విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 510 / Vishnu Sahasranama Contemplation - 510

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 510 / Vishnu Sahasranama Contemplation - 510🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻510. సత్యసన్ధః, सत्यसन्धः, Satyasandhaḥ🌻

ఓం సత్యసన్ధాయ నమః | ॐ सत्यसन्धाय नमः | OM Satyasandhāya namaḥ

సత్యాసన్ధాఽస్య సంకల్పః సత్యసన్ధోఽత ఉచ్యతే ।
శ్రీవిష్ణుస్సత్యసంకల్ప ఇతి శ్రుతి సమీరణాత్ ॥

సన్ధా అనగా సంకల్పము. సత్యము అనగా సఫలము అగు సంకల్పము ఎవనికి కలదో అట్టివాడు సత్యసంధుడు.

:: ఛాన్దోగ్యోపనిషత్ ఆష్టమః ప్రపాఠకః ప్రథమ ఖణ్డః ::

స బ్రూయా న్నాస్య జరయైత జ్జీర్యతి న వధే నాఽస్య హన్యత ఏత త్సత్యం బ్రహ్మ పుర మస్మిన్ కామా స్సమాహితా ఏష ఆత్మాఽపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోఽపిపాస స్సత్యకామ స్సత్యసఙ్కల్పో యథా హ్యేవేహ ప్రజా అన్వావిశంతి యథానుశాసనం యం యమన్త మభి కామా భవన్తియం జనపదం యం క్షేత్రభాగం తం తమే వోపజీవంతి ॥ 5 ॥

ఈ శరీరమునకు ముసలితనము వచ్చినను, బ్రహ్మమునకు అట్టి వృద్ధాప్యము రాదు. దేహమునకు దెబ్బ తగిలినను ఆత్మకు తగలదు. ఈ బ్రహ్మము సత్యమైనది. శరీరము సత్యము కానిది. బ్రహ్మమునందు సద్గుణములు ఆశ్రయించియున్నవి. ఈ బ్రహ్మము పాపరహితమైనది. పరబ్రహ్మమునకు ముసలితనము, మరణము, దుఃఖము, ఆకలి దప్పిక - ఇవి ఏవియునులేవు. ఆత్మ సత్యకామమైయున్నది (అది తలంచిన ప్రకారము జరుగును). సత్యసంకల్పమైయున్నది. అట్టి ఆత్మను తెలిసికొనవలయును. దానిని తెలిసికొనలేనిచో ఈ లోకమున రాజుయొక్క ఆజ్ఞానువర్తులై అనుసరించువారు ఏయే ఫలమును, ఏయే ప్రదేశమున కోరుదురో, దానినే పొందుదురు. కానీ సమస్తమును పొందునట్లు, సమస్తమును స్వేచ్ఛగా పొందలేరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 510🌹

📚. Prasad Bharadwaj

🌻510. Satyasandhaḥ🌻

OM Satyasandhāya namaḥ

सत्यासन्धाऽस्य संकल्पः सत्यसन्धोऽत उच्यते ।
श्रीविष्णुस्सत्यसंकल्प इति श्रुति समीरणात् ॥

Satyāsandhā’sya saṃkalpaḥ satyasandho’ta ucyate ,
Śrīviṣṇussatyasaṃkalpa iti śruti samīraṇāt .

One whose sandha or resolve always becomes true is Satyasandhaḥ.

:: छान्दोग्योपनिषत् आष्टमः प्रपाठकः प्रथम खण्डः ::

स ब्रूया न्नास्य जरयैत ज्जीर्यति न वधे नाऽस्य हन्यत एत त्सत्यं ब्रह्म पुर मस्मिन् कामा स्समाहिता एष आत्माऽपहतपाप्मा विजरो विमृत्युर्विशोको विजिघत्सोऽपिपास स्सत्यकाम स्सत्यसङ्कल्पो यथा ह्येवेह प्रजा अन्वाविशंति यथानुशासनं यं यमन्त मभि कामा भवन्तियं जनपदं यं क्षेत्रभागं तं तमे वोपजीवंति ॥ ५ ॥

:: Chāndogyopaniṣat āṣṭamaḥ prapāṭhakaḥ prathama khaṇḍaḥ ::

Sa brūyā nnāsya jarayaita jjīryati na vadhe nā’sya hanyata eta tsatyaṃ brahma pura masmin kāmā ssamāhitā eṣa ātmā’pahatapāpmā vijaro vimr‌tyurviśoko vijighatso’pipāsa ssatyakāma ssatyasaṅkalpo yathā hyeveha prajā anvāviśaṃti yathānuśāsanaṃ yaṃ yamanta mabhi kāmā bhavantiyaṃ janapadaṃ yaṃ kṣetrabhāgaṃ taṃ tame vopajīvaṃti. 5.

With the old age of the body, That (i.e. Brahman, described as the akasa in the heart) does not age; with the death of the body, That does not die. That Brahman and not the body is the real city of Brahman. In It all desires are contained. It is the Self−free from sin, free from old age, free from death, free from grief free from hunger, free from thirst; Its desires come true, Its thoughts come true. Just as, here on earth, people follow as they are commanded by a leader and depend upon whatever objects they desire, be it a country or a piece of land so also those who are ignorant of the Self depend upon other objects and experience the result of their good and evil deeds.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసన్ధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

14 Nov 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 320-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 320-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 320-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 320-1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 320-1. 'రమణలంపటా' 🌻

స్త్రీ స్వరూపిణి యగుటచే పురుషునితో క్రీడించుట యందు ఆసక్తి కలిగియున్నది అని అర్థము. శ్రీమాత కామేశ్వరీ క్రీడాసక్తురాలు. ఆమె ఎల్లప్పుడును కామేశ్వరునితో క్రీడించుట, భోగించుట యందే ఆసక్తి కలిగియుండునది. రకరకములుగ లోకములను సృష్టిచేసి ఆ లోకముల యందు ఈశ్వరుని తోనే క్రీడించును. సృష్టి అవసరములను బట్టి సంభోగించును కూడ. ఆమెకు కామేశ్వరునితో రమించుటయందే ప్రధానముగ ఆసక్తి యుండును. తత్కారణముగ ఆమె రమణి. అతడు రమణుడు. రమించు టయేగాక, కామేశ్వరుని రమింప జేయును కూడ.

రమింప చేయుట స్త్రీ గుణమే. పురుషుడు తానుగ రమించుట కుద్యమింపడు. పురుషుడు రమించుటకు ప్రేరణ స్త్రీ నుండి కలుగును. ఆమె రమింపజేసి రమించును. ఇది సృష్టి సత్యము.

తపస్సమాధి యందున్న ఈశ్వరుని కోరి రమించినది మాత పార్వతియే. ఆమె పరమేశ్వరుని మెప్పించుటకు భక్తియే ప్రధానమని భావించి, ప్రేమ భక్తిని ప్రదర్శించి శివుని మెప్పించి, శివునితో క్రీడించి నది. అనితర సాధ్యమైన కార్యము నిర్వహించినది. భక్తి, ప్రేమ ఒక దాని కొకటి అనురూపములని చాటి తెలిపినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 320-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 320-1. Ramaṇa-lampaṭā रमण-लम्पटा (320) 🌻

She enjoys Her moments with Her consort Śiva at sahasrāra. She enjoys the marital bliss. She loves to play around with Śiva. She makes women devoted to their husbands, since She is the embodiment of women (previous nāma).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 94

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 94 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనసన్నది గతంలోనో, భవిష్యత్తులోనో వుంటుంది. ఈ క్షణంలో మాత్రం చైతన్యమన్నది స్వచ్చంగా వుంటుంది. ధ్యానంలో గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించుకుని ఇప్పుడు యిక్కడ జీవించడ మన్నదే నిజమైన యోగ జీవనం. 🍀

ఒకసారి నువ్వు గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించు కుంటే వందశాతం నువ్వు విముక్తుడవుతావు. ఎందుకంటే విషయమంతా యాభయి శాతం గతంలో, యాభయి శాతం భవిష్యత్తులో వుంటుంది. ఆ రెండూ లేకుంటే విషయమన్నదే వుండదు. వర్తమానంలో విషయమంటూ వుండదు. వ్యక్తి యిపుడు యిక్కడ వుంటే చైతన్యం ఖాళీగా వుంటుంది.

ఎందుకంటే మనసన్నది గతంలోనో, భవిష్యత్తులోనో వుంటుంది. ఈ క్షణంలో మాత్రం చైతన్యమన్నది స్వచ్చంగా వుంటుంది. ధ్యానంలో క్రమక్రమంగా గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించుకుని వర్తమాన కేంద్రంలో నిలబడతాడు. ఇప్పుడు యిక్కడ జీవించడ మన్నదే నిజమైన యోగ జీవనం. అదే స్వచ్ఛమైన చైతన్యం. స్వచ్చమైన చైతన్యం గుండా జరిగేదే ధర్మం. అపుడు నువ్వేది చేసినా సరైందే అవుతుంది. నీ ప్రతిస్పందనకు అక్కడ పశ్చాత్తాప ముండదు. నువ్వు అక్కడే పొరపాటు చెయ్యవు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

మైత్రేయ మహర్షి బోధనలు - 27

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 27 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 17. ఒక రహస్యము 🌻

ఈ మధ్యకాలమున ప్రపంచమున వేలాది సోదరబృందము లేర్పడినవి. ఈ బృందములన్నిటి యందును సోదరత్వము మాత్రమే కొలత. నామమాత్రపు సోదరత్వమే కాని అందు మూలసూత్రములు కానరావు. సోదరత్వమునకు విశ్వాసము పునాదిరాయి. ఒకరిపై ఒకరికి అపనమ్మకము, అనుమానము, సందేహము, అసంతృప్తి కలిగి బృందము మాత్రము గోచరించుచు నామావశిష్టములుగ ఈ బృందములు మిగిలివున్నవి. ఒకరి నొకరు "సోదరా” అని సంబోధింతురే కానీ హృదయమున సోదరత్వముండదు. భావశూన్యమైన ఉత్తమ పదజాలములతో ఒకరి నొకరు పొగడుకొనుచు ఎవరి కార్యములు వారు నెగ్గించుకొనుటకు ప్రయత్నించు చుందురు. ధర్మసంస్థల యందు ధర్మమే' కొఱత. సహకార సంఘముల యందు 'సహకారమే' కొలత. సేవాసంస్థల యందు 'సేవయే' కొలత.

ఆధ్యాత్మిక సంస్థల యందు 'ఆత్మజ్ఞానమే' కొలత. పదజాలము ఇంద్రజాలమువలె వికృతముగ నాట్యము చేయుచున్నది. ఇట్టి కలుషిత వాతావరణమున గుహ్యముగ విశ్వమానవ సోదరత్వమునకు సంకల్ప బీజములు నిశ్శబ్దముగ చల్లుట నా కర్తవ్యము. ఈ బీజములు మొలకెత్తి ఉద్యానవనములై భవిష్యత్తు నందు సత్ఫలములీయ గలవని నా విశ్వాసము. ధర్మముపై పూర్ణ విశ్వాసము కలవారెల్లరును ఈ ఉద్యానవనమును క్రమముగా చేరగలరు. సమస్త ధర్మములను అతిక్రమించుచు భౌతిక వాదములు చెలరేగుచున్న ఈ సమయమున ధర్మము రహస్యముగ నూతన పునాదులను ఏర్పరచుకొనుచున్నది.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

14-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 14 ఆది వారం, , భాను వారము ఆక్టోబర్ 2021 కార్తీక మాసం 10వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 113 / Bhagavad-Gita - 113 2-66🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 510 / Vishnu Sahasranama Contemplation - 510 🌹
4) 🌹 DAILY WISDOM - 188🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 27🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 93🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 320-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 320-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*14, నవంబర్‌ 2021, భానువారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 10వ రోజు 🍀*

నిషిద్ధములు: గుమ్మడికాయ, 
నూనె, ఉసిరి
దానములు: గుమ్మడికాయ, 
స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము: అష్ట దిక్పాలకులు
జపించాల్సిన మంత్రము:
ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము :- యశస్సు – ధనలబ్ధి

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 30:40:45 వరకు 
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: పూర్వాభద్రపద 16:32:27 
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: హర్షణ 25:43:01 వరకు 
తదుపరి వజ్ర 
కరణం: వణిజ 18:13:59 వరకు
వర్జ్యం: 26:46:48 - 28:29:16
దుర్ముహూర్తం: 16:09:43 - 16:55:03
రాహు కాలం: 16:15:23 - 17:40:24
గుళిక కాలం: 14:50:23 - 16:15:23
యమ గండం: 12:00:23 - 13:25:23
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 08:09:40 - 09:50:08
సూర్యోదయం: 06:20:21
సూర్యాస్తమయం: 17:40:24
వైదిక సూర్యోదయం: 06:24:07
వైదిక సూర్యాస్తమయం: 17:36:38
చంద్రోదయం: 14:43:58
చంద్రాస్తమయం: 02:02:37
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కుంభం
చర యోగం - దుర్వార్త శ్రవణం 16:32:27 
వరకు తదుపరి స్థిర యోగం - 
శుభాశుభ మిశ్రమ ఫలం 
పండుగలు : దేవత్త ఏకాదశి, Devutthana Ekadashi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 113 / Bhagavad-Gita - 113 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 66 🌴*

66. నాస్తి బుద్ధిరయుక్తస్య 
న చాయుక్తస్య భావనా |
న చాభావయుత: శాన్తిరశాన్తస్య
కుత: సుఖమ్ ||

🌷. తాత్పర్యం :
*భగవానునితో సంబంధమును పొందని వాడు విశుద్ధ బుద్ధిని గాని, స్థిరమైన మనస్సును గాని కలిగి యుండజాలడు. అవి లేనిదే శాంతిని పొందటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును?*

🌷. భాష్యము :
మనుజుడు కృష్ణభక్తిభావన యందు నిలువనిదే శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు, తపస్సులకు ఫలభోక్తయనియు, అతడే సకలసృష్టులకు అధిపతి యనియు, అతడే సకలజీవులకు నిజమైన స్నేహితుడనియు మనుజుడు అవగతము చేసికొనినపుడు వాస్తవమైన శాంతిని పొందునని భగవద్గీత పంచామాధ్యాయమున (5.29) ద్రువీకరింప బడినది. అనగా మనుజుడు కృష్ణభక్తిరస భావితుడు కానిచో మనస్సుకు ఒక లక్ష్యము లభింపడు. 

చరమలక్ష్యము లేనందునే మనస్సు చంచలమగును గనుక శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తమునకు భోక్త, ప్రభువు, స్నేహితుడు తెలిసికొననిచో మనుజుడు స్థిరమనస్సుతో శాంతిని పొందగలడు. 

కనుకనే శ్రీకృష్ణునితో ఎటువంటి సంబంధము లేకుండా వర్తించువాడు ఎంతటి ఆధ్యాత్మికపురోగతిని మరియు శాంతిని ప్రదర్శించినను శాంతి లేకుండా సదా కలత చెందియే ఉండును. కృష్ణభక్తిరసభావన యనునది స్వయముగా ప్రకటమయ్యే దివ్యమైన శాంతిస్థితి. అట్టి దివ్యస్థితి శ్రీకృష్ణునితో గల దివ్య సంబంధముతోనే ప్రాప్తించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 113 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 66 🌴*

66. nāsti buddhir ayuktasya na cāyuktasya bhāvanā
na cābhāvayataḥ śāntir aśāntasya kutaḥ sukham

🌷Translation :
*One who is not connected with the Supreme [in Kṛiṣhṇa consciousness] can have neither transcendental intelligence nor a steady mind, without which there is no possibility of peace. And how can there be any happiness without peace?*

🌷 Purport :
Unless one is in Kṛiṣhṇa consciousness, there is no possibility of peace. So it is confirmed in the Fifth Chapter (5.29) that when one understands that Kṛiṣhṇa is the only enjoyer of all the good results of sacrifice and penance, that He is the proprietor of all universal manifestations, and that He is the real friend of all living entities, then only can one have real peace. 

Therefore, if one is not in Kṛiṣhṇa consciousness, there cannot be a final goal for the mind. Disturbance is due to want of an ultimate goal, and when one is certain that Kṛiṣhṇa is the enjoyer, proprietor and friend of everyone and everything, then one can, with a steady mind, bring about peace. 

Therefore, one who is engaged without a relationship with Kṛiṣhṇa is certainly always in distress and is without peace, however much he may make a show of peace and spiritual advancement in life. Kṛiṣhṇa consciousness is a self-manifested peaceful condition which can be achieved only in relationship with Kṛiṣhṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 510 / Vishnu Sahasranama Contemplation - 510🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻510. సత్యసన్ధః, सत्यसन्धः, Satyasandhaḥ🌻*

*ఓం సత్యసన్ధాయ నమః | ॐ सत्यसन्धाय नमः | OM Satyasandhāya namaḥ*

సత్యాసన్ధాఽస్య సంకల్పః సత్యసన్ధోఽత ఉచ్యతే ।
శ్రీవిష్ణుస్సత్యసంకల్ప ఇతి శ్రుతి సమీరణాత్ ॥

సన్ధా అనగా సంకల్పము. సత్యము అనగా సఫలము అగు సంకల్పము ఎవనికి కలదో అట్టివాడు సత్యసంధుడు.

:: ఛాన్దోగ్యోపనిషత్ ఆష్టమః ప్రపాఠకః ప్రథమ ఖణ్డః ::

స బ్రూయా న్నాస్య జరయైత జ్జీర్యతి న వధే నాఽస్య హన్యత ఏత త్సత్యం బ్రహ్మ పుర మస్మిన్ కామా స్సమాహితా ఏష ఆత్మాఽపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోఽపిపాస స్సత్యకామ స్సత్యసఙ్కల్పో యథా హ్యేవేహ ప్రజా అన్వావిశంతి యథానుశాసనం యం యమన్త మభి కామా భవన్తియం జనపదం యం క్షేత్రభాగం తం తమే వోపజీవంతి ॥ 5 ॥

ఈ శరీరమునకు ముసలితనము వచ్చినను, బ్రహ్మమునకు అట్టి వృద్ధాప్యము రాదు. దేహమునకు దెబ్బ తగిలినను ఆత్మకు తగలదు. ఈ బ్రహ్మము సత్యమైనది. శరీరము సత్యము కానిది. బ్రహ్మమునందు సద్గుణములు ఆశ్రయించియున్నవి. ఈ బ్రహ్మము పాపరహితమైనది. పరబ్రహ్మమునకు ముసలితనము, మరణము, దుఃఖము, ఆకలి దప్పిక - ఇవి ఏవియునులేవు. ఆత్మ సత్యకామమైయున్నది (అది తలంచిన ప్రకారము జరుగును). సత్యసంకల్పమైయున్నది. అట్టి ఆత్మను తెలిసికొనవలయును. దానిని తెలిసికొనలేనిచో ఈ లోకమున రాజుయొక్క ఆజ్ఞానువర్తులై అనుసరించువారు ఏయే ఫలమును, ఏయే ప్రదేశమున కోరుదురో, దానినే పొందుదురు. కానీ సమస్తమును పొందునట్లు, సమస్తమును స్వేచ్ఛగా పొందలేరు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 510🌹*
📚. Prasad Bharadwaj

*🌻510. Satyasandhaḥ🌻*

*OM Satyasandhāya namaḥ*

सत्यासन्धाऽस्य संकल्पः सत्यसन्धोऽत उच्यते ।
श्रीविष्णुस्सत्यसंकल्प इति श्रुति समीरणात् ॥

Satyāsandhā’sya saṃkalpaḥ satyasandho’ta ucyate ,
Śrīviṣṇussatyasaṃkalpa iti śruti samīraṇāt .

One whose sandha or resolve always becomes true is Satyasandhaḥ.

:: छान्दोग्योपनिषत् आष्टमः प्रपाठकः प्रथम खण्डः ::

स ब्रूया न्नास्य जरयैत ज्जीर्यति न वधे नाऽस्य हन्यत एत त्सत्यं ब्रह्म पुर मस्मिन् कामा स्समाहिता एष आत्माऽपहतपाप्मा विजरो विमृत्युर्विशोको विजिघत्सोऽपिपास स्सत्यकाम स्सत्यसङ्कल्पो यथा ह्येवेह प्रजा अन्वाविशंति यथानुशासनं यं यमन्त मभि कामा भवन्तियं जनपदं यं क्षेत्रभागं तं तमे वोपजीवंति ॥ ५ ॥

:: Chāndogyopaniṣat āṣṭamaḥ prapāṭhakaḥ prathama khaṇḍaḥ ::

Sa brūyā nnāsya jarayaita jjīryati na vadhe nā’sya hanyata eta tsatyaṃ brahma pura masmin kāmā ssamāhitā eṣa ātmā’pahatapāpmā vijaro vimr‌tyurviśoko vijighatso’pipāsa ssatyakāma ssatyasaṅkalpo yathā hyeveha prajā anvāviśaṃti yathānuśāsanaṃ yaṃ yamanta mabhi kāmā bhavantiyaṃ janapadaṃ yaṃ kṣetrabhāgaṃ taṃ tame vopajīvaṃti. 5.

With the old age of the body, That (i.e. Brahman, described as the akasa in the heart) does not age; with the death of the body, That does not die. That Brahman and not the body is the real city of Brahman. In It all desires are contained. It is the Self−free from sin, free from old age, free from death, free from grief free from hunger, free from thirst; Its desires come true, Its thoughts come true. Just as, here on earth, people follow as they are commanded by a leader and depend upon whatever objects they desire, be it a country or a piece of land so also those who are ignorant of the Self depend upon other objects and experience the result of their good and evil deeds.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసన్ధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 188 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 6. The War between the Subject and the Object 🌻*

The external forces, the objective forces, are the Kauravas. The forces that are subjective may be likened to the Pandavas. So the Mahabharata is a war between the subject and the object. Now, what this object is, is also very difficult to explain. It may be a pencil; it may be a wristwatch; it may be one single item in this world that we may call an object. 

It may be one human being who may be in the position of an object. It may be a whole family, it may be an entire community, and it may be the whole human setup, the entire mankind or the whole physical universe—it is an object in front of us. The irreconcilability between the subjective attitude of consciousness with its objective structure is the preparation for the Mahabharata battle. 

Sri Ramakrishna Paramahamsa used to give a very homely example. Fire can burn ghee, as everyone knows. If we pour ghee over fire, the ghee will be no more. It is simply burned to nothing; it simply becomes vaporised. Yes, it is true, fire has the power to burn ghee and destroy it completely. But, says Sri Ramakrishna, if we pour one quintal of ghee over one spark of fire, what will happen to that fire? Though it is true, in principle, that fire can burn ghee, that one spark of the fire will be extinguished by the quintal of ghee that we poured.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 27 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 17. ఒక రహస్యము 🌻*

*ఈ మధ్యకాలమున ప్రపంచమున వేలాది సోదరబృందము లేర్పడినవి. ఈ బృందములన్నిటి యందును సోదరత్వము మాత్రమే కొలత. నామమాత్రపు సోదరత్వమే కాని అందు మూలసూత్రములు కానరావు. సోదరత్వమునకు విశ్వాసము పునాదిరాయి. ఒకరిపై ఒకరికి అపనమ్మకము, అనుమానము, సందేహము, అసంతృప్తి కలిగి బృందము మాత్రము గోచరించుచు నామావశిష్టములుగ ఈ బృందములు మిగిలివున్నవి. ఒకరి నొకరు "సోదరా” అని సంబోధింతురే కానీ హృదయమున సోదరత్వముండదు. భావశూన్యమైన ఉత్తమ పదజాలములతో ఒకరి నొకరు పొగడుకొనుచు ఎవరి కార్యములు వారు నెగ్గించుకొనుటకు ప్రయత్నించు చుందురు. ధర్మసంస్థల యందు ధర్మమే' కొఱత. సహకార సంఘముల యందు 'సహకారమే' కొలత. సేవాసంస్థల యందు 'సేవయే' కొలత.* 

*ఆధ్యాత్మిక సంస్థల యందు 'ఆత్మజ్ఞానమే' కొలత. పదజాలము ఇంద్రజాలమువలె వికృతముగ నాట్యము చేయుచున్నది. ఇట్టి కలుషిత వాతావరణమున గుహ్యముగ విశ్వమానవ సోదరత్వమునకు సంకల్ప బీజములు నిశ్శబ్దముగ చల్లుట నా కర్తవ్యము. ఈ బీజములు మొలకెత్తి ఉద్యానవనములై భవిష్యత్తు నందు సత్ఫలములీయ గలవని నా విశ్వాసము. ధర్మముపై పూర్ణ విశ్వాసము కలవారెల్లరును ఈ ఉద్యానవనమును క్రమముగా చేరగలరు. సమస్త ధర్మములను అతిక్రమించుచు భౌతిక వాదములు చెలరేగుచున్న ఈ సమయమున ధర్మము రహస్యముగ నూతన పునాదులను ఏర్పరచుకొనుచున్నది.*

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 94 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనసన్నది గతంలోనో, భవిష్యత్తులోనో వుంటుంది. ఈ క్షణంలో మాత్రం చైతన్యమన్నది స్వచ్చంగా వుంటుంది. ధ్యానంలో గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించుకుని ఇప్పుడు యిక్కడ జీవించడ మన్నదే నిజమైన యోగ జీవనం. 🍀*

*ఒకసారి నువ్వు గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించు కుంటే వందశాతం నువ్వు విముక్తుడవుతావు. ఎందుకంటే విషయమంతా యాభయి శాతం గతంలో, యాభయి శాతం భవిష్యత్తులో వుంటుంది. ఆ రెండూ లేకుంటే విషయమన్నదే వుండదు. వర్తమానంలో విషయమంటూ వుండదు. వ్యక్తి యిపుడు యిక్కడ వుంటే చైతన్యం ఖాళీగా వుంటుంది.* 

*ఎందుకంటే మనసన్నది గతంలోనో, భవిష్యత్తులోనో వుంటుంది. ఈ క్షణంలో మాత్రం చైతన్యమన్నది స్వచ్చంగా వుంటుంది. ధ్యానంలో క్రమక్రమంగా గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించుకుని వర్తమాన కేంద్రంలో నిలబడతాడు. ఇప్పుడు యిక్కడ జీవించడ మన్నదే నిజమైన యోగ జీవనం. అదే స్వచ్ఛమైన చైతన్యం. స్వచ్చమైన చైతన్యం గుండా జరిగేదే ధర్మం. అపుడు నువ్వేది చేసినా సరైందే అవుతుంది. నీ ప్రతిస్పందనకు అక్కడ పశ్చాత్తాప ముండదు. నువ్వు అక్కడే పొరపాటు చెయ్యవు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 320-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 320-1 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 320-1. 'రమణలంపటా' 🌻* 

స్త్రీ స్వరూపిణి యగుటచే పురుషునితో క్రీడించుట యందు ఆసక్తి కలిగియున్నది అని అర్థము. శ్రీమాత కామేశ్వరీ క్రీడాసక్తురాలు. ఆమె ఎల్లప్పుడును కామేశ్వరునితో క్రీడించుట, భోగించుట యందే ఆసక్తి కలిగియుండునది. రకరకములుగ లోకములను సృష్టిచేసి ఆ లోకముల యందు ఈశ్వరుని తోనే క్రీడించును. సృష్టి అవసరములను బట్టి సంభోగించును కూడ. ఆమెకు కామేశ్వరునితో రమించుటయందే ప్రధానముగ ఆసక్తి యుండును. తత్కారణముగ ఆమె రమణి. అతడు రమణుడు. రమించు టయేగాక, కామేశ్వరుని రమింప జేయును కూడ. 

రమింప చేయుట స్త్రీ గుణమే. పురుషుడు తానుగ రమించుట కుద్యమింపడు. పురుషుడు రమించుటకు ప్రేరణ స్త్రీ నుండి కలుగును. ఆమె రమింపజేసి రమించును. ఇది సృష్టి సత్యము.
తపస్సమాధి యందున్న ఈశ్వరుని కోరి రమించినది మాత పార్వతియే. ఆమె పరమేశ్వరుని మెప్పించుటకు భక్తియే ప్రధానమని భావించి, ప్రేమ భక్తిని ప్రదర్శించి శివుని మెప్పించి, శివునితో క్రీడించి నది. అనితర సాధ్యమైన కార్యము నిర్వహించినది. భక్తి, ప్రేమ ఒక దాని కొకటి అనురూపములని చాటి తెలిపినది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 320-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 320-1. Ramaṇa-lampaṭā रमण-लम्पटा (320) 🌻*

She enjoys Her moments with Her consort Śiva at sahasrāra. She enjoys the marital bliss. She loves to play around with Śiva. She makes women devoted to their husbands, since She is the embodiment of women (previous nāma).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹