🌹 09 - NOVEMBER నవంబరు - 2022 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 279 / Bhagavad-Gita -279 - 6వ అధ్యాయము 46 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 678 / Vishnu Sahasranama Contemplation - 678 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 640 / Sri Siva Maha Purana - 640 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 357 / DAILY WISDOM - 357 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 256 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹09, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ నారాయణ కవచం - 21 🍀*
*31. యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్ |*
*సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః*
*32. యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్ |*
*భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : పరోపకారబుద్ధి, కర్తవ్య పరాయణత, కుటుంబాభిమానము, దేశభక్తి, మానవ జాతీయత - ఇవి ఆత్మకు సాధనములుగా వినియోగ పడనప్పుడు సంకెళ్ళుగా తయారై ఆత్మను బంధిస్తాయి.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 17:18:01 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: కృత్తిక 27:10:23 వరకు
తదుపరి రోహిణి
యోగం: వరియాన 21:17:43 వరకు
తదుపరి పరిఘ
కరణం: కౌలవ 17:21:01 వరకు
వర్జ్యం: 14:24:00 - 16:06:00
దుర్ముహూర్తం: 11:36:56 - 12:22:32
రాహు కాలం: 11:59:44 - 13:25:13
గుళిక కాలం: 10:34:15 - 11:59:44
యమ గండం: 07:43:17 - 09:08:46
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 24:36:00 - 26:18:00
మరియు 25:40:08 - 27:24:04
సూర్యోదయం: 06:17:48
సూర్యాస్తమయం: 17:41:40
చంద్రోదయం: 18:21:43
చంద్రాస్తమయం: 06:52:11
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు : సిద్ది యోగం - కార్య సిధ్ధి ,
ధన ప్రాప్తి 27:10:23 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 279 / Bhagavad-Gita - 279 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 46 🌴*
*46. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధిక: |*
*కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||*
🌷. తాత్పర్యం :
*యోగియైన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మరతుని కన్నను అధికుడైనట్టివాడు. కనుక ఓ అర్జునా! అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము.*
🌷. భాష్యము :
యోగమును గూర్చి చర్చించినపుడు దానిని స్వీయచైతన్యమును పరతత్వముతో సంధించు విధానముగా మనము అన్వయింతుము. అట్టి విధానము మనుజులు తామనుసరించు ప్రత్యేక పద్ధతిని బట్టి వివిధనామములతో పిలుతురు. కామ్యకర్మలు అధికముగా నున్నచో అట్టి అనుసంధాన పద్ధతి కర్మయోగామనియు, జ్ఞానముతో అధికముగా ముడివడి యున్నచో జ్ఞానయోగామనియు, శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తకార్యములతో నిండియున్నచో భక్తియోగమును పిలువబడును. తదుపరి శ్లోకములలో వివరింపబడినట్లు భక్తియోగమే(కృష్ణభక్తిరసభావనము) సర్వయోగములకు చరమ పూర్ణత్వమై యున్నది. భగవానుడు ఇచ్చట యోగము యొక్క అధిపత్యమును ధ్రువీకరుంచుచున్నను, దానిని భక్తియోగము కన్నను ఉత్తమమని మాత్రము పలికియుండలేదు.
వాస్తవమునకు భక్తియోగము సంపూర్ణ ఆధ్యాత్మికజ్ఞానమైనందున దానిని ఏ యోగము సైతము అతిశయింపలేదు. ఆత్మజ్ఞానములేని తపస్సు అసంపూర్ణమైనది. అలాగుననే భగవానుని శరణాగతి లేని జ్ఞానము సైతము అసంపూర్ణమై యున్నది. ఇక కృష్ణభక్తిభావన లేనటువంటి కామ్యకర్మ వృథాకాలవ్యయమే అయియున్నది. కనుకనే ఇచ్చట ఘనముగా కీర్తించబడిన యోగపద్ధతి వాస్తవమునకు భక్తియోగమే. ఈ విషయము రాబోవు శ్లోకములలో మరింత విపులముగా వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 279 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 46 🌴*
*46. tapasvibhyo ’dhiko yogī jñānibhyo ’pi mato ’dhikaḥ*
*karmibhyaś cādhiko yogī tasmād yogī bhavārjuna*
🌷 Translation :
*A yogī is greater than the ascetic, greater than the empiricist and greater than the fruitive worker. Therefore, O Arjuna, in all circumstances, be a yogī.*
🌹 Purport :
When we speak of yoga we refer to linking our consciousness with the Supreme Absolute Truth. Such a process is named differently by various practitioners in terms of the particular method adopted. When the linking process is predominantly in fruitive activities it is called karma-yoga, when it is predominantly empirical it is called jñāna-yoga, and when it is predominantly in a devotional relationship with the Supreme Lord it is called bhakti-yoga. Bhakti-yoga, or Kṛṣṇa consciousness, is the ultimate perfection of all yogas, as will be explained in the next verse.
The Lord has confirmed herein the superiority of yoga, but He has not mentioned that it is better than bhakti-yoga. Bhakti-yoga is full spiritual knowledge, and therefore nothing can excel it. Asceticism without self-knowledge is imperfect. Empiric knowledge without surrender to the Supreme Lord is also imperfect. And fruitive work without Kṛṣṇa consciousness is a waste of time. Therefore, the most highly praised form of yoga performance mentioned here is bhakti-yoga, and this is still more clearly explained in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 678/ Vishnu Sahasranama Contemplation - 678🌹*
*🌻678. మహాహవిః, महाहविः, Mahāhaviḥ🌻*
*ఓం మహాహవిషే నమః | ॐ महाहविषे नमः | OM Mahāhaviṣe namaḥ*
*మహచ్చ తద్ధవిశ్చేతి బ్రహ్మాత్మన్యఖిలం జగత్ ।*
*తదాత్మతయా హూయత ఇతి విష్ణుర్మహాహవిః ॥*
*మహత్ అనగా పరమాత్ముని ఉద్దేశించి వేల్చబడునదియగునట్టి పవిత్ర హవిస్సు; అది కూడ విష్ణుని విభూతియే. జగత్తు సైతము వాస్తవమున తదాత్మకము, బ్రహ్మరూపము కావున అది బ్రహ్మతత్త్వమేయగు ప్రత్యగాత్మ తత్త్వమున వేల్చబడును. కావున అట్టి మహా పరిమాణముగల హవిస్సు మహా హవిస్సే కదా! బహువ్రీహి సమాసముగానైతె గొప్పదియగు జగద్రూప హవిస్సు ఎవని విషయమున ఎవనియందు వేల్చబడునో ఆతండు మహాహవిః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 678🌹*
*🌻678. Mahāhaviḥ🌻*
*OM Mahāhaviṣe namaḥ*
महच्च तद्धविश्चेति ब्रह्मात्मन्यखिलं जगत् ।
तदात्मतया हूयत इति विष्णुर्महाहविः ॥
Mahacca taddhaviśceti brahmātmanyakhilaṃ jagat,
Tadātmatayā hūyata iti viṣṇurmahāhaviḥ.
*Mahat meaning the sacred oblation that is offered as an oblation to the great Lord. Such an oblation is also a form of Lord Viṣṇu Himself. Since the entire world is itself a manifestation of the Supreme Soul, during annihilation phase, such an oblation of great value and magnitude gets offered onto that very all devouring Supreme Entity. Hence the world itself is the great oblation offered to the Lord.*
*In another form of interpretation, He in whose regard great oblations are offered - is Mahāhaviḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 640 / Sri Siva Maha Purana - 640 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴*
*🌻. గణ వివాదము - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ గణములు కోపముతో నిండిన వారై శివుని ఆజ్ఞానుసారముగ అచటకు వెళ్లి, ద్వారపాలకుడై యున్న ఆ పార్వతీ తనయుని ఇట్లు ప్రశ్నించిరి (1).
శివగణములు ఇట్లు పలికిరి -
నీవెవరివి? ఎచటనుండి వచ్చితివి? నీవేమి చేయ గోరుచున్నావు? నీవు బ్రతుక దలచినతో ఇపుడు ఇచటి నుండి దూరముగా పొమ్ము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వారి ఆ మాటను విని పార్వతీపుత్రుడు భయము లేనివాడై చేత కర్ర బట్టుకొని ద్వారపాలకులతో నిట్లు పలికెను (3).
గణేశుడిట్లు పలికెను -
మీరెవరు? ఎచటనుండు వచ్చిరి? మీరు సుందరముగా నున్నారు. దూరముగా పొండు. ఇచట మీరు విరోధమును గోరి నిలబడి యుండుటకు కారణమేమి? (4).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మహావీరులు, తొలగిన గర్వము గలవారు అగు శివగణములందరు వాని ఈ మాటలను విని ఒకరిలో నొకరు నవ్వుకొని ఇట్లు పిలికిరి (5). శివగణములందరు ఒకరితో నొకరు సంప్రదించుకొని క్రోధముతో నిండిన మనస్సు గలవారై ద్వారపాలుడగు ఆ గణేశునితో నిట్లనిరి (16).
శివగణములు ఇట్లు పలికిరి -
వినుము. మేము శ్రేష్ఠులగు శివగణములము. ద్వారపాలకులము. శంకరప్రభుని ఆజ్ఞచే నిన్ను తప్పించుటకు వచ్చినాము (7). నీవు కూడా ఇచటి గణమని తలంచి నిన్ను సంహరించలేదు. లేనిచో నీవీ పాటికి సంహరింపబడి యుండెడి వాడవు. నీ అంతట నీవే దూరముగా పొమ్ము. మృత్యువును ఏల గోరు చున్నావు? (8)
బ్రహ్మ ఇట్లు పలికెను -
వారిట్లు పలికిననూ పార్వతీ తనయుడగు గణశుడు భయము లేనివాడై ఆ శివగణములను భయవెట్టినాడే గాని, ద్వారమును వీడలేదు (90. అచట నున్న ఆ శివగణములందరు ఆ మాటను విని శివుని వద్దకు వెళ్లి ఆ వృత్తాంతమును చెప్పిరి (10). ఓ మహర్షీ! లోకాచారముననుసరించి అద్బుతమగు లీలలను ప్రదర్శించే మహేశ్వరుడు వారి మాటలను విని ఆ తన గణములపై కోపించి గద్దించి వారితో నిట్లనెను (11).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 640🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴*
*🌻 The Gaṇas argue and wrangle - 1 🌻*
Brahmā said:—
1. The infuriated Gaṇas of Śiva at his bidding went there and questioned the son of Pārvatī who stood at the gate.
Śiva’s Gaṇas said:—
2. “Who are you? Whence do you come? What do you propose to do? If you have a desire to remain alive go away from here.”
Brahmā said:—
3. On hearing their words, the son of Pārvatī who was armed with the staff spoke to the Gaṇas as follows:—
Gaṇeśa said:—
4. O “handsome fellows, who are you? Whence have you come? Go away. Why have you come here and why do you stand in opposition to me?”
Brahmā said:—
5. On hearing his words, Śiva’s Gaṇas of great heroism and arrogance laughingly spoke to one another.
6. After conferring with one another, the infuriated Pārṣadas of Śiva replied to Gaṇeśa, the doorkeeper.
Śiva’s Gaṇas said:—
7. “Listen. We are the excellent Gaṇas of Śiva. We are his doorkeepers. We have come here to throw you out at the bidding of lord Śiva.
8. Considering you too, as one of the Gaṇas, we are not going to kill you. Otherwise you would have been killed. Better stay away yourself. Why do you court death?”
Brahmā said:—
9. Though warned thus, Gaṇeśa, the son of Pārvatī, stood fearless. He did not leave his post at the door. He rebuked Śiva’s Gaṇas.
10. After hearing his words, the Gaṇas of Śiva went back and informed Śiva about his stand.
11. O sage, on hearing their words, lord Śiva of wonderful divine sports, following the worldly conventions rebuked his Gaṇas.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 357 / DAILY WISDOM - 357 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻22. మనిషి బ్రహ్మను ధ్యానించలేడు 🌻*
*బ్రహ్మం సంపూర్ణమైనది. బ్రహ్మాన్ని ఎవరూ ధ్యానించలేరు, ఎందుకంటే అది ధ్యానం చేసేవారిని కూడా కలిగి ఉంటుంది. దేవుడు మానవులను తనలో కలిగి ఉన్నందున మనిషి భగవంతుడిని విడిగా ధ్యానించలేడు. అంటే, భగవంతుడిని ధ్యానించడమంటే తన స్వంత ఉనికిని కోల్పోవడమే. దేవుడు ఉన్నప్పుడు, మనిషి ఉండడు. ఇది ఒక సూక్ష్మమైన ఫలితం, ఇది సర్వవ్యాపి అయిన భగవంతునిపై ధ్యానం చేసే ప్రయత్నంలో ఉత్పన్నమయ్యే ఒక స్థితి.*
*దేవుడు, ఆ విధంగా, మనిషి ఆలోచించే ఒక వస్తువుగా కాక, సర్వావ్యాపిగా తనను తాను ధ్యానిస్తాడు. సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు ధ్యాని వేరు, ధ్యానించబడే వస్తువు వేరు. కానీ, భగవంతుని ధ్యానించేటపుడు ఆ ధ్యాని భగవంతునితో ఎంత మమేకం చెందుతాడంటే ధ్యాని తాను ధ్యానించే భగవంతుడే అయిపోతాడు. అంటే, భగవంతుడే తనను తాను ధ్యానిస్తాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 357 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻22. Man Cannot Meditate on Brahman🌻*
*Brahman is the Absolute, and one cannot meditate on Brahman, because it is inclusive of even the meditator himself. Man cannot meditate on God because God includes the human location. Thus, to endeavour to meditate on the omnipresence of God would be a simultaneous attempt to abolish one's own individual existence. When God is, man ceases to be. This is a subtle result that would insinuate itself into the effort at meditation on the supremacy of All-Being.*
*God, thus, ceases to be an object of individual contemplation. God is the Supreme Subject which contemplates Itself as the All. One, generally, regards oneself as the subject, and what is contemplated upon as the object. But in the case of God, conceived in the true sense of the term, the meditating consciousness affiliates itself with the object in such an intimate manner that in this inward association of the meditator with the object of meditation it would appear that the object itself is in a state of meditation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 256 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది. అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతయే అసలైన ప్రార్ధన. 🍀*
*మన జీవితం జీవితమని చెప్పడానికి అర్హత లేనిది నువ్వు మరణాన్ని దాటి ప్రయాణించినపుడే జీవితం మొదలవుతుంది. ధ్యానమంటే అదే. ద్యానందానికి వుపయోగపడే వుపకరణం, వ్యూహం, నిచ్చెన, మరణాన్ని దాటిన ఒక మెరుపు చాలు. అప్పుడు నువ్వు ఈ శరీరమొకటే మరణిస్తుందని నువ్వు కాదని తెలుసుకుంటావు. శరీరమే పుడుతుందని, నువ్వు కాదని గ్రహిస్తావు. నువ్వు పుట్టుకకు ముందు యిక్కడున్నావు. మరణానంతరం యిక్కడుంటావు. నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది.*
*అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతని నేను ప్రార్ధన అంటాను. తక్కిన అన్ని ప్రార్ధనలూ మోసపూరితాలే. నిజమైన ప్రార్థన నువ్వు ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవడం నించీ ఆరంభమవుతుంది. అప్పుడు నీలో కృతజ్ఞత మొదలవుతుంది. నువ్వు అస్తిత్వానికి తలవంచాలి. నువ్వు పొందిన వరాన్ని నువ్వు ఆశించలేదు. అడగలేదు. నిజానికి నీకా అర్హత కూడా లేదు. ఎవరికీ అర్హత లేదు. కానీ అస్తిత్వం వాటన్నిటీ అనురాగంతో యిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹