నిర్మల ధ్యానాలు - ఓషో - 94


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 94 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనసన్నది గతంలోనో, భవిష్యత్తులోనో వుంటుంది. ఈ క్షణంలో మాత్రం చైతన్యమన్నది స్వచ్చంగా వుంటుంది. ధ్యానంలో గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించుకుని ఇప్పుడు యిక్కడ జీవించడ మన్నదే నిజమైన యోగ జీవనం. 🍀


ఒకసారి నువ్వు గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించు కుంటే వందశాతం నువ్వు విముక్తుడవుతావు. ఎందుకంటే విషయమంతా యాభయి శాతం గతంలో, యాభయి శాతం భవిష్యత్తులో వుంటుంది. ఆ రెండూ లేకుంటే విషయమన్నదే వుండదు. వర్తమానంలో విషయమంటూ వుండదు. వ్యక్తి యిపుడు యిక్కడ వుంటే చైతన్యం ఖాళీగా వుంటుంది.

ఎందుకంటే మనసన్నది గతంలోనో, భవిష్యత్తులోనో వుంటుంది. ఈ క్షణంలో మాత్రం చైతన్యమన్నది స్వచ్చంగా వుంటుంది. ధ్యానంలో క్రమక్రమంగా గతం నించీ భవిష్యత్తు నించీ ఉపసంహరించుకుని వర్తమాన కేంద్రంలో నిలబడతాడు. ఇప్పుడు యిక్కడ జీవించడ మన్నదే నిజమైన యోగ జీవనం. అదే స్వచ్ఛమైన చైతన్యం. స్వచ్చమైన చైతన్యం గుండా జరిగేదే ధర్మం. అపుడు నువ్వేది చేసినా సరైందే అవుతుంది. నీ ప్రతిస్పందనకు అక్కడ పశ్చాత్తాప ముండదు. నువ్వు అక్కడే పొరపాటు చెయ్యవు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment