🌹 . శ్రీ శివ మహా పురాణము - 656 / Sri Siva Maha Purana - 656 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴
🌻. గణేశ శిరశ్ఛేదము - 3 🌻
విష్ణువు ఇట్లు పలుకుచుండగనే పార్వతీ తనయుడగు గణేశుడు పరిఘను త్రిప్పి విష్ణువు పైకి విసిరెను (28). అపుడు విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి చక్రమును చేత బట్టి ఆ చక్రముతో వెంటనే పరిఘను ముక్కలు చేసెను (29). ఆ గణేశుడు పరిఘ ముక్కను విష్ణువుపైకి విసిరెను. గరుడపక్షి దానిని పట్టుకొని వ్యర్ధము చేసెను (30). ఈ విధముగా మహావీరులగు విష్ణు గణేశులిద్దరు ఆయుధములను ఒకరిపై నొకరు ప్రయోగించుచూ చిరకాలము యుద్ధమును చేసిరి (31).
గొప్ప వీరుడు, బలశాలి అగు పార్వతీ తనయుడు తల్లిని స్మరించి సాటిలేని కర్రను మరల చేతబట్టి దానితో విష్ణువును కొట్టెను (32). ఆ దెబ్బకు తాళలేక అతడు నేలపై బడెను. ఆయన మరల వెంటనే లేచి పార్వతీ పుత్రునితో యుద్ధమును చేసెను (33). ఈ అవకాశమును పరికించి శివుడు శూలమును చేతబట్టి చొచ్చుకుని వచ్చి త్రిశూలముతో అతని శిరస్సును పెరికి వేసెను (34). ఓ నారదా! ఆ గణేశుని శిరస్సు నరుకబడుటను గాంచిన గణసైన్యము మరియు దేవసైన్యము లేశమైననూ కదలిక లేకుండ నుండెను (35).
అపుడు నీవు వెళ్లి పార్వతీ దేవికి వృత్తాంతమునంతయూ విన్నవించితివి. ఓ మానవతీ! వినుము. ఇపుడు నీవు అభిమనమును ఎట్టి పరిస్థితులలోనైననూ వీడరాదు (26). ఓ నారదా! కలహప్రియుడవగు నీవు ఇట్లు పలికి అచట అంతర్హితుడవైతివి. నీవు వికారములు లేనట్టియు, ఎల్లవేళలా మనస్సులో శివుని స్మరించే మహర్షివి (37).
శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో గణేశ శిరశ్ఛేదమనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 656🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴
🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 4 🌻
28. Gaṇeśa, son of the Śaktis whirled the iron club and hurled it at Viṣṇu even as he was saying so.
29. After remembering the lotus-like feet of Śiva, Viṣṇu took up his discus and split the iron club by means of discus.
30. Gaṇeśa hurled the piece of iron club at Viṣṇu which was caught by the bird Garuḍa and rendered futile.
31. Thus for a long time the two heroes Viṣṇu and Gaṇeśa fought with each other.
32. Again the foremost among heroes, the son of Pārvatī took up his staff of unrivalled power remembering Śiva and struck Viṣṇu with it.
33. Struck with that unbearable blow he fell on the ground. But he got up, quickly and fought with Pārvatī’s son.
34. Securing this opportunity, the Trident-bearing deity came there and cut off his head with his trident.
35. O Nārada, when the head of Gaṇeśa was cut off, the armies of the gods and the Gaṇas stood still.
36. You, Nārada, then came and acquainted Pārvatī with the matter—“O proud woman, listen. You shall not cast off your pride and prestige.”
37. O Nārada, saying this, you, fond of quarrels, vanished from there. You are the unchanging sage and a follower of the inclinations of Śiva.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment