 వరకు
తదుపరి మృగశిర
యోగం: సిధ్ధి 06:42:04 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: గార 17:37:30 వరకు
వర్జ్యం: 10:21:20 - 11:59:04
మరియు 24:22:20 - 26:03:00
దుర్ముహూర్తం: 11:40:54 - 12:28:39
రాహు కాలం: 12:04:47 - 13:34:18
గుళిక కాలం: 10:35:15 - 12:04:47
యమ గండం: 07:36:12 - 09:05:44
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27
అమృత కాలం: 15:14:32 - 16:52:16
సూర్యోదయం: 06:06:40
సూర్యాస్తమయం: 18:02:53
చంద్రోదయం: 21:59:17
చంద్రాస్తమయం: 10:46:12
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: శుభ యోగం - కార్య
జయం 18:30:23 వరకు తదుపరి
అమృత యోగం - కార్య సిధ్ది
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 437 / Bhagavad-Gita - 437 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 23 🌴*

*23. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహురుపాదమ్ |*
*బహూదరం బహు దంష్ట్రాకరాలం దృష్ట్వా లోకా: ప్రవ్యథితాస్తథాహమ్ ||*

*🌷. తాత్పర్యం : ఓ మహాబాహో! బహు ముఖములును, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నియు వ్యథ చెందుచున్నవి. వానివలెనే నేనును కలత చెందుచున్నాను.*

*🌷. భాష్యము : భగవంతుని అసంఖ్యాకములైన చేతులు, కాళ్ళు, ముఖములు, మరియు ఉదరములు అంతటా ఉన్నాయి. శ్వేతాశ్వాతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:*

*సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్*
*స భూమిం విశ్వతో వృత్వాత్యతిష్ఠద్దశాఙ్గులమ్ (3.14)*

*‘సర్వోత్కృష్ట భగవానుడికి వేలకొలదీ తలలు, వేల కళ్ళు, మరియు వేల పాదములు ఉన్నాయి. ఆయన విశ్వమును ఆవరించి ఉన్నాడు, కానీ దాని కన్నా అతీతుడు. అందరు మనుష్యులలో నాభి (బొడ్డు) నుండి పది వేళ్ళ పైన, హృదయాంతరాళంలో ఆయన ఉన్నాడు.’ ఆయనను దర్శించేవారు, ఆయనచే దర్శించబడేవారు, భీతిల్లి పోయేవారు మరియు భయం పుట్టించేవారు అందరూ కూడా ఆ భగవంతుని విశ్వ రూపము యందు భాగమే. మరల, కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:*

*భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్యః*
*భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః (2.3.3)*

*‘భగవంతుడు అంటే భయం చేతనే, అగ్ని మండుతున్నది మరియు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన అంటే భయము వలననే గాలి వీస్తున్నది, మరియు ఇంద్రుడు వర్షాలను కురిపిస్తున్నాడు. మృత్యు దేవత యమధర్మరాజు కూడా ఆయన ముందు వణికిపోతాడు.’*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 437 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 23 🌴*

*23. rūpaṁ mahat te bahu-vaktra-netraṁ mahā-bāho bahu-bāhūru-pādam*
*bahūdaraṁ bahu-daṁṣṭrā-karālaṁ dṛṣṭvā lokāḥ pravyathitās tathāham*

*🌷 Translation : O mighty-armed one, all the planets with their demigods are disturbed at seeing Your great form, with its many faces, eyes, arms, thighs, legs and bellies and Your many terrible teeth; and as they are disturbed, so am I.*

*🌹 Purport : The numerous hands, legs, faces, and stomach of God are everywhere. The Śhwetāśhvatar Upaniṣhad states:*

*sahasraśhīrṣhā puruṣhaḥ sahasrākṣhaḥ sahasrapāt*
*sa bhūmiṁ viśhwato vṛitvātyatiṣhṭhaddaśhāṅgulam (3.14)[v5]*

*“The Supreme Entity has thousands of heads, thousands of eyes, and thousands of feet. He envelopes the universe, but is transcendental to it. He resides in all humans, about ten fingers above the navel, in the lotus of the heart.” Those who are beholding and those who are being beheld, the terrified and the terrifying, are all within the universal form of the Lord. Again, the Kaṭhopaniṣhad states:*

*bhayādasyāgnistapati bhayāt tapati sūryaḥ*
*bhayādindraśhcha vāyuśhcha mṛityurdhāvati pañchamaḥ (2.3.3)[v6]*

*“It is from the fear of God that the fire burns and the sun shines. It is out of fear of him that the wind blows and Indra causes the rain to fall. Even Yamraj, the god of death, trembles before him.”*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 798 / Sri Siva Maha Purana - 798 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 22 🌴*

*🌻. శివ జలంధరుల యుద్ధము - 2 🌻*

*ఆయన బాణముల తుఫానులచే రాక్షసులను దుఃఖింపచేసెను. మరియు భయంకరమగు బాణములను గుప్పించి వారిని నేల గూల్చెను (10). మరియు ఖడ్గరోముని శిరస్సును పరశువుతో నరికి దేహమునుండి వేరు చేసెను. మరియు ఖట్వాంగముతో బలాహకుని శిరస్సును రెండు ముక్కలుగా చేసెను (11). ఆయన ఘస్మరాసురుని పాశముతో బంధించి నేలగూల్చెను. మహావీరుడగు ప్రచుండుని త్రిశూలముతో నరికివేసెను (12). వృషభము కొందరిని సంహరించగా, మరి కొందరు బాణములచే సంహరింపబడిరి. సింహముచే పీడింపబడిన ఏనుగులు వలె ఆ రాక్షసులు అచట నిలబడలేక పోయిరి (13). అపుడు ధైర్యశాలి, మహారాక్షసుడు అగు జలంధరుడు క్రోధముతో నిండిన మనస్సు గలవాడై శుంభాది రాక్షసులను ఆ యుద్ధములో నిందించి ఇట్లు పలికెను (14).*

*జలంధరుడిట్లు పలికెను - శత్రువులచే పృష్ఠ భాగమునందు కొట్టబడుతూ పారిపోయే మీరు మాతృవంశమును గూర్చి గొప్పలను చెప్ప ఫలమేమున్నది.? మేము శూరులమని భావించు వారలు భయపడి పారిపోతూ వధింపబడుట కొని యాడదగినది కాదు; స్వర్గమును ఈయబోదు (15). ఓ అల్పులారా! మీకు యుద్ధమునందు శ్రద్ద ఉన్నచో, హృదయములో దార్ఢ్యము ఉన్నచో, తుచ్ఛసుఖముల యందు తృష్ణలేని వారైనచో కేవలము నా ఎదుట నిలబడుడు (16). యుద్ధములో మరణించుట శ్రేష్ఠము. ఆ మరణము కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. సర్వఫలములను, కీర్తిని, మరియు విశేషించి మోక్షమును కూడా ఇచ్చునని మహర్షులచే కీర్తింపబడినది (17).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 798 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 22 🌴*

*🌻 Description of Jalandhara’s Battle - 2 🌻*

10. He afflicted the Daityas with the gusts of wind raised by the arrows. He felled them to the ground with fierce volleys of arrows.

11. He severed the head of Khaḍgaromā from his body with his axe. He shattered the head of Balāhaka with his club into two pieces.

12. He tied the Daitya Ghasmara with his noose and dashed him on the ground. With his trident, he chopped off the great hero Pracaṇḍa.

13. Some of the Asuras were killed by the bull. Some were struck by the arrows. Like elephants harassed by lions, the Asuras were unable to stay there.

14. Then the great Asura Jalandhara became infuriated and rebuked the Daityas in the battle. The courageous Daitya mocked at Śumbha and others and spoke thus.
Jalandhara said:—

15. Of what avail is your boasting about the pedigree of your mother if you flee back on being attacked? To die cowardly while you profess to be heroes is not commendable, nor does it yield heaven.

16. O trivial fellows, if you have faith in war or the essential strength in the heart or if you have no lurking pleasures for sexual indulgence then you come forward and stand before me.

17. Death in battle is preferrable. It yields all cherished desires. It is especially conducive to fame. It has been proclaimed as the bestower of salvation too.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 51 / Osho Daily Meditations  - 51 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 51. పొగలేని జ్వాల 🍀*

*🕉. ఎక్కడ వెలుగు చూసినా ఆరాధనగా భావించండి. గుడి అక్కడే ఉంది. 🕉*

*కాంతి రహస్యాలను చూడండి. కేవలం ఒక చిన్న జ్వాల ప్రపంచంలో అత్యంత రహస్యమైన విషయం, మరియు జీవితం మొత్తం దానిపై ఆధారపడి ఉంటుంది. అదే జ్వాల మీలో మండుతోంది. అందుకే నిరంతర ఆక్సిజన్ అవసరం, ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా మంట మండదు.*

*అందుకే యోగాలో చెప్పబడినట్టుగా లోతుగా ఊపిరి పీల్చుకోవడం, ఆక్సిజన్‌ను ఎక్కువగా పీల్చడం ద్వారా మీ జీవితం మరింత లోతుగా మండుతుంది మరియు జ్వాల స్పష్టంగా మారుతుంది మరియు మీలో ఎటువంటి పొగ రాకుండా ఉంటుంది--మీరు పొగలేని మంటను పొందవచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 51 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 51. SMOKELESS FLAME  🍀*

*🕉.  Wherever you see light, feel worshipful. The temple is there.  🕉*

*Look at the mysteries of light. Just a small flame is the most mysterious thing in the world, and the whole of life depends on it. The same flame is burning in you. That's why continuous oxygen is needed, because the flame cannot burn without oxygen.*

*This is why yoga emphasizes breathing deeply, breathing more and more oxygen so that your life burns deeper and the flame becomes clearer and no smoke arises in you--so that you can attain a smokeless flame.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 485 - 494 -3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 490 - 494 - 3🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।*
*దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*
*🍀  101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।*
*మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*

*🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 3 🌻*

*పండ్రెండు దళముల పద్మము నిజమునకు ఆరు జంటల పద్మమే. ఆరు జంటలు కూడ నిజమునకు మూడు చతుర్భుజములే. లేక నాలుగు త్రిభుజములే. పండ్రెండు దళములకు పండ్రెండు రాశులకు సంబంధ మున్నది. పండ్రెండు రాశులు నిజమునకు ఆరు జంట రాశులే. రాశులు కూడ నాలుగు త్రిభుజములు. అనాహతము మహత్తరమగు కేంద్రము. సృష్టి యందలి పరిపూర్ణ కేంద్రము. సృష్టి కావల దైవము సృష్టియందు పరిపూర్ణముగ యుండుటకు హృదయమే నివాసముగ నుండును. ఇచ్చటి పండ్రెండు దళముల యందు 'క' నుండి 'ఈ' వరకు పండ్రెండు అక్షరము లున్నవని యోగశాస్త్రము తెలుపును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 485 to 494 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya*
*danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*
*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya*
*mahavirendra varada rakinyanba svarupini  ॥ 101 ॥ 🌻*

*🌻 Description of Nos. 485 to 494 Names - 3 🌻*

*The lotus of twelve petals is actually a lotus of six pairs. Six pairs are also three quadrilaterals really. Or four triangles. The twelve petals are related to the twelve constellations. Twelve constellations are actually six pairs of constellations. The signs are also four triangles. Anahata is a great center. The perfect center in the whole creation. For the God beyond creation to be perfectly in the creation, the heart is the abode. Yoga Shastra says that there are twelve letters from 'Ka' to 'E' in these twelve petals.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శివ సూత్రములు - 151 : 3-4 శరీరే సంహారః కళానామ్‌ - 3 / Siva Sutras - 151 : 3-4 sarire samharah kalanam - 3


🌹. శివ సూత్రములు - 151 / Siva Sutras - 151 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-4 శరీరే సంహారః కళానామ్‌ - 3 🌻

🌴. కళ మొదలైన తత్త్వములలోని మాలిన్యాలను నశింప జేసి వాటిని త్యజించి దేహ శుద్ధిలో నిమగ్నమవ్వాలి. 🌴


ఈ సూత్రంలో సంహారః అంటే స్థూల శరీరాన్ని దగ్ధం చేసి సూక్ష్మ శరీరంలోకి మార్చడం; మరియు సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరంలోకి మార్చడం. చివరికి దగ్ధం చేయడానికి ఏమీ మిగలకపోవడం. ఈ ప్రక్రియను చైతన్యం యొక్క మూడు దశలతో పోల్చవచ్చు - జాగృత్ స్వప్న సుషుప్తి. ఒకరు గాఢ నిద్ర దశలోకి ప్రవేశించినప్పుడు, ప్రతి దశ తదుపరి ఉన్నత స్థాయిలోకి కరిగిపోతుంది. దశలవారీగా దగ్ధం చేసే ఈ ప్రక్రియను మనస్సు యొక్క రంగంలో ఆలోచించాలని ఈ సూత్రం చెబుతుంది, ఇక్కడ చివరికి ధ్యానం మరియు కరిగిపోవడం కోసం ఏమీ మిగిలి ఉండదు. అతను ఇప్పుడు శూన్యస్థితిలోకి ప్రవేశిస్తాడు మరియు ఇదే శివుని గ్రహించే స్థితి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 151 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-4 śarīre samhārah kalānām - 3 🌻


🌴. Destroying the impurities in the tattvas such as kala and renouncing them, one should engage in the purification of the body. 🌴

Saṁhāraḥ in this sūtra means annihilation of gross body into subtle body; and subtle body into casual body and ultimately leaving nothing to be annihilated. This process can be compared to the three stages of consciousness – awake, dream and deep sleep. When one enters the stage of deep sleep, each stage is dissolved into the next higher. This sūtra says that this process of stage by stage annihilation should be contemplated in the arena of mind where ultimately nothing is left for contemplation and dissolution. He now enters the state of void and this is the point where Śiva is realised.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




DAILY WISDOM - 149 : 28. Human Life is a Process of Knowledge / నిత్య ప్రజ్ఞా సందేశములు - 149 : 28. మానవ జీవితం ఒక జ్ఞాన ప్రక్రియ



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 149 / DAILY WISDOM - 149 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 28. మానవ జీవితం ఒక జ్ఞాన ప్రక్రియ 🌻


మానవ జీవితం ఒక జ్ఞాన ప్రక్రియ. జ్ఞానం అంటే ఒక విషయం, ఒక వస్తువు మధ్య ఉన్న సంబంధం. ఈ సంబంధమే జ్ఞానానికి దారి తీస్తుంది. జ్ఞాన సముపార్జనలో జ్ఞాని యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే జ్ఞాని లేకుండా జ్ఞానం లేదు మరియు జ్ఞానం లేకుండా అనుభవం ఉండదు. ఒకరి జీవితమంతా వివిధ రకాల అనుభవాలతో రూపొందించబడింది. అన్ని అనుభవాలు చైతన్యంతో కూడి ఉంటాయి. చైతన్యం ఎల్లప్పుడూ జ్ఞానం లేదా జ్ఞానితో సంబంధం కలిగి ఉంటుంది.

స్వీయ జ్ఞానం లేకుండా లక్ష్యం జ్ఞానం ఉండదు. అనుభూతికి రాని ప్రాపంచిక అనుభవం మనుగడలో ఉండడం అసాధ్యం. తెలియబడిన వాస్తవం తెలిసిన వ్యక్తి యొక్క సత్యాన్ని సూచిస్తుంది. మన స్వంత ఉనికిని మనం అంతర్లీనంగా అంగీకరించకుండా ఆలోచన కూడా దాని అర్ధాన్ని కోల్పోతుంది. ఈ స్వయం మానవ కార్యకలాపాలన్నిటినీ ప్రకాశింపజేసే సమస్త జ్ఞానానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. అన్ని కార్యకలాపాలు, అంతిమంగా, ఒక రకమైన జ్ఞానరూపమే అని చెప్పవచ్చు. జ్ఞానం బాహ్యంగా ఒక చర్యగా వ్యక్తమవుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 149 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 28. Human Life is a Process of Knowledge 🌻


Human life is a process of knowledge. All knowledge implies a subject or a knower, whose relation to an object manifests knowledge. The existence of the knower in an act of knowledge cannot be doubted, for without a knower there is no knowledge, and without knowledge there is no experience. The whole of one’s life is constituted of various forms of experience, and all experience is attended with consciousness. Consciousness has always to be in relation with the subject or the knower.

Without a knowing self there is no objective knowledge. The experience of a world outside would become impossible if it is not to be given to a knowing subject. The fact of the known implies the truth of a knower. Even thinking would lose its meaning without our tacitly admitting the existence of our own self. This self reveals itself as the centre of all the knowledge which illumines every form of human activity. All activities can, ultimately, be reduced to a kind of knowledge. It is some form of knowledge that fulfils itself through external action.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 836 / Vishnu Sahasranama Contemplation - 836


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 836 / Vishnu Sahasranama Contemplation - 836🌹

🌻836. బృహత్, बृहत्, Br‌hat🌻

ఓం బృహతే నమః | ॐ बृहते नमः | OM Br‌hate namaḥ


బృహత్వాత్ బృంహణత్వాచ్చ బహ్మైవ బృహదుచ్యతే ।
మహతో మహీయానితిశ్రుతివాక్యానుసారతః ॥

'బృంహతి', 'బృంహయతి' అను వ్యుత్పత్తులచే ఆత్మ తత్త్వము ప్రపంచ రూపమున వృద్ధి నందును, ప్రాణులను వృద్ధి నందించును కావున బ్రహ్మము బృహత్ అనబడును.


:: కఠోపనిషత్ (ప్రథమాధ్యాయము) 2వ వల్లి ::

అణోరణీయాన్మహతో మహీయానాత్మాఽస్య జన్తోర్నిహతో గుహాయామ్ ।
తమక్రతుః పశ్యతి వీతశోకో ధాతుప్రసాదాన్మహిమానమాత్మనః ॥ 20 ॥ (49)

ఆత్మతత్త్వము అణువుకంటె అణువుగను, మహత్తుకంటె మహత్తుగను ప్రతి జీవి యొక్క హృదయకుహరమునందు నివసించుచున్నది. మనోబుద్ధీంద్రియముల కరుణచే ఎవడు సంకల్ప వికల్పముల నుండి విముక్తుడగుచున్నాడో, అట్టివాడు ఆత్మ యొక్క మహామహిమను గుర్తించి సర్వశోకముల నుండి రక్షింపబడుచున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 836🌹

🌻836. Br‌hat🌻

OM Br‌hate namaḥ


बृहत्वात् बृंहणत्वाच्च बह्मैव बृहदुच्यते ।
महतो महीयानितिश्रुतिवाक्यानुसारतः ॥

Br‌hatvāt br‌ṃhaṇatvācca bahmaiva br‌haducyate,
Mahato mahīyānitiśrutivākyānusārataḥ.


From the roots 'Br‌ṃhati' and 'Br‌ṃhayati', it is understood that consciousness grows in the form of world and also causes growth in beings and hence being big and growing to infinitude - Brahman is Br‌hat.


:: कठोपनिषत् (प्रथमाध्यायमु) वल्लि २ ::

अणोरणीयान्महतो महीयानात्माऽस्य जन्तोर्निहतो गुहायाम् ।
तमक्रतुः पश्यति वीतशोको धातुप्रसादान्महिमानमात्मनः ॥ २० ॥ (४९)


Kaṭhopaniṣat Part I, Canto II

Aṇoraṇīyānmahato mahīyānātmā’sya jantornihato guhāyām,
Tamakratuḥ paśyati vītaśoko dhātuprasādānmahimānamātmanaḥ. 20. (49)


The Self that is subtler than the subtle and greater than the great, is lodged in the heart of every creature. A desire less man sees that glory of the Self through serenity of the organs, and thereby he becomes free from sorrow.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,
Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥



Continues....

🌹 🌹 🌹 🌹




కపిల గీత - 244 / Kapila Gita - 244


🌹. కపిల గీత - 244 / Kapila Gita - 244 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 09 🌴

09. గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేష్వతంద్రితః|
కుర్వన్ దుఃఖప్రతీకారం సుఖవన్మన్యతే గృహీ॥


తాత్పర్యము : గృహస్థుడు దుఃఖకారకములైన కుహనాధర్మముల ఆచరణలో మునుగు చుండును. ఒక్కొక్కసారి ఆ దుఃఖముల నివారణకై తాను చేయు ప్రయత్నములో కృతకృత్యుడైనచో, అతడు దానిని సుఖమని భావించును.

వ్యాఖ్య : భగవద్గీతలో భగవంతుని యొక్క వ్యక్తిత్వం స్వయంగా భౌతిక ప్రపంచాన్ని కష్టాలతో నిండిన అశాశ్వతమైన ప్రదేశంగా ధృవీకరించింది. ఈ భౌతిక ప్రపంచంలో వ్యక్తిగతంగా లేదా కుటుంబం, సమాజం లేదా దేశం పరంగా ఆనందానికి సంబంధించిన ప్రశ్నే లేదు. సంతోషం పేరుతో ఏదైనా జరిగితే అది కూడా భ్రమే. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో, ఆనందం అంటే బాధల ప్రభావాలకు విజయవంతమైన ప్రతిఘటన. భౌతిక ప్రపంచం చాలా బాగా తయారు చేయబడింది, ఎవరైనా తెలివైన దౌత్యవేత్త కాకపోతే, అతని జీవితం వైఫల్యం అవుతుంది. మానవ సమాజం గురించి చెప్పనవసరం లేదు, దిగువ జంతువులు, పక్షులు మరియు తేనెటీగల సమాజం వంటివి కూడా, తినడం, నిద్రించడం మరియు సంభోగం చేయడం వంటి శారీరక అవసరాలను తెలివిగా నిర్వహిస్తుంది. మానవ సమాజం జాతీయంగా లేదా వ్యక్తిగతంగా పోటీపడుతుంది మరియు విజయం సాధించే ప్రయత్నంలో మొత్తం మానవ సమాజం దౌత్యంతో నిండి ఉంటుంది. మన అస్తిత్వ పోరాటంలో పూర్తి దౌత్యం మరియు అన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ, సర్వోన్నత సంకల్పం ద్వారా ప్రతిదీ సెకనులో ముగుస్తుందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండాలనే మన ప్రయత్నాలన్నీ మాయ అందించే మాయ మాత్రమే.



సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 244 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 09 🌴

09. gṛheṣu kūṭa-dharmeṣu duḥkha-tantreṣv atandritaḥ
kurvan duḥkha-pratīkāraṁ sukhavan manyate gṛhī

MEANING : The attached householder remains in his family life, which is full of diplomacy and politics. Always spreading miseries and controlled by acts of sense gratification, he acts just to counteract the reactions of all his miseries, and if he can successfully counteract such miseries, he thinks that he is happy.

PURPORT : In Bhagavad-gītā the Godhead Himself certifies the material world as an impermanent place that is full of miseries. There is no question of happiness in this material world, either individually or in terms of family, society or country. If something is going on in the name of happiness, that is also illusion. Here in this material world, happiness means successful counteraction to the effects of distress. The material world is so made that unless one becomes a clever diplomat, his life will be a failure. Not to speak of human society, even the society of lower animals, the birds and bees, cleverly manages its bodily demands of eating, sleeping and mating. Human society competes nationally or individually, and in the attempt to be successful the entire human society becomes full of diplomacy. We should always remember that in spite of all diplomacy and all intelligence in the struggle for our existence, everything will end in a second by the supreme will. Therefore, all our attempts to become happy in this material world are simply a delusion offered by māyā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 03, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

🍀. వామన జయంతి శుభాకాంక్షలు అందరికి, Vamana Jayanthi Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻


🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 23 🍀

46. ఋణత్రయహరః సూక్ష్మః స్థూలః సర్వగతిః పుమాన్ |
అపస్మారహరః స్మర్తా శ్రుతిర్గాథా స్మృతిర్మనుః

47. స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం యతీశ్వరః |
నాదరూపం పరం బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మపురాతనః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : గురుశిష్యుల మధ్య ఆదాన ప్రదానాలు

ఇచ్చేది స్వీకరించ గల స్థితిలో శిష్యుడుంటే, ఇవ్వడానికి నిజమైన గురువెప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. స్వీకరించడానికి శిష్యుడు విముఖంగా ఉన్నా, లేక స్వీకరణకు అవరోధమైన విధంగా బాహ్యమున గాని, అంతరమున గాని అతని ప్రవర్తనమున్నా, లేక అంతశ్శుద్ధి అనునది అతనిలో

లేకపోయినా గురు శిష్యులమధ్య ఆదాన ప్రదానాలు జరగడం దుష్కరం.🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

భాద్రపద మాసం

తిథి: కృష్ణ చవితి 06:13:26 వరకు

తదుపరి కృష్ణ పంచమి

నక్షత్రం: కృత్తిక 18:05:24 వరకు

తదుపరి రోహిణి

యోగం: వజ్ర 08:17:06 వరకు

తదుపరి సిధ్ధి

కరణం: బాలవ 06:12:26 వరకు

వర్జ్యం: 06:14:30 - 07:49:06

దుర్ముహూర్తం: 08:29:55 - 09:17:44

రాహు కాలం: 15:04:22 - 16:34:01

గుళిక కాలం: 12:05:04 - 13:34:43

యమ గండం: 09:05:47 - 10:35:26

అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28

మృత కాలం: 15:42:06 - 17:16:42

సూర్యోదయం: 06:06:30

సూర్యాస్తమయం: 18:03:40

చంద్రోదయం: 21:08:28

చంద్రాస్తమయం: 09:46:11

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: గద యోగం - కార్య హాని,

చెడు 18:05:24 వరకు తదుపరి

మతంగ యోగం - అశ్వ లాభం

దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹