1) 🌹 28, JUNE 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 390 / Bhagavad-Gita - 390 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 1 / Chapter 10 - Vibhuti Yoga - 18 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 237 / Agni Maha Purana - 237 🌹
🌻. స్నానతర్పణాది విధి కధనము - 2 / Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 102 / DAILY WISDOM - 102 🌹
🌻 11. నేడు ప్రపంచంలోని విద్యావంతుల పరిస్థితి ఏమిటి? / 11. What is the Condition of the Educated Man of the World Today? 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 368 🌹
6) 🌹. శివ సూత్రములు - 104 / Siva Sutras - 104 🌹
🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 7 / 2-07. Mātrkā chakra sambodhah - 7 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 28, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ గణేశ హృదయం - 26 🍀*
*27. నామార్థయుక్తం కథితం ప్రియే తే విఘ్నేశ్వరస్యైవ పరం రహస్యమ్ |*
*సప్తత్రినామ్నాం హృదయం నరో యో జ్ఞాత్వా పరం బ్రహ్మమయో భవేదిహ*
*ఇతి శ్రీముద్గల పురాణే గణేశ హృదయ స్తోత్రమ్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : వియోగ బాధలు - వియోగబాధలు ప్రాణకోశానికి సంబంధించినవి కాని హృత్పురుషునికి సంబంధించినవి కావు. హృత్పురుషునికి బాడలూ లేవు, వాటిని ప్రకటించ వలసిన అవసరమూ లేదు. నిండు విశ్వాసంతో ఆనందంతో సదా అతడు ఈశ్వరాభి ముఖుడుగానే ఉన్నాడు. అతని ఆకాంక్ష యందు వ్యాకులపాటుకు తావులేదు.🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: శుక్ల-దశమి 27:20:51 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: చిత్ర 16:01:09 వరకు
తదుపరి స్వాతి
యోగం: పరిఘ 06:08:24 వరకు
తదుపరి శివ
కరణం: తైతిల 15:12:39 వరకు
వర్జ్యం: 21:44:00 - 23:22:00
దుర్ముహూర్తం: 11:52:55 - 12:45:34
రాహు కాలం: 12:19:14 - 13:57:58
గుళిక కాలం: 10:40:31 - 12:19:14
యమ గండం: 07:23:05 - 09:01:48
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45
అమృత కాలం: 09:16:44 - 10:57:48
సూర్యోదయం: 05:44:22
సూర్యాస్తమయం: 18:54:07
చంద్రోదయం: 13:56:57
చంద్రాస్తమయం: 01:08:48
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: కాలదండ యోగం - మృత్యు
భయం 16:01:09 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 390 / Bhagavad-Gita - 390 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 18 🌴*
*18. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన |*
*భూయ: కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్*
🌷. తాత్పర్యం :
*ఓ జనార్ధనా! నీ యోగవిభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివితీరుట లేదు.*
🌷. భాష్యము :
*శౌనకుని అధ్యక్షతన గల నైమిశారణ్య ఋషులు సైతము సూతగోస్వామితో ఈ విధముగనే పలికియుండిరి.*
*వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే |*
*యచ్చృణ్వాతామ్ రసజ్ఞానామ్ స్వాదు స్వాదు పదేపదే*
*“ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలను నిరంతరము శ్రవణము చేసినను ఎవ్వరును తనివినొందలేరు.*
*శ్రీకృష్ణునితో దివ్యసంబంధమును కలిగినవారు అతని లీలావర్ణనములను అడుగడున అస్వాదింతురు” (శ్రీమద్భాగవతము 1.1.19). అనగా అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చియు, ముఖ్యముగా అతడు ఏ విధముగా సర్వవ్యాపియై యున్నాడన్న విషయమును గూర్చియు శ్రవణము చేయుటలో అనురక్తుడై యున్నాడు. కృష్ణునకు సంబంధించిన ఏ వర్ణనమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతముతో సమానము. అటువంటి అమృతమును ఎవ్వరైనను అనుభవపూర్వకముగా ఆస్వాదింపవచ్చును. ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్యకథలు శ్రీకృష్ణుని దివ్యలీలకు భిన్నములై యుండును. మనుజుడు వారి యెడ కొంతకాలమునకు విసుగు చెందవచ్చునేమో గాని కృష్ణుని గూర్చి వినుట యందు విసుగు చెందడు. కనుకనే విశ్వచరిత్ర దేవదేవుని వివిధావతారములతో నిండియున్నది. భగవానుని అట్టి వివిధ అవతారముల యందలి లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. ఈ కారణముననే ఎన్నిమార్లు పఠించినను వాని యందలి పఠనాంశములు నిత్యనూతనముగా నుండును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 390 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 18 🌴*
*18. vistareṇātmano yogaṁ vibhūtiṁ ca janārdana*
*bhūyaḥ kathaya tṛptir hi śṛṇvato nāsti me ’mṛtam*
🌷 Translation :
*O Janārdana, again please describe in detail the mystic power of Your opulences. I am never satiated in hearing about You, for the more I hear the more I want to taste the nectar of Your words.*
🌹 Purport :
*A similar statement was made to Sūta Gosvāmī by the ṛṣis of Naimiṣāraṇya, headed by Śaunaka. That statement is:*
*vayaṁ tu na vitṛpyāma uttama-śloka-vikrame*
*yac chṛṇvatāṁ rasa-jñānāṁ svādu svādu pade pade*
*“One can never be satiated even though one continuously hears the transcendental pastimes of Kṛṣṇa, who is glorified by excellent prayers. Those who have entered into a transcendental relationship with Kṛṣṇa relish at every step the descriptions of the pastimes of the Lord.” (Śrīmad-Bhāgavatam 1.1.19) Thus Arjuna is interested in hearing about Kṛṣṇa, and specifically how He remains as the all-pervading Supreme Lord. Now as far as amṛtam, nectar, is concerned, any narration or statement concerning Kṛṣṇa is just like nectar.*
*And this nectar can be perceived by practical experience. Modern stories, fiction and histories are different from the transcendental pastimes of the Lord in that one will tire of hearing mundane stories but one never tires of hearing about Kṛṣṇa. It is for this reason only that the history of the whole universe is replete with references to the pastimes of the incarnations of Godhead. The Purāṇas are histories of bygone ages that relate the pastimes of the various incarnations of the Lord. In this way the reading matter remains forever fresh, despite repeated readings.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 237 / Agni Maha Purana - 237 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 72*
*🌻. స్నానతర్పణాది విధి కధనము - 2 🌻*
*పిమ్మట అంగన్యాసమంత్రములను నాల్గింటిని చదువుచు కుడినుండి ప్రారంభించి ఎడమవైపువరకు హృదయము, శిరస్సు, శిఖ, రెండు భుజములు స్పృశించి, చెవులు, ముక్కు మొదలగు రంధ్రములు మూసికొని, సంముఖీకరణముద్రతో శివ - విష్ణు - గంగలను స్మరించుచు, నీటిలో మునగవలెను. షడంగన్యాస మంత్రములను ఉచ్చరించుచు (ఓం హృదయాయనమః, శిరసే స్వాహా, శిఖాయై వషట్, కవచాయ హుమ్, నేత్రత్రయాయ వౌషట్, అస్త్రాయ ఫట్) నీటిలో నిలచి, రెండు చేతులును కలిపి కుంభముద్రలో స్నానము చేయవలెను. స్నానానంతరము నీటినుండి బైటకు వచ్చి సంహారిణీ ముద్రతో తీర్థమును ఉపసంహరించవలెను.*
*పిమ్మట యథావిధిగా పరిశుద్ధము, సంహితామంత్రములచే అభిమంత్రితము, నివృత్త్యాదులచే శోధితము అగు భస్మచే స్నానము చేయవలెను. ''ఓం అస్త్రాయ హుం ఫట్'' అను మంత్ర ముచ్చరించుచు శిరస్సునుండి పాదములవరకు భస్మముతో మలస్నానము చేసి, పిదప, యధావిధిగ శుద్ధస్నానము చేయవలెను. ఈశాన - తత్పురుష - అఘెర - గుహ్యక (దేదా వామదేవ) సద్యోజాత మంత్రములతో క్రమముగ శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యాంగము, శరీరమునందలి ఇతరావయవములు వీటిపై ఉంచవలెను. మూడు సంధ్యలందును, అర్ధరాత్రమునందును, వర్షాకాలమునకు పూర్వము, అనంతరము, నిద్రానంతరము, భోజనానంతరము, జలపానానంతరము. ఇతరమైన ఆవశ్యకకార్యములు చేసిన పిమ్మట నీవు, ఆగ్నేయస్నానము చేయవలెను. స్త్రీని, నపుంసకుని, శూద్రుని పిల్లిని, శవమును. ఎలుకను స్పృశించి నపుడు ఆగ్నేయస్నానము విధింపబడినది,చుళుకము నిండ పవిత్రజలము పోసికొని త్రాగవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 237 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 72*
*🌻 Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 2🌻*
10. Having the part on the north and reciting the Śiva-mantra the waters of Śiva should be accomplished. The part on the south (sanctified with the aṅga mantra) should be smeared all over the body from head to foot.
11-12. After having recited the four aṅgamantras and covered all the (nine) apertures (in the body) with the recitation of the sammukhīkaraṇa mantra (mantra accomplishing the presence), one should contemplate Lord Śiva or Lord Hari or the Ganges and plunge into the waters. Then the ṣaḍaṅga mantra (mantra for assigning to the limbs of the body) ending with vauṣat [vauṣaṭ?] should be recited and water poured (over the head).
13-15. One should place water in the pitchers in the east (and other directions) in order to prevent any harm during ablution. Having bathed one should apply sweet perfumes such as emblic myrabolans which are (considered as) royal honour. Having bathed and come out, that water should be made to cease to exist with the saṃhāriṇī (mudrā). One should then bathe [i.e., snāna] from head to foot with the ashes duly purified by the saṃhitā (vedic) mantras or concluding rites with (the recitation) of the mantra huṃ phaṭ.
16-17. Having performed the malasnāna, (bathing with mud), the vidhisnāna (bathing with the recitation of mantras), one should besmear the head, face, heart, and the genital organ with the (mantras of gods) Īśa (Īśāna), Tatpuruṣa, Aghora, Guhyaka and Jāta (Sadyojāta) in the three twilights, night, and. before and after the commencement of rainy season.
18-19. If a person happens to touch a woman, an eunuch, a man of lower caste, a cat, hare or mouse just after getting up from sleep, or eaten food or drunk water one should do the āgneyaka bathing, standing up with uplifted arms, the face having turned towards the east, being cleansed by the shower of sun’s rays.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 102 / DAILY WISDOM - 102 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 11. నేడు ప్రపంచంలోని విద్యావంతుల పరిస్థితి ఏమిటి? 🌻*
*జ్ఞానమే శక్తి అని గట్టిగా చెప్పబడింది. జ్ఞానమే ధర్మం అని కూడా అంటారు. మరియు భారతీయ ఆధ్యాత్మికం, దాని అత్యున్నత దశలలో, జ్ఞానం బ్రహ్మానందం అని ప్రకటిస్తుంది. ఇప్పుడు, విద్య అంటే జ్ఞాన సముపార్జన కాదా? బుద్ధిమంతులెవరైనా దానిని అలా అని కొట్టిపారేయరు. మరి నేడు ప్రపంచ విద్యావంతుడి పరిస్థితి ఏమిటి? అతనికి అధికారం ఉందా? అతడు సద్గుణవంతుడా? అతడు పరమానందభరితుడా? మనం సరిగ్గా విచారిస్తే, మన విద్యావంతులు నిజంగా శక్తిమంతులు కాదని తెలుసుకుంటాము.*
*వారు సద్గుణవంతులు అయి ఉంటారని కూడా కాదు. మరియు బ్రహ్మానందం, ఇంకా వారి పరిధికి దూరంగా ఉంది. విద్య అనేది జ్ఞాన సముపార్జన ప్రక్రియ అయితే, అంటే విద్య జ్ఞానంతో సమానమైతే, మరియు పైన పేర్కొన్న పద్ధతిలో జ్ఞానాన్ని మనం నిర్వచించినట్లయితే, విద్య మరియు దాని ఆశించిన ఫలాల మధ్య అంతరం ఎలా ఉంటుంది? మనం గమనిస్తే అధికారం ఉన్నవారు రాజకీయ నాయకులు లేదా అపారమైన సంపదను కలిగి ఉన్నవారు. పరిశీలిస్తే అది నిజం కాదని తేలుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 102 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 11. What is the Condition of the Educated Man of the World Today? 🌻*
*It is emphatically said that knowledge is power. It is also held that knowledge is virtue. And Indian metaphysics, in its last reaches, proclaims that knowledge is bliss. Now, does education mean acquisition of knowledge? Any sensible person would not deny that it is so. And what is the condition of the educated man of the world today? Has he power? Is he virtuous? Is he blissful? We would, on an enquiry, discover that our men of knowledge are not really men of power.*
*They need not necessarily be virtuous persons, too. And bliss, of course, is far from their reach. If education is the process of the acquisition of knowledge, that is, if education is the same as knowledge, and if knowledge is defined in the above-mentioned manner, how is it that there is a gulf between education and its expected fruits? We find that the men of power are either the political leaders or the possessors of enormous wealth. On a scrutiny it would be found that it is not true.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 368 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ధ్యానం నువ్వు మొదలు పెట్టినపుడు నువ్వు ఆలోచనల్ని పరిశీలిస్తావు. ఒకరోజు అవి మాయమవుతాయి. తరువాత రెండో అడుగు. హృదయ నిశ్శబ్దం. అది నీ అనుభూతుల్ని పరిశీలించడం నించీ వస్తుంది. 🍀*
*మొదట అడుగు మనసు నిశ్శబ్దం. ఆలోచనలు ఆగిపోతాయి. ధ్యానం నువ్వు మొదలు పెట్టినపుడు నువ్వు ఆలోచనల్ని పరిశీలిస్తావు. ఒకరోజు అవి మాయమవుతాయి. తరువాత రెండో అడుగు. హృదయ నిశ్శబ్దం. అది నీ అనుభూతుల్ని పరిశీలించడం నించీ వస్తుంది. అది మరింత సున్నితమైన విషయం మొదటి దాని కన్నా గాఢమైంది. పద్ధతి ఒకటే.*
*నువ్వు మొదటి దానితో విజయం పొందితే రెండో దానిలోనూ పొందుతావు. అప్పుడు రెండో నిశ్శబ్దాన్ని అందుకుంటావు. అప్పుడు ఈ రెండు అందుకున్నపుడు పరిశీలకుడు కూడా అదృశ్యం కావడం చూస్తావు. కారణం అక్కడ పరిశీలించడానికేమీ లేదు. తెలుసు కోడానికి ఏమీ లేదు. తెలుసుకునే వాడు అదృశ్యమయ్యాడు. అది అంతిమ నిశ్శబ్దం. దాన్నే బుద్ధుడు 'నిర్వాణ'మన్నాడు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 104 / Siva Sutras - 104 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 7 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*
*ఈ కదలిక ముగింపులో శివుడు తన స్వంత ఇచ్ఛా శక్తిని గ్రహిస్తాడు. ఈ శివ స్థితి సంస్కృత వర్ణమాల యొక్క మూడవ అక్షరమైన ఇ (ఇ) ద్వారా ఉద్దేశించబడింది. తదుపరి అతను నాల్గవ కదలికను చేస్తాడు. మూడవ కదలిక సూక్ష్మమైనది. ఈ నాల్గవ కదలిక స్థూలమైనది. ఈ కదలిక ముందు వరకు జరిగిన కదలికలన్నీ తన అంతరంలో జరిగాయి. కానీ ఈ నాల్గవ కదలిక ఇప్పుడు బాహ్యంగా రూపాంతరం చెందుతుంది. నాల్గవ కదలిక తన ఇచ్ఛా శక్తిని నిరంతరం కలిగి ఉండాలనే కోరిక. అందువలన, అతని ఇచ్ఛా శక్తి యొక్క బాహ్యీకరణను ఈశాన అని పిలుస్తారు. ఇది నాల్గవ అక్షరం ఈ(ఈ) ద్వారా సూచించబడుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 104 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-07. Mātrkā chakra sambodhah - 7 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴*
*At the end of this movement Śiva realises His own icchā śakti and this state of Śiva is meant by vowel i (इ), the third letter of Sanskrit alphabet. Next He makes the fourth movement. Third movement was subtle in nature and this fourth movement is gross in nature. All the movements that were happening till this movement were within His own Self, now gets transformed externally. The fourth movement is His desire to continuously posses His icchā śakti. Thus, the externalisation of His icchā śakti is known as īśana, which represented by the fourth letter ī (ई).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama