Obedience to the Guru


Obedience to the guru is necessary for attunement with his wisdom. 
It is not slavery to follow the wish of a God-realized guru, because his wish gives independence and freedom. 
A true guru is the servant of God, carrying out His plan for your liberation. Realize this, and you will always obey, until you find perfect freedom in Spirit.




18 Mar 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 90


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 90 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 75. ప్రత్యేక దృష్టి - 2 🌻


భూమిపై తిరుగాడు దైవము దత్తాత్రేయుడు. అతడు సామాన్యులలో కలసిమెలసి తిరుగుచుండును. అతని నెవ్వరునూ గుర్తింపలేరు. కారణము మానవుల డాంబికతయే. డాంబిక విషయముల యందు సత్యము నేతి బీరకాయలోని నెయ్యివంటిది. ఆధ్యాత్మిక మార్గముననే చాటించుకొనుచు తమను తామే కీర్తించుకొను సంఘములు పెక్కు గలవు. అందు ఆధ్యాత్మికత నామమాత్రమే.

విలువగల విషయము లెప్పుడును మరుగున యుండును. ఒక రకమగు తమస్సు వాని నావరించి వెలుగును మరుగుగ నుంచును. కావున మహత్తర విషయములను, సన్నివేశములను, మనుష్యులను గుర్తించుటకు మీరు ప్రత్యేకమగు కన్నును ఏర్పాటు గావించు కొనవలెను. అట్టి దృష్టి లేనివాని జీవితము సత్యదూరమై సాగును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


18 Mar 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 152


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 152 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితం నీకు రెండు రకాలయిన అవకాశాల్ని యిస్తుంది. అది నీకు పగలు నిస్తుంది. అది నీకు రాత్రి నిస్తుంది. అదెప్పుడూ సమతూకంగా వుంటుంది. ఏది నువ్వు ఎంచుకుంటావో అదే నీకు కనబడుతుంది. 🍀


మనం దు:ఖాల్లో మునిగి తేలడానికి చాలా కష్టపడుతూ వుంటాం. జనం ఆ విషయాన్ని గుర్తించరు. ఆ విషయం గుర్తిస్తే వాళ్ళు నవ్వుకుంటారు. ఎప్పుడూ వీలయినన్ని మార్గాల్లో బాధల్ని కొని తెచ్చుకుంటూ వుంటారు. చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు. వాళ్ళు తమకి బాధల్ని అందించే ప్రతి దానిలోకి దూకుతారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. జీవితం నీకు రెండు రకాలయిన అవకాశాల్ని యిస్తుంది. అది నీకు పగలు నిస్తుంది. అది నీకు రాత్రి నిస్తుంది. అది నీకు గులాబీల నిస్తుంది. అది నీకు ముళ్ళనిస్తుంది. అది నీకు రెండు రకాలయిన అవకాశాల్ని యిస్తుంది.

అదెప్పుడూ సమతూకంగా వుంటుంది. ఎప్పుడూ ఫిఫ్టీ, ఫిఫ్టీగా వుంటుంది. నువ్వు ఏ అవకాశాన్ని ఉపయోగించు కుంటున్నావన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ జరిగే అద్భుతమేమిటంటే నువ్వు ముళ్ళను ఎంచుకుంటే అక్కడ పూలు అదృశ్యమవుతాయి. కారణం నీ మనసు ముళ్ళకే అతుక్కుని వుంటుంది. నీకు ముళ్ళు మాత్రమే కనిపిస్తాయి. పూలని కోల్పోతావు. అసలు వాటిని గుర్తించనే గుర్తించవు. అట్లాగే పూలను ఎన్నుకొన్న వాడి పరిస్థితి కూడా అదే అతను ముళ్ళను మరిచిపోవడం ప్రారంభిస్తాడు. అసలు ముళ్ళే అతనికి కనిపించవు. అతను ఎంత పాజిటివ్ గా ఆశావహంగా చూస్తాడంటే అతని దృష్టి పూర్తిగా భిన్నంగా వుంటుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 Mar 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 251 - 7. అధిదైవ దైవత్వాలు సంఖ్యలో లెక్కలేనన్ని / DAILY WISDOM - 251 - 7. Adhidaiva Divinities are Countless in Number


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 251 / DAILY WISDOM - 251 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 7. అధిదైవ దైవత్వాలు సంఖ్యలో లెక్కలేనన్ని 🌻


విశ్వాత్మ చేతనాశక్తి యొక్క త్రైపాక్షిక అమరిక - ఆత్మాశ్రయం, లక్ష్యం మరియు మధ్యవర్తిత్వ స్పృహ అనే త్రికోణ సూత్రంలో ఉంటాయి. అవి, ఆధ్యాత్మ, అధిభూత, మరియు అధిదైవంగా తెలుస్తాయి. వీటి వేదాంత వివరణల యొక్క మొత్తం శ్రేణి ఒక ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. అదేమిటంటే అధిదైవము దేనికీ చెందకుండా కూడా, ఆత్మాశ్రయ మరియు వాస్తవిక అనుభవం అనే రెండింటినీ నియంత్రించే దైవత్వం అయినప్పుడు, ఆధ్యాత్మము మరియు ఆదిభౌతికం అదే సమయంలో ఆత్మాశ్రయ లేదా వాస్తవికమునకు చెందినది కాదు అని చెప్పబడినప్పుడు, చేతన మరియు పదార్థం మధ్య విషయ సంబంధం ఉండకూడదు కదా అని ?.

అవరోహణ మరియు ఆరోహణ అని చెప్పే ఈ విశ్వం యొక్క సృష్టిలో చేతన-పదార్థం యొక్క సంబంధాలు, సోపానక్రమంలో చిన్నవి లేదా పెద్ద కొలతలు కలిగిన అనంతమైన కోణములు - స్థూల పదార్థ మిశ్రమ శ్రేణితో ఏర్పడిందని చెప్పవచ్చు. విశ్య పదార్థం అవరోహణలో క్రిందికి రావడం, తన ఈ అతిక్రమణలో ఎక్కువ, మరింత ఎక్కువ అస్పష్టతతో విస్తరించడం వలన, మరియు అనంతము యొక్క చేతనా కోణములు సంపూర్ణత వైపు అధిరోహించడంతో, నిమ్న జగత్తులలో ఈ సంబంధం అచేతనంగా, మరింత అస్పష్టంగా మారుతుంది. ఈ అనంత కోణముల ఆరోహణ మరియు పదార్ధత యొక్క స్థూలత విశ్వంలో ప్రతిచోటా విస్తరించి ఉన్నందున, ఆత్మాశ్రయ చేతన మరియు పదార్ధ వాస్తవికతల మధ్య సమగ్రత మరియు పారదర్శకత యొక్క సంబంధిత స్థాయికి అనుగుణంగా పరిమాణంలో మరియు నాణ్యతలో తేడా ఉంటుంది. ఈ ఆదిదైవ దైవత్వాల సంఖ్య లెక్కలేనన్ని ఉండడం అనేది నిజానికి అనేక ప్రసిద్ధ మత ఆరాధనల యొక్క దేవతలుగా ఉండడం కనిపిస్తుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 DAILY WISDOM - 251 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 7. Adhidaiva Divinities are Countless in Number🌻


The tripartite arrangement of the Universal Being into the subjective, objective and the principle of an intermediary consciousness, namely, adhyatma, adhibhuta and adhidaiva, raises also the question of the whole range of theological enunciations, since the adhidaiva is the divinity that controls the subjective and the objective sides of experience—adhyatma and adhibhuta—and at the same time rises above them in an instantaneous act of transcendence by not belonging either to the subjective or the objective side, though immanently present in both the sides, without which there cannot be a conscious relation between the subject and the object.

The descent, or may we say ascent, of the hierarchy of subject-object relations in the history of the creation of the universe may be said to be constituted of an infinite series of degrees of lesser and larger dimensions, the relation becoming grosser and more inscrutable as the degrees come downwards in descent and enlarging in greater and greater perspicuity and transcendence as the degrees ascend towards the Absolute. Inasmuch as these degrees of ascent and descent are spread out everywhere in the universe, differing in quantity and quality in accordance with the corresponding degree of inclusiveness and transparency obtaining between the subjective and objective sides, it appears that these adhidaiva divinities are countless in number and these are, in fact, the many gods of popular religious worship.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Mar 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 21 / Agni Maha Purana - 21


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 21 / Agni Maha Purana - 21 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 8

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. కిష్కిందకాండ వర్ణనము - 2 🌻


ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వానరులు తూర్పు-పశ్చిమము, ఉత్తరము వైపు వెళ్లి అచట సీతను గానక రామ సుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి.

హనుమంతుడు రాముని అంగుళీయకమును తీసికొని, వానరసమేతుడై దక్షిణ దిక్కునందు సుప్రభ గుహ సమీపమున అన్వేషించెను.

మాసము దాటిన తరువాత కూడ వింధ్యపర్వతమునందు ఉండి సీతను చూడజాలని ఆ వానరులు ఇట్లు అనుకొనిరి. ''మన మందరము వ్యర్థముగా మరణించనున్నాము. యుద్దమునందు రావణునిచే చంపబడి, సీత నిమత్తమై ప్రాణములు విడచిన ఆ జటాయువు ధన్యుడు కదా!''

ఆ మాటలు విని సంపాతి వానరులును భక్షించుట మాని ఇట్లు పలికెను. ఆ జటాయువు నాసోదరుడు , నాతో కలిసి సూర్య మండలము వైపు ఎగిరెను. అతనిని నేను సూర్యుని వేడవిమినుండి రక్షించగా భూమి పై పడెను. ఆకాశము పైనున్న నా రెక్కలు కాలిపోయినవి. రాముని కథ వినుటచే నా రెక్కలు మరల మొలచినవి.

ఓ వానరులారా! శత యోజనవిస్తీర్ణమైన లవణ సముద్రమున,. త్రికూటపర్వతముపై నున్న లంకాపట్టణమునందు అశోకవనములో ఉన్న జానకి నాకు కనబడుచున్నది. ఈ విషయము తెలిసికొని రామసుగ్రీవులకు తెలుపుడు.

అగ్ని మహాపురాణమునందు రామాయణ కథలో కిష్కిన్దాకాండ వర్ణనమును అష్టమాధ్యమాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Agni Maha Purana -21 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 8

🌻 Kishkinda Kand - 2 🌻

10. So saying (he sent monkeys in all directions). The monkeys sent towards the eastern, western and northern routes came (back) to Rāma and Sugrīva not finding Jānakī.

11. Having taken the signet ring of Rāma, Hanūmat together with other monkeys searched in the south in the caves of Suprabhā (mountain).

12- 16. And being engaged for more than a month and not being able to find Jānakī, they said, “We will die in vain. Jaṭāyu is fortunate. For the sake of Sītā, he gave his life being wounded by Rāvaṇa in the battle.”

Having heard this, (the eagle) Sam-pāti, abandoning (his intention of) eating the monkeys (said), “This brother of mine, Jaṭāyu, was protected by me from the heat of the Sun as he was flying in the solar region. Hence, I had my wings burnt as I was flying in the clouds.

On account of hearing the story of Rāma, the wings have grown again. I see Jānakī gone to Aśoka grove in Laṅkā in the Trikūṭaka (mountain) in (the middle of) the salt ocean of an extent of hundred yojanas. Knowing this let the monkeys tell Rāma and Sugrīva.”


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


18 Mar 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 572 / Vishnu Sahasranama Contemplation - 572


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 572 / Vishnu Sahasranama Contemplation - 572🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 572. సర్వదృగ్వ్యాసః, सर्वदृग्व्यासः, Sarvadr‌gvyāsaḥ 🌻


ఓం సర్వదృగ్వ్యాసాయ నమః | ॐ सर्वदृग्व्यासाय नमः | OM Sarvadr‌gvyāsāya namaḥ

సర్వదృగ్వ్యాసః, सर्वदृग्व्यासः, Sarvadr‌gvyāsaḥ

విస్తారకృత్ సర్వదృశాం సర్వదృగ్వ్యాస ఉచ్యతే ।
సర్వాఽస్య సాచ దృక్చేతి విష్ణుస్సర్వదృగుచ్యతే ॥
సర్వాకారజ్ఞానరూపః దృక్ త్వాత్ సర్వస్య సర్వదృక్ ।
ఋగ్వేదాదివిభాగేన వ్యస్తో వేదశ్చతుర్విధః ॥
ఆద్య ఏకవింశతిధా సామవేదస్సహస్రధా ।
యజుర్వేద ఏకోత్తరశతధా శ్రూయతే కృతః ॥
అథర్వవేదో నవధా శాఖాభేదేన వై కృతః ।
అన్యాని చ పురాణాని వ్యస్తానేమవనేనహి ॥

దృక్ అనగా చూడబడి, ఎరుగబడెడి జ్ఞానము. వ్యాపింపజేయువాడు వ్యాసః. సర్వ విధములగు జ్ఞానమును విస్తారము చేయువాడు లేదా విస్తరింపజేయువాడు సర్వదృగ్వ్యాసః.

సాధన భూతమగు దేని సాయముచే ఏ వస్తువు కానీ విషయము కానీ చూడ, తెలియ బడునో అది దృక్ అనగా దృష్టి. సర్వదృక్ అనగా సర్వరూపములును గల జ్ఞానము. ప్రతియొకనికి సంబంధించిన దృష్టి అనదగినది వేదమే! అట్టి సర్వదృక్ అగు వేదమును విభజించినవాడు సర్వదృగ్వ్యాసః.

ఋగ్వేదాది విభాగముతో వేదము నాలుగుగా విభాగించబడినది. అందును మొదటి ఋగ్వేదము ఇరువదియొక విధములుగా చేయబడినది. రెండవది అయిన యజుర్వేదము నూటయొక విధములుగా చేయబడినది. సామవేదము వేయి విధములుగా, అథర్వ వేదము తొమ్మిది విధములుగా విభాగింపబడినవి. ఇట్లు వేదములు అన్నియు శాఖా భేదముచే విభజించబడినవి. ఈ విధముగానే ఇతరములగు పురాణములును ఈతనిచే విభజించబడినవి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 572🌹

📚. Prasad Bharadwaj

🌻 572. Sarvadr‌gvyāsaḥ 🌻


OM Sarvadr‌gvyāsāya namaḥ

विस्तारकृत् सर्वदृशां सर्वदृग्व्यास उच्यते ।
सर्वाऽस्य साच दृक्चेति विष्णुस्सर्वदृगुच्यते ॥
सर्वाकारज्ञानरूपः दृक् त्वात् सर्वस्य सर्वदृक् ।
ऋग्वेदादिविभागेन व्यस्तो वेदश्चतुर्विधः ॥
आद्य एकविंशतिधा सामवेदस्सहस्रधा ।
यजुर्वेद एकोत्तरशतधा श्रूयते कृतः ॥
अथर्ववेदो नवधा शाखाभेदेन वै कृतः ।
अन्यानि च पुराणानि व्यस्तानेमवनेनहि ॥


Vistārakr‌t sarvadr‌śāṃ sarvadr‌gvyāsa ucyate,
Sarvā’sya sāca dr‌kceti viṣṇussarvadr‌gucyate.
Sarvākārajñānarūpaḥ dr‌k tvāt sarvasya sarvadr‌k,
R‌gvedādivibhāgena vyasto vedaścaturvidhaḥ.
Ādya ekaviṃśatidhā sāmavedassahasradhā,
Yajurveda ekottaraśatadhā śrūyate kr‌taḥ.
Atharvavedo navadhā śākhābhedena vai kr‌taḥ,
Anyāni ca purāṇāni vyastānemavanenahi.


As Vyāsa He expounded at length - all knowledge and hence Sarvadr‌gvyāsaḥ.

Sarvadr‌k means jñāna or the knowledge that encompasses every aspect. What other jñāna is worth calling Sarvadr‌k but the Veda?

Sarvadr‌k means He sees everything. Vyāsa the classifier. Vedas were classified fourfold in the forms of R‌k and others. The first of them, R‌g Veda was made of twenty one parts. The second Yajur Veda was made of one thousand and one parts. The Sāma Veda was of a thousand parts and the Atharva Veda in nine branches. And also other purāṇas were made by him, vyastāni. So he was called Vyāsa. In that aspect, the Lord too is called Vyāsa i.e., Brahmā.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


18 Mar 2022

హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, వసంతోత్సవం శుభాకాంక్షలు Holi Purnima, Kamuni Purnima, Vasant festival greetings


🌹. హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, వసంతోత్సవం శుభాకాంక్షలు 🌹

🍀🔱. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? ? 🔱🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ


తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.


🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀

రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.

ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది. కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగపురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.

ఫాల్గుణశు ద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.


🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀

శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.

🌹 🌹 🌹 🌹 🌹


18 Mar 2022

18 - MARCH - 2022 శుక్రవారం MESSAGES హోళీ పండుగ శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 18, మార్చి 2022 శుక్రవారం , భృగు వాసరే - హోళీ పూర్ణిమ శుభాకాంక్షలు🌹 
*🌹. హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, వసంతోత్సవం శుభాకాంక్షలు 🌹*
🍀🔱. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? ? 🔱🍀*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 174 / Bhagavad-Gita - 174 - 4-12 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 572 / Vishnu Sahasranama Contemplation - 572🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 21 / Agni Maha Purana 21 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 251 / DAILY WISDOM - 251 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 152 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 90 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. హోళీ పూర్ణిమ శుభాకాంక్షలు మరియు శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 18, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : హోళీ పూర్ణిమ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి, Holi, Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 14 🍀*

27. నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీస్తస్య నశ్యతి |
ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి
28. యః పఠేత్ప్రాతరుత్థాయ శ్రద్ధాభక్తిసమన్వితః |
గృహే తస్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీ మనస్సు, బుద్ధియే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటుంది. తపస్సుతో దానిని సరి చేసుకోండి. - శ్రీరామశర్మ ఆచార్య. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: పూర్ణిమ 12:48:45 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 24:18:11 వరకు
తదుపరి హస్త
యోగం: దండ 23:14:01 వరకు
తదుపరి వృధ్ధి
 కరణం: బవ 12:44:44 వరకు
వర్జ్యం: 07:41:54 - 09:16:46
దుర్ముహూర్తం: 08:46:54 - 09:35:13
మరియు 12:48:26 - 13:36:44
రాహు కాలం: 10:53:42 - 12:24:17
గుళిక కాలం: 07:52:34 - 09:23:08
యమ గండం: 15:25:25 - 16:55:59
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:48
అమృత కాలం: 17:11:06 - 18:45:58
సూర్యోదయం: 06:21:59
సూర్యాస్తమయం: 18:26:33
చంద్రోదయం: 18:38:03
చంద్రాస్తమయం: 06:26:38
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
శుభ యోగం - కార్య జయం 24:18:11
వరకు తదుపరి అమృత యోగం 
- కార్య సిధ్ది 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, వసంతోత్సవం శుభాకాంక్షలు 🌹*
🍀🔱. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? ? 🔱🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.*

🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀

*రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.*

*ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.*

*ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది. కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగపురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.*

*ఫాల్గుణశు ద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.*

*🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀*

*శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.*
🌹 🌹 🌹 🌹 🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 174 / Bhagavad-Gita - 174 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 12 🌴*

*12. కాంక్షన్త: కర్మాణాం సిద్ధిం యజన్త ఇహ దేవతా: |*
*క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||*

🌷. తాత్పర్యం :
*లోకమున జనులు కామ్యకర్మల యందు జయమును గోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగము నందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు.*

🌻. భాష్యము :
ఈ జగమున దైవమును గూర్చి లేదా దేవతలను గూర్చియు గొప్ప తప్పు భావన కలదు. అల్పజ్ఞులైనవారు (విద్వాంసులుగా చలామణి అగుచున్నను) దేవతలను భగవానుని వివిధరూపములుగా భావింతురు. కాని వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధరూపములు కారు. వారు కేవలము అతని అంశాలు మాత్రమే. భగవానుడొక్కడే కాని అతని అంశలు మాత్రము అనతములు. “నిత్యోనిత్యానాం” – భగవానుడొక్కడే యని వేదములు తెలుపుచున్నవి. 

“ఈశ్వర: పరమ: కృష్ణ:” – దేవదేవుడు అద్వితీయుడు. ఆతడే శ్రీకృష్ణుడు. భౌతికజగమును పాలించుటకు పాలనాధికారము ఒసగబడెడివారే దేవతలు. వారందరును వివిధశక్తులు కలిగిన జీవులు(నిత్యనాం) మాత్రమే. వారెన్నడను దేవదేవుడైన శ్రీకృష్ణునితో లేదా నారాయణునితో లేదా విష్ణువుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు మరియు శ్రీకృష్ణభగవానుడు సమానమే యని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడని పిలువబడును. బ్రహ్మ మరియు శివుని వంటి మహా దేవతలే ఆ భగవానునకు సాటిరారు. 

వాస్తవమునకు భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలచే పూజలనందుచుండును(శివవిరించితమ్). అయినను ఆశ్చర్యవిషయమేమన మూఢజనులు కొందరు భగవానునికి మనుష్యరూపమును ఆపాదించుట లేదా భగవానునికి జంతురూపము నపాదించుట వంటి అపోహలో పలువురు మానవులన పూజించుచుందురు. ఈ శ్లోకమున “ఇహదేవతా:” అణు పదము ఈ లోకమునకు చెందిన శక్తిమంతుడైన మనుజుని గాని, దేవతను గాని సూచించును. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుడు (నారాయణుడు లేదా విష్ణువు) ఈ లోకమునకు చెందినవాడుకాడు. అతడు ఈ భౌతికజగమునకు పరమైనట్టివాడు.  

మూఢజనులు (హృతజ్ఞానులు) శీఘ్రఫలములను గోరినందున వివిధదేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను, అవి అశాశ్వతములనియు మరియు బుద్ధిహీనులకు మాత్రమే నిర్దేశింపబడినవనియు ఎరుగజాలరు. కాని బుద్ధిమంతుడైనవాడు కృష్ణభక్తిభావన యందు నిలిచిన కారణముగా ఏదియో తాత్కాలిక లాభము కొరకై వివిధ దేవతలను అర్చింప నవసరము లేదు. వాస్తవమునకు దేవతలు మరియు వారిని పూజించెడి వారందరును విశ్వప్రళయమున నశించిపోవుదురు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 174 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 12 🌴*

*12. kāṅkṣantaḥ karmaṇāṁ siddhiṁ yajanta iha devatāḥ*
*kṣipraṁ hi mānuṣe loke siddhir bhavati karma-jā*

🌷 Translation : 
*Men in this world desire success in fruitive activities, and therefore they worship the demigods. Quickly, of course, men get results from fruitive work in this world.*

🌹 Purport :
There is a great misconception about the gods or demigods of this material world, and men of less intelligence, although passing as great scholars, take these demigods to be various forms of the Supreme Lord.

Actually, the demigods are not different forms of God, but they are God’s different parts and parcels. God is one, and the parts and parcels are many. The Vedas say, nityo nityānām: God is one. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ. The Supreme God is one – Kṛṣṇa – and the demigods are delegated with powers to manage this material world. These demigods are all living entities (nityānām) with different grades of material power. They cannot be equal to the Supreme God – Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa. 

Anyone who thinks that God and the demigods are on the same level is called an atheist, or pāṣaṇḍī. Even the great demigods like Brahmā and Śiva cannot be compared to the Supreme Lord. In fact, the Lord is worshiped by demigods such as Brahmā and Śiva (śiva-viriñci-nutam). Yet curiously enough there are many human leaders who are worshiped by foolish men under the misunderstanding of anthropomorphism or zoomorphism. Iha devatāḥ denotes a powerful man or demigod of this material world. But Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa, the Supreme Personality of Godhead, does not belong to this world. He is above, or transcendental to, material creation. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 572 / Vishnu Sahasranama Contemplation - 572🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 572. సర్వదృగ్వ్యాసః, सर्वदृग्व्यासः, Sarvadr‌gvyāsaḥ 🌻*

*ఓం సర్వదృగ్వ్యాసాయ నమః | ॐ सर्वदृग्व्यासाय नमः | OM Sarvadr‌gvyāsāya namaḥ*

సర్వదృగ్వ్యాసః, सर्वदृग्व्यासः, Sarvadr‌gvyāsaḥ

విస్తారకృత్ సర్వదృశాం సర్వదృగ్వ్యాస ఉచ్యతే ।
సర్వాఽస్య సాచ దృక్చేతి విష్ణుస్సర్వదృగుచ్యతే ॥
సర్వాకారజ్ఞానరూపః దృక్ త్వాత్ సర్వస్య సర్వదృక్ ।
ఋగ్వేదాదివిభాగేన వ్యస్తో వేదశ్చతుర్విధః ॥
ఆద్య ఏకవింశతిధా సామవేదస్సహస్రధా ।
యజుర్వేద ఏకోత్తరశతధా శ్రూయతే కృతః ॥
అథర్వవేదో నవధా శాఖాభేదేన వై కృతః ।
అన్యాని చ పురాణాని వ్యస్తానేమవనేనహి ॥

*దృక్ అనగా చూడబడి, ఎరుగబడెడి జ్ఞానము. వ్యాపింపజేయువాడు వ్యాసః. సర్వ విధములగు జ్ఞానమును విస్తారము చేయువాడు లేదా విస్తరింపజేయువాడు సర్వదృగ్వ్యాసః.*

*సాధన భూతమగు దేని సాయముచే ఏ వస్తువు కానీ విషయము కానీ చూడ, తెలియ బడునో అది దృక్ అనగా దృష్టి. సర్వదృక్ అనగా సర్వరూపములును గల జ్ఞానము. ప్రతియొకనికి సంబంధించిన దృష్టి అనదగినది వేదమే! అట్టి సర్వదృక్ అగు వేదమును విభజించినవాడు సర్వదృగ్వ్యాసః.*

*ఋగ్వేదాది విభాగముతో వేదము నాలుగుగా విభాగించబడినది. అందును మొదటి ఋగ్వేదము ఇరువదియొక విధములుగా చేయబడినది. రెండవది అయిన యజుర్వేదము నూటయొక విధములుగా చేయబడినది. సామవేదము వేయి విధములుగా, అథర్వ వేదము తొమ్మిది విధములుగా విభాగింపబడినవి. ఇట్లు వేదములు అన్నియు శాఖా భేదముచే విభజించబడినవి. ఈ విధముగానే ఇతరములగు పురాణములును ఈతనిచే విభజించబడినవి.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 572🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 572. Sarvadr‌gvyāsaḥ 🌻*

*OM Sarvadr‌gvyāsāya namaḥ*

विस्तारकृत् सर्वदृशां सर्वदृग्व्यास उच्यते ।
सर्वाऽस्य साच दृक्चेति विष्णुस्सर्वदृगुच्यते ॥
सर्वाकारज्ञानरूपः दृक् त्वात् सर्वस्य सर्वदृक् ।
ऋग्वेदादिविभागेन व्यस्तो वेदश्चतुर्विधः ॥
आद्य एकविंशतिधा सामवेदस्सहस्रधा ।
यजुर्वेद एकोत्तरशतधा श्रूयते कृतः ॥
अथर्ववेदो नवधा शाखाभेदेन वै कृतः ।
अन्यानि च पुराणानि व्यस्तानेमवनेनहि ॥

Vistārakr‌t sarvadr‌śāṃ sarvadr‌gvyāsa ucyate,
Sarvā’sya sāca dr‌kceti viṣṇussarvadr‌gucyate.
Sarvākārajñānarūpaḥ dr‌k tvāt sarvasya sarvadr‌k,
R‌gvedādivibhāgena vyasto vedaścaturvidhaḥ.
Ādya ekaviṃśatidhā sāmavedassahasradhā,
Yajurveda ekottaraśatadhā śrūyate kr‌taḥ.
Atharvavedo navadhā śākhābhedena vai kr‌taḥ,
Anyāni ca purāṇāni vyastānemavanenahi.

*As Vyāsa He expounded at length - all knowledge and hence Sarvadr‌gvyāsaḥ.*

*Sarvadr‌k means jñāna or the knowledge that encompasses every aspect. What other jñāna is worth calling Sarvadr‌k but the Veda?*

*Sarvadr‌k means He sees everything. Vyāsa the classifier. Vedas were classified fourfold in the forms of R‌k and others. The first of them, R‌g Veda was made of twenty one parts. The second Yajur Veda was made of one thousand and one parts. The Sāma Veda was of a thousand parts and the Atharva Veda in nine branches. And also other purāṇas were made by him, vyastāni. So he was called Vyāsa. In that aspect, the Lord too is called Vyāsa i.e., Brahmā.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 21 / Agni Maha Purana - 21 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 8*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. కిష్కిందకాండ వర్ణనము - 2 🌻*

ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వానరులు తూర్పు-పశ్చిమము, ఉత్తరము వైపు వెళ్లి అచట సీతను గానక రామ సుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి.

హనుమంతుడు రాముని అంగుళీయకమును తీసికొని, వానరసమేతుడై దక్షిణ దిక్కునందు సుప్రభ గుహ సమీపమున అన్వేషించెను.

మాసము దాటిన తరువాత కూడ వింధ్యపర్వతమునందు ఉండి సీతను చూడజాలని ఆ వానరులు ఇట్లు అనుకొనిరి. ''మన మందరము వ్యర్థముగా మరణించనున్నాము. యుద్దమునందు రావణునిచే చంపబడి, సీత నిమత్తమై ప్రాణములు విడచిన ఆ జటాయువు ధన్యుడు కదా!''

ఆ మాటలు విని సంపాతి వానరులును భక్షించుట మాని ఇట్లు పలికెను. ఆ జటాయువు నాసోదరుడు , నాతో కలిసి సూర్య మండలము వైపు ఎగిరెను. అతనిని నేను సూర్యుని వేడవిమినుండి రక్షించగా భూమి పై పడెను. ఆకాశము పైనున్న నా రెక్కలు కాలిపోయినవి. రాముని కథ వినుటచే నా రెక్కలు మరల మొలచినవి. 

ఓ వానరులారా! శత యోజనవిస్తీర్ణమైన లవణ సముద్రమున,. త్రికూటపర్వతముపై నున్న లంకాపట్టణమునందు అశోకవనములో ఉన్న జానకి నాకు కనబడుచున్నది. ఈ విషయము తెలిసికొని రామసుగ్రీవులకు తెలుపుడు.

అగ్ని మహాపురాణమునందు రామాయణ కథలో కిష్కిన్దాకాండ వర్ణనమును అష్టమాధ్యమాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -21 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

Chapter 8
*🌻 Kishkinda Kand - 2 🌻*

10. So saying (he sent monkeys in all directions). The monkeys sent towards the eastern, western and northern routes came (back) to Rāma and Sugrīva not finding Jānakī.

11. Having taken the signet ring of Rāma, Hanūmat together with other monkeys searched in the south in the caves of Suprabhā (mountain).

12- 16. And being engaged for more than a month and not being able to find Jānakī, they said, “We will die in vain. Jaṭāyu is fortunate. For the sake of Sītā, he gave his life being wounded by Rāvaṇa in the battle.” 

Having heard this, (the eagle) Sam-pāti, abandoning (his intention of) eating the monkeys (said), “This brother of mine, Jaṭāyu, was protected by me from the heat of the Sun as he was flying in the solar region. Hence, I had my wings burnt as I was flying in the clouds. 

On account of hearing the story of Rāma, the wings have grown again. I see Jānakī gone to Aśoka grove in Laṅkā in the Trikūṭaka (mountain) in (the middle of) the salt ocean of an extent of hundred yojanas. Knowing this let the monkeys tell Rāma and Sugrīva.”

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 251 / DAILY WISDOM - 251 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 7. అధిదైవ దైవత్వాలు సంఖ్యలో లెక్కలేనన్ని 🌻*

*విశ్వాత్మ చేతనాశక్తి యొక్క త్రైపాక్షిక అమరిక - ఆత్మాశ్రయం, లక్ష్యం మరియు మధ్యవర్తిత్వ స్పృహ అనే త్రికోణ సూత్రంలో ఉంటాయి. అవి, ఆధ్యాత్మ, అధిభూత, మరియు అధిదైవంగా తెలుస్తాయి. వీటి వేదాంత వివరణల యొక్క మొత్తం శ్రేణి ఒక ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. అదేమిటంటే అధిదైవము దేనికీ చెందకుండా కూడా, ఆత్మాశ్రయ మరియు వాస్తవిక అనుభవం అనే రెండింటినీ నియంత్రించే దైవత్వం అయినప్పుడు, ఆధ్యాత్మము మరియు ఆదిభౌతికం అదే సమయంలో ఆత్మాశ్రయ లేదా వాస్తవికమునకు చెందినది కాదు అని చెప్పబడినప్పుడు, చేతన మరియు పదార్థం మధ్య విషయ సంబంధం ఉండకూడదు కదా అని ?.*
 
*అవరోహణ మరియు ఆరోహణ అని చెప్పే ఈ విశ్వం యొక్క సృష్టిలో చేతన-పదార్థం యొక్క సంబంధాలు, సోపానక్రమంలో చిన్నవి లేదా పెద్ద కొలతలు కలిగిన అనంతమైన కోణములు - స్థూల పదార్థ మిశ్రమ శ్రేణితో ఏర్పడిందని చెప్పవచ్చు. విశ్య పదార్థం అవరోహణలో క్రిందికి రావడం, తన ఈ అతిక్రమణలో ఎక్కువ, మరింత ఎక్కువ అస్పష్టతతో విస్తరించడం వలన, మరియు అనంతము యొక్క చేతనా కోణములు సంపూర్ణత వైపు అధిరోహించడంతో, నిమ్న జగత్తులలో ఈ సంబంధం అచేతనంగా, మరింత అస్పష్టంగా మారుతుంది. ఈ అనంత కోణముల ఆరోహణ మరియు పదార్ధత యొక్క స్థూలత విశ్వంలో ప్రతిచోటా విస్తరించి ఉన్నందున, ఆత్మాశ్రయ చేతన మరియు పదార్ధ వాస్తవికతల మధ్య సమగ్రత మరియు పారదర్శకత యొక్క సంబంధిత స్థాయికి అనుగుణంగా పరిమాణంలో మరియు నాణ్యతలో తేడా ఉంటుంది. ఈ ఆదిదైవ దైవత్వాల సంఖ్య లెక్కలేనన్ని ఉండడం అనేది నిజానికి అనేక ప్రసిద్ధ మత ఆరాధనల యొక్క దేవతలుగా ఉండడం కనిపిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 251 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 7. Adhidaiva Divinities are Countless in Number🌻*

*The tripartite arrangement of the Universal Being into the subjective, objective and the principle of an intermediary consciousness, namely, adhyatma, adhibhuta and adhidaiva, raises also the question of the whole range of theological enunciations, since the adhidaiva is the divinity that controls the subjective and the objective sides of experience—adhyatma and adhibhuta—and at the same time rises above them in an instantaneous act of transcendence by not belonging either to the subjective or the objective side, though immanently present in both the sides, without which there cannot be a conscious relation between the subject and the object.*

*The descent, or may we say ascent, of the hierarchy of subject-object relations in the history of the creation of the universe may be said to be constituted of an infinite series of degrees of lesser and larger dimensions, the relation becoming grosser and more inscrutable as the degrees come downwards in descent and enlarging in greater and greater perspicuity and transcendence as the degrees ascend towards the Absolute. Inasmuch as these degrees of ascent and descent are spread out everywhere in the universe, differing in quantity and quality in accordance with the corresponding degree of inclusiveness and transparency obtaining between the subjective and objective sides, it appears that these adhidaiva divinities are countless in number and these are, in fact, the many gods of popular religious worship.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 152 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం నీకు రెండు రకాలయిన అవకాశాల్ని యిస్తుంది. అది నీకు పగలు నిస్తుంది. అది నీకు రాత్రి నిస్తుంది. అదెప్పుడూ సమతూకంగా వుంటుంది. ఏది నువ్వు ఎంచుకుంటావో అదే నీకు కనబడుతుంది. 🍀*

మనం దు:ఖాల్లో మునిగి తేలడానికి చాలా కష్టపడుతూ వుంటాం. జనం ఆ విషయాన్ని గుర్తించరు. ఆ విషయం గుర్తిస్తే వాళ్ళు నవ్వుకుంటారు. ఎప్పుడూ వీలయినన్ని మార్గాల్లో బాధల్ని కొని తెచ్చుకుంటూ వుంటారు. చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు. వాళ్ళు తమకి బాధల్ని అందించే ప్రతి దానిలోకి దూకుతారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. జీవితం నీకు రెండు రకాలయిన అవకాశాల్ని యిస్తుంది. అది నీకు పగలు నిస్తుంది. అది నీకు రాత్రి నిస్తుంది. అది నీకు గులాబీల నిస్తుంది. అది నీకు ముళ్ళనిస్తుంది. అది నీకు రెండు రకాలయిన అవకాశాల్ని యిస్తుంది. 

అదెప్పుడూ సమతూకంగా వుంటుంది. ఎప్పుడూ ఫిఫ్టీ, ఫిఫ్టీగా వుంటుంది. నువ్వు ఏ అవకాశాన్ని ఉపయోగించు కుంటున్నావన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ జరిగే అద్భుతమేమిటంటే నువ్వు ముళ్ళను ఎంచుకుంటే అక్కడ పూలు అదృశ్యమవుతాయి. కారణం నీ మనసు ముళ్ళకే అతుక్కుని వుంటుంది. నీకు ముళ్ళు మాత్రమే కనిపిస్తాయి. పూలని కోల్పోతావు. అసలు వాటిని గుర్తించనే గుర్తించవు. అట్లాగే పూలను ఎన్నుకొన్న వాడి పరిస్థితి కూడా అదే అతను ముళ్ళను మరిచిపోవడం ప్రారంభిస్తాడు. అసలు ముళ్ళే అతనికి కనిపించవు. అతను ఎంత పాజిటివ్ గా ఆశావహంగా చూస్తాడంటే అతని దృష్టి పూర్తిగా భిన్నంగా వుంటుంది. 

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 90 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 75. ప్రత్యేక దృష్టి - 2 🌻*

*భూమిపై తిరుగాడు దైవము దత్తాత్రేయుడు. అతడు సామాన్యులలో కలసిమెలసి తిరుగుచుండును. అతని నెవ్వరునూ గుర్తింపలేరు. కారణము మానవుల డాంబికతయే. డాంబిక విషయముల యందు సత్యము నేతి బీరకాయలోని నెయ్యివంటిది. ఆధ్యాత్మిక మార్గముననే చాటించుకొనుచు తమను తామే కీర్తించుకొను సంఘములు పెక్కు గలవు. అందు ఆధ్యాత్మికత నామమాత్రమే.*

*విలువగల విషయము లెప్పుడును మరుగున యుండును. ఒక రకమగు తమస్సు వాని నావరించి వెలుగును మరుగుగ నుంచును. కావున మహత్తర విషయములను, సన్నివేశములను, మనుష్యులను గుర్తించుటకు మీరు ప్రత్యేకమగు కన్నును ఏర్పాటు గావించు కొనవలెను. అట్టి దృష్టి లేనివాని జీవితము సత్యదూరమై సాగును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹