నిర్మల ధ్యానాలు - ఓషో - 272
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 272 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మన లోపలి అన్వేషణ, ఆరాటం శాశ్వతమైన దాని కోసం. అది బాహ్యమయిన దానితో పూరింప బడదు. కాబట్టి సందర్భాన్ని బట్టి బాహ్యంతో ఆనందంగా వుండు. క్షణికమైన దాన్ని ఆనందించు. శాశ్వతమైన దాన్ని అన్వేషించు. 🍀
బాహ్య ప్రపంచం తృప్తి పరచలేదు కారణం అది మారే ప్రపంచం, క్షణికం. కానీ మన లోపలి అన్వేషణ, ఆరాటం శాశ్వతమైన దాని కోసం. అది బాహ్యమయిన దానితో పూరింప బడదు. కాబట్టి సందర్భాన్ని బట్టి బాహ్యంతో ఆనందంగా వుండు. కాని దాన్ని శాశ్వతంగా వుండమని కోరకు. బాహ్యంలో ఏదీ శాశ్వతం కాదు. ఆ క్షణము జరిగిన దాన్ని ఆ సందర్భంలో ఆనందించు. కానీ అది క్షణమే అని గ్రహించు.
పువ్వు వుదయాన్నే విచ్చుకుని సాయంత్రానికి వాడిపోతుంది. సూర్యోదయానికి వస్తుంది. సూర్యాస్తమయంతో నిష్క్రమిస్తుంది. కాబట్టి ఆనందించు! ఐతే గుర్తుంచుకో. దానికి అతుక్కుపోకు. ఆశించకు. బాహ్యాన్ని ఆనందించు. లోపలి దాన్ని అన్వేషించు. క్షణికమైనదాన్ని ఆనందించు. శాశ్వతమైన దాన్నిఅన్వేషించు. లోపల నీకు అమృతం, తేనె, శాశ్వతత్వం, మరణరహితం, దైవత్వం కనిపిస్తుంది. అప్పుడు వాటిని దర్శించిన నీకు పరవశం, ఆనందం కలుగుతాయి. జీవితం పరిపూర్ణమవుతుంది. వ్యక్తి తన స్వగృహానికి చేరుతాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment