🍀 12 - DECEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 12 - DECEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 12 - DECEMBER - 2022 MONDAY,సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 103 / Kapila Gita - 103 🌹 సృష్టి తత్వము - 59
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 695 / Vishnu Sahasranama Contemplation - 695 🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 142 / Agni Maha Purana - 142 🌹 🌻. ఆలయ ప్రాసాద దేవతా స్థాపన శాంత్యాది వర్ణనము - 5 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 277 / Osho Daily Meditations - 277 🌹. మారనిది - UNCHANGING
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 418 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 418 - 3 🌹 'జడశక్తిః' - 3 'Jadashaktih' - 3 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹12, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
 *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 11 🍀*

*19. కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః |*
*నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః*
*20. బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః |
*నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పాపపుణ్యాలు - మనలను బానిసగా చేసుకొనే అలవాటే పాపమనేది. అట్లే పుణ్యమనేది కేవలం మానవునకు కలిగిన ఒక అభిప్రాయం. కనుక నీవు నేరుగా భగవంతుని దర్శించి, ఆయన సంకల్పానుసారం ఏ మార్గం నీకు నిర్దిష్టమైతే ఆ మార్గం అనుసరించు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: కృష్ణ చవితి 18:50:04 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: పుష్యమి 23:36:41 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: ఇంద్ర 30:07:13 వరకు
తదుపరి వైధృతి
కరణం: బాలవ 18:49:05 వరకు
వర్జ్యం: 05:36:40 - 07:24:36
దుర్ముహూర్తం: 12:31:47 - 13:16:14
మరియు 14:45:07 - 15:29:34
రాహు కాలం: 07:59:34 - 09:22:54
గుళిక కాలం: 13:32:54 - 14:56:14
యమ గండం: 10:46:14 - 12:09:34
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:31
అమృత కాలం: 16:24:16 - 18:12:12
మరియు 24:45:12 - 26:33:00
సూర్యోదయం: 06:36:14
సూర్యాస్తమయం: 17:42:53
చంద్రోదయం: 21:15:20
చంద్రాస్తమయం: 09:55:31
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు : ధాత్రి యోగం - కార్య జయం
23:36:41 వరకు తదుపరి సౌమ్య యోగం
- సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 103 / Kapila Gita - 103🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 59 🌴*

*59. నాడ్యోఽస్య నిరభిద్యంత తాభ్యో లోహితమాభృతమ్|*
*నద్యస్తతః సమభవన్నుదరం నిరభిద్యత॥*

*ఈ విధముగా ఆ విరాట్ పురుషునకు నాడులు ఏర్పడెను. వాటి నుండి రక్తము, దాని నుండి నదులు ఆవిష్కృతములయ్యెను. తదుపరి ఉదరము ప్రకటమయ్యెను.*

*నాడులకు ఇంద్రియం రక్తమూ, అధిష్ఠాన దేవత నదులు. నదులు సక్రమముగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అందుకే నదీ స్నానం చేసే వారు. నదులు రక్తమునకు అధిష్ఠాన దేవత. మనలో రక్తం ప్రవహిస్తూ ఉన్నట్లే, భూగోళములో కూడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 103 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 59 🌴*

*59. nāḍyo 'sya nirabhidyanta tābhyo lohitam ābhṛtam*
*nadyas tataḥ samabhavann udaraṁ nirabhidyata*

*The veins of the universal body became manifested and thereafter the red corpuscles, or blood. In their wake came the rivers (the deities presiding over the veins), and then appeared an abdomen.*

*Blood veins are compared to rivers; when the veins were manifested in the universal form, the rivers in the various planets were also manifested. The controlling deity of the rivers is also the controlling deity of the nervous system. In Āyur-vedic treatment, those who are suffering from the disease of nervous instability are recommended to take a bath by dipping into a flowing river.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 695 / Vishnu Sahasranama Contemplation - 695🌹*

*🌻695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ🌻*

*ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ*

*వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ*

*వసుదేవస్య తనయో వాసుదేవ ఇతీర్యతే*

*వసుదేవుని పురుష సంతానము అనగా తనయుడు కనుక వాసుదేవః.*

:: పోతన భాగవతము - దశమ స్కంధము ::
మఱియుం గృష్ణు నుద్దేశించి తొల్లి యీ శిశువు ధవళారుణ పీతవర్ణుండై యిప్పుడు నల్లనైన కతంబునఁ గృష్ణుం డయ్యె, వసుదేవునకు నొక్కెడ జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యె, నీ పాపనికి గుణరూపకర్మంబు అనేకంబులు గలుగుటంజేసి నామంబు లనేకంబులు గలవు. ఈ శాబకుని వలన మీరు దుఃఖంబులఁ దరియింతు, రీ యర్భకునిచేత దుర్జనశిక్షణంబును సజ్జనరక్షణంబును నగు, నీ కుమారుండు నారాయణ సమానుండని చెప్పి తన గృహమ్మున క మ్మునీశ్వరుండు సనియె. నందుండును బరమానందంబున నుండె నంత. (288)

*తరువాత గర్గ మహర్షి యశోదా కుమారుని ఉద్దేశించి ఇల అన్నాడు - "ఈ శిశువు పూర్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లనైనాడు కనుక 'కృష్ణు'డని పిలవండి. ఇతడు వసుదేవునకు జన్మించినవాడుగనుక 'వాసుదేవుడు' అని పేరుగూడ చెల్లుతుంది. ఈ బిడ్డడికి గుణములు, రూపములు, కర్మములు ఎన్నో ఉండడంవల్ల ఇంకా ఎన్నో పేర్లు వహిస్తాడు. ఈ బాలునివలన మీరు అన్ని దుఃఖములను అతిక్రమించుతారు. వీని చేత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణా జరుగుతాయి. నాయనా! నీ కుమారుడు నారాయణునితో సమానుడు సుమా! అని చెప్పి గర్గ మహాముని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మహానుభావుడైన ఋషీంద్రుడు తన కుమారుని గురించి మంచిమాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు.*

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 695🌹*

*🌻695. Vāsudevaḥ🌻*

*OM Vāsudevāya namaḥ*

वसुदेवस्य तनयो वासुदेव इतीर्यते / 
*Vasudevasya tanayo vāsudeva itīryate*

*Since He is Vasudeva's son, He is called Vāsudevaḥ.*

:: श्रीमद्भागवते दशमस्कन्धे अष्टमोऽध्यायः ::
प्रागयं वसुदेवस्य क्वचिज्जातस्त्वात्मजः ।
वासुदेव इति श्रीमानभिज्ञाः सम्प्रचक्षते ॥ १४ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 8
Prāgayaṃ vasudevasya kvacijjātastvātmajaḥ,
Vāsudeva iti śrīmānabhijñāḥ saṃpracakṣate. 14.

*Garga Muni indirectly disclosed, “This child was originally born as the son of Vasudeva, although He is acting as your child. Generally He is your child, but sometimes He is the son of Vasudeva.”*

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥
Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 142 / Agni Maha Purana - 142 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 44*

*🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 1🌻*

హయగ్రీవుడు చెప్పెను. ఇపుడు వాసుదేవాది ప్రతిమల లక్షణము చెప్పదను వినుము. ఆలయమును పూర్వాభిముఖముగ గాని, ఉత్తరాభి ముఖముగగాని శిలనుంచి, దానికి పూజచేసి. శిల్పి, ఆ శిలకు మధ్య సూత్రముంచి దానిని తొమ్మిది భాగములు చేయవలెను. తొమ్మిదవ భాగమును గూడ పండ్రెండు భాగములుగ విభజించిన పిమ్మట ఒక్కొక్క భాగము అతని అంగుళముతో ఒక్క అంగుళముండును. రెండు అంగుళముము ''గోలకము'' దీనికి ''కాలనేత్ర'' మని కూడ పేరు. 

పైన చెప్పిన తొమ్మిది భాగములలో ఒక భాగమును మూడు భాగములుగా విభజించి దానితో సీలమండలుగా చేయవలెను. ఒక భాగము మోకాలు కొరకు, మరొక భాగము కంఠము కొరకు నిశ్చయించ ఉంచుకొనవలెను. ముకుటమునకు ఒక జానెడు, ముఖమునకు ఒక జానెడు, కంఠమునకు ఒక జానెడు, హృదయమునకై ఒక జానెడు ఉంచవలెను. నాభికిని, లింగమునకు మధ్య ఒక జానెడు దూరముండవలెను. తొడలు రెండు జానలు కాళ్ళు రెండు జానలు ఉండవలెను. ఇపుడు సూత్రముల కొలతను వినుము - పాదములపై రెండు సూత్రములు, కాళ్ళపై రెండు సూత్రములు, మోకాళ్ళపై రెండు సూత్రములు రెండు తొడలపై రెండేసి సూత్రములు ఉపయోగింపవలెను. 

లింగముపై మరి రెండు సూత్రములు కటి ప్రదేశముపై నడుము నిర్మించుటకు మరి రెండు సూత్రములును ఉపయోగింపవలెను. నాభి యందు కూడ రెండు సూత్రములు ఉపయోగింపవలెను. అట్లే హృదయమునందును. కంఠము నందును రెండు సూత్రము లుంచవలెను. లలాటముపై మరి రెండు సూత్రములు, శిరస్సుపై మరి రెండు సూత్రములు ఉపయోగంచవలెను. బుద్ధిమంతుడైన శిల్పి ముకుటముపై ఒక సూత్రముంచవలెను. పైన ఏడు సూత్రములు మాత్రమే ఉంచవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 142 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 44*
*🌻Characteristics of the image of Vāsudeva - 1 🌻*

The Lord said:

1-2. I shall describe to you the characteristics of the image of Vāsudeva and other gods. Having placed the stone to the north of the temple facing either the east or the north and worshipped it, the sculptor should divide the stone into nine parts along the central line after making the offering.

3. In the twelve divisions (of the line) a division is said to be an aṅgula (a finger breadth). Two aṅgulas are known to be a golaka. It is also said to be a kālanetra.

4. Having divided one of the nine divisions into three, (with one part) the region of the calves should be made. In the same way a part is to be used for the knees and part for the neck.

5. The crown should be of a measure of a tāla (12 aṅgulas). In the same way the face (should be) of the measure of a tāla. The neck and heart should also be a tāla each.

6. The navel and the genital part should be a tāla apart. (The length) of the thighs should be two tālas. (The length) of the part from the ankle to the knee should be two tālas. Listen now to (the description) (of the drawing) of lines (on the body).

7. Two lines should be drawn on the foot, and (two) more in between the calves (and knees). Two lines about the kneesand two more in between the thighs and the knees should be drawn.

8. One line should be drawn over the genital part, and one more about the waist. Another (line) (should) then (be drawn) above the navel for accomplishing the girdle.

9. Then (a line) should be drawn on the heart and two lines on the neck. One such line should be drawn on the forehead and one more on the head.

10. One more line should be drawn on the crown by the learned. O Brahman! seven vertical lines should be drawn.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 277 / Osho Daily Meditations - 277 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 277. మారనిది 🍀*

*🕉. మీరు క్షణికం కాదు, శాశ్వతం, మారుతున్న వారు కాదు, మార్పులేని వారు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. 🕉*

*ఒక పువ్వులో రెండు భాగాలు ఉన్నాయి: రూపం - ఆపైది, రూపం వెనుక దాగి ఉంటుంది, నిరాకారమైనది. ఇది మారదు. కానీ శరీర భాగాన్ని నిరంతరం మారుస్తూ ఉంటుంది. పువ్వులు వస్తాయి మరియు పోతాయి. కానీ వాటి అందం అలాగే ఉంటుంది. కొన్నిసార్లు అది ఒక రూపంలో వ్యక్తమవుతుంది, కొన్నిసార్లు అది నిరాకారమైనదిగా మారుతుంది. మళ్ళీ పువ్వులు ఉంటాయి మరియు అందం తనను తాను నొక్కి చెబుతుంది. పువ్వులు వాడిపోతాయి మరియు అందం అవ్యక్తంగా మారుతుంది.*

*మనుషుల్లో, పక్షుల్లో, జంతువులతో, ప్రతి విషయంలోనూ అదే జరుగుతోంది. మనకు రెండు కోణాలు ఉన్నాయి: మనం వ్యక్తమయ్యే పగటి భాగం మరియు మనం వ్యక్తీకరించ బడనప్పుడు రాత్రి భాగం. కానీ మనం శాశ్వతం. మనం ఎల్లప్పుడూ ఉన్నాము మరియు మనం ఎల్లప్పుడూ ఉంటాము. ఉండటం కాలానికి మించినది. అది మార్పుకు అతీతం. ప్రారంభంలో ఇది ఇలా ఉండవచ్చు అని గుర్తుంచుకోండి, అప్పుడు మీరు దాని వాస్తవికతను అనుభవించడం ప్రారంభిస్తారు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 277 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 277. UNCHANGING 🍀*

*🕉. Always remember that you are not the momentary but the eternal, not the changing but the unchanging. 🕉*

*In a flower there are two constituents: one that is constantly changing the body part, the form-and then, hidden behind the form, the formless, which is unchanging. Flowers come and go, but their beauty remains. Sometimes it is manifested in a form, sometimes it dissolves back into the formless. Again there will be flowers, and beauty will assert itself. Then the flowers will fade and the beauty will move into the unmanifest.*

*And the same is happening with human beings, with birds, with animals, with everything. We have two dimensions: the day part when we become manifested, and the night part when we become unmanifested--but we are eternal. We have been always, and we will be always. Being is beyond time and beyond change. In the beginning just remember it "as if:' then you will start feeling the reality of it.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 418 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 418 -3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*

*🌻 418. 'జడశక్తిః' - 3🌻* 

*మానవ శరీరమున ఎముకలే అత్యంత ఘనమగు పదార్థము. ఈ ఆవరణ లన్నియూ వాని వాని శక్తులు కలిగి యున్నవి. ఇవన్నియూ జడముచే ఆవరింపబడిన శక్తులే. ఇట్లు చిత్ శక్తి, జడశక్తి రెండు శక్తులను వినియోగించుచు శ్రీమాత ఏడు లోకముల నేర్పరచును. వీరే శ్రీ భూ దేవతలు. చిత్ శక్తి ఎంత అవసరమో, సృష్టికార్యమున జడశక్తి కూడ అంతయే అవసరము. నిజమునకు శ్రీమాతయే రెండుగ భాసించు చున్నది. ఆవిరి, నీరు, మంచుగడ్డవలె అవరోహణ క్రమమును మరల మంచుగడ్డ నీరు ఆవిరి వలె ఆరోహణ క్రమము నేర్పరచును. ఇందు జీవులు వారి వారి చైతన్య స్థితిని బట్టి ఏడు లోకములందు వసించు చుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 418 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*

*🌻 418. 'Jadashaktih' - 3🌻*

*Bones are the hardest material in the human body. All these layers have their own powers. All these are forces have inherent inertia. By using Chit Shakti ( life energy )and Jada Shakti (inertia), Sri Mata creates and rules the seven worlds. These are Sri Bhu Devas. As much as Chit Shakti is needed, so too is Jada Shakti in creation. The truth is that Srimata is twofold. Steam, water and ice follow descending order and ice follows ascending order as water and steam. Living beings live in the seven worlds according to their state of consciousness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శివ సూత్రములు - 09 - 3. యోనివర్గః కళాశరీరం - 4 / Siva Sutras - 09 - 3. Yonivargaḥ kalāśarīram - 4


🌹. శివ సూత్రములు - 09 / Siva Sutras - 09 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻3. యోనివర్గః కళాశరీరం - 4 🌻

🌴. ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలే విశ్వం యొక్క సంపూర్ణ దేహం.🌴


కర్మ మలం మరియు మాయ మలం కలిసి బ్రహ్మాన్ని గ్రహించడంలో నిరోధక కారకంగా పనిచేస్తాయి. పూర్వ జన్మల ముద్రల వల్ల కర్మ మలం పుడుతుంది. మాయ మలం అనేది పరిమితుల ప్రభావాన్ని కలిగించడం ద్వారా ఆత్మను బ్రహ్మాన్ని గ్రహించకుండా చేస్తుంది.

ఈ సూత్రం మునుపటి సూత్రంలో చర్చించబడిన అజ్ఞానానికి గల కారణాన్ని మరింత వివరిస్తుంది. పునరావృతమయ్యే జనన మరణాల బాధలు మరియు బాధలతో బాధపడడం వల్ల ఆత్మ తన విముక్తి కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంది. శివ సూత్రాలు క్రమంగా పురోగమిస్తాయి, మొదట పరిభాషలను వివరిస్తాయి మరియు తరువాత సాక్షాత్కారానికి మార్గం సుగమం చేస్తాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Siva Sutras - 09 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻3. Yonivargaḥ kalāśarīram - 4 🌻

🌴The multitude of similar origins is the body of parts of the whole.🌴



Kārma mala and māyīya mala together act as a deterrent factor in realising the Brahman. Kārma mala arises because of the impressions of the previous births and māyīya mala prevents the soul to realise the Brahman, by causing the effect of limitations.

This sūtrā further explains the cause for ignorance discussed in the previous sūtrā. The soul eagerly awaits its final liberation, as it continues to suffer from the pains and miseries of repeated births and deaths. Śiva sūtrās progresses gradually, first outlining the terminologies and later paving the way for realisation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 272


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 272 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మన లోపలి అన్వేషణ, ఆరాటం శాశ్వతమైన దాని కోసం. అది బాహ్యమయిన దానితో పూరింప బడదు. కాబట్టి సందర్భాన్ని బట్టి బాహ్యంతో ఆనందంగా వుండు. క్షణికమైన దాన్ని ఆనందించు. శాశ్వతమైన దాన్ని అన్వేషించు. 🍀


బాహ్య ప్రపంచం తృప్తి పరచలేదు కారణం అది మారే ప్రపంచం, క్షణికం. కానీ మన లోపలి అన్వేషణ, ఆరాటం శాశ్వతమైన దాని కోసం. అది బాహ్యమయిన దానితో పూరింప బడదు. కాబట్టి సందర్భాన్ని బట్టి బాహ్యంతో ఆనందంగా వుండు. కాని దాన్ని శాశ్వతంగా వుండమని కోరకు. బాహ్యంలో ఏదీ శాశ్వతం కాదు. ఆ క్షణము జరిగిన దాన్ని ఆ సందర్భంలో ఆనందించు. కానీ అది క్షణమే అని గ్రహించు.

పువ్వు వుదయాన్నే విచ్చుకుని సాయంత్రానికి వాడిపోతుంది. సూర్యోదయానికి వస్తుంది. సూర్యాస్తమయంతో నిష్క్రమిస్తుంది. కాబట్టి ఆనందించు! ఐతే గుర్తుంచుకో. దానికి అతుక్కుపోకు. ఆశించకు. బాహ్యాన్ని ఆనందించు. లోపలి దాన్ని అన్వేషించు. క్షణికమైనదాన్ని ఆనందించు. శాశ్వతమైన దాన్నిఅన్వేషించు. లోపల నీకు అమృతం, తేనె, శాశ్వతత్వం, మరణరహితం, దైవత్వం కనిపిస్తుంది. అప్పుడు వాటిని దర్శించిన నీకు పరవశం, ఆనందం కలుగుతాయి. జీవితం పరిపూర్ణమవుతుంది. వ్యక్తి తన స్వగృహానికి చేరుతాడు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 07 - 7. మార్పు అనేది . . . / DAILY WISDOM - 07 - 7. Change is . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 07 / DAILY WISDOM - 07 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 7. మార్పు అనేది అసత్యం యొక్క లక్షణం 🌻


మార్పు అనేది అసత్యం యొక్క లక్షణం. సత్యం అనేది స్వీయ-సంతృప్తి కలిగివున్నది, స్వయం-అస్తిత్వం కలిగివున్నది, నిర్ద్వంద్వమైనది, ప్రశాంతత మరియు పూర్తిగా పరిపూర్ణమైనది అని ఉపనిషత్తులు నొక్కి చెబుతున్నాయి. ఉపనిషత్తులు చైతన్యం అంతర్ముఖం అయ్యి అనంతానికి విస్తరించడానికి దోహదపడతాయి.

ఈ విషయంలో ఉపనిషత్తులు చాలా మార్మికమైనవి. మార్మికత అంటే అహెతుకత కలిగివుంటుందని లేదా విపరీత భావనలు కలిగి ఉంటాయని అని అపార్థం చేసుకోకూడదు. ఉపనిషత్తుల యొక్క మార్మికత ఏంటంటే అవి మీలో కేవలం ఒక భావోద్వేగానికి దారితీయకుండా మీ చైతన్యాన్ని అంచెలంచెలుగా మీ మనస్సును, బుద్ధిని దాటించి ఉన్నత చైతన్యంతో ఏకీకృతం చేయడం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 7 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj

🌻 7. Change is the Quality of Untruth 🌻


Change is the quality of untruth and the Upanishads assert that Reality is Self-satisfied, Self-existent, non-dual, tranquil and utterly perfect. An appeal to the inwardness of consciousness expanded into limitlessness is the burden of the song of the Upanishads.

In this respect the Upanishads are extremely mystic, if mysticism does not carry with it an idea of irrationalism or a madness of spirit. The transcendental mysticism of the Upanishads is not the effect of an emotional outburst, but a calm transcendence of intellect and reason through a development into the integral consciousness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 656 / Sri Siva Maha Purana - 656

🌹 . శ్రీ శివ మహా పురాణము - 656 / Sri Siva Maha Purana - 656 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴

🌻. గణేశ శిరశ్ఛేదము - 3 🌻

విష్ణువు ఇట్లు పలుకుచుండగనే పార్వతీ తనయుడగు గణేశుడు పరిఘను త్రిప్పి విష్ణువు పైకి విసిరెను (28). అపుడు విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి చక్రమును చేత బట్టి ఆ చక్రముతో వెంటనే పరిఘను ముక్కలు చేసెను (29). ఆ గణేశుడు పరిఘ ముక్కను విష్ణువుపైకి విసిరెను. గరుడపక్షి దానిని పట్టుకొని వ్యర్ధము చేసెను (30). ఈ విధముగా మహావీరులగు విష్ణు గణేశులిద్దరు ఆయుధములను ఒకరిపై నొకరు ప్రయోగించుచూ చిరకాలము యుద్ధమును చేసిరి (31).

గొప్ప వీరుడు, బలశాలి అగు పార్వతీ తనయుడు తల్లిని స్మరించి సాటిలేని కర్రను మరల చేతబట్టి దానితో విష్ణువును కొట్టెను (32). ఆ దెబ్బకు తాళలేక అతడు నేలపై బడెను. ఆయన మరల వెంటనే లేచి పార్వతీ పుత్రునితో యుద్ధమును చేసెను (33). ఈ అవకాశమును పరికించి శివుడు శూలమును చేతబట్టి చొచ్చుకుని వచ్చి త్రిశూలముతో అతని శిరస్సును పెరికి వేసెను (34). ఓ నారదా! ఆ గణేశుని శిరస్సు నరుకబడుటను గాంచిన గణసైన్యము మరియు దేవసైన్యము లేశమైననూ కదలిక లేకుండ నుండెను (35).

అపుడు నీవు వెళ్లి పార్వతీ దేవికి వృత్తాంతమునంతయూ విన్నవించితివి. ఓ మానవతీ! వినుము. ఇపుడు నీవు అభిమనమును ఎట్టి పరిస్థితులలోనైననూ వీడరాదు (26). ఓ నారదా! కలహప్రియుడవగు నీవు ఇట్లు పలికి అచట అంతర్హితుడవైతివి. నీవు వికారములు లేనట్టియు, ఎల్లవేళలా మనస్సులో శివుని స్మరించే మహర్షివి (37).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో గణేశ శిరశ్ఛేదమనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 656🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴

🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 4 🌻


28. Gaṇeśa, son of the Śaktis whirled the iron club and hurled it at Viṣṇu even as he was saying so.

29. After remembering the lotus-like feet of Śiva, Viṣṇu took up his discus and split the iron club by means of discus.

30. Gaṇeśa hurled the piece of iron club at Viṣṇu which was caught by the bird Garuḍa and rendered futile.

31. Thus for a long time the two heroes Viṣṇu and Gaṇeśa fought with each other.

32. Again the foremost among heroes, the son of Pārvatī took up his staff of unrivalled power remembering Śiva and struck Viṣṇu with it.

33. Struck with that unbearable blow he fell on the ground. But he got up, quickly and fought with Pārvatī’s son.

34. Securing this opportunity, the Trident-bearing deity came there and cut off his head with his trident.

35. O Nārada, when the head of Gaṇeśa was cut off, the armies of the gods and the Gaṇas stood still.

36. You, Nārada, then came and acquainted Pārvatī with the matter—“O proud woman, listen. You shall not cast off your pride and prestige.”

37. O Nārada, saying this, you, fond of quarrels, vanished from there. You are the unchanging sage and a follower of the inclinations of Śiva.


Continues....

🌹🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత - 295: 07వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 295: Chap. 07, Ver. 15

 

🌹. శ్రీమద్భగవద్గీత - 295/ Bhagavad-Gita - 295 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 15 🌴

15. న మాం దుష్కృతినో మూఢా: ప్రపద్యన్తే నరాధమా: |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితా: ||



🌷. తాత్పర్యం :

దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడినవారు, దానవప్రవృత్తియైన నాస్తికస్వభావమును కలిగియుండువారు నా శరణము నొందరు.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణకమలములకు కేవలము శరణమునొందుట ద్వారా మనుజుడు అతికఠినమైన ప్రకృతినియమములను దాటగాలడని భగవద్గీత యందు తెలుపబడినది. అట్టి యెడ విద్యావంతులైన తాత్త్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్థులు, పాలకులు, సామాన్యజనుల నేతలు పలువురు ఎందులకు సర్వశక్తిసంపన్నుడైన శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణుజొచ్చరనెడి ప్రశ్న ఇచ్చట ఉదయించును. మానవులకు మార్గదర్శకులైనవారు పలురీతులలో గొప్ప ప్రణాలికలు మరియు పట్టుదలతో ముక్తిని (ప్రకృతి నియమముల నుండి విడుదల) బడయుటకై పలు సంవత్సరములు లేదా జన్మలు యత్నింతురు. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణకమలములకు కేవలము శరణము నొందుట ద్వారా ముక్తి సాధ్యమగుచున్నప్పుడు మేధావులు మరియు కష్టించువారును అగు నాయకులు ఎందులకై ఈ సులభవిధానము ఎన్నుకొనుటలేదు?

ఈ ప్రశ్నకు భగవద్గీత స్పష్టముగా సమాధానమొసగుచున్నది. మానవులకు వాస్తవముగా మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాదిఋషులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలిమహారాజు, తదనంతరము వారైన మధ్వాచార్యులు, రామానజాచార్యులు, శ్రీచైతన్యమాహాప్రభువు మరియు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, ప్రజానేతలు, విద్యాబోధకులు, శాస్త్రజ్ఞుల వంటివారు సర్వశక్తిసమన్వితుడు మరియు ప్రామాణికుడును అగు శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణము నొందియేయున్నారు. కేవలము నిజమైన తత్త్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కానివారు మాత్రమే విషయాభిలాషులై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు ఆ భగవానుని ప్రణాళికను గాని, మార్గమును గాని అంగీకరించుట లేదు. వారు భగవానుని గూర్చిన అవగాహన ఏమియునులేక కేవలము లోకవ్యవహార ప్రణాళికలను మాత్రము పలుజేయుచు, భౌతికస్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింత వృద్ధిచేసికొందురు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 295 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 15 🌴

15. na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ
māyayāpahṛta-jñānā āsuraṁ bhāvam āśritāḥ



🌷 Translation :

Those miscreants who are grossly foolish, who are lowest among mankind, whose knowledge is stolen by illusion, and who partake of the atheistic nature of demons do not surrender unto Me.

🌹 Purport :

It is said in Bhagavad-gītā that simply by surrendering oneself unto the lotus feet of the Supreme Personality Kṛṣṇa one can surmount the stringent laws of material nature. At this point a question arises: How is it that educated philosophers, scientists, businessmen, administrators and all the leaders of ordinary men do not surrender to the lotus feet of Śrī Kṛṣṇa, the all-powerful Personality of Godhead? Mukti, or liberation from the laws of material nature, is sought by the leaders of mankind in different ways and with great plans and perseverance for a great many years and births. But if that liberation is possible by simply surrendering unto the lotus feet of the Supreme Personality of Godhead, then why don’t these intelligent and hard-working leaders adopt this simple method?

The Gītā answers this question very frankly. Those really learned leaders of society like Brahmā, Śiva, Kapila, the Kumāras, Manu, Vyāsa, Devala, Asita, Janaka, Prahlāda, Bali, and later on Madhvācārya, Rāmānujācārya, Śrī Caitanya and many others – who are faithful philosophers, politicians, educators, scientists, etc. – surrender to the lotus feet of the Supreme Person, the all-powerful authority. Those who are not actually philosophers, scientists, educators, administrators, etc., but who pose themselves as such for material gain, do not accept the plan or path of the Supreme Lord. They have no idea of God; they simply manufacture their own worldly plans and consequently complicate the problems of material existence in their vain attempts to solve them.

🌹 🌹 🌹 🌹 🌹



11 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹11, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi🌻

🍀. ఆదిత్య స్తోత్రం - 13 🍀


13. అభ్రాకల్పః శతాఙ్గః స్థిరఫణితిమయం మణ్డలం రశ్మిభేదాః
సాహస్రాస్తేషు సప్త శ్రుతిభిరభిహితాః కిఞ్చిదూనాశ్చ లక్షాః |

ఏకైకేషాం చతస్రస్తదను దినమణేరాది దేవస్య తిస్రః
క్లుప్తాః తత్తత్ప్రభావప్రకటన మహితాః స్రగ్ధరా ద్వాదశైతాః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : సన్యాసి ధరించే కాషాయ వస్త్రాలను గౌరవించు. కాని, దానితోపాటు ఆ వస్త్రధారిని సైతం పరిశీలించి చూడు. ఏలనంటే, మిథ్యాచారం పవిత్ర స్థలాలలోనికి చొరబడవచ్చు. అంతర్దృష్టితో కూడిన ఆత్మనైర్మల్య మనేది వట్టి కట్టుకథగా తయారు కావచ్చు.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: కృష్ణ తదియ 16:16:51 వరకు

తదుపరి కృష్ణ చవితి

నక్షత్రం: పునర్వసు 20:37:40 వరకు

తదుపరి పుష్యమి

యోగం: బ్రహ్మ 29:15:23 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: విష్టి 16:15:51 వరకు

వర్జ్యం: 07:09:30 - 08:57:10

మరియు 29:36:40 - 31:24:36

దుర్ముహూర్తం: 16:13:38 - 16:58:05

రాహు కాలం: 16:19:11 - 17:42:32

గుళిక కాలం: 14:55:49 - 16:19:11

యమ గండం: 12:09:06 - 13:32:28

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:31

అమృత కాలం: 17:55:30 - 19:43:10

సూర్యోదయం: 06:35:40

సూర్యాస్తమయం: 17:42:32

చంద్రోదయం: 20:22:55

చంద్రాస్తమయం: 09:09:58

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి

20:37:40 వరకు తదుపరి శ్రీవత్స

యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹