శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🌻 410. 'శివపరా'- 2 🌻

ప్రకృతి పురుషులలో ఇట్టి అవినాభావ అభేద స్థితి సతతముండును. ఇట్లు ఒకరి నొకరు మన్నించుకొనుట సృష్టియందు వీరిరువురి నుండియే ప్రారంభమైనది. భక్తుడు, భగవంతుడి నడుమ కూడ ఇట్టి అభేద స్థితి యున్నది. గురుశిష్యుల సంబంధముకూడ అట్టిదే. గోచరించుటకు ఒకటి కన్న ఎక్కువగా వున్ననూ ఇరువురి నుండి వ్యక్తమగు తత్త్వ మొక్కటియే. రామనామము చేయువానిని హనుమంతుడు అనుగ్రహించును. హనుమంతుని ఆరాధించువానిని రాము డనుగ్రహించును. నందీశ్వరుని గౌరవించినచో శివుడనుగ్రహించును. శివుని ప్రార్థించినచో నందీశ్వరుడు సహకరించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻

🌻 410. 'Shivapara'- 2 🌻


In between nature and consciousness, this state of imperishable oneness is eternal. This feeling of oneness in creation originated from Srimata and Lord Shiva. The devotee and the Lord are also in this state of oneness. The same is with the relationship between Guru and His disciples. Eventhough they are more than one, there is oneness in the philosophy they are expressing. Lord Hanuman blesses the one who chants Ram Naam. Rama blesses the worshiper of Hanuman. If you respect Nandiswara, Shiva will bless you. If you pray to Lord Shiva, Nandiswara will help you.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 257. మాట్లాడం / Osho Daily Meditations - 257. TALK


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 257 / Osho Daily Meditations - 257 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 257. మాట్లాడం 🍀

🕉. మీకు మాట్లాడాలని అనిపించకపోతే, వద్దు - మీకు ఆకస్మికంగా రాని ఒక్క మాట కూడా మాట్లాడకండి. మీకు పిచ్చి పట్టిందని ప్రజలు అనుకుంటే చింతించకండి. దానిని ఒప్పుకో. మీరు మూగగా మారారని వారు భావిస్తే, దానిని అంగీకరించి, మీ మూగత్వాన్ని ఆస్వాదించండి! 🕉


అసలు ఇబ్బంది ఏమిటంటే, వారు ఏమి మాట్లాడుతున్నారో మరియు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఆపుకోలేక మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ మీరు మొత్తం అర్ధం లేని మరియు మనస్సులో జరిగే ఇబ్బంది గురించి కొంచెం తెలుసుకుంటే, చెప్పడానికి ఏమీ లేదని, ప్రతిదీ చిన్న విషయం అని మీరు తెలుసుకుంటే, మీరు వెనక్కి తగ్గుతారు. ప్రారంభంలో మీరు సంభాషణ చేసే సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది - అది అలా కాదు. వాస్తవానికి, ప్రజలు సంభాషణ చేయడానికి కాదు, సంభాషణను నివారించడానికి మాట్లాడతారు. త్వరలో మీరు నిజంగా సంభాషణలు చేయగలరు. వేచి ఉండండి మరియు దేనినీ బలవంతం చేయవద్దు. మీకు మాట్లాడాలని అనిపించకపోతే, వద్దు - మీకు ఆకస్మికంగా రాని ఒక్క మాట కూడా మాట్లాడకండి.

మీకు పిచ్చి పట్టిందని ప్రజలు అనుకుంటే చింతించకండి. దానిని ఒప్పుకో. మీరు మూగగా మారారని వారు భావిస్తే, దానిని అంగీకరించి, మీ మూగత్వాన్ని ఆస్వాదించండి! నిశ్శబ్దం గురించి చింతించకండి. అయినప్పటికీ, మొత్తం సమాజం మాట్లాడటంపై, బాషపై మాత్రమే కేంద్రీకృతమై వుంది. చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తులు సమాజంలో- నాయకులు, పండితులు, రాజకీయ నాయకులు, రచయితలు అవుతారు. కాబట్టి మిగితా వారు ఆందోళన చెందుతారు. భాషపై పట్టు కోల్పోతున్నామని భయపడతారు, కానీ చింతించకండి. నిశ్శబ్దం అనేది భగవంతునిపై పట్టు, మరియు మీరు నిశ్శబ్దం అంటే ఏమిటో ఒకసారి తెలుసు కున్నట్లయితే, మీరు మాట్లాడటానికి ఏదైనా ఉంటుంది. మీరు నిశ్శబ్దంలోకి లోతుగా వెళ్ళిన తర్వాత, మీ పదాలు మొదటిసారి అర్థాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు అవి ఖాళీ పదాలు మాత్రమే కాదు, దానికి మించిన వాటితో నిండి ఉంటాయి. మీకు ఒక కవిత్వం, ఒక నృత్యం వుంటుంది. అప్పుడు మీ అంతర్గత దయను అందరూ తమతో తీసుకు వెళతారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 257 🌹

📚. Prasad Bharadwaj

🍀 257. TALK 🍀

🕉. If you don't feel like talking, don't--don't say a single word that is not coming to you spontaneously. Don't be worried if people think you are going crazy. Accept it. if they think you have become dumb ,accept it, and enjoy your dumbness! 🕉


The real trouble is with people who go on talking and don't know what they are talking about and why. They go on talking because they cannot stop. But if you become a little aware of the whole nonsense and the trouble that goes on in the mind, if you become aware that there is nothing to say, that everything seems to be trivia, then you hesitate. In the beginning it feels as though you are losing the capacity to communicate--it is not so. In fact, people talk not to communicate, but to avoid communication. Soon you will be able to really communicate. Just wait, and don't force anything. If you don't feel like talking, don't--don't say a single word that is not coming to you spontaneously.

Don't be worried if people think you are going crazy. Accept it. if they think you have become dumb ,accept it, and enjoy your dumbness! Don't be worried about the silence. One does worry, though, because the whole society exists on talking, on language, and people who are very articulate become very powerful in society-leaders, scholars, politicians, writers. One soon becomes afraid that one is losing one's grip on language, but don't be worried. Silence is the grip on God, and once you mow what silence is, you have something to talk about. Once you have gone deeper into silence, then your words carry meaning for the first time. Then they are not just empty words, they are full of something of the beyond. They have a poetry to them, a dance. They carry your inner grace with them.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 122 / Agni Maha Purana - 122


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 122 / Agni Maha Purana - 122 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 38

🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 5🌻


యమధర్మరాజు చెప్పెను: "దేవ ప్రతిమా నిర్మాణముచేసినవారిని, దానికి పూజలు సలిపిని వారిని మీరు నరకమునకు తీసికొనిరాకూడదు. దేవాలయాదులను నిర్మింపనివారిని మాత్రమే తీసికొనిరావలెను. మీరందరు లోకములో సంచరించుచు నా ఆజ్ఞను పాలింపుడు. ప్రపంచమునందలి ఏ ప్రాణియు మీ ఆజ్ఞను ధిక్కరింపజాలడు. జగత్పిత యైన ఆనంతుని శరణుజొచ్చినవారిని మాత్రము మీరు విడచివేయవలెను. వారి కీ లోకములో నివాసము ఉండదు.

భగవంతునిపై చిత్తము లగ్నము చేసి, భగవంతుని శరణుజొచ్చినభగవద్భక్తు లగు మహాత్ములను, సదా విష్ణుపూజ చేయువారిని మీరు విడిచివేయవలెమ. నిలచినపుడు గాని, నిద్రించినపుడు గాని, నడచునపుడు గాని, అన్ని వేళలందును శ్రీకృష్ణనామస్మరణము చేయువారి దరికి పోవలదు. నిత్యనైమిత్తికకర్మల ద్వారా జనార్దనుని పూజ చేయువారి వైపు కన్నెత్తి యైనను చూడవలదు. అట్టి భగవద్వ్రతశీలులు భగవంతునే చేరుదురు.

పుష్పములు, ధూపము, వస్త్రములు మొదలగు అలంకారములను సమర్పించి భగవంతుని పూజ చేయువారి జాడలకు పోవలదు. వారు శ్రీకృష్ణుని చేరినవారు. దేవాలయములందు ఆలికి ముగ్గులు వేయువారి పుత్రులను, వంశీయులకను కూడ విడిచివేయవలెను. విష్ణ్వాలయమును నిర్మించినవారి వంశములో నూరు తరములవరకును మీరెవ్వరిని దుష్టభావముతో చూడరూదు. కఱ్ఱతో గాని, మట్టితో గాని, ఱాతితో గానీ విష్ణువులనకు ఆలయము కట్టించినవాడు సమస్తపాపనిర్ముక్తుడగును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 122 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 38

🌻 Benefits of constructing temples - 5 🌻


Yama said:

“Those men who build temples of gods and adore the idols are not to be brought to hell.

36. Bring them to my view who have not built temples and other things. Move around in the befitting way and execute my directive.

37. Except those who have resorted to Ananta, the father of the universe, no other beings would at any time disregard the command.

38. Those who are devotees of Viṣṇu and have their mind fixed on him have to be avoided by you. They are not to live here.

39-49. Those who always adore Viṣṇu should be avoided by you from a distance. Those who sing the glories of Govinda while standing or sleeping or walking or standing behind or stumbling or remaining (at a place) are to be avoided by you from a distance

Those who worship Janārdana with obligatory and occasional rites are not to be beheld by you. Those who follow this course attain good position. Those who worship (the god) with flowers, incense, raiments, favourite ornaments, (and) those who have gone to the abode of Kṣṣṇa are not to be seized by you.

Those who besmear with unguents, and those who are engaged in sprinkling his body, their children and their descendants should be left in the temple of Kṛṣṇa. Hundreds of men born in the family of one who has built the temple of Viṣṇu should not be seen by you with evil mind. Whoever builds a temple of Viṣṇu with wood or stone or earth gets free from all sins.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

కపిల గీత - 83 / Kapila Gita - 83


🌹. కపిల గీత - 83 / Kapila Gita - 83🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 39 🌴


39. ద్రవ్యాకృతిత్వం గుణతా వ్యక్తి సంస్థాత్వమేవ చ|
తేజస్త్వం తేజసః సాధ్వి రూపమాత్రస్య వృత్తయః॥

పూజ్యురాలా! వస్తువులయొక్క ఆకారము, వాటి గుణములను తెలిసికొనునట్లు చేయుట అనగా వస్తువుల ఆకారము, పరిమాణములు మొదలగు వాని యొక్క జ్ఞాపకమును కలిగించుట, తేజోరూపముగా భాసించుట అనునవి రూపతన్మాత్ర యొక్క వృత్తులు.

చక్షురింద్రియం రూపాన్ని గ్రహిస్తుంది. రూపం అంటే ప్రతీ ద్రవ్యానికి ఒక ఆకారం కలిగించేది. ఒక వస్తువు గురించి చెబుతున్న్నామంటే దాని ఆకారం బట్టే చెబుతాము. ద్రవ్యమునకు ఆకారాన్ని ఆపాదించేది రూపం.

గుణతా: అంటే ద్రవ్య ఆశ్రయత్వం. ఆధారము లేకుండా ఆధేయం ఉండదు. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది గుణం. గుణము ద్రవ్యము లేకుండా విడిగా ఉండదు. రూపం అంటే గుణం. గుణం అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది.

ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తినుండి వేరు చేసేది రూపము. రూపముకు ఈ మూడు గుణాలు ఉన్నాయి.

1. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటున్నది, 2. ఒక ద్రవ్యానికి ఆకారాన్ని ఏర్పరుస్తున్నది, 3. ఒక ద్రవ్యాన్ని ఇంకో ద్రవ్యము నించి వేరు చేసి చూపుతుంది. దీన్నే తేజత్వం అంటాము. ఇవి రూపము యొక్క వ్యాపారము.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 83 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 39 🌴


39. dravyākṛtitvaṁ guṇatā vyakti-saṁsthātvam eva ca
tejastvaṁ tejasaḥ sādhvi rūpa-mātrasya vṛttayaḥ

My dear mother, the characteristics of form are understood by dimension, quality and individuality. The form of fire is appreciated by its effulgence.

Every form that we appreciate has its particular dimensions and characteristics. The quality of a particular object is appreciated by its utility. But the form of sound is independent. Forms which are invisible can be understood only by touch; that is the independent appreciation of invisible form. Visible forms are understood by analytical study of their constitution. The constitution of a certain object is appreciated by its internal action. For example, the form of salt is appreciated by the interaction of salty tastes, and the form of sugar is appreciated by the interaction of sweet tastes. Tastes and qualitative constitution are the basic principles in understanding the form of an object.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹25, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆశ్వీయుజ అమావాస్య, సూర్యగ్రహణము, Aswiyuja Amavasya, Surya Grahan🌻

గ్రహణం యొక్క వ్యవధి : హైదరాబాదులో సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై 5:48 నిమిషాలకు ముగుస్తుంది.

🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 8 🍀


8. వీర! త్వయా హి విహితం సురసర్వకార్యం
మత్సంకటం కిమిహ యత్త్వయకా న హార్యం.

ఏతద్ విచార్య హర సంకటమాశు మే త్వం
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ద్వేషం కూడదు - నిన్ను పీడించే వానిని నీవు ద్వేషించవద్దు. ఏలనంటే, అతడు బలవంతుడైతే నీ ద్వేషం ఆతని పీడనను పెంచుతుంది. బలహీనుడైతే, నీవు ద్వేషించడం అనవసరం. ద్వేషం రెండు వైపులా పదను గల కత్తి. బలి దొరకనప్పుడు ఎదురు తిరిగి ప్రయోకనే మ్రింగివేసే ప్రాచీన మాంత్రిక ప్రయోగ క్రియను బోలినదది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: అమావాశ్య 16:15:56 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: చిత్ర 14:17:27 వరకు

తదుపరి స్వాతి

యోగం: వషకుంభ 12:31:23

వరకు తదుపరి ప్రీతి

కరణం: నాగ 16:14:57 వరకు

వర్జ్యం: 19:40:52 - 21:13:24

దుర్ముహూర్తం: 08:31:07 - 09:17:32

రాహు కాలం: 14:54:07 - 16:21:10

గుళిక కాలం: 12:00:02 - 13:27:04

యమ గండం: 09:05:56 - 10:32:59

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 07:59:56 - 09:34:12

మరియు 28:56:04 - 30:28:36

సూర్యోదయం: 06:11:51

సూర్యాస్తమయం: 17:48:13

చంద్రోదయం: 05:52:53

చంద్రాస్తమయం: 17:49:17

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు : ధ్వాo క్ష యోగం - ధన నాశనం,

కార్య హాని 14:17:27 వరకు తదుపరి

ధ్వజ యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹